Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

అథోత్పాత శాంతిః

పుష్కర ఉవాచః

శ్రీసూక్తంచ ప్రతివేదం జ్ఞేయం లక్ష్మీ వివర్ధనమ్‌ | హిరణ్య వర్ణాం హరిణీమృచః పంచదశక్రియః. 1

రథేష్వక్షేషు వాజేతి చతస్రో యజుషిశ్రియః | స్రావన్తీయం తథాసామ శ్రీసూక్తం సామవేదకే. 2

శ్రియం ధాతర్మయి ధేహి ప్రోక్తమాథర్వణ తథా | శ్రీసూక్తంయో జపేద్భక్త్యా హుత్వా శ్రీస్తస్య వైభ##వేత్‌. 3

పద్మాని చాథ బిల్వాని హుత్వాజ్యం వా తిలాంఛ్రియః | ఏకంతు పౌరుషం సూక్తం ప్రతివేదంతు సర్వదమ్‌.

సూక్తేన దద్యాన్నిష్పాపో హ్యేకైకయా జలాంజలిమ్‌ | స్నాత ఏకైకయాపుష్పం విష్ణోర్దత్వాఘహా భ##వేత్‌.

స్నాత ఏకైకయా దత్వాఫలం స్యాత్సర్వకామభాక్‌ | మహాపాపోప పాపాన్తో భ##వేజ్జప్త్వాతు పౌరుషమ్‌. 6

కృచ్ఛ్రైర్విశుద్ధో జప్త్వాచ హుత్వాస్నాత్వాథ సర్వభాక్‌ |

పుష్కరుడు పలికెను : పరశురామా! ఒక్కొక్క వేదములోనున్న లక్ష్మీవర్ధకమగు శ్రీసూక్తమును తెలియవలెను. ''హిరణ్యవర్జాం హరిణీం'' మొదలగు పదునైదు ఋక్కులు ఋగ్వేదీయ శ్రీసూక్తము. ''రథే'' (29-43) ''అక్షయరాజాయ'' (30-18) వాజః (18-34) చతస్రః (18-32) ఈ నాలుగు మంత్రములును యజుర్వేదీయ స్త్రీసూక్తము. ''శ్రావంతీ యసామ'' సామవేదీయ శ్రీసూక్తము. ''శ్రియంధాతర్మయిధేహి'' ఇది అథర్వవేదీయ శ్రీసూక్తము. భక్తిపూర్వకముగా శ్రీసూక్త జపహోమము చేయువానికి తప్పక లక్ష్మి లభించును. శ్రీదేవి అనుగ్రహమునకై కమలములు, బిల్వములు ఆజ్యము, తిలలు, హోమము చేయవలయును. అన్ని వేదములందును పురుషసూక్తము వున్నది. అది సకల కామప్రదము. స్నానము చేసి పురుషసూక్తములోని ఒక్కొక్క మంత్రముతో మహావిష్ణువునకు ఒక్కొక్క జలాంజలియు పుష్పమును సమర్పించువాడు తానుపాపరహితుడై ఇతరుల పాపములను కూడ తొలగించును. స్నానముచేసి ఈ సూక్తమునందలి ఒక్కొక్క మంత్రముతో శ్రీమహావిష్ణువునకు ఫలమును సమర్పించువాడు సర్వకామములను పొందును. పురుషసూక్త జపముచే మహాపాతకములు ఉపపాతకములు నశించును. కృఛ్రవ్రతము చేసి పరిశుద్ధుడైనవాడు స్నానపూర్వకముగా పురుష సూక్తజప హోమములు చేసినచో సర్వమును పొందును.

అష్టాదశభ్యః శాంతిభ్యస్తిస్రో7న్యాః శాంతయో వరాః. 7

అమృతా చాభయాసౌమ్యా సర్వోత్పాత విమర్ధనాః | అమృతా సర్వదైవత్యా హ్యభయా బ్రహ్మదైవతా. 8

సౌమ్యాచ సర్వ దైవత్యా ఏకాస్యాత్సర్వకామదా | అభయాయా మణిః కార్యోవరుణస్య భృగూత్తమ. 9

శతకాండామృతా యాశ్చ సౌమ్యాయాః శంఖజోమణిః |

తద్దైవత్యా స్తథా మంత్రాః సిద్ధౌస్యాన్మణి బంధనమ్‌. 10

దివ్యాన్తరిక్ష భౌమాది సముత్పాతార్దనా ఇమాః | దివ్యాన్తరిక్ష భౌమంతు అద్భుతం త్రివిధం శృణు. 11

అహర్‌క్ష వైకృతం దివ్యమాంతరిక్షం నిబోధమే | ఉల్కాపాతశ్చ దిగ్దాహః పరివేషస్త థైవచ. 12

గంధర్వ నగరం చైవ వృష్టిశ్చ వికృతా చయా | చరస్థిర భవం భూమౌ భూకంపమపి భూమిజమ్‌. 13

సప్తాహాభ్యంతరే వృష్టావద్భుతం నిష్పలం భ##వేత్‌ | శాంతిం వినాత్రిభిర్వర్షైరద్భుతం భయకృద్భవేత్‌. 14

దేవతార్చాః ప్రనృత్యంతి వేపన్తే ప్రజ్వలన్తిచ | ఆరటంతి చలోదంతి ప్రస్విద్యన్తే హసన్తిచ. 15

అర్చావికారోపశమో7భ్యర్చ్య హుత్వా ప్రజాపతేః | అనగ్నిర్దీప్యతే యత్ర రాష్ట్రేచ భృశనిఃస్వనమ్‌. 16

పదునెనిమిది శాంతులలో సమస్త ఉత్పాతములను తొలగించు అమృత. అభయ, సౌమ్య, అనుమూడు శాంతులు సర్వోత్తమములు. అమృతాశాంతి సర్వదైవత్యము. అభయాశాంతి బ్రహ్మదైవత్యము. సౌమ్యశాంతి సర్వదైవత్యము. వీటిలో ఒక్కొక్కటికూడ సర్వకామప్రదము. ఓ భృగుశ్రేష్ఠా! అభయశాంతి కొరకై వరణవృక్షము యొక్క మూలముతో మణి చేయవలయును. అమృతశాంతికి దూర్వామూల మణిని, సౌమ్యాశాంతికి శంఖమణిని ధరించవలయును. ఆయా శాంతుల దేవతలకు సంబంధించిన మంత్రములతో మణిని సిద్ధముచేసి కట్టవలెను. ఈ శాంతులు దివ్యఅంతరిక్ష భౌమ ఉత్పాతములను శమింప చేయును. దివ్య, అంతరిక్ష, భౌమ ములను మూడు విధముల అద్భుతములగు ఉత్పాతములను చెప్పెదను వినుము. గ్రహనక్షత్రముల వికారములచే కలుగు ఉత్పాతములు దివ్యములు. అంతరిక్షోత్పాతములను వినుము. ఉల్కాపాతము, దిగ్దాహము, సూర్యుడు గుడి కట్టుట, గంధర్వనగరము, వికృతమైన వర్షము ఇవి అంతరిక్ష ఉత్పాతములు. స్థావరములందును జంగమప్రాణులందును కలుగు ఉపద్రవములు, భూకంపము, ఇవిభూమిజోత్పాతములు. ఈ ఉత్పాతములు కనబడిన తరువాత ఒక వారములో పునఃవర్షము పడినచో ఆ అద్భుతము నిష్ఫలమగును. మూడు సంవత్సరములవరకు ఈ అద్భుతోత్పాతమునకు శాంతిచేయకున్నచో అది లోకమునకు భయావహము. దేవతాప్రతిమలు నాట్యమాడుట, కదలుట, మండుట, శబ్దము చేయుట, ఏడ్చుట, చెమట పట్టుట, నవ్వుట మొదలగు వికారములు కనబడినచో ఆ దేవతలన పూజించి ప్రాజాపత్య హోమము చేయవలయును. ఏరాష్ట్రమునందు అంటించకుండగనే అగ్నిఘోర శబ్దముతో ప్రజ్వలించినదో ఆ రాష్ట్రము రాజుచే పీడింపబడును.

నదీప్యతే చేంధన వాంస్తద్రాష్ట్రం పీడ్యతే నృపైః | అగ్ని వైకృత్య శమన మగ్ని మంత్రైశ్చ భార్గవ. 17

ఆకాలే ఫలితావృక్షాః క్షీరం రక్తం స్రవంతిచ | వృక్షోత్పాత ప్రశమనం శివం పూజ్యచ కారయేత్‌. 18

అతివృష్టి రనావృష్టి ర్దుర్భిక్షాయోభయం మతమ్‌ | అనృతౌత్రిదినారబ్ధ వృష్టిర్‌జ్ఞేయా భయాయహి. 19

వృష్టివైకృత్య నాశః స్యాత్పర్జన్యేన్ద్వర్క పూజనాత్‌ | నగరాదప సర్పన్తే సమీప ముపయాన్తిచ. 20

నద్యోహ్రదప్రస్రవణా విరసాశ్చ భవన్తిచ | సలిలాశయ వైకృత్యే జప్తవ్యో వారుణో మనుః. 21

అకాల ప్రసవా నార్యః కాలతోవా ప్రజాస్తథా | వికృత ప్రసవాశ్చైవ యుగ్మప్రసవ నాదికమ్‌. 22

స్త్రీణాంప్రసవ వైకృత్యే స్త్రీవిప్రాది ప్రపూజయేత్‌ | వడవా హస్తినీ గౌర్వాయది యుగ్మం ప్రసూయతే. 23

విజాత్యం వికృతం వాపి షడ్బిర్మాసైర్మ్రియేతవై | వికృతం వా ప్రసూయన్తే పరచక్ర భయం భ##వేత్‌. 24

హోమః ప్రసూతి వైకృత్యే జపోవిప్రాది పూజనమ్‌ | యాని యానాన్య యుక్తాని యుక్తాని న వహంతిచ. 25

ఆకాశే తూర్యనాదాశ్చ మహద్భయ ముపస్థితమ్‌ | ప్రవిశంతి యదా గ్రామ మారణ్యా మృగపక్షిణః. 26

అరణ్యం యాన్తివా గ్రామ్యా జలం యాన్తిస్థలోద్భవాః | స్థలం వా జలకాయాన్తి రాజద్వారాదికే శివాః. 27

ప్రదోషే కుక్కుటోవాసే శివాచార్కోదయే భ##వేత్‌ | గృహం కపోతః ప్రవిశేత్క్రవ్యాద్వామూర్ధ్నిలీయతే.

మధురాం మక్షికాం కుర్యాత్కాకో మైథునగోదృశి | ప్రాసాద తారేణో ద్యానద్వార ప్రాకార వేశ్మనామ్‌. 29

అనిమిత్తంతు పతనం దృఢానాం రాజమృత్యవే | రజసావాథ ధూమేన దిశోయత్ర సమాకులాః. 30

కేతూదయోపరాగౌ చ ఛిద్రతాశశిసూర్యయోః గ్రహర్‌క్షవికృతిర్యత్రతత్రాపి భయమాదిశేత్‌. 31

అగ్నిర్యత్ర నదీప్యేత స్రవన్తే చోదకుంభకాః | మృతిర్భయం శూన్యతాది రుత్పాతానాం ఫలంభ##వేత్‌.

ద్విజదేవాది పూజాభ్యః శాంతిర్జపైస్తు హోమతః. 32

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఉత్పాత శాంతిర్నామ త్రిషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

భృగునందనా! ఇట్టి అగ్నివికారశాంతికి అగ్ని దైవత్యములగు మంత్రములతో హోమము చేయవలయును. వృక్షములు ఫలములిచ్చినను, వాటినుండి పాలు, రక్తము కారినను అది వృక్షజనిత భౌమోత్పాతము. అపుడు శివుని పూజించి ఉత్పాతములకు శాంతి చేయవలయును. అతి వృష్టి, అనావృష్టి రెండును దుర్భిక్షకారణములు. వర్షఋతువుకాని ఋతువులో మూడు దినములు నిరంతర వృష్టి కలిగినచో అదిభయజనకము, పర్జన్య, చంద్ర సూర్యులను పూజించుటచే ఈ వర్షవికారము నశించును. ఒక నగరము నుండి నదులు, దూరమై పోయినను దగ్గరకు వచ్చినను, అందలి సరోవరములు ప్రవాహములు ఎండిపోయినను ఈజలాశయ వికారమును తొలగించుటకు వారుణ మంత్రము జపించవలెను. స్త్రీలు ఆసమయమున ప్రసవించినను, సమయమున ప్రసవించకున్నను వికృతమైన గర్భముకన్నను, కవల పిల్లలు మొదలగు వారిని కన్నను ఈ ప్రసవవికారమును తొలగించుటకు పతి వ్రతలైన స్త్రీలను, బ్రాహ్మణాదులను పూజించవలెను. గుఱ్ఱముగాని, ఏనుగుగాని, ఆవుగాని, రెండు పిల్లలుకన్నను, వికృతమైన విజాతీయ సంతానమును కన్నను ఆరుమాసము లలోపున మరణించినను వికృత గర్భముకన్నను ఆరాజ్యమునకు శత్రువులనుండి భయముకలుగును. ఈ ఉత్పాతమును శాంతింపచేయుటకై హోమము జపము బ్రాహ్మణ పూజ చేయవలెను. అయోగ్యమైన పశువులు బండి కట్టినను, యోగ్యపశువులు బండిలాగకున్నను, ఆకాశమున తూర్యనాదము వినబడినను మహాభయము వచ్చును. వన్య పశుపక్షులు గ్రామములో ప్రవేశించినను గ్రామ్య పశువులు వనములోనికి వెళ్ళిపోయినను స్థలచరములు జలములో ప్రవేశించినను, జలచరములు స్థలముపైకి వచ్చినను రాజు ద్వారాది సమీపమునకు నక్కలు వచ్చినను, ప్రదోష కాలమున కోడికూసినను, సూర్యోదయ సమయమున నక్కలు అరచినను, పావురములు, ఇంటిలో దూరినను మాంసము తిను పక్షులు తలపై తిరిగినను, సామాన్యపు ఈగ తేనె కూర్చినను కాకులు మైథునము చేయుచుండగా కనబడినను దృఢమైన ప్రాసాదములు తోరణములు, ఉద్యానములు, ద్వారములు, ప్రాకారములు, భవనములు, అకారణముగ పడిపోయినను రాజు మరణించును. పరాగముగాని, ధూమముగాని, పదిదిక్కుల నిండిపోయినను కేతువు ఉదయించినను గ్రహణము వచ్చినను, సూర్యచంద్రబింబముల మధ్య రంధ్రము కనబడినను ఇవి గ్రహనక్షత్ర వికారములు. ఇవి ఎచట కనబడునో అచట భయమును సూచించును. అగ్ని మండక పోయిను, ఉదకకుంభము ఆకారణముగ కారినను ఈ ఉత్పాతములకు ఫలితముగ మరణము, భయము, మహామారి, మొదలగునవి కలుగును. బ్రాహ్మణులను దేవతలను పూజించుటచేతను, జపహోమముల చేతను, ఈ ఉత్పాతములు శాంతించును.

అగ్నిమహాపురాణమునందు ఉత్పాతశాంతికథనమను రెండువందల అరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page