Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకపంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః

పునః ధనుర్వేదః

అగ్ని రువాచ :

జితహస్తోజితమతిర్జిత దృగ్లక్ష్య సాధకః | నియతాం సిద్ధి మాసాద్య తతో వాహన మారుహేత్‌. 1

దశహస్తో భ##వేత్పాశో వృత్తః కరముఖస్తథా| గుణకార్పాస ముంజానాం భంగస్నాయ్వ ర్కవర్మిణామ్‌.2

అన్యేషాం సుదృడానాంచ సుకృతం పరివేష్టితం | తథా త్రింశత్సమం పాశంబుధః కుర్యాత్సు వర్తితమ్‌. 3

కర్తవ్యం శిక్షకైస్తన్య స్థానం కక్షాసువై సదా| వామహస్తేన సంగృహ్య దక్షిణనోద్ధరేత్తతః.4

కుండలస్యా కృతిం కృత్యా భ్రామ్యైకం మస్తకోపరి| క్షిపేత్తృణమయే తూర్ణం పురుషే చర్మ వేష్టితే.5

వల్గితే చప్లుతే చైవ తథా ప్రవ్రజితేషు చ | సమయోగవిధిం కృత్వా ప్రయుంజీత సుశిక్షితమ్‌.6

విజిత్వాతు యథాన్యాయం తతో బంధం సమాచరేత్‌|

అగ్నిదేవుడు పలికెను : వసిష్ఠా! హస్తమును, మనస్సును, దృష్టిని జయించిన లక్ష్యసాధకుడు తప్పక సిద్ధిని పొంది యుద్ధము కొరకై వాహనారూఢూడు కావలెను. పాశము పదిహస్తముల పొడవై, గోలాకారమై చేతికి సుఖప్రదముగ నుండవలెను. దీనికొరకై మంచి ముంజగడ్డి గాని, హరిణముల ప్రేగుల గాని, అర్కవల్కల రజ్జువుగాని ఏర్పరచు కొనవలెను. ఇతరదృఢసూత్రములలో గూడ సుందరమగు పాశము ఏర్పరుప వచ్చును. ఆ సూత్రములను చాల ఆవృత్తులుచుట్టి బాగుగా పేనవలెను. ముప్పది ఆవృత్తులు చేసి పేనిన త్రాడుతో పాశము నిర్మింపవలెను. పాశప్రయోగ శిక్షణమునకై శిక్షకులు కక్షలందు స్థానము ఏర్పాటు చేయవలెను. పాశమును ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతితో విప్పవలెను. దానిని కుండలాకారము చేసి అన్నివైపుల త్రిప్పి, శత్రువు శిరస్సుపై విసరవలెను. ముందుగ తృణచర్మాది నిర్మితమగు పురుషమూర్తిపై ప్రయోగించి పిదప గంతులువేయుచున్న మునుష్యులపై ప్రయోగించి, సాఫల్యము లభించిన పిమ్మటనే పాశప్రయోగము చేయవలెను. సుశిక్షితుడగు యోధుడు పాశముతో యథోచితముగ జయించిన పిమ్మటనే శత్రువు విషయమున పాశబంధన క్రియ చేయవలెను.

కట్యాంబద్ధ్వా తతః ఖడ్గ వామపార్శ్వా వలంబితమ్‌.7

దృఢం విగృహ్య వామేన నిష్కర్షేద్‌ దక్షిణన తు | షడంగుల పరీణాహం సప్తహస్త సముచ్ఛ్రితమ్‌.8

అయోమయ్యఃశలాకాశ్చ మర్మాణి వివిధాని చ | అర్ధ హస్తే సమేచైవ తిర్య గూర్ధ్వ గతం తథా.9

యోజయోద్విధినాయేన తథాత్వం గడతఃశృణు | తూణ చర్మావనద్ధాఙ్గం స్థాపయిత్వా సవందృఢమ్‌.10

కరేణాదాయలడుడం దక్షిణాంగులకం సవమ్‌ | ఉద్యమ్య ఘాతయే దస్య నాశ##స్తేన శిశోర్దృఢమ్‌.11

ఉభాభ్యా మథ హస్తాభ్యాం కుర్యాత్తస్య నిపాతనమ్‌ | ఆక్లేశేన తతః కుర్వన్వధే సిద్ధిః ప్రకీర్తితా.12

వాహానం శ్రమకరణం ప్రచారార్థం పురం తవ.12

ఇత్యాది మహాపురాణ అగ్నేయే ధనుర్వేదో నామైక పంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః.

ఒరను కూడిన ఖడ్గమును నడుమునందుకట్టి దానిని ఎడమవైపు వ్రేలాడదీయవలెను. దాని ఒరను ఎడమచేతితో గట్టిగ పట్టుకొని కుడిచేతితో ఖడ్గమును వెలుపలకు తీయవలెను. ఆ ఖడ్గము వెడల్పు ఆరు అంగుళములు, పొడవు ఏడు హస్తములు ఉండవలెను. అనేకములైన లోహమయశలాకలను కవచములను తన సగము హస్తమునందు గాని ధరించవలెను. ప్రక్కలందును, పైనను, క్రిందను, శరీరరక్షకొరకై ఈ వస్తువులనన్నింటిని యథాశాస్త్రముగ ధరించవలెను. యుద్ధము నందు విజయము సంపాదించుటకై ఎట్టి ఏర్పాట్లు చేయవలెనో చెప్పెదను; వినుము. తూణీరము యొక్క చర్మము చుట్టిన ఒక క్రొత్త దృఢమైన కఱ్ఱను తన దగ్గర ఉంచుకొనవలెను. దానిని కుడిచేతి వ్రేళ్ళతో పైకి ఎత్తి ఎవనినెత్తిపై గట్టిగా కొట్టునో ఆ శత్రువు తప్పక మరణించును. ఈ పనిలో సిద్ధిలభించిన పిమ్మట రెండు హస్తుములతో ఆకర్రతో శత్రువు తలపై కొట్టవలెను. దీనితో అనాయాసముగ వానిని చంపగల్గును. ఈవిధముగా యుద్ధమునందు సిద్ధి ఎట్లు కలుగునో చెప్పబడినది. యుద్ధభూమియందు చక్కగా సంచరించుటకై తన వాహనములచే శ్రమ చేయించుచుండవలెను విషయము ముందుగనే చెప్పియున్నాను.

అగ్నిమహాపురాణమునందు ధనుర్వేదకథన మను రెండవువందల ఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page