Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షడ్వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ సామాద్యుపాయకథనమ్‌.

పుష్కర ఉవాచ :

స్వమేవ కర్మదైవాఖ్యం విద్ధి దేహాంతరార్జితమ్‌ | తస్మాత్పౌరుషమేవేహ శ్రేష్ఠమాహుర్మనీషిణః. 1

ప్రతికూలం తథాదైవం పౌరుషేణ విహన్యతే | సాత్త్వికాత్కర్మణః పూర్వాత్సిద్ధిః స్యాత్పౌరుషంవినా. 2

పౌరుషం దైవసమ్పత్త్యా కాలేఫలతిభార్గవ | దైవం పురుషకారశ్చ ద్వయం పుంసః ఫలావహమ్‌. 3

కృషేర్వృష్టి సమాయోగాత్కాలేస్యుః ఫలసిద్ధయః | సధర్మం పౌరుషం కుర్యాన్నాలసో నచ దేవవాన్‌. 4

సామాదిభిరుపాయైస్తు సర్వేసిధ్యంత్యుపక్రమాః | సామ చోపప్రదానంచ ఖేదదండౌ తథాపరౌ. 5

మాయో పేక్షేంద్రజాలం చ హ్యుపాయాః సప్తతాంచ్ఛృణు | ద్వివిధం కథితం సామతథ్యం చాతథ్యమేవచ. 6

తత్రాప్యతథ్యం సాధూనామాక్రోశాయైవ జాయతే | మహాకులీనా హ్యృజవో ధర్మనిత్యా జితేంద్రియాః. 7

సామసాధ్యా అతథ్యైశ్చ గృహ్యన్తే రాక్షసా అపి | తథా తదుపకారాణాం కృతానాం చైవ వర్ణనమ్‌. 8

పరస్పరం తుయే ద్విష్టాః క్రుద్ధభీతావమానితాః | తేషాం భేదం ప్రయంజీత పరమందర్శయేద్భయమ్‌. 9

ఆత్మీయాం దర్శయేదాశాం యేనదోషేణ బిభ్యతి | పరాస్తేనెవ తే ఖేద్యా రక్ష్యోవైజ్ఞాతి భేదకః. 10

సామంత కోపో బాహ్యస్తు మంత్రామాత్యాత్మ జాదికః |

అంతఃకోపం చోపశామ్యం కుర్వఞ్చత్రోశ్చతంజయేత్‌. 11

పుష్కరుడు పలికెను : పరశురామా! మనుష్యుడు పూర్వము తాను ఇతరశరీరముతో చేసిన కర్మకే దైవమని పేరు. అందుచే బుద్ధిమంతుడు పురుషకారమే శ్రేష్ఠమైనదని తెలిసికొనవలెను. దైవము ప్రతికూలముగా నున్నచో పురుష కారముచే దానిని అనుకూలము చేసికొనవచ్చును పూర్వము చేసిన సాత్త్విక కర్మల ఫలితముగా ఈనాడు, పురుష కారమేమియులేకున్నను సిద్ధి లభించును. భృగునందనా ! పురుషకారమే దైవసాహాయ్యముతో తగు సమయమునందు ఫలమిచ్చుచుండును. దైవ పురుషకారములు రెండును మానవునకు ఫలమునిచ్చును. పురుషకారముచే వ్యవసాయము చేయగా వర్షయోగము వచ్చినపుడు సమయానుసారము ఫలము లభించు అందుచే కర్మానుష్ఠానము చేయుచు పురుషకారమునందు కూడ ప్రవర్తించవలెను, గాని కేవలము దైవమునే నమ్ముకొని కూర్చుండ కూడదు. సామాద్యుపాయములతో ప్రారంభించిన సర్వకార్యములును సిద్ధించును. సామము, దానము, భేదము, దండము, మాయ ఉపేక్ష, ఇంద్రజాలము అని ఏడు ఉపాయములు. వాటి స్వరూపమును గూర్చి వినుము. తథ్యము, అతథ్యము అని సామము రెండు విధములు. అతథ్యసామము పురుషులకు అపకీర్తి కరము; ఉత్తమవంశ సంజాతులు, సరలస్వభావులు, ధర్మ పరాయణులు, జితేంద్రియులు అయిన పురుషులు సామమునకు లొంగుదురు. అతథ్యసామముచే రాక్షసులను కూడ లొంగదీసి కొనవచ్చును. వారు చేసిన ఉపకారములను వర్ణించుటయే వారిని వశముచేసికొనుటకు మంచి ఉపాయము పరస్పరద్వేషవంతులై, కుపితులై, భయభీతులై, అవమానితులై ఉన్న వారి విషయమున భేదమును ప్రయోగించవలెను వారికి ఇంకను భయము కలుగునట్లు చేయవలెను. తమవైపునుండి వారికి ఆశచూపించి, ఏదోషముచే వారు ఇతరుల నుండి భయపడుదురో దానిని ప్రకటించి వారిలో భేదము పుట్టించవలెను. శత్రుకుటుంబమునందు పుట్టించువారిని రక్షించవలెను. సామంతులకోపము మంత్రి-పుత్రాదుల కోపము అందరకోపము. అందుచే ముందుగా అంతరకోపమును శమింపచేసి, పిదప బాహ్యకోపమును తొలగిన ప్రయత్నించవలెను.

ఉపాయ శ్రేష్ఠం దానం స్యాద్ధానాదుభయలోకభాక్‌ | నసో7స్తి నామదానేన వశగో యో న జాయతే. 12

దాన వానేన శక్నోతి సంహతాన్భేతితుం పరాన్‌ | త్రయాసాధ్యం సాధయేత్తం దండేనచ కృతేనచ. 13

దండే సర్వం స్థితం దండో నాశ##యేద్దుపష్ర్పణికృతః | అదండ్యాన్దండ యన్న శ్యేద్ధండ్యాన్రాజాప్యదండయన్‌.

దేవదైత్యోరగనరాః సిద్ధా భూతాః పతిత్రిణః | ఉత్ర్కమేయుః స్వమర్యాదాం యదిదండాన్నపాలయేత్‌. 15

యస్మాదదాన్తాన్దమయత్యదండ్యాన్దండ యత్యపి | దమనాద్ధండనాచ్చైవ తస్మాద్దండం విదుర్భుధాః. 16

తేజసాదుర్నిరీక్ష్యోహి రాజాభాస్కరవత్తతః | లోకప్రసాదం గచ్ఛేత్తు దర్శనాచ్చంద్రవత్తతః. 17

జగద్వ్యాప్నోతివై చారైరతోరాజా సమీరణః | దోషనిగ్రహకారిత్వాద్రాజా వైవస్వతః ప్రభుః. 18

యదాదహతి దుర్బుద్ధిం తదాభవతిపావకః | యదాదానం ద్విజాతిభ్యో దద్యాత్తస్మాద్ధనేశ్వరః. 19

ధనధారాప్రవర్షిత్వాద్ధేవాదౌ వరుణః స్మృతః | క్షమయా ధారయంల్లోకాన్పార్థివః పార్థివోభ##వేత్‌.

ఉత్సాహమంత్రశక్త్యాద్యై రక్షే ద్యస్మాద్ధరిస్తతః. 20

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సామాద్యుపాయోనామ షడ్వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

అన్ని ఉపాయములలో దానము శ్రేష్ఠమైనది. దానముచే ఇహపరములు రెండింటియందును ఫలములభించును. దానమునకు లొంగని వారెవరునులేరు. దానము చేయువాడు పరస్పరము కలిసియున్న వారిలోకూడ భేదమును కలిగించును. సామదాన భేదములచే సిద్ధించనికార్యములనుదండముచే సిద్ధింపచేసికొనవలెను. దండమునందే సర్వమును ఉన్నది. కాని దండమును అనుచితరీతిలో ప్రయోగించినచో అది ఆత్మ వినాశ హేతువగును. దండింపతగని వానినిదండించువాడును, దండింపతగినవానిని దండించనివాడును అయిన రాజు వినాశముపొందును రాజు దండముద్వారా అందరిని రక్షించకున్నచో దేవతలు, దైత్యులు, నాగులు, మనష్యులు, సిద్ధులు, భూతములు, పక్షులు-అందరును తమతమమర్యాదలను ఉల్లంఘింతురు. క్రూరులను అణచివేసి, దండనీయులను శిక్షించును గానదీనికి దండమని పేరు. రాజు ఇతరులు చూడజాలని విధమున తేజస్సుతో ప్రకాశించునపుడు ఆతడు సూర్యుని వంటివాడు. దర్శనమాత్రముచే ఆనందమును కలిగించునపుడు ఆతడు చంద్రునివంటివాడు. గూఢచారులద్వారా ప్రపంచకము నందంతటను వ్యాపించియుండుటచే ఇతడు వాయుతుల్యుడు. దోషములను చూచి దండించుటచే ఇతడు యమధర్మరాజసమానుడు కుటిలబుద్ధిగల దుష్టులను చూచి దండించునుగాన ఆతడు సాక్షాత్తు అగ్ని దేవుడు. బ్రాహ్మణులకు దానములిచ్చునపుడు ధనాది పతియైన కుబేరుడు. దేవతాదులనుద్దేశించి హవిస్సు, ఘృతము మొదలగువాటిని ధారగావిడచును గాన వరుణుడు. ఓర్పుతో ఈ జగత్తునంతను ధరించునుగాన పృథ్వీరూపుడు. ప్రభుమంత్రోత్సాహశక్తులతో అందరిని పాలించునుగాన సాక్షాత్తు శ్రీమహావిష్ణుస్వరూపుడు.

అగ్ని మహాపురాణమునందు సామాద్యుపాయకథనమను రెండువందల ఇరువదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page