Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రయోవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ రాజధర్మాః

పుష్కర ఉవాచ :

గ్రామస్యాధిపతిం కుర్యాద్దశ గ్రామాధిపం నృపః | శతగ్రామాధిపంచాన్యం తథైవ విషయేశ్వరమ్‌. 1

(అ) 2/4

తేషాం భోగ విభాగశ్చ భ##వేత్కర్మానురూపతః | నిత్యమేవతథాకార్యం తేషాంచారైః పరీక్షణమ్‌. 2

గ్రామేదోషాన్సముత్పన్నాన్గ్రామేశః ప్రశమం నయేత్‌ | అశక్తోదశపాలస్య సతు గత్వా నివేదయేత్‌. 3

శ్రుత్వాపి దశపాలో7పి తత్రయుక్తి ముపాచరేత్‌ | విత్తాద్యాప్నోతి రాజావై విషయాత్తు సురక్షితాత్‌. 4

ధనవాన్ధర్మమాప్నోతి ధనవాన్కా మమశ్నుతే | ఉచ్ఛిద్యన్తే వినాహ్యర్థైః క్రియాగ్రీష్మేనరిద్యథా. 5

విశేషో నాస్తిలోకేషు పతితస్యాధనస్య చ | పతితాన్నతు గృహ్ణంతి దరిద్రో న ప్రయచ్ఛతి. 6

ధనహీనస్య భార్యాపి నైకాస్యాదుపవర్తినీ | రాష్ట్రపీడాకరోరాజా నరకే వనతేచిరమ్‌. 7

నిత్యం రాజ్ఞా తథా భావ్యం గర్భిణీ సహధర్మిణీ | యథాస్వం సుఖముత్సృజ్య గర్భస్య సుఖమావ హేత్‌. 8

కిం యజ్ఞైస్తపసాతస్య ప్రజాయస్యన రక్షితాః | సురక్షితాః ప్రజా యస్య స్వర్గస్తస్య గృహోపమః. 9

అరక్షితాః ప్రజా యస్య నరకం తస్య మందిరమ్‌ | రాజాషడ్భాగమాదత్తే సుకృతాద్ధుష్కృతాదపి. 10

ధర్మాగమో రక్షణాచ్చ పాపమాప్నోత్యరక్షణాత్‌ | సుభగా విటభీతేవ రాజవల్లభ తస్కరైః. 11

భక్ష్యమాణాః ప్రజారక్ష్యాః కాయస్థైశ్చ విశేషతః | రక్షితా తద్భయేభ్యస్తురాజ్ఞోభవతిసాప్రజా. 12

అరక్షితా సా భవతి తేషామేవేహ భోజనమ్‌ | దుష్టసమ్మర్ధనం కుర్యాచ్ఛాస్త్రోక్తం కరమాదదేత్‌. 13

కోశే ప్రవేశ##యేదర్థం నిత్యం చార్థం ద్విజేదదేత్‌ | నిధిం ద్విజోత్తమః ప్రాప్య గృహ్ణీయాత్సకలం తథా. 14

చతుర్థమష్టమం భారం తథాషోడశమం ద్విజః | వర్ణక్రమేణ దద్యాచ్చ నిధిం పాత్రేతు ధర్మతః. 15

అనృతంతువదన్దండ్యః సువిత్తస్యాంశమష్టమమ్‌ | ప్రనష్టస్వామికంరిక్థం రాజాత్ర్యబ్జం నిధాపయేత్‌. 16

అర్వాక్‌ త్ర్యబ్ధాద్ధరేత్స్వామీ పరేణనృపతిర్హరేత్‌ | మమేదమితీ యో బ్రూయాత్సోర్థయుక్తోయథావిధి. 17

సమ్పాద్య రూపసంఖ్యాదీ న్స్వామీ తద్ద్రవ్యమర్హతి | బాలదాయాదికం రిక్థం తావద్రాజాతుపాలయేత్‌. 18

యావత్స్యాత్స సమావృత్తో యావద్వాతీతశైశవః | బాలపుత్రాసు చైవం స్యాద్రక్షణం నిష్కులాసుచ. 19

పుష్కరుడు పలికెను : రాజు ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క అధిపతిని నియమించవలెను. పదేసి గ్రామములకు ఒక అధ్యక్షుని, నూరేసి గ్రామములకు మరొక అధ్యక్షుని నియమించవలెను. వారందరిపైనను మొత్తము రాష్ట్రమునకు శాసకుడుగా ఒకనిని నియమించవలెను. వారందరికిని వారివారి పనులను బట్టి వేరువేరుగా భృతిని నిర్ణయించవలెను. గూఢచారులద్వారా ప్రతిదినము వారి ప్రవృత్తులనుగూర్చి తెలసుకొనుచుండవలెను. గ్రామములో ఏదైనదోషము (వ్యవహారము) ఉత్పన్నమైనచో గ్రామాధిపతి దానిని పరిష్కరించవలెను. తానుపరిష్కరింపజాలకున్నచో దశగ్రామాధిపతి వద్దకు వెళ్ళి ఆవిషయములన్నియు ఆతనికి తెలుపవలెను. విషయమునంతను తెలిసికొనిన పిమ్మట దశగ్రామాధిపతి ఆదోషమును పరిష్కరించుటకు ప్రయత్నించవలెను. రాజ్యము సురక్షితముగా ఉన్న యెడలనే రాజునకు దానినుండి ధనాదులు లభించును. ధనవంతుడే ధర్మమునార్జించగలుగును. అతడే కామసుఖములను అనుభవించగలుగును. ధనములేనిచో గ్రీష్మమునందు నదుల నీరు ఎండిపోయినట్లు కార్యములన్నియు విఫలములై పొవును. ఈ ప్రపంచమునందు పతితునకును, దరిద్రునకును భేదమేమియు లేదు. పతితునిచేతినుండి ఎవరును ఏవస్తువును తీసికొనరు. దరిద్రుడుకూడ ఏమియులేనివాడగుటచే ఇతరులకేమియు ఇవ్వజాలడు భార్యకూడ దరిద్రుని మాటవినదు. అందుచే రాష్ట్రమునుపీడించి, దానిని నిస్సారముచేయు రాజు చిరకాలము నరకములో నుండును. గర్భవతియైన స్త్రీ తనసుఖముకొరకు చూచుకొనక గర్భస్థశిశువుక్షేమానికై ప్రయత్నించునో, అట్లే రాజు కూడ ప్రజారక్షణమునే సర్వదాదృష్టిలోనుంచుకొనవలెను. ప్రజలను రక్షించ జాలనిరాజు యజ్ఞము, తపస్సు చేసి ఏమిప్రయోజనము? ప్రజలను బాగుగా రక్షించువాని గృహమేస్వర్గము. ప్రజలు కష్టపడుచున్న రాజు గృహమే నరకము. ప్రజల పుణ్యపాపములలో ఆరవవంతు రాజుకు చెందును. రక్షించుటచే ప్రజలపుణ్యమునందలి ఆరవభాగమును పొందినట్లే రక్షించకపోవుటచే వారి పాపములోని ఆరవవంతుగూడ పొందును. పరస్త్రీలంపటులగు దురాత్ములనుండి పతివ్రతలను రక్షించుట ధర్మము. రాజు బంధువులచేతను, చోరులచేతను, అధికారులచేతను పీల్చివేయబడుచున్న ప్రజలను రక్షించవలెను. ప్రజలను బాగుగా రక్షించినచో వారు రాజుకు ఉపయోగపడుదురు. ప్రజలను రక్షించకున్నచో వారు పైనచెప్పిన రాజు బంధ్వాదులకు గ్రాసమైపోదురు. అందుచే రాజు దుష్టులను శిక్షించి శాస్త్రోక్తప్రకారము ప్రజలనుండి పన్నుతీసికొనవలెను. రాజ్యమునందలి సగము ఆయమును కోశాగారములో రక్షించి సగము బ్రాహ్మణులకీయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు దానినంతను గ్రహించి నాల్గవవంతు క్షత్రియులకును, ఎనిమిదవభాగము వైశ్యులకును, పదునారవభాగము శూద్రులకును ఇవ్వవలెను. ధనమును ధర్మానుసారముగా సత్పాత్రలకు దానము చేయవలెను. అసత్యముపలుకువానిని దండించవలెను. వానిధనములో ఎనిమిదవవంతు దండముగా తీసికొనవలెను. స్వామిఎవరో తెలియని ధనమును రాజు మూడు సంవత్సరముల పాటు తనవశములో నుంచుకొనవలెను. మూడుసంవత్సరములలోపుగా ధనస్వామి వచ్చినచో ఆధనమును ఆతడు తీసికొన వచ్చును. ఆసమయము దాటినచో ఆ ధనము రాజధనమైపోవును. మూడుసంవత్సరములలోపునవచ్చి 'ఇది నాధనము' అని చెప్పుచు, ధనస్వామి దాని స్వరూపము, సంఖ్యమొదలగువాటిని రాజుఎదుట సరిగా చెప్పగలిగినచో ఆ ధనము పొందవచ్చును. చిన్నపిల్లవానికి చెందిన సొత్తును రాజు, ఆతనికి సమావర్తన సంస్కారము అగువరకును లేదా అతని బాల్యావస్థతీరువరకును తన ఆధీనమునందుంచుకొనవలెను. సంరక్షులెవ్వరును లేని కాలమునందు పిల్లలు చిన్నవారైనపుడు స్త్రీల పోషణ బాధ్యతకూడ రాజు వహించవలెను.

పతివ్రతాసు చ స్త్రీషు విధవాస్వాతురాసుచ | జీవన్తీనాం తు తాసాం యే సంహరేయుః స్వబాంధవాః. 20

తాఞ్ఛిష్యాచ్చౌరదండేన ధార్మికః పృథివీపతిః | సామాన్యతోహృతం చౌరైస్తద్వై దద్యాత్స్వయంనృపః. 21

చౌరరక్షాధికారిభ్యో రాజాపిహృతమాప్నుయాత్‌|అహృతే యో హృతం బ్రూయాన్నిః సార్యోదండ్యఏవసః. 22

నతద్రాజ్ఞాప్రదాతవ్యంగృహేయద్గృహగైర్మృతమ్‌ | సర్వాష్ట్రపణ్యాదద్యాద్రాజా వింశతిగం ద్విజః. 23

శుల్కాంశం పరదేశాచ్చక్షయవ్యయ ప్రకాశకమ్‌ | జ్ఞాత్వాసంకల్పయేచ్ఛుల్కం లాభంవణిగ్యథాప్నుయాత్‌.

వింశాంశం లాభమాదద్యాద్దండనీయస్తతో7న్యథా | స్త్రీణాం ప్రవ్రజితానాం చ తరశుల్కం విర్జయేత్‌. 25

తరేషు దాశ దోషేణ నష్టం దాశాంస్తు దాపయేత్‌ | శూకధాన్యేషు షడ్భాగం శింబిధాన్యేతథాష్టమమ్‌. 26

రాజావన్యార్థమాదద్యాద్దేశకాలానురూపకమ్‌ | పఞ్చషడ్భాగమాదద్యాద్రాజా పశుహిరణ్యయోః. 27

గంధౌషధిరసానాం చ పుష్పమూల ఫలస్య చ | పత్రశాక తృణానాం చ వంశ##వైణవ చర్మణామ్‌. 28

వైదలానాం చ భాండానాం సర్వస్యాశ్మమయస్య చ | షడ్భాగమేవ చాదద్యాన్మధుమాంసస్యసర్పిషః. 29

పతివ్రతలైన స్త్రీలు వైధవ్యము పొందినను, రోగగ్రస్తులైనను వారిని కూడ ఈ విధముగనే రక్షించవలెను. అట్టి స్త్రీలు జీవించి ఉండగా వారి బంధువులెవ్వరైన వాళ్ళ ధనమును అపహరించినచో రాజు వారిని చోరులను దండించినట్లు దండించవలెను. చోరులు ప్రజల ధనమును అపహరించినపుడు రాజు పోయినంత ధనమును ప్రజకిచ్చి, దానిని రక్షాధికారుల నుండి రాబట్టవలెను. ధనము అపహరింపబడకపోయినను అపహరింపబడినట్లు చెప్పినవానిని దండించి రాజ్యము నుండి బైటకు పంపివేయవలెను. ధనమును ఇంటిలోని వారే దొంగిలించినపుడు రాజు తన ధనమును ఈయవలసి పనిలేదు. రాజ్యమునందలి అపణముల నుండి వారి ఆదాయములో ఐదవవంతు పన్నుగా రాజు గ్రహించవలెను. పరదేశము నుంచి వస్తువులు దిగుమతి చేసుకొను నపుడు ఎంత ఖర్చు, నష్టము అగునో దానిని కాతాఋక్కుల ద్వారా పరిశీలించి, వస్తువుల మీద పన్ను ఎంత ఇచ్చుచున్నారో చూచి, ప్రతి వ్యాపారస్థుని మీదను ఆతనికి నష్టము కలగకుండునట్లు పన్ను వేయవలెను. రాజు ఆదాయములోని ఇరువదవంతు మాత్రమే తీసికొనవలెను. ఎవరైన అధికారి అంతకంటే ఎక్కువ వసూలు చేసినచో ఆతని దండించవలెను. స్త్రీల నుండియు, సన్యాసుల నుండియు నావ దాటించుటకు కేవు తీసుకొన గూడదు నావికుని పొరబాటుచేత ఏ వస్తువైన నష్టమైనచో ఆ నష్టము నావికుని నుండి వసూలు చేయవలెను. శూకధాన్యములో (వరి, గోధుమ మొ.) ఆరవవంతు, శింబిధాన్యములో (శనగ మొ.) ఎనిమిదవ వంతు పన్నుగా తీసికొనవలెను. అడవిలో పండు ఫలమూలాదులపై గూడ దేశకాలానుసారముగా పన్ను గ్రహించవలెను. పశువులలో ఐదవ భాగము, బంగారములో ఆరవ భాగము తీసికొనవలెను. గంధము, ఓషధులు, రసము, పుష్పములు, ఫలములు, మూలములు, పత్రములు, శాకములు, తృణము, వెదురు, చర్మ, వెదురుబుట్టలు, శిలావ్రాతలు, మధువు, మాంసము, నెయ్యి వీటిపై కూడ ఆదాయములో ఆరవవంతు మాత్రమే వసూలు చేయవలెను.

మ్రియమాణోపి నాదద్యాద్ర్బాహ్మణభ్యస్తథాకరమ్‌ | యస్యరాజ్ఞస్తువిషయే శ్రోత్రియుః సీదతిక్షుధా. 30

తస్యసీదతి తద్రాష్ట్రం వ్యాధిదుర్భిక్షతస్కరైః | శ్రుతం వృత్తంతు విజ్ఞాయ వృత్తిం తస్య ప్రకల్పయెత్‌.

రక్షేచ్చ సర్వతస్త్వేనం పితా పుత్రమివౌరసమ్‌ | సంరక్ష్యమాణోరాజ్ఞాయః కురుతేధర్మమన్వహమ్‌. 32

తేనాయుర్వర్ధతేరాజ్ఞో ద్రవిణం రాష్ట్రమేవ చ |

కర్మకుర్యుర్న రేంద్రస్య మాసేనైకంచశిల్పినః | భుక్తమాత్రేణ యే చాన్యం స్వశరీరోపజీవినః. 33

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రాజధర్మో నామ త్రయోవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

బ్రాహ్మణుల నుండి ప్రియవస్తువేదియు, లేదా పన్ను తీసికొనగూడదు. శ్రోత్రియులైన బ్రాహ్మణులు ఏ రాజు రాజ్యములో ఆకలితో బాధపడుచుందురో ఆ రాజ్యము రోగములు, కరువు, దోపిడీదొంగలు వీటిచే పీడింపబడును. అందువలన బ్రాహ్మణుల విద్యా సదాచారాదులను తెలసికొని వారికి అనుకూలమగు జీవికను ఏర్పాటు చేయవలెను. తండ్రి తన కుమారుని పాలించినట్లు రాజు సదాచారవంతులును, విద్వాంసులును అగు బ్రాహ్మణులను పాలించవలెను. రాజుచే రక్షింపబడి బ్రాహ్మణుడాచరించు స్వధర్మానుష్ఠానముచే రాజు యొక్క ఆయుర్దాయము పెరుగును. రాష్ట్రము, కోశము కూడ వృద్ధి పొందును. శిల్పకారులు వేతనము తీసికొనకుండ, భోజనము మాత్రము చేసి మాసము నందు ఒక రోజు రాజు పనులు చేయవలెను. రాజ్యములో నివసించుచు శరీర పరిశ్రమచే జీవించు ఇతరులు కూడ ఈ విధముగనే మాసమునందొక రోజు రాజకార్యములు చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు రాజధర్మకథన మను రెండువందల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page