Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ వింశత్యధికద్విశతతమో7ధ్యాయః

అథ రాజ్ఞః సహాయనమ్పత్తిః

పుష్కర ఉవాచ :

సో7భిషిక్తః సహామాత్యో జయేచ్ఛత్పూన్నృపోత్తమః | రాజ్ఞాసేనాపతిఃకార్యో బ్రాహ్మణఃక్షత్రియో7థవా. 1

కులీనో నీతిశాస్త్రజ్ఞః ప్రతీహారశ్చ నీతివత్‌ | దూతశ్చ ప్రియవాదీ స్యాదక్షిణో7తి బలాన్వితః. 2

తాంబూలాధారీ నా స్త్రీ నా భక్తః క్లేశసహః ప్రియః | సంధివిగ్రహికః షాడ్గుణ్యాది విశారదః. 3

ఖడ్జధారీ రక్షకః స్యాత్సారథిః స్యాద్బలాదివత్‌ | సూదాధ్యక్షోహితోవిజ్ఞో మహానసగతోహినః. 4

సభాసదస్తు ధర్మజ్ఞా లేఖకో7క్షరవిద్ధితః | ఆహ్వానకాలవిజ్ఞాః స్యుర్హితా దౌవారికాజనాః. 5

రత్నాదిజ్ఞో ధనాధ్యక్ష అర్ధద్వారే హితోనరః | స్యాదాయుర్వేద విద్వైద్యో గజాధ్యక్షో7థ హస్తివిత్‌. 6

జితశ్రమో గజారోహో హయాధ్యక్షో హయాదివిత్‌ | దుర్గాధ్యక్షోహితో ధీమాన్థ్సపతిర్వాస్తు వేదవిత్‌. 7

యంత్రముక్తే పాణిముక్తే హ్యముక్తే ముక్తధారితే | అస్త్రాచార్యోనియుద్ధే చ కుశలోనృపతేర్హితః. 8

వృద్ధశ్చాంతఃపురాధ్యశ్చ వఞ్చాశద్వార్షిక్యః స్త్రియః | సప్తత్యబ్దాస్తు పురుషాశ్చరేయుః సర్వకర్మసు. 9

జాగ్రత్స్యాదాయుధాగారే జ్ఞాత్వా వృత్తిర్విధీయతే | ఉత్తమాధమమధ్యాని బుద్ధ్వాకర్మాణి పార్ధివః. 10

ఉత్తమాధమ మధ్యాని పురుషాన్వినియోజయేత్‌ | జయేచ్ఛుః పృథివీం రాజా సహాయావానయేద్ధితాన్‌. 11

ధర్మిష్ఠాన్ధర్మకార్యేషు శూరాన్సంగ్రామకర్మసు | నిపుణానర్థ కృత్యేషు సర్వత్ర చ తథా శుచీన్‌. 12

పుష్కరుడు పలికెను : అభిషేకానంతరము ఉత్తముడగు రాజు మంత్రి సమేతుడై శత్రువులను జయించవలెను. సత్కులప్రసూతుడు, నీతిశాస్త్రజ్ఞుడు అగు బ్రాహ్మణుని గాని క్షత్రియునిగాని సేనాపతిగా నియమించవలెను. ద్వారకపాలకులు గూడ నీతిజ్ఞులైయుండవలెను. దూత కూడ మృదుభాషియై, అత్యంత బలసామర్థ్యవంతుడై ఉండవలెను. స్త్రీ గాని, పురుషుడు గాని, తాంబూలధారి కావచ్చును. కాని ఆ వ్యక్తి రాజభక్తి కలిగి, క్లేశసహిష్ణువై, స్వామిప్రీతి పాత్రము కావలెను. సంధి - విగ్రహ - యాన - ఆసన - ద్వైధీభావ - సమాశ్రయములను ఆరు గుణములను సమయానుసారముగా ప్రయోగింప గలుగు వానిని సాంధివిగ్రహకునిగా నియమింపవలెను. రాజరక్షకుడు సర్వదా ఖడ్గముబూని యుండవలెను. సారథి సేనాదివియక మగు మంచి జ్ఞానము కలవాడై ఉండవలెను. పాకశాలాధ్యక్షుడు రాజహితభిలాషియై, చతురుడై, సర్వదా పాకశాలలోనే ఉండవలెను. రాజసభాసదస్యులు ధర్మవేత్తలై యుండవలెను. వ్రాయసగాండ్రు వివిధ లిపివేత్తలై రాజ హితైషులై ఉండవలెను. ద్వారపాలకులు రాజహితచింతకులై, రాజు ఎప్పుడు తమను పిలచునో తెలిసినవారై ఉండవలెను. ధనాధ్యక్షుడు, రత్నపరీక్షా నిపుణుడై, ధనమును వృద్ధి చేయుట యందాసక్తి కలవాడై ఉండవలెను. రాజవైద్యుడు ఆయుర్వేద నిపుణుడై యుండవలెను. గజాధ్యక్షుడు గజవిద్య యందు ప్రవీణుడై ఉండవలెను. ఏనుగులపై ఎక్కు మావటీడు పరిశ్రమచే అలసట చెందనివాడు కావలెను. అశ్వాధ్యక్షుడు అశ్వవిద్యావిశారదుడై ఉండవలెను. దుర్గాధ్యక్షుడు రాజహితైషియై బుద్ధిమంతుడై ఉండవలెను. శిల్పులు వాస్తు విద్యావిశారదులై ఉండవలెను. యంత్రముల ద్వారా ఆయుధములు ప్రయోగించుట, హస్తముచే శస్త్రములను విడచుట, శస్త్రములను ప్రయోగింపకుండుట. విడచిన శస్త్రములను నివారించుట మొదలగు యుద్ధ రీతులందు ప్రవీణుడు, రాజహితమును కోరువాడు అగు వానిని శస్త్రాచార్యపదమునందు నియమించవలెను. వృద్ధుని అంతఃపురాధ్యక్షుని చేయవలెను. అంతఃపురమునందలి అన్ని కార్యములను నిర్వహించుటకు ఏబది సంవత్సరముల స్త్రీలను, డెబ్బది సంవత్సరములు పురుషులను నియమించవచ్చును. సర్వదా జాగరూకులైన వారినే ఆయుధాగారమున నియమింపవలెను. భృత్యులకు వారి వారి కార్యములను బట్టి జీవిక ఏర్పరుపవలెను. ఉత్తమ - మధ్యమ - అధమ కార్యానుసారముగా అట్టివారినే ఆయా కార్యములందు నియోగించవలెను. విజయాభిలాషి యగు రాజు స్వహితైషులగు వారిచే సహాయకులుగా నియమించవలెను. ధర్మకార్యములందు ధర్మాత్ములను, యుద్ధమునందు శూరులను, ధనార్జనమునందు అర్థకుశలులను నియమించవలెను. శుద్ధమగు ప్రవర్తన, ఆలోచన కలవారినే ఆయా కార్యములందు నియోగించవలెను.

స్త్రీషు షణ్డాని యుఙ్జీత తీక్ష్‌ణాన్దారుణకర్మసు | యోయత్ర విదితోరాజ్ఞా శుచిత్వేన తు తన్నరమ్‌. 13

ధర్మేచార్థే చ కామేచ నియుఞ్జీతాదమే7ధమాన్‌ | రాజా యథార్హః కుర్యాచ్చ ఉపదాభిః పరీక్షితాన్‌. 14

సమంత్రీ చ యథాన్యాయాత్కుర్యాద్దస్తివనేచరాన్‌ | తత్పదాన్వేషణ యత్తానధ్యక్షాంస్తత్రకారయేత్‌. 15

యస్మిన్కర్మణి కౌశల్యం యస్యతస్మిన్ని యోజయేత్‌ |

పితృవైతామహాన్‌భృత్యాన్సర్వకర్మసు యోజయేత్‌. 16

వినాదాయాదకృత్యేషు తత్రతేహి సమాగతాః | పరరాజ గృహాత్ప్రప్తాన్‌జనాన్సం శ్రయకామ్యయా. 17

దుష్టానప్యథవా7దుష్టాన్సంశ్రయేత ప్రయత్నతః | దుష్టం జ్ఞాత్వా విశ్వసేన్నం తద్వృత్తిం వర్తయేద్వశే. 18

దేశాన్తరగతాన్సార్శ్వే చారైర్‌జ్ఞాత్వా హి పూజయేత్‌ | శత్రవో7గ్నిర్విషం సర్పో నిస్త్రింశమపి చైకతః. 19

భృత్యా విశిష్టం విజ్ఞేయాః కుభృత్యాశ్చతథైకతః | చారచక్షుర్భవేద్రాజా నియుఞ్జీత సదాచరాన్‌. 20

జనస్యావిహితాన్సౌమ్యాం స్తథా జ్ఞాతాన్పరస్పరమ్‌ | వణిజోమంత్రకుశలాన్సాంవత్సర చికిత్సకాన్‌. 21

తథా ప్రవ్రజితాకారాన్బలా బల వివేకినః | నైకస్యరాజా శ్రద్ధధ్యాచ్ఛృద్ధధ్యాద్బహువాక్యతః. 22

రాగపరాగౌ భృత్యానాం జనస్యచ గుణాగుణాన్‌ | శుభానామశుభానాంచ జ్ఞానం కుర్యాద్వశాయుచ. 23

అనురాగ కరం కర్మ చరేజ్జహ్యాద్విరాగజమ్‌ | జనానురాగయాలక్ష్మ్యా రాజాస్యాజ్జనరఞ్జనాత్‌. 24

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ రాజసహాయసంపత్తి ర్నామ వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

స్త్రీల సంరక్షణ విషయమున నపుంసకులను నియమించవలెను. క్రూరకార్యములను తీక్‌ష్ణస్వభావులగు వారిని నియోగించవలెను. ధర్మార్థ కామములను హరించుటయందు ఏ పురుషుడు సమర్థుడుగ కనబడునో ఆతనిని నియమించవలెన. నీచకార్యములందు అట్టివానినే నియోగించవలెను. పురుషులను అనేక విధముల పరీక్షించిన పిదపనే వారిని తగు కార్యములందు నియోగించవలెను. మంత్రితో ఆలోచనలు చేయుచుండవలెను. కొందరికి వృత్తికల్పించి ఏనుగులున్న అడవులలో వారికి నివాస మేర్పరచి వారి విషయము తెలుసుకొనుచుండుటకై ఉత్సాహవంతు లగు అధ్యక్షులను నియమించవలెను. ఎవరికి ఏ కార్యమునందు నైపుణ్య ముండునో వారిని ఆ కార్యమునందు నియమించవలెను. తండ్రి తాతల నుండి తరతరాలుగా వచ్చుచున్న భృత్యులను అన్ని కార్యములందును నియోగించవచ్చును. వారందరును సమానులే గాన వారిలో ఎవరినికూడ ఇతరులపై అధికారిగ నియమించగూడదు. ఇతర రాజుల నుండి తనను ఆశ్రయించుటకై వచ్చినవారికి, వారు దుష్టులైనను, మంచివారైనను ప్రయత్నపూర్వకముగా ఆశ్రయమీయవలెను. వారు దుష్టులని తెలసినచో వారిని విశ్వసించగూడదు. వారి జీవికా వృత్తిని తన ఆధీనమునందును కొనవలెను. ఇతర దేశములనుండి వచ్చిన వారిని గూఢచారులద్వారా బాగుగా పరీక్షించి తగు విధమున సత్కరించవలెను. శత్రు - అగ్ని - విష - సర్ప - ఖడ్గములు ఒక ప్రక్క దుష్టులగు భృత్యులు మరొక ప్రక్క. వీరిలో దుష్టభృత్యులు అధికభయంకరులు. రాజు గూఢచారులనే నేత్రములుగ ఉపయోగించవలెను అందుచే అన్ని విషయములు తెలుసుకొనుటకై గూఢచారులను సమకూర్చుకొనవలెను. జనులచే గుర్తింప శక్యముకానివారిని శాంత- కోమలస్వభావము కలవారిని, గూఢచారులనుగా నియమించవలెను. వారు ఒకరికొకరు కూడ తెలియనివారుగా ఉండవలెను. వారిలో కొందరు వర్తకులుగాను, కొందరు మంత్రతంత్రవేత్తలుగాను, కొందరు జ్యోతిష్కులుగాను, కొందరు వైద్యులుగాను, కొందరు సంన్యాసులుగాను, కొందరు బలాబలవిచారకర్తలుగాను సంచరించుచుండవలెను. రాజు ఒక్క గూఢచారి చెప్పినది నమ్మకూడదు. చాలమంది ఒకే విధముగ చెప్పినయెడలనే నమ్మవలెను. భృత్యులలో ఎవనికి తవపై అనురాగమున్నదో ఎవనికి లేదో, ఎవనిలో ఏసద్గుణములున్నవి. ఏదుర్గుణము లున్నవి, శుభచింతకుడెవడు అశుభచింతకుడెవడు అను విషయములను తెలిసికొనవలెను. ప్రజల అనురాగమును పెంచు కార్యములను మాత్రమే చేయవలెను. వారికి వైముఖ్యము కలుగు పని చేయకూడదు. ప్రజానురాగమును పెంచు లక్ష్మిగల రాజే నిజమైన రాజు. అందరిని రంజింపచేయుట చేతనే ఆతడు 'రాజు' అని చెప్పబడుచున్నాడు.

అగ్ని మహాపురాణమునందు రాజసహాయసంపత్తివర్ణన మను రెండువందల ఇరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page