Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుర్దశాధిక ద్విశతతమోధ్యాయః

అథ మంత్ర మాహాత్మ్య కథనమ్‌

అగ్ని రువాచ :

నాడీచక్రం ప్రవక్ష్యామి యజ్‌జ్ఞానాజ్‌జ్ఞాయతే హరిః | నాభేరదస్తాద్యత్కన్దమంకురాస్తత్ర నిర్గతాః. 1

ద్వానప్తతి సహస్రాణి నాభిమధ్యే వ్యవస్థితాః | తిర్యగూర్ధ్వ మధశ్చైవ వ్యాప్తంతాభిః సమన్తతః. 2

చక్రవత్సంస్థితా హ్యేతాః ప్రధానా దశ నాడయః | ఇడా చ పిఙ్గలాచైవ సుషువ్ణూ చ తథైవచ. 3

గాంధారీ హస్తిజిహ్వాచ పృథాచైవ యశాతథా | అలమ్భుషా కుహూశ్చైవ శంఖినీ దశమీ స్మృతా. 4

దశ ప్రాణహరా హ్యేతా నాడయః పరికీర్తితాః | ప్రాణో7పాసః సమానశ్చోదాన వ్యానౌ చ వాయవః. 5

నాగః కూర్మో7థ కృకరో దేవదత్తో ధనంజయః | ప్రాణస్తు ప్రథమో వాయుః దశానామపి సప్రభుః. 6

ప్రాణః ప్రాణయతే ప్రాణం విసర్గాత్పూరణం ప్రతి | నిత్యమాపూరయత్యేష ప్రాణినామురసి స్థితః. 7

నిఃశ్వాసోచ్ఛ్వాసకాసైస్తు ప్రాణో జీవసమాశ్రితః | ప్రయాణం కురుతే యస్మాత్తస్మాత్ర్పాణః ప్రకీర్తితః. 8

అధో నయత్యపానస్తు ఆహారంచ నృణామధః | మూత్ర శుక్రవహో వాయురపానస్తేన కీర్తితః. 9

పీతం భక్షితమాఘ్రాతం రక్తపిత్త కఫానిలమ్‌ | సమం నయతిగాత్రేషు సమానో నామమారుతః. 10

స్పందయత్యధరం వక్త్రం నేత్రరాగప్రకోపనమ్‌ | ఉద్వేజయతి మర్మాణి ఉదానో నామ మారుతః. 11

వ్యానో వినామయత్యఙ్గం వ్యానోవ్యాధిప్రకోపనః | ప్రతిదినం తథా కంఠాద్వ్యాపనాద్వ్యాన ఉచ్యతే. 12

ఉద్గారే నాగఇత్యుక్తః కూర్మశ్చోన్మీలనే స్థితః | కృకరో భక్షణ చైవ దేవదత్తో విజృమ్భితే. 13

ధనంజయః స్థితో ఘోషే మృతస్యాపి న ముఞ్చతి | జీవః ప్రయాతి దశధా నాడీచక్రం హి తేన తత్‌. 14

అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు నాడీచక్రమును గూర్చి చెప్పెదను దీనిని తెలుసుకొనుటచే శ్రీమహావిష్ణు జ్ఞానము కలుగును. నాభిక్రింద మూలాధారచక్రముండును. దానినుంచి అంకురమువలె నాగులు బయల్వెడలును. నాభిమధ్యయందు డెబ్బదిరెండువేల నాడులున్నవి. చక్రాకారముననున్న ఈనాడులు శరీరమును క్రింద, పైన, ప్రక్కల అంతటను వ్యాపించి యున్నవి. వీటిలో-ఇడా, పింగళా, సుషుమ్నా, గాంధారీ, హస్తిజిహ్వా, పృథా, యశా, అలంబుషా, కుహూ. శంఖినీ అను వదినాడులు ప్రధానమైనవి. ఇవి ప్రాణవాయు ప్రసారముచేయు పది ప్రధాననాడులు. ప్రాణ-అపాన-వ్యన-ఉదాన-సమాననాగ - కూర్మ - కృకర - దేవదత్త - ధనంజయములనునవి పది ప్రాణవాయువులు. వీటిలో ప్రాణవాయువు అన్నింటికి అధిపతి. రిక్త (శూన్య) త్వమును పూర్తిచేయుటకై ఈ ప్రాణము ఇతర ప్రాణవాయువులను ప్రేరేపించును; సకలప్రాణుల హృదయదేశమునందుండి అపానవాయువుద్వారాజరుగు మలమూత్ర త్యాగముచే ఏర్పడు రిక్తత్వమును నిత్యము పూడ్చును. జీవుని ఆశ్రయించి యున్న ఈ ప్రాణము శ్వాస-ఉచ్ఛ్వాస - కాసాదుల ద్వారా ప్రయాణము (గమనాగమనములు) చేయునుగాన 'ప్రాణ'మని చెప్పబడుచున్నది. అపానవాయువు ఆహారమును, మూత్ర - శుక్లాదులను క్రిందికి తీసికొనిపోవును. ఇట్లు అపానయనము (తొలగించుట) చేయుటచే 'అపాన' మైనది. తిన్న ఆహారమును, త్రాగిన జలాదులను, వాసనచూసిన పదార్థములను రక్త - పిత్త - కఫ వాతములను సమానరూపమున సర్వాంగములందు ప్రసరింపచేయునది 'సమానము'. ఉదానము ముఖమును, అధరములను స్పందింపజేయును, నేత్రముల ఎరుపును అధికము చేయును; మర్మ స్థానములను ఉద్విగ్నము చేయును; అందుచే దీనికి 'ఉదానము' అని పేరు. వ్యానము అంగములను పీడించును. వ్యాధి ప్రకోపము కలిగించును. కంఠమును అవరుద్ధము చేయును. వ్యాపన శీలమగుటచే ఇది ''వ్యానము''. నాగవాయువు త్రేణుపు, వాంతిమొదలగునవి చేయును. కూర్మవాయువుకంటిరెప్పల మూయుట తెరచుట చేయును. కృకరము భక్షణ మునందును, దేవదత్తము ఆవులింతలందును ఉండును. ధనంజయమునకు స్థానము ఘోషము. ఇది మృతశరీరమును కూడ విడువదు. ఈ పదింటిలో జీవుడు ప్రయాణము చేయును. అందుచే దశప్రాణభేదముచే నాడీచక్రమునకు గూడ పది భేదములేర్పడు చున్నవి.

సంక్రాన్తిర్విషువం చైవ హ్యహోరాత్రాయనాని చ | అధిమాన ఋణం చైవ హ్యూనరాత్రం ధనం తథా. 15

ఊనరాత్రం భ##వేద్ధిక్కా హ్యధిమాసో విజృమ్భికా | ఋణం చాత్ర భ##వేత్కాసో విశ్వాసో ధనముచ్యతే. 16

ఉత్తరం దక్షిణం జ్ఞేయం వామం దక్షిణ సంజ్ఞితమ్‌ | మధ్యేతు విషువం ప్రోక్తం పుటద్వయ వినిఃసృతమ్‌. 17

సంక్రాన్తిః పునరసై#్యవ స్వస్థానాత్థ్సాన యోగతః | సుషువ్ణూ మధ్యమే హ్యజ్ఘే ఇడావామే ప్రతిష్ఠితా. 18

షింగలా దక్షిణ విప్ర ఊర్ధ్వం ప్రాణోహ్యహః స్మృతమ్‌ | అపానో రాత్రిరేవం స్యాదేకో వాయుర్దశాత్మకః.

ఆయామో దేహ మధ్యస్థః సోమగ్రహణ మిష్యతే | దేహాతి తత్త్వమాయామమాదిత్య గ్రహణం విదుః. 20

సూర్యగతిచే ఏర్పడు సంక్రాంతి - విషువ - దిన - రాత్రి ఆయన -అధిమాస - ఋణ - ఊనరాత్ర - ధనములను పదిదశలు శరీరములో కూడ ఏర్పడును. ఈ శరీరమునందు ఎక్కిళ్లు ఊనరాత్రము. ఆవులింత అధిమాసము. దగ్గు ఋణము; నిశ్వాసము ధనము. శరీరములో నున్న వామనాడి ఉత్తరాయణము. దక్షిణనాడి దక్షినాయనము. ఆ రెండింటి మధ్య నాసికారంధ్రద్వయము నుండి బయల్వెడలు శ్వాసవాయువు విషువము. ఈ విషువవాయువు తన స్థానమునుండి చరించి రెండవస్థానమునకు పోవుట సంక్రాంతి. ద్విజశ్రేష్ఠా! శరీర మధ్యభాగమునందు సుషుమ్న, వామభాగమున ఇడ, దక్షిణ భాగమునపింగళ ఉన్నవి. ఊర్ధ్వగతిగల ప్రాణముదినము; అధోగతిగలది రాత్రి, ఒక్కప్రాణవాయునే దశవాయురూపమున విభక్తమైనది. దేహములోపల ప్రాణవాయువు ఆయామము చెందుట ''చంద్రగ్రహణము'' అది దేహము పైభాగము వరకు వ్యాపించినచో సూర్యగ్రహణము.

ఉదరం పూరయేత్తావ ద్వాయునా యావదీప్సితమ్‌ | ప్రాణాయామో భ##వేదేష పూరకోదేహపూరకః. 21

పిధాయ సర్వద్వారాణి నిఃశ్వాసోచ్ఛ్వాస వర్జితః | సంపూర్ణకుంభవత్తిష్ఠేత్ర్పాణాయామః స కుంభకః. 22

ముఞ్చేద్వాయం తతస్తూర్ధ్వం శ్వాసేనైకేన మంత్రవిత్‌ |

ఉచ్ఛ్వాస యోగయుక్తశ్చ వాయుమూర్ధ్వం విరేచయేత్‌. 23

ఉచ్చరతి స్వయం యస్మాత్స్వదేహావస్థితః శివః | తస్మాత్తత్త్వవిదాం చైవ సఏవ జపఉచ్యతే. 24

అయుతే ద్వే సహసై#్రకం షట్‌శతాని తథైవచ | అహోరాత్రేణ యోగీన్ద్రో జపసంఖ్యాం కరోతిసః. 25

అజపా నామ గాయత్రీ బ్రహ్మవిష్ణుమహేశ్వరీ | అజపాం జపతేయస్తాం పునర్జన్మ న విద్యతే. 26

చంద్రాగ్నిరవి సంయుక్తా ఆద్యాకుండలీనీమతా | హృత్ర్పదేశీ తు సాజ్ఞేయా అంకురాకార సంస్థితా. 27

సృష్టిన్యాసో భ##వేత్తత్ర సవై సర్గావలంబనాత్‌ | స్రవన్తం చింతయే త్తస్మిన్నమృతం సాత్త్వికోత్తమః. 28

దేహస్థః సకలోజ్ఞేయో నిష్కలోదేహవర్జితః | హంస హంసేతియో బ్రూయాద్ధంసోదేవః సదాశివః. 29

తిలేషు చ యథాతైలం పుష్పేగంధః సమాశ్రితః | పురుషస్య తథాదేహే స బాహ్యాభ్యన్తరంస్థితః. 30

బ్రహ్మణో హృదయే స్థానం కంఠే విష్ణుః సమాశ్రితః | తాలుమధ్యేస్థితోరుద్రోలలాటేతు మహేశ్వరః. 31

ప్రాణాగ్రంతు శివం విద్యాత్తస్యాన్తేతు పరాపరమ్‌ | పంచధా సకలఃప్రోక్తో విపరీతస్తు నిష్కలః. 32

సాధకుడు ఎంత శక్యమగునో అంతవాయువు లోనికి తీసికొనవలెను. ఇది దేహమును 'పూరక' ప్రాణాయామము. శ్వాస బైటికి పోకుండునట్లు శ్వాసనిశ్వాసలు ఆపివేసి పూర్ణకుంభము వలెనున్నచో అది 'కుంభక' ప్రాణాయామము. పిదప మంత్రవేత్త పైకి ఒకే నాసారంధ్రముచే వాయువును విడచినచో అది 'రేచక' ప్రాణాయామము. శ్వాసోచ్ఛ్వాస క్రియచే శరీరములో నున్న శివరూపబ్రహ్మయొక్క ఉచ్చారణము (సోహంహంసఃఅనువిధమున) జరుగును. గాన తత్త్వవేత్తలు దీనిని జపమందురు. ఈ విధముగ తత్త్వవేత్త ఒకదినమునందు శ్వాసప్రశ్వాసల ద్వారా 21600 పర్యాయములు మత్రజపము చేయును. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సంబంధించిన 'అజపాగాయత్రి'. ఈ అజపాజపము చేయవానికి పునర్జన్మ లేదు. చంద్రాగ్ని సూర్యయుక్త మూలాధారస్థిత యగు కుండలినీ శక్తి హృదయప్రదేశమునందు అంకురా కారమును నుండును. సాత్త్విక పురుషశ్రేష్ఠుడగు యోగి సృష్టిక్రమము నవలంబించి, సృష్టిన్యాసము చేసి, బ్రహ్మరంధ్రము నందున్న శివునినుండి కుండలినీముఖమునందు అమృతము ప్రవహించునట్లు భావనచేయవలెను. శివునకు సకలము నిష్కలము అని రెండు రూపములున్నవి. సాకారుడగు శివుడు సకలుడు, నిరాకారుడు నిష్కలుడు. వారు 'హంసహంస' అని జపము చేయుదురు. హంస అనగా సదాశివుడు, తిలలలోతైలము, పుష్పములలో సుగంధము ఉన్న విధమున జీవాత్మకు లోపలను వెలుపలను సదాశివుడు నివసించును. బ్రహ్మ హృదయమునందును, విష్ణువు కంఠమునందును, తాలుమధ్యభాగమున రుద్రుడు, లలాటమున మహేశ్వరుడు, ప్రాణాగ్రమునందు సదాశివుడును ఉందురు. వీటి అన్నింటికినీ అంతమునందు పరాత్పర బ్రహ్మ ఉండును. సకల పరమాత్మ బ్రహ్మ - విష్ణు- రుద్ర మహేశ్వర - సదాశివరూపముననుండును. నిర్గుణుడు, నిష్కలుడు అగు పరమాత్మ 'నిష్కలుడు'.

ప్రాసాదం నాదముత్థాప్య సతతంతు జపేద్యది | షణ్మాసైఃసిద్ధిమాప్నోతి యోగయుక్తో నసంశయః. 33

గమాగమస్య జ్ఞానేన సర్వపాపక్షయోభ##వేత్‌ | అణిమాది గుణౖశ్వర్యం షడ్భిర్మాసైరవాప్నుయాత్‌. 34

స్థూలః సూక్ష్మః పరశ్చేతి ప్రాసాదః కథితో మయా | హ్రస్వోదీర్ఘః ప్లుతశ్చేతి ప్రాసాదం లక్షయేత్త్రిధా. 35

హ్రస్వో దహతి పాపాని దీర్ఘో మోక్షప్రదో భ##వేత్‌ | ఆప్యాయనే ప్లుత శ్చేతి మూర్ధ్ని బిందు విభూషితః. 36

ఆదావన్తేచ హ్రవ్వస్య ఫట్కారో మారణ హితః | అదావన్తేచ హృదయమాకృష్టౌ సంప్రకీర్తితమ్‌. 37

దేవస్య దక్షిణాం మూర్తిం పంచలక్షంస్థితో జపేత్‌ | జపాన్తే ఘృతహోమస్తు దశసాహస్రికో భ##వేత్‌. 38

ఏవ మాప్యాయితో మన్త్రో వశ్యోచ్చాటాదికారయేత్‌ | ఊర్థ్వేశూన్యమధఃశూన్యం మధ్యే శూన్యం నిరామయమ్‌. 39

త్రిశూన్యంయో విజానాతి ముచ్యతే7సౌధ్రువంద్విజః | ప్రాసాదం యోనజానాతి పంచమంత్ర మహాతనుమ్‌.

అష్టత్రింశత్కలాయుక్తం న స ఆచార్య ఉచ్యతే | తథోఙ్కారంచ గాయత్రీం రుద్రాదీన్వేత్త్య సౌ గురుః.

అనాహతనాదమును ప్రాసాదమువరకు లేవదీసి నిరంతర జపముచేయు యోగి ఆరుమాసములలోనే సిద్ధినిపొందును; సంశయము లేదు. గమనాగమన జ్ఞానముచే సమస్త పాపములను నశించి అణిమాదిసిద్ధులు, గుణములు, ఐశ్వర్యము ఆరు మాసములలో లభించును. స్థూలము, సూక్ష్మము పరము అను మూడువిధములగు ప్రాసాదమును వర్ణించితిని. ప్రాసాదమును హ్రస్వము దీర్ఘము, ప్లుతము అను మూడు రూపములలో గుర్తించవలెను. హ్రస్వము పాపములను దహించివేయును. దీర్ఘము మోక్షప్రదము. ప్లుతము తృప్తిప్రదము. దీని శిరస్సు పై బిందువు (అనుస్వారము) ఉండును. మారణకర్మల యందు హ్రస్వప్రాసాద మంత్రమునకు ఆద్యంతములందు 'ఫట్‌' చేర్చి జపము చేసిన మంచిది. ఆద్యంతములందు 'నమః' చేర్చి జపము చేసినచో ఆది ఆకర్షణసాధకము. మహాదేవుని దక్షిణామూర్తి సంబంధి మంత్రమును నిలబడి నాలుగులక్షలు జపించి, జపాంతమున పదివేల ఆజ్యహోమములు చేసినచో మంత్రసిద్ధి కలుగును. పిదప దానితో వశీకరణోచ్చాటనాదులు చేయవచ్చును. పైనను, క్రిందను, మధ్యయందును శూన్యమైన త్రిశూన్య నిరామయమంత్రము తెలిసికొనిన ద్విజుడు తప్పక ముక్తిపొందును. ఐదు మంత్రముల కలయికచే చాలపెద్దది, ముప్పదియేడు కలలతో కూడినది అయిన ప్రాసాదమంత్రము నెరుగనివాడు ఆచార్యుడు కాజాలడు. ఓం కారము, గాయత్రి, రుద్రాది మంత్రములు తెలిసినవాడే గురువు.

అగ్ని మహాపురాణమునందు నాడీచక్రకథన మను రెండువందలపదునాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page