Sri Devi Bhagavatam-1    Chapters   

అథ వింశో%ధ్యాయః

శృణు భారత వక్ష్యామి భారావతరణం తథా | కురుక్షేత్రే ప్రభాసే చ క్షపితం యోగమాయమా. 1

యదువంశే సముత్పత్తి ర్విష్టో రమితతేజసః | భృగుశాపప్రతాపేన మహామాయా బలేన చ. 2

క్షితిభారసముత్తార నిమిత్తమితి మే మతిః | మాయయా విహితో యోగో విష్ణోర్జన్మ ధరాతలే. 3

కిం చిత్రం నృప! దేవీ సా బ్రహ్మవిష్ణుసురానపి | నర్తయత్యనిశం మాయా త్రిగుణా నపరాన్కిము. 4

గర్భవాసోద్భవం దుఃఖం విణ్మూత్రస్నాయుసంయుతమ్‌ | విష్ణోరాపాదితం సమ్యగ్యయా విగతలీలయా. 5

పురా రామావతారే%పి నిర్జరా వానరాః కృతాః | విదితం తే తథా విష్ణు ర్దుఃఖపాశేన మోహితః. 6

అహం మమేతి పాశేన సుదృఢేన నరాధిప | యోగినో ముక్తసంగాశ్చ ముక్తకామా ముముక్షవః. 7

తామేవ సముపాసంతే దేవీం విశ్వేశ్వరీం శివామ్‌ | యద్భక్తి లేశ##లేశాంశ లేశ##లేశలవాంశకమ్‌. 8

లబ్ధ్వా ముక్తో భ##వే జ్జంతు స్తాం న సేవేత కో జనః | భువనేశీత్యేవ వక్త్రే దదాతి భువనత్రయమ్‌. 9

మాం పాహీత్యస్య వచసో దేయా%భావా దృణాన్వితా | విద్యా%విద్యేతి తస్యా ద్వే రూపే జానీహి పార్థివ. 10

విద్యయా ముచ్యతే జంతు ర్బధ్యతే%విద్యయా పునః | బ్రహ్మో విష్ణుశ్చ రుద్రశ్చ సర్వే తస్యా వశానుగాః. 11

అవతారాః సర్వ ఏవ యంత్రితా ఇవ దామభిః | కదాచిచ్చ సుఖం భుంక్తే వైకుంఠే క్షీరసాగరే. 12

ఇరువదవ యధ్యాయము

శ్రీ దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతము

ఓ జనమేజయా! శ్రీ యోగమాయాప్రభావమున భూభారహరణము-కురుక్షేత్రమందు ప్రభాస తీర్థమందు సైన్యావినాశము - భృగు మహర్షి శాప ప్రభావమున మహా మాయాశక్తి వలన పరాక్రమ శాలియైన విష్ణువు యదువంశమందుద్భవించుట మున్నగునవి తెలుపుచున్నాను. కడుశ్రద్ధగ వినుము. ఈ భూతలమందు దుష్ట సంహారమునకు-భూభార ముడుపుటకు - శ్రీ మహామాయ ప్రభావమున శ్రీమహావిష్ణు వవతరించెనని తలంచు చున్నాను. చిద్రూపమైన మాయాదేవి సకలాంతర్గతమగు స్వ మాయాశక్తిచే బ్రహ్మ-విష్ణువు మున్నగు దేవతల నాటాడించును. ఇంక నితరులను మోహింపజేయుననుటలో చోద్యమేమున్నది? ఆ విశ్వమాత తన లీలతో విష్ణునకు సైతము మలమూత్ర స్నాయు సంయుత మగు గర్భవాసపు దుఃఖము గలిగించినది. ఆ లోకాల బ్రోచుతల్లి తొల్లి రామావతారమందు దేవతలను వానరులుగ జేసినది. హరి యంతటివాడు తీరని దుఃఖపాశములచే బద్ధుడయ్యెను. ఆతడు నహంకార మమకార పాశముల యనుబంధములతో గట్టిగ గట్టబడెను. పరమయోగులు ముక్తసంగులు బంధముక్తిని గోరుదురు. సంగదోషము లేనివారు విశ్వేశ్వరీదేవియగు శివంకరి నుపాసింతురు. ఆ పరాదేవికి యాత్మనివేదన మను భక్తితో లేశ##లేశ లేశ##లేశలవాంశమంతయైన ఎడదలో కుదురుకొన్న తరించుటకు చాలును. అట్టి దేవీభక్తుడు సమతాయుత మనముతో నిచటనే ముక్తుడు గాగలడు. అంతటి దయామృత రస ప్రసన్నయగు అంతటి తల్లి సేవలు సేయని మూర్ఖు డెవడుండును? ఒక్కసారి శ్రీ త్రిభువనేశ్వరి' యను మధుర మధుర నామ ముచ్చరించిన చాలును. ఆ తల్లి వానికి త్రిభువనశ్రీలు ప్రసాదింప గలదు. ఓ యమ్మా! నన్ను కాపాడుమమ్మా! నేను నీవాడనమ్మా! యని యొకసారి యన్న చాలును. అతని కీయదగిన వస్తువులేమి దేవి యతనికి ఋణపడి యుండును. ఆ దేవికి విద్య యవిద్యయను రెండు రూపులు గలవని యెఱుంగుము. ప్రాణులు విద్యవలన ముక్తిబొందుదురు. అవిద్యవలన బంధముల పాలగుదురు. బ్రహ్మ-విష్ణు-రుద్రులు సైత మా మహనీయ శక్తికి వశులై వర్తింతురు; విష్ణుని యవతారములన్నియును త్రాటిచే బంధింపబడి నట్టులుండును. ఆతడొకప్పుడు వైకుంఠమందు మరొకప్పుడు పాలసంద్రముపై సుఖములందును.

కదాచి త్కురుతే యుద్ధం దానవై ర్బలవత్తరైః | హరిః కదాచి ద్యజ్ఞాన్వై వితతా న్ప్రకరోతి చ. 13

కదాచిచ్చ తపస్తీవ్రం తీర్థే చరతి సువ్రత | కదాచి చ్ఛయనే శేతే యోగనిద్రా ముపాశ్రితః. 14

న స్వతంత్రః కదాచిచ్చ భగవా న్మదుసూదనః | తథా బ్రహ్మా తథా రుద్ర స్తంథేంద్రో వరుణో యమః. 15

కుబేరో%గ్నీ రవీందూ చ తథా%న్యే సురసత్తమాః | మునయః సనకాద్యాశ్చ వసిష్ఠాద్యాస్తథా%పరే. 16

సర్వే%ంబావశగా నిత్యం పాంచాలీవ నరస్య చ | నసి ప్రోతా యథా గావో విచరంతి వశానుగాః. 17

తథైవ దేవతాః సర్వాః కాలపాశనియంత్రితాః | హర్షశోకాదయో భావా నిద్రాతంద్రాలసాదయః. 18

సర్వేషాం సర్వదా రాజ న్దేహినాం దేహసంశ్రితాః | అమరా నిర్జరాః ప్రోక్తా దేవాశ్చ గ్రంథకారకైః. 19

అభిధాత శ్చార్థతో న తేసూనం తాదృశాః క్వచిత్‌ | ఉత్పత్తి స్థితానాశాఖ్యా భావా యేషాం నిరంతరమ్‌. 20

అమరాస్తే కథం వాచ్యా నిర్జరాశ్చ కథం పునః | కథం దుఃఖాభిభూతా వా జాయంతే విబుధోత్తమాః. 21

కథం దేవాశ్చ వ్యక్తవ్యా వ్యసనే క్రీడనం కథమ్‌ | క్షణాదుత్పుతత్తి ర్నాశశ్చ దృశ్యతే%స్మి న్న సంశయః. 22

జలజానామ చ కీటానాం మశకాదీనాం తథా పునః | ఉపమా న కథం చైషా మాయుషో%ంతే%మరాః స్మృతాః. 23

తతో వర్షాయుషశ్చాపి శతవర్షాయుష స్తథా | మనుష్యా హ్యమరాదేవా స్తస్మా ద్బృహ్మ పరః స్మృతః. 24

అతడొక్కమారు బలవంతులైన దానవులతో బోరుసల్పును. వేరొక్కసారి పెక్కు యజ్ఞము లాచరించును. ఆతడొక్కొక్క సమయమున పుణ్యతీర్థములందు తీవ్ర తపమాచరించును. ఇంకొక్కతఱి యోగనిద్రను జెంది పరుండును. కనుక మధుసూదనుడు సైత మేనాడును సర్వతంత్ర స్వతంత్రుడుగాడు. అటులే బ్రహ్మ-రుద్రుడు-ఇంద్రుడు-యముడు-వరుణుడు-కుబేరుడు-అగ్ని-సూర్యచంద్రలు-ఇతర సురసత్తములు, సనకుడు-వసిష్ఠుడు మున్నగు మునులును మహర్షులును ఎల్లరును త్రిభువనేశ్వరీ మాయకు వశులై యాటబొమ్మల వలె మెలగుదురు. ముకుత్రాడు వేసిన యెంత బలముగల యెద్దయిన నరునకు వశ##మై అతని వెంటబడి తిరుగుచుండును గదా! అటులే దేవతలెల్లరు నఖండమైన కాలపాశముచే నియంత్రితులై భ్రమింతురు. హర్షశోకాదిభావములు- నిద్ర-తంద్ర-అలసత్వము-ఇవి దేహధారియైన ప్రతి ప్రాణి నాశ్రయించి విడువకుండును. దేవతల నమరులని నిర్జరులని గ్రంథకారులు వచించిరి. కాని, వాస్తవమున వారి యమరత్వము నామ మాత్రమైనదే. అది సార్థకమైనదిగాదు. ఉత్పత్తి స్థితిలయములు వారికిని గలుగును. ఇట్టివారి నమరులని నిర్జరులని యెట్టులు చెప్పవలయును? వీరును దుఃఖపీడితులు గదా! వీరు విబుధోత్తము లెట్లగుదురు? వారికిని విపత్తులు మూడును. వారికిని క్షణమాత్రమున చావు పుట్టువులు గలుగుచుండును. ఇట్టివారికి శాశ్వత క్రీడాసుఖము లెట్లు గల్గును? నీటిలోని పురుగులు - దోమలు నంతలో పుట్టి యంతలో చచ్చును. వీనితో దేవతలకు పోలిక గనుపట్టుచున్నది. వారికిని వీటికి వలెనే ఆయువు మూడునుగదా! మఱి వా రమరులెట్లు గాగలరు? ఒక ఏడాది వానికంటే నూఱండ్లవాడు - నూఱండ్ల వానికంటే దేవతలు - దేవతలకన్న బ్రహ్మ -

రుద్ర స్తథా తథా విష్ణుః క్రమశశ్చ భవంతి హి | నశ్యంతి క్రమశ##శ్చైవ వర్ధంతే చోత్తరోత్తరమ్‌. 25

నూనం దేహవతో నాశో మృతస్యోత్పతత్తిరేవచ | చక్రవద్భ్రమణం రాజ న్సర్వేషాం నా%త్ర సంశయః. 26

మోహజాలా%%వృతో జంతుర్ముచ్యతే న కదాచన | మయాయాం విద్యమానాయాం మోహజాలం న నశ్యతి. 27

ఉత్పిత్సుకాల ఉత్పత్తిః సర్వేషాం నృప జాయతే | తథైవ నాశః కల్పాంతే బ్రహ్మాదీనాం యథాక్రమమ్‌. 28

నిమిత్తం యస్తు యన్నా శే సఘాతయతి తం నృప | నాన్యథా తద్భవేన్నూనం విధినా నిర్మితం తు యత్‌. 29

జన్మ మృత్యుజరావ్యాధి దుఃఖం వా సుఖమేవ వా | తత్తథైవ భ##వేత్కామం నాన్యథేహ వినిర్ణయః. 30

సర్వేషాం సుఖదౌదేవౌ ప్రత్యక్షౌ శశిభాస్కరౌ | న నశ్యతి తయోః పీడా క్వచిత్త ద్వైరిసంభవా. 31

భాస్కరస్య సుతో మందః క్షయా చంద్రః కళంకవాన్‌ | పశ్య రాజన్విధేః సూత్రం దుర్వారం మహతామపి. 32

వేదకర్తా జగద్ధర్తా బుద్ధిదస్తు చతుర్ముఖః | సో%పి విక్లబతాం ప్రాప్తో దృష్ట్వా పుత్త్రీం సరస్వతమ్‌. 33

శివస్యా%పి మృతా భార్యా సతీ దగ్ద్వా కళేబరం | సో%భవద్ధుఃఖసంతప్తః కామార్తశ్చ జనార్తిహా. 34

కామాగ్ని దగ్ధదేహస్తు కాళింద్యాం పతితః శివః | సా%పి శ్యామజలా జాతా తన్నిదాఘవశాన్నృప. 35

కామార్తో రమమాణస్తు నగ్నః సో%పి భృగోర్వనం | నతః ప్రాప్తో%థ భృగుణా శప్తః కామాతురో భృశమ్‌. 36

పతత్వద్యైవ తేలింగం నిర్లజ్జేతి భృశం కిల | పపౌ చామృతవాపీం చ దానవై ర్నిర్మితాం ముదే. 37

ఇంద్రో%పి చ వృషో భూత్వా వాహనత్వం గతః క్షితౌ | ఆద్యస్య సర్వలోకస్య విష్ణోరేవ వివేకినః. 38

బ్రహ్మకంటె శివుడు, శివునికంటే విష్ణువు నుత్తరోత్తరముగ దీర్ఘకాల జీవులు. ఇట్లు సర్వులును క్రమముగ నభివృద్ధి జెందుచు నష్టమగుచుందురు. ప్రతి దేహికి చావునిక్కము. చచ్చిన ప్రతివానికిని మరల జన్మము ధ్రువము. ఇట్టు లెల్లరును చక్రము పగిది క్రిందుమీదులకు తిరుగుచుందురు. ఈ ప్రాణులన్నియును మోహజాలములో చిక్కుకొన్నవి. ఇ వేనాటికిని ముక్తిజెందవు. ఈ ఘోరమైన మాయా సంసారమందు తిరుగాడు వానికి మోహజాలమెట్లు నశించును? బ్రహ్మ మొదలుగా గల ప్రాణులన్నిటికిని వరుసగ సృష్టికాలమున సంభవము కల్పాంతమున నాశము జరిగి తీరును. ఎవని నిమిత్తమున నెవనికి చావు వ్రాయబడెనో వానిచే వాడు చచ్చును. విధి ప్రాణులనొసట వ్రాసిన వ్రాలు వేరు విధముగ నెన్నడును జరుగదు. ఆయా జీవులకు విధి నిర్ణయానుసారముగ చావుపుట్టుకలు జరావ్యాధులు సుఖదుఃఖములు గలుగుచుండును. దీనికి తిరుగులేదు. ఎల్ల ప్రాణికోటికిని సూర్యచంద్రులు ప్రత్యక్షముగ సుఖము గలిగింతురు. ఐనను వారికి సైతము శత్రుబాధ తప్పలేదు. రవి సుతుడు మందుడయ్యెను. చంద్రుడు కళంకియు క్షయరోగియు నయ్యెను. కాన విధి విధానమెంత గొప్ప వారికైనను దాటతరముగాదు. వేదకర్త విశ్వకర్త నలువ బుద్ధిప్రదాత యైన బ్రహ్మ తన సొంత కూతురగు సరస్వతిని గని మోహ పరవశుడయ్యెను. భక్తిలోకార్తిహరుడగు హరుడు సైతము తన భార్య తనువు చాలించినపుడు మదనబాధ కోపలేక దుఃఖపీడితుడయ్యెను. కామాగ్ని దగ్ధుడైన శివుడు కాళిందీనదిలో మునిగెను. రుద్రుని యొడలి వేడిమి మంటలకు నదీజలము సలసలమని క్రాగి నీలవర్ణమయ్యెను. అపుడు మహాదేవుడు భృగువనమందు కామాతిరేకమున రమణీలోలుడై యుండెను. అట్టి శివుని తపోధనుడగు భృగుమహర్షి నీవు లజ్జలేనివాడవు. నీ లింగమిపుడే పతనమందుగాకని శపించెను. శివుడవు డానంద ప్రాప్తికై దానవులు నిర్మించిన యమృతపుడిగ్గియలోని నీరు గ్రోలెను. ఈ భూతలమందొకప్పుడింద్రుడు వృషభవాహనముగ పనిచేసెను. శ్రీ మహా విష్ణువు సర్వలోకాద్యుడు వివేకి సర్వజ్ఞుడును.

సర్వజ్ఞత్వం గత కుత్ర ప్రభుశక్తిః కుతో గతా | యద్ధేమ మృగ విజ్ఞానం న జ్ఞాతం హరిణా కిల. 39

రాజ న్మాయాబలం పశ్య రామో హి కామమోహితః | రామే విరహసంతప్తో రురోద భృశ మాతురః. 40

యో%పృచ్ఛ త్పాదపాన్మూఢః క్వ గతా జనకాత్మజా | భక్షితా వా హృతా కేన రుదన్నుచ్చతరం తతః. 41

లక్ష్మణా%హం మరిష్యామి కాంతావిరహదుఃఃతః | త్వం చాపి మమ దుఃఖేన మరిష్యసి వనే%నుజ. 42

ఆవయో ర్మరణం జ్ఞాత్వా మాతా మమ మరిష్యతి | శత్నుఘ్నో%ప్యతి దుఃఖార్తః కథం జీవితు మర్హతి. 43

సుమిత్రా జీవితం జహ్యా త్పుత్ర వ్యసన కర్శితా | పూర్ణకామా%థ కైకేయీ భ##వే త్సుత సమన్వితా. 44

హా సీతే క్వ గతా%సి త్వం మా విహాయ స్మరాతురా | ఏహ్యేహి మృగశాబాక్షి మాం జీవయ కృశోదరి. 45

కిం కరోమి క్వ గచ్ఛామి త్వదధీనం చ జీవితమ్‌ | సమాశ్వాసయ దీనం మాం ప్రియం జనకనందిని. 46

ఏవం విలపతా తేన రామే ణామితతేజసా | వనే వనే చ భ్రమతా నేక్షితా జనకాత్మజా. 47

శరణ్యః సర్వలోకానం రామః కమలలోచనః | శరణం వానరాణాం స గతో మాయా విమోహితః. 48

సహాయా న్వానరా న్కృత్వా బహాబంధ వరుణాలయమ్‌ | జఘన రావణం వీరం కుంభకర్ణం మహోదరమ్‌. 49

ఆనీయ చ తతః సీతాం రామో దివ్య మకారయత్‌ | సర్వజ్ఞో%పి హృతాం మత్వా రావణన దురాత్మనా. 50

ఆ శ్రీవిష్ణువునకు బంగారు లేడిని గూర్చిన విజ్ఞానము లేకపోయెనుగదా! ఆతని ప్రభుశక్తి యేమయ్యెను? రాజా! యోగమాయా శక్తిని గనుము. అలనాడు సీతాపతి కామమోహమున విరహ సంతప్తుడై మిక్కుటముగ వగచెను. సుగుణాభి రాముడగు రాముడు మూఢత్వమున తన జానకి నెవరేని యపహరించిరో కాక భక్షించిరోయని యెలుగెత్తి విలవించుచు చెట్టు చెట్టు నడుగజొచ్చెను. సోదరా! లక్ష్మణా! నేనిపుడు కాంతా విరహమున మరణింతును. అపుడు నా శోకమున నీవును బ్రతుకవు. మన మరణవార్త విన్నంతనే నా తల్లి మృతిజెందును. శత్రుఘ్నుడును దుఃఖార్తితో బ్రతుకజాలడు. పుత్రమరణము విని సుమిత్రయు శోకించి యసువులు పాయును. ఇకకైక భరతుని వలన పూర్ణకామ కాగలదు. సీతా! నేను కామార్తుడనైతిని. నన్ను వీడి నీ వెటకేగితివి? వేవేగ రారమ్ము. నన్ను జీవింపజేయుము. జనకనందినీ! నీవెక్కడి కేగితివి? నా ప్రాణములు నీ యరచేత నున్నవి. ఇంక నేనేమి చేతును? నీవు వేవేగమే వచ్చి దీనుడైన నీ యీ ప్రియు నోదార్చుము. ఇట్లు ప్రతి వనమున గ్రుమ్మరుచు విలపించుచున్న సీతారామునకు జానకి యెచ్చోటను గనబడలేదు. ఇట్లు సర్వలోక శరణ్యుడు రాజీవ నయనుడు వానరుల కేడుగడ సుగుణాభిరాముడగు రాముడును మాయామోహితుడయ్యె. కోదండరాముడు వానరుల తోడ్పాటుతో జలధికి సేతువు గట్టెను. అతడు రణభీముడై మహోదర కుంభకర్ణులను రావణుని సంహరించెను. దురాత్ముడైన రావణుడు సీత నపహరించెను. రాముడు సర్వజ్ఞుడయ్యు సీత ననుమానించి దివ్యమున నామెను అగ్ని పూతగ నొనరించెను.

కిం బ్రవీమి మహా రాజ యోగమాయాబలం మహత్‌ | యయా విశ్వం మిదం సర్వం భ్రామితం భ్రమతే కిల. 51

ఏవం నానా%వతారే%త్ర విష్ణుః శాపవశం గతః | కరోతి వివిధా శ్చేష్టా దైవాధీనః సదైవ హి. 52

తవాహం కథం యిష్యామి కృష్ణస్యా%పి విచేష్టితమ్‌ | ప్రభవం మానుషం లోకే దేవకార్యార్థ సిద్ధయే. 53

కాళిందీపులినే రమ్యే హ్యాసి న్మధువనం పురా | లవణో మధుపుత్రస్తు తత్రా%%సీ ద్దానవో బలీ. 54

ద్విజానాం దుఃఖదః పాపో వరదానేన గర్వితః | నిహతో%సౌ మహాభాగ లక్ష్మణస్యానుజేన వై. 55

శత్రుఘ్నేనాథ సంగ్రామే తం నిహత్య మదోత్కటం | వాసితౌ మథురా నామ పురీ పరమశోభనా. 56

స తత్ర పుష్కరాక్షౌ ద్వౌ పుత్రౌ శత్రునిషూదనః | నివేశ్య రాజ్యే మతిమా న్కాలే ప్రాప్తే దివంగతః. 57

సూర్యవంశక్షయే తాం తు యాదవాః ప్రతిపేదిరే | మథురాం ముక్తిదాం రాజ న్యయాతితనయః పురా. 58

శూరసేనాభిధః శూర స్తత్రాభూన్మేదినీపతిః | మథురాన్‌ శూరసేనాంశ్చ బుభుజే విషయా న్నృప. 59

తత్రోత్పన్నః కశ్యపాంశః శాపాచ్చ వరుణస్య వై | వసుదేవో%తివిఖ్యాతః శూరసేన సుతస్తదా. 60

వైశ్య వృత్తి రతః సో%భూ న్మృతే పితరి మాధవః | ఉగ్రసేనో బభూవాథ కంస స్తస్యా%%త్మజో మహాన్‌. 61

అదితి ర్దేవకీ జాతా దేవకస్య సుతా తదా | శాపాద్వై వరుణస్యాత్ర కశ్యపానుగతా కిల. 62

మహాయోగమాయ మహిమ నేమని వర్ణింతును? ఆ మహాశక్తి మూలమున సర్వజగములు పరిభ్రమించు చున్నవి. విష్ణువు శాప వశమున నానావతారము లెత్తును. అతడును దైవమునకు కట్టుబడి పలురీతుల చేష్టలొనర్చు చుండును. ఇపుడు నేను దైవకార్యార్థము మానవలోకమున ప్రభవించి మానవాతీతమైన కార్యములు చేసి చరితార్థుడైన కృష్ణుని చరితము వినిపింతు వినుము. పూర్వకాలము కాళిందీనదీ తీరమందు కనులపండువైన మధువన ముండెను. అచ్చోట మధుపుత్రుడగు లవణుడు దాన వీరుడై వసించు చుండెను. అతడు వీర్యబల గర్వితుడై విప్రులను సతతము బాధించుచుండెను. లక్ష్మణుని తమ్ముడగు శత్రుఘ్నుడు రణమున నతని నంతమొందించెను. శత్రుఘ్నుడా దానవుని చంపి యచట మధుర యనబడు సుందర నగరమును శోభాయమానముగ వెలయించెను. శత్రుఘ్నుడు శత్రుల పరిమార్చువాడు - మతిమంతుడు. ఆతడు మధురానగరమునకు కమలాక్షులగు తన యిరువు కుమారులను రాజ్యాథిపతులుగ జేసెను. కాలము సమీపించగనే శత్రుఘ్నుడు దివంగతుడయ్యెను. తుట్టతుదకు సూర్యవంశము క్షీణించెను. ముక్తి ప్రదమైన మధురకు యయాతి కులము వారైన యాదవులు రాజులైరి. శూరసేనుడను యాదవరాజు మహాశూరుడు. అతడు మధుర కధిపతియై సుఖసంపద లనుభవించెను. అతనికి కశ్యపాంశమున వరుణుని శాపమున కుమారుడుద్భవించి ప్రఖ్యాతి చెందెను. అతడే వసుదేవుడు. అతడు వైశ్యవృత్తియగు వ్యవసాయమందు నిరతుడయ్యెను. ఆ కాలమున నుగ్రసేనుడను నతడు శూరసేన దేశమునకు రాజయ్యెను. అతనికి కంసుడు పుట్టెను. అదితి కశ్యపుని భార్య. ఆమెయు వరుణ శాపమున దేవకుడను వానికి దేవకిగ నుద్భవించెను.

దత్తా సా వసుదేవాయ దేవకేన మహాత్మనా | వివాహే రచితే తత్ర వాగభూ ద్గగనే తదా. 63

కంస కంస మహాభాగ దేవకీ గర్భ సంభవః | అష్టమస్తు సుతః శ్రీమాం స్తవ హంతా భవిష్యతి. 64

తచ్ఛ్రుత్వా వచనం కంసో విస్మితో%భూ న్మహాబలః | దేవవాచం తు తాం మత్వా సత్యాం చింతా మవాప సః. 65

కిం కరోమీతి సంచింత్య విమర్శ మకరో త్తదా | నిహాత్యైనాం న మే మృత్యు ర్భవే దద్వైవ సత్వరమ్‌. 66

ఉపాయో నాన్యథా చాస్మి న్కార్యే మృత్యుభయావహే | ఇయం పితృష్యసా పూజ్యా కథం హన్మీత్యచింతయత్‌. 67

పునర్విచార యామాస మరణం మే%స్త్యహో స్వసా | పాపేనా%పి ప్రకర్తవ్యా దేహరక్షా విపశ్చితా. 68

ప్రాయశ్చిత్తేన పాపస్య శుద్ధి ర్భవతి సర్వదా | ప్రాణరక్షా ప్రకర్తవ్యా బుధైరప్యేనసా తథా. 69

విచంత్య మనసా కంసః ఖడ్గ మాదాయ సత్వరః | జగ్రాహ తాం వరారోహం కేశే ష్వాకృష్య పాపకృత్‌. 70

కోశాత్ఖడ్గ ముపాకృష్య హంతుకామో దురాశయః | పశ్యతాం సర్వలోకానాం నవోఢాం తాం చకర్ష హ. 71

హన్య మానాం చ తాం దృష్ట్వా హాహాకారో మహా నభూత్‌ | వాసుదేవానుగా వీరా యుద్ధాయోద్యత కార్ముకాః. 72

ముంచ ముంచేతి ప్రోచు స్తంతే తదా%ద్భుత సాహసాః | కృపయా మోచయా మాసు ర్దేవకీం దేవమాతరమ్‌. 73

ఆ దేవకరాజు తన కూతురును వసుదేవున కిచ్చి వివాహ మొనరించెను అపుడాకాశవాణి యిట్లు పలికెను : కంసా ! కంసా ! దేవకి కష్టమ గర్భమునందొక శ్రీమంతుడగు పురుషోత్తముడు గల్గును. అతడు నీపాలిటి మృత్యుదేవత. అది విని మహాబలుడగు కంసు డచ్చెరువంది దేవవాణి సత్యమగునుగదా యని చింతాక్రాంతుడయ్యెను. నేనిపుడేమి చేయవలయునని తలపోయుచు నతడిట్లు తనలో చింతించెను. ఇపుడీ దేవకినీ చంపినచో నా చావు తప్పును గద! నాకీ చావు భయములో నితరాలోచనలు దోచుటలేదు. ఈమె నా తండ్రికి తోబుట్టువు. పూజ్యురాలు, ఇంక నీమెను నేనెట్లు చంపగలనని కంసుడు చింతలో మునిగెను. అతడు మరల నిట్లు తలచెను: నాకీమె వలన చావు నిక్కము. పాపము చేసియైన శరీరమును రక్షించుకొనవలయునని పండితులందురు. పాతక మెంతటిదైనను ప్రాయశ్చిత్తముతో తప్పక తొలగును. కనుక పండితుడైనవాడు పాపము చేసియైన తన శరీరమును రక్షించుకొనవలయును. పాపిష్ఠుడగు కంసుడిట్లు దలచి కత్తి చేబూని వేగమే దేవకి కేశపాశములు పట్టిలాగెను. ఆ దుర్మార్గు డొఱ నుండి కత్తి పెఱికి ఝళిపించుచు జనము చూచుచుండగ ఆ నవ వధువును చంపదలచి యామెపై కురికెను. అట్లత డామెను చంప నుంకించుట గని జనులు హాహాకారములు చేసిరి. వసుదేవు ననుచరులైన వీరవరులు పోర విల్లమ్ములు చేబూనిరి. వా రద్భుత సాహసోపేతులై విడు విడుమని కేకలు వేయుచు దేవమాతయైన దేవకిని దయతో విడిపించిరి.

తద్యుద్ధ మభవ ద్ఘోరం ధీరాణాం చ పరస్పరమ్‌ | వసుదేవ హాయానాం కంసేన చ మహాత్మనా. 74

వర్తమానే తథా యుద్ధే దారుణ లోమహర్షణ | కంసం నివారయామాసు ర్వృద్ధా యే యదుసత్తమాః. 75

పితృష్వసేయం తే వీర పూజనీయా చ బాలిశ | న హంతవ్యా త్వయా వీర వివాహోత్సవసంగమే. 76

స్త్రీహత్యా దుఃసహా వీర కీర్తిఘ్నీ పాపకృత్తమా | భూతభూషితమాత్రేణ న కర్తవ్యా విజానతా. 77

అంతర్హితేన కేనా%పి శత్రుణా తవ చాస్య వా | ఉదితేతి కుతో న స్యాద్ధిగనర్థకరీ విభో!. 78

యశసస్తే విఘాతాయ వసుదేవగృహస్య చ | అరిణా రచితా వాణీ గుణమాయావిదా నృప. 79

బిభేషి వీర స్త్వం భూత్వా భూతభాషిత భాషయా | యశో మూలవిఘతార్థ ముపాయ స్త్వరిణా కృతః. 80

పితృష్వసా న హంతవ్యా వివాహసమయే పునః | భవితవ్యం మహారాజ! భ##వేచ్చ కథ మన్యథా. 81

ఏవం తై ర్యోధ్యమానో%సౌ నివృత్తో నా%భవద్యదా | తథా తం వసుదేవో%పి నీతిజ్ఞః ప్రత్యభాషత. 82

కంస! సత్యం బ్రవీమ్యద్య సత్యాధారం జాగత్త్రయమ్‌ | దాస్యామి దేవకీపుత్త్రా నుత్పన్నాం స్తవ సర్వశః. 83

జాతం జాతం సుతం తుభ్యం న దాస్యామి యదిప్రభో | కుంభీపాకే తదా ఘోరే పతంతు మమ పూర్వజాః. 84

శ్రుత్వా%థ వచనం సత్యం పౌరవా యే పురః స్థితాః | ఊచుస్తే త్వరితాః కంసం సాధు సాధు పునః పునః. 85

న మిథ్యా భాషతే క్వాపి వసుదేవో మహామనాః | కేశం ముంచ మహాభాగ స్త్రీహత్యాపాతకం తథా. 86

వ్యాసఉవాచ : ఏవం ప్రభోధితః కంసో యదువృద్ధే ర్మహాత్మభిః |

క్రోధం త్యక్త్వా స్థిత స్తత్ర సత్యవాక్యానుమోదితః | తతో దుందుభయో నేదు ర్వాదిత్రాణి చ సస్వనుః. 87

జయశబ్ద స్తు సర్వేషా ముత్పన్న స్తత్ర సంసది.

ప్రసాద్య కంసం ప్రతిమోచ్య దేవకీం మహాయశాః శూరసుత స్త దానీమ్‌ |

జగామ గేహం స్వజానానువలత్తో నవోఢయా వీతభయ స్తరస్వీ. 88

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణా చతుర్థ స్కంధే వింశో%ధ్యాయః.

అట్టి దారుణ భీకర సమరము జరుగుటగని వృద్ధ యాదవోత్తములు వారించి కంసునితో నీ రితిగ బలికిరి: ఈమె నీ తండ్రికి తోడబుట్టువు. నీకు పూజనీయ. ఈ వివాహ మంగళోత్సవమున నీమెను చంపుట తగదు. ఈమె నీకు హంతవ్యగాదు. స్త్రీ హత్య కడుంగడు దుస్సహము - పాపకార్యము - కీర్తినాశకము. గగనవాణి పలికినంతమాత్రన పండితుడిట్టు లొనర్పడు. నీవాడో కాక వసుదేవుని వాడో యెవడో వైరి దాగియుండి నిన్నీయనర్థకర కర్మములకు పురికొల్పెను. కానిచో నిట్టి ఘోరమెట్లు జరుగును? ఎవడో మాయాజాల మెఱిగిన వైరి నీ యశో నాశమును వసుదేవుని గృహ నాశమును దలచి యిట్టు లాకాశవాణిగ పలికియుండ నోపును. నీవు మహావీరుడవే! ఒక భూతము పలుకులకు భయపడుదువా? ఇదంతయు నీ కీర్తి మూలమునకు హాని గల్గింపదలచి నీ వైరి పన్నిన పన్నుగడ సుమా! నీ మేనత్తను నీవు చంపరాదు. భవితవ్యము తప్పక జరిగితీరును. కాని వేరువిధముగ నెన్నడును జరుగదు అని పలికిన పెద్దల మాటను కంసుడు పెడచెవిని బెట్టెను. అంతట నీతికుశలుడైన వసుదేవుడు కంసునితో నిట్లుపలికెను. ఓ కంసా! ఈ ముజ్జగములును సత్యాధారములు. నా సత్యవాక్కును వినుము. దేవకికి గల్గిన వారి నందఱిని నీ చేతిలో బెట్టుదును. అట్లు నేను పుట్టిన ప్రతివానిని నీకీయనిచో నా పూర్వజులు కుంభీపాక నరకమున గూలుదురుగాక! అను వసుదేవుని సత్యవాణి వినిన ప్రజలు మేలు మేలని మెచ్చుకొని కంసునితో నీరీతిగ బలికిరి : మహాత్ముడగు వసుదేవుడెన్నడును నసత్యమాడువాడు కాడు. ఇంక నామె కేశములు వదలుము. స్త్రీ హత్యా పాతకమున కొడిగట్టకుము. అట్లు యాదవ వృద్ధులైన మహాత్ములచే కంసుడు ప్రబోధితుడై వారి సత్యవాక్యములనుబట్టి కోపముడిగెను. దుందుభి ధ్వనులు వాద్యనిస్వనములు సెలంగెను. నిండు సభలో నెల్లరు జయజయకారము లొనరించిరి. అట్లు వసుదేవుడు కంసుని ప్రసన్నుని జేసి నవ వధువగు దేవకిని విడిపించుకొని యామెతో స్వజనముతో నిర్భయముగ నిజగృహమున కరిగెను.

అని శ్రీ వ్యాస భగవానుడు జనమేజయునితో పలికెను.

ఇది శ్రీమద్దేవీభాగవత చతుర్థస్కంధమందు దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతమను ఇరువదవ అధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters