Sri Devi Bhagavatam-1    Chapters   

అథ నవమో%ధ్యాయః

కుర్వం స్తీర్థవిధిం తత్ర హిరణ్య కశిపోః సుతః | న్యగ్రోధం సుమహచ్ఛాయ మపశ్యత్పురత స్తదా. 1

దదర్శ బాణా నపరా న్నానా జాతీయకాం స్తదా | గృధ్రపక్షయుతాం స్తీవ్రాన్‌ శిలాధౌతా న్మహోజ్జ్వలాన్‌. 2

చింతయామాస మనసా యస్యేమే విశిఖా స్త్విహ | ఋషీణా మాశ్రమే పుణ్య తీర్థే పరమపావనే. 3

ఏవం చింతయతా%%నేన కృష్ణాజినధరౌ మునీ | సమున్నతజటాభారౌ దృష్టా ధర్మసుతౌ తదా. 4

తయో రగ్రే ధృతే శుభ్రే ధనుషీ లక్షణాన్వితే | శారఙ్గ మాజగవం చైవ తథా%క్ష¸°్య మహేషుధీ. 5

ధ్యానస్థౌ తౌ మహాభాగౌ నరనారాయణా వృషీ | దృష్ట్వా ధర్మసుతౌ తత్ర దైత్యానామధిప స్తదా. 6

క్రోధరక్తేక్షణ స్తౌతు ప్రోవా చాసురపాలకః | కిం భవద్భ్యాం సమారబ్ధో దంభో ధర్మ వినాశనః. 7

న శ్రుతం నైవ దృష్టం హి సంసారే%స్మి న్కదాపి హి | క్వ తపశ్చరణం తీవ్రం తథా చాపస్య ధారణమ్‌. 8

విరోధో2యం యుగే చా%%ద్యే కథం యుక్తం కలిప్రియమ్‌ | బ్రాహ్మణస్య తపో యుక్తం తత్ర కిం చాపధారణమ్‌. 9

క్వ జటాధారణం క్వేషుధీ చ విడంబనా | ధర్మస్యా%%చరణం యుక్తం యువయో ర్దివ్యభావయోః. 10

ఇతి తస్య వచః శ్రుత్వా నరః ప్రోవాచ భారత | కా తే చింతా%త్రదైత్యేంద్రవృథా తపసిచా%%వయోః. 11

సామర్థ్యే సతి యం కుర్యా త్త త్సంపద్యేత తస్య హి | ఆవాం కార్యద్వయే మంద ! సమర్ధౌ లోకవిశ్రుతౌ. 12

యుద్ధే తపసి సామర్థ్యం త్వం పునః కిం కరిష్యసి | గచ్ఛ మార్గే యథా కామం కస్మాదత్ర వికత్థసే. 13

బ్రహ్మతేజో దురారాధ్యం న త్వం వేద విమోహితః | విప్రచర్చా న కర్తవ్యా ప్రాణిభిః సుఖ మీప్సుభిః. 14

తొమ్మిదవ అధ్యాయము

నరనారాయణులు ప్రహ్లాదునితో పోరుట

ఆ విధముగ ప్రహ్లాదుడు విధి విధానముగ తీర్థవిధిని నిర్వర్తించుచు తన యెదుట నొక మఱ్ఱిచెట్టు గాంచెను. ఆ చోట నతనికి కొన్ని పలువిధములైన బాణములు గనబడెను. అవి గృధ్రపక్షములతోకూడి వాడియై మహోజ్జ్వలములై తనరుచుండెను. ఇది పావన పుణ్యతీర్థము. ఋషుల ఆశ్రమము. ఇందు వాడిబాణములు! ఇవెవరివోయని ప్రహ్లాదుడు మదిలో నాలోచించుచుండగనే యతని కున్నతమైన జడలు దాల్చి కృష్ణాజినముల దరించి విరాజిల్లు ధర్మసుతులు గనంబడిరి. అతడు వారి సమీపమునందు మంచి లక్షణములుగల శారఙ్గము ఆజగవ మను పేరుగల రెండు విండ్లను అక్షయతూణీరములను గాంచెను. ఆ దానవపతి నిశ్చలధ్యాన నిమగ్నులై యున్న ధర్మసుతులైన నరనారాయణులను గాంచి క్రోధతామ్రాక్షుడై వారితో నిట్లు పలికెను: మునులారా! మీ యందు ధర్మ వినాశకరమైన దంభము చేరెనా యేమి? ఈ సత్యయుగమునందు తపశ్చరణము-చాపము దాల్చుట యను రెండు నెప్పుడును జరుగవని మీరు కనివిని యెరుగరా? ఆ రెండును ఒకేచోట నుండుట కలికి ప్రియము. అవి యీ యుగమునకు విరుద్ధ ధర్మములు. కనుక యుక్తములు గావు. విప్రులకు తపము యుక్తము. చాపధారణ మయుక్తము. ఈ శరీరమం దీ జడలు దాల్చుటేమి? ఈ యాడంబరముతోడ ధనుస్సులు బట్టుటేమి? దివ్య భావములతో ధర్మమాచరించుటే మీకు తగును అను ప్రహ్లాదుని మాటలు విని నరుడిట్లు నుడివెను : దైత్యేంద్రా! మా ఇరువురి తపమును గూర్చి నీకీ వ్యర్థ ప్రలాపము లేల? ఎవడు దేనికి సమర్థుడై ఏది చేయునో వాని కది సంపన్నమగును. మే మీ రెండు కార్యములందును దక్షుల మగుట లోక విదితమే గదా! మాకు రణమునకు సర్వథా సమర్థత గలదు. నీవేమి చేయగలవు? నీ ఇచ్చ వచ్చినచోటి కిచ్చవచ్చినట్టు లేగుము. ఈ చేతకాని డంబములు పలుకుటేల? బ్రహ్మతేజో బలమే బలము. అది కడుంగడు దుర్లభ##మైనది. మూఢబుద్ధికి | నీకేమి తెలియును? సుఖము గోరు ప్రాణి యెన్నడును బ్రాహ్మణుల విషయము చర్య సేయడు. అనగా విని -

ప్రహ్లాదః : తపసౌ మందబుద్ధీ స్థో మృషా వాం గర్వమోహితౌ | మయి తిష్ఠతి దైత్యేంద్రే ధర్మ సేతు ప్రవర్తకే. 15

న యుక్త మేత త్తీర్థే%స్మి న్నధార్మ%%చరణం పునః | కా శక్తి స్తవ యుద్ధే%స్తి దర్శయా%ద్య తపోధన. 16

తదాకర్ణ్య వచస్తస్యనన్తర ప్రత్యువాచ హ | యుధ్యస్వా%ద్య మయా సార్థం యది తే మతి రీదృశీ. 17

అద్య తే సోపటయిష్యామి మూర్థాన మసురాధమ | 18

యుద్ధే శ్రద్ధా నతే పశ్చా ద్భవిష్యతి కదాచన | తన్నిశమ్య వచస్తస్య దైత్యేంద్రః కుపితస్తదా. 19

నరనారాయణౌ దాంతా వృషీ తపసమన్వితౌ | వ్యాసః; ఇత్యుక్త్వా వచనం దైత్యః ప్రతిగృహ్య శరాసనమ్‌. 20

ఆకృష్య తరసా చాపం జ్యా శబ్దం చ చకార హ | నరో%పి ధను రాధాయ శరాం స్తీవ్రాన్‌ శిలాశితాన్‌. 21

ముమోచ బహుశః క్రోధా త్ప్రహ్లాదోపరి పార్థివ ! 22

తాన్దైత్యరాజ స్తపనీయంపుంఖై శ్చిచ్ఛేద బాణౖ స్తరసా సమేత్య !

సమీక్ష్య ఛిన్నాంశ్చ నరః స్వసృష్టా నన్యాన్ముమోచా%%శురుషాన్వితోవై. 23

దైత్యా%ధిప స్తానపి తీవ్రవేగైశ్చిత్త్వా జఘానోరసి తం మునీంద్రమ్‌ |

నరో%పి తం పంచభి రాశుగైశ్చ క్రుద్ధో%హన ద్దైత్యప బాహుదేశే. 24

సేంద్రాః సురా స్తత్ర తయోర్హి యుద్ధం ద్రష్టుం విమానై ర్గగన స్థితాశ్చ |

నరస్య వీర్యం యుధి సంస్థితస్య తే తుష్టువు ర్దైత్యపతేశ్చ భూయః. 25

వవర్షదైత్యాధిప అత్తచాపః శిలీముఖా నంబుధరో యథాపః |

ఆదాయ శారఙ్గం ధనురప్రమేయం ముమోచ బాణాన్‌ శితహేమపుంఖాన్‌. 26

బభూవ యుద్ధం తుములం తయోస్తు జయైషిణోః పార్థివదేవదైత్యయోః |

వవర్షు రాకాశ పథే స్థితా స్తే పుష్పాణి దివ్యాని ప్రహృష్టచిత్తాః. 27

చుకోప దైత్యాధిపతి ర్హరౌస ముమోచ బాణా నతి తీవ్రవేగాన్‌ |

చిచ్ఛేద తాన్ధర్మసుతః సుతీక్షైర్ధునుర్విముక్తై స్తదా%%శు. 28

తతో నారాయణం బాణౖః ప్రహ్లాదశ్చాతితర్షితైః | వవర్ష సుస్థితం వీరం ధర్మపుత్రం సనాతనమ్‌ |

ప్రహ్లాదు డిట్లనెను : తాపసులారా! మీరు మందమతులు. వ్యర్థముగ గర్వమోహితులు; నేను ధర్మసేతు ప్రవర్తకుడను. దైత్య రాజను. ఈ తీర్థమం దధర్మాచరణము తగదు. నీకు రణమందు శక్తిగలదేని యేది-చూపుము చూతము. ప్రహ్లాదుని మాటలు విని నరుడిట్లు పలికెను: నీకు రణమొనరించు బుద్ధియున్నచో నాతో యుద్ధమొనరింపుము. ఓ యసురాధమా! నీ శరీర మిప్పుడే ముక్కలు ముక్కలు చేతును. ఇంక నీ కేనాటికిని రణమందు పట్టుదల పుట్టకుండుగాక! అను నరుని పలుకులకు బలశాలియుఉ దైత్యపతియునగు ప్రహ్లాదుడు కుపితుడై, నే నేయుపాయముచేతనైనను ఋషులు - తాపసులు దాంతులు నైన నరనారాయణులను గెలిచి తీరుదును అని ప్రతినబూని వెంటనే ధనువు చేత ధరించెను వింటి నారిని లాగి టంకార మొనరించెను. నరుడును విల్లు చేతబూని తీవ్రశరము లెక్కిడి క్రోధాతిరేకమున ప్రహ్లాదునిపై పెక్కు బాణములు నిగుడించెను. దైత్యపతి వానినెల్ల తన బంగారు పింజ బాణపరంపరలతో వేగమే ఖండించెను. తన శరములు మొక్కపోయినందులకు నరునకు రోషమతిరేకించి పెక్కు బాణవర్షములు గురిసెను. దైత్యాధిపతి వానినెల్ల తన తీవ్ర బాణములతో ఛేదించి పిమ్మట నరుని రొమ్ముపై శరములు నాటెను. నరుడుగ్రుడై యైదమ్ములతో నతని బాహువులను గాటముగ ప్రహరించెను. విను వీథిలో నింద్రాది దేవతాగణము విమానములపై నుండి వారి పోరు కనులార తిలకించుచుండిరి. కారు మబ్బులు వేగముగ కుంభవర్షము గురియునట్లు దానవపతి నరునిపై పెక్కు వాడి బాణవర్షములు కురిసెను. అంత నారాయణుడు లేచి సాటి లేని మేటి విల్లగు శార్గము చేబూని బంగరు పింజలుగల వాడి బాణములు ప్రహ్లాదునిపై ప్రయోగించెను. విజిగీషులగు ఆ నారాయణ ప్రహ్లాదులకు ఘోరముగ పోరాటము సాగెను. సకల సురులు గగన మార్గమున సంతుష్టచిత్తులై దివ్య సుమములు కురిసిరి. అసురపతి క్రోధముతో తీవ్రగాములైన బాణములు ఏయగా నారాయణుడు వేగముగ తన ధనువునుండి వదలిన వాడి బాణములతో వాని నెల్ల నట్టనడుమనే సుళువుగ దనుమాడెను.

నారాయణో%పి తం వేగాదక్తైర్బాణౖః శిలాశితైః. 29

తేతోదా%తీవ పురతో దైత్యానా మధిపం స్థితమ్‌ | సన్నిపాతో2ంబరే తత్ర దిదృక్షూణాం బభూవ హ. 30

దేవానాం దానవానాం చ కుర్వతాం జయఘోషణమ్‌ | ఉభయోః శరవర్షేణ చ్ఛాదితే గగనే తదా. 31

దివా%పి రాత్రి సదృశం బభూవ తిమిరం మహత్‌ | ఊచుః పరస్పరం దేవా దైత్యాశ్చాతీవ విస్మితాః. 32

అదృష్టపూర్వం యుద్ధం వై వర్తతే%ద్య సుదారుణమ్‌ | దేవర్షయో%థ గంధర్వా యక్షకిన్నర పన్నగాః. 33

విద్యాధరా శ్చారణాశ్చ విస్మయం పరమం యయుః | నారదః పర్వత శ్చైవ ప్రేక్షణార్థం స్థితౌ మునీ. 34

నారదః పర్వతం ప్రాహ నేదృశం చాభవత్పురా | తారకా సురయుద్ధం చ తథా వృత్రాసురస్య చ. 35

మధుకైటభారయోర్యుద్ధం హరిణా చేదృశం కృతమ్‌ | ప్రహ్లాదః ప్రబలః శూరో యస్మాన్నారయణన చ. 36

కరోతి సదృశం యుద్ధం సిద్ధే నాద్భుతకర్మణా | దినే దినే తథా రాత్రౌ కృత్వా కృత్వాపునః పునః. 37

చక్రతుః పరమం యుద్ధం తౌ తదా దైత్యతాపసౌ | నారాయణస్తు విచ్ఛేద ప్రహ్లాదస్య శరాసనమ్‌. 38

తరసైకేన బాణన స చా%న్యద్ధునురాదదే | నారాయణస్తు తరాసా ముక్త్వా%న్యం చ శిలీముఖమ్‌. 39

తదైవ మధ్యతశ్చాపం చిచ్చేద ఘుహస్తకైః | ఛిన్నం ఛిన్నం పునర్దైత్యో ధనురన్యత్సమాదదే. 40

నారాయణస్తు చిచ్ఛేద విశిఖై రాశు కోపితః | ఛిన్నే ధనుషి దైత్యేంద్రః పరిఘం తు సమాదదే. 41

జఘాన ధర్మజం తూర్ణం బాహ్వోర్మధ్యే%తి | తమాయాంతం స బలవా న్మార్గణౖ ర్నవభి ర్మునిః. 42

మరల ప్రహ్లాదుడు ధర్మతనయుడగు నారాయణునిపై పెక్కు వాడి యమ్ములు ఏయగ వెంటనే నారాయణుడు నతనిమీద పదునైన బాణములు ప్రయోగించెను. పిమ్మట నారాయణుడు తన యెదుట నున్న ప్రహ్లాదుని మిక్కిలిగ నొప్పించెను. చూపరై గుమిగూడిన దేవ దానవులు జయఘోషలు పెట్టిరి. గగనతల మంతయును బాణ పరంపరలతో నిండి కనిపించకుండెను. పగలు చీకటి రేయిగ మారెను. దేవదానవులు చోద్యమంది యొండొరులతో వీరికిపుడు దారుణమును అపూర్వమునైన పోరు సంఘటిల్లెనని మాటలాడుకొనుచుండిరి. మింట దేవర్షి గంధర్వులు యక్ష కిన్నెర పన్నగులు చారణ విద్యాధరులు చేరి యదిచూచి పరమ విస్మితులైరి. అది చూచుటకు పర్వత నారదులు నేతెంచిరి. నారదుడు పర్వతునితో నిట్లు పలికెను. ఇట్టి పోరు పూర్వము జరుగలేదు. తారక వృత్రాసురుల పోరు నిట్టుండలేదు. ఆ హరి తోడి మధుకైటభుల బవరము గూడ నింతగ జరుగలేదు. ఈ ప్రహ్లాదుడును మిక్కిలి శూరుడు. కనుకనే అద్భుత కర్ముడును సిద్ధపురుషుడునైన నారాయణుని తోడను పోరుచున్నాడు. అట్లు వీరిర్వురు నిర్విరామముగ రేయింబవళ్ళు పోరుచుండిరి. అంత నారాయణుడు ప్రహ్లాదుని వింటి నొకే బాణమున వేగమే ఛేదించెను. ప్రహ్లాదుడు మరొక వింటిని గ్రహించెను. నారాయణు డా వెనువెంటనే మరొక వాడి తూపు వదలెను. దానిచే నా ధనువును విరిగెను. ఇట్లు తన చాపములెన్ని విరిగిన నన్నిటిని ప్రహ్లాదుడు మరల గ్రహించెను. నారాయణుడు మహోగ్రుడై యతని విండ్ల నన్నిటిని ఖండించి వేసెను. తన ధనుస్సులన్నియును తెగిన మీదట నసురపతి పరిఘను బూని కోపముకొలది ధర్మపుత్రుని భుజా మధ్యమున విసరివేసెను. బలశాలియగు నారాయణుడు తనపైకి వచ్చు పరిఘను తొమ్మిది బాణములతో నెదుర్కొని -

చిచ్ఛేద పరిఘం ఘోరం దశభి స్తమతాడయత్‌ | గదామదాయ దైత్యేంద్రః సర్వాయసమయీం దృఢామ్‌ 43

జానుదేశే జఘనా%%శు దేవం నారాయణం రుషా | గదయా చాపి గిరివ త్సంస్థితః స్థిరమానసః. 44

ధర్మపుత్రో%తి బలవా న్ముమోచా%%శు శిలీముఖాన్‌ - గదాం చిచ్ఛేద భగవాం స్తదా దైత్యవతే ర్దృఢామ్‌. 45

విస్మయం పరమం జగ్ముః ప్రేక్షకా గగనే స్థితాః | స తు శక్తిం సమాదాయ ప్రహ్లాదః పరవీరహా. 46

చిక్షేప తరసా క్రుద్ధో బలాన్నారాయణోరసి | తామాపతంతీం సంవీక్ష్య బాణనైకేన లీలయా. 47

సప్తధా కృతవా నాశు సప్తభి స్తం జఘాన హ | దివ్యవర్ష సహస్రంతు తద్యుద్ధం పరమం తయోః. 48

జాతం విస్మయదం రాజ న్సర్వేషాం తత్ర చాశ్రమే | తదా%%జగామ తరసా పీతవాసా శ్చతుర్భుజః. 49

ప్రహ్లాదస్యా%%శ్రమం తత్ర జగామ చ గదాధరః | చతుర్భుజో రమాకాంతో రథాంగదర పద్మభృత్‌. 50

దృష్ట్వా సమాగతం తత్ర హిరణ్యకశిపోః సుతః | ప్రణమ్య పరయా భక్త్యా ప్రాంజలిః ప్రత్యువాచహ.

ప్రహ్లాద ఉవాచ : దేవదేవ ! జగన్నాథ ! భక్తవత్సల ! మాధవ ! 51

కథం న జితవానాజా వహమేతౌ తపస్వినౌ | సంగ్రామ స్తు మయా దేవ కృతః పూర్ణం శతం సమాః. 52

సురాణాం న జితౌ కస్మా దితి మే విస్మయో మహాన్‌ | విష్ణుః సిద్ధావిమౌ మదంశౌ చ విస్మయః కో%త్ర మారిష! 53

తపసౌన జితాత్మానౌ నరనారాయణౌ జితౌ | గచ్ఛ త్వం వితలం రాజ న్కురుభక్తిం మమాచలామ్‌ ! 54

నా%%భ్యాం కురు విరోధం త్వం తాపసాభ్యాం మహామతే! ఇత్యాజ్ఞప్తో దైత్యరాజో నిర్యయా వసురైః సహ.

నరనారాయణౌ భూయ స్తపోయుక్తౌ బభూవతుః.

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే నవమో%ధ్యాయః.

పరిఘను దునిమి మరల పది బాణములతో ప్రహ్లాదుని ప్రహరించెను. అపుడు ప్రహ్లాదుడు గట్టి ఇనుపగద చేబూని కోపముతో దానిని నారాయణుని మోకాళ్ళపై వేసెను. ఐనను ధర్మజుడు పర్వతము పగిది నిశ్చలముగ నిలుచుండుటే కాక మహావిక్రముడైన నారాయణుడు వాడి యమ్ములతో ప్రహ్లాదుని పటుగదను మధ్యమందే నడుమకు దునిమెను. గగన వీథి నుండి చూచు వారదికని పరమ విస్మితులైరి. అంత పరంతపుడగు దానవపతి శక్తిని చేపట్టి యుగ్రుడై నారాయణుని ఱొమ్ముపై వేసెను. తన పైకి వచ్చు ఆ శక్తిని గని నారాయణుడు ప్రతిబాణమును ప్రయోగించి దానితో నా శక్తిని తునకలు చేసెను. పిమ్మట నే డమ్ములతో ప్రహ్లాదుని బాధించెను. ఇట్లు వారిరువురకును దివ్య సహస్రవర్షముల వఱకు నా మాశ్రమ మందెల్లరకు వింత గొల్పు బవరము జరిగెను. అంత నచటికి పీతవాసుడగు చతుర్భుజుడేతెంచెను. రమాకాంతుడు - శంఖచక్రగదా పద్మధారియై తన చెంతకేతెంచిన భగవానుని సందర్శించి పరమభక్తితో దోయిలొగ్గి ప్రహ్లాదుడు దేవదేవా! జగన్నాథా! భక్తవత్సలా! మాధవా! ఈ తాపసులు రణమున నెంతకు నోటమి జెందుటలేదు. నేను వీరితో దివ్య సహస్ర వర్షములు పోరాడితిని. వీరు జయింపబడ కుండుట నాకు వింతగ నున్నది అన విష్ణువిట్లనెను. ఓ క్షమాశీలా! వీరు మద్దివ్యాంశసంభూతులు. పరమసిద్ధులు. ఇందు వింత యెంత మాత్రమును లేదు. ఈ పరమ తాపసులుజితాత్ములు అపరాజితులు - కాన నింక నీవు రసాతల మేగుము. పూర్వమువలె నా యందు నిశ్చల భక్తి కల్గియుండుము. ఈ మునీశ్వరులతో నెన్నడును వైరము బూనకుము అని విష్ణువాజ్ఞాపింపగా ప్రహ్లాదుడు దనుజులను గూడి యరిగెను. నరనారాయణులును మరల నాత్మధ్యానమున నిమగ్నులైరి.

ఇది శ్రీ మద్దేవీ భాగవత మందలి చతుర్థస్కంధమందు నరనారాయణులు ప్రహ్లాదునితో బోరుటయను నవమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters