Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

సూతంః: ఏవం పృష్టః పురాణజ్ఞో వ్యాసః సత్యవతీసుతః | పరీక్షిత సుతం శాంతం తతో వై జనమేజయమ్‌. 1

ఉవాచ సంశయచ్ఛేత్తృ వాక్యం వాక్యవిశారదః | రాజన్కిమేత ద్వక్తవ్యం కర్మణాం గహనా గతిః. 2

దుర్జేయా కిల దేవానాం మానవానాం చ కా కథా | యదా సముత్థితం చైత ద్ర్బహ్మాండం త్రిగుణాత్మకమ్‌. 3

కర్మణౖవ సముత్పత్తిః సర్వేషాం నాత్ర సంశయః | అనాదినిధనా జీవాః కర్మబీజసముద్భవాః. 4

నానామోనిషు జాయంతే మ్రియంతే చ పునః పునః | కర్మణా రహితో దేహసంయోగో న కదాచన. 5

శుభాశుభైస్తథా మిశ్రైః కర్మభి ర్వేష్టితం త్విదమ్‌ | వివిధాని హి తాన్యాహు ర్బుధా స్తత్త్వవిదశ్చ యే. 6

సంచితాని భవిష్యాణి ప్రారబ్ధాని తథా పునః | వర్తమానాని దేహే%స్మిం సై#్త్రవిధ్యం కర్మణాం కిల. 7

బ్రహ్మాదీనాం చ సర్వేషాం తద్వశత్వం నరాధిప | సుఖదుఃఖ జరా మృత్యుహర్షశోకాదయ స్తథా. 8

కామక్రోధౌ చ లోభశ్చ సర్వే దేహగతా గుణాః | దైవాధీనాశ్చ సర్వేషాం వ్రభవంతి నరాధిప! 9

రాగద్వేషాదయో భావాః స్వర్గే%పి ప్రభవంతి హి | దేవానాం మానవానాం చ తిరశ్చాం చ తథా పునః. 10

వికారాః సర్వ ఏవైతే దేహేన సహ సంగతాః | పూర్వవైరాగనుయోగేన స్నేహయోగేన వై పునః. 11

ఉత్పత్తిః సర్వజంతూనాం వినా కర్మ న విద్యతే | కర్మణా భ్రమతే సూర్యః శశాంకః క్షయరోగనాన్‌. 12

రెండవ అధ్యాయము

కర్మ ప్రభావము

జనమేజయుడు సత్యవతీ సుతుడును పరాణజ్ఞుడునైన వ్యాసుని ఈ విధముగ ప్రశ్నించగా వాక్యవిశారదుడగు వ్యాసమహర్షి జనమేజయుని సంశయములెల్ల పాపుట కిట్లుపలికెను. రాజా! ఏమని చెప్పుదును? కర్మగతి మిక్కిలి గహనమైనది. దాని రహస్యము దేవతలకు సైత మంతుపట్టదు. ఇక మానవుల సంగతి చెప్పవలయునా? ఈ జగములు త్రిగుణముల మేళనమున పుట్టుచుండును. జగమంతయును కర్మమువలననే సంభవించును. ఈ కర్మ బీజములవలన బుట్టుచుండు జీవుల కాద్యంతములు లేవు. వారు మాటి మాటికి నానాయోనులందు బుట్టుచు గిట్టుచుందురు. కర్మబంధములేనివాని కెన్నటికిని దేహధారణ జరుగదు. ఈ సర్వమును శుభము-అశుభము-మిశ్రమ నను మూడు విధములైన కర్మములచేత వ్యాపించియున్నదని తత్త్వవిదులగు బుధులనిరి. ఆ మూడు విధముల కర్మములును సంచితము ప్రారబ్ధము భవిష్యత్తు నను మూడు విధముల విభక్తమైనవి. ఈ మువ్విధములైన కర్మములును ప్రతివాని జీవితము నెడబాయ కుండును. బ్రహ్మాదులు సేతమా కర్మమునకు వశులై యుందురు. ఎల్ల జీవులకును సుఖదుఃఖములును హర్షశోకములును జరామృత్యువులును కామక్రోధలోభములును దేహగతములైన గుణములు. అవి దైవాధీనములై కల్గుచుండును. స్వర్గమందుగూడ రాగద్వేషములు చెలరేగుచుండును. దేవ నర తిర్యగ్జంతువులకును వికారములు అన్నియు దేహముతోకూడ సంప్రాప్తములై కల్గును. ఆ వికారము లన్నియు నాయా ప్రాణుల పూర్వవైరానుయోగముగ స్నేహసంబంధముగ కర్మసూత్ర బద్ధముగ జీవులకు గలుగుచుండును. కర్మ సంబంధము లేనిచో నెల్లప్రాణులకు నుత్పత్తియే లేదు. కర్మమూలముననే సూర్యుడు మింటతిరుగు చున్నాడు. చంద్రుడు క్షయరోగియైనాడు.

కపాలీ చ తథా రుద్రః కర్మణౖ వస్త సంశయః | అనాదినిధనం చైతత్కారణం కర్మ సంభ##వే. 13

తేనేహ శాశ్వతం సర్వం జగత్థ్సావరంజంగమమ్‌ | నిత్యానిత్యవిచారే%త్ర నిమగ్నా మునయః సదా. 14

న జానంతి కిమేతద్వై నిత్యం వా%నిత్య మేవచ | మాయాయాం విద్యమానాయాం జగన్నిత్యం ప్రతీయతే. 15

కార్యాభావః కథం వాచ్యః కారణ సతి సర్వథా | మాయా నిత్యా కారణం చ సర్వేషాం సర్వదా కిల. 16

కర్మ బీజం తతో%నిత్యం చింతనీయం సదా బుధైః | భ్రమత్యేవ జగత్సర్వం రాజ న్కర్మనియంత్రితమ్‌. 17

నానాయోనిషు రాజేంద్ర నానాధర్మమయేషు చ | ఇచ్ఛయా చ భ##వేజ్జన్మ విష్ణో రమితతేజసః. 18

యుగేయుగే ష్వనేకాసు నీచయోనిషు తత్కథమ్‌ | త్యక్త్వా వై కుంఠసంవాసం సుఖభోగా ననేకశః. 19

విణ్మూత్ర మందిరే వాసం సంత్రస్తః కో%భివాంఛతి | పుష్పాపచయ లీలాం చ జలకేళిం సుభాసనమ్‌. 20

త్యక్త్వా గర్భగృహే వాసం కో%భివాంఛతి బుద్ధిమాన్‌ ? తూలికాంమృదుసంయుక్తాందివ్యాంశయ్యాంవినిర్మితామ్‌. 21

త్యక్త్వా%ధోముఖవాసం చ కో%భివాంఛతి పండితః | గీతం నృత్యంచ వాద్యం చ నానాభావసమన్వితమ్‌. 22

ముక్త్వా కో నరకే వాసం మనసా%పి విచింతయేత్‌ | సింధుజాద్భుతభావానాం రసం త్యక్త్వా సుదుస్త్యజమ్‌. 23

విణ్మూత్రరసపానం చ క ఇచ్ఛే న్మతి మాన్నరః | గర్భవాసాత్పరో నాస్తి నరకో భువనత్రయే. 24

కర్మకు ఫలముగనే రుద్రుడు సైతము కపాలముల దాల్చెను. ఈ విచిత్రకర్మము జగదుత్పత్తికి మూలకందము. ఈ కర్మమునకు మొదలులేదు. కాని, ముక్తివలన దీనికి నాశము గల్గును. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచము శాశ్వతమైనదిగా తోచును. కాని, యీ జగములు నిత్యములా కాక అనిత్యములాయని తేలక తికమక పడుచుందురు. ఈ జగము నిత్యమో అనిత్యమో జను లెఱుగరు. కాని, యిది మాత్రము మాయామయమై నిత్యమైనట్లుగ దోచును. అన్ని విధములుగా నొక కారణము వ్యాపించి యుండగ కార్యము లేదనుట పొసగదుగదా! కావున నీ మాయ నిత్యమై అన్ని విధముల నన్నిటికి కారణభూతమై నిజమై యున్నది. కనుక ఓ రాజా! ఈ జగదుత్పత్త్యాది రూపమయిన సంసారగతికి కర్మము సహకారి కారణమనియు అందుచేతనే ఈ జగత్తులును అనిత్యములనియు ఈ జగత్తులన్నియు కర్మములచే నియంత్రితములై వాటికి లోబడి నడుచు చుండుననియు వివేకులెరుగవలయును. రాజవర్య! అమితతేజస్వియగు విష్ణువు సైతము తన యిచ్చ మెచ్చునట్లుగ నచ్చిన జన్మమెత్త జాలడు. అతడిట్లెత్తగలిగినచో వైకుంఠధామ మందలి సుఖభోగములు విడనాడి యుగయుగమున నీచయోనులం దేల జన్మింప దలచును? కమ్మని పూలవాసనలు విరజిమ్ము తోటల విహారము జలక్రీడలు సుఖాసనములు కాలదన్ని యీ మలమూత్రముల కొంపలోనే బుద్ధిశాలి వసింపదలచును? మెత్తని పూసెజ్జను నెట్టివైచి యే పండితుడైన గర్భపుసంచిలో తలక్రిందుగపడి యుండగ గోరుకొనునా? పెక్కు రాగగీత వాద్యముల సుఖమువదలి యెంతటి విద్వాంసుడైనను గర్భవాస నరక మనుభవింప దలచునా? వదలరాని మహాలక్ష్మియొక్క మధుర హావభావరాగములు వదలి యే మతి మంతుడు నరకాస మనుభవింప దలచును? ఏ ప్రాజ్ఞు డీ మలమూత్రముల రసపాన మొనర్పదలచును? ఈ ముజ్జగాలలో గర్భవాస దుఃఖమును మించిన నరకము మరొకటి లేదు.

తద్భీతాశ్ఛ ప్రకుర్వంతి మునయో దుస్తరం తపః | హిత్వా భోగం చ రాజ్యం చ వనే యాంతి మనస్వినః. 25

యద్భీతాస్తు విమూఢాత్మా కస్తం సేవితు మిచ్ఛతి | గర్భే తుదంతి కృమయో జఠరాగ్నిస్తపత్యధః. 26

వపాసంవేష్టనం క్రూరం కిం సుఖం తత్ర భూపతే | వరం కారాగృహే వాసో; బంధనం నిగడై ర్వరమ్‌. 27

అల్పమాత్రం క్షణం నైవ గర్భావాసః క్వచిచ్ఛుభః | గర్భవాసే మహద్దుఃఖం దశమాసనివాసనమ్‌. 28

తథా నిస్సరణ దుఃఖం యోనియంత్రే%తిదారుణ | బాలభావే తదా దుఃఖం మూకాజ్ఞభావసంయుతమ్‌. 29

క్షత్తృడావేదనా%శక్తః పరతంత్రో%తికాతరః | క్షుధితే రుదితే బాలే మాతా చింతాతురా తదా. 30

భైషజం పాతు మిచ్ఛంతీ జ్ఞాత్వా వ్యాధివ్యథాం దృఢామ్‌ | నానావిధాని దుఃఖాని బాలభావే భవంతి వై. 31

కిం సుఖం విబుధా దృష్ట్వా జన్మ వాంఛంతి చేచ్ఛయా | సంగ్రామ మమరైః సార్ధం సుఖం త్యక్త్వా నిరంతరమ్‌. 32

కర్తు మిచ్ఛేచ్చ కో మూఢః శ్రమదం సుఖనాశనమ్‌ | సర్వథైవ నృప శ్రేష్ఠ! సర్వే బ్రహ్మాదయః సురాః. 33

కృతకర్మ విపాకేన ప్రాప్ను వంతి సుఖాసుఖే | అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌. 34

తపసా దానయజ్ఞై శ్చ మానవ శ్ఛేంద్రతాం వ్రజేత్‌ | పుణ్య క్షీణ%థ శక్రో%పి పతత్యేవ న సంశయః. 35

రామావతారయోగేన దేవా వానరతాం గతాః | తథా కృష్ణసహాయార్థం దేవా యాదవతాం గతాః. 36

ఏవం యుగేయుగే విష్ణు రవతారా ననేకశః | కరోతి ధర్మరక్షార్థం బ్రహ్మణా ప్రేరితో భృశమ్‌. 37

ఇట్టి ఘోరదుఃఖములకు కారణమైన కర్మమునకు భయపడి మనీషులును మునులునైన వారు రాజభోగములు వదలి దుస్తరతప మొనర్ప వనముల కేగుదురు. ఆ గర్భనరకమునకు భయపడినవాడు మూఢుడై మరల దానినే చేర గోరుకొనునా? గర్భవాస మందున్న వానిని పురుగులు తినుచుండును. వానికి జఠరాగ్ని తాపము మిక్కుటముగ గలుగుచుండును ఆ దారుణ గర్భవాస మందున్నవాడు మాయచే మాంసముచే చుట్టబడియుండవలయును. వానికంటె కారావాసమేని సంకెళ్లతో బంధింపబడుటేని కొంత మేలు గాదా? గర్భవాస మొక క్షణమాత్రమైన దైనను నది సుఖవంతమైనది కాదు. అనగా నిండుగ పది నెలలు గర్భవాసమున నుండుట మిక్కిలి బాధాకరమును దుఃఖప్రదమును సుమా! అటుపిమ్మట నతిదారుణమైన యోని యంత్రపుటిరుకునుండి బయలు వెడలుట మరింత పీడాకరము. అజ్ఞుని రీతిగను మూగవలెను బాల్య మందుండుటయు నింకను దుఃఖకరము. ఆ పుట్టిన శిశు వాకలిదప్పులను తెలుప నసమర్థుడై పరతంత్రుడై భీతుడై యుండును. బాలుడు ఆకలిగొని యేడ్చునపుడు తన తల్లి మిక్కిలి చింతించును. ఆ బాలు డధిక వ్యాధి పీడితుడైనచో నతని తల్లి యతనికి మందు త్రాపును. ఇట్లు బాల్యమున పెక్కు దుఃఖములు గలుగుచుండును. కాన, విబుధు లే సుఖశాంతు లాశించి యింతటి ఘోరతర దుఃఖములను చేజేతుల నేల కొని తెచ్చుకొందురు ఎడతెగని సుఖమును విడిచి ఏ మూఢుడు శ్రమకరమును సుఖమును నశింపజేయునదియునగు మానవ జన్మమును - అది దేవతలకు కూడ భయపడక వారి నెదిరించి యుద్ధము చేయుట కవకాశమిచ్చున దైనను - కావలెనని కోరుకొనును? బ్రహ్మాది దేవతలును తమ తమ కర్మ పరిపాకము ననుసరించి సుఖాసుఖము లందుదురు. కునుక దేహము ధరించిన దేవతలు నరులు పశుపక్ష్యాదులు సైతము నెవరు చేసిన కర్మము వా రనుభవింపక యేనాటికిని తీరదు. మానవుడు తపోదానయజ్ఞముల వలన నింద్ర పదవి నందవచ్చును. కాని, యా పున్నెము కొంచెమును క్షీణింపగనే యమరపతియు పతన మందును. శ్రీరామావతారమునందు రామునకు సాయముగ దేవతలు వానరులుగ జన్మించిరి. అట్లే వేల్పులు కృష్ణునకు సహాయముగ యాదవులై పుట్టిరి. ఈ విధముగ శ్రీమహావిష్ణువు యుగయుగమునందును విధిప్రేరితుడై పలువిధములుగ నవతరించి ధర్మ సంరక్షణ మొనరించుచుండును.

పునః పున ర్హ రే రేవం నానాయోనిషు పార్థివ! అవతారా భవంత్యన్యే రథచక్రవ దద్భుతాః. 38

దైత్యానాం హననం కర్మ కర్తవ్యం హరిణా స్వయమ్‌ | అంశాంశేన పృథివ్యాం వై కృత్వా జన్మ మహాత్మనా. 39

తదహం సంప్రవక్ష్యామి కృష్ణజన్మకథాం శుభామ్‌ | స ఏవ భగవాన్విష్ణు రవతీర్ణో యదోః కులే. 40

కశ్యపస్య మునేరంశో వసుదేవః ప్రతాపవాన్‌ | గోవృత్తి రభవద్రాజ న్పూర్వశాపానుభావతః. 41

కశ్యపస్య చ ద్వే పత్న్యౌ శాపా దత్ర మహీతలే | అదితిః సురసా చైవ మాసతుః పృథివీపతేః 42

దేవకీ రోహిణీ చోభే భగిన్యౌ భరతర్షభ | వరుణన మహాన్‌ శాపో దత్తః కోపా దితి శ్రుతమ్‌. 43

రాజోవాచః కిం కృతం కశ్యపేనా%%గోయేనశప్తోమహానృషిః | సభార్యః స కథం జాత స్తద్వదస్వ మహామతే! 44

కథం చ భగవా న్విష్ణు స్తత్ర జాతో%స్తి గోకులే | వాసీ వై కుంఠనిలయే రమాపతి రఖండితః. 45

నిదేశాత్కస్య భగవాన్వర్తతే ప్రభు రవ్యయః | నారాయణః సురశ్రేష్ఠో యుగాదిః సర్వధారకః. 46

స కథం సదనం త్యక్త్వా కర్మవానివ మానుషే | కరోతి జననం కస్మా దత్ర మే సంశయో మహాన్‌. 47

ప్రాప్య మానుష దేహం తు కరోతి చ విడంబనమ్‌ | భావా న్నానావిధాం స్తత్ర మానుషే దుష్ఠజన్మని. 48

కామః క్రోధో2మర్షశోకౌ వైరం ప్రీతిశ్చ కర్హిచిత్‌ | సుఖం దుఃఖం భయం నౄణాం దైన్య మార్జపమేవచ. 49

దుష్కృతం సుకృతంచైవ వచనం హననం తథా | పోషణం చలనం తాపో విమర్శ శ్చ వికత్థనమ్‌. 50

లోభో దంభ స్తథా మోహః కపటం శోచనం తథా | ఏతే చాన్యే తథా భావా మానుషే సంభవంతి హి. 51

ఓ పుడమి ఱడా! ఈ ప్రకారముగ శ్రీహరి యంతటివాడును రథచక్రము తిరుగునట్టు లద్భుతముగ పలుమారులు పలుయోనులందు తిరుగును. మహనీయుడగు హరి తన యంశాంశముతో భూమిపై స్వయముగ నవతరించి దుష్ట దానవులను దునుమాడుచుండును. కనుక నీ కిపుడు విష్ణు నంశమువలన యదువంశమున నవతరించిన కృష్ణుని శుభకరములైన దివ్య జన్మగాథలు వివరింతును వినుము: రాజా! మున్ను శాపకారణముగ కశ్యపు నంశమున జన్మించిన మహాప్రతాపి యగు వసుదేవుడు పశుపాలన వృత్తిలో నుండెను. ఓ భూమీశా! ఆ కశ్యపున కిరువులు భార్యులు గలరు. వారు అదితి-సురస-యనబడువారు. వారు నేలపై దేవకీరోహిణు లను నక్కచెల్లెండ్రుగ బుట్టిరి. వరుణుడు కోపించి వారికి మహాశాప మొసంగెనని విందును.

రాజిట్లనియెను: మహాపతీ! ఆ కశ్యప మహర్షియేమి యపరాధ మొనరించెనని యతడు నతని భార్యయు శపింపబడిరి. నా కంతయు సవివరముగ దెలుపుము. వైకుంఠవాసియు రమానాథుడు నగు శ్రీవిష్ణు భగవానుడు గోకులమున నేల జన్మించెనో నాకు విశదపఱచుము. ఆ దేవముఖ్యుడును విశ్వధారకుడును ప్రభువును అవ్యయుడు నైన నారాయణ భగవాను డెవరి యానతి వలన నవతరించెను? ఆతడు తన దివ్యధామము విడనాడి నేలపై జన్మించి మానవీయకర్మము లేల యొనరించెనో నాకు సంశయముగ నున్నది. ఆత డీ నరజన్మ మెత్తి పలురీతులైన మోసములు జేసి పెక్కు దుష్ట మానవ భావము లనుభవించెను గదా! కామక్రోధములు శోక మాత్సర్యములు ప్రేమ వైరములు సుఖదుఃఖములు ఆర్జవ దైన్యములు సుకృత దుష్కృతములు వచనము హననము చలనము పోషణము తాపము విమర్శనము ఆత్మస్తుతి లోభమోహములు కపట దంభములు మున్నగు భావము లెల్ల ఈ నరజన్మమున గలుగుచుండును.

స కథం భగవాన్విష్ణు స్త్యక్త్వా సుఖ మనశ్వరమ్‌ | కరోతి మానుషం జన్మ భావై రేతై రభిద్రుతమ్‌. 52

కిం సుఖం మానుషం ప్రాప్య భువి జన్మ మునీశ్వర ! కిం నిమిత్తం హరిః సాక్షా ద్గర్భవాసం కరోతి వై? 53

గర్భదుఃఖం జన్మదుఃఖం బాలభావే తథా పునః | ¸°వనే కామజం దుఃఖం గార్హస్థ్యే%తి మహత్తరమ్‌. 54

దుఃఖా న్యేతా న్యతా న్యవాప్నోతి మానుషే ద్విజసత్తమ | కథం స భగవాన్విష్ణు రవతారా న్పునఃపునః. 55

ప్రాప్య రామావతారం హి హరిణా బ్రాహ్మయోనినా | దుఃఖం మహత్తరం ప్రాప్తం వనవాసే%తి దారుణ. 56

సీతావిరహజం దుఃఖం సంగ్రామశ్చ పునః పునః | కాంతాత్యాగో%ప్యనేనైవ మనుభూతో మహాత్మనా 57

తథా కృష్ణా%వ తారే%పి జన్మ రక్షాగృహే పునః | గోకులే గమనం చైవ గవాం చారణ మిత్యుత. 58

కంసస్య హననం కష్టా ద్ద్వారకాగమనం పునః | నానా సంసార దుఃఖాని భుక్తవా న్భగవాన్కథమ్‌? 59

స్వేచ్ఛాయా కః ప్రతీక్షేత ముక్తో దుఃఖాని జ్ఞానవాన్‌ | సంశయం ఛింధి సర్వజ్ఞ! మమ చిత్తప్రశాంతయే. 60

ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే ద్వితీయో%ధ్యాః.

ఆ శ్రీహరి యా శాశ్వత సుఖకరమగు వైకుంఠమును కాల దన్ని యిట్టి క్రూర భావములు గల మనుజ జన్మ మేల గ్రహింపగోరెను? ఓ తాపసేంద్రా! ఆ హరి ధరపై మనుష్య జన్మ మెత్తి ఏ సుఖమునకై ప్రత్యక్షముగ గర్భవాస దుఃఖ మనుభవించెను? మునీంద్రా! మానవ జన్మములో గర్భదుఃఖము బాల్యదుఃఖము ¸°వనమున కామజన్యమగు దుఃఖము గృహస్థ జీవన దుఃఖము గల్గును. ఓ ద్విజేంద్రా! ఆ విష్ణు భగవానుడు మాటిమాటికీ మనుజత్వ మంది యేల యింతటి ఘోర దుఃఖము లనుభవించుచుండును? ఆ సుహృత్తము డగు విష్ణువు శ్రీరామాతార మెత్తి వనవాసమున నతిదారుణములును దుఃఖతరములు నగు క్లేశము లనుభవించెను? అపుడు రామచంద్రుడు సీతావియోగ దుఃఖమున సమరములు సల్పెను. సీతను పరిత్యజించెను. ఇట్లు పెక్కు దుఃఖము లనుభవించెను. అటులే శ్రీకృష్ణావతార మందును కృష్ణుని కారాగార జన్మము గోకులవాసము ఆలమందలు మేపుట మున్నగునది జరిగినవి. ఆ కృష్ణ భగవానుడు కంసవధ ద్వారకా గమనము మున్నగు పెక్కు సంసార దుఃఖము లేల యనుభవించెను. ఓ సర్వజ్ఞా! ముక్తసంగుడు జ్ఞానియగు వాడు తాను సొంతముగ నిట్టి దుఃఖములు బడయగోరుకొనునా? కావున నా యీ సంశయము లన్నియు విచ్ఛేదించి నా కాత్మశాంతి చేకూర్చుము.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు కర్మ ప్రభావమను ద్వితీయాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters