Sri Devi Bhagavatam-1    Chapters   

అథ త్రింశో%ధ్యాయః

వ్యాస ఉవాచ : 

ఏవం తౌ సంవిదం కృత్వా యావత్తూష్ణీం బభూవతుః | ఆజగామ తదా%%కాశా న్నారదో భగవాన్నృషిః 1

రణయ న్మహతీం వీణాం స్వరగ్రామ విభూషితామ్‌ | గాయ న్బృహద్రథం సామ తదా సముపతస్థివాన్‌. 2

దృష్ట్వాతం రామ ఉత్థాయ దదావథ వృషం శుభమ్‌ | ఆసనం చార్య పాద్యంచ కృతవా నమిత ద్యుతిః. 3

పూజాం పరమికాం కృత్వా కృతాంజలి రుపస్థితః | ఉపవిష్ఠః సమీపే తు కృతాజ్ఞో మునినా హరిః. 4

ఉషవిష్టం తదా రామం సానుజం దుఃఖమానసమ్‌ | పప్రచ్ఛ నారదః ప్రీత్యా కుశలం మునిసత్తమః. 5

కథం రాఘవ: శోకార్తో యథా వై ప్రాకృతో నరః | హృతాం సీతాం చ జానామి రావణన దురాత్మనా. 6

సురసద్మ త శ్చాహం శ్రుతవాన్‌ జనకాత్మజామ్‌ | పౌలస్త్యేన హృతాం మోహా న్మరణం స్వ మజానతా. 7

తవ జన్మ చ కాకుత్థ్స పౌలస్త్యనిధనాయ వై | మైథిలీహరణం జాత మేతదర్థం నరాధిప. 8

పూర్వజన్మని వైదేహీ మునిపుత్రీ తపస్వినీ | రావణన వనే దృష్టా తపస్యంతీ శుచిస్మితా. 9

ప్రార్థితా రావణ నాసౌ భవ భార్యేతి రాఘవ | తిరస్కృత స్తయా%సౌవై జగ్రాహ కబరం బలాత్‌. 10

శశాప తతణం రామ రావణం తాపసీ భృశమ్‌ | కుపితా త్యక్తు మిచ్ఛంతీ దేహం సంస్పర్శ దూషితమ్‌. 11

దురాత్మం స్తవ నాశార్థం భవిష్యామి ధరాతలే | అయోనిజా వరా నారీ త్యుక్త్వా దేహం జహావపి. 12

ముప్పదవ అధ్యాయము

వ్యాసమునిచంద్రు డిట్లనియె : ఈ ప్రకారముగ రామలక్ష్మణులు విచారించి మౌనముగ నుండిరి. అంతలో గగన సీమనుండి నారద భగవాను డేతెంచెను. ఆ మహర్షి షడ్జాది స్వరములతో నొప్పారు మహతీ వీణను మీటుచు బృహద్రథ సామగానము సేయుచు రాముని సమీపించెను. తేజశ్శాలి యగు రాము డతనిని వీక్షించి యతనికి శుభాసనము నర్ఘ్యపాద్యములు నొసంగి పరమపూజ లాచరించి యంజలి ఘటించి యతని యనుమతితో నతని సన్నిధి నుపవిష్టు డయ్యెను. రాముడు తన తమ్మునితో గూడి మదిలో గుందుచు దిగులుతో గూరుచున్న శ్రీరాముని మహర్షి కుశల మడిగెను: ఓ రాఘవేంద్రా! ఒక ప్రాకృత నరుని పగిది శోకింతు వేల? క్రూరుడు రావణుడు సీతను హరించుట నే నెఱుంగుదును. అతడు తన చావు తా నెఱుగలేక మోహవశమున సీత నపహరించెను. ఇదంతయును నేను సురలోక మందుండియే వింటిని. ఓ కాకుత్థ్సా! నరాధిపా! నీవు రావణ వినాశమునకే యవతరించితివి. అందులకే యతడు సీత నపహరించెను. పూర్వజన్మమున సీత యొక ముని కుమారిగ జన్మించెను. ఆమె వనములందు ఘోర తప మొనరించుచు రావణుని కంటబడెను. అత డామెను తనకు భార్యగ గమ్మని వేడుకొనెను. కాని, యామె యతనిని తిరస్కరించెను. అత డామె కేశపాశములు బట్టి బలిమితో లాగెను. ఓ రామా! ఆ దుష్టాత్ముని స్పర్శము చేత తన శరీరము కళంకితమైనదని యెంచి యామె తన తనువు చాలింపదలచెను. ఆమె వెంటనే కోపమునంఓరీ దురాత్మా! నేను నీ వినాశమునకై భూమిపై నయోనిజగ సంభవింపగలను'' అని శపించి యామె తన మేను చాలించెను.

సేయం రమాంశ సంభూతా గృహీతా తేన రక్షషా | వినాశార్థం కులసై#్యవ వ్యాళీ స్రగివ సంభ్రమాత్‌. 13

తవ జన్మ చ కాకుత్థ్స తస్య నాశాయ చామరైః | ప్రార్థితస్య హరే రంశా దజవంశే%ప్యజన్మనః. 14

కురు ధైర్యం మహాబాహో తత్ర సా వర్తతే%వశా | సతీధర్మరతా సీతా త్వాం ధ్యాయంతీ దివానిశమ్‌. 15

కామధేను పయః పాత్రే కృత్వా మఘవతా స్వయమ్‌ | పానార్థం ప్రేషితం తస్యాః పీతం చైవామృతం తథా. 16

సురభీదుగ్ధ పానాత్సా క్షుత్తృ డ్దుఃఖ వివర్జితా | జాతా కమల వత్రాక్షీ వర్తతే వీక్షితా మయా. 17

ఉపాయం కథయామ్యద్య తస్య నాశాయ రాఘవ | వ్రతం కురుష్వ శ్రద్ధావా నాశ్వినే మాసి సాంప్రతమ్‌. 18

నవరాత్రోపవాసం చ భగవత్యాః ప్రపూజనమ్‌ | సర్వసిద్ధికరం రామః జపహోమ విధానతః. 19

మేధ్యైశ్చ పశుభి ర్దేవ్యా బలిం దత్వా విశంసితైః | దశాంశం హవనం కృత్వా సుశక్తస్త్వం భవిష్యసి. 20

విష్ణునా చరితం పూర్వ మహాదేవేన బ్రాహ్మణా | తథా మఘవతా చీర్ణం స్వర్గమధ్యస్థితేన వై. 21

సుఃనా రామ కర్తవ్యం నవరాత్ర వ్రతం శుభమ్‌ | విశేషేణ చ కర్తవ్యం పుంసా కష్ట గతేన వై. 22

విశ్వామిత్రేణ కాకుత్థ్స! కృత మేత న్న సంశయః | భృగుణా%థ వసిష్ఠేన కశ్యపేన తథైవ చ. 23

గురునా హృతదారేణ కృత మేతన్మహావతమ్‌ | తస్మాత్త్వం కురు రాజేంద్ర రావణస్య వధాయ చ. 24

ఇంద్రేణ వృత్రనాశాయ కృతం వ్రత మనుత్తమమ్‌ | త్రిపురస్య వినాశాయ శివేనాపి పురాకృతమ్‌. 25

ఆ యీ సీత లక్ష్మ్యంశ సంభూతురాలు. నాగుపామును పూలమాల యను భ్రాంతితో బట్టినట్లుగ నతడు తన కులనాశనమునకు సీత నపహరించెను. ఓ సుజన మనోనయనాభిరామా! రామా! అతని సర్వనాశమునకే నీవును సంభవించితివి. ఎల్లదేవతలును ప్రార్థింపగా జన్మములేని నీవు నారాయణాంశమున నజుని వంశమునందు అవతరించింతివి. మహాబాహూ! ధైర్యము వహింపుము. అచ్చట సీతయును ధర్మరతయు సతియునై అవశ##యై రేయింబవళ్ళు నిన్నే తన మదిలో ధ్యానించుచు నున్నది. దేవేంద్రుడు స్వయముగ నొక పాత్రలో నమృత మధురములైన కామధేనువు పాలు పోసి త్రాగుట కామె కంపించెను. ఆ దివ్య గోక్షీరము త్రాగుటచే నా కమలదళనయన యాకలి దప్పులు పాసి సుఖ ముండెను. ఇదంతయును నేను గంటిని. రాఘవా! రావణుడు చచ్చుటకు నీకొక వ్రతము దెల్పుదును. అదేమన, నీ వాశ్వయుజ మాసమున శ్రద్ధతో శ్రీదేవీ నవరాత్ర వత్ర మాచరింపుము. రామా! నవరాత్రములం దుపవసింపుము. దేవిని జపహోమాది విధులతో బూజింపుము. నీకు సర్వసిద్ధులు కరతలామలకము లగును. దేవికి యాగ పశువును బలి యొసంగుము. జపదశాంశము వేల్చుము. దీనివలన నీ వధిక శక్తిమంతుడవు గాగలవు. పూర్వము శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మ సురలోకమందలి యింద్రుడును యథావిధిగ నీ దేవీ నవరాత్ర వ్రతము జరిపిరి. నీలమేఘశ్యామా! రామా! ఈ నవరాత్ర వ్రతమును సుఖములు బొందువారు సేయవలయును. కష్టములలో బాధపడువారు చేయుట మరింత యవసరము. తొల్లి వసిష్ఠుడు భృగువు కశ్యపుడు విశ్వామిత్రుడు నీ దేవీ నవరాత్ర వ్రతము సల్పి సుఃంచి రనుటలో లేశమయినను సందియము లేదు. మునుపు బృహస్పతి భార్య యపహరింపబడెను. అపు డత డీ దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. నీవును రావణ వధార్థము దీని నాచరింపుము. మున్ను దేవపతి వృత్ర సంహారమునకును శివుడు త్రిపుర వినాశమునకును ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరించిరి.

హరిణా మధునాశాయ కృతం మేరౌ మహామతే: | విధివ త్కురు కాకుత్థ్స వ్రత మేత దతంద్రితః. 26

శ్రీరామ ఉవాచ: కా దేవీ కిం ప్రభావా సా కుతో జాతా కిమాహ్వయా |

వ్రతం కిం విధివ ద్బ్రూహి సర్వజ్ఞో%సి దయానిధే: 27

నారద ఉవాచ : శృణు రామ! సదా నిత్యా శక్తి రాద్యా సనాతనీ |

సర్వకామప్రదా దేవీ పూజితా దుఃఖనాశినీ. 28

కారణం సర్వజంతూనాం బ్రహ్మాదీనాం రఘూద్వహ | తస్యాః శక్తిం వినా కో%పి స్పందితుం న క్షమో భ##వేత్‌. 29

విష్ణోః పాలనశక్తిః సా కర్తృశక్తిః పితు ర్మమ | రుద్రస్య నాశశక్తిః సా త్వన్యశక్తిః పరాశివా. 30

యచ్చ కించి త్క్వచి సదస ద్భువనత్రయే | తస్యసర్వస్య యా శక్తి స్తదుత్పత్తిః కుతో భ##వేత్‌. 31

న బ్రహ్మా న యదా విష్ణు ర్న రుద్రో న దివాకరః | న చేంద్రాద్యాః సురాః న ధరా న ధరాధరాః. 32

తదా సా ప్రకృతిః పూర్ణా పురుషేణ పరేణ వై | సంయుతా విహరత్యేవ యుగాదౌ నిర్గుణా శివా. 33

సా భూత్వా సగుణా పశ్చా త్కరోతి భువనత్రయమ్‌ | పూర్వ సంసృజ్య బ్రహ్మాదీ న్దత్వా శక్తీశ్చ సర్వశః. 34

తాం జ్ఞాత్వా ముచ్యతే జంతు ర్జన్మ సంసారబంధనాత్‌ | సా విద్యా పరమాజ్ఞేయా వేదాద్య వేదకారిణీ. 35

అసంఖ్యాతాని నామాని తస్యా బ్రహ్మాదిభిః కిల | గుణకర్మ విధానైస్తు కల్పితాని చ కిం బ్రువే. 36

ఆకారాదిక్షకారాంతైః స్వరై ర్వర్ణైస్తు యోజితైః | అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన. 37

సీతాపతి! మహామతీ! శ్రీహరి తొలిసారిగ మధు సంహారమునకు మేరుగిరిపై శ్రీదేవీ మహావ్రతము యథావిధిగ నప్రమత్తతతో నొనరించెను. రామభద్రుడిట్లనియెను : ఓ దయానిధీ! సర్వజ్ఞా! ఆ మహాదేవి యెవరు? ఆమె పేరేమి? ఆమె యెట్లు ప్రాదుర్భవించెను? ఆమె ప్రభావ మెట్టిది? ఆ దేవీ వ్రతమేది? నా కంతయు యథావిధి నెఱిగింపుము. నారదు డిట్లనియెను. ఓ రామా! శ్రద్ధగ నాలింపుము. ఆ దేవి నిత్య - సనాతని - ఆద్యశక్తి- విశ్వపూజిత-సర్వదుఃఖనాశని - అభీష్ట ప్రదాయిని. గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మవఱకు గల సకల జంతువుల కామె కారణభూతురాలు. ఆమె చేతనశక్తి తోడులేనిచో నెవడును కదలనైన నోపడు. బ్రహ్మలోని పుట్టించు శక్తియు విష్ణు నందలి పాలనశక్తియు రుద్రుని యందలి సంహారశక్తియు నివన్నియు నా మహాశక్తి యొక్క ప్రతిరూపములే. ఆ మహాశక్తియే పరాశివశక్తి యన చెలువు మీరును. ఈ రేడు లోకాలలో సదసదాత్మక రూపమున భాసిల్లు ప్రతి చిన్న వస్తువులోని శక్తియు నా పరాచైతన్య మహాశక్తి నుండియే కలుగుచున్నది. ఈ సకల సృష్టికి పూర్వము హరిహరబ్రహ్మలు సూర్యుడు సురపతి భూమి గిరులు మొదలగు దేవతలు ఎవరును - ఏమియు నుండలేదు. అట్టి సమయమున ఆ పరమ ప్రకృతి శక్తి పరమపురుషునితోడి పరమ బ్రహ్మానంద సంగమమున పరిపూర్ణయై నిర్గుణ శివ స్వరూపమున విలసిల్లెను. సృష్టి ప్రారంభమున నా ప్రకృతి మహాశక్తి సగుణ రూపము దాల్చును. ఆ శక్తి యీ భువనత్రయమును సృజించును. బ్రహ్మాదులను పుట్టించి, వారిని సర్వశక్తి సంపన్నులను జేయుము. ఆ యెల్ల లోకముల నేలెడి తల్లి - మహావిద్య - వేదాద్య - వేదకారిణి - యని యెఱిగినవాడు జన్మమరణ సంసార సాగర బంధనముల నుండి విముక్తు డగును. ఆ మహాదేవి యొక్క గుణకర్మ విభాగములు బట్టి బ్రహ్మాదు లామెకు పెక్కు నామము లుంచిరి. ఆ దేవీ నామము లనంతములు. అకారాది క్షకారాంతములగు స్వర వర్ణఘటనలతో నా దేవీ సుధామధుర నామములు శతసహస్రాధికములు గలవు.

రామ ఉవాచ : విధిం మే బ్రాహి విప్రర్షే! వ్రతస్యాస్య సమాసతః 38

కరోమ్యద్యైవ శ్రద్ధావాన్‌ శ్రీదేవ్యాః పూజనం తథా.

నారద ఉవాచ : పీఠం కృత్వా సమే స్థానే సంస్థాప్య జగదంబికామ్‌ |

ఉపవాసాన్నవైవ త్వంకురు రామ! విధానతః. 39

ఆచార్యో%హం భవిష్యామి కర్మణ్యస్మి న్మమీపతే | దేవీకార్య విధానార్థ ముత్సాహం ప్రకరోమ్యహమ్‌. 40

తచ్ఛుత్వా వచనం సత్యం మత్వా రామః ప్రతాపవాన్‌ |

కారయిత్వా శుభం పీఠం స్థాపయిత్వా%ంబికాం శివామ్‌. 41

విధివత్పూజనం తస్యా శ్చకార వ్రతవాన్హరిః | సంప్రాప్తే చాశ్వినే మాసి తస్మిన్గిరివరే తదా. 42

ఉపవాసపరో రామః కృతవా న్ర్వతముత్తమమ్‌ | హోమంచ విధివత్తత్ర బలిదానం చ పూజనమ్‌. 43

భ్రాతరౌ చక్రతుః ప్రేవ్ణూ వ్రతం నారదసమ్మతమ్‌ | అష్టమ్యాం మధ్యరాత్రే తు దేవీ భగవతీ హి సా. 44

సింహారూఢా దదౌ తత్ర దర్శనం ప్రతిపూజితా | గిరిశృంగే స్థితోవాచ రాఘవం సానుజం గిరా. 45

మేఘ గంభీరయా చేదం భక్తి భావేన తోషితా.

అనగా రాముడిట్లనియెను: ఓ దేవర్షీ! నా కా దేవీ వ్రత విధానము సంక్షేమముగ దెల్పుము. నే నిపుడే శ్రద్ధా భక్తులతో దేవీ వ్రత మాచరింతును. అన నారదుడిట్లనియెను. ఓ రామభద్రా! ఒక సమతల ప్రదేశమున నొక పీఠమేర్పరచవలయును. దానిపై జగదంబికను స్థాపించవలయును. ఉపవసించి యథావిధిగ దేవీ నవరాత్ర వ్రత మాచరింప వలయును. ఈ దేవీ శుభవ్రత మహోత్సవమునం దాచార్యుడుగ నేనే యుందును. నాకు దేవీ కార్య నిర్వహణమున నమితోత్సాహము గల్గుచుండును.''

వ్యాసుడిట్లనియెను: ముని పలుకులు విని అవి లోన గట్టిగ నమ్మి మహావీరుడగు రాము డొక యున్నతమైన పీఠము చేయించెను. దానిపై నంబికను ప్రతిష్ఠించెను. రాము డా గిరిపై నుండగనే యంతలో నాశ్వయుజ మాసము సమీపించెను. శ్రీరాముడు యథావిధిగ దేవీ నవరాత్ర పూజ లోనరించెను. రాము డుపవాసముతో నుత్తమ దేవీ వ్రత మాచరించెను. యథా విధిగ పూజా హోమ బలి విధానము లొనరించెను. ఆ యిరువు రన్నదమ్ములును నారదానుమతముతో దేవీ వ్రతము సలిపిరి. అష్టమినాడు నడిరేయి శ్రీ భగవతీదేవి వారి భక్తిభావమునకు సుప్రసన్నయై సింహాసనాసీనయై గిరిశిఖర మందుండి వారికి దర్శన భాగ్య మొసంగి మేఘగంభీర నాదమున సానుజుడగు రామున కిట్లనియెను:

దేవ్యువాచ: రామరామ మహాబాహో! తుష్టా%స్మ్య ద్యవ్రతేన తే.

ప్రార్థయస్వ వరం కామం యత్తే మనసి వర్తతే | నారాయణాంశ సంభూత స్త్వం వంశే మానవే%నఘే. 47

రావణస్య వధాయైవ ప్రార్థిత స్త్వమరై రసి | పురా మత్స్యతనుం కృత్వా హత్వా ఘోరం చ రాక్షసమ్‌. 48

త్వయా వై రక్షితా వేదాః సురాణాం హిత మిచ్ఛతా | భూత్వా కచ్ఛపరూప స్తు ధృతవా న్మందరం గిరిమ్‌. 49

అకూపారం ప్రమంథానం కృత్వా దేవా నపోషయః | కోలరూపం పురా కృత్వా దశనాగ్రేణ మేదినీమ్‌. 50

ధృతవానసి యద్రామ హిరణ్యాక్షం జఘాన చ | నారసింహీం తనుం కృత్వా హిరణ్యకశిపుం పురా. 51

ప్రహ్లాదం రామ రక్షిత్వా హతవానసి రాఘవ | వామనం వపు రాస్థాయ పురా ఛలితవా న్బలిమ్‌. 52

భూత్వేంద్రస్యానుజః కామం దేవకార్య ప్రసాధకః | జమదగ్ని సుత స్త్వం మే విష్ణోర శేన సంగతః. 53

కృత్వాతం క్షత్రియాణాం తు దానం భూమే రదా ద్విజే | తథేదానీం తు కాకుత్థ్స! జాతో దశరథాత్మజః. 54

ప్రార్థితస్తు సురైః సర్వై రావణ నాతిపీడితైః | కపయస్తే సహాయా వై దేవాంశా బలవత్తరాః! 55

భవిష్యంతి నరవ్యాఘ్ర! మచ్ఛక్తి సంయుతాహ్యమీ.

రామా! రామా! ఓ మహాబాహూ! నీ వొనరించిన వ్రతమునకు సంతుష్టి జెందితిని. నీ మన మందలి యేదేని వరము గోరుకొనుము. నీవు నారాయణాంశ సంభూతుడవు. పావన మను వంశ పంజాతుడవు. అమరులు నిన్ను రావణ వధార్థము ప్రార్థించిరి. మున్ను నీవు మత్స్యరూపము దాల్చి క్రూర దనుజుని హతమార్చితివి. దేవతల మేలు గోరి వేదములను గాపాడితివి. కూర్మ రూపము దాల్చి మందరగిరి నెత్తితివి. పాలసంద్రము మధించునపుడు విబుధులకు సంతసము గల్గించితివి. వరాహావతార మెత్తి కొనకోఱలపై భూమిని ధరించితివి. హిరణ్యాక్షుని వధించితివి. భీకర నరసింహావతారము ధరించి హిరణ్యకశిపుని పరిమార్చితివి. రామా! భాగవతోత్తముడగు ప్రహ్లాదుని గాచితివి. వామన రూపమున బలి గర్వ మడగించితివి. దేవకార్యము నిమిత్త మింద్రునకు సోదరుడ వైతివి. విష్ణువంశమున జమదగ్నికి తనయుడవై యుద్భవించితివి. క్షత్రియుల నెల్ల సంహరించితివి. బ్రాహ్మణులకు భూమి నంతయును దాన మొసంగితివి. ఓ కాకుత్థ్సా! అట్టి నీవే యిపుడు దశరథుని నందనుడవై యవతరించితివి. రావణ పీడితులైన దేవత లెల్లరును నిన్ను శరణు వేడిరి. ఇచటి కపివీరులు దేవాంశజులు. మహాబలవంతులు. వీరు నీకు సాయ మొనరింపగలరు.

భవిష్యతి న సందేహః కర్తవ్యో2త్ర త్వయా2నఘః వసంతే సేవనం కార్యం త్వయా తత్రాతి శ్రద్ధయా. 57

ఏకాదశ సహస్రాణి వర్షాణి పృథివీతలే. 58

కృత్వా రాజ్యం రఘుశ్రేష్ఠః గంతాసి త్రిదివం పునః | ఇత్యుక్త్వా%తర్దధే దేవీ రామస్తు ప్రీతమానసః 59

సమాప్య తద్వృతం చక్రే ప్రయాణం దశమీదినే | విజయాపూజనం కృత్వా దత్వా దానాన్యనేకశః. 60

కపిపతి బలయుక్తః సానుజః శ్రీపతిశ్చ ప్రకట పరమ శక్త్యా ప్రేరితః పూర్ణకామః |

ఉదధితటగతో%సౌ సేతుబంధం విధా యా త్యహన దమరశత్రుం రావణం గీతకీర్తిః. 61

యః శృణోతి నరో భక్త్యా దేవ్యాశ్చరిత ముత్తమమ్‌ | స భుక్త్వా విపులా న్భోగా న్ప్రాప్నోతి పరమం పదమ్‌ 62

సంత్యన్యాని పురాణాని విస్తరాణి బహూని చ శ్రీ మద్భాగవతస్యాస్య న తుల్యానీతి మే మతిః. 63

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ%ష్టాదశ సాహస్ర్యాం సంహితాయాం తృతీయస్కంధే త్రింశో%ధ్యాయః

దేవీ భాగవతస్యాస్య తృతీయస్కంధ విస్తరమ్‌ సార్ధైః షడబ్ధిశైలేందు పద్యై ర్వ్వాసో వ్యరీరచత్‌.

ఇతి శ్రీదేవీ భాగవతే తృతీయ స్కంధః సమాప్తః.

నీ యీ రూపములన్నియును నా మహాశక్తితో సంపన్నములై సంభవించినవి. లక్ష్మణుడు శేషు నంశమున నుద్భవించెను. అతడు రావణుని కుమారుని పరిమార్చగలడు. నా మాటలందు నీ కెంతమాత్రమును సందేహము వలదు. ఇదే విధముగ నీవు వసంత నవరాత్రములను జరిపి శ్రద్ధతో దేవీపూజ లొనరింపుచుండవలయును. నీవా పాపాత్ము డగు రావణాసురుని దునుమాడి భూమిపై పదునొక్కండు వేలేండ్లు సుఖశాంతులతో రామరాజ్యము నెలకొల్పుదువు. ఆ పిదప నీవు స్వర్గలోక మేగుదువు అని యీ విధముగ దేవి పలికి యంతర్ధాన మొందెను. శ్రీరాముడు సంతుష్టాంతరంగు డయ్యెను. శ్రీరాము డీ విధముగ శ్రీ మద్దేవీ నవరాత్ర వ్రతము పరిసమాప్తము గావించి దశమినాడు విజయా (దశమీ) పూజ లొనరించి అనేక దాన ధర్మము లొనరించెను. జైత్రయాత్ర సాగించెను. ఆ రణశూరుడు కోదండ రాముడు నగు రాముడు కపిపతి యగు సుగ్రీవ బలము సాయముతో లక్ష్మణుని గూడి పరమశక్తి ప్రేరితుడై పూర్ణకాముడై సముద్రముపై సేతువు గట్టెను. సురవైరి యగు రావణు నంతమొందించెను. సుగుణకీర్తిధాముడై స్థిరముగ విలసిల్లెను. ఏ పుణ్యాత్ముడు డీ యుత్తమోత్తమమైన దేవీ చరిత్ర మాకర్ణించునో యతడు విపుల భోగములంది పిదప పరమసౌఖ్యము లనుభవించును. ఎన్నెన్నో పురాణములు విపులములు గలవు. కాని యవన్నియు శ్రీ మద్దేవీ భాగవతముతో సరిపోలజాలవనియు నా దృఢ విశ్వాసము అని వ్యాసముని జనమేజయునితో పలికెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు ముప్పదవ యధ్యాయము.

ఇట్లు శ్రీ దేవీభాగవతమందలి తృతీయస్కంధమున 1746 శ్లోకములను శ్రీ వ్యాస మహర్షి రచించెను.

శ్రీ దేవీ భాగవత తృతీయ స్కంధము సమాప్తము.

శ్రీ దేవీ భాగవత తృతీయ స్కంధము సమాప్తము.

l l l

Sri Devi Bhagavatam-1    Chapters