Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకోనవింశో%ధ్యాయః

వ్యాసః: భర్త్రాసా%భిహితాబాలాం పుత్రీం కృత్వాంకసంస్థితామ్‌ | ఉవాచ వచనం శ్లక్ణం సమాశ్వాస్యశుచిస్మితామ్‌. 1

కిం వృథా సుదతి! త్వం హి విప్రియం మమ భాషసే | పితా తే దుఃఖ మాప్నోతి వాక్యే నానేన సువ్రతే! 2

సుదర్శనో%తి దుర్భాగ్యో వరో%యం వై వనాశ్రయః | బలకోశ విహీనశ్చ పరిత్యక్తస్తు బాంధవైః. 3

మాత్రా సహ వనం ప్రాప్తః ఫలమూలాశనః కృశః | నతే యోగ్యో వరో%యం వై వనవాసీ చ దుర్భగః. 4

రాజపుత్రాః కృతప్రజ్ఞా రూపవంతః సుసమ్మతాః | తవార్హాః పుత్రి సంత్యన్యే రాజచిహ్నై రలంకృతాః. 5

భ్రాతా%స్య వర్తతే కాంతః స రాజ్యం కోసలేషు వై | కరోతి రూపసంపన్నః సర్వలక్షణ సంయుతః. 6

అన్య చ్చ కారణం సుభ్రుః శృణు యచ్చ మయాశ్రుతం | యుధాజిత్సతతం తస్యవధకామో%స్తి భూమిపః. 7

దౌహిత్రః స్థాపితస్తేన రాజ్యే కృత్వా%తి సంగరమ్‌ | వీరసేనం నృపం హత్వా సమ్మంత్ర్య సచివైఃసహ. 8

భారద్వాజాశ్రమం ప్రాప్తం హంతుకామః సుదర్శనమ్‌ | మునినా వారితః పశ్చా జ్జగామ నిజమందిరమ్‌. 9

పందొమ్మిదవ అధ్యాయము

సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు చిరుగనవు కల తన చిన్నారి కూతును తొడపై కూర్చుంబెట్టుకొని ఊరడించుచు మృదువచనముల నిట్లు పలికెను. సుదతీ! సువ్రతా! నాకు ప్రీతికరముగాని వ్యర్థపు పల్కు పలికెదవేల? నీ యీ మాటలచేత నీ తండ్రియు మిక్కిలి దుఃఖము పొందుచున్నాడు. ఆ సుదర్శనుడు భాగ్యహీనుడు రాజ్యభ్రష్టుడు నిరాశ్రయుడు బలకోశరహితుడు నిజబంధు పరిత్యక్తుడు. తన తల్లితో వనములందు కందమూలములు తినుచు కృశించుచు బ్రతుకు వెళ్ళబుచ్చుచున్నాడు. వనవాసియు దుర్భాగ్యుడునగు అతడు నీకు దగిన వరుడుగాడు. రాజలక్షణ లక్షితులు రూపప్రజ్ఞా గుణవంతులు ఆదరపాత్రులునగు రాకుమారులితరులెందఱో నీకన్ని విధాల తగినవారు గలరు. ఈ సుదర్శనుని సోదరుడు గలడు. అతడు సకల లక్షణ సంయుతుడు రూప సంపన్నుడు కోసలదేశపతి. నేనింకొక మాట గూడ వింటిని. అది వినుము. యుధాజిత్తు అను రాజు ఈ సుదర్శనుని చంపుటకు పొంచుకొని యున్నాడు. అతడు ఇతని మాతామహుడగు వీరసేనరాజు నంతమొందించి మంత్రులతో మంతనములాడి తన మనుమని రాజుగ చేసెను. అతడు సుదర్శనుని గూడ చంపనుంకించి భారద్వాజశ్రమము జేరెను. కాని, మునివరుడడ్డగింప జేయునదిలేక తన పురకేగెను.''

శశికళోవాచ: మాతర్మ మేప్సితః కామే వనస్థో%పి నృపాత్మజః | శర్యాతివచనేనైవ సుకన్యా చ పతివ్రతా 10

చ్యవనం చ య|థా ప్య్రా పతిశశ్రూషణ రతా | భర్తృశుశ్రూషణం స్త్రీణాం స్వర్గదం మోక్షదం తథా. 11

అకైతవకృతం నూనం సుఖదం భవతి స్త్రీయాః | భగవత్యా సమాదిష్టం స్వప్నే వర మనుత్తమమ్‌. 12

తమృతే2హం కథం చాన్యం సంశ్రయామి నృపాత్మజం | మచ్చిత్తభిత్తౌ లిఃతో భగవత్యా సుదర్శనః 13

తం విహాయ ప్రియం కాంతం కరిష్యే%హం నచాపరమ్‌ | వ్యాస ఉవాచ : ప్రత్యాదిష్టా%థ వైదర్భీ తయా బహునిదర్శనైః. 14

భర్తారం సర్వ మాచష్ట పుత్య్రోక్తం వచనం భృశం | వివాహస్య దినా దర్వాగాప్తం శ్రుతసమన్వితమ్‌. 15

ద్విజం శశికళా తత్ర ప్రేషయామాస సత్వరం | యథా న వేద మే తాత స్తథా గచ్ఛ సుదర్శనమ్‌ 16

భారద్వాజాశ్రమే బ్రూహి మద్వాక్యా త్తరసా విభో | పిత్రా మే సంభృతః కామం మదర్థేన స్వయంవరః. 17

ఆగమిష్యంతి రాజానో బలయుక్తా హ్యనేకశః | మయా త్వం వై వృతశ్చిత్తే సర్వథా ప్రీతిపూర్వకమ్‌ 18

భగవత్యా సమాదిష్టః స్వప్నే మమ సురోపమ| విష మద్మి హుతాశేవా ప్రపతామి ప్రదీపితే. 19

వరయే త్వదృతే నాన్యం పితృభ్యాం ప్రేరితా%పి వా | మనసా కర్మణా వాచా సంవృత స్త్వం మయా వరః. 20

భగవత్యాః ప్రసాదేన శర్మావాభ్యాం భవిష్యతి | ఆగంతవ్యం త్వయా%త్రైవ దైవం కృత్వా పరంబలమ్‌. 21

యదధీనం జగత్సర్వం వర్తతే సచరాచరం | భగవత్యా యదాదిష్టం న తన్మిథ్యా భవిష్యతి. 22

యద్వశే దేవతాః సర్వా వర్తంతే శంకరాదయః | వక్తవ్యో%సౌ త్వయా బ్రహ్మన్నే కాంతే వై నృపాత్మజః. 23

యథా భవతి మే కార్యం తత్కర్తవ్యం త్వయానఘ | ఇత్యుక్త్వా దక్షిణాం దత్వా మునిర్వ్యాపారిత స్తయా. 24

శశికళ యిట్లు పలికెను : నా మనోరథ విషయమై అన్ని విధముల నా మనసునకు నచ్చిన రాకుమారుడు వనముల నున్ననేమి? మున్ను శర్యాతి వాక్కుల బట్టి పతివ్రతయగు సుకన్య చ్యవనుని భర్తగ బడసి పతిపరిచర్యానిరతయై వెలయలేదా? పరమసతులకు పతిసేవయే స్వర్గ ప్రదము మోక్షప్రదము. నిష్కపటముగ చేసిన పని సతీమణికి నిశ్చయముగ సుఖ ప్రదమేయగును. ఆ యుత్తమ వీరుడే నాకు వరుడని పరమ భగవతి కలలో నాదేశించిన యుత్తమ వరుడగు అతనిని వదలి యితర నృపకుమారులనెటుల నాశ్రయింపగలను? నా చిత్తమనెడు గోడపై నా ప్రియతముడు భగవతిచేత లిఃంపబడెను. అట్టి నా ప్రియుని తప్ప ఇతరుని నేను భర్తగా చేసికొనను. వ్యాసుడిట్లనియెను: అనేక నిదర్శనములు చూపి శశికళ తన తల్లిమాటను త్రోసిపుచ్చగా రాణి తన కూతురు చెప్పినదంతయు మిక్కిలిగా తన పతికి విన్నవించెను. వివాహమునకు పూర్వము శశికళ వేదవిదుడు నాప్తుడునగు నొక్క ద్విజుని బిలిపించి యాతనితో తన తండ్రికి తెలియకుండునట్లుగ భరద్వాజాశ్రమమందున్న సుదర్శనుని చెంతకేగుమని పలికి తన మాటగా అతనితో పలుకుమని ఇట్లు చెప్పెను : నా తండ్రి నాకు స్వయంవరము చాటించెను. అందులకు బలవంతులగు పెక్కురు రాజు లేతెంతురు. నేను మాత్రము ప్రీతిపూర్వకముగ నిన్నే నా చిత్తమున వరించితిని. ఓ సుర సమానా! ఆ భగవతియగు దేవి నా కలలో నిన్నే చూసి వరించుమనినది. నీవు కాదననిచో ఇంత విషమైన మ్రింగుదును. మండు మంటేలలోనైన పడి చత్తును. అంతేకాని తల్లిదండ్రులు నాకెంత చెప్పినను నిన్ను దక్కొరుని వరునిగ వరింపను. నా మనోవాక్కాయముల పూర్తిగ నిన్నే వరించితిని. భగవతీ ప్రసాదమున మనకు సుఖము కలుగగలదు. నీవిపుడా దైవమునే బలముగనెంచి యిచ్చోటికి రావలయును. ఈ సకలచరాచరమున కేలోక ధాత్రి ఆధారమో యా జగన్మాతృనాదేశ##మెట్లు పొల్లు పోగలదు? శంకరాది దేవతలే యా మహాపరాశక్తికి మోకరిల్లి చేతులు జోడింతురుగదా! ఓ బ్రాహ్మణవర్యా! ఆ రాజకుమారుడొంటిగనుండగ జూచి నా యుదంతమునతనిముందుంచుము. అనగా, ఈ కార్యమెట్లు నెరవేరగలదో యట్లొనరింపుము. ఇది నీ కర్తవ్యము సుమా! అని యామె యతనికి దక్షిణాదులొసంగి యతని నాపనికై వీడ్కొలిపెను.

గత్వా సర్వం నివేద్యాశు తత్ర ప్రత్యాగతో ద్విజః | సుదర్శన స్తు తత్‌ జ్ఞాత్వా నిశ్చయం గమనే తదా. 25

చకార మునినా తేన ప్రేరితః పరమాదరాత్‌ | గమనాయోద్యతం పుత్రం తమువాచ మనోరమా. 26

వేపమానా%తి దుఃఖార్తా జాతత్రాసాశ్రులోచనా | కుత్ర గచ్ఛసి తత్రాద్య సమాజే భూభృతాం కిల. 27

ఏకాకీ కృతవైరశ్చ కిం విచింత్య స్వయంవరే | యుధాజిద్ధంతుకామ స్త్వాం సమేష్యతి మహీపతి. 28

నతే%న్యో%స్తి సహాయశ్చ తస్మా న్మా వ్రజపుత్రక | ఏకపుత్రో%తి దీనా%స్మి త్వదాధార నిరాశ్రయా. 29

నార్హసి త్వం మహాభాగ | నిరాశాం కర్తు మద్య మామ్‌ | పితా మే నిహతో యేన సో%పి తత్రాగతో నృపః. 30

ఏకాకినం గతం తత్ర యుధాజిత్త్వాం హనిష్యతి | సుదర్శనః భవితవ్యం భవత్యేవ నాత్ర కార్యావిచారణా. 31

ఆదేశా చ్చ జగన్మాతు ర్గచ్ఛామ్యద్య స్వయంవరే | మా శోకం కురు కళ్యాణి | క్షత్రియా%సి వరాననే | 32

న బిభేమి ప్రసాదేన భగవత్యా నిరంతరమ్‌ |

అతడేగి యామెపల్కినదంతయును సుదర్శనునకు నివేదించి మరలి వచ్చెను. సుదర్శనుడంతయునెఱింగి యచ్చటి కేగ నిశ్చయించుకొనెను. భరద్వాజుడు పరమాదరమున సుదర్శనుని ఈ విషయమున ఉత్సాహపరచెను. అట్లు బయలుదేరు తన కొడుకునుగని మనోరమ వడకుచు కన్నుల నీరునిండగ నిట్లనెను : అంత పెద్ద రాజ సమూహమునకు నీవొక్కడవేల యేగుదువు? దేని నాశ్రయముగ చూచికొని స్వయంవరమునందు నీవొంటిగ వైరులమధ్యకేగగలవు? అచ్చటికి యుధాజిత్తు నిన్ను చంపుటకు తప్పక రాగలడు. అచ్చట నీకండగ నిలబడువారెవ్వరును లేరు. కావున నాయనా! వెళ్ళవలదు. నేనేకపుత్రను - దీనను - నిరాధారను - ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకొనియున్నదానను. నీవు నన్ను నిరాశను చేయదగదు. నా తండ్రిని పొట్టబెట్టుకొన్నవాడచ్చటికిని తప్పక రాగలడు. నీవొంటరిగ వచ్చుటజూచి యుధాజిత్తు నిన్ను హతమార్చును. సుదర్శను డిట్లనియెను : ఓయమ్మా! కానున్నది కానమానదు. అందులకు విచారమేల? నేనా జగజ్జనని యాదేశముననే స్వయంవరమున కేగుచున్నాను. అమ్మా! నీవు క్షత్రియకుల సంజాతవు వీరమాతవు. దుఃఖపడవలదు. ఆ భగవతీ వరప్రసాదమున నాకెట్టి భయమును లేదు.

ఇత్యుక్త్వా రథ మారుహ్య గంతుకామం సుదర్శనమ్‌. దృష్ట్వా మనోరమా పుత్ర మాశీర్భి శ్చాన్వమోదయత్‌ | 33

అగ్రత స్తే%ం బికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః. పార్వతీ పార్శ్వయోః పాతు శివః సర్వత్ర సాంప్రతమ్‌. 34

వారహీ విషయమే మార్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్‌ | కాళికా కలహే ఘోరే పాతు త్వాం పరమేశ్వరీ. 35

మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే | భవానీ భూపమధ్యే తు పాతు త్వాం భవమోచనీ. 36

గిరిజా గిరి దుర్గేషు చాముండా చత్వరేషు చ | కామగా కాననే ష్వేవం రక్షతు త్వాం సనాతనీ. 37

వివాదే వైష్ణవీ శక్తి రవతాత్త్వాం రఘూద్వహ | భైరవీ చరణ సౌమ్య! శత్రూణాంవై సమాగమే. 38

సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ | మహోమాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణీ. 39

ఇత్త్యుక్త్వా తం తదా మాతా వేపమానా భయాకులా | ఉవాచాహం త్వయా సార్థ మాగమిష్యామి సర్వథా. 40

నిమిషార్థం వినా త్వాం వై నాహం స్థాతు మిహోత్సహే | సహైవం నయ మాం వత్స యత్రతతే గమనే మతిః. 41

ఇత్యుక్త్వా నిస్సృతా మాతా ధాత్రేయీసంయుతా తదా | విపై#్ర ర్దత్తాశిష స్సర్వేనిర్యయుర్హర్ష సంయుతాః. 42

వారాణస్యాం తతః ప్రాప్తో రథేనైకేన రాఘవః | జ్ఞాతః సుబాహునా తత్ర పూజిత శ్చార్హణాదిభిః. 43

నివేశార్థం గృహం దత్త మన్నపానాదికం తథా | సేవకం సమనుజ్ఞాప్య పరిచర్యార్థ మేవ చ. 44

అని యిట్లు పలికి స్వయంవరమున కేగ నుద్యుక్తుడయిన సుదర్శనుని తన కొడుకును గని మనోరమ ఆశీర్వచనముల నిట్లతని ననుమోదించెను : ఆ శ్రీ యంబికా దేవి నీ ముందు భాగమును శ్రీదేవి వెనుక భాగమును బ్రోచుగాత! పార్వతీ దేవి నీ యిరుప్రక్కలను శివ సర్వత్ర సర్వకాలములందును గాపడుత. వారాహీదేవి విషమస్థలులందును దుర్గాదేవి దుర్గమ ప్రదేశములందును కాళికాపరమేశ్వరి ఘోర కలహముల మధ్యను నిన్నోముత! మాతంగి మంటపముల మధ్య సౌమ్యస్వయంవరము నడుమ భవ విమోచనియుగు భవాని భూపతుల మధ్య నీకు రక్షయగుగాక. గిరిజ గిరిదుర్గములందు చాముండ చత్వరములందు సనాతనియగు కామగ కాననములందు నిన్ను రక్షించుగాక! ఓ రఘూద్వహా! శ్రీ వైష్ణవీశక్తి వాద వివాదములందు భైరవీశక్తి శత్రుసమాగమములందు నిన్ను గాపాడుగాక! మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందన స్వరూపిణియగు త్రిభువనేశ్వరీదేవి సర్వకాల సర్వావస్థలయందును నీకండయై యుండుగాత! అని యీ విధముగ రక్షజేసి భయాకులయై గడగడలాడుచు నేనును నీవెంట రాగలనని సుతునకు ఆమె మరల నిట్లనెను: నీవు లేక నే నరనిముసమైన బ్రతుకజాలను. నీ వెటకేగ దలచినచో నన్ను నటకు గొంపొమ్ము అని యిట్లు మనోరమ పలికి విప్రుల యాశీస్సులు బడసి తన తనయునితో దాదితో గలిసి తానును బయలుదేరెను. రఘువంశీయుడగు సుదర్శనుడట్లు వెడలి యొక్క యరదమెక్కి వారణాసీపరము జేరెను. అచ్చటి సుబాహురాజది యెఱింగి యతని నుచితరీతిగ నాదరించెను. సుబాహువు వారికి విడుదులేర్పరచి యన్నపానాదులకు వసతులు కల్పించి వారి పరిచర్యలకు సేవకుల నాదేశించెను.

మిళితా స్త్వథ రాజానో నానాదేశాధిపాః కిల | యుధాజిదపి సంప్రాప్తో దౌహిత్రేణ సమన్వితః. 45

కరూషాధిపతి శ్చైవ తథా మద్రేశ్వరో నృపః | సింధురాజ స్తథా వీరో యోద్ధా మాహిష్మతీపతిః. 46

పాంచాలః పర్వతేయశ్చ కామరూపో%తి వీర్యవాన్‌ | కర్ణాట శ్చోలదేశీయో వైదర్భశ్చ మహాబలః. 47

అక్షౌహిణీ త్రిషష్టిశ్చ మిళితా సంఖ్యయా తదా | వేష్టితా నగరీ సా తు సైన్యైః సర్వత్ర సంస్థితైః. 48

ఏతే చాన్యే చ బహవః స్వయంవరదిదృక్షయా | మిళితా స్తత్ర రాజానో వరవారణ సంయుతాః. 49

అన్యోన్యం నృపపుత్రాస్తే ఇత్యూచు ర్మిళితాస్తదా | సుదర్శనో నృపసుతో హ్యాగతో%స్తి నిరాకులః. 50

ఏకాకీ రథ మారుహ్య మాత్రాసహ మమామతిః | వివాహార్థ మిహాయాతః కాకుత్థ్సః కింను సాంప్రతమ్‌. 51

ఏతా న్రాజసుతాం స్త్యక్త్వా ససైన్యా న్సాయుధానథ | కి మేనం రాజపుత్రీ సా పరిష్యతి మహాభుజమ్‌. 52

యుధాజిదథ రాజేశ స్తా నువాచ మహీపతిన్‌ | అహ మేనం హనిష్యామి కన్యా%ర్థే నాత్రసంశయః. 53

అచటికి యుధాజిత్తును తన మనుమని వెంటగొనివచ్చెను. అచటికి కరూషపతి మద్రపతి మాహిష్మతీపతి సింధుపతి - పాంచాల పర్వతేయులు కర్ణాట చోళ##వైదర్భపతులును వీరుడగు కామరూపుడు మొదలగు నానాదేశాధీశులు మఱికొందఱు భూపతులు స్వయంవరమును గాంచ నేనుగుల మీద వేడుకలతో నేతెంచిరి. అపుడా నగర మరువది మూడక్షౌహిణుల సేనలతో నెల్లెడల క్రిక్కిరిసి యుండెను. సుదర్శను డేకాకిగ నిరాకులుడై యేతెంచెనని కొందఱు రాకొమరులిట్లు గుసగుసలు వోయిరి: అతడొంటరిగ వివాహార్థము రథమెక్కి తన తల్లితో నేగుదెంచెను. ఇందఱు రాజసుతులు సైన్యసమేతులై రాగా వీరందఱిని త్రోసిరాజని యారాకుమారి మహాభుజుడగు సుదర్శనుని వరించును. అంత యుధాజిత్తు నేను కన్యార్థమై సుదర్శనుని చంపగలన'ని యచటి రాజులతో ననెను.

కేరళాధిపతిః ప్రాహ తం తదా నీతిసత్తమః | నాత్ర యుద్ధం ప్రకర్తవ్యం రాజన్నిచ్ఛా స్వయంవరే. 54

బలేన హరణం నాస్తి నాత్ర శుల్క స్వయంవరః | కన్యేచ్ఛయా%త్ర వరణం వివాదః కీదృశస్త్విహ. 55

అన్యాయేన త్వయా పూర్వమసౌ రాజ్యాత్ప్రవాసితః | దౌహిత్రాయార్పితం రాజ్యం బలవ న్నృపసత్తమ! 56

కాకుత్థ్సో%యం మహాభాగ! కోసలాధిపతేః సుతః | కథ మేనం రాజపుత్రం హనిష్యసి నిరాగసమ్‌. 57

లప్స్యసే తత్ఫలం నూనమనయస్య నృపోత్తమ | శాస్తా%స్తి కశ్చిదాయుష్మాన్‌ జగతో%స్య జగత్పత్తిః. 58

ధర్మో జయతి నాధర్మః సత్యం జయతి నానృతం | మా%నయం కురు రాజేంద్ర! త్యజ పాపమతిం కిల. 59

దౌహిత్ర స్తవ సంప్రాప్తః సో%పి రూపసమన్వితః | రాజ్యయుక్త స్తథా శ్రీమా స్కథం తం న పరిష్యతి. 60

అన్యే రాజసుతాః కామం వర్తంతే బలవత్తరాః | కన్యాస్వయంవరే కన్యా స్వీకరిష్యతి సాంప్రతమ్‌. 61

వృతే తథా వివాదః కః ప్రవదంతు మహీభుజః | పరస్పరం విరోధో%త్ర కర్తవ్యో విజానతా.

62

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే ఏకోనవింశో%ధ్యాయః.

అంత నీతిమంతుడగు కేరళాధిపతి యుధాజిత్తున కిట్లనియె : ఓ రాజా! ఇది ఇచ్ఛా స్వయంవరము. ఇందు యుద్ధము చేయరాదు. ఇది శుల్కముతో గూర్చిన స్వయంవరము కాదు. ఇందు బల్మితో కన్నెను హరింప వీలులేదు. రాజా! నీవు మును సుదర్శను నన్యాయముగ రాజభ్రష్టుని జేసితివి. నీ మనుమనికి రాజ్యమొసగితివి. ఈ కాకుత్థ్సుడు కోసలాధిపతి పుత్రుడు - రాజ కుమారుడు నిర్దోషి, ఇట్టి వానిని నీ వెట్టుల మట్టుపెట్ట చూచెదవు? నీ యవినీతికి నీవు పాపఫలిత మనుభవించి తీరుదువు. ఈ యీరేడులోకాలకొక జగత్పతి విశ్వశాస్త గలడని నమ్ముము. ధర్మమే జయించును. అధర్మమోడిపోవును. కావున దుర్ణయ వృత్తిని పాపమతిని వదలుము. నీ మనుమడు వచ్చెను. అతడు గూడ సురూపి. రాజ్యవంతుడు. శ్రీమంతుడు : మఱి శశికళ యతని నేల వరింపదు? ఇచటికి బలశాలురగు నితర రాజకుమారు లెందఱో వచ్చి యున్నారు. కన్యక ఎవ్వనినేని ఒక్కనినే తప్పక వరించి తీరును. ఎవ్వనినైన వరించినచో నిక వివాదమునకు తావెక్కడిది? కాన బుద్ధిశాలి పరస్పర విరోధము కల్పించుకొనరాదు.

ఇది శ్రీదేవీ భాగవతమున తృతీయస్కంధమందు పందొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters