Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

సూత ఉవాచ :

 గత ప్రాణంతు రాజానం బాలం పుత్రం సమీక్ష్యచ | చక్రుశ్చ మంత్రిణః సర్వే పరలోకస్య సత్క్రియాః. 1

గంగాతీరే దగ్ధదేహం భస్మ ప్రాయం మహీపతిమ్‌ | అగురుభిశ్చాభియుక్తాయాం చితాయా మధ్యరోపయున్‌. 2

దుర్మరణన మృతసాస్య చక్రుశ్చైవౌర్థదైహికీమ్‌ | క్రియాం పురోహితాస్తస్య వేదమంత్రై ర్విధానతః. 3

దదు ర్దానాని విప్రేభ్యోగాః సువర్ణం యథోచితమ్‌ | అన్నంత బహువిధం తత్ర వస్త్రాణి వివిధాని చ. 4

సుముహూర్తే సుతం బాలం ప్రజానాం ప్రీతివర్ధనమ్‌ | సింహాసనే శుభే తత్ర మంత్రిణః సంస్యవేశయన్‌. 5

పౌరజానపదా లోకా శ్చక్రు స్తం నృపతిం శిశుమ్‌ | జనమేజయనామానం రాజలక్షణసంయుతమ్‌. 6

ధాత్రేయా శిక్షమాయాస రాజచిహ్నాని సర్వశః | దినేదినే వర్ధమానః స బభూవ మహామతిః. 7

ప్రాప్తే చైకాదశే వర్షే తసై#్మ కులపురోహితః | యథోచితాం దదౌ విద్యాం జగ్రాహ స యథోచితామ్‌. 8

ధనుర్వేదం కృపః పూర్ణం దదావసై#్మ సుసంస్కృతమ్‌ | అర్జునాయ యథా ద్రోణః కర్ణాయ భార్గవో యథా. 9

సంప్రాప్తవిద్యో బలవాన్బభూవ దురతిక్రమః | ధనుర్వేదే తథా వేదే పారగః పరమార్థవిత్‌. 10

ధర్మశాస్త్రార్థకుశలః సత్యవాదీ జితేంద్రియః | చకార రాజ్యం ధర్మాత్మా పురా ధర్మసుతో యథా. 11

పదునొకండవ అధ్యాయము

ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

సూతుడిట్లనెను: ఆ తెఱంగున పరీక్షిత్తు ప్రాణములు పాసెను. ఆతని కుమారుడు జనమేజయుడు. కడు పసివాడు. కనుక మంత్రులు రాజునకు పరలోకక్రియలు జరుగునట్లు చేసిరి. వారు దుర్మరణమున ప్రాణాలు వదలిన రాజు శవమును గంగాతీరమందు చందనచితి పేర్చి దానిపై నుంచిరి. రాజ పురోహితులు దుర్మరణము జెందిన ఆ రాజునకు వేద మంత్రములతో పరలోకక్రియలు జరిపిరి. వారు బ్రాహ్మణులకు యథోచితముగా బహువిధముల గోదానసువర్ణదా నాన్న దానవస్త్రదానము లొనర్చిరి. మంత్రులందఱును పౌరజానపదులను నొక సుముహుర్తమున ప్రజా పీతికరుడు బాలకుడునగు రాజసుతుని జనమేజయుని పాలకునిగ నొనరించి సింహాసనమున గూర్చుండబెట్టిరి. ఒక దాది యతనికి రాజచిహ్నములను గూర్చి శిక్షణ గఱపెను. మహామతియగు అతడును దిన దిన క్రమమున ప్రవర్దమానుడయ్యెను. పదునొకండవయేట నతనికి కులపురోహితుడు యథోచిత విద్య గఱపెను. వాని నా బాలకుడు చక్కగ నేర్చుకొనెను. అర్జునునకు ద్రోణుడును కర్ణునకు పరశురాముడునువలె జనమేజయునకు కృపాచార్యుడు చక్కగ ధనుర్వేదమంతయు నేర్పెను. ఆ రాజు విద్యలెల్లబడసి దురతిక్రముగడు బలశాలి యయ్యెను. మఱియు వేద ధనుర్వేదములు తుదముట్ట నెరిగి పరమార్థవేత్త యయ్యెను. అతడు దర్మార్థకుశలుడు - సత్యవాది - జితేంద్రియుడునై జను లితడు ధర్మరాజను నట్లు రాజ్యము చేసెను.

తతః సువర్ణవర్మాక్షో రాజా కాశిపతిః కిల | పపుష్టమాం శుభాం కన్యాం దదౌ పారిక్షితాయచ. 12

స తాం ప్రాప్య సితాపాంగీం ముముదే జనమేజయః | కాశిరాజసుతాం కాంతాం ప్రాప్య రాజా యథా పురా. 13

విచిత్రవీర్యో మముదే సుభద్రాం చ యథా %ర్జునః | విజహార మహీపాలో వనేషూవననేషు చ. 14

తయా కమలపత్రాక్ష్యా శచ్యా శతక్రతు ర్యథా | ప్రజాస్తస్య సుసంతుష్టా బభూవుః సుఖలాలితాః. 15

మంత్రిణః కర్మకుశలా శ్చక్రుః కార్యాణి సర్వశః | ఏతస్మిన్నేవ కాలేతు ముని రుత్తంకనామకః. 16

తక్షకేణ వరిక్లిష్టో హస్తినాపుర మభ్యగాత్‌ | వైరస్యావచితిం కో%స్య ప్రకుర్యాదితి చింతయన్‌. 17

పరీక్షితసుతం మత్వా తం నృపం సముపాగతః | కార్యాకార్యం నజానాసి సమయే నృపసత్తమః 18

అకర్తవ్యం కరోష్యధ్య కర్తవ్యం నకరోషి చ | కిం త్వాం సంప్రార్థయామ్యద్య గతామర్షం నిరుద్యమమ్‌. 19

అవైరజ్ఞ మతంత్రజ్ఞం బాలచేష్టా సమన్వితమ్‌ | జనమేజయః : కిం వైరం న మయా జ్ఞాతం న కిం ప్రతికృతం మయా. 20

అంతట కాశీరాజగు సువర్ణవర్మాక్షుడు తన వపుష్టమయను కన్య నతని కిచ్చెను. ఆ ధవళాక్షినిబొంది జనమే జయుడు మున్ను కాశీరాజు కూతును బడసిన విచిత్రవీర్యుడువలెను సుభద్రను పొందిన అర్జునుడువలెను ముదితనుగూడి ప్రమదముతో వనోపవనములందు విహరించెను. ఇంద్రుడు శచిని బడసి ప్రసన్నుడై నట్లే యతడా లేమనుజేరి సుఖముండెను. అతడు ప్రజలు సంతోషించునట్లు వారిని లాలించి పాలించెను. కార్యదక్షులైన మంత్రులెల్లరును తమ తమ విధులు చక్కగ నిర్వహించుచుండి ఆ దినములలో ఉత్తంకుడను ముని యుండెను. అతడు తక్షకునిచేత బాధింపబడెను. ఆ బాధకు ప్రతీకార మెవరు చేయగలరోయని యాలోచించి యుత్తంకుడు జనమేజయుడందులకు తగినవాడనియెంచి హస్తిపురికేగెను. ఆ ముని జనమేజయుని సమీపించి యిట్లు పలికెను : 'రాజా! నీవు సమయానుకూలముగ మంచిచెడ్డ లెఱుగలేవు. నీవు చేయరాని పని చేయుదువు. చేయవలసినది చేయవు. నీకు కోపముగాని ప్రయత్నముగాని తెలియవు. ఇట్టి నిన్ను నేనేమి కోరగలను? నీవు తంత్ర మెఱుగవు. నీకు దేనియందును పగలేదు. నీవింకను పిల్లచేష్టలు మరువలేదు.' జనమేజయు డిట్లనియెను: 'ఇతరులు నాకు చేసిన ఏ అపకారము నాకు తెలియలేదో నేను దేనికి ప్రతీకారము చేయలేదో మహాభాగా ! నాకంతయు వివరముగ దెలుపుము. చేయగలను.'

తద్వద త్వం మహాభాగ కరోమియ దనంతరమ్‌ | ఉత్తంకః : పితా తే నిమతో భూప తక్షకేణ దురాత్మనా. 21

మంత్రిణస్త్వం సమాహూయ పృచ్ఛస్వపితృనాశనమ్‌ | సూతః : తచ్ఛ్రుత్వా వచనం రాజాపప్రచ్ఛ మంత్రిసత్తమాన్‌. 22

ఊచుస్తే ద్విజశాపేన దష్టః సర్పేణ వై మృతః | జనమేజయః : శాపో%త్ర కారణం రాజ్ఞః శప్తస్య మునినా కిల. 23

తక్షకస్యతు కో దోషో బ్రూహి మే మునిసత్తమ | ఉత్తంకః : తక్షకేణ దనం దత్వా కశ్యవః కిన్నివారితః. 24

న స కిం తక్షకోవైరీ పితృహా తవ భూపతే | భార్యా రురోః పురా భూప | దష్టా సర్పేణ సా మృతా. 25

అవివాహితా తు మునినా జీవితా చ పునః ప్రియా | రురుణా పి కృతా తత్ర ప్రతిజ్ఞా చాతిదారుణా. 26

యం యం సర్పంప్రపశ్యామి తం తం హన్మ్యాయుధేన వై ఏవం కృత్వా ప్రతిజ్ఞాం స శస్త్రపాణీ రురుస్తథా. 27

వ్యచర త్పృథివీం రాజ న్నిఘ్న న్సర్పా న్యతస్తతః | ఏకదా స వనే ఘోరం డుండుభం జరసా%న్వితమ్‌. 28

అపశ్య ద్దండ ముద్యమ్య హంతుం తం సముపాయ¸° | అభ్యహన్రుషితో వివ్ర స్తమువాచాథ డుండుభః. 29

నాపరాధ్నోమి తే విప్ర కస్మా న్మా మభిహంసి వై | రురుః : ప్రాణప్రియా మే దయితా దష్టా సర్పేణ సామృతా. 30

ప్రతిజ్ఞేయం తదా సర్పదుఃఖితేన మయా కృతా | డుండుభః : నాహం దశామి తే%న్యే యే దశంతి భుజంగమాః. 31

శరీర సమయోగేన న మాం హింసితు మర్హసి | ఉత్తంకః : శ్రుత్వాతాం మానుషీం వాణీం సర్పేణోక్తాం మనోహరామ్‌. 32

అనగా ఉత్తంకుడిట్లనియెను : ఓ భూపతీ ! నీ తండ్రి తక్షకుని దౌర్మార్గ్యముచే హతుడయ్యెను. నీ మంత్రులను పిలిచి నీ పితృమరణమును గూర్చి యడిగి తెలిసికొనుము. అది విని రాజా విషయము గురించి మంత్రులతో ప్రస్తావించగా వారిట్లనిరి: 'నీ తండ్రి విప్రుని శాపకారణమున పాముచే కాటువేయబడి వెంటనే మరణించెను.' జనమేజయుడు నా తండ్రి చావునకు ముని శాపమెట్లు కారణమయ్యెను? అందులో తక్షకుని తప్పిదమేమి? నాకంతయు దెలుపుడు. అన నుత్తంకు డిట్లనియెను: తక్షకుడు కశ్యపునకు ధనమిచ్చి యతనిని చికిత్స చేయనీయక వెనుకకు పంపెను. రాజా ! నీ తండ్రిని చంపిన తక్షకుడు నీకు పగవాడగునా కాడా? మునుపు రురుముని భార్యయు సర్పదష్టయై చనిపోయెను. ఆమె యవివాహితుడగు రురునిచేత మరల బ్రతికింపబడినది. ఆ సమయమున రురుమని 'నా కంటబడిన ప్రతి పామును నా యాయుధముతో చంపగలను' అని దారుణ ప్రతిజ్ఞచేసి యతడు శస్త్రపాణి యయ్యెను. నాటినుండి యతడు నేల నాలుగు చెఱగులు తిరుగుచు కంటబడిన పాములనెల్ల చంపుచుండెను. అంత నతని కొకమారు వనమున నొక ముసలి డుండుభము కంటబడెను. అతడా పెనుబామునుగని దానిని చంపుటకు కోపముతో కఱ్ఱ పైకెత్తి దెబ్బకొట్టగా డుండుభ మిట్లనెను: విప్రా! నీకు నేనేమి యపరాధము చేసితిని? నన్నేల చంపదలచితివి? అందులకు రురువు తొల్లి నా యిష్టసఖి సర్పదష్టయై మరణించినది. ఆనాడు నేనెల్ల పాముల జంప ప్రతిన బూనితిని' అన నతనితో డుండుభము 'నేను నిన్ను కాటు వేయను, కాటువేయు పాములు వేరే యుండును. కేవలము పాము రూపముగల నన్ను చంపుట నీకు తగదు. అనెను. ఈ చక్కని మనుజ వాక్కులు పాము నోటవచ్చుట రురువు విని -

రురుః పప్రచ్ఛ కో%సి త్వం కస్మా డ్డుం డుభతాం గతః | సర్పః : బ్రాహ్మణో%హం పురా విప్రసఖా మే ఖగమాభిధః. 33

విప్రో ధర్మభృతాం శ్రేష్ఠః సత్యవాదీ జితేంద్రియః | స మయా వంచితో మౌర్ఖ్యా త్సర్పం కృత్వా చ తార్ణకమ్‌. 34

భయం చ ప్రాపితో%త్యర్థ మగ్నిహోత్ర గృహే స్థితః | తేన భీతేన శప్తో%హం విహ్వలేనాతి వేపినా. 35

భవ సర్పో మందబుద్ధే యేనాహం దర్షిత స్త్వయా | మయా ప్రసాదితో%త్యర్థం సర్పేణా %సౌ ద్విజోత్తమః. 36

మామూవాచాథ తత్క్రోధా త్కించిచ్ఛాంతి మవాప్య చ | రురుస్తే మోచితా శాపస్యాస్య సర్ప భవిష్యతి. 37

ప్రమతేస్తు సుతో నూన మితి మాం సో%బ్రవీ ద్వచః సో%హం సర్పో రురు స్త్వం చ శృణు మే పరమం వచః 38

అహింసా పరమో ధర్మో విప్రాణాం నాత్ర సంశయః | దయా సర్వత్ర కర్తవ్యా బ్రాహ్మణన విజానతా. 39

యజ్ఞా దన్యత్ర; విప్రేంద్ర న హింసా యాజ్ఞికీ మతా ఉత్తంకః : సర్పయోనే ర్వినిర్ముక్తో బ్రాహ్మణో% సౌ రురుస్తతః. 40

కృత్వా తస్య చ శాపాంతం పరిత్యక్తం చ హింససమ్‌ | వివాహితా తేన బాలా మృతా సంజీవితా పునః. 41

'నీవెవరవు?' ఈ డుండుభత్వము నీవెట్లు పొందితివి?' అని దానిని ప్రశ్నించెను. విప్రా ! నేనును పూర్వ మొక బ్రాహ్మణుడను. నా స్నేహితుడు ఖగముడనువాడు గలడు. అతడు ధర్మవిద్వరుడు. జితేంద్రియుడు. సత్యశీలుడు. నేనొక గడ్డిపామునుచేసి అగ్నిశాలలోనున్న యతనిని మూర్ఖత్వమున వంచించితిని. అతడు భయవిహ్వలుడై గడగడలాడుచు' ఓ మందమతీ! నీవు నన్ను వంచించితివి. కాన సర్పముగమ్మని శపించెను. అపుడు నేను పాముగ మారి యతని ప్రసన్నతకతనిని ప్రార్థించితిని. అతని కోపము కొంత శాంతించగ 'నిన్ను ప్రమతిపుత్త్రుడగు రురుపు శాపముక్తుని చేయు'ననెను ఆ పామును నేనే, నీవే యా రురుమునివి. ఇంకనా పరమహితవచన మాలకింపుము. విప్రులకు పరమధర్మ మహింసయే సుమా! విజ్ఞుడైన బ్రాహ్మణుడెల్లచోట్ల దయతో వర్తింపవలయును. ఇది నిజము విప్రేంద్రా ! హింస యాగములందు తప్ప వేరు సందర్భముల తగదు అని డుండుభము పలికెను. ఆ విప్రుడట్లు సర్పయోనినుండి ముక్తిగాంచెను. రురువు అట్లు ఖగముఖుని శాపముక్తిని గావించుటతోపాటు నాటినుండి హింసను మానుకొని, చచ్చి మరల బ్రతికిన బాలికను ప్రమద్వరను పెండ్లి చేసికొనెను.

కదనం సర్వసర్పాణాం కృతం వైర మనుస్మరమ్‌ | త్వం తు వైరం సముత్సృజ్య వర్తసే పన్నగే ష్వథ 42

విమన్యు ర్భరత శ్రేష్ఠ! పితృఘాతనరేషు వై ! అంతరిక్షే మృత స్తాతః స్నానదానవివర్జితః. 43

తస్యోద్ధారం చ రాజేంద్ర కురు హత్వా% థ పన్నగాన్‌ | పితుర్వైరం న జానాతి జీవన్నేవ మృతో హి సః. 44

దుర్గతి స్తే పితు స్తావ ద్యావత్తాన్న హనిష్యసి | అంబామఖమిషం కృత్వా కురు యత్నం నృపోత్తమ. 45

సర్పసత్రం మహారాజ పితుర్వైర మనుస్మరన్‌ | సూతః : ఇతి తస్య వచః శ్రుత్వా రాజా జనమేజయ స్తదా. 46

నేత్రాభ్యా మశ్రుపాతం చ చకారాతీవ దుఃఖితః | ధిజ్‌ మా మస్తు సుదుర్బుద్ధే వృథా మానకరస్య వై. 47

పితా యస్య గతిం ఘోరాం ప్రాప్తః పన్నగపీడితః | అద్యాహం మఖ మారభ్య కరో మ్యవచితిం పితుః. 48

హత్వా సర్పా నసందిగ్ధో దీప్యమానే విభావసౌ : ఆహూయ మంత్రిణః సర్వా న్రాజా వచన మబ్రవీత్‌. 49

కుర్వంతు యజ్ఞసంభారం యథార్హం మంత్రిసత్తమాః | గంగాతీరే శుభాం భూమింమాపయిత్వా ద్విజోత్తమైః. 50

కుర్వంతు మండపం స్వస్థాః శత స్తంభం మనోహరమ్‌ | వేదీ యజ్ఞస్య కర్తవ్యా మమాద్య సచివాః ఖలు. 51

తదంగత్వే విదేయో వై సర్పసత్రః సువిథేస్తరః | తక్షకస్తు పశు స్తత్ర హోతోత్తంకో మహామునిః. 52

శ్రీఘ్ర మాహుయతాం విప్రాః సర్వజ్ఞా వేదపారగాః |

రురువు అట్లు పాముతోడి పగదీర్చుకొనుటకు సర్పములను హింసించెను. నీవు మాత్రము వైరము మాని వర్తింతువే! ఇపుడు నీ తండ్రి స్నానదానములులేక నంతరిక్షమున దిరుగుచున్నాడు. ఓ రాజా! పాముల నన్నింటిని చంపి నీ తండ్రి నుద్ధరింపుము. తండ్రికి ఇతరుల వలన కలిగిన అపకారము నెఱుగనివాడు బ్రతికియు చచ్చినవాడే. నరనాయకా! ఆ పాములను చంపనంత కాలము నీ తండ్రికి దుర్గతి పాయదు. నీ తండ్రి శత్రువును దలంచి అంబాయజ్ఞమను నామముతో సర్పయాగ మొనరింపుము. ఉత్తంకుని ఈ మాటలు విని జనమేజయుడు కన్నీరొలుక 'నే నభిమానవంతుడను. మందమతిని. పనికిమాలినవాడను. నా తండ్రి సర్పదష్టుడై ఘోరదుర్గతి బొందెను. కాన సర్పయాగ మొనరించి నా తండ్రి నుద్ధరింతును. జ్వాలలు గ్రక్కుచున్న యగ్నిలో పాములను వేల్తును, అని పలికి మంత్రులను రావించి వారి కిట్లనియెను: 'మంత్రాలారా! మీరు యాగ సంభారములు సిద్ధము సేయుడు. గంగాతీరమున యాగమునకు దిగినచోటు విప్రులచే గొలిపించి నిర్ణయింపుడు. అచట నూఱు గట్టిస్తంభములతో మనోహరముగ మండలము నిర్మింపజేయుడు. అందు శ్రేష్ఠమైన యజ్ఞ వేదిక నిర్మింపజేయుడు. యజ్ఞాంగముగ సర్పయాగము మహాఘనముగ సాగవలయును. అందు తక్షకుడు పశువుగ ఉత్తంకుడు హోతగా నుండవలయును. సత్వరమే సర్వజ్ఞులు వేదపారగులునగు బ్రాహ్మణోత్తముల నాహ్వానింపుడు.

సూతః : మంత్రిణస్తు తదా చక్రు ర్భూవవాక్యై ర్విచక్షణాః. 53

యజ్ఞస్య సర్వసంభారం వేదిం యజ్ఞస్య విస్తృతామ్‌ | హవనే వర్తమానే తు సర్పాణాం తక్షకో గతః. 54

ఇంద్రం ప్రతి భకార్తో%హం త్రాహి మా మితి చాబ్రవీత్‌ | భయభీతం సమాశ్వాస్య స్వాసనే సంనివేశ్య చ. 55

దదా వభయ మత్యర్థం నిర్భయో భవ పన్నగ | తమింద్రశరణం జ్ఞాత్వాముని ర్దత్వాభయం తథా. 56

ఉత్తంకో%హ్వయ దుద్విగ్నః సేంద్రం కృత్వా నిమంత్రణమ్‌ | స్మృతస్తదా తక్షకేణ యాయావరకులోద్భవః. 57

ఆస్తీకో నామ ధర్మాత్మా జరత్కారుసుతో మునిః | తత్రాగత్య మునే ర్బాల స్తుష్టావ జనమేజయమ్‌. 58

రాజా త మర్చయామాస దృష్ట్వా బాలం సుపండితమ్‌ | అర్చయిత్వా నృప స్తం తు ఛందయామాస వాంఛితైః. 59

స తు వవ్రే మహాభాగ యజ్ఞో%యం విరమత్వితి | సత్యబద్ధో నృప స్తేన ప్రార్థితశ్చ పున స్తథా. 60

హోమం నివర్తయామాస సర్పాణాం మునివాక్యతః | భారతం శ్రావయామాస వైశంపాయనవిస్తరాత్‌. 61

శ్రుత్వా%పి నృపతిః కామం న శాంతి ముభిజగ్మివాన్‌ | వ్యాసం పప్రచ్ఛ భూపాలో మమశాంతిః కథం భ##వేత్‌. 62

మనో%తిదహ్యతే కామం కిం కరోమి వదస్య మే | పితా మే దుర్భగసై#్యవ మృతః పార్థసుతాత్మజః. 63

క్షత్రియాణాం మహాభాగ సంగ్రామే మరణం వరమ్‌ | రణ వా మరణం వ్యాస! గృహే వా విధిపూర్వకమ్‌. 64

మరణం న పితు ర్మే%భూ దంతరిక్షే మృతో%వశః | శాంత్యుపాయం వదస్వాత్ర త్వం చ సత్యవతీసుతః. 65

యథా స్వర్గం వ్రజేదాశు పితా మే దుర్గతిం గతః.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే ఏకాదశోధ్యాయః.

అపుడు విచక్షణులగు మంత్రులు రాజు నాజ్ఞానుసార మొనరించిరి. బహువిధములైన యాగసంభారములతో యాగము ఆరంభమయ్యెను. సర్పహవనము జరుగుచుండగా తక్షకుడు భయార్తుడై బయలుదేరి ఇంద్రునికడ కరిగి తన్ను బ్రోవుమని వేడుకొనెను. ఇంద్రుడు తక్షకు నూరడించి తన గద్దియపై గూర్చుండబెట్టుకొని 'నాగేశ్వరా ! నిర్భయముగ నుండుము. నీ కభయ మిచ్చురున్నాను' అనెను. తక్షకు డింద్రు నాశ్రయించి యభయము బొందిన విషయ ముత్తంకుడు తెలిసికొని యుద్విగ్నుడై యింద్రునితోడి తక్షకుని వేల్చుచున్నానని నిమంత్రించెను. అట్టితఱి తక్షకుడు యాయావర కులోద్భవుడును జరత్కారు తనయుడునగు ఆస్తీకుని స్మరించగా నాబాలుడు జన్నము జరుగు చోటికేగుదెంచి జనమేజయుని స్తుతించి సంతుష్టుని చేసెను. రాజా పండితుడగు ఆస్తీకబాలుని చూచి యతని నర్చించి యతని వాంఛితములడుగగా బాలుడు 'మహాభాగా! ఇక నీ యజ్ఞము చాలింపుడు. ఇదే నా మనోవాంఛిత'మని పలికెను. సత్యబద్ధుడగు రాజతని ప్రార్థన మన్నించి సర్పయాగము చాలించెను. అపుడు వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతము వినిపించెను. అది వినినప్పటికిని రాజునకు శాంతి చేకూరలేదు. అతడు వ్యాసమహర్షిని మునివరా! దిగులు నా మనస్సును దహించివేయుచున్నది. నాకు మనశ్శాంతి యెట్లు చేకూరునో - ఇపుడు నా కర్తవ్యమేమో తెలుపుము. దౌర్భాగ్యమున నా తండ్రి సర్పహతుడయ్యెను. క్షత్త్రియులకు సమరమున మరణము శ్రేష్ఠమైనది. రణమందైనను ఇంటియందైనను విధిపూర్వకముగ సహజముగ దైన్యములేని చావు చచ్చు టుత్తతము గదా! కాని, నా తండ్రి చా వావిధముగ జరుగలేదు. అత డంతరిక్షమున మరణించెను. కాన నతని యాత్మకు శాంతి గల్గు నుపాయము దెలుపుము. నా తండ్రి దుర్గతినుండి స్వర్గమున కేగునట్లు చేయుము' అని వేడెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందు పదునొకండవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters