Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

సూతః : ప్రతీపే%థ దివం యాతే శంతనుః సత్య విక్రమః| బభూవమృగయాశీలో నిఘ్నన్వ్యాఘ్రాన్మృగాన్నృపః 1

స కదాచి ద్వనే ఘోరే గంగాతీరే చర న్నృపః | దదర్శ మృగశాబాక్షీం సుందరీం చారుభూషణామ్‌. 2

దృష్ట్వా తావం నృపతి ర్మగ్నః పిత్రోక్తేయం వరాననా | రూప¸°వన సంపన్నా సాక్షా ల్లక్ష్మీ రివాపరా. 3

పిబ న్ముఖాంబుజం తస్యా న తృప్తి మగమ న్నృపః | హృష్టరోమా%భవ త్తత్ర వ్యాప్తచిత్త ఇవానఘః. 4

మహాభిషం సా%పి మత్వా ప్రేమయుక్తా బభూవ హ| కించి న్మందస్మితం కృత్వా తస్థా వగ్రే నృపస్య చ 5

వీక్ష్య తా మసితాపాంగీం రాజా ప్రీతమనా భృశమ్‌ | ఉవాచ మధురం వాక్యం సాంత్వయన్‌ శ్లక్షణయా గిరా. 6

దేవీ వాత్వం చ వామోరు మానుషీ నా వరాననే| గంధర్వీ వా%థ యక్షీవా నాగకన్యా%ప్సరా%పివా. 7

యా%సి కా%సి వరోరోహా భార్య మే భవ సుందరి| ప్రేమయుక్తా స్మితైవత్వం ధర్మపత్నీ భవాద్యమే. 8

నాలుగవ అధ్యాయము

గాంగేయుని జన్మవృత్తాంతము

సూతు డిట్లనియెను : ఆ ప్రకారముగ ప్రతీపరాజు దివికేగిన పిమ్మట సత్యవిక్రముడగు శంతనుడు మృగవ్యాఘ్రముల బరిమార్చుచు మృగయాశీలుడయ్యెను. ఒకనాడారాజడవిలో దిరుగుచు మృగశాబకలోచన - మనోహరాభరణ యగు జవ్వనిని గాంచెను. రాజా రెండవ లక్ష్మియోయన రూప¸°వనముల నలరారు జవరాలిని గాంచి యానాడు తన తండ్రి పేర్కొనిన పడతి యామెయే కాబోలునని తలంచెను. ఆ పద్మాక్షిలోని ముఖకాంతులెంత చూచినను రాజునకు తనివిదీరుటలేదు. రాజు మది యాకామిని యెడదలో జిక్కుకొనెను. అతనిహృది సమ్మదము కలిగించు కామనలతో వ్యాప్తమయ్యెను. ఆ గంగానదియు నానాటి మహాభిషుడీ రాజేయని తెలిసికొని యతని విషయమున ప్రేమానురాగతరంగితయై చిఱునగవుతో రాజు నెదుట నిలిచెను. రాజా యసితాపాంగిని చూచి మిగుల ప్రీతినొందిన చిత్తముతో లాలించి కమ్మని పలుకులతో నామె కిట్లు మధురవాక్యములు పలికెను : నీవు దేవతవో! గంధర్వ యక్షనాగకన్యలలో నెవ్వతెవో! కాక - మానిసివో! నీవెవ్వరవైన నౌదుగాక! నాకు నీపై ననురాగము కల్గినది. నాకు ధర్మపత్నివి గమ్ము.

సూతః : రాజా తాం నాభిజానాతి గంగేయ మితి నిశ్చితమ్‌ | మహాభిషం సముత్పన్నం నృపం జానాతి జాహ్నవీ. 9

పూర్వ ప్రేమసమాయోగా చ్ఛ్రుత్వా వాచం నృపస్య తామ్‌| ఉవాచ నారీ రాజానం స్మితపూర్వ మిదం వచః 10

స్త్య్రువాచ: జానామి త్వాం నృపశ్రేష్ఠ ప్రతీపతనయం శుభమ్‌| కానవాంఛతిచార్వంగీభావిత్వాత్సదృశం పతిమ్‌. 11

వాగ్బంధేన నృపశ్రేష్ఠ చరిష్యామి పతింకిల | శృణు మే సమయం రాజన్వృణోమి త్వాం నృపోత్తమ! 12

యచ్చ కుర్యా మహం కార్యం శుభంవా యదివా%శుభమ్‌| ననిషేధ్యాత్వ యారాజన్న వక్త్యం తథా%ప్రియమ్‌. 13

యదా చ త్వం నృపశ్రేష్ఠ న కరిష్యసి మే వచః| తదా ముక్త్వా గమిష్యామి యథేష్టం దేశం మారిష. 14

స్మృతా జన్మ వసూనాం సా ప్రార్థనాపూర్వకం హృది| మహాభిషస్య ప్రేమార్థం విచింత్యైవ హి జాహ్నవీ. 15

తథేత్యుక్తా%థ సా దేవీ చకార నృపతిం పతిమ్‌| ఏవం వృతా నృపేనాథ గంగా మానుషరూపిణీ. 16

నృపస్య మందిరం ప్రాప్తా సుభగా వరవర్ణినీ| నృపతి స్తాం సమాసాద్య చిక్రీడోపవనే శుభే. 17

సా%పి తం రమయామాస భావజ్ఞా వై వరాంగనా| న బుబోధ నృపః క్రీడ న్గతా న్వర్షగణా నథ. 18

స త యా మృగశాబాక్ష్యా శచ్యా శతక్రతు ర్యథా| సా సర్వగుణ సంపన్నా సో%పి కామవిచక్షణః 19

రేమాతే మందిరే దివ్యే రమానారాయణా వివ| ఏవం చ్ఛతి కాఏల సా దధార నృపతే స్తదా. 20

సూతు డిట్లనియెను : ఈమెయే యానాటి గంగయని రాజెఱుగడుగాని నాటి మహాభిషుడితడేయని గంగకు దెలియును. రాజు మాటలు విని వెనుకటి ప్రేమ సమాయోగము దలంచి చిరునగవుతో గంగాదేవి రాజున కిట్లనెను : నరపతీ! నీవు ప్రతీపుని కుమారుడవని నేనెఱుంగుదును. నీవంటి నరపతిని తన పతిగ నే యందగత్తె గోరుకొనదు? రాజా! నా వాగ్బంధముననే నిన్ను పతిగ నొనర్చుకొనగలను. కాని నిన్ను వరించుటకు నాదొక ప్రతిన గలదు. వినుము. శుభాశుభములలో నేనేది చేసినను నీవు గాదనగూడదు. నాకప్రియముగ బలుకగూడదు. నా యీ ప్రతినను తిరస్కరించిననాడు నేను నిన్ను విడనాడి స్వేచ్ఛగ నెటకే నేగుదును. అని గంగాదేవి వసువుల రాబోవు జన్మలను మహాభిషుని ప్రేమప్రార్థనను తన యెడదలో దలచె. రాజామె మాట కామోదము వెలిపుచ్చెను. ఆమెయు రాజునటులే పతిగ భావించెను. ఇట్లు గంగాదేవి మనుష్య యువతి రూపమున ఆ శంతనునకు పత్ని అయ్యెను. ఆ వరవర్ణిని రాజువెంట రాజభవనము కేగెను. ఆ రాజుకూడ ఉద్యానవనములందామెతో కూడి విహరింపసాగెను. ఆ సుందరియు అతని భావమెరిగి అతని నానంద పెట్టుచుండగా ఎన్ని ఏండ్లు గడచినదియు ఎరుగక ఆ రాజేంద్రుడా హరిణాక్షినిగూడి యింద్రాణితోడి యింద్రుని పగిది కాలము గడుపుచుండెను. సర్వగుణసంపన్నయగు నామెతో కామతత్త్వ మెరిగిన ఆ రాజు లక్ష్మిని గూడిన నారాయణుని విధముగ దివ్య మందిరాలలో నానందమందెను.

గర్భం గంగా వసుం పుత్రం సుషువే చారులోచనా| జాతమాత్రం సుతం వారి చిక్షేపైవం ద్వితీయకే. 21

తృతీయ%థ చతుర్థేథ పంచమే షష్ఠ ఏవ చ| సప్తమే వా హతే పుత్రే రాజా చింతాపరో%భవత్‌. 22

కిం కరోమ్యద్య వంశో మే కథం స్యాత్సుస్థిరో భువి| సప్తపుత్రా హతా నూన మనయా పాపరూపయా. 23

నివారయామి యది మాం త్యక్త్వా యాస్యతి సర్వదా| అష్టమో%యం సుసంప్రాప్తో గర్భో మే మనసేప్సితః 24

న వారమామి చేదద్య సర్వథేయం జలే క్షిపేత్‌| భవితా వన వా చాగ్రే సంశయో%యం మమాద్భుతః 25

సంభ##వే%పి చ దుష్టేయం రక్షయేద్వా న రక్షయేత్‌| ఏవం సంశయితే కార్యే కిం కర్తవ్యం మాయా%ధునా. 26

వంశస్య రక్షణార్థం హియత్నః కార్యః పరో మయా! తతః కాలే యదా జాతః పుత్రో%య మష్టమో వసుః 27

మునే ర్యేన హృతా ధేనుర్నందినీ స్త్రీజితేన హి| తం దృష్ట్యా నృపతిః పుత్రం తా మువాచ పత న్పదే. 28

దాసో%స్మి తవ తన్వంగి ప్రార్థయామి శుచిస్మితే| పుత్ర మేకం పుషా మ్యద్య దేహి జీవంత మద్య హి. 29

హింసితాః సప్త పుత్రా మే కరభోరు త్వయా శుభాః| అష్టమం రక్ష సుశ్రోణి పతామి తవ పాదయోః. 30

అన్యద్వై ప్రార్థితం తే%ద్య దదామ్యథ చ దుర్లభమ్‌| వంశో మే రక్షణీయో%ద్య త్వయా పరమశోభ##నే. 31

అపుత్రస్య గతి ర్నాస్తి స్వర్గే వేదవిదో విదుః| తస్మాదద్య వరారోహే ప్రార్థయా మ్యష్టమం సుతమ్‌. 32

ఆ విధముగ గొంతకాలము గడచినంతలో రాజువలన ఆ చారులోచనయగు గంగ గర్భము దాల్చి వసువును పుత్త్రునిగ బడసినది. ఆమె యతనిని పుట్టినతోడనే గంగలో పడవేసినది. అట్లే రెండవ కొడుకును జేసినది. అట్లు మూడవ, నాలుగవ, యైదవ, యాఱవ కొడుకులును గంగపాలైరి. తుద కేడవ కొడుకుగూడ మరణించెను. రాజుపుడిటుబోరున పలవరించెను. నేనిపు డేమి చేతును? ఇట నా వంశము స్థిరముగ నుండుటెట్లు? ఈ పాపాత్మురాలు చేజేతుల తన యేడుగురు కొడుకులను నీట గలిపినది. ఒకవేళ నన్నీమె వదలి వెళ్ళిన వెళ్ళుగాక. నాకు ప్రియమైన యీ యెనిమిదవ పుత్త్రునినైన చావునుండి వారించగలను. నేనిప్పుడడ్డుపెట్టనిచో నీమె యెనిమిదవ వానిని గూడ మరల నీటముంచును. నాకిక ముందు సంతు కలుగునో లేదోయను సందేహము గల్గుచున్నది. ఒకవేళ పుట్టినప్పటికి నీ దుష్టురా లతనిగూడ మననిచ్చునోలేదో? ఇట్టి సంశయములో నేనేమి చేయవలయునో నాకే తోచుటలేదు. కనుక వంశరక్షణ దొరకొనుట నా ప్రస్తుత కర్తవ్యవ్య'మని రాజనుకొనునంతలో నెనిమిదవ వసువష్టమ పుత్త్రుడుగ జన్మించెను. తొలుత నెవ్వడు తన భార్య మాట కాదనలేక నందినీ ధేను నపహరించెనో యతడే నే డష్టమపుత్త్రుడుగ నుద్భవించెను. అదిగని రాజు తన భార్య పాదాలు పట్టుకొని యిట్టుల పలవించెను : నేను నీ దాసుడను. ఈ యొక్క కొడుకునైన వదలిపెట్టుము. ఈతని రక్షణ భారము నేను జూచుకొందును. నిన్నిదే ప్రార్థించుచున్నాను. నా కడుపు తఱుగుకొని పోవునట్లు పండ్లవంటి యేడుగురు ముద్దుబిడ్డలను నీ పొట్టను పెట్టుకొంటివి. ఈ యెనిమిదవవాని నొక్కనినైన బ్రతకనిమ్ము. నీ పాదాలు సాక్షిగ వేడుకొనుచున్నాను. నీవేదేని కోరుకొమ్ము. ఎంత దుర్లభ##మైనదైనను నా వంశ మికనైన నిలువబెట్టుము. అపుత్త్రకులకు స్వర్గగతులు లేవని వేదవిదులు వక్కాణించి పల్కుదురు. కాన నిపు డెనిమిదవ కొడుకును బ్రతుకనిమ్మని వేడుకొనుచున్నాను.

ఇత్యుక్తా%పి గృహీత్వా తం యదా గంతుం సముత్సుకా| తదాపి కుపితో రాజా తా మువాచాతిదుఃఃతః 33

పాపిష్ఠే కింకరో మ్యద్య నిరయా న్న బిభేషి కిమ్‌| కా%సి పాపకరాణాం త్వం పుత్రీ పాపరతా సదా. 34

యథే చ్ఛం గచ్ఛ వా తిష్ఠ పుత్రో మే స్థీయతా మిహ| కిం కరోమి త్వయా పాపే వంశాంతకరయా%నయా. 35

ఏవం వదతి భూపాతే సా గృహీత్వా సుతం శిశుమ్‌| గచ్ఛంతీ వచనం కోపసంయుక్తా త మువాచహ. 36

పుత్రకామా సుతం త్వేనం పాలయామి వనే గతా| సమయో మే గమిష్యామి వచనం హ్యన్యథా కృతమ్‌. 37

గంగాం మాం వై విజానీహి దేవకార్యార్థ మాగతామ్‌| వసవస్తు పురా శప్తా వషిస్ఠేన మహాత్మనా. 3

ప్రజంతు మానుషీం యోనిం స్థితాం చింతాతురాస్తు మామ్‌| దృష్ట్వేదం ప్రార్థయామాసుర్జననీ నో భవానఘే. 39

తేభ్యో దత్వా వరంజాతా పత్నీ తే నృపసత్తమ| దేవకార్యార్థ సిద్ధ్యర్థం జానీహి సంభవో మమ. 40

సప్త తే వసవః పుత్రా ముక్తాఃశాపా దృషేస్తుతే | కియంతం కాల మేకో%యం తవ పుత్రో భవిష్యతి. 41

గంగాదత్త మిమం పుత్రం గృహాణ శంతనో స్వయమ్‌ వసుదేవం విదిత్వైనం సుఖం భుంక్ష్వ సుతోద్భవమ్‌. 42

గంగేయో%యం మహాభాగః భవిష్యతి బలాధికః| అద్య తత్ర నయామ్యేనం యత్రత్వం వై మయావృతః 43

యాస్యామి ¸°వన ప్రాప్తం పాలయిత్వా మహీపతే| న మాతృరహితః పుత్రోజివే న్న చ సుఖీ భవత్‌. 44

ఇత్యుక్త్వాంతర్దధే గంగా తం గృహీత్వా చ బాలకమ్‌| రాజా చాతీవ దుఃఖార్తః సంస్థితో నిజమందిరే. 45

ఇది విన్నప్పటికిని గంగ బాలునిగొనిపోవ నుంకించుచుండెను. రాజపుడు గుండె చెఱువుగాగ పట్టరాని కోపమున నామెకిట్లు పలికెను. ఓసీ! పాపిష్ఠురాలా! నీకు నరకమన్న జంకులేదు. నీవే పాపాత్ముని కడుపు చెట్టపుట్టితివో గదా! నేనిపుడేమి చేతును? నీవు వంశఘాతుకురాలవు. ఇంక నీవుండిన నుండుము, పోయిన నీ యిచ్చవచ్చు తావునకు పొమ్ము. కాని నా పుత్త్రుడు మాత్రమిక్కడనే యుండగలడు. నీతో నాకికనేమి పని? అని గుండె ద్రవించునట్లు రాజు పలికెను. శిశువును గొంపోవుచు గంగ కోపమున నతకిట్లు పలికెను. పుత్రులన్న నా మనసు గూడ పడిచచ్చునదియే సుమా! నాకును గొంచెము మెత్తని గుండె కలదు. ఈ బాలునిగొని వనములందితనిని బోషింతును. నీ మాట నిలుపుకొనలేదు. నీ చేసిన శపథము భగ్నమైనది. కాన నిన్నిదే వదలి తరలుచున్నదానను. నన్ను గంగానదిగ నెఱుంగుము. దేవకార్యర్థ మరుగుదెంచితిని. పూర్వము వసువులు వసిష్ఠ మహామునిచే మనుజయోని బుట్టుడని శపింపబడిరి. వారు నన్నుగాంచి చింతాపరులై నీవు మాకు తల్లివి గమ్మని వేడుకొనిరి. నేను వారికటులే వరమిచ్చితిని. అందుచే నీకిల్లాలనైతిని. నా సంభవము దేవకార్యార్థ సిద్ధికని తెలిసికొనుము. ఆ యేడుగురు వసువులు ముని శాపమున మనకు పుత్త్రులై చనిపోయిరి. శాపవిముక్తి బడసిరి. ఈ బాలుడు మాత్రము కొంతకాలమిచటనే వసింపగలడు. గంగాదత్తుడగు నీ సుతుని గనుము. ఆ వసువు నీ సుతుడుగ జన్మించెనని తెలిసికొనుము. పుత్రోత్సాహ మనుభవింపుము. మహానుభావా! ఇతడు గాంగేయ నామమును విఖ్యాతి గడించ గలడు. మహాబలశాలి కాగలడు. నీవు తొల్లి నన్ను వరించిన చోటి కితనిని గొనిపోవుదును. ఇతడు యువకుడైన పిమ్మట నితనిని నీకప్పగింపగలను. తల్లిలేని బిడ్డ డెప్పుడైన సుఖముగ జీవింపజాలడు గదా!' అని గంగ యిత్తెఱుంగున బలికి యా బాలునిగొని యంతర్థానమందెను. శంతనుడు దుఃఖార్తుడై తన భవనమున కేగి వసించుచుండెను.

భార్యావిరహజం దుఃఖం తథా పుత్రస్య చాద్భుతమ్‌| సర్వదా చింతయ న్నాస్తే రాజ్యం కుర్వ న్మహీపతిః 46

ఏవం గచ్ఛతి కాలే%థ నృపతి ర్మృగయాం గతః| నిఘ్న స్మృగగణా న్బాణౖ ర్మహిషా న్సూకరా నపి. 47

గంగాతీర మనుప్రాప్తః స రాజా శంతను స్తదా| నదీం స్తోక జలాం దృష్ట్వా విస్మితః స మహీపతిః 48

తత్రా పశ్చ త్కుమారం తం ముంచంతం విశిఖా న్బహూన్‌| ఆకృష్య చ మహాచాపం క్రీడంతం సరితస్తటే. 49

తం వీక్ష్య విస్మితో రాజా నస్మ జానాతి కించన | నోపలోభే స్మృతిం భూపః పుత్రో%యం మమ వా న వా. 50

దృష్ట్వా%ప్యమానుషం కర్మ బాణషు లఘుహస్తతామ్‌| విద్యాం వా%ప్రతిమాం రూపం తస్యవైస్మర సన్నిభమ్‌. 51

పప్రచ్ఛ విస్మితో రాజా కస్య పుత్రో%సి చానఘ | నో వాచ కించి ద్వీరో%సౌ ముంచన్‌ శిలీముఖా నథ. 52

అంతర్థానం గతః సో%థ రాజా చింతా తురో%భవత్‌| కో%యం మమ సుతో బాలఃకిం కరోమి వ్రజామికమ్‌. 53

ఆ రాజు తన భార్యాపుత్రుల వియోగభరమున లోలోన కుములుచు రాజ్యపాలన సాగించుచుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట శంతను రాజొకనాడు వేటకేగి మహిష సూకరములను మృగగణములను నురుమాడుచు గంగాతీరమేగెను. అట గంగ చిన్నచిన్న పాయలుగ పారుచుండెను. అదిగని రాజు విస్మయమందెను. అతడా నదీతీరమందు నారి సారించుచు బాణములు వదలుచున్న యొక సుకుమార కుమారుని గాంచెను. కాంచి రాజబ్బురపడి తన్ను తానే మఱచిపోయెను. ఆ బాలుడు తన-నాటి పుత్త్రుడగునో కాడో యెఱుగలేకుండెను. ఆ బాలుని బాణ ప్రయోగమందలి హస్తలాఘవము సాటిలేని విలువిద్య మానవాతీతశక్తి మదనుని బోలు రూపము ఇన్నియును గన్నారగని రాజు విస్తుపోయెను. రాజతనితో నీవెవరి పుత్త్రుడ'వని యడిగెను. అమ్ములు వదలుచు నాడుకొను బాలుడేమియును పలుకకయే వెంటనే యదృశ్యుడయ్యెను. ఆ బాలుని వాలకము చూచి యతడచ్ఛముగ నా పుత్త్రునివలెనే యున్నాడు. ఇపుడేమి సేతును? ఎటకేగుదును! అని చింతాతురుడయ్యెను?

గంగాం తుష్టావ భూపాలః స్థిత స్తత్ర సమాహితః| దర్శనం సా దదౌ చాథ చారురూపా యథా పురా. 54

దృష్ట్వాతాం చారుసర్వాంగీం బభాషే నృపతిఃస్వయమ్‌| కో%యం గంగే గతో బాలో మమత్వం దర్శయాధునా. 55

గంగోవాచః పుత్రో%యం తవ రాజేంద్రరక్షితశ్చాష్టమోవసుః| దదామిత వహస్తేతు గంగేయో%యం మహాతపాః 56

కీర్తికర్తా కులస్యాస్య భవితా తవ సువ్రతః పాఠిత స్త్వఃలా న్వేదా న్థనుర్వేదం చ శాశ్వతమ్‌. 57

వశిష్ఠస్యాశ్రమే దివ్యే సంస్థితో%యం సుత స్తవ| సర్వ విద్యావిధానజ్ఞః సర్వార్థకుశలః శుచిః. 58

యద్వేద జామదగ్న్యో%సౌ తద్వేదాయం సుత స్తవ| గృహాణ గచ్చ రాజేంద్ర| సుఖీ భవ నరాధిప. 59

ఇత్యుక్త్వాంతర్దధే గంగా దత్వా పుత్రం నృపాయ వై| నృపతిస్తు ముదా యుక్తో బభూవాతిసుఖాన్వితః 60

సమాలింగ్య సుతం రాజా సమాఘ్రాయ చ మస్తకమ్‌| సమారోప్య రథే పుత్రం స్వపురం స ప్రచక్రమే. 61

అంత శంతనుడు గంగను స్తుతించి ప్రసన్నురాలిని జేసికొనెను. ఆ చారు స్వరూపిణి తొంటిరూపమున నతినికి దర్శన మొసంగెను. తన యంగకాంతు లెసగంగ వెలుంగుచున్న గంగను గని రాజామె కిట్లు పలికెను: 'ఓ గంగా! ఈతడెవడు? నా బాలుడెక్కడ? నా బాలుని నాకు వేగమే చూపింపుము. గంగ యిట్లనియెను: 'ఓ రాజేంద్రా! ఇదిగో! ఇటడష్టమ వసువగు నీ పుత్త్రుడు. ఇత డింతకాలము నాచేత పోషింపబడెను. ఇపు డితనిని నీ చేతిలో పెట్టుచున్నాను. ఇతడే గాంగేయుడు, మహా తపస్వి. ఇతడే నీ కులమునకు వన్నెలు దెచ్చువాడగును. ఇతడెల్ల వేదములను ధనుర్వేదమును చక్కగ చదివెను. ఇతడింత కాలము వసిష్ఠునాశ్రమమున సకల విద్యాబుద్ధులు నేర్చెను. సర్వార్థములందు కుశలుడు. శుచి యయ్యెను. పరశురాము డెఱింగిన విద్యలెల్ల నితడెఱింగెను. ఇంక నీవితనిని గ్రహించి సుఖముగ నేగుము.' అని పలికి రాజునకు పుత్త్రు నొసంగి యంతర్హితయైనది. ఆ శంతనుడును ప్రమోదభరితుడై సుఖముగ నుండెను. ఆ శంతనుడు తన కొడుకు నాలింగనము చేసికొని శిరంబు మూచూచి యరదంబుపై నిడికొని తన పురమునకు బయలు దేరెను.

గత్వా గజాహ్వయం రాజా చకారోత్సవ ముత్తమమ్‌| దైవజ్ఞం చ సమాహూయ పప్రచ్ఛ చ శుభం దినమ్‌. 62

సమాహృత్య ప్రజాః సర్వాః సచివా న్సర్వశః శుభాన్‌ | ¸°వరాజ్యే%థ గాంగేయం స్థాపయామాస పార్థివః. 63

కృత్వా తం యువరాజానం పుత్రం సర్వగుణాన్వితమ్‌| సుఖ మాస స ధర్మాత్మా న సస్మార చ జాహ్నవీమ్‌. 64

సూతః : ఏత ద్వః కథితం సర్వం కారణం వసుశాపజమ్‌| గాంగేయస్య తథోత్పత్తిం జాహ్నవ్యాః సంభవం తథా 65

గంగావతరణం పుణ్యం వసూనాం సంభవం తథా| యః శృణోతి నరః పాపా న్ముచ్యతే నాత్ర సంశయః 66

పుణ్యం పవిత్ర మాఖ్యానం కథితం మునిసత్తమాః | మయా యథాశ్రుతం వ్యాసా త్పురాణం వేద సమ్మితమ్‌. 67

శ్రీమద్భాగవతం పుణ్యం నానాఖ్యాన కథాన్వితమ్‌| ద్వైపాయనముఖోద్భూతం పంచలక్షణసంయుతమ్‌. 68

శృణ్వతాం సర్వపాపఘ్నం శుభదం సుఖదం తథా| ఇతహాస మిమం పుణ్యం కీర్తితం మునిసత్తమాః. 69

ఇది దేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే చతుర్థో%ధ్యాయః.

రాజు కరిపురికరిగి ఘనముగ పుత్రోత్సవ మొనరించెను. దైవజ్ఞులను రావించి శుభముహూర్తమడిగి రాజు ప్రకృతి జనుల నెల్లర బిలిపించి గాంగేయుని యువరాజు జేసెను. సకల సద్గుణోపేతుడగు పుత్త్రుని యువరాజు జేసి రాజు నిశ్చింతముగ నుండెను. గంగను గూడ మఱచిపోయెను. సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ వసువుల శాపకారణముగ గంగా సంభవము గాంగేయుని జన్మవృత్తాంతము పావన గంగావరతణము వసువుల సంభవము జరిగినవి. అన్నియును మీకు విశదపరచితిని. ఈ పుణ్యకథలు వినిన పుణ్యాత్ముడు నిస్సంశయముగ కలుషజాలము నుండి విముక్తి గాంచును. ఇంతవరకు మీకు వినిపించిన దానిని నేను మున్ను వ్యాసుని వలన వింటిని. ఇది బ్రహ్మ సమ్మితమగు శ్రీదేవీ పురాణమందలిది. ఆ పరమ పవిత్ర దేవీభాగవతము మహిమోజ్జ్వలములైన నానాఖ్యానక కథలతో పుణ్యమై పంచలక్షణ లక్షితమై వ్యాసుని ముఖకమలము నుండి వెడలి సుగుణామృత రసభరితమై యలరారుచున్నది. ఈ పుణ్యతహాసము పరమశ్రద్ధతో వినువారి దురితములు దూరమొనర్చును. కళ్యాణ సుఖము లొడగూర్చును అని యీ దేవీపురాణము లోకములందు ప్రఖ్యాతి జెందినది.

ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందు చతుర్థాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters