Sri Devi Bhagavatam-1    Chapters   

అథ షోఢశోధ్యాయః

వ్యాసః : దృష్ట్వా తం విస్మితం దేవం శయానం వటపత్రకే | ఉవాచ సస్మితం వాక్యం విష్ణో ! కిం విస్మితో హ్యసి. 1

మహాశక్త్యాః ప్రభావేణ త్వం మాం విస్మృతవా న్పురా | ప్రభ##వే ప్రళ##యే జాతే భూత్వా పునఃపునః 2

నిర్గుణా సా పరా శక్తిః సుగుణ స్త్వం తథా%వ్యహమ్‌ | సాత్త్వికీ కిల యా శక్తి స్తాంశక్తిం విద్ధి మామికామ్‌ 3

త్వ న్నాభికమలా ద్బ్రహ్మా భవిష్యతి ప్రజాపతిః | స కర్తా సర్వలోకస్య రజోగుణ సమన్వితః. 4

స తదా తప అస్థాయ ప్రాప్య శక్తి మనుత్తమామ్‌ | రజసా రక్తవర్ణం చ కరిష్యతి జగత్త్రయమ్‌ 5

సుగుణా న్పంచభూతాంశ్చ సముత్పాద్య మహామతిః | ఇంద్రియా ణీంద్రియేశాంశ్చ మనఃపుర్వా న్సమంతతః 6

కరిష్యతి తతః సర్గం తేన కర్తా స ఉచ్యతే | విశ్వస్యాస్య మహాభాగ త్వం వై పాలయితా తథా 7

త ద్భ్రువో ర్మధ్యదేశాచ్చ క్రోధా ద్రుద్రో భవిష్యతి | తప ః కృత్వా మహాఘోరం ప్రాప్య శక్తింతు తామసీమ్‌ 8

కల్పాంతే%సో పి సంహర్తా భవిష్యతి మహామతే | తేనాహం త్వా ముపాయాతా సాత్వికీం త్వమవేహి మామ్‌ 9

స్థాస్యే%హం త్వ త్సమీపస్థా సదా%హం మధుసూదన | హృదయే తే కృతావాసా భవామి సతతం కిల10

పదునారవ అధ్యాయము

వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

వ్యాసుడిట్లనియె : ఈ ప్రకారముగ క్షీరసాగరశయనుడు వటపత్రశాయి పరమాశ్చర్యమందుచుండ శ్రీదేవి సుధలుచిందు చిరునవ్వు వెన్నెలలతో విష్ణుని గాంచుచు ననియెను : 'నీకిదంతయును వింతగ నున్నదా? నీవు మహాశక్తి ప్రభావమున మున్ను నన్ను విస్మరించితివి. ప్రళయము గడచినప్పుడెల్ల నీవు మరల మరల నుద్భవించుచుందువు. ఆ పరామూలశక్తి నిర్గుణురాలు. నీవును నేనును సగుణులము. నన్ను సాత్వికశక్తిగ నెఱుంగుము. నీ నాభికమలమునందుండి ప్రజాపతియగు బ్రహ్మ యుద్భవించగలడు. అతడు రజోగుణముతో నెల్లలోకములు మరల సృజించును. అతడంతట నుగ్రతవ మొనర్చి యుత్తమ రాజసశక్తిని బడసి రజోరాగప్రభావమున ముల్లోకములను రజోరాగముతో నింపివేయును. బ్రహ్మ త్రిగుణమయములగు పంచభూతముల నుత్పత్తిచేయును. ఆ పిదప నింద్రియములను ఇంద్రియాధిష్ఠాన దేవతలను మనస్సును సృజించును. ఈ విధముగ విధి సృష్టిరచన పూర్వమువలెనే కొనసాగించును. కావుననే బ్రహ్మ సృష్టికర్త యనంబరగును. ఓ మహాశక్తీ! విష్ణూ! ఈ సకల విశ్వమునకు నీవే పరిపాలకుడవు. నీ కన్బొమల మధ్యనుండి కోపకారణముగ రుద్రు డావిర్భవించును. అతడు మహోగ్రతపమొనర్చి తామసశక్తిని వశము చేసికొనును. ఆ రుద్రుడే కల్పాంతమున సర్వమును పొలియజేయును. నీ సన్నిధానమున కరుగుదెంచిన నన్ను సాత్త్వికశక్తిగ నెఱుగుము. మధుసూదనా! నేను పెన్నిధివైన నీ సన్నిధి యందే యుందును. నీ హృదయకమలమందే యిల్లు కట్టుకొని నిముసమైన నినుబాయక నివసింతును.

విష్ణుః : శ్లోక స్యార్థం మయా పూర్వం శ్రుతం దేవి | స్ఫుటాక్షరమ్‌| తత్కేనోక్తంవరారో హేరహస్యంపరమంశివమ్‌ 11

త న్మే బ్రూహి వరారో హే సంశయో%యం వరాననే | నిర్ధనో హి యథా ద్రవ్యం తత్స్మరామి పునఃపునః 12

వ్యాసః : విష్ణో స్తద్వచనం శ్రుత్వా మహాలక్ష్మీః స్మితాననా | ఉవాచ పరయా ప్రీత్యా వచనం చారుహాసినీ 13

మహాలక్ష్మీః: శృణుశౌరే వచో మహ్యంసగుణా%హం చతుర్భుజా | మాంజానాసినజానాసినిర్గుణాంసగుణాలయామ్‌ 14

త్వం జానీహి మహాభాగ తయఃతత్ప్రకటీకృతమ్‌ | పుణ్యం భాగవతం విద్ధి వేదసారం శుభావహమ్‌ 15

కృపాం చ మహతీం మన్యే దేవ్యాః శత్రునిషూదన | యయా ప్రోక్తం వరం గుహ్యం హితాయ తవ సువ్రత | 16

రక్షణీయం సదా చిత్తే న విస్మార్యం కదా చన | సారం సా సర్వశాస్త్రాణాం మహావిద్యాప్రకాశితమ్‌ 17

నాతః పరం వేదితవ్యం వర్తతే భువనత్రయే | ప్రియో %సి ఖలు దేవ్యాస్త్యం తేన తే వ్యాహృతం వచః. 18

విష్ణువిట్లనియె : 'నేను మునుపు చమత్కారముగొల్పు శబ్దార్థములుగల శ్లోకార్థము వింటిని. అది పరమమై శివవై రహస్యమై రస్యమై యలరుచున్నది. ఆ వాక్కునెవరు వక్కాణించిరో తెలిపి నా యీ సందియము తొలగింపుము. నిఱుపేద ధనముకొఱకు నిరంతరముగ చింతించుచుండునట్లు నేనా శ్లోకార్థమందలి గమ్యార్థమును మాటిమాటికి సంస్మరించుచున్నాను. వ్యాసుడిట్లనియె: విష్ణుని యాపలుకు లాలకించి చారుహాసినియగు నిత్యకల్యాణి పరమప్రీతితో విరిసిన లేనగవుతో హరికిట్లనియెను: 'శౌరీ! నన్ను చతుర్భుజగ నిర్గుణగ నెఱుంగుము. నేను సగుణ నిర్గుణములుగల దాననని నీకు దెలియదా? ఆ శ్లోకార్థ మా మహాశక్తిది. నీవా మూలశక్తినే నమ్ముము. ఆ యద్భుతశక్తిచేతనే శుభకరము వేదసారమునగు పుణ్యపురాణము వెలసినదని తెలిసికొనుము. ఆ కరుణామయియగు దేవికి నీపై నెక్కడలేని వాత్సల్యము గలదని భావింతును. ఆమెయే నీ యోగక్షేమములు చూచు తల్లి. కావుననే యామె నీకా పరమరహస్యమైన వాక్యము వినిపించినది. దానిని నీ యెడదలో నిల్పుకొని యెన్నడును మరువకుము. ఆ మహావిద్యా స్వరూపిణి నీకు సర్వశాస్త్రరసాయన మెఱుకపఱచినదని యెఱుగుము. ఈ భువనత్రయమందును దానిన మించి గ్రహించవలసినది మరొండులేదు. నీవన్న నామె కెంతయో యిష్టము. కనుకనే యాయె నీకా దివ్యవాక్కు వినిచెను.''

వ్యాసః : ఇతి శ్రుత్వా వచో దేవ్యాః మహాలక్ష్మ్యాశ్చతుర్భుజః |దధారహృదయే నిత్యంమత్వామంత్రమనుత్తమమ్‌ 19

కాలేన కియతా తత్ర తన్నాభికమలోద్భవః | బ్రహ్మా దైత్యభయాత్ర స్తో జగామ వరణం హరేః 20

తతః కృత్వా మహాయుద్ధం హత్వా తౌ మధుకైటభౌ | జజాప భగవా న్విష్ణుః శ్లోకార్ధం విశదాక్షరమ్‌ 21

జపంతం వాసుదేవం చ దృష్ట్వా దేవః ప్రజాపతిః | పప్రచ్ఛ పరమప్రీతిః పంకజః కమలాపతిమ్‌ 22

కిం త్వం జపసి దేవేశ త్వత్తః కో%వ్యధికో%స్తి వై | య త్స్కృత్వా పుండరీకాక్ష ప్రీతో%సి జగదీశ్వర 23

హరిః: మయి త్వయి చ యా శక్తిః క్రియా కారణ లక్షణా | విచారయ మహాభాగ యా సా భగవతీ శివా 24

య స్యాధారే జగత్సర్వం తిష్ఠ త్యత్ర మహార్ణవే | సాకారా యా మహాశక్తి రమేయా చ సనాతనీ 25

యయా విసృజ్యతే విశ్వం జగదేత చ్చరాచరమ్‌ | సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే 26

సౌ విద్యా పరమా ముక్తే ర్హే తుభూతా సనాతనీ | సంసారబంధ హేతుశ్చ సైవ సర్వేశ్వ రేశ్వరీ 27

అహం త్వ మఖిలం విశ్వం తస్యా శ్చిచ్ఛక్తి సంభవమ్‌ | విద్ధి బ్రహ్మ న్న సందేహః కర్తవ్యః సర్వదా%నఘ 28

శ్లోకార్థేన తయా ప్రోక్తం తద్వై భాగవతం కిల | విస్మితో భవితా తస్య ద్వాపరాదౌ యుగే తథా 29

వ్యాసుడిట్లనియె : అట్టి దేవి దివ్యవాణి నాకర్ణించి భగవానుడు దానినే పరమమంత్రరాజముగనెంచి హృదయకమలమందు దరించెను. కొంతకాలము పిదప విష్ణుని నాభికమలమునుండి బ్రహ్మ యుద్భవించెను. అతడు దానవభయభీతుడై శరణు వేడుకొనగా హరి మధుకైటభులతో బోరి వారి నంతమొందించి బ్రహ్మభయము బాపెను. పిదప కూడా హరి దివ్యరసమయమైన యాశ్లోకార్థమునే జపించుచుండెను. అది వినిన కమలజుడగు బ్రహ్మ హరిని ఓ పుండరీకాక్షా! నీవేమి జపించుచున్నావు? నీకంటె నధికుడెవడు గలడు? నీవనుస్మరించుచు ముదమందు నామంత్రమేమి? అని ప్రశ్నించెను. హరి యిట్లు పలికెను : ''మహాభాగా! నీలో నాలో సర్వములోగల కారయిత్రిశక్తిని భగవతిగ జగదంబగ భావింపుము. ఈ మహాజలరాశియు నెల్లలోకములు నే తల్లి యాధారముగ నొప్పుచున్నవో యా తల్లినే సాకారగ ననంతశక్తిగ సనాతనగ నెఱుంగుము. ఆ మహాశక్తియే యెల్లప్రాణుల జీవనాడులు స్పందింపజేయు నిత్యనూతన చైతన్యశక్తి - చరాచర విశ్వకర్త్రి-ఆమె సుప్రసన్నురాలయ్యెనా - కోరిన కోర్కులు గురియు వరదాయిని యగును. ముముక్షులకు ముక్తిప్రదాయిని యగును. ఆ తల్లియే పరావిద్య - మోక్షహేతుభూతురాలు - సంసార బంధన కారణురాలు - సర్వవిశ్వేశ్వరి. ఈ విశ్వవిశ్వమును నీవును నేనును సత్యశివసుందరశక్తివలన సంభవించిన వారమని భావింపుము. ఇది నిజము. నిజము. ఇందు సందేహము లేశ##మైనను లేదు. ఆమె నాకు వచించిన శ్లోకార్థమే మహాభాగవత పరమ సారము. ఆ యర్థశ్లోకమే రాబోవు ద్వాపరయుగాదిని వ్యాసభగవానునిచే భాగవతముగ వ్రాయబడును.''

వ్యాసః : బ్రహ్మణా సంగృహీతం చ విష్ణోస్తు నాభిపంకజే | నారదాయ చ తేనోక్తం పుత్రా యామితబుద్ధయే. 30

నారదేన తథా మహ్యం దత్తం మునినా పురా | మయా కృత మిదం పూర్ణం ద్వాదశస్కంధ విస్తరమ్‌. 31

తత్పఠస్వ మహాభాగ పురాణం బ్రహ్మసమ్మితమ్‌ | పంచలక్షణ యుక్తం చ దేవ్యాశ్చరిత ముత్తమమ్‌. 32

తత్త్వజ్ఞాన రసోపేతం సర్వేషా ముత్తమోత్తమమ్‌ | దర్మశాస్త్రమం పుణ్యం వేదార్థే నోపబృంహితమ్‌ 33

వృత్రాసుర వధోపేతం నానాఖ్యాన కథాయుతమ్‌ | బ్రహ్మ విద్యా నిధానంతు సంసారార్ణవ తారకమ్‌ 34

గృహీణ త్వం మహాభాగ యోగ్యో% సి మతిమత్తరః | పుణ్యం భాగవతం నామ పురాణం పురుషర్షభ 35

అష్టాదశసహస్రాణాం శ్లోకానాం కురు సంగ్రహమ్‌ | అజ్ఞాన నాశనం దివ్యం జ్ఞాన భాస్కర బోధకమ్‌ 36

సుఖదం శాంతిదం ధన్యం దీర్ఘయుష్యకరం శివమ్‌ | శృణ్వతాం పఠతాం చేదం పుత్ర పౌత్ర వివర్దనమ్‌ 37

శిష్యో%యం మమ ధర్మాత్మా లోమహర్షణసంభవః | పఠిష్యతి సార్థం పురాణసంహితాం శుభామ్‌. 38

వ్యాసుడిట్లనియె : ''ఆ మహామంత్రమును విష్ణువునుండి బ్రహ్మ గ్రహించి తన తనయుడగు నారదునకు సమ్మతితో నుపదేశించెను. నారదునివలన నేను విని దానిని పండ్రెండు స్కంధముల శ్రీమహాభాగవతముగ విస్తరించితిని. ఆ పురాణము బ్రహ్మ సమ్మితము. అది పంచలక్షణ లక్షితము. శ్రీదేవీ మహిమాన్వితమునై యలరారును. అది తత్త్వజ్ఞాన రసామృతము - సర్వోత్తమము - ధన్యము - పుణ్యము - ధర్మశాస్త్రసమము - సాహితీరససంభరితము - వేదార్థప్రతిపాదకము. వృత్రాసుర కథాభరితము - నానాఖ్యానక సంకలితము-బ్రహ్మవిద్యా నిధానము-సంసారార్ణవతారకము. ఓ మహామతీ! ఓ పురుషవర్యా! నీవా పరమపుణ్య పురాణ మెఱుంగుము. దానిని చదువుట కెల్ల విధముల నీవే యోగ్యుడవు. అది పదునెనిమిదివేల శ్లోకములతో కూడి అజ్ఞానపుకఱకు చీకట్లకు దివ్యజ్ఞానభాస్కర శుభోదయమైనది. సుఖశాంతులు వర్ధిల్లచేయును. దన్యము. దివ్యము. శివంకరము. విను-చదువు-వారలకు చిరాయుఃపుత్త్రపౌత్ర సౌభాగ్యముల చేకూర్చును. సూతుడు రోమహర్షణసుతుడు అతడు పరమధార్మికుడు. నా ముఖ్య శిష్యుడు. అతడు నీకు తోడుగా నీపుణ్యపురాణసంహిత పఠించగలడు.

సూతః: ఇత్యుక్తం తేన పుత్రాయ మహ్యం చ కథితం కిల | యయా గృహీతం తత్సర్వంపురాణంచాతివిస్తరమ్‌ 39

శోకో%ధీత్య పురాణం తు స్థితో వ్యాసాశ్రమే శుభే | నలేభే శర్మ కర్మాత్మా బ్రహ్మాత్మజ ఇవాపరః 40

ఏకాంత సేవీ వికలః స శూన్య ఇవ లక్ష్యతే | నా త్యంత భోజనాసక్తో నో పవాసరత స్తథా 41

చింతావిష్టం శుకం దృష్ట్యా వ్యాసః ప్రాహ సుతంప్రతి | కింపుత్రచింత్యనేనిత్యం కస్మాద్వ్యగ్రో%సిమానద 42

అస్సే ధ్యానపరో నిత్య మృణగ్రస్త ఇవా ధనః | కా చింతా వర్తతే పుత్ర మయి తాతేతు తిష్ఠతి 43

సుఖం భుంక్ష్వ యథా కామం ముంచ శోకం మనోగతమ్‌ | జ్ఞానం చింతయ శాస్త్రోక్తం విజ్ఞానే చ మతిం కురు 44

న చేన్మనసి తే శాంతి ర్వచసా మమ సువ్రత | గచ్ఛ త్వం మిథిలాం పుత్ర పాలితాం జనకేన చ 45

స తే మోహం మహాభాగ నాశయిష్యతి భూపతిః | జనకో నామ ధర్మాత్మా విదేహః సత్యసాగరః 46

తం గత్వా నృపతిం పుత్ర సందేహం స్వం నివర్తయ | వర్ణాశ్రమాణాం ధర్మాం స్త్వంపృచ్ఛపుత్రయథాతథమ్‌. 47

జీవన్ముక్తః స రాజర్షిర్బ్రహ్మజ్ఞాన మతిః శుచిః | తథ్య వక్తా%తిశాంతశ్చ యోగీ యోగప్రియః సదా 48

సూతుడిట్లనియె : ఈ విధముగ వ్యాసుడు తన పుత్త్రునకు దెలుప నతనితోబాటు ఈ విశాలపురాణ సంగ్రహతత్త్వ మెఱిగితిని. శుకుడును దీనిని గ్రహించి వ్యాసాశ్రమమందే యుండెను. కాని బ్రహ్మకు పుట్టని యపరనారదునివలె యతడు ఆత్మశాంతిని బడయకుండెను. ఆత డేకాంతప్రియుడయ్యెను. విషయశూన్యునివలె దోచుచుండెను. తన యునికిలోనే తానుండెను. అతనికి భోజనము రుచించకుండెను. ఉపవాసమనిన నిష్టమేలేదు. ఇట్లాత్మ చింతాపరవశుడగు తన సుతునిగని వ్యాసుడిట్లు పలికెను: ''కుమారా! నీవింత వింతగ ఏల యేకాగ్రతతో నదేపనిగ నూరక విచారించుచున్నావు? ఋణగ్రస్తుడైన కటికదరిద్రుడు చింత్రాగ్రస్తుడగును. నీవునట్లే యేదో పరధ్యానమందున్నావు. నీ తండ్రినగు నేను బ్రతికియే యుండగ నీకీలేనిపోని లోని చింతయేల? నీవు కోరినకోర్కులన్నియు తనివార ననుభవింపుము. మదిలోన శోకముడుగుము. శాస్త్రోక్తజ్ఞాన మెఱుగుము. హృదయాంతరజ్యోతివలె విజ్ఞానమయుడవుగమ్ము. నా యీ మాటలవలన నీకైకాంతిక శాంతి చేకూరనిచో మిథిలకేగి జనకుని సన్నిధానము జేరుము. ఆ జనకుడు విదేహుడు - ధర్మమూర్తి; సత్యసంధుడు. జనకనామమున ప్రసిద్ధికెక్కెను. అతడే నీలోని మోహపు మంచుతెరలను పటాపంచలు చేయగలవాడు. నీవా రాజునుజేరి నీలోని సందేహమును బాపుకొనుము. అతనితో యథాయోగ్యమైన వర్ణాశ్రమధర్మములగూర్చి ముచ్చటించుము. అతడు రాజర్షి; జీవన్ముక్తుడు. బ్రహ్మజ్ఞానమూర్తి-శుచి-యథార్థవాది. సత్యవస్తునిష్ఠుడు. సిద్ధయోగరతుడు. బ్రహ్మతేజోబలమున మహోజ్ఞ్వలుడు. నిరంజనుడు.

సూతః : తుచ్ఛత్వ్రా వచనం తస్య వ్యాస స్యామిత తేజసః | ప్రత్యువాచ మహాతేజః శక శ్చారణిసంభవః 49

దంభో %యం కిల ధర్మాత్మ న్భాతి మమాధునా | జీవన్ముక్తో విదేహశ్చ రాజ్యం శాస్తి ముదా%నితః 50

వంధ్యాపుత్ర ఇవాభాతి రాజా%సౌ జనకఃపితః | కుర్వ న్రాజ్యం విదేహఃకింసదేహో%యం మమాద్భుతః 51

ద్రష్టు మిచ్ఛా మ్యహం భూపం విదేహం నృపసత్తమమ్‌ | కథం తిష్ఠతి సంసారే పద్మపత్ర మివాంభసి 52

సందేహో%యం మహాం స్తాత విదేహే పరివర్తతే | మోక్షః కిం వదతాం శ్రేష్ఠ! సౌగతానా మివాపరః 53

కథం భుక్త మభుక్తం స్యా దకృతం చ కృతం కథమ్‌ | వ్యవహారః కథంత్యాజ్య ఇంద్రియాణాం మహామతే 54

మాతా పుత్ర స్తథా భార్యా భగినీ కులటా తథా | భేదాభేదం కథం న స్యా ద్యద్యేత న్ముక్తతా కథమ్‌ 55

కటుక్షారం తథా రూక్షం కషాయం మిష్టమేవ చ | రసనా యది జానాతి భుంక్తే భోగా ననుత్తమాన్‌ 56

శీతోష్ణ సుఖదుఃఖాది పరిజ్ఞానం యథా భ##వేత్‌ | ముక్తతా కీదృశీ తాత సందేహో%యం మమాద్భుతః 57

శత్రు మిత్ర పరిజ్ఞానం వైర ప్రీతికరం సదా | వ్యవహారే పరే తిష్ఠ స్కథం న కురుతే నృపః 58

చౌరం వా తాపనం వా%సి సమానం మన్యతే కథమ్‌ | అసమా యది బుద్ధిః స్యా న్ముక్తతా తర్హి కీదృశీ 59

దృష్టపూర్వో న మే కశ్చి జ్జీవన్ముక్తశ్చ భూపతిః | శంకేయం మహతీ తాత గృహే ముక్తః కథం నృపః 60

దిదృక్షా మహతీ జాతా శ్రుత్వాతం భూపతిం తథా | సందేహవినివృత్త్యర్థం గచ్ఛామి మిథిలాం ప్రతి. 61

ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే షోడశోధ్యాయః

ఆ మహాతేజస్వియగు వ్యాసుని వచనము లాకర్ణించి అరణిజుడగు శుకుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను : ఓ జనకా ! నాకా జనకుడు దంభాచారిగ దోచుచున్నాడు. ఏలయన, ఆ విదేహుడు జీవన్ముక్తుడుగద! మరి సుఖశాంతులతో నెట్టు రాజ్యమేలుచున్నాడు? నాకతడు వంధ్యాపుత్రుడుగ దోచుచున్నాడు. కానిచో విదేహుడు బ్రహ్మజ్ఞాని రాజ్యమెట్లు ఏలగలడు? ఇది నాకు అద్భుతమును గల్గించుచున్నది. ఈ దురంతమైన మాయా సంసారసాగరమందు నీటియందలి పద్మమువలె నా విదేహరాజెట్లు మనుగడ సాగించుచున్నాడు? విదేహ జనకుని విషయమున నందియము నాకే లొకోకలుగుచున్నది. ఆతని ముక్తిబౌద్ధుల నాస్తికత్వమువంటిదేనా? ముక్తుడు అముక్తుడెట్లగును? కర్త అకర్తయెట్లగును? ఇంద్రియ వ్యాపారముల బెడద నెట్లు వదలించుకొనవచ్చును. తల్లి-కొడుకు-భార్య-సోదరి-వారాంగన-వీరిలో పరస్పరము భేదములు గలవు గదా? ఇన్ని భేదములుండగ నభేదమైన ముక్తియెట్లు సాధ్యము? చేదు కారము వేడిమి తీపి ఉప్పు మొదలగువానిలోని రుచిని నాలుక తెలిసికొని తృప్తిజెందును. శీతోష్ణములు సుఖదుఃఖములు ననుభవించుచున్నంతకాల మాత్మముక్తి యేరీతి గల్గును? ఇదంతయు విడ్డూరమే. నాకెందులకో యిందు అద్భుతమగు సందేహము గల్గుచున్నది. వీడు శత్రువనుకొనినచో వైరము పెరుగును. వీడు మిత్రుడనుకొనినచో ప్రేమ గలుగును. మరి యారాజు ద్వంద్వముల నడుమ నుండుచు నిష్క్రియుడై యెట్లు మనుచున్నాడు? ఆ రాజు చోరుని తాపసుని నొకే రీతిగ నెట్లు చూడగలడు? బుద్ధితో స్థితప్రజ్ఞత సమతలేనిచో ముక్తి యెట్లు గల్గును? జీవన్ముక్తుడైన నరపతిని నేనింతవఱకును చూడలేదు. ఇంటియందే యుండుచు ముక్తుడయ్యెననగ నాకిందేదో సందేహము తోచుచున్నది. ఆ జనకుని గుఱించి నీవింతగ వింతగ జెప్పుటవలన నాకతనిని చూడవేడుకగుచున్నది. నా సందేహము బాపుకొనుటకు మిథిలకేగగలను.

ఇది శ్రీదేవీ భాగవ మహాపురాణమున ప్రథమస్కంధమందు షోడశాధ్యాయముం

Sri Devi Bhagavatam-1    Chapters