Sri Devi Bhagavatam-1    Chapters   

అథ పంచవిశో%ధ్యాయః

వాసవీ చకితా జాతా శ్రుత్వామే వాక్యమీదృశమ్‌ | దాశేయా మామువాచేదం పుత్రార్థే భృశమాతురా. 1

అంబాలికా వధూ ర్ధన్యా కాశిరాజ సుతా సుత | భార్యా విచిత్రవీర్యస్య విధవా శోకసంయుతా. 2

సర్వలక్షణసంపన్నా సర్వ ¸°వనశాలినీ | తస్యాం జనయ సంగం త్వం కృత్వాపుత్రం సుసమ్మతమ్‌. 3

నాంధో రాజా%ధికారీ స్యా త్తస్మాత్పుత్రం మనోహరహరమ్‌ | ఉత్పాదయ రాజపుత్ర్యాం వచనా న్మమ మానద. 4

ఇత్యుక్తో%హం తదా మాత్రా స్థిత స్తత్ర గజాహ్వయే | యావదృతుమతీ జాతా కాశిరాజ సుతా మునే 5

ఏకాంతే శయనాగారే ప్రాప్తానా మమసన్నిధౌ | లజ్జమానా సుకేశాంతా స్వశ్వ శ్రూవచనాత్తదా. 6

దృష్ట్వా మాం జిటనం దాంతం తాపసం రసవర్జితమ్‌ | సా స్వేదవదనా జాతా పాండురా విమనా భృశమ్‌. 7

కుపితో%హం తదా దృష్ట్వా కామినీం నిశి సంగతామ్‌ | వేప మానాం స్థితః పార్శ్వే హ్య | బువం తామహంరుషా. 8

దృష్ట్వా మాం యది గర్వేణ పాండువర్ణ సమావృతా | అత స్తే తనయః పాండు ర్భవిష్యతి సుమధ్యమే. 9

ఇత్యుక్త్వా నిశి తత్రైవ స్థితో%ంబాలికయా యుతః | భుక్త్వా తాం నిశి నిర్యాతః స్తాన మాపృచ్ఛ్యమాతరమ్‌. 10

తత స్తాభ్యాం సుతౌ కాలే ప్రనూతా వంధ పాండురౌ | ధృతరాష్ట్ర శ్చ పాండుశ్చ ప్రథితౌ సంబభూవతుః. 11

మాతా మే విమనా జాతా తాదృశౌ వీక్ష్యతౌ సుతౌ | తతః సంవత్సర స్యాంతే మామాహూ య తదా బ్రవీత్‌. 12

ద్వైపాయన సుతౌ జాతౌ రాజ్యయోగ్యౌ న తాదృవౌ | అన్యం మనోహరం పుత్రం సముత్పాదయమే ప్రియమ్‌. 13

తథేతి సా మయా ప్రోక్తా ముదితా జననీ తదా | అంబికాం ప్రార్థయామాస సుతార్థే కాల ఆగతే. 14

ఇరువదియైదవ యధ్యాయము

వ్యాసుని మోహవృత్తాంతము

నా మాటలు విని సత్యవతి చకితురాలైన తన కోడలికి సుపుత్రప్రాప్తి గలుగవలయునను తలంపుతో నాతో నిట్లనెను : నందనా! అంబాలిక కాశిరాజు కూతురు. విచిత్రవీర్యుని భార్య విధవ శోకసంతప్త. నీవు ఆ మగువయందు సుపుత్రుని గనుము. మహాత్మా! గ్రుడ్డివాడు రాజు గాజాలడు. కనుక నా మాట విని రాజపుత్రికయందొక కుమారుని గనుము అని నా తల్లి పలుకగ నంబాలిక ఋతుమతి యగువఱకు నేను హస్తిపుర మందుంటిని. ఒక తగిన సమయమున నంబాలిక తన యత్తమాట ప్రకారము నొంటిగ శయనాగారమున నా కడకు వచ్చెను. ఆమె నన్ను జడదారిగ తబిసిగ మోటువానిగ దలచెను. నన్ను జూడగానే యామెకు మొగము వెలవెల బారెను. ఆ రేయి నాతో గూడి నా కట్టెదుటనున్న యామె వణకు చుండెను. అపుడా కాంతతో కోపమున నిట్లంటిని : సుశ్రోణీ! నీ రూపగర్వములో నన్ను గాంచి వెలవెలపోతిని. కనుక నీకు పాండువర్ణముగల కొడుకు పుట్టడలడు. అని నే నారాత్రియంతయు నంబాలికను గూడి యామెననుభవించితిని. ఆ పిమ్మట నా తల్లి యనుమతితో నేను నాచోటికేగితిని. పిమ్మట కొంతకాలమునకు వారిర్వురకు పుత్రులు గల్గిరి. మొదటినాడు ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు. రెండవాడు పాండురాజు ప్రసిద్ధికెక్కెను. అట్టి వారిని గాంచిన నా తల్లి మనస్సు మరింత కలత జెందెను. అట్లొక యేడాది గడచిన పిదప నా తల్లి నన్ను మరల పిలిచి యిట్లనెను : ద్వైపాయనా! నీవు కనిన యిద్దఱును రాజ్యమునకు యోగ్యులు గారు. కనుక నా కోడలియందు వేరొక కుమారుని నాకు నచ్చు వానిని కనుము. నేనొప్పుకొంటిని. నా తల్లి మోదముతో నంబికను ఋతుకాలమున మరొక పుత్రునిగనుటకిట్లు వేడుకొనెను :

పుత్రి వ్యాసం సమాలింగ్య పుత్ర ముత్పాదయా%ద్భుతమ్‌ | కురు వంశస్యకర్తారం రాజ్య యోగ్యం వరాననే. 15

వధూ ర్లజ్జాన్వితా కించి న్నోవాచ వచనం తదా | గతో%హం శయనాగారే మాతు స్తద్వచనా న్నిశి. 16

దాసీ విచిత్ర వీర్యస్య రూప¸°వన సంయుతా | ప్రేషితా%ంబికయా త్వత్ర విచిత్రాభరణాంబరా. 17

చందనా రక్తదేహ సా పుష్పమాలా విభూషితా | ఆయతా హావసంయుక్తా సుకేశీ హంసగామినీ. 18

పర్యంకే మాం సమావేశ్య సంస్థితా ప్రేమ సంయుతా | ప్రసనో%హం తదా తస్యా విలాసేనాభవం మునే. 19

రాత్రౌ సం క్రీడితం ప్రేవ్ణూ తయా సహ మయా భృశమ్‌ | వరో దత్తః పున స్తస్య ప్రసన్నే తు నారద. 20

సుభ##గే భవితా పుత్రః సర్వలక్షణ సంయుతః | సురూపః సర్వధర్మజ్ఞః సత్యవాదీ శ##మేరతః. 21

స తదా విదురో జాత స్త్రయః పుత్రా మయా%భవన్‌ | మాయా వృద్ధింగతా సాధో పరక్షేత్రోద్భవే మమ. 22

విస్మృతః శుకసంబంధీ విరహః శోకకారణమ్‌ | దృష్ట్వా త్రీ న్స్వసుతా న్కామం వీర్యవాన్‌ వీర్యసమ్మతాన్‌. 23

మాయా బలపతీ బ్రహ్మన్‌ దుస్త్యజాహ్యకృతాత్మభిః | అరూపాచ నిరాలంబా జ్ఞానినా మపి మోహినీ. 24

మాతరి స్నేహసంబద్ధం తథా పుత్రేషు సంవృతమ్‌ | న మే చిత్తం వనే శాంతి మగా న్ముని వరోత్తమ. 25

డోలారూఢం మనోజాతం కదాచి ద్ధస్తినాపురే | పునః సరస్వతీ తీరే న చైకత్ర వ్యవస్థితిః. 26

ఓ యమ్మాయీ! నీవీ వ్యాస మునీంద్రునితో సంగమింపుము. మన కురువంశము నిలుపజాలు వానిని రాజ్యమునకు దగిన వానిని గనుము. అందులకామె యేమియు మాటాడక తలవంచుకొని యుండెను. నేను నా తల్లి మాట నిలువబెట్టుటకు మరల రేతిరి శయన గృహము ప్రవేశించితిని. అపుడంబిక విచిత్ర వీర్యుని దాసిని సర్వాభరణముల నలంకరించి నా ముందు నకు పంపెను. అది మంచి రూపముగలది. జవరాలు. సుకేశి. ఆ మగువ మేన చందన మలందుకొనెను. పూల మాలలు దాల్చెను. అనురాగభావముతో ఆమె నా కడకు వచ్చెను. ఆమె విలాసములకు నేను ప్రసన్నుడనైతిని. నేను ప్రమోదముతో నామెకిట్లు వరమిచ్చితిని : ఓ సౌభాగ్యవతీ! నీ కందగాడు, సర్వ ధర్మవిదుడు సత్యవాది శమసంపన్నుడు సర్వ లక్షణ లక్షితుడు నగు సుపుత్రుడు జన్మింప గలడు. అట్లు పుట్టినవాడు విదురుడను పేరు గాంచెను. అట్లు నాకు మువ్వురు పుత్రులు గల్గిరి. అట్టి సంతువలన నన్ను మమకారము మాయ యావరించెను. ఆ మువ్వురు పుత్రులు మిక్కిలి వీర్యవంతులు. అందుచే నేను శుకవియోగమున గల్గిన శోకము కొంత దిగమ్రింగితిని. మునివరా! ఈ మాయ బలవత్తరమైనది. ఇంద్రియనిగ్రహములేని వారికి దాటరానిది. ఒక రూపము గాని ఆధారముగాని లేనిది. జ్ఞానులను సైతము మోహమున ముంచునది. మునిప్రవరా! నా చిత్తము మాతృస్నేహమునకు పుత్ర ప్రాప్తికి పరాయత్తమయ్యెను. కనుక వనములందును నాకు శాంతి స్వరూపానందము గల్గుటలేదు. అపుడు నా మనస్సు కోరికల యూయేలలలో నూగెను. ఒకప్పుడు హస్తిపురిలో మఱొకప్పుడు సరస్వతీ తీరమున నిశ్చలశాంతి లేక గ్రుమ్మరితిని.

కదాచి చ్చింతయన్‌ జ్ఞానం మానసే ప్రతిభాతి వై | కే%మీ పుత్రాః క్వ మోహో%యం నశ్రాద్ధార్హామృతస్యమే. 27

వ్యభిచారోద్భవాః కిం మే సుఖదాః సుః సుతాః కిల | మాయా బలవతీ మోహం వితనోతి మి మానసే. 28

జాన న్మోహాంధకూపే%స్మి న్పతితో % మం మృషా మునే | ఇత్యకుర్వం రహ స్తాపం కదాచి త్సుసమాహితః. 29

రాజ్యం ప్రాప తతః పాండు ర్బలవా న్భీష్మసమ్మతః | తదా మమ మనో జాతం ప్రసన్నం సుతకారణాత్‌. 30

కుంతీ మాద్రీ సురూపే ద్వే భార్యే తస్య బభూవతుః | శూరసేన సుతా కుంతీ మద్రరాజ సుతా%వరా. 31

స శాపం ద్విజతంః ప్రాప్య కామినీద్వయ సంయుతః | పాండు ర్నిద్వేద మాపన్నః స్త్యక్త్వారాజ్యం వనంగతః. 32

తదా మా మావిశచ్ఛోకః శ్రుత్వా పుత్రం వనే స్థితమ్‌ | గతో%హం తత్ర యత్రాసౌ భార్యాభ్యాం సహ సంస్థితః. 33

తమాశ్యాస్య వనే పాండుం పునః ప్రాప్తో గజాహ్వయే | ధృతరాష్ట్రం సమాభాష్య హ్యాగమం బ్రహ్మజాతటే. 34

క్షేత్రజా న్పంచ పుత్రాన్స సముత్పాద్య వనాశ్రమే | ధర్మతో వాయుతః శక్రాదశ్విభ్యాం పంచపాండవాన్‌. 35

యుధిష్ఠిరో భీమసేనస్తథైవార్జున ఇత్యపి | కుంతీపుత్రాః సమాఖ్యాతా ధర్మానిలసురేశజాః. 36

నకులః సహదేవశ్చ మద్రరాజ సుతాసుతౌ | కదాచిత్తు రహో మాద్రీం సమాలింగ్య మహీపతిః. 37

మృతః శాపాత్తు మునిభిః సంస్కృతో హుతభుఙ్ముఖే | మాద్రీ తత్ర సతీ భూత్వా ప్రతిష్టా పతినా సహ. 38

స్థితాపుత్రయుతాకుంతీ జ్వలితే జాతవేదసి | మునయః సుత సంయుక్తాం శూరసేన సుతాం తదా. 39

దుఃఃతాం పతీహీనాం తా మానిన్యు ర్గజసాహ్వ | సమర్పితా%థభీష్మాయ విదురాయ మహాత్మనే. 40

అప్పుడప్పుడు నాలోనిట్లు జ్ఞానరేఖలుదయించెను : నాకీ పుత్రులేమి? ఈ తీరని మోహపాశ##మేమి? నేను మరణించినచో వీరు నా శ్రాద్ధకర్మకు దగరు గదా! ఈ నా కొడుకులు వ్యభిచారమున బుట్టినవారు. వీరు నాకేమి సుఖము గల్గింపగలరు? అను నట్టి దాటరానిమాయ నాలో మోహభ్రాంతులు రేకెత్తించెను. మునిపుంగవా! ఈ జగము మిథ్యయని యెఱింగియు నంధ తమసంబున గూలితిని. అప్పుడప్పుడు నేనీ మోహకూపము గూర్చి తలపోయుచు పరితాపమొందితిని. ఆ తర్వాత భీష్ముననుమతి వలన బలశాలియగు పాండుడు రాజయ్యెను. నా సుతుల యభివృద్ధి కారణమున నా మనస్సు మరల ప్రసన్నత గాంచెను. శూరసేనుని కూతురు కుంతి. మద్రరాజు కుమార్తె మాద్రి. వీరిర్వురును పాండురాజునకు పత్నులైరి. ఒక విప్రుని శాపమువలన పాండురాజు నిర్వేదమంది రాజ్యమువదలి భార్యలతో నడవులకేగెను. నా పుత్రుడడవుల పాలగుట వినిన నా మనస్సు ముక్క చెక్కలయ్యెను. అపుడు భార్యలతో నా కొడుకు వసించుచోటికేను వెళ్ళితిని. నేను పాండురాజు నోదార్చి హస్తినకేగి ధృతరాష్ట్రునితో మాటలాడి మరల సరస్వతీతీరము జేరితిని. ఆ వనమునందు ధర్మ-వాయుదేవుల-ఇంద్రుని- అశ్వినులవలన పాండురాజు పంచపాండవులను క్షేత్రజ పుత్రులను బడసెను. వారిలో కుంటికి ధర్మ పవనేంద్రులవలన వరుసగా యుధిష్ఠిరుడు - భీముడు - అర్జునుడు గల్గిరి. అశ్వినులవలన మాద్రికి నకుల సహదేవులు గల్గిరి. అంత నొకనాడు పాండురాజు మాద్రి నేకాంతమున కవుంగిలించుకొనెను. తొంటి విప్రశాపమున పాండురాజు చనిపోయెను. మునులతని కగ్ని సంస్కారము లొనరించిరి. మాద్రి పాండురాజుతో సహగమించెను. కుంతియు సహగమనము చేయదలంచెను. కాని, పుత్రుల సంరక్షణ చేయుటకు మునులామెను వారించిరి. అట్లు పతివియోగమున విలవిలలాడు కుతిని మునులు హస్తిపురికి గొంపోయి భీష్మ విదురుల కప్పగించిరి.

శ్రుత్వా%హం సుఖ దుఃఖాభ్యాం పీడిత స్తు పరాత్మభిః | భీష్మేణ పాలితాః పుత్రాః పాండోరితి విచింత్యతే. 41

విదురేణ తథా ప్రీత్యా ధృతరాష్ట్రేణ ధీమతా | దుర్యోధనాదయ స్తస్య పుత్రా యే క్రూరమానసాః. 42

ఏకత్ర స్థితి మాపన్నా విరోధంచక్రురద్భుతమ్‌ | ద్రోణాచార్య స్తు సంప్రాప్త స్తత్ర భీష్మేణ మానితః. 43

అధ్యాపనాయ పుత్రాణాం పురే తస్మి న్నివాసితః | కర్ణః కుంత్యాపరిత్యక్తో జాతమాత్రః శిశుర్యదా. 44

సూతేన పాలితో నద్యాం ప్రాప్తశ్చాధిరథేన హ | దుర్యోధన ప్రియశ్చాభూ త్కర్ణః శూరతమస్తథా. 45

పరస్పరం విరోధో%భూ ద్భీమ దుర్యోధనాదిషు | ధృతరాష్ట్ర స్తు సంచింత్య క్లేశం పుత్రేషు తేషు చ. 46

నివాసం కల్పయామాస పాండవానాం మహాత్మనామ్‌ | విరోధశమనాయైన నగరే వారణావతే. 47

దుర్యోధనేన తత్రైవ ద్రోహా జ్జతుగృమాణివై | కారితాని చ దివ్యాని ప్రేష్య మిత్ర పురోచనమ్‌. 48

శ్రుత్వా జతుగృహే దగ్ధా న్పాండవా న్పృథయాయుతాన్‌ | పౌత్రభావా న్మునిశ్రేష్ఠ మగ్నో%హం వ్యసనార్ణవే. 49

శోకాతురే భృశం శూన్యే పనే పశ్యన్నహర్నిశమ్‌ | దృష్ట్వా మయైక చక్రాయాం పాండవా దుఃఖకర్శితాః. 50

తత స్తుష్టమనాశ్చాహం జాతః పార్ధాన్విలోక్యచ | ప్రేరితాస్తు మయాతూర్ణం ద్రుపదస్య పురం ప్రతి. 51

తే గతా స్తత్ర దుఃఖార్తా విప్రవేషధరాః కృశాః మృగచర్మ పరీధానాః సభాయాం సంస్థితా స్తదా. 52

ఇదంతయు విని యితరుల సుఖ దుఃఖములకు నా మనస్సు కలతజెందెను. అట్లు పాండుసుతులు భీష్మునిచేత పెంచబడిరి. ధీశాలియగు ధృతరాష్ట్రుడును విదురుడను పాండవులను ప్రీతిగదుర పోషించిరి. కాని దుర్యోధనాదులు ధృతరాష్ట్రసుతులు క్రూరాత్ములు కౌరవులు. పాండవులతో పగబూనియుండిరి. అంతలో నచటికి ద్రోణాచార్య డేతేరగ భీష్ముడతనిని మిక్కిలి గౌరవించెను. కురుపుత్రులకు విద్యగఱపుటకు ద్రోణుడు హస్తినపురమున నియమింపబడెను. కుంతికి మొట్టమొదట కర్ణుడు పుట్టెను. ఆమె యతనిని వెంటనే వదలి పెట్టెను. కర్ణుడు నదలో గొట్టుకొని పోవుచుండగ సూతు డతనిని గొనిపెంచెను. మహావీరుడగుట కర్ణుడు దుర్యోధనునకు ప్రియమిత్రుడయ్యెను. పిమ్మట భీమదుర్యోధనుల నడుమ జ్ఞాతివైరము పెచ్చు పెరిగెను. ధృతరాష్ట్రుడు కౌరవపాండవుల మధ్యగల వైరభావమెఱిగెను. అతడు వారి విరోధము తగ్గుటకు పాండవులను వారణావతమున నుండ ఏర్పాడు గావించెను. దుర్యోధనునిలో ద్రోహచింత మెండయ్యెను. అతడు తన మిత్రుడగు పురోచనునంపి పాండవులకు మేలైన లక్కయిండ్లు నిర్మింపజేసెను. మునివర్యా! ఆ లక్కయింట పాండవులు తమ తల్లితో గూడ కాలిపోయిరని విని మనుమల మీది మమత వలన దుఃఖసాగరమున మునిగితిని అట్లు నేను శోకాతురడనై రేయింబవళ్ళు నిజన ప్రదేశమున పరిభ్రమించుచుంటిని. అంతలో నేకచక్రపురమున దుఃఖపీడితులగు పాండవులు నా కంటబడిరి. నేను పాండవులను గాంచి మోదమొందితిని. పిమ్మట వారి ద్రుపదపురి నేను వారిని ప్రేరేపించితిని. అంత దుఐఖార్తులగు పాండవులు బ్రామ్మణ వేషములు దాల్చి మృదచర్మములు వస్త్రములుగ ధరించి ద్రుపదసభలో నుండిరి.

కృత్వా పరాక్రమం జిష్ణుః స జిత్వా ద్రుపదాత్మజామ్‌ | చక్రు ర్వివాహం మానిన్యా పంచైవ మాతృవాక్యతః. 53

దృష్ట్వా వివామం తేషాంతు ముదితో%హంభృశంతదా | తతో నాగాహ్వయే ప్రాప్తాః పాంచాలీసహితమునే. 54

నివాసం ఖాండవప్రస్థం ధృతరాష్ట్రేణ కల్పితమ్‌ | పాండవానాం ద్విజశ్రేష్ఠ వసుదేవ సుతేనవై. 55

తర్పితః పావక స్తత్ర విష్ణునా సహజిష్ణునా రాజసూయః కృతో యజ్ఞ స్తదా%హం ముదితోభవమ్‌. 56

దృష్ట్వా%థ విళవం తేషాం తథా మయకృతాం సభామ్‌ | దుర్యోధనో%తి సంతప్తో దురోదర మథాకరోత్‌. 57

దు ర్ద్యూతవేదీ శకుని రనక్షజ్ఞశ్చ ధర్మజః | హృతం రాజ్యం ధనం సర్వం యాజ్ఞసేనీ చ క్లేశితా. 58

వనే ద్వాదశవర్షాణి పాండవా స్తే వివాసితాః | పాంచాలీ సమితా స్తేన దుఃఖం మే జనితం భృశమ్‌. 59

ఏవం నారద! సంసారే సుఖ దుఃఖాత్మకే భృశమ్‌ | నిమగ్నో%హం భ్రమేణౖవ జానన్ధర్మం సనాతనమ్‌. 60

కో%హం కస్య సుతాస్తే%మీ కా మాతా కిం సుఖం పునః | యేన మే హృదయం మోహాద్ర్భమతీతి దివానిశమ్‌. 61

కిం కరోమి క్వ గచ్ఛామి సంతోషో నాధిగచ్ఛతి | డోలారూఢం మనో%మేత్ర చంచలం న స్తిరం భ##వేత్‌. 62

సర్వజ్ఞో%పి మునిశ్రేష్ఠ సందేహం మే నివర్తయ | తథా కురు యథా%హం స్యాం సుఃతో విగతజ్వరః. 64

ఇతి శ్రీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే పంచవింశో%ధ్యాయః.

అందర్జునుడు మత్స్యయంత్రమును గొట్టి ద్రోపదిని గెలుచుకొనెను. వారేవురును తమ తల్లివచనము ప్రకారముగ ద్రౌపదిని వివాహమైరి. దేవర్షీ! ఆనాటి వారి వివాహము తిలకించి నేనానందమగ్నుడనైతిని. అంతట వారు పాంచాలితో హస్తిపురి కేగిరి. ధృతరాష్ట్రుడు వారికి ఖాండవప్రస్థము నివాసముగ నేర్పరచెను. ద్విజవరా! వారున్నచోటికి వాసుదేవు డేతెంచెను. శ్రీకృష్ణుడర్జునునితో గలిసి యగ్నికి సంతృప్తి గలిగించెను. పిదప వారు రాజసూయయాగము చేయగ నేనెంతయో హర్షించితిని. దుర్యోధనుడు పాండవుల మహావైభవమును మయసభను గాంచి యోర్వలేక జూదమేర్పాటు చేసెను. శకుని కపటజూదమున మేటి. ధర్మజుడు మాయచేయుటలో నేర్పరి కాడు. కనుక నతడు తన రాజ్యమంతయు గోలుపోయెను. అందు ద్రోపదియు నమానుషముగ నవమానింపబడెను. అపుడు పాండవులు పాంచాలితో గలిసి పండ్రెండేండ్లు వనవాస క్లేశములనుభవించిరి. దానికి నా మనస్సు క్రుంగిపోయెను. నారదా! నేను సనాతన దివ్యధర్మమెఱిగిని వాడను. ఐనను సుఖ దుఃఖాత్మకమగు సంసారసాగరమున భ్రమలో మునింగితిని. ఇకేమిచేతును? నేనెక్కడికేగుదును? నాకు సంతోషము శాంతి గల్గుటలేదే యని తలంచుచు నా మనస్సు చంచలమై యూగుచుండెను. కనుక మునివరా! నీవు సర్వజ్ఞుడవు. నా యీ సందేహము బాపుము. నాకు దుఃఖము దొలగునట్లు నిరంతరము సుఖశాంతులు గల్గునట్లు అనుగ్రహింపుము.

ఇది శ్రీదేవీభాగవత మందలి షష్ఠస్కంధమందు వ్యాసుని మోహవృత్తాంతమను నిరువదియైదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters