Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్వింశో%ధ్యాయః

రాజోవాచ : 

భగవం స్త్వ న్ముఖాంభో జాచ్చ్యుతం దివ్యకథారసమ్‌ | నతృప్తి మధిగచ్చామిపి బంస్తుసుధయాసమమ్‌. 1

విచిత్ర మిద మాఖ్యానం కథితం భవతా మమ | హైహయానాం సముత్పత్తి ర్విస్తరా ద్విస్మయ ప్రదా. 2

పరం కౌతూహలం మే%త్ర యద్విష్ణుః కమలావతిః | దేవదేవో జగన్నాథః సృష్టి స్థిత్యంతకారకః. 3

సో%ప్యశ్వ భావ మాపన్నో భగవా న్హరి రచ్యుతః | పరతంత్రః కథం జాతః స్వతంత్రః పురుషోత్తమః 4

ఏతన్మే సంశయం బ్రహ్మన్‌ ఛేత్తు మర్హసి సాంప్రతమ్‌ | సర్వజ్ఞ స్త్వం మునిశ్రేష్ఠ | బ్రూహి వృత్తాంతమద్భుతమ్‌. 5

వ్యాసః : శృణు రాజ న్ర్పవక్ష్యామి సందేహస్యాస్య నిర్నయమ్‌ | యథా శ్రుతం మయాపూర్వ నారదాన్మునిసత్తమాత్‌. 6

బ్రాహ్మణో మానసః పుత్రో నారదో నామ తాపసః | సర్వజ్ఞః సర్వగః శాంత సర్వలోకప్రియః కవిః. 7

స చైకదా మునిశ్రేష్ఠో విచర న్పృథివీ మిమామ్‌ | వాదయ న్మహతీం వీణాం స్వరతానసమన్వితామ్‌. 8

బృహద్రథంతరాదేనాం సామ్నాం భేదా ననేకశై | గాయ న్గాయత్ర మమృతం సంప్రాప్తో%థ మమా%%శ్రమమ్‌. 9

శమ్యాప్రాసం మహాతీర్థం సరస్వత్యాః సుపావనమ్‌ | నివాసం మునిముఖ్యానాం శర్మదం జ్ఞానదం తథా. 10

తమాగత మహం ప్రేక్ష్య బ్రహ్మపుత్రం మహాద్యుతిమ్‌ | అభ్యుత్థానాదికం సర్వం కృతవా నర్చనాదికమ్‌. 11

అర్యపాద్యవిధిం కృత్వా తసా%%సనస్థితస్య చ | ఉపవిష్ఠః సమీపే%హం మునే రమిత తేజసః. 12

ఇరువదినాల్గవ యధ్యాయము

విక్షేపశక్తి వర్ణనము

జనమేజయుడిట్లనెను : ఓ మహితాత్మా ! నీ ముఖ కమలముల నుండి వెడలు నమృతమువంటి శ్రీ మాతృదేవి దివ్య కథా రసమెంత క్రోలినను తనివితీరుట లేదు. హైహయవంశోత్పత్తి చరిత్ర విచిత్రము విస్మయకరము. దానిని నీవు విపులముగ తెల్లమొనర్చితివి. కాని యందు నాకొక సందియము గల్గుచున్నది. అదేమన, దేవదేవుడు జగన్నాథుడు - సృష్టి స్థితి సంహార కారకుడు - కమలాపతి - విష్ణువు పురుషోత్తముడు హరి పరతంత్రుడై గుఱ్ఱము రూపేల దాల్చెను? నా యీ సంశయము బాపుటకీవే సమర్థుడవు. నీవు సర్వజ్ఞుడవు, మునివరుడవు కనుక హరియొక్క యీ విచిత్రవర్తనము గూర్చి తెలుపుము అన వ్యాసుడిట్లనెను : రాజా! పూర్వము నారదమునివరున కిదే సందేహము వెలిపుచ్చి యా మహాత్మునివలన దానిని తీర్చుకొంటిని. దానిని నీకు దెల్పుదును. ఆలింపుము. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు - తబిసి - సర్వవిదుడు - పరమశాంతుడు - సర్వగుడు - కవి - సర్వలోకహితుడు - లోకప్రియుడు. ఆ మునిచంద్రు డొకనాడు తన మహతివీణియగు గోటమీటుచు స్వరతాల రాగలయలతో బాడుచు భూతలమున దిరుగుచుండెను. అతడొకనాడు సామవేదములోని బృహద్రథంతర మంత్రముల విశేషములు వెల్లడించు దివ్యగాయత్రీ గానము సలుపుచు నాశ్రమము చేరెను. సరస్వతీ తీరమున మునులకు నివాసయోగ్యమై జ్ఞాన సుఖములు గలిగించుచు శమ్యాప్రాసమను తీర్థమొకటి గలదు. ఆ పావనతీర్థమున నా యాశ్రమము గలదు. నే నాదివ్యతేజములు వెదజల్లుచు నేతెంచు బ్రహ్మ మానస పుత్రుని వీక్షించి లేచి యెదురేగి యతని నర్చించితిని. నే నతని కర్యపాద్యాది విధులొనరించితిని. ఆ అమిత తేజస్వి గూర్చున్న పిమ్మట నేనతని సన్నిధిలో గూర్చుంటిని.

దృష్ట్వా విశ్రమిణం శాంతం నారదం జ్ఞానపారగమ్‌ | త మపృచ్ఛ మహం రాజ న్యత్పృష్టో%మంత్వయా%ధునా. 13

అసారే%స్మిం స్తు సంసారే ప్రాణినః కిం సుఖం మునే | నవశ్యామి వినిశ్చిత్య కదాచిత్కుత్రచిత్క్వచిత్‌. 14

ద్వీపే జాతో జనన్యాహం సంత్యక్త స్తతణాదపి | అనాశ్రయో వనే వృద్ధిం ప్రాప్తః కర్మానుసారతః. 15

తప స్తప్తం మయా చోగ్రం పర్వతే బహువార్షికమ్‌ | పుత్రకామేన దేవర్షే శంకరః సముపాసితః. 16

తతో మయా శుకః ప్రాప్తః పుత్రోజ్ఞానవతాంవరః | పాఠిత స్తు మయా సమ్య గ్వేదానాం సార ఆదితః. 17

స త్యక్త్వా మాం గతః క్వా%పి రుదంతం విరహాతురమ్‌ | లోకాల్లోకాంతరం సాధో వచనా త్తవ బోధితః. 18

తతో%హం పుత్రసంతప్త స్త్యక్త్వా మేరుం మహాగిరిమ్‌ | మాతరం మనసా కృత్వా సంప్రాప్తః కురు జాంగలమ్‌. 19

పుత్రస్నేహా దతితరాం కృశాంగః శోకసంయుతః | జాన న్మిథ్యేతి సంసారం మాయా పాశనియంత్రితః. 20

తతో రాజ్ఞా వృతాం జ్ఞాత్వా మాతరం వాసవీంశుభామ్‌ | స్థితో%త్రైవా%%శ్రమం కృత్వా సరస్వత్యా స్తటేవుభే. 21

శంతనుః స్వర్గతి ప్రాప్తో విధురా జననీ స్థితా | పుత్రద్వయయుతా సాధ్వీ భీష్మేణ ప్రతిపాలితా. 22

చిత్రాంగదః కృతో రాజా గంగాపుత్రేణ ధీమతా | కాలేన సో%పి మే భ్రాతా మృతః కామసమద్యుతిః. 23

తతః సత్యవతీ మాతా నిమగ్నా శోకసాగరే | చిత్రాంగదం మృతం పుత్రం రురోద భృశ మాతురా. 24

అట్లు దివ్యజ్ఞానియగు నారదర్షి విశ్రమించి శాంతిగనుండుట గని నీవు నన్నడిగిన ప్రశ్న నేనతనిని నీ విధముగ నడిగితిని: ఓ మునివర్యా! ఈ సారహీనమైన సంసారమందలి యే ప్రాణియు నెప్పుడు నెచ్చట నేరీతిగను సుఖశాంతులు బడయలేదని నేను గట్టిగ తెలిసికొంటిని. నేనొక ద్వీపముపై జన్మించితిని. పుట్టిన వెంటనే నన్ను నా తల్లి వదలి వెళ్ళెను. నేను నా కర్మ కొలదిగ దిక్కులేని వాడనై వనములందు పెరగితిని. దేవర్షీ! నేనపుడు పుత్రార్థినై యొక గిరిపై గిరీశుడైన శంకరుని గూర్చి తీవ్ర తపమొనరించితిని. నాకు మహాజ్ఞాని యగు శుకుడు జన్మించెను. నేనతనికి వేదాలసారము మొత్తము మొదటి నుండియు చక్కగ చెప్పితిని. నీ ప్రబోధముల పుణ్యమాయని అతడు నన్ను వదలి వేరొకలోకమున కరిగెను. నేను పుత్ర వియోగమున విలవిలలాడితిని. అంత నేను పుత్రవియోగ సంతప్తుడనై మేరుపర్వతము వదలి నా తల్లిని స్మరించుచు కురు భూముల కరిగితిని. ఈ సంసారమంతయును మిథ్యయని యెఱుంగుదును. ఐనను పుత్రవియోగము భరింపలేక శోకించి కృశించి మాయాపాశబద్ధుడనైతిని. శంతనుడు నా తల్లిని వివాహమాడెను. అదెఱింగి నేనచటనే సరస్వతీతటమున పుణ్యాశ్రమ మేర్పరచుకొంటిని. కొంతకాలమునకు శంతనుడు స్వర్గస్థుడుగాగా నా తల్లి విధవయయ్యెను. ఆమె యిర్వురు కుమారులను భీష్ముడు పెంచి పెద్ద చేయుచుండెను. ధీశాలియగు భీష్ముడు చిత్రాంగదుని రాజుగ జేసెను. చిత్రాంగదుడు నాకు సోదరుడు చక్కనివాడు. కొన్నాళ్ళకతడు కాలగర్భమున గలిసెను. తనకొడుకగు చిత్రాంగదుడు చనిపోవుటవలన నా తల్లి సత్యవతి శోకసాగరమున మునిగెను.

సంప్రాప్తో%హం మహాభాగ జ్ఞాత్వాతాం దుఃఃతాం సతీమ్‌ | ఆశ్వాసితా మయాత్యర్థం భీష్మేణ చ మహాత్మనా. 25

విచిత్ర వీర్య స్త్వపరో వీర్యవా న్పృథివీ పతిః | కృతో భీష్మేణ భ్రాతా వై స్త్రీరాజ్య విముఖేనహ. 26

కాశిరాజసుతే రమ్యే విజిత్య పృథివీపతీన్‌ | భీష్మేణా%%నీయ స్వబలా త్కన్యకే ద్వే సమర్పితే. 27

సత్యవత్యౌ శుభేకాలే వివామః పరికల్పితః | భ్రాతు ర్విచిత్రవీర్యస్య తదా%హం సుఃతో%భవమ్‌. 28

పునః సో%పి మృతో భ్రాతా యక్ష్మణా పీడితో భృశమ్‌ | అనపత్యో యువా ధన్వీ మాతా మే దుఃఃతా%భవత్‌. 29

కాశిరాజసుతే ద్వేతుమృతం దృష్ట్వా పతిం తదా | పతివ్రతాధర్మపరే భగిన్యౌ సంబభూవతుః. 30

తే ఊచతుః సతీం శ్వశ్రూం రుదతీం భృశదుఃఃతామ్‌ | పతినా సహ గామిన్యౌ భవిష్యావో హుతాశ##నే. 31

పుత్రేణ సహ తే శ్వశ్రు స్వర్గే గత్వా%థ నందనే | సుఖేన విహరిష్యావః పతినా సహ సంయుతే. 32

నివారితే తదా మాత్రా వధ్వౌ తస్మాన్మహోద్యమాత్‌ | స్నేహభావం సమాశ్రిత్య భీష్మస్యవచనా త్తదా. 33

గాంగేయేన చ మాత్రామే సమ్మంత్ర్య చ పరస్పరమ్‌ | కృత్వౌర్ధ్వ దైహికం సర్వం సంస్మృతోహంగజాహ్వయే. 34

స్మృతమాత్ర స్తు మాత్రా వై జ్ఞాత్వా భావం మనోగతమ్‌ | తరసైవా%%గతశ్చాహం నగరం నాగసాహ్వయమ్‌. 35

ప్రణమ్య మాతరం మూర్ధ్నా సంస్థితో%థ కృతాంజతిః | తా మబ్రువం సుతప్తాంగీం పుత్రశోకేన కర్శితామ్‌. 36

మహాత్మా! నా తల్లి దుఃఃతురాలగుట విని మహాత్ముడు భీష్ముడును నేనును వెళ్ళి యామెను నూరడించితిమి. భీష్ముడు రాజ్యరమా విముఖుడు. అతడు తన రెండవ తమ్ముడగు విచిత్రవీర్యుని రాజుగ జేసెను. అతడు ప్రతాపి భీష్ముడు రాజుల నెల్లరిని తన విక్రమముతో నోడించి కాశిరాజపుత్రికల నిర్వురను దెచ్చి సత్యవతి కిచ్చెను. ఒక శుభముహూర్తమున విచిత్రవీర్యున కా కన్యలతో వివాహము జరిగెను. అది గని నేను ప్రమోదమందితిని. నా తమ్ముడగు విచిత్రవీర్యుడు దనుర్ధనుడు వయసుగాడు. అయినను రాజయక్ష్మరోగ పీడితుడగుటవలన నతడును పుత్రహీనుడుగనేమరణించెను. అపుడు నా తల్లి వలవల యేడ్చెను. కాశిరాజపుత్రిక లక్క సెల్లెండ్రిరువురును తమ పతి మరణించుటవలన తామును పతివ్రతా ధర్మము పాటింప దలంచిరి. వారు బోరున విలపించుచున్న తమ యత్తతో నిట్లనిరి : మేమును మా పతితో సహగమన మొనర్తుము. అత్తా! నీ పుత్రుని గూడి మేము స్వర్గమున నందనవనమునందు సుఖముగ విహరింపగలము. అపుడు నా తల్లి భీష్ముని హితవచనములాలించి దయబూని తన కోడండ్రను సహగమన యత్నమునుండి వారించెను. విచిత్రవీర్యునకు పరలోకక్రియలు జరిగెను. ఆ పిదప నా తల్లి హస్తి పురమందుండి భీష్ముని హితవు ప్రకారము నన్ను మదిలో తలంచినది. ఆమె స్మరించి నంతనే నేను నా తల్లి భావమెఱింగి వేవేగ హస్తిపురమున కరిగితిని. అట పుత్రశోకమున కృశించియున్న నా తల్లికి దోయిలించి శిరమువంచి యిట్లంటిని :

మాత స్త్వయా కిమాహూతో మనసాహం తపస్విని | ఆజ్ఞాపయ మహత్కార్యం దాసో%స్మి కరవాణి కిమ్‌. 37

త్వం వే తీర్థం పరం మాత ర్దేవశ్చ ప్రార్థితః పరః | ఆగత శ్చింతిత శ్చా%త్ర బ్రూహి కృత్యం తవ ప్రియమ్‌. 38

ఇత్యుక్త్వా%హం స్థితస్తత్ర మాతుర గ్రే యదా మునే | తదాసా మామువాచేదం పశ్యంతీ భీష్మమంతికే. 39

పుత్ర తే%ద్య మృతో భ్రాతా పీడితో రాజయక్ష్మణా | తేనా%హం దుఃఃతా జాతా వంశ##చ్ఛేదభయాదిహ. 40

తస్మా త్త్వమద్య మేధావి న్మయా%హూతః సమాధినా | గాంగేయస్య మతేనాత్ర పారాశర్త్యా సిద్ధయే. 41

కులం స్థాపయ నష్టం త్వం శంతనో ర్మమకారణాత్‌ | రక్ష మాం దుఃఖతః కృష్ణవంశ##చ్ఛేదోద్భవా ద్ద్రుతమ్‌. 42

కాశిరాజసుతే భార్యే భ్రాతు స్తవ యవీయసః | సాధో ర్విచిత్ర వీర్యస్య రూప¸°వన భూషితమ్‌. 43

తాభ్యాం సంగమ్య మేధావి న్పుత్రోత్పాదనకం కురు | రక్షస్వ భారతం వంశం నాత్ర దోషో%స్తి కర్హిచిత్‌. 44

ఇతి మాతుర్వచః శ్రుత్వా జాతశ్చింతాతురోహ్యహమ్‌ | లజ్జయా%%కుల చిత్త స్తా మబ్రువం వినయానతః. 45

మాతః పాపాధికం కర్మ పరదారాభిమర్శనమ్‌ | జ్ఞాత్వా ధర్మపథం సమ్యక్కరోమి కథమాదరాత్‌. 46

తథా యవీయసో ర్ర్భాతు ర్వధూః కన్యా ప్రకీర్తితా | వ్యభిచారం కథం కుర్యా మధీత్య నిగమానహమ్‌. 47

అన్యాయేన న కర్తవ్యం సర్వథా కులరక్షణమ్‌ | న తరంతి మి సంసారా త్పితరః పాపకారిణః. 48

ఓ తపస్వినీ ! అమ్మా! నీ మనస్సులో నన్నేల స్మరించితివి? నేను నీ దాసుడను. నేనేమి కార్యము చేయవలయునో యాజ్ఞాపింపుము. తల్లీ! నాకు తీర్థము నీవే - పరదేవతవు నీవే! నీవు తలంచినంతనే వచ్చితిని. నీ కెట్టి ప్రియమొనర్పవలయునో తెలుపుము. నేనటుల పలికి నా తల్లిచెంత నుంటిని. అపుడామె భీష్మునివైపు చూచుచు నాతో నిట్లు పలికెను : పుత్రా! నీ సోదరుడు రాజక్ష్మరోగపీడితుడై మరణించెను. అందుచే వంశమింతటితో నాగునేమోయని భీతిచే దుఃఃంచుచున్నాను. మేధావీ! పారాశర్యా! ఈ శుభకార్యనిర్వహణమునకు భీష్ముననుమతితో నేను నిన్ను దలంచితిని. ఈ నశించుచున్న వంశమును శంతనుని పేరుమీద నిలువబెట్టుము. నా దుఃఖము పాపుము. సురూపము సుశీలముగల కాశీరాజపుత్రికలు నీ తమ్ముని భార్యలు. ఆ యిర్వురితో నీవు సంగమించి పుత్రోత్పత్తి చేయుము; భరతవంశమును పునరుద్ధరింపుము. దీనివలన నీకెట్టి దోషమును గలుగదు అను నా తల్లి పలుకులు విని నేను సిగ్గుచే చింతాపరుడనై సవినయముగ నిట్లంటిని : తల్లీ! పరభార్యలను దాకుట పాపము గదా! ధర్మమెఱింగిన నేనీపని కెట్టు లొప్పుకొందును? తమ్ముని భార్య స్వకన్యతో సమాన యందురు. కనుక వేదశాస్త్రము లెఱిగిన నేనట్టి వ్యభిచార కర్మము నెట్లు చేయగలను? ఒక కులము నన్యాయముతో నిలువబెట్టరాదు. అట్లు చేయు పాపాత్ముని పితరులు సంసారమునుండి తరింపరు.

లోకాన ముపదేష్టాయః పురాణానం ప్రవర్తకః | స కథం కుత్సితం కర్మ జ్ఞాత్వాకుర్యాన్మమాద్భుతమ్‌. 49

పునరుక్తో హ్యహం మాత్రా రుదత్యా భృశమంతికే | పుత్రశోకాతితప్తాయా వంశరక్షణ కామ్యయా. 50

పారాశర్య న తే దోసో వచనాన్మమ పుత్రక | గురూనాం వచనం తథ్యం సదోషమపి మానవైః. 51

కర్తవ్య మవిచార్యైవ శిష్టాచార ప్రమాణతః | వచనం కురుమే పుత్ర న తే దోషో%స్తి మానద. 52

పుత్రస్య జననం కృత్వా సుఃనీం కురు మాతరమ్‌ | విశేషేణ తు సంతప్తా మగ్నాం శోకార్ణవే సుత. 53

ఇతి తాం బ్రువతీం శ్రుత్వా తదా సురనదీసుతః | మా మువాచ విశేషజ్ఞః సూక్ష్మధర్మస్య నిర్ణయే. 54

ద్వైపాయన విచారో%త్ర న కర్తవ్య స్త్వయా%నఘ | మాతు ర్వచన మాదాయ విహరస్వ యథాసుఖమ్‌. 55

ఇతి తస్య వచః శ్రుత్వా మాతుశ్చ ప్రార్థనం తథా | నిఃశంకో%హం తదా జాతః కార్యే తస్మిన్‌ జుగుప్సితే. 56

అంబికాయాం ప్రవృత్తో%హ మృతుమత్యాం ముదా నిశి | మయి విమనసాయాం తు తాపసే కుత్సితే భృశమ్‌. 57

శప్తా మయాసా సుశ్రోణీ ప్రసంగే ప్రథమే తదా | అంధ స్తే భవితా పుత్రో యతో నేత్రే నిమీలితే. 58

ద్వితీయే%హ్ని మునిశ్రేష్ఠ పృష్టో మాత్రా రహః పునః | భవిష్యతి సుతః పుత్ర కాశిరాజసుతోదరే. 59

మ యోక్తా జననీ తత్ర వ్రీడానమ్ర ముఖేన హ | వినేత్రో భవితా పుత్రో మాతఃశాపాన్మమైన హి. 60

తయా నిర్భర్త్సిత స్తత్ర కఠోరవచసా మునే | కథం పుత్ర త్వయా శప్తః పుత్ర స్తే%ంధో భవిష్యతి. 61

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే చతుర్వింశో%ధ్యాయః

నేను లోకాలను మేలుబాట జూపువాడను. పురాణకర్తను. ఇక నే నెట్టు లిట్టి నీచకర్మమున కొడిగట్టగలను. అపుడు నా తల్లి పుత్రశోకముతో విలపించుచు వంశోద్ధరణము జేయదలచి నా చెంత కేతెంచి మఱల నిట్లనియెను : పరాశర నందనా! నా మాట వినుము. దీనివలన నీ కెట్టి దోషము లుండవచ్చును గాక! ఐనను పిన్నలు విచారింపక చేయుట మంచిది. ఇది శిష్టాచార పద్ధతి. కుమారా! నా మాట నమ్ముము. ఇందు నీకెట్టి దోషము తగులదు. నందనా! సంతానము గనుము. శోకసముద్రమున తపించుచున్న నీ తల్లికి సంతోషము గలిగింపుము. అని నా తల్లి పలుకగ సూక్ష్మ ధర్మనిర్ణేత విశేషజ్ఞుడు గంగాసుతుడునైన భీష్ముడు నాతో మెల్లగ నిట్లనెను : ఓ యనఘా! ద్వైపాయనా! నీవు చింతింపవలదు. తల్లి మాట నిలువబెట్టి యామెకు శాంతి గల్గింపుము. అపుడు నేను భీష్మ వచనములును తల్లి కోర్కియు నంగీకరించి శంక దక్కి యా నీచకార్యమునకు పూనుకొంటిని. నేనొక రేయి ఋతుమతియైన యంబికతో విలాసముగ గడపితిని. నా తపసవేషము జూడగనే యంబిక మనస్సు కలవర మొందెను. 'నీవు నా కలయికలో కన్నులు మూసికొంటివి. కనుక నీకు గ్రుడ్డివాడు పుట్టు'నని నేనామెను శపించితిని. మరునాడు నా తల్లి నన్నొంటరిగ పిలిచి 'మునిశ్రేష్ఠా! అంబికకు కొడుకు పుట్టునా?' యని నన్నడిగెను. అపుడు నేను తలవంచుకొని 'అమ్మా! ఆమెకు నా శాపమున గ్రుడ్డివాడు పుట్టు'నని నేనంటిని. అంత నా తల్లి కఠిన వాక్కులతో పుత్రుని గ్రుడ్డిని గమ్మని యేల శపించితి'వని నన్ను నిందించెను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు విక్షేపకశక్తి వర్ణనమను నిరుది నాల్గవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters