Sri Devi Bhagavatam-1    Chapters   

అథ త్రయోవింశో%ధ్యాయః

తస్యా స్తు వచనం శ్రుత్వా రమాపుత్రః ప్రతాపవాన్‌ | ప్రపుల్లవదనాంభోజ స్తామువా చ విశాంపతే. 1

రాజాః రంభోరు యస్త్వయా పృష్టో వృత్తాంతో విశదాక్షరః | హైపయో%హంచై కవీరనామ్నా సింధుసుతాసుతః. 2

మనో మే యత్త్వమా నూనం పరతంత్రం కృతం కిల | కిం కరోమి క్వి గచ్ఛామి విరహేణాతి పీడితః. 3

ప్రథమం రూప మాఖ్యాతం సర్వలోకాతిగం త్వయా | తేన మే విహ్వలం జాతం కామబాణహతం మనః. 4

తత స్తస్యా గుణాః ప్రోక్తా సై#్త స్తు చిత్తం హృతం పునః |

యత్త్వ యోక్తం పునర్వాక్యం తేన మే విస్మయో%భవత్‌. 5

ఏకావల్యా వచః ప్రోక్తం దానవాగ్రే మయా వృతః | హైహయ స్తం వినా నాన్యం వృనోమీతి వినిశ్చయః. 6

తేన వాక్యేన తన్వంగి : భృతో%హ మధునా కృతః త్వయా తస్యాః సుకేశాంతే బ్రూహి కిం కరవాణి వామ్‌. 7

స్థానం తస్య న జానామి రాక్షసస్య దురాత్మనః | గతి ర్మే నాస్తి గమనే పురే తస్మి న్సులోచనే. 8

వద మాం త్వం విశాలాక్షి : తత్ర ప్రాయితుం క్షమా | ప్రాపయాశు సఖీ తే సా యత్ర తిష్ఠతి సుందరీ. 9

మత్వా తం రాక్షసం క్రూరం మోచయిష్యామి సాంప్రతమ్‌ | వివశాం శోకసంతప్తాం రాజపుత్త్రీం తవప్రియామ్‌. 10

విముక్త దుఃఖాం కృత్వా%%శు ప్రాపయిష్యామి తే పురమ్‌ |

పిత్రే చాస్యాః ప్రదాస్యామి కన్యా మేకావలీ మహమ్‌. 11

పశ్చా ద్వివాహం కర్తా%సౌ రాజా పుత్రాః పరంతప | ఏవం తే మనసః కామో మమ చాపి ప్రియంవదే. 12

భవిష్యతి స సంపూర్ణః సాధనేన తవాధునా | దర్శయా%%శు పురం తస్య పశ్య మే త్వం పరాక్రమమ్‌. 13

ఇరువది మూడవ యధ్యాయము

హైహయ కాలకేతుల యుద్ధము

రాజా! అట్టి యశోవతి పలుకులు విని మహావీరుడైన యేకవీరుడు ప్రసన్న వదన కమలముతో నామెకిట్లు పలికెను : రంభోరూ! నీవు లలిత మృదువచనములతో నడిగిన వృత్తాంతము చెప్పెదను వినుము. నేను హైహయ వంశీయుడను. నాపే రేక వీరుడు. నేను లక్ష్మీ పుత్రుడను. నీవు నా మనస్సును పరవశము చేసితివి. నేను విరహవేదనచే కృశించుచున్నాను. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? మొదట నీవతిలోకమైన నీ చెలి సింగారపుమేనిసొంపులు వర్ణించితివి. నా యెడద కామబాణహతమై దాని కువ్విళ్ళూరు చున్నది. ఆమె గుణవర్ణనమున నా చిత్తము నాలో లేకున్నది. ఆమె నన్ను దోచుకొనినది. ఈ రెంటిపిదప నీవు రాక్షసవృత్తాంతము చెప్పితివి. అది విని నాకు వింతగనున్నది. అంతటి రాక్షసుని కాలదన్ని 'నేను హైహయునే వరించితిని. అతని కంటె నన్యునివరింప'నని యేకావలి తెంపుతో రక్కసుని ముందు చెప్పినదా! ఆమె పల్కిన ఈ మాటలకు నే నామెకు దాసుడనైతిని. ఇపుడు నీకేమి మేలుచేసి పెట్టవలయునో తెలుపుము. సులోచనా! నాకా దుష్టరాక్షసుడున్న చోటు దెలియదు. అతని పురమునకు వెళ్ళు మార్గము తెలియదు. సుందరీ! విశాలసుందరాక్షీ! నన్నామె ముందునకు చేర్చుటకు నీవే తగినదానవు. కనుక నన్ను నీ చెలికత్తెయుండు చోటునకు త్వరగ జేర్చుము. నేనా క్రూరరాక్షసుని నిలువున చంపగలను. వివశత్వముతో శోకసంతప్తయగు నీ ప్రియరాజ పుత్రిని విడిపింపగలను. ఆమె మదిలోని తీరనివెత తీర్చగలను. ఆమెను నగరి కంపగలను. ఆ యేకావళి నామె తండ్రి కప్పగింపగలను. ప్రియవాదినీ! ఆ పిదప రాజామెకు పెండ్లి చేయును. ఇది నా నిశ్చితాభిప్రాయము. నీ కోర్కెయు నిదేకదా! ఇపుడు నీ ప్రయత్నమున సర్వము సమకూరును. కనుక రాక్షసుని పురము చూపుము. ఇక నా పరాక్రమము చూడుము.

యథా హన్మి దురాచారం పరదాపహారకమ్‌ | తథా కురు ప్రియంకర్తుం శక్తా%సి వరివర్ణిని. 14

మార్గం దర్మయ తస్యాద్య పురస్య దుర్గమస్య చ | తన్నిశమ్య ప్రియం దాక్యం ముదితాచయశోవతీ 15

తము వాచ రమాపుత్రం గమనోపాయ మాదరాత్‌ | మంత్రం గృహాణ రాజేంద్ర! భగవత్యా స్తు సిద్ధి దమ్‌. 16

దర్శయిష్యామి తస్యాద్య పురం రాక్షస పాలితమ్‌ | సజ్జోభవ మహాభాగత గమనాయ మయాసహ. 17

సైన్యేన మహతా యుక్త స్తత్ర యుద్ధం భవిష్యతి | కాలకేతు ర్మహావీరో రాక్షసై ర్బలిభి ర్వృతః. 18

తస్మా న్మంత్రం గృహీత్వా త్వం ప్రజ తత్రయాసహ | దర్శయిష్యామి తే మార్గం పురస్యాస్య దురాత్మనః. 19

హత్వా తం పాప కర్మాణం మోచయా%%శు సఖీం మమ | శ్రుత్వాతద్వచనం వీరో మంత్రం జగ్రాహ సత్వరః. 20

దత్తాత్రేయాద్దైవ యోగాత్ర్పాప్రాప్తాత్‌ జ్ఞానివరాచ్ఛుభాత్‌ | యేగేశ్వరీ మహామంత్రం త్రిలోకీ తిలకాభిధమ్‌. 21

తేన సర్వజ్ఞతా జాతా సర్వాంతశ్చారితా తథా | తయా సహ జగామా%%శు పురం తస్య సుదర్గమమ్‌. 22

రక్షితం రాక్షసై రోరైః పాతాళమివ పన్నగైః | యశోవత్యా చ సైన్యేన మహతా సంయుతోనృపః. 23

త మా యాంతం సమాలోక్యం దూతాస్తస్య భయాతురాః | క్రోశతో%భియయుః పార్శ్వం కాలకేతో స్తరస్వినః. 24

తమూచుః సహసా మత్వా రాక్షసం కామమోహితమ్‌ | ఏకావలీ సమీపస్థం కుర్వంతం వినయా న్బహూన్‌. 25

దూతా ఊచుః : రాజ న్యశోవతీ నారీ కామిన్యాః సహచారిణీ | ఆయాతి సహ సైన్యేన రాజపుత్రేణ సంయుతా. 26

వరవర్ణినీ! శుభకార్యములు చేయించుటకు నీవే తగిన జాణవు. ఆ దురాచారి పరదారల నపహరించువాడు; అతనిని నేను సంహరించు విధానము గల్గింపుము. వాని దుర్గమమైన పురమునకు త్రోవజూపుము అను ప్రియవచనములు వినిన యశోవతి ముదితురాలయ్యెను. అపుడామె రమాసుతుడు రాక్షసునిజేరు నుపాయమిట్లు చెప్పెను: రాజా! శ్రీభగవతి యొక్క సర్వసిద్ధ ప్రదమగు మహామంత్రము గలదు. దానిని స్వీకరింపుము. మహాత్మా! ఆ రాక్షసుడు నిసించు పురమును నీ కిపుడే చూపగలను. నీవు నాతో వచ్చుటకు సిద్ధపడుము. కాలకేతు మహావీరుడు. పెక్కుమంది రాక్షసులు వాని కండగ నున్నారు. అతని బలము చాల గొప్పది. అచట మీ యిర్వురకు పోరు సాగగలదు. కనుక నీవు శ్రీదేవీమంత్రము గ్రహించి నావెంటరమ్ము. ఆ దుష్టుడున్న పురము త్రోవ నీకు జూపగలను. నీవా పాపకర్ముని చంపి నా చెలిచెఱ బాధ తొలగింపుము. అను నామె తీపి పలుకులు విని యేకవీరుడు మంత్రము గ్రహించెను. అంతలో దైవయోగమున నచటికి మహాజ్ఞాని యగు దత్తాత్రేయ డరుదెంచెను. ఏకవీరు డా ఋషి వలన త్రిలోకతిలకాయమానమై శుభనామముగల శ్రీయోగేశ్వరీ మహామంత్రము గ్రహించెను. ఆ మంత్ర ప్రభావమున నతని కన్నియు నెఱుగు శక్తియు నంతట తిరుగు శక్తియు గల్గెను. అతడు యశోవతిని గూడి రక్కసుని చొరరాని పురికి పయనమయ్యెను. యశోవతి కొంతసేనను వెంటగొనివచ్చెను. ఆ క్రూర రాక్షసుని పురము పన్నగములు గల పాతాళమువలె రాక్షసులచే రక్షింపబడుచుండెను. అట్టి పురమును హైహయుడును యశోవతియు జేరిరి. ఆ రీతిగ దండెత్తివచ్చుచున్న వీరునిగని రాక్షస భటులు భయపడి రోదించుచు కాలకేతుని చెంతకరిగిరి. అత్తఱి రాక్షసు డేకావళి చెంత గూర్చుండి కామమోహితుడై వినయముగ ప్రియములు పలుకుచుండెను. అది గని భటులతనికిట్లనిరి : రాజా! ఈ కామిని చెలియగు యశోవతి యొక రాకుమారుని వెంట పెట్టుకొని గొప్ప సేనతో వచ్చుచున్నది.

జయంతో వా మహారాజ కార్తికేయో%థవా సు కిమ్‌ | ఆ గచ్ఛతి బలోన్మత్తో వాహినీ సహితః కిల. 27

సంయత్తో భవ రాజేంద్ర సంగ్రామః సముపస్తితః | దేవ పుత్రేణ యుధ్యస్వ త్యజ వా కమలేక్షణాత్‌. 28

ఇతో దూరే%స్తి సైన్యం త ద్యోజన త్రయ మాత్రతః | సజ్జో భవ మహీపాల దుందుభిం ఘోషయాశువై. 29

తేషాం తద్వచనం శ్రుత్వా రాక్షసః క్రోధమూర్ఛితః |

రాక్షసా న్ర్పేరయా మాస సాయుధా న్సబలా న్బహూన్‌. 30

గచ్ఛధ్వం రాక్షసాః సర్వే సమ్ముఖాః శస్త్రపాణయః | తానాజ్ఞాప్య కాలకేతుః పప్రచ్ఛ ప్రణయాన్వితః. 31

ఏకావళీం సమీపాస్థాం వివశాం భృశ దుఃఃతామ్‌ | కో%య మాయాతి తన్వంగి పితా తే వా పరఃపుమాన్‌. 32

త్వదర్థే సైన్య సంయుక్తో బ్రూహి సత్యం కృశోదరి | పితా తే యది సంప్రోప్తో నేతుంత్వాం విరహాతురః. 33

జ్ఞాత్వా తే పితరం సమ్యక్సంగ్రామం న కరోమ్యహమ్‌ | ఆనయిత్వా గృహే పూజాం రత్నైర్వ సై#్త్రర్హయైః శుభైః. 34

కరోమి తస్య చాతిథ్యం గృహే ప్రాప్తస్య సర్వథా | అన్యశ్చేద్యది సంప్రాప్తస్తం హన్మి నిశితైః శ##రైః. 35

ఆనీతః కిల కాలేన మరణాయు మహాత్మనా | తస్మా ద్వద విశాలాక్షి కో%యమాయాతి మందధీంః. 36

అజ్ఞాత్వా మాం దురాధర్షం కాలరూపం మహాబలమ్‌ |

ఏకావల్యువాచ : నజానే%హం మహాభాగ కో%యమాయాతి సత్వరః. 37

నమే%స్తి విదితః కో%పి స్థితాయా స్తవ బంధనే | నా%యం పితా మే న భ్రాతా కో%ప్యన్యో%స్తి మహాబలః. 38

కిమర్థ మిహ చాయాతి నా%హం వేద వినిశ్చయమ్‌ |

దైత్య ఉవాచ : ఏవం వదం త్యమీ దూతా వయస్యా తే యశోపతీ. 39

సమానీయ చ తం వీర మాగతేతి కృతోద్యమా | క్వ గతా సా సఖీ కాంతే విదగ్ధా కార్యనిశ్చయే. 40

నాన్యః కో%పి మమారాతి ర్యో మే ప్రతిబలోభ##వేత్‌ | ఏతస్మి న్నంతరే దూతా స్తత్రా%న్యే సమాగతాః. 41

ఆ వీరుడు జయంతుడో! కార్తికేయుడో తెలియుట లేదు. అతడు రణమదోన్మాదమున సేనా సమేతముగ వచ్చుచున్నాడు. పోరాటము సిద్ధమైనది. త్వరపడుము. ఆ దేవపుత్రునితో నీవు పోరుము. లేదా యీ కమలాక్షిని వదలి పెట్టుము. వారి సైన్యము మూడు యోజనములంత మేర వ్యాపించినది. నీవును సిద్దపడుము. వేగ రణభేరి మ్రోగించుము అను భటుల మాటలు విని రాక్షసుడు క్రోధమూర్ఛితుడై తన బలశాలురగు సాయుధ రాక్షసుల నిట్లు పురికొల్పెను: రాక్షసులారా! మీరు శస్త్రపాణులై వైరులను మార్కొనుడు; వెళ్ళుడు అని రాజు తన భటుల కాజ్ఞాపించెను. కాని, తాను మాత్రము ప్రేమపూర్ణుడయ్యెను. అతడు వివశుడై తనచెంత దుఃఃంచుచున్న యేకావళితో నిట్లనియెను : 'ఓ తన్వంగీ! ఆ వచ్చువాడెవడు? నీ తండ్రియా లేకె పరపురుషుడా? తలోదరీ! నీ కొఱకు సేనతో వచ్చువా డెవడై యుండును? ఒకవేళ నీ తండ్రి నిన్ను బాసియుండలేక వచ్చుచున్నాడేమో? అతడు నీ తండ్రియైనచో నేనతనితో యుద్ధము చేయను. అతనికి నా యింటికి సగౌరవముగ దెచ్చి పూజించి రత్న వస్త్రహారములిచ్చి సత్కరింతును. అతనికి నా యింట సర్వ విధముల నాతిథ్య మిత్తును కాక! అతడు పరవీరుడైనచో నతనిని నా వాడియమ్ములతో దునుముదును. అతడీ మహాకాలుని చేతిలో చచ్చుటకే వచ్చుచున్నాడు. కనుక నో విశాలాక్షీ! ఆ వచ్చుచున్న మందమతి యెవడు? అతడు దుర్ధర్షడను మహాబలుడనగు నా లావెఱుగక వచ్చుచున్నాడు కాబోలు! అతడెవడో తెలుపుము ఏకావళి యిట్లనెను : మహాత్మా! ఆ వచ్చుచున్న వీరుని నే నెఱుగను. నీ చెఱలో నున్న నాకేమియు తెలియదు. అతడు నా తండ్రిగాని సోదరుడు గాని కాదు. ఎవడో మహావీరుడు గాబోలు! అతడెందులకు వచ్చుచున్నాడో నాకు నిజముగ తెలియదు. రాక్షసు డిట్లనెను : 'నా భటులు నాతో ఏకావళి చెలి యశోవతి పనిగట్టుకొని యొక వీరుని వెంటబెట్టుకొని వచ్చుచున్నదనిరి. ఇంతకు నీ సః కార్యకుశల, ఆమె యెచటి కేగెను? నాకు ప్రతి వీరుడగు వైరి యెవ్వడును లేడు' అని రాక్షసు డనుచున్నంతలో భటులు కొందఱచటికి వచ్చిరి.

తే హో చు స్త్వరితా భీతాః కాలకేతుం గృహే స్థితమ్‌ | కిం స్వస్థో%సి మహారాజ సమీపే సైన్య మాగతమ్‌. 42

నిర్గచ్ఛ నగరా త్తూర్ణం సైన్యేన మహతావృతః | ఇతి తేషాం వచః శ్రుత్వా కాలకేతు ర్మహాబలః. 43

రథ మారుహ్య త్వరితో నిర్య¸° స్వపురా ద్బమిః | ఏకవీరో%పి సహసా హయారూఢః ప్రతాపవాన్‌. 44

ఆగత స్తత్ర కామిన్యా విరహేణ సమాకులః | యుద్ధం తయో రభూ త్తత్ర వృత్రవాసవయెరివ. 45

శస్త్రా సై#్త ర్బహుధా ముక్తై రాదీపిత దిగంతరమ్‌ | వర్తమానే తదా యుద్ధే కాతరాణం భయావహే. 46

గదయా తాడయామాస దైత్యం సింధుసుతాసుతః | స గతాసుః పపారోతర్వ్యాం వజ్రాహత ఇవాచలః. 47

పలాయిత్వా గతాః సర్వే రాక్షసా భయపీడితాః | యశోవతీ తతో గత్వా వేగాదేకావలీం తదా. 48

ఉవాచ మధురాం వాణీం ముదితా విస్మితాం భృశమ్‌ | ఏహ్యాలి నృపపుత్రేణ దానవో%సౌ నిపాతితః. 49

ఏకవీరేణ ధీరేణ యుద్ధం కృత్వా సుదారుణమ్‌ | స్కంధావారే%ప్య సౌ రాజా తిష్ఠత్యద్య శ్రమాతురః. 50

దర్శనం కాంక్షమాణ స్తే శ్రుతరూపగుణస్తవ | పశ్చ తం కుటిలాపాంగి! మనోభవ సమం నృపమ్‌. 51

కథితా త్వం మయా పూర్వం తస్యా%గ్యే జాహ్నివీతటే | పూర్ణానురాగః సంజాత స్తేనా%సౌ విరహాతురః. 52

వాంఛతి త్వాం చారురూపాం ద్రష్ఠుం నృపతి నందనః | సా తస్యా వచనం శ్రుత్వా గమనాయ మనో దధే. 53

తన యింటిలో నున్న కాలేకేతునకు త్వరితముగ వారిట్లనిరి : రాజా! సైన్యము మనమీద వచ్చిపడుచున్నది. ఇంకను తీరికగ నిట్లు కూరుచుంటికేమి? నీవు వెంటనే గొప్ప సేనతో నగరు వెడలుము. భటుల మాటలు బలశాలియగు కాలకేతువు వినెను. అతడరదమెక్కి వేగముగ దన నగరము బయటి కేగెను. అదే సమయమున ప్రతాపియగు నేక వీరుడును రథమెక్కి వచ్చెను. ఏక వీరుడును కామినీ వియోగమున తపించుచుండెను. అంత వారిర్వురును వాసన వృత్రుల వలె ఘోరముగ పోరు సాగించిరి. వారి శస్త్రాస్త్రముల తళతళలతో నింగి మిఱుమిట్లు గొల్పుచుండెను. వారి పోరు పిరికి గుండెలదరిపడునట్లు దారుణముగ సాగుచుండెను. అంతట రమాపుత్రుడు రాక్షసుని గదతో గట్టిగ కొట్టెను. ఆ దెబ్బకు వాడు వజ్రాహతమగు గిరి వలె నేలగూలెను. తక్కిన రక్కసులెల్లరు భయకంపితులై కాలికి బుద్ధి చెప్పిరి. అపుడు యశోవతి యేకావళిని సమీపించి వింతగ తీయగ నిట్లనియెను : ఓ చెలియా! రారమ్ము; ఒక రాకుమారునిచేత దానవుడు నిహతుడయ్యెను. ఆ వీరు డేకవీరుడు. అతడు మహాధీరుడు. అతడు దారుణముగ పోరి దానవుని చంపెపను. అతడు మిక్కిలి శ్రమ జెంది సేనల గుడారములో సేద దీర్చుకొనుచున్నాడు. చపలాక్షీ! ఆ రాజవరుడు మన్మథుని చందమున నందగాడు. ఆ వీరుడు నీ యెదలోని దొడ్డ సుగుణములు విని తన కన్నుల కరవు దీర్చుకొన నిన్ను చూడ కాంక్షించుచున్నాడు. నేను గంగాతటమున నిన్ను గుఱించి యతనితో నెమ్మిగదుర బలికితిని. అతడు నా ప్రియవచనములకలరి రాగమగ్నుడై విరహాతురుడయ్యెను. ఆ నరపతి నందనుడు నీ సురూపమును తమితీర తిలకింప కోరుచున్నాడు.

లజ్జమానా భృశం భీత్యా కౌమార ప్రాప్తయా తయా | కథం తస్య ముఖం ద్రక్ష్యే కుమారీ హ్యవశా భృశమ్‌. 54

స మాం గృహ్ణాతి కామార్త ఇతి చింతాకులా సతీ | యశోవత్యా యుతా తత్ర నరయాన స్థితా య¸°. 55

స్కంధా వారే%తి మలినా మలినాం బరధారిణీ | తమాగతాం విశాలాక్షీం దృష్ట్వా రాజసుతో%బ్రవీత్‌. 56

దర్శనం దేమి తన్వంగి తృషితే నయనే మమ | కామాతురం చ తం వీక్ష్య తాంచ లజ్జా భరావృతామ్‌. 57

నీతిజ్ఞా శిష్ట మార్గజ్ఞా తమువాచ యశోవతీ | రాజపుత్ర పితా%వ్యస్యా స్త్వామేనాం దాతు మిచ్చతి. 58

ఏసా%పి త్వ ద్వశా నూనం భవితాసంగమ స్తవ | కాలం ప్రతీక్ష్య రాజేంద్ర నయైనాం పితురంతికమ్‌. 59

స వివాహ విధిం కృత్వా దాస్య తీతి వినిశ్చయః | స తస్యా వచనం తథ్యం మత్వా సైన్యసమన్వితః. 60

సమేతః కామినీభ్యాం తు య¸° తత్పితు రాశ్రమమ్‌ | రాజపుత్రీం తథా యాతాం శ్రుత్వా ప్రేమసమన్వితః. 61

ప్రయ¸° సమ్ముఖ స్తూర్ణం సచివైః పరివేష్టితః | బహుభి ర్దవసై ర్దృష్టా పుత్రీ స మలినాంబరా. 62

యశో వత్యా స్తు వృత్తాంతః కథితో విస్తరాత్పురః | ఏకవీరం మిలిత్వా%సౌ గృహమానీయ చాదరాత్‌. 63

పుణ్య%హ్ని కారయా మాస వివాహం విధిపూర్వకమ్‌ | పారిబర్హం తతో దత్వా సంపూజ్య విధివత్తదా. 64

పుత్రీం విసర్జయామాస యశోవత్యా సమన్వితామ్‌ | ఏవం వివాహే సంవృత్తే రమాపుత్రో ముదాన్వితః. 65

గృహం ప్రాప్య బహూ న్భోగా న్బభుజే ప్రియయా సమమ్‌ | బభూవ తస్యాం పుత్ర స్తు కృతవీర్యాభిధః కిల. 66

తత్సుతః కార్తవీర్య స్తు వంశో%యం కథితో మయా. 67

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే త్రయోవింశోధ్యాయః.

ఇట్లనుచున్నంతలో నేకావళిలో పెండ్లి కూతునకు తగిన సిగ్గు తొట్రుపాటు ముంచుకొని వచ్చెను. వివశురాలనగు నేనతని ముఖమెట్లు చూతునాయని యామె తన మదిలో దలచెను. ఆ కామర్తుడు తన్ను తప్పక తన సొంతము చేసికొనునని తలంచు చామె యశోవతితో పూలపల్లకిలో గూర్చుండి వెళ్ళెను. ఆమె మాసిన మేనిపై మాసిన చీరగట్టి రాజున్న గుడారము చెంత కేగెను. ఆ వచ్చుచున్న విశాలాక్షిని వీక్షించి రాకుమారు డిట్లనెను: ' పూబోడీ! తన్వీ! నా కన్నులు దప్పికొన్నవి. నీ కన్నులు చినుకు వెన్నెలలవలన వాని దప్పితీరును: అని తన సరసను ముచ్చటాడుచున్న కామపరవశుని క్రీగంట తలవంచుకొన్న ప్రేమముగ్ధ అగు ఏకావళిని యశోవతి గాంచెను. యశోవతి శిష్టాచారము తెలిసినది. ఆమె రాకొమరునకిట్లనెను : రాకుమారా! ఈమె తండ్రి యీమెను నీ చేతులలో నుంచదలంచెను. ఇపుడీమె తానుగ నీ హృదిలో నింత చోటుజేసికొనెను. ఇక మీ యిర్వురి సాంగత్యము జరిగితీరును. కొద్ది సమయము వరకు వేచియుండుము. ఈమె నీమె తండ్రి చెంతకు గొనిపొమ్ము. అతడు వివాహ విధి యథావిధి జరిపి యీమెను నీ కప్పగింత పెట్టగలడు అను యశోవతి మాటలలో నిజమెఱింగి రాకుమారుడు సేనతో గదలెను. ఆ విధముగ నేకవీరుడిర్వురు జవరాండ్రను గూడి యేకావళి తండ్రి కడకేగెను. తన పట్టి తిరిగివచ్చుట విని రాజు సంతుష్టుడయ్యెను. రాజు మంత్రులను వెంటగొని వారి కెదురుకోలు జరిపెను. చాలా కాలమునకు మలినాంబరములతో తన పుత్రిక గనంబడినందులకు రాజు హర్షించెను. యశోవతి జరిగిన విషయమంతయు దెలిపెను. అపుడు రా జేకవీరుని గలిసి యతనిని సగౌరముగ తన యింటికి తోడుకొని వెళ్ళెను. అతడు శీఘ్రతరముగ నొక శుభముహూర్తమున వారికి వివాహము యథావిధిగ జరిపించెను. రాజతనిని సత్కరించి యతనికి పెక్కు వస్తు సంభారములు కానుకగ నొసంగెను. తన కూతు నేక వీరునితో నంపెను. యశోవతి తండ్రి యశోవతిని సైతము రాకుమారుని వెంట నంపెను. ఇట్లు రమా పుత్రుడు వివాహము చేసికొని పరమానందభరితుడయ్యెను. అతడు తన యింటి కరిగి వారిని గూడి పెక్కు సుఖభోగము లనుభవించెను. ఏకావళికి కృతవీర్యుడను పుత్రుడు గలిగెను. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యుడును పేర విశ్వవిఖ్యాతి గాంచెను. ఇట్లు హైహయవంశమును వర్ణించితిని.

ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి షష్ఠస్కంధమందు హైహయకాలకేతుల యుద్ధమను నిరువది మూడవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters