Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్దశో%ధ్యాయః

మైత్రావరుణి రిత్యుక్తం నామ తస్య మునేః కథమ్‌ | వసిష్ఠస్య మహాభాగ బ్రహ్మణ స్తనుజస్య హ. 1

కిమసౌ కర్మతో నామ ప్రాప్త వా న్గుణత స్తథా | బ్రూమి మే వదతాంశ్రేష్ఠ కారణం తస్య నామజమ్‌. 2

వ్యాస ఉవాచ : నిబోధ నృపతి శ్రేష్ఠ వసిష్ఠో బ్రహ్మణః సుతః | నిమి శాపా త్తనుం త్యక్త్వా పునర్జాతో మహాద్యుతిః. 3

మిత్రా వరుణయో ర్యస్మాత్త త్తస్మా న్నామ విశ్రుతమ్‌ | మైత్రావరుణి రిత్యస్మిం ల్లోకే సర్వత్ర పార్థివ. 4

రాజోవాచ : కస్మా చ్ఛ ప్తః స ధర్మాత్మా రాజ్ఞా బ్రహ్మాత్మజో మునిః | చిత్ర మేత న్మునిం లగ్నో రాజ్ఞా శాపో%తి దారుణః. 5

అనాగసం మునిం రాజా కిమసౌ శప్త వాన్మునే - కారణం వద ధర్మజ్ఞ తస్య శాపస్య మూలతః. 6

వ్యాస ఉవాచ : కారణం తు మయా ప్రోక్తం తవపూర్వం వినిశ్చితమ్‌ | సంసారో%యం త్రిభిర్వ్యాప్తో రాజ న్మాయాగుణౖః కిల. 7

ధర్మం కరోతు భూపాల శ్చరంతు తాపసాస్తపః | సర్వేషాం తు గుణౖ ర్విద్ధం నోజ్జ్వలం తద్భ వేదిహ. 8

కామక్రోధాభిభూతాశ్చ రాజనో మునయ స్తథా | లోభాహంకార సంయుక్తా శ్చరంతి దుశ్చరం తపః. 9

యజంతి క్షత్రియా రాజ న్రజోగుణ సమావృతాః | బ్రాహ్మణా స్తు తథా రాజ న్న కో%పి సత్త్వసంయుతః. 10

ఋషిణా%సౌ నిమిః శప్త స్తేన శప్తో మునిః పునః | దుఃఖా ద్దుఃఖతరం ప్రాప్తా పుభావపి విధే ర్బలాత్‌. 11

ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి ర్మనసః శుద్ధి రుజ్జ్వలా | దుర్లభా ప్రాణినాం భూప | సంసారే త్రిగుణాత్మకే. 12

పరాశక్తి ప్రభావో%యం నోల్లంఘ్యః కేనచిత్క్వచిత్‌ | యస్యానుగ్రహ మిచ్ఛేత్సా మోచయత్యేవ తం క్షణాత్‌. 13

మహంతో%పి న ముచ్యంతే హరిబ్రహ్మహరాదయః | పామరా అపి ముచ్యంతే యథా సత్యప్రతాదయః. 14

తస్యాస్తు హృదయం కో%పి న వేత్తి భువనత్రయే | తథాపి భక్తవశ్యేయం భవత్యేవ సునిశ్చితమ్‌. 15

తస్మా త్త ద్భక్తి రాస్థేయా దోష నిర్మూలనాయ చ | రాగదంభాదియుక్తా చేత్సా భక్తి ర్నాశినీ భ##వేత్‌.16

పదునాల్గువధ్యాయము

వసిష్ఠుని పూర్వజన్మ వృత్తాంతము

జనమేజయు డిట్లనెను : ఓ వ్యాస! మహాత్మా! వసిష్ఠుడు బ్రహ్మ మానస పుత్త్రుడు కదా! అతనిని మైత్రావరుణుడని యంటివి. అతనికా పేరెట్లు వచ్చెను? వాక్య విశారదా! అతనికా పే రతని కర్మ వలన గలిగెనా? లేక గుణము వలన గలిగెనా? ఆ కారణము నాకు విశదీకరించుము. వ్యాసుడిట్లనెను : 'ఓ రాజా! వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్త్రుడు. అతడు నిమిశాపమున తన మేను చాలించి పునర్జన్మమందెను. ఆ మఱుజన్మలో నతడు మిత్రావరుణులకు జన్మించుటవలన లోకమున మైత్రావరుణి నామధేయముతో ప్రసిద్ధి కెక్కెను.' రాజిట్లనెను : 'వసిష్ఠుడు బ్రహ్మతేజోబలుడు బ్రహ్మజుడు ధర్మ స్వరూపుడు. అట్టి వాడొక రాజు శాపమునకు దారుణముగ గురియగుట వింతగనున్నది. ఏ పాప మెఱుగని బ్రహ్మర్షిని రాజేల శపించెనో యా కారణమును వినిపింపుము.' అన వ్యాసుడిట్లనెను : 'రాజా! నేనీ యింతటికిని కారణము పూర్వమే తెల్పితిని. ఈ జగములు త్రిగుణములచే వ్యాపించియున్నవి. పూర్వము తెలిపిన రాజులు ధర్మమాచరించి యుందురుగాక! తబిసి తపము చేసియుండుగాక! కాని, వారి వారి కర్మములు మాయాగుణబద్ధములయ్యెను. కనుక నవి సాత్త్వికత్వము గాంచలేకుండెను. రాజులను మునులును కాలక్రమమున కామక్రోధములకు లోభాహంకారములకు లోనై దారుణ తపము లొనర్చిరి. రాజులు రజోగుణముతో యాగము లొనర్చిరి. విప్రడెవ్వడును సత్త్వగుణముతో వెలుగొందలేడు. కనుక నిమివలన మునియు ముని వలన నిమియును పరస్పరము విధివశమున శపించుకొని క్లేశములు కొనితెచ్చుకొనిరి. ఈ జగము గుణత్రయ బద్ధము కనుక నెల్ల జీవులకు చిత్తశుద్ధి క్రియాశుద్ధి మనఃశుద్ధియును మూడును దుర్లభములు. ఇదంతయు నా దివ్యపరాశక్తి మాయాప్రభావమున గల్గును. దానినెంత వాడును మీఱజాలడు. ఆ దయామయి యెవని ననుగ్రహించునో వాడు ముక్తుడగును. ఇంతయేల? ఆ మాత దయలేనిచో హరి హర బ్రహాదులును ముక్తులు గాజాలరు. పామరులు సత్యవ్రతాదులవలె దేవి దయవలన తరింతురు. ఆ సర్వేశ్వరి హృదయపులోతు లెఱుగువా డీ ముల్లోకములలో లేదు. ఐనను ఆ తల్లి దేవీ భక్తులకు వశ##మై యుండును. కనుక దోషములెల్ల తొలగుటకు సాత్త్విక శాశ్వత భక్తి ముఖ్యాతిముఖ్యము. భక్తిలో రాగదంభములు తావు చేసికొన్నచో నది దుఃఖదాయక మగును.

ఇక్ష్వాకుకుల సంభూతో నిమిర్నామ నరాధిపః | రూపవా న్గుణసంపన్నో ధర్మజ్ఞో లోకరంజకః. 17

సత్యవాదీ దానపరో యాజకో జ్ఞానవాన్‌ శుచిః ద్వాదశ స్తనయో దీమా న్ర్పజాపాలన తత్పరః. 18

పురం నివేశయా మాస గౌతమాశ్రమసన్నిధౌ | జయంతుపురసంజ్ఞం తు బ్రాహ్మణానాం హితయ సః. 19

బుద్ధి స్తస్య సముత్పన్నా యజేయ మితి రాజసీ | యజ్ఞేన బహుకాలేన దక్షినాసంయుతేన చ. 20

ఇక్ష్వాకుం పితరం దృష్ట్వా యజ్ఞకార్యాయ పార్థివ | కారయామాస సంభారం యథోద్దిష్టం మహాత్మభిః. 21

భృగు మంగిరసం చైవ వామదేవం చ గౌతమమ్‌ | వసిష్టం చ పులస్త్యం చ ఋచీకం పులహం క్రతుమ్‌. 22

మునీ నామంత్రయామాస సర్వజ్ఞా న్వేదపారగాన్‌ | యజ్ఞవిద్యా ప్రవీణాం శ్చ తాపసా న్వేదవిత్తమాన్‌. 23

రాజా సంభృత సంభారః సంపూజ్యం గురుమాత్మనః | వసిష్ఠం ప్రాహ ధర్మజ్ఞో వినయేన సమన్వితః. 24

యజేయం మునిశార్ధూల యాజయస్వ కృపానిధే | గురు స్త్వం సర్వవేత్తా%సి కార్యం మే కురు సాంప్రతమ్‌. 25

యజ్ఞోపకరణం సర్వం సమానీతం సుసంస్కృతమ్‌ | పంచవర్ష సహస్రం తు దీక్షాం కర్తుం మతి శ్చ మే. 26

యస్మి న్యజ్ఞే సమారాధ్యా దేవీ శ్రీజగదంబికా | తత్ర్పీత్యర్థ మహం యజ్ఞం కరోమి విధిపూర్వకమ్‌. 27

తచ్ఛ్రుత్వా%సౌ నిమేర్వాక్యం వసిష్ఠః ప్రాహ భూపతిమ్‌ | ఇంద్రేణాహం వృతః పూర్వం యజ్ఞార్థం నృపసత్తమ. 28

పరిశక్తిమఖం కర్తు ముద్యుక్తః పాకశాసనః | స దీక్షాం గమితో దేవః పంచవర్షశతాత్మికామ్‌. 29

తస్మా త్త్వ మంతరం తావ త్ర్పతిపాలయ పార్థివ | ఇంద్రయజ్ఞే సమాప్తే% కృత్వా కార్యం దివస్పతేః. 30

పూర్వ మిక్ష్వాకు వంశమునందు నిమియను రాజుండెను. అతడు రూపగుణసంపన్నుడు; ధర్మజ్ఞుడు; లోకరంజకుడు. అతడు సత్యవాది దాత జ్ఞాని పవిత్రుడు యాజకుడు ధీశాలి ప్రజాపాలనతత్పరుడు. తన తండ్రికి పండ్రెండవ తనయుడు. అతడు గౌతమాశ్రమముచెంత జయంతు పురమను నగ్రహారమును బ్రాహ్మణుల మేలుగోరి వారికై నిర్మింపజేసెను. అతనికి భూరిదక్షిణలతో రాజసూయాగము చేయవలయుననెడు కోరిక చాలకామునుండి యుండెను. అంత నతడు తన తండ్రి యాజ్ఞ బడసి గొప్పవారి నుండి కావలసిన యాగ సామగ్రి సమకూర్చుకొనెను. పిమ్మట నతడు భృగువు అంగిరుడు వామదేవుడు గౌతముడు వసిష్ఠుడు పులస్త్యుడు పులహుడు ఋచీకుడు క్రతువు మున్నగు వేదపారగులు సర్వజ్ఞులు యజ్ఞ విద్యానిపుణులు తాపసులునగు వారిని యజ్ఞమున కాహ్వానించెను. అట్లు రాజు యాగసామగ్రి నంతయు సమకూర్చుకొని సవినయముగ తన గురువగు వసిష్ఠుని పూజించి యిట్లనియెను : మునివరా! దయామయా! నేను యజ్ఞ మాచరింతును. యాగ మొనరింపజేయుము. నీవు సర్వవిదుడవు. నాకు కులగురుడవు. ఆప్తుడవు నా కార్యము నెఱవేర్చుము. నేను యాగ ద్రవ్యము లన్నియు చక్కగ సమకూర్చుకొంటిని. ఐదువేలేండ్లు పూర్తిగ యాగదీక్ష వహింపదలచితిని. నేను శ్రీ జగదంబికా దేవి నారాధింపగలను. దేవీ ప్రీత్యర్థముగ దేవీ మహాయజ్ఞము విధివిధానముగ నాచరింపగలను'' అను నిమి వాక్కులు విని వసిష్ఠుడిట్లనెను : 'ఇంద్రు డింతకు పూర్వమే నన్నొక యాగమున కాహ్వానించెను. అతడైదువందల యేండ్లవఱకు శ్రీపరాశక్తి మహాయజ్ఞమాచరింప బద్ధకంకణు డయ్యెను. అతని యజ్ఞము పూర్తియగువఱ కెదురు చూడుము. ఇంద్రుని యాగము పూర్తిచేసి వత్తును. అంతవఱ కోపికపట్టుము.'

ఆగమిష్యా మ్యహం రాజం స్తావత్త్వం ప్రతిపాలయ | రాజా : మయా నిమంత్రితా శ్చాన్యే మునయో యజ్ఞకారణాత్‌. 31

సంభారాః సంభృతాః సర్వే పాలయామి కథం గురో | ఇక్ష్వాకుణాం కులే బ్రహ్మ న్గురు స్త్వం వేదవిత్తమః. 32

కథం త్యక్త్యా%ద్య మే కార్య ముద్యతో గంతు మాశువై | న తే యుక్తం ద్విజ శ్రేష్ఠ యదుత్సృజ్యం మఖం మమ. 33

గంతాసి ధనలోభేన లోభాకులిత చేతనః | నివారితో%పి రాజ్ఞా స జగామేంద్రమఖం గురుః. 34

రాజా%పి విమనా భూత్వా గౌతమం ప్రత్యపూజియత్‌ | ఇయాజ హిమవత్పార్శ్వే సాగరస్య సమీపతః. 35

దక్షిణా బహుళా దత్తా విప్రేభ్యో మఖకర్మణి | నిమినా పంచసాహస్రీ దీక్షా తత్ర కృతా నృప. 36

ఋత్విజః పూజితాః కామం ధనై ర్గోభి ర్ముదా యుతాః | శక్ర యజ్ఞే సమాప్తేతు పంచవర్షశతాత్మకే. 37

ఆజగామ వసిష్ఠ స్తు రాజ్ఞః సత్రదిదృక్షయా | ఆగత్య సంస్థిత స్తత్ర దర్శనార్థం నృపస్య చ. 38

తదా రాజా ప్రసుప్త స్తు నిద్రయా%పహృతో భృశమ్‌ | నాసో ప్రబోధితో భృత్యై ర్నాతస్తు మునిం నృపః. 39

వసిష్ఠస్య తతో మన్యుః ప్రాదుర్భూతో%వమానతః | అదర్శనా న్నిమే స్తత్ర చుకోప మునిసత్తమః. 40

శాపంచ దత్తనాం స్తసై#్మ రాజ్ఞే మన్యువశం గతః | యస్మాత్త్వం మాం గురు త్యక్త్వా కృత్వా%న్యం గురు మాత్మనః. 41

దీక్షితో%సి బలాన్మంద మమవజ్ఞాయ పార్థివ | వారితో%పి మయా తస్మా ద్విదేహ స్త్వం భవిష్యసి. 42

పతిత్విదం శరీరం తే విదేహో భవ భూపతే | ఇతి తద్వ్యాహృతం శ్రుత్వా రాజ్ఞ స్తు పరిచారకాః. 43

రాజిట్లనెను : ''నే నీ యజ్ఞమున కితరమునుల నెల్ల నాహ్వానించితిని. యజ్ఞసంభారము లెల్ల తెచ్చుకొంటిని. ఇప్పుడు దాని నెట్లు మానుకొందును? విప్రవరా! నీవు వేదవిదుడవు. ఇక్ష్వాకుల కులగురుడవు. ఇపుడు నా కార్యము వదలి నీ వెట్లు వెళ్ళగలవు? ద్విజవరా! నా యాగము వదలివెళ్ళుట నీకు తగదు. నీవు లోభముతో ధనాశతో వెళ్ళుచున్నావు' అని నిమి యెంతయో వారించెను. ఐనను వసిష్ఠుడింద్రుని యాగమునకు వెళ్ళెను. అపుడు రాజు విమనస్కుడై తన యజ్ఞము కొనసాగింప గౌతముని నియమించెను. అతనిని పూజించి సత్కరించి హిమాలయముచెంత గల సాగరతీరమున జన్నమునకు పూనుకొనెను. ఆ యజ్ఞమునందు నిమి విప్రులకు భూరి దక్షిణ లొసంగెను. అట్లు నిమియైదు వేలేండ్లు దీక్షతో దేవీ మహాయజ్ఞమాచరించెను. అందు రాజు ఋత్విజులను చక్కగ బూజించి వారికి విశేషముగ గోధనము లొసంగెను. అట నింద్రుని యైదు వందల యేండ్ల దేవీయాగము పూర్తి యయ్యెను. ఆ పిదప వసిష్ఠుడు నిమి యాగము గాంచుటకు వచ్చి రాజదర్శనము కెదురు చూచుచుండెను. ఆ సమయమున నిమి గాఢనిద్రలో నుండుటచే సేవకు లతనిని మేలుకొల్పలేదు. కనుక రాజు ముని చెంతకు రాలేకపోయెను. అంత మునిసత్తముడగు వసిష్ఠునకు కోపము తీవ్రరూపము దాల్చెను. అతడు నిమిని నేను నీ గురుడను. నన్ను త్రోసిరాజని వేరొక్కని గురువుగ నెన్నుకొంటివి. మందమతీ! నేనెంతజెప్పినను నా మాట కాలదన్ని యోపిక లేక నీవు దీక్ష వహించితివి. నన్ను నిందించితివి. కాన నీవు నీ శరీరము పడిపోయి విదేహుడవగుము' అని యెలుగెత్తి శపించుట సేవకులు వినిరి.

సద్యః ప్రబోధయామాసు ర్ముని మాహుః ప్రకోపితమ్‌ | కుపితం తం సమాగత్య రాజా విగతకల్మషః. 44

ఉవాచ వచనం శ్లక్షం హేతుగర్భం చ యుక్తిమత్‌ | మమ దోషో న ధర్మజ్ఞ గత స్త్వం తృష్ణయా%%కులః 45

హిత్వా మాం యజమానం వై ప్రార్థితో%పి మయా భృశమ్‌ | న లజ్జసే ద్విజ శ్రేష్ఠ కృత్వా కర్మ జుగుప్సితమ్‌. 46

సంతోషే బ్రాహ్మణ శ్రేష్ఠ జాన న్దర్మస్య నిశ్చయమ్‌ | పుత్రో%సి బ్రహ్మణః సాక్షా ద్వేదవేదాంగ విత్తమః. 47

న వేత్సి విప్రధర్మస్య గతిం సూక్ష్మాం దురత్యయామ్‌ | ఆత్మదోషం మయి జ్ఞాత్వా మృషా మాం శప్తు మిచ్ఛసి 48

త్యాజ్య స్తు సుజనైః క్రోధ శ్చందాలా దధికో యతః | వృథా క్రోధపరీతేన మయి శాపః ప్రపాతితః. 49

తవాపి చ పతత్వద్య దేహో%యం క్రోధసంయుతః | ఏవం శప్తో మునీ రాజ్ఞా రాజా చ మునినా తథా. 50

పరస్పరం ప్రాప్య శాపం దుఃఃతౌ తౌ బభూవతుః | వసిష్ఠ స్త్వతి చింతార్తో బ్రహ్మాణం శరణం గతః. 51

నివేదయామాస తథా శాపం భూపకృతం మహత్‌ | రాజ్ఞా శప్తో%స్మి దేహో%యం పతత్వద్య తవేతి వై. 52

కిం కరోమి పితః ప్రాప్తం కష్టం కాయప్రపాతజమ్‌ | అన్యదేహసముత్పత్తౌ జనకం వద సాంప్రతమ్‌. 53

తథా మే దేహసంయోగః పూర్వవ త్సమ పద్యతామ్‌ | యాదృశం జ్ఞాన మేతస్మి న్దేహే తత్రాస్తు తత్పితః. 54

సమర్థో%సి మహారాజ ప్రసాదం కర్తు మర్హసి | వసిష్ఠస్య వచః శ్రుత్వా బ్రహ్మ ప్రోవాచ తం సుతమ్‌. 55

మిత్రావరుణయో స్తేజ స్త్వం వ్రిశ్య స్థిరో భవ | తస్మా దయోనిజః కాలే భవితా త్వం న సంశయః. 56

పున ర్దేహం సమాసాద్య ధర్మయుక్తో భవిష్యసి | భూతాత్మా వేదవిత్కామం సర్వజ్ఞః సర్వపూజితః. 57

వారు రాజును మేలుకొల్పి వసిష్ఠుడు కోపముతో నతనిని శపించిన తెఱుంగెఱింగించిరి. నిమి యే కల్మషములేని శుద్ధాత్ముడగు రాజు. అతడు యుక్తి యుక్తముగ సహేతుకముగ సవినయముగ నిట్లనెను : ఓ ధర్మజ్ఞా! ఇందు నా దోషమావంతయును లేదు. నీకు ధనకాంక్ష మెండయ్యెను. నేను నీ యజమానుడను. నేనెంతయో ప్రార్థించితిని. ఐనను నీవు నన్ను లెక్కచేయక వెళ్ళితివి. ఇట్టి నింద్యకర్మ మొనరించియు నీకు సిగ్గు గల్గుటలేదా? బ్రాహ్మణుని ముఖ్య ధర్మము సంతోషము అని వేదవేదాంత విదుడవు బ్రహ్మపుత్త్రుడవునగు నీ వెఱుందువు. కాని, విప్రధర్మములలోన ధర్మ సూక్ష్మ మెఱుగలేకపోతివి. నీ దోషము నాయందారోపించి వ్యర్థముగ నన్ను శపించితివి. క్రోధము చండాలునికంటె చెడ్డది. సజ్జనులు దానిని చెంతకు చేరనీయరు. నీవు పట్టరాని కోపముతో వట్టిగ నన్ను శపించితివి. క్రోధము చండాలునికంటె చెడ్డది. సజ్జనులు దానిని చెంతకు చేరనీయరు. నీవు పట్టరాని కోపముతో వట్టిగ నన్ను శపించితివి. కోపముతో భగ్గున మండితివి. కనుక నీ దేహమును పడి పోవుగాక! ఇట్లు మునిచేత రాజు రాజుచేత మునియు శపింపబడిరి. ఇట్లు వారు పరస్పరము శపించుకొని తిరని దుఃఖము లనుభవించిరి. అంత వసిష్ఠుడు వంతజెంది బ్రహ్మను శరణు వేడెను. తన్ను రాజు శపించిన విధమును విసిష్ఠు డిట్లతనికి తెలిపెను : నీ శరీరము పడిపోవుగాక అని నేను నిమిచే శపింపబడితిని. తండ్రీ! ఇపుడీ దేహపతనమున పెద్ద యిక్కట్టువచ్చి పడినది. నే నిపుడేమి చేతును? నాకు జన్మ మొసగు తండ్రి యెవడో తెలుపుము. నాకు పూర్వ దేహమే కలుగవలయును. ఈ దేహ మందున్న జ్ఞానము వేరొక దేహమునందును గలుగవలయును. నా మీద దయజూపుట కీవే సమర్థుడవు' అను వసిష్ఠుని దీనవచనములువిని బ్రహ్మ తన తనయునితో నిట్లనెను : నీవు మిత్రావరుణి తేజములో ప్రవేశించి స్థిరముండుము. అంత సుకాలమున తప్పక నయోనిజుడవై వెలుగొందగలవు. ఆ దేహము బడసి నీవు విశ్వాభూతాత్మకుడవు ధర్మయుతుడవు వేదవిదుడవు సర్వజ్ఞుడవు సర్వపూజితుడవు గాగలవు.'

ఏవముక్త స్తదా పిత్రా ప్రయా¸° వరుణాలయమ్‌ | కృత్వా ప్రదక్షిణం ప్రీత్యా ప్రణమ్య చ పితామహమ్‌. 58

వివేశ స తయో ర్దేహే మిత్రా వరుణయోః కిల | జీవాంశేన వసిష్ఠో%థ త్యక్త్వా దేహ మనుత్తమమ్‌. 59

కదాచి త్తూర్వశీ రాజ న్నాగతా వరుణాలయమ్‌ | యదృచ్ఛయా వరారోహా సఖీగణ సమావృతా. 60

దృష్ట్వా తా మపసరాం దివ్యాం రూప¸°వనసంయుతామ్‌ | జాతౌ కామాతురౌ దేవౌ తదా తా మూచతుర్నృప. 61

వివశౌ చారుసర్వాంగీం దేవకన్యాం మనోరమామ్‌ | ఆవాం త్వ మనవద్యాంగి ! వరయస్వ సమాకులౌ. 62

విహరస్వ యథాకామం స్థానే%స్మి న్వరవర్ణిని | తథోక్తా సా తతో దేవీ తాభ్యాం తత్ర స్థితా వశా. 63

కృత్వా భావం స్థిరం దేవీ మిత్రావరుణయో ర్గృహే | సా గృహీత్వా తయో ర్భావం సంస్థితా చారుదర్శనా. 64

తయో స్తు పతితం వీర్యం కుంభే దైవా దనావృతే | తస్మా జ్జాతౌ మునీ రాజ న్ద్వావేవాతి మనోహరౌ. 65

అగస్తిః ప్రథమ స్తత్ర వసిష్ఠ శ్చాపర స్తథా | మిత్రావరుణయో ర్వీర్యా త్తాపసా వృషిసత్తమౌ. 66

ప్రథమ స్తు వనం ప్రాప్తో బాలేవ మహాతపాః | ఇక్ష్వాకు స్తు వసిష్ఠం తం బాలం వవ్రే పురోహితమ్‌. 67

వంశాస్యాస్య సుఖార్థం తే పాలయామాస పార్థిఇవ | విశేషేణ మునిం జ్ఞాత్వా ప్రీత్వా యుక్తౌ బభూవ హ. 68

ఏతత్తే సర్వ మాఖ్యాతం వసిష్ఠస్య చ కారణమ్‌ | శాపా ద్దేహాంతర ప్రాప్తి ర్మిత్రా వరుణయోః కులే. 69

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే చతుర్దశో%ధ్యాయః

అపుడు వసిష్ఠుడు పితామహునకు ప్రదక్షిణ నమస్కారము లాచరించి వరుణాలయ మేగెను. అచట వసిష్ఠుడు తన దేహము చాలించి జీవరూపముతో మిత్రావరుణుని దేహములో ప్రవేశించెను. ఒకప్పుడూర్వశి తన చెలియలు వెంటరాగా రాగము లొలికించుచు స్వేచ్ఛా విహారములు సల్పుచు వరుణాలయము జేరెను. ఊర్వశి రూప¸°వనసంపన్న. వియచ్చర దేవకామిని. ఆ సొబగులాడిని గాంచగనే మిత్రావరుణుల హృదయములు మదన పరవశము లయ్యెను. వారు కామపీడితులైరి. వారిర్వురు మనోరమ సర్వాంగసుందరి వేల్పుకన్నియ యగు నూర్వశితో నిట్లు పలికిరి : శోభనాంగీ! మమ్ము వరింపుము. వరవర్ణినీ! మాతో నీ యిచ్చమెచ్చునట్లు విహరించుము. అని వారు పలుకగనే యూర్వశి వారియందనురాగవతియై మిత్రావరుణుల యింటిలో నివాస మేర్పరచుకొనెను. ఆమె యచట వారి భావముల కనుకూలముగ మసలుకొనుచుండెను. అంతలో దైవయోగమున మిత్రావరుణుల వీర్య మొక మూతలేని కుండలో పడెను. అందుండి యిర్వురు సుకుమారముని కుమారులుద్భవించిరి. వారిలో మొదటివాడగస్త్యుడు, రెండవవాడు వసిష్ఠుడు. ఇట్లు మిత్రావరుణుల వీర్యమువలన ఋషిసత్తములగు తాపసు లుద్భవించిరి. అగస్త్యుడు బాల్యమునందే తపమునకు వనముల కరిగెను. వసిష్ఠు డిక్ష్వాకు రాజునకు పురోహితుడుగ వరింపబడెను. రాజతనిని తన పూర్వ వసిష్ఠునిగ నెఱిగి ప్రీతితో తన వంశము మేలుకొఱ కతనిని గౌరవించుచుండెను. రాజా! నీ కీ విధముగ వసిష్ఠుని పూర్వ చరిత్రము తెలిపితిని. అతడు శాపవశమున మిత్రావరుణులకు సుతుడగుటయు తేటతెల్ల మొనరించితిని.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు వసిష్ఠుని జన్మ వృత్తాంతమను చతుర్దశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters