Sri Devi Bhagavatam-1    Chapters   

అథ త్రయోదశో%ధ్యాయః

ఇంద్ర ఉవాచ :

 సాహసం కృతవాన్రాజా పూర్వం యత్కథితో మఖః | వరుణాయ ప్రతిజ్ఞాతః పుత్త్రం కృత్వా పశుం ప్రియమ్‌. 1

గతే త్వయి పితా పుత్రం బద్ధ్వా యూపే%ఘృణః పునః | పశుం కృత్వా మహాబుద్ధే | వధిష్యతి వ్యథాతురః. 2

ఇత్థం నిషిద్ధ స్తత్ర్పుత్త్రః శ##క్రేణామిత తేజసా | స్థిత స్తత్రైవ మాయేశీమాయయా మోహితో భృశమ్‌. 3

యదా పునః పునః శ్రుత్వా పితరం రోగపీడితమ్‌ | గమనాయ మతిం చక్రే తదేంద్రః ప్రత్యషేధయత్‌. 4

హరిశ్చంద్రో%తి దుఃఖార్తః పప్రచ్ఛ గురుమంతికే | స్థితం వసిష్ఠ మేకాంతే సర్వజ్ఞం హితతత్పరమ్‌. 5

రాజా : భగవన్కిం కరోమ్యద్య కాతరో%స్మి వ్యథాకులః | త్రాహి మాం దుఃఖమనసం మహావ్యాధిభయాతురమ్‌. 6

వసిష్ఠః : శృణు రాజన్నుపాయో%స్తి రోగనాశంప్రతిస్తుతః | త్రయోదశ విధాః పుత్రాః కథితా ధర్మసంగ్రహే. 7

తాస్మా త్క్రీతం సుతం కృత్వా యజస్వ మఖముత్తమమ్‌ | ద్రవ్యం దత్త్వా యథోద్దిష్ట మానయస్వ ద్విజోత్తమమ్‌. 8

ఏవం కృతే మఖే భూప రోగనాశో భవిష్యతి | వరుణో%పి ప్రసన్నాత్మా భవిష్యతి యథాసుఖమ్‌. 9

ఇతి తస్య వచః శ్రుత్వా రాజా ప్రోవాచ మంత్రిణమ్‌ | అన్వేషయ మహాబుద్ధే | విషయే ష్వతి యత్నతః. 10

కదాచిత్కో%పి లోభార్థీ దదాతి స్వసుతంపితా | సమానయ ధనం దత్వా యావత్ప్రార్థయతే%ప్యసౌ. 11

సర్వథైవ సమానేయో యాజ్ఞార్థే ద్విజబాలకః | న కార్యా కృపణా బుద్ధి స్త్వయా మత్కార్యహేతవే. 12

ప్రార్థనీయ స్త్వయా పుత్రః కస్యచిద్ద్విజవాదినః | ద్రవ్యేణ దేహి యజ్ఞార్థం కర్తవ్యో%సౌ పశుః కిల. 13

ఇతి సంచోదిత స్తేన సచివః కార్యహేతవే | అన్వేషయామాస పురే గ్రామేగ్రామే గృహే గృహే. 14

పదమూడవ అధ్యాయము

హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

ఇంద్రుడిట్లనెను : ''ఈ విధముగ మున్ను నీ తండ్రి హరిశ్చంద్రుడు తన కోడుకును యాగపశువుగ జేసి యాగమొనర్తునని వరుణునకు మాటయిచ్చెను. కనుక నీవీ పరిస్థితిలో వెళ్ళినచో నీ తండ్రి దయమాలి యూపస్తంభమునకు నిన్ను పశువుగ గట్టి చంపగలడు.' ఇట్లు తేజశ్శాలియగు మహేంద్రుడు వారించుటచే మాయామోహవతుడగుట వలన రాకుమారు డచ్చటనేయుండ నిశ్చయించుకొనెను. మొదట తన తండ్రి రోగపీడితుడై యున్నాడని వినినపుడతడు వెళ్ళుటకు తలంచెను. కాని, యంతలో నింద్రుడు వచ్చి యతనిని వారించెను. అట హరిశ్చంద్రుడు దుఃఖార్తుడై యుండెను. ఒకనాడతని మేలుగోరు వసిష్టుడతని చెంత నొంటిగ నుండగ నతడు ముని కిట్లనియెను : ఓ మహాత్మా! నేను శోకార్తుడను. ఏమి చేతును? ఈ తీరని భీకర వ్యాధిచే బాధపడుచున్నాను. నన్ను గాపాడుము. వసిష్ఠు డిట్లనెను : రాజా! వినుము. నీ రోగము తొలగుట కొక యుపాయము గలదు. ధర్మశాస్త్రములందు పుత్రులు పదమూడు విధములుగ జెప్పబడినారు. కనుక నీవొక విప్రునకు కోరిన ధనమిచ్చి యతని కొడుకును కొనితెచ్చి యాగమొనరింపుము. అట్లు యాగము చేయుట వలన నీవు రోగముక్తుడవగుదువు. వరుణుడును తప్పక ప్రసన్నుడుగాడలడు.' ముని మాటలు విని రాజు తన మంత్రితో నిట్లనియెను : 'మంత్రీ! నీవు మహామతివి. నీవు బాగుగ యత్నించి మనదేశమందలి యొక విప్రకుమారుని కొనితెమ్ము. ధనాశగలవాడెవడైన తన కొడుకు నమ్ముకోగలడు. అతనికి కోరినంత ధనమిచ్చి యతని కొడుకును కొనితెమ్ము. నీవు నా యాగమున కెల్ల భంగులనొక విప్రబాలుని తేవలయును. నా యీ కార్యసాధనకు వెనుకచూపు చూడవలదు. నీ వే బ్రాహ్మణునైన సమీపించి యతనికి ధనమిచ్చి యతని బాలుని యాగపశువుగ నుండుట కిచ్చుట కతని నడుగుము. ఇట్లు మంత్రి రాజునాజ్ఞబడసి రాజకార్యము సాధించుట కూరురు నిల్లిల్లు వెదకుచుండెను.

ఏవ మన్వేషత స్తస్య విషయో కశ్చిదాతురః | నిర్ధన స్త్రీసుత శ్చాసీ దజీగ ర్తేతి నామతః. 15

తస్య పుత్రం శునః శేపం మధ్యమం మంత్రిసత్తమః | ఆనయామాస దత్త్వార్థం ప్రార్థితం యద్ధనం తదా. 16

సమానీయ శునః శేపం సచివః కార్యతత్పరః | రాజ్ఞే నివేదయామాస పశుయోగ్యం ద్విజాత్మజమ్‌. 17

రాజా%తిముదిత స్తేన విప్రా నానీయ సర్వతః | కారయామాస సంభారా న్యజ్ఞార్థం వేదవిత్తమాన్‌. 18

ప్రారబ్ధే తు మఖే తత్ర విశ్వామిత్రో మహామునిః | బద్ధం దృష్ట్వా శునః శేపం నిషిషేధ నృపం తదా. 19

రాజ న్మా సాహసం కార్షీ ర్ముంచైనం ద్విజబాలకమ్‌ | ప్రార్థయా మ్యహ మాయుష్మ న్సుఖం తే%ద్య భవిష్యతి. 20

క్రందత్యయం శునఃశేపః కరుణా మాం దునోత్యపి | దయావాన్భవ రాజేంద్ర! కురు మే వచనం నృప. 21

పరదేహస్య రక్షాయై స్వదేహం యే దయాపరాః | దదతి క్షత్త్రియాః పూర్వం స్వర్గకామాః శుచివ్రతాః. 22

తం స్వదేహస్య రక్షార్థం హంసి ద్విజసుతం బలాత్‌ | పాపం మా కురు రాజేంద్ర దయావాన్భవ బాలకే. 23

సర్వేషాం సదృశీ ప్రీతి ర్దేహే వేత్సి స్వయం నృప | ముంచైనం బాలకం తస్మా త్రపమాణం యది మే వచః. 24

అనాదృత్య చ తద్వాక్యం రాజా దుఃఖాతురో భృశమ్‌ | న ముమోచ మునిస్తస్మె చుకోపాతీవ తాపసః. 25

ఉపదేశం దదౌ తసై#్మ శునఃశేపాయ కౌశికః | మంత్రం పాశధరస్యాథ దయావాన్వేదవిత్తమః. 26

శునఃశేపో%పి తం మంత్ర మసకృద్వధకర్శితః | ప్లుతస్వరేణ చుక్రోశ సంస్మర న్వరుణం భృశమ్‌. 27

స్తువంతం మునిపుత్త్రం తం జ్ఞాత్వా వైయాదసాంపతిః | తత్రాగత్య శునఃశేవం ముమోచ కరుణార్ణవః. 28

ఇట్లు మంత్రి వెదుకుచుండగ నొకచోట అజీగర్తుడను పేద విప్రునకు మువ్వురు కొడుకులుండిరి. అపుడు మంత్రి యజీగర్తునకు కోరినధనమిచ్చి నడిమివాడగు శునశ్శేపుని తనవెంట గొనితెచ్చెను. అట్లు కార్యసాధకుడగు మంత్రి శునశ్శేవుని గొనితెచ్చి యీ విప్రకుమారుడు పశుత్వమునకు యోగ్యుడని రాజునకు చెప్పెను. అందులకు రాజు ముదమంది వేదవిధులను పిలిపించి యాగద్రవ్యములు సమకూర్చెను. యజ్ఞము ప్రారంభమయ్యెను. అంతలో నటకు విశ్వామిత్ర మహర్షి యరుగుదెంచెను. అట్లు శునశ్శేపుడు గట్టుపడుటగాంచి ముని రాజును యాగమాపుమనుచు : ''రాజా! దుస్సాహసము వలదు. ఈ విప్రబాలుని విడువుము. నిన్ను నేను వేడుకొనుచున్నాను. నీకు మేలగుత! ఈ బాలుడు విలపించుచున్నాడు. ఇతనిని చూడగనే నా గుండె చెఱువగుచున్నది. నా మాట విని యితనిపై దయబూనుము. తొల్లి క్షత్త్రియవీరులు పరులను రక్షించిరి. వారు స్వర్గకాములై రణములందు తనువులు బాసిరి. ఇపుడు నీవు నీ శరీర రక్షణకొక విప్రబాలుని బలిచేయుచున్నావు. పాపము చేయకుము. ఈ బాలునిపై జాలి బూనుమ. ప్రతి ప్రాణికి తన ప్రాణములమీద తీపియుండును గదా! ఇది నీకును దెలియును. కనుక నీ మాట ప్రమాణముగ నమ్మి యితనిని విడువుము'' అనెను. కాని, దుఃఖార్తుడగు రాజు మునిమాటలు లెక్కచేయక బాలుని వదలలేదు. అంతట విశ్వామిత్రుడు రాజుపై కోపించెను. వేదవిదుడగు విశ్వామిత్రుడు దయతో శునశ్శేపునకు వరుణమంత్ర ముపదేశించెను. చావుబాధపడుచున్న శునశ్శేపుడు మంత్రమును ప్లుతస్వరముతో జపించుచు వరుణదేవుని దీనముగ ప్రార్థించెను. వరుణుడు కరుణరస సముద్రుడు. అతడు తన్ను నుతించునట్టి విప్రకుమారుని చెంతకేతెంచి యతనిని బంధముక్తుని చేసెను.

రోగహీనం నృపం కృత్వా వరుణః స్వగృహం య¸° | విశ్వామిత్ర స్తుతం పుత్రం కృతవాన్మోచితం మృతేః. 29

స కృతం వచనం రాజ్ఞా కౌశికస్య మహాత్మనః | రోషం దధార మనసా రాజోపరి స గాధిజః. 30

ఏకస్మి న్సమయే రాజా హయారూఢో వనం గతః | సూకరంహంతు కామ స్తు మధ్యాహ్నే కౌశికితటే. 31

వృద్ద బ్రాహ్మణవేషేణ విశ్వామిత్రేణ వంచితః | సర్వస్వం ప్రార్థితం తస్య గృహీతం రాజ్యమద్భుతమ్‌. 32

పీడితో%సౌ హరిశ్చంద్రో యజమానో యతో భృశమ్‌ | వసిష్ఠః కౌశికం ప్రాహ వనే ప్రాప్తం యదృచ్ఛయా. 33

క్షత్త్రియాధమ దుర్బుద్ధే! వృథా బ్రాహ్మణవేషభృత్‌ | బకధర్మ వృథా కిం త్వం గర్వం వహసి దాంభిక. 34

కస్మాత్త్వయా నృపశ్రేష్ఠో యజమానో మమాప్యసౌ | అపరాధం వినా జాల్మ గమితో దుఃఖ మద్భుతమ్‌. 35

బక ధ్యానపరో యస్మాత్తస్మాత్త్వం వై బకో భవ | ఇతి శప్తో వసిష్ఠేన కౌశికః ప్రాహ తం పునః. 36

త్వమ ప్యాడి ర్భవాయుష్మ న్బకో%హం యావదేవ హి | ఏవం పరస్పరం దత్త్వా శాపం తౌక్రోధపీడితౌ. 37

అండజౌ తరసా జాతౌ సరస్యాడీబకౌ మునీ | ఏకస్మి న్పాదపే నీడం కృత్వా%సౌ బకరూపభాక్‌. 38

విశ్వామిత్రః స్థిత స్తత్ర దివ్యే సరసి మానసే | అన్యస్మి న్పాదపే కృత్వా వసిష్ఠో నీడముత్తమమ్‌. 39

ఆడీరూపధర స్తస్థా వన్యోన్యం ద్వేషతత్పరౌ | దినే దినే తౌ సంగ్రామం చక్రతుః క్రోధసంయుతౌ. 40

దుఃఖదం సర్వలోకానాం క్రందమానా వుభౌ భృశమ్‌ | చంచువక్ష ప్రహారై స్తు నఖాఘాతైః పరస్పరమ్‌. 41

జఘ్నతూ రుధిరక్లిన్నౌ పుష్పితా వివ కింశుకౌ | ఏవం బహూని వర్షాణి పక్షిరూపధరౌ మునీ. 42

వరుణుడు రాజును సైతము రోగముక్తునిజేసి తనచోటికేగెను. అట్లు విశ్వామిత్రుడు విప్రబాలుని మృత్యుముఖము నుండి కాపాడెను. రాజు విశ్వామిత్రుని మాట పెడచెవిని బెట్టినందువలన ముని రాజునెడ రోషముబూని యుండెను. ఇది ఇట్లుండ ఒకనాడు హరిశ్చంద్రుడు ఒక పందిని చంపదలచి కౌశికీతీరమునకు వేటకుపోయెను. ఆ మధ్యాహ్న సమయమున విశ్వామిత్రుడొక ముసలి బ్రాహ్మణుని వేషమున వచ్చి రాజును ప్రార్థించి మోసముతో నతని రాజ్యమంతయు తన కైవసము చేసికొనెను. తన యజమానుడగు హరిశ్చంద్రుడట్లు కష్టాలపాలగుట వసిష్టుడెఱిగెను. అతడొకనాడడవిలో తనకంటబడిన విశ్వామిత్రునితో నిట్లనెను : 'క్షత్రియాధమా! దుర్మతీ! నీవు బ్రాహ్మణవేషముదాల్చి దంభాచారుడగు కొంగవలె ప్రవర్తించి వట్టి గర్వము బొందెదవేల? మూఢుడా! హరిశ్చంద్రుడు నా యజమానుడు. నిరపరాధుడు. అట్టి వానిని నీవేల దుఃఖములపాలు చేసితివి? నీవు బక ధ్యానము బూనితివి. కనుక కొంగవగుము.' అని వసిష్ఠుడు శపించెను. విశ్వామిత్రుడంత నిట్లనెను : ''ఓ యాయుష్మంతుడా! నీవు ఆడి యను పక్షివగుదువుగాక!' ఇట్లు వారిర్వును కోపముతో శపించుకొనిరి. వెంటనే వారిర్వురు నొక సరస్సుచెంత ఆడీ బక పక్షులుగ బుట్టిరి. అటనొక చెట్టుపై నొక గూడుగట్టుకొని బకరూపుడగు విశ్వామిత్రుడు కొలనిగట్టున జీవించుచుండెను. వేరొకచెట్టుపై గూడుగట్టుకొని వసిష్ఠు డాడియను పక్షి రూపముతో వసించుచుండెను. ఆ రెండును పరస్పర క్రోధద్వేషములతో ప్రతిదినమును పోరుచుండెను. అవి లోకమునకు భీతిగల్గునట్లు గోళ్ళు ఱక్కలు ముక్కులు మున్నగువానితో పోరెను. ఆ రెంటి శరీరములు పూచిన మోదుగులవలె నెత్తుట దోగియుండెను. ఇట్లవి పెక్కేండ్లు పక్కిరూపములలో నుండెను.

స్థితౌ తత్ర మహారాజ శాపపాశేన యంత్రితౌ | రాజోవాచ: కథం ముక్తౌ మునిశ్రేష్ఠౌ శాపాద్వసిష్ఠ కౌశికౌ 43

తన్మమాచక్ష్వ విప్రర్షే పరం కౌతూహలం హి మే | వ్యాసః : యుధ్యమాన వుభౌ దృష్ట్వా బ్రహ్మలోకపితామహః. 44

తత్రజగామానిమిషై ర్వృతః సర్వైర్దయాపరైః | తావాశ్వాస్య జగత్కర్తా యుద్ధతో వినివార్య చ. 45

శాపం సమ్మోచయామాస తయోః క్షిప్తం పరస్పరమ్‌ | తతో జగ్ముః సురాః సర్వే స్వాని దిష్ణ్యాని పద్మభూః. 46

సత్యలోకం జగామాశు హంసారూఢః ప్రతాపవాన్‌ | విశ్వామిత్రో%ప్యగాత్తూర్ణం వసిష్ఠః స్వాశ్రమం గతః. 47

మిథః స్నేహం తతః కృత్వా ప్రజాపత్యుపదేశతః | మైత్రావరుణినా%ప్యేవం కృతం యుద్ధ మకారణమ్‌. 48

కౌశికేన సమం భూప దుఃఖదం చ పరస్పరమ్‌ | కో నామ మానవోలోకే దేవోవా దానవో%పివా. 49

అహంకారజయం కృత్వా సర్వదా సుఖభా గ్భవేత్‌ | తస్మా ద్రాజం శృత్త శుద్ధి ర్మహతామపి దుర్లభా. 50

యత్నేన సాధనీయా సా తద్విహీనం నిరర్థకమ్‌ | తీర్థందాన తపః సత్యం యత్కించి ద్ధర్మ సాధనమ్‌. 51

(శ్రద్ధ%త్ర త్రివిధా ప్రోక్తా సాత్త్వి కీ రాజసీ తథా | తామసీ సర్వ దేహేషు దేహినాం ధర్మకర్మసు. 1

సాత్త్వి కీ దుర్లభా లోకే యథోక్త ఫలదా సదా | తదర్థ ఫలదా ప్రోక్తా రాజసీ విధి సంయుతా. 2

తామసీ త్వఫలా రాజన్నతు కీర్తికరీ పునః | కామక్రోధాభిభూతానాం జనానాం నృపసత్తమ.) 3

వాసనారహితం కృత్వా తచ్ఛిత్తం శ్రవణాదినా | తీర్థాదిషు వసేన్నిత్యం దేవీపూజన తత్పరః. 52

దేవీనామాని వచసా గృహ్ణం స్తస్యా గుణాన్‌ స్తువన్‌ | ధ్యాయం స్తస్యాః పదాంభోజం కలిదోషభయార్దితః. 53

ఏవం తు కుర్వత స్తస్య న కదాచి త్కలేర్భయమ్‌ | అనాయాసేన సంసార న్ముచ్యతే పాతకీ జనః. 54

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే త్రయోదశో%ధ్యాయః

ఇట్లు మునులు శాపబద్ధులైయుండిరి. అన రాజినట్లనెను. 'ఆ ముని వర్యులు తిరిగి యెట్లు శాపముక్తులైరి? ఓ మునివరా! దానిని వినుటకు నాకుత్కంఠ గల్గుచున్నది. తెలుపుము.' వ్యాసుడిట్లనెను : 'అట్లు వారు పోరుచుండుట లోకపితామహుడగు బ్రహ్మగాంచెను. అపుడు బ్రహ్మ దయామయులగు దేవతలను వెంటగొని యచటి కరుదెంచెను. బ్రహ్మ వారి కూరటగలిగించి పోరు మానిపించెను. వారి పరస్పర శాపములను తొలగించెను. పిమ్మట దేవతలు తమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మయును హంసవాహనమెక్కి సత్యలోకమేగెను వసిష్ఠ విశ్వామిత్రులును తమ తమ యాశ్రమములకు జనిరి. వారు బ్రహ్మ యొసగిన యాదేశమును పాటించిరి. నాటినుండి యిర్వురు నేస్తముతో నుండిరి. ఇట్లు వసిష్ఠుడు సైతము నిష్కారణముగ పోరెను. మైత్రావరుణియగు వసిష్టుడట్లు విశ్వామిత్రునితో క్లేశకరమగు పోరు సలిపెను. ఈ లోకములో దేవ-దానవ-మానవాదికమగు ప్రాణులు గలరు. వీరిలో నహంకారమును జయించి సుఖముగ నుండి వాడెవ్వడును లేడు. కనుక రాజా! చిత్తశుద్ధి మహితాత్ములకు సైతము దుర్లభము. దానిని ప్రయత్నముతో నెటులైన సాధింపవలయును. అహంకారము గెల్వనిచో తీర్థ - దాన - తపస్సులు సత్యధర్మ సాధనములన్నియు వ్యర్థము. (జీవులు ధర్మకర్మలు నిర్వర్తించుటకు శ్రద్ధ యత్యవసరము. అది సాత్త్వికము రాజసము తామసమని ముత్తెఱంగుల నొప్పును. అందును లోకమందు సాత్త్వికశ్రద్ధ దుర్లభము. అది పూర్ణఫలము నిచ్చును. విధి పూర్వకముగ ఆచరించిన కర్మములును రాజసశ్రద్ధ ఇచ్చుదానిలో సగము ఫలమే ఇచ్చును. రాజా! తామసశ్రద్ధ కామక్రోధముల వలన గల్గును. ఇది నిష్ఫలము. అపకీర్తికరమైనది.) కనుక శ్రద్ధాళువులు శ్రవణాదుల వలన చిత్తమును వాసనారహిత మొనర్చుకొనవలయును. శ్రీదేవీ పూజా తత్పరులై పుణ్యతీర్థములందు వసింపవలయును. ఈ కలిదోషపీడితుడు శ్రీమాతృదేవి దివ్య మధుర నామము లుచ్ఛరింపవలయును. శ్రీ లలితాంబా పాదపద్మములు సంస్మరింప వలయును. నిత్యము దేవీ ధ్యానము చేయుచుండ వలయును. ఇట్టు లాచరించువాని కేనాటికిని కలిభయము సంక్రమించదు. ఇట్టు లాచరించినచో నెంతటి పాపియైనను తప్పక తేలికగ సంసార ముక్తుడగును. ఇది ధ్రువము.

ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి షష్ఠస్కంధమందు హరిశ్చంద్రుడు రోగముక్తుడగుటయను త్రయోతశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters