Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

ఋషయః : కో%సౌ పురూరవా రాజా కోర్వశీదే వకన్యకా | కథం కష్టం చ సంప్రాప్తం తేన రాజ్ఞా మహాత్మనా. 1

సర్వం కథానకం బ్రూహి లోమహర్షణజా%ధునా | శ్రోతుకామా వయం సర్వే త్వన్ముఖాబ్జచ్యుతం రసమ్‌. 2

అమృతాదపి మిష్టా తే వాణీ సూత| రసాత్మికా | న తృప్యామో వయం సర్వే సుధయా చ యథా%మరాః. 3

సూతః శృణుధ్వంమునయః స్సర్వేకథాందివ్యాంమనోరమామ్‌ | పక్ష్యామ్యహం యథాబుద్ధ్యాశ్రుతాంవ్యాసవరోత్తమాత్‌ 4

గురోస్తు దయితా భార్యా తారా నామేతి విశ్రుతా | రూప¸°వనయుక్తా సా చార్వంగీ మదవిహ్వలా 5

గతై కతా విధోర్థామ యజమానస్య భామినీ | దృష్టా చ శశినా%త్యర్థం రూప¸°వనశాలినీ. 6

కామాతుర స్తదా జాతః శశీ శశిముఖీం ప్రతి | సా%పి వీక్ష్య విధుం కామం జాతా మదన పీడితా. 7

తా వన్యోన్యం ప్రేమ యుక్తౌ స్మరార్తౌ చ బభూవతుః | తారా శశీ మదోన్మత్తౌ కామబాణప్రపీడితౌ. 8

రేమాతే మదమత్తౌ తౌ పరస్పరస్పృహాన్వితౌ | దినాని కతిచి త్తత్ర జాతాని రమమాణయోః 9

బృహస్పతిస్తు దుఃఖార్త స్తారా మానయితుం గృహమ్‌ | ప్రేషయామాస శిష్యం తు నాయాతా సా వశీకృతా. 10

పదుకొండవ యధ్యాయము

బుధుని జన్మవృత్తాంతము

ఋషులిట్లనిరి : అపురూరవ మహారాజెవరు? దేవకన్యక యూర్వశి యెవర్తుక? ఆ మహారాజునకు కష్టములెట్లు గలిగెను? ఆ కథ మాకు వినిపింపుము. నీ ముఖకమలమునుండి వెడలు మధురసామృత మెంత గ్రోలినను తనివితీరదు. నీ వాక్కుల నుండి యమృతరసమే కురియును. అమృతములో లేని దివ్యరసము నీ వాక్కులందు గలదు. అమరుల మృతమున దనియరు. అట్లే మేము నీ వాగమృతమున దనియకున్నాము. సూతుడిట్లనియెను : మునులారా ! మున్ను శ్రీ వ్యాసునిచే చెప్పబడిన సుమనోహర దివ్యకథ నా బుద్ధికి దోచినట్లు వివరింతును వినుడు. దేవగురుడు బృహస్పతి. అతని భార్య తార. ఆమె సురూపమును ¸°వనమును కలది. అందమగు అవయవములు కలది. మదన పరవశ. ఒకనాడు రూప¸°వనశాలిని యగు ఆ భామిని ఆ కాలమున యజ్ఞము నాచరించున్న చంద్రుని గృహమునకేగి అతని కంటబడెను. ఆ రాజముఖిని గాంచగనే చంద్రుడు కామాతురుడయ్యెను. ఆమెయును చందురుని చూచి మిక్కిలిగా కామపీడిత యయ్యెను. ఇట్లు తారాశశాంకులు పరస్పరా సురాగమున కామార్తులైరి. మదోన్మత్తులగుచు కామబాణ పీడితులైరి. కామమదమత్తులును పరస్పరానురాగాన్వితులునగు వారిరువురును అట్ల క్రీడించుచు ఎన్నియో దినములు గడిపిరి. ఇది తెలిసి గురుడు విచారగ్రస్తుడై తారను ఇంటికిదోడ్కొని రమ్మని తన శిష్యునంపెను. కాని చంద్రునిచే వశీకృతయగు నామె రాలేదు.

పునఃపున ర్యదా శిష్యం పరావర్తత చంద్రమాః | బృహస్పతి స్తదా క్రుద్ధో జగామ స్వయమేవ హి. 11

గత్వా సోమగృహం తత్ర వాచస్పతి రుదారధీః | ఉవాచ శశినం క్రుద్ధః స్మయమానం మదాన్వితమ్‌. 12

కిం కృతం కిల శీతాంశో కర్మ దర్మవిగర్హితమ్‌ | రక్షితా మమ భార్యేయం సుందరీ కేన హేతునా. 13

తన దేవగురు శ్చాహం యజమానో సి సర్వథా | గురుభార్యా కథం మూఢ భుక్తా కిం రక్షితా థవా. 14

బ్రహ్మహా హేమహరీ చ సురాపో గురుత్పలగః | మహాపాతకినోహ్యేతే తత్సంసర్గీ చ పంచమః. 15

మహాపాతయుక్తస్త్వం దురాచారో%తిగర్హితః | న దేవసదనార్హో%సి యది భుక్తేయ మంగనా. 16

ముంచేమా మసితాపాంగీం నయామి సదనం మమ | నోచే ద్వక్ష్యామి దుష్టాత్మ న్గురుదారావహారిణమ్‌. 17

ఇత్యేవం భాషమాణం త మువాచ రోహిణీవతిః | గురుం క్రోధసమాయుక్తం కాంతావిరహ దుఃఖితమ్‌. 18

ఇందుః : క్రోధాత్తే తు దురారాధ్యా బ్రాహ్మణాః క్రోధవర్జితాః | పూజార్హాధర్మ శాస్త్రజ్ఞావర్జనీయా స్తతో % న్యథా. 19

ఆగమిష్యతి సా కామం గృహం తే వరవర్ణినీ | ఆత్రైవ సంస్థితా బాలా కా తే హాని రిహానఘ. 20

ఇచ్ఛయా సంస్థితా చాత్ర సుఖకామార్థినీ హిసా | దినాని కతిచి త్థ్సిత్వా స్వేచ్ఛయా చాగమిష్యతి. 21

త్వయైవోదాహృతం పూర్వం ధర్మశాస్త్రమతం తథా | న స్త్రీ దుష్యతి చారేణ న విప్రో వేదకర్మణా. 22

ఇత్యుక్తః శశినా తత్ర గురు రత్యంతదుఃఖితః | జగామ స్వగృహం తూర్ణం చింతావిష్ణంః స్మరాతురః. 23

దినాని కచితి త్తత్ర స్థిత్వా చింతాతురో గురుః | యయా వథ గృహం తస్య త్వరిత శ్ఛౌషధీపతేః. 24

స్థితః క్షత్రా నిషిద్ధో%సౌ ద్వారదేశే రుషాన్వితః | నాజగామ శశీ తత్ర చుకోపాతి బృహస్పతిః. 25

ఆయం మే శిష్యతాం యాతో గురుపత్నీం తు మాతరమ్‌ | జగాహ బలతో%ధర్మీ శిక్షణీయో మయాధునా. 26

అట్లే మాటిమాటికి గురుడు పంపుశిష్యులను చంద్రుడు తిరుగ బంపుచుండెను. కడకు ఆ యుదారమతి యగు బృహస్పతి తానే బయలుదేరి సోమునింటికేగి మదాన్వితుడై నవ్వు చంద్రుని గని పట్టరాని రోషమున నతని కిట్లనియెను: 'చంద్రా ! ధర్మనిందితమైన పనిజేసితివేమి? సుందరియగు నా భర్యను నీవట్టె పెట్టుకొని యంటివేమి? దేవతలలోని వాడవగు చంద్రా! నీకు గురుడను. నీవు యాగముచేయుచున్న వాడవు గదా! ఓరీ మూఢా! నీవు గురుభార్య ననుభవించితివే! మీదుమిక్కిలి ఇపుడును వదలకున్నావు. బ్రహ్మహంత సువర్ణాపహారి సురాపాయి గురుతల్పశాయి వారి సంసర్గము కలవాడు అను వీరు పంచమహాపాతకులు. నీవు మహాపాపివి. దురాచారివి. అతినిందితుడవు. నీవు నా యంగన ననుభవించి నందున దేవలోకార్హుడవు కావు. ఇకనైన నా యసితేక్షణను వదలిపెట్టుము. నా యింటికామెను గొనిపోదును. కానిచో నీవు దుష్టాత్ముడవని గురుభార్యనే కూడినవాడవని లోకమున కెలుగెత్తి చాటుదును' అని పలుకుచున్న క్రుద్ధుడును భార్య యొక్క యెడబాటుచే దుఃఖితుడునైన గురునితో చంద్రుడిట్లనియెను: 'బ్రాహ్మణులు కోపముననే యపూజ్యులగుదురు. దర్మశాస్త్రము లెఱింగిన వారు పూజార్హులు. క్రోధయుక్తులు పూజయందు విడువదగినవారు. అనఘా! నీ భార్య నీ యింటికే రాగలదు. ఆ చిన్నది నా యింటిలోనే యున్నను నీకు గల్గునష్టమేమి? ఆమె తన యభీష్టము ననుసరించి కామ సుఖార్థినిగదా! ఇచట కొన్ని నాళ్లిట్టులే యుండి తన యిష్టముననుసరించి యింటికి వచ్చును. పాతకము చేసినను ఋతుమతియైన పిదప స్త్రీ దుష్టురాలుగాదనియు, పాతకియైనను వేదకర్మలాచరించుటచే విప్రుడెన్నడును నింద్యుడుగాడు అనియు గురు వర్యులగు మీరు దర్మశాస్త్ర సమ్మతమైన పలుకు మున్ను పల్కితిరి, అని చంద్రుడు పలుకగనే గురుడు మరింత దురపిల్లెను. అతడు చేయునదిలేక స్మరాతురుడై చింతావశుడై తన యింటి మొగము పట్టెను. ఇట్లు కొన్ని దినములు గడచిన పిదప గురుడు చింతాపరవశుడై మరల త్వరితగతితో నోషదీపతి యింటికేగెను. ద్వారపాలు రడ్డగించుటచేత గురుడు బయటనే యుండెను. చంద్రెడంతకును బయటికా రాలేదు. గురునకంతకంతకును కోపము మితిమీరు చుండెను. ఇతడు నాకు శిష్యుడు. గురుపత్ని తల్లియేయగును. ఐన నితడు ధర్మముతో నా దానిని బల్మితో తానే యుంచుకొనెను. ఇపుడు నేనితనిని శిక్షింతును.

ఉవాచ వాచం కోపాత్తు ద్వారదేశే స్థితితో బహింః | కి వేషే భవనే మంద పాపాచార సురాధమ. 27

దేహి మే కామినీం శీఘ్రం నోచే చ్ఛాపం దదామ్యహమ్‌ | కరోమి భస్మసా న్నూనం న దదాసిప్రియాంమమ. 28

క్రూరాణీ చైవమాదీని భాషణాని బృహస్పతేః | శ్రేత్వా ద్విజపతిః శీఘ్రం నిర్గతః సదనా ద్భహిః. 29

తమువాచ హస న్సోమః కిమిదం బహు భాషసే | న తే యోగ్యా%సితాపాంగీ సర్వలక్షణసంయుతా. 30

కురూపాం చ స్వసదృశీం గృహాణాన్యాం స్త్రీయం ద్విజ | భిక్షుకస్య గృహే యోగ్యా నేదృశీ వరవర్ణినీ. 31

రతిః స్వసదృశే కాంతే నార్యాః కిల నిగద్యతే ! త్వం న జానాసి మందాత్మ న్కామశాస్త్రవినిర్ణయమ్‌. 32

యథేష్టం గచ్ఛ దుర్భుద్ధే నాహం దాస్యామి కామినీమ్‌ | య చ్ఛక్యం కురు తత్కామం న దేయా వరవర్ణినీ. 33

కామార్తస్య చ తే శాపో న మాం బాధితు మర్హతి | నాహం దదే గురో కాంతాం యథేచ్ఛసి తథాకురు. 34

ఇత్యుక్తః శశినా చేజ్య శ్చింతా మాప రుషా %న్విత | జగామ తరసా సద్మ క్రోధయుక్తః శచీపతేః. 35

దృష్ట్వా శతక్రతు స్తత్ర గురుం దుఃఖాతురం స్థితమ్‌ | పాదార్ఘ్యాచమనీయాదైః పూజయిత్వా సుసంస్థితః. 36

గురుడు ద్వారము చెంతనే నిలుచుండి యిట్లు కేకలు పెట్టుచుండెను : 'ఓరీ మందా! పాపీ! సురాధమా! ఇంకను లోననే పండుకొని యున్నావా! వేగమే నా ప్రియకామినిని నాకిమ్ము. లేనిచో నిన్ను శపింతును. నా ప్రియను నా కీయనిచో నిన్ను భస్మమొనర్పగలను.' సూతుడిట్లనియెను : ఇట్లు గురుని పరుషవాక్కులు విని వెంటనే చంద్రుడింటిలోనుండి వెలుపలకు వచ్చెను. చంద్రుడు పక పక నవ్వుచు గురున కిట్లనియెను : ''ఏమో యెక్కువగ పలుకుచున్నావే? సర్వశుభలక్షణ లక్షితయగు ఈ అసితా పాంగి నీకు యోగ్యురాలుగాదు. నీకు తగిన కురూపను చేపట్టుము. ఒక్క బిచ్చగాని యింట నిట్టివరవర్ణిని యుండదగదు. మందమతీ! స్త్రీకి తనకు సాటివాడగు ప్రియునివలన రత్యానందము కలుగును. నీ వీ కామశాస్త్ర మర్మము లెఱుగవు. దుర్మతీ! ఇంక నీవు యథేష్టముగ పోవచ్చును. నేను ఆ కామినిని ఈయను. నీ చేతనైనది చేసికొమ్ము. ఈ వరవర్ణిని నీయను కామార్తుడవగు నీవు శపించినను నాకదితగులదు. గురూ! ఈ కాంతను నేనీయను. నీ కిష్టమైనది చేసికొమ్ము.'' సూతుడిట్లనియెను: చంద్రుడట్లు పలుకగా గురుడు చేయనదిలేక కిన్కబూని పెల్లుదురపిల్లి వేగనింద్రుని కడకరిగెను. క్రుంగిన మదితో చింతం బొగులుచుండిన గురుని దర్శించి ఇంద్రుడు అర్ఘ్యపాద్యాదివిధుల బూజించెను.

ప్రపచ్ఛ పరమోదార స్తం తథావస్థితం గురుమ్‌ | కా చింతాతే మహాభాగ శోకార్తో%సి మహామునే. 37

కేనావమానితో%సి త్వం మమ రాజ్యే యే | త్వదధీన మిదం సర్వం సైన్యం లోకాధిపైః సహ. 38

బ్రహ్మా విష్ణు స్తథా శంభు ర్చేచాన్యే దేవసత్తమాః | కరిష్యంతి చ సాహాయ్యం కా చింతా వద సాంప్రతమ్‌. 39

గురురువాచ : శశినా%పహృతా భార్యా తారా మమ సులోచనా | న దదాతి స దుష్టాత్మా ప్రార్థితో%పిపునఃపునః. 40

కిం కరోమి సురేశాన త్వ మేవ శరణం మమ| సాహాయ్యం కురు దేవేశ దుఃఖితో%స్మి శతక్రతో. 41

ఇంద్రః : మా శోకం కురు దర్మజ్ఞ దాసో%స్మి తవ సువ్రత! ఆనయిష్యామ్యహంనూనంభార్యాంతవమహామతే. 42

ప్రేషితే చే న్మయా దూతే న దాస్యతి మదాకులః | తతో యుద్ధం కరిష్యామి దేవసైన్యైః సమావృతంః. 43

ఇత్యాశ్వాస్య గురుం శక్రో దూతం వక్తుం విచక్షణమ్‌ | ప్రేషయమాస సోమాయ వార్తాశంసినమద్భుతమ్‌. 44

స గత్వా శశిలోకం తు త్వరితః సువిచక్షణః | ఉవాచ వచనేనైవ వచనం రోహిణీపతిమ్‌. 45

ప్రేషితో%హం మహాభాగ శ##క్రేణ త్వాం వివక్షయా | కథితం ప్రభుణా యచ్చ త ద్బ్రవీమి మహామతే. 46

దర్యజ్ఞో %సి మహాభాగ నీతిం జానాసి సువ్రత | అత్రిః పితా తే ధర్మాత్మా న నింద్యం కర్తు మర్హసి. 47

భార్యా రక్ష్యా సర్వభైతై ర్యథాశక్తి హ్యతంద్రితైః తదర్థే కలహః కామం భవితా నాత్ర సంశయః. 48

యథా తవ రథా తస్య యత్నః స్యా ద్దారరక్షణ | ఆత్మవ త్సర్వభూతాని చింతయు త్వం సుధానిధే. 49

అష్టావింశతిసంఖ్యాస్తే కామిన్యో దక్షజాః శుభా | గురుపత్నీం కథం భోక్తుం త్వ మిచ్చసి సుధానిధే! 50

స్వర్గే సదా వసంత్యేతా మేనకాద్యా మనోరమాః | భుంక్ష్వ తాః స్వేచ్ఛయా కామంముంచపత్నీంగురోరపి. 51

ఈశ్వరా యది కుర్వంతి జుగుప్సిత మహాంతయా | అజ్ఞా స్త దనువర్తంతే తదా ధర్మక్షయో భ##వేత్‌. 52

తస్మా న్ముంచ మహాభాగః గురోః పత్నీం మనోరమామ్‌ | కలహ స్త్వన్ని మిత్తో%ద్య సురాణం న భ##వే ద్యథా. 53

పరమోదారు డింద్రుడు దీనదశలో నున్న గురునకిట్లనియెను : 'మహాభాగా! మీ మోము విన్నబోయియున్నదే! శోకార్తుడవైతివేమి? మీ చింతవేమి? నీవు నా గురుడవు. నా యేలుబడిలో నిన్నెవ్వడవమానించెను? ఈ లోకపాలురతోడి నా సైన్యమంతయును నీ యధీనము. బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలెల్లరు నీకు సాయమొనర్పగలరు. మీ చింతయేమో వేగిరమే వెల్లడించుడు'' గురుడిట్లనియెను : 'సులోచనయగు నా పత్ని తారను తారేశుడు తన చేజిక్కించుకొనెను. ఎన్ని మారులు వేడికొన్నను ఆ దుష్టాత్ముడు తిరిగి యామెను నా కిచ్చుటలేదు. ఇపుడు నేనేమిచేతును? నీవే నాకు శరణము. నేను మిక్కిలి క్లేశపడుచున్నాను. నాకీ విషయమున సాయమొనర్పుము. ఇంద్రుడిట్లనియెను : ''ధరజ్ఞా! సువ్రతా! మహామతీ! నీ వింక దుఃఖించకుము. నేను నీ దాసుడను. నీ కాంతను తప్పక తెప్పించి యిత్తును. నేనిపుడే నా దూతనంపుదును. ఆ మదమత్తుడప్పటికిని నీ భార్యనీయనిచో సురసైన్యముతో నతని మార్కొని యుద్ధము చేయుదును. అని యిటుల నింద్రుడు గురునోదార్చి విచారదర్శియు చతురుడునగు దూతను వార్త నందించుటకై చంద్రునికడ కంపెను. సువిచక్షణుడగు ఆ దూత వెంటనే చంద్రలోకమేగి రోహిణీ పతితో నిట్లు పలికెను : మహాభాగా! మహామతీ! ఇంద్రుడు నీ కొకమాట చెప్పుమని నన్నంపెను. నా ప్రభువనిన పలుకులు పలుకుచున్నాను. నీవు దర్మజ్ఞుడవు నీతివిదుడవు. నీ తండ్రి అత్రియును ధర్మాత్ముడు. కాన నీవు నింద్యమైన కార్యము చేయదగదు. ఎల్లరును తమ తమ భార్యలను యథాశక్తిగా ఎచ్చరికతో గాపాడుకొనవలయును. ఈ విషయమున కలహముకూడ జరుగునకాశము కలదు. అందు సందియము లేదు. నీవు నీ భార్యనెటుల రక్షించుకొనదలతువో గురుడును తన భార్య నటులే రక్షించుకొన దలచును. సుధానిధీ! ఎల్లభూతములను స్వాత్మభావమున జూడుము. నీ కిరువదెనమండ్రుగురు దక్షకన్యకలు గలరు. వారినందఱిని స్వేచ్ఛగ ననుభవింపుము. గురు భార్యను మాత్రము విడిచిపెట్టుము. నీవంటి గొప్పవాడే యహంకరించి నింద్య కార్యము సేయుటకు పూనుకొన్నచో నిక మూర్ఖుడునట్లే ప్రవర్తించును గదా. దాని వలన ధర్మము నశించును. మనోరమ యగు గురు నిల్లాలిని వదలిపెట్టుము. నీ నిమిత్తమున విబుధులలో కలహము చెలరేగకుండుగాక!

సోమః శక్రవచః శ్రుత్వా కించిత్క్రోధ సమాకులః | భంగ్యా ప్రతివచః ప్రాహశక్రదూతంతదాశశీ. 54

దర్మజ్ఞో%సి మహబాహో దేవానా మధిపః స్వయమ్‌ | పురోధా%పిచతేతాదృ గ్యువయోః సదృశీమతిః. 55

పరోపదేశే కుశలా భవంతి బహవో జనాః | దుర్లభస్తు స్వయం కర్తా ప్రాప్తే కర్మణి సర్వదా. 56

బార్హస్పత్యవ్రణీతం చ శాస్త్రం గృహ్ణంతి మానవాః| కోవిరోధో%త్రదేవేశః కామయానాం భజన్‌స్త్రియమ్‌. 57

స్వకీయం బలినాం సర్వం దుర్బలానాం న కించన | స్వీయా చ పరకీయాచభ్రమో%యంమందచేతసామ్‌. 58

తారా మయ్యసురక్తాచ యథా న తు తథా గురౌ | అనురక్తా కథం త్యాజ్యా ధర్మతో న్యాయత స్థథా. 59

గృహారంభస్తు రక్తాయాం విరక్తాయాం కథం భ##వేత్‌ | విరక్తేయం తదా జాతా చకమే %నుజకామినీమ్‌. 60

న దాస్యే% హం వరారోహాం గచ్చదూత | వదస్వయమ్‌ | ఈశ్వరో సిసహస్రాక్ష ! యదిచ్ఛసికురుష్వతత్‌. 61

ఇత్యుక్తః శశినాసూతః ప్రయ¸° శక్రసన్నిధిమ్‌ | ఇంద్రాయా%%చష్టతత్సర్వంయదుక్తం శీతరశ్మినా. 62

తురాషాడపి తచ్చ్రుత్వా క్రోధయుక్తో బభూవ హ | సేనోద్యోగం తథా చక్రే సాహాయ్యార్థం గురోర్విభుః. 63

శుక్రస్తు విగ్రహం శ్రుత్వా గురుద్వేషా త్తతో య¸° | మా దదస్వేతి తం వాక్య మువాచ శశినం ప్రతి. 64

సాహాయ్యం తే కరిష్యామి మంత్రశక్త్యా మహామతే | భవితా యది సంగ్రామ స్తవ చేంద్రేణ మారిష!. 65

శంకరస్తు తదాకర్ణ్య గురుదారాభిమర్శనమ్‌ | గురుశత్రుం భృగుం మత్వా సాహాయ్య మకరో త్తదా. 66

ఆ యింద్రుని సందేశమాలించి చంద్రుడించుక కినుకబూని ఇంద్రుని దూతతో వక్రభంగి నిట్లు పలికెను. ''ఓ మహాబాహో! నీవును ధర్మజ్ఞుడవే! దేవేంద్రుడవే! నీ పురోహితుడు నీతో సమానుడే. మీ యిద్దఱి బుద్ధులును సమానములే. చాలమంది పరోపదేశమున పండితులు. ఏ పనియైన తామే చేయవలసి వచ్చినపుడు అట్లే యాచరించువారు దుర్లభులు. ఎల్లరును బృహస్పతి రచించిన ధర్మశాస్త్రమును ప్రమాణముగ నంగీకరింతురు గదా! తన్నువలచిన కామినిని అనుభవించుట దోసముగాదని దాని యందే కలదు. ఇంతకు వీర్యవంతున కందఱును తనవారే. పాపము! బలహీనున కొక్కడును తనవాడునువాడు లేడు. ఈమె స్వీయ - ఆమె పరకీయ యను భేదములు మందమతుల భ్రమలే. ఈ తారకు నా యందనురాగమున్నంతగా బృహస్పతియందు లేదు. అనురాగవతిని వదలిపెట్టుటేమంత ధర్మము గాదు. న్యాయమును గాదు. అనురాగముగల దానియందే సంసారముగాని విరక్తురాలియందు కాదుగదా! ఆ గురుడు తనయన్న భార్య యందనురక్తుడైన నాటనుండియే యీమె కతనియందు విరక్తి గిగినది. దూతా! ఇక నీవు వెళ్లవచ్చును. నే నీ వరారోహన గురున కీయను. నీవు నా మాటగ స్వయముగ నింద్రునకిట్లు దెల్పుము: 'ఓ యింద్రా! నీవు దేవపతివి. నీకు తోచినది చేసికొనుము.' సూతుడిట్లనియెను : అని చంద్రుడు పల్కగా విని దూత యింద్రుని చెంతకేగి చంద్రుని మాటలతనికి వినిపించెను. అదివిని యమరపతి కోపాతిరేకమున తన గురునకు సాయము సేయ సేననాయత్త పరచెను. శుక్రునకు గురునకు సరిపడదు. ఆ ద్వేషముతో శుక్రుడు చంద్రునిజేరి తారను మరల గురునకీయ వద్దని యిట్లు చెప్పెను. ఓ మహామతీ ! ఆర్యా ! ఆ యింద్రునితో నీకు పోరాటము సంఘటిల్లినచో నా మంత్రశక్తిచేత నేను నీకు సాయపడుదును. చంద్రుడు గురుదారను బొందెననియును శుక్రుడు గురునకు శత్రువనియు శివుడెఱింగి బృహస్పతికి తానండగ నిలిచెను.

సంగ్రామస్తు తదా వృత్తో దేవదానవయో ర్ద్రుతమ్‌ | బహూని తత్ర వర్షాణి తారకాసురవ త్కిల. 67

దేవాసురకృతం యుద్ధం దృష్ట్వా తత్ర పితామహః | హింసారూఢో జగామాశు తం దేశం క్లేశశాంతయే. 68

రాకాపతిం తదా ప్రాహ ముంచ భార్యాం గురో రితి | నో చే ద్విష్ణుం సమాహూయ కరిష్యామి తు సంక్షయమ్‌. 69

భృగుం నివారయామాస బ్రహ్మా లోకపితామహః | కిమన్యాయమతి ర్జాతా సంగదోషా న్మహామతే!. 70

నిషేధయామాస తతో భృగు స్తం చౌషధీపతిమ్‌ | ముంచ భార్యాం గురోరద్య పిత్రా% హం ప్రేషిత స్తవ. 71

ద్విజరాజస్తు తచ్ఛ్రుత్వా భృగోర్వచన మద్భుతమ్‌ | దదౌచ తత్ప్రియాంభార్యాంగురోర్గర్భవతీంశుభామ్‌. 72

ప్రాప్య కాంతాంగురుర్‌ హృష్టః స్వగృహంముదితో య¸° | తతోదేవాస్తతోదైత్యాయయుః స్వాన్స్వాన్గృన్ప్రతి. 73

బ్రహ్మా స్వసదనం ప్రాప్తః కైలాసం చాపి శంకరః | బృహస్పతిస్తు సంతుష్టః ప్రాప్య భార్యాం మనోరమామ్‌. 74

తతః కాలేన కియతా తారా% సూత సుతం శుభమ్‌ | సుదినే శుభనక్షత్రే తారాపతిసమం గుణౖః. 75

దృష్ట్యా పుత్రం గురు ర్జాతం చకార విధిపూర్వకమ్‌ | జాతకర్మాదికం సర్వం ప్రహృష్టే నాంతరాత్మనా. 76

శ్రుతం చంద్రమసా జన్మ పుత్రస్య మునిసత్తమాః | దూతం చ ప్రేష యామాస గురుం ప్రతి మహామతిః. 77

న చాయం తవ పుత్రో% స్తి మమ వీర్యసముద్భవః | కథం త్వం కృతవా న్కామం జాతకర్మాదికం విధిమ్‌. 78

ఆ సమయమున తారకాసుర సంగ్రామమువలె సురాసురుల నడుమ పెక్కేండ్లు ఘోరమైన పోరు సంఘటిల్లెను. ఆ దేవదానవ సంగ్రామము గూర్చి విని వారిని శాంతింప జేయుటకు బ్రహ్మయును హంసవాహనమెక్కి యక్కడి కేతెంచెను. అపుడు బ్రహ్మ చంద్రునితో నిట్లు పలికెను : 'నీవా గురుపత్నిని వదలుము. కానిచో శ్రీ విష్ణువునకు జెప్పి నిన్ను నశింపజేతును. 'పిమ్మట బ్రహ్మశుక్రుని వారించి యిట్లనియెను : 'ఓ మహామతీ! దైత్యుల సహవాస దోషమున నీ మతియు నన్యాయమే తలపెట్టుచున్నదా? అంత శుక్రుడు చంద్రుని వారించి 'ఆ గురునాలినింక విడనాడుము. నీకిట్లు చెప్పుమని నీ తండ్రియే నన్నంపెను.' అనెను. సూతుడిట్లనియెను : శుక్రుని మాటలు విని చంద్రుడు అప్పటికి గర్భవతి యగు గురుని యిల్లాలిని తిరిగి గురునకు నప్పగించెను. గురుడు తన భార్యను మరల గ్రహించి, సంతసించి తన యింటి కరిగెను. దేనదానవులును దమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మ తన లోకమేగెను. శంకరుడు కైలాసము జేరెను. గురుడు తన మనోరమ దార యగు తారను మరల బడసి సంతసించెను. కొన్ని నాళ్లకొక శుభ దినమున శుభ తార యందు తార యందొక సుపుత్రుడుదయించెను. ఆ శిశువు గుణములలో తారాపతినే పోలియుండెను. గురుడు సంతుష్టుడై యా కుమారునకు జాతకర్మ మున్నగు కార్యములు యథావిధిగ జరిపెను. మహామతి చంద్రుడునపుడు పుత్త్ర జననము విని 'ఈ శిశువు నీ కుమారుడు గాడు. మద్వీర్య సంజాతుడు. జాతకర్మాది విదులను నీ వొనర్చితివేమి ?' అని దూతచే గురునకు వార్త నంపెను.

తచ్ఛ్రుత్వా వచనం తస్యదూతస్య చ బృహస్పతిః | ఉవాచ మమ పుత్రో మే సదృశో నాత్ర సంశయః. 79

పున ర్వివాదః సంజాతో మితా దేవదానవాః | యుద్ధార్థ మాగతా స్తేషాం సమాజః సమజాయత . 80

తత్రా%%గతః స్వయం బ్రహ్మా శాంతికామః ప్రజాపతిః | నివారయామాస ముఖే సంస్థితా న్యుద్ధదుర్మదాన్‌. 81

తారాం పప్రచ్ఛ ధర్మాత్మా కస్యాయంతనయః శుభే! సత్యం వద వరారోహే! యథా క్లేశః ప్రశామ్యతి. 82

త మువాచా%సితాపాంగీ లజ్జామానా%వ్యధోముఖీ | చంద్రస్యేతి శ##నై రంత ర్జగామ వరవర్ణినీ. 83

జగ్రాహ తం సుతం సోమః ప్రహృ ష్టేనాంతరాత్మనా | నామ చక్రే బుధ ఇతి జగామ స్వగృహం పునః. 84

య¸° బ్రహ్మా స్వకం ధామ సర్వే దేవాః సవాసవాః | యథాగతం గతం సరైః సర్వశః ప్రేక్షకై ర్జనైః. 85

కథితేయం బుధోత్పత్తి ర్గురుక్షేత్రే చ సోమతః | యథా శ్రుతా మయా పూర్వం వ్యాసా త్సత్యవతీసుతాత్‌. 86

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ప్రథమస్కంధే బుధోత్పత్తిర్నామైకాదశో%ధ్యాయః.

దూతవాక్కులు విని గురుడు 'నను బోలి యున్నందున ఇతడు నా కొడుకు. ఇందు సందేహము లేదు' అని సమాధానమంపెను. అపుడు దేవదానవులు మరల వాదించుకొనుచు సంఘములుగ కయ్యమునకై గుమికూడిరి. శాంతికాముడగు బ్రహ్మ మరల నచ్చటికి విచ్చేసి దుర్మదులై రణమొనర్ప జూచువారిని వారించెను. మరియు దర్మాత్ముడగు బ్రహ్మ తారతో 'వరారోహా! ఈ తనయుడెవరివాడో నిక్కము పలుకుము. జరిగినదంతయు నీవు చెప్పిననే కాని వీరు శాంతించరు' అని పలికెను. అపుడా వరవర్ణిని తారాధిపతివై పోరగన్నుల నగి తల వంచుకొని యా శిశువు చంద్రుని పుత్రుడేయని మెల్లగ బల్కి లోనికేగెను. అంత చంద్రుడు ముదమంది తన తనయుని నెత్తుకొని యతనికి బుధుడను పేరు పెట్టి తన నెలవున కేగెను. బ్రహ్మ తన లోకమున కేగెను. సురలింద్రుని గూడి నాక లోకము చేరిరి. ఇట్లెల్ల వారును దమ తమ నిలయముల కరిగిరి. ఇట్లు గురుని భార్యయందు చంద్రుని వనల బుధుడు జన్మించెను. ఇదే బుధుని జన్మ వృత్తాంతము. మున్ను సత్యవతీ సుతుడగు వ్యాసుని వలన నిదంతయును వింటిని. ఇపుడదే మీకు వినిపించితిని.

ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణమందలి ప్రథమ స్కంధమందు బుధోత్పత్తి యను ఏకాదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters