Sri Devi Bhagavatam-1    Chapters   

శ్రీః

శ్రీ దేవీ భాగవతము

ఆంధ్రానువాద సహితము

అనువాదకులు:

శ్రీ దేవులపల్లి శివరామయ్య FsLi.G.,

పరిష్కర్తలు:

శ్రీ పాతూరి సీతారామాంజనేయులు FsLi.G.

(తెలుగు-సంస్కృతము)

విద్వాన్‌ శ్రీ జంధ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

వ్యాకరణ విద్యాప్రవీణ, సాహిత్య విద్యా ప్రవీణ, వేదాంతవిశారద

ప్రకాశకులు:

శ్రీ వేంకటేశ్వర అర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌ నగర్‌, హైదరాబాద్‌ - 500 020.

ప్రథమ ముద్రణము సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

1994 మూల్యము : రూ. 100/-

ప్రతులు: 2000 కాపీలు

ద్వితీయ ముద్రణము

1996

ప్రతులు: 1000 కాపీలు

ఇంటింట దేవతామందిరములందు పూజింపవలసినవి

ఆడపడుచులు అత్తవారింటికి వెళ్లునపుడు సారె పెట్టవలసినవి

ఆచంద్రార్కము మనుమల మునిమనుమల ఆయురారోగ్యభాగ్య సౌభాగ్య సమృద్ధికి

ధర్మము దనము భోగము మోక్షమునుకోరి చదివి చదివించి

విని వినిపింపవలసినవి వేద వేదాంత రహస్య సుబోధకములైనవి

వ్యాసప్రోక్త అష్టాదశ(18) మహాపురాణములు.

వానిని సంస్కృతమూల-సరళాంధ్రానువాద-పరిశోధనలతో

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముద్రించి

అదించుచున్నది.

ప్రతులకు : ముద్రణ :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌,

గురుకృప, శ్రీవాణి, 1-8-702/105,

1-10-140/1, అశోక్‌ నగర్‌, నల్లకుంట, హైదరాబాద్‌-44

హైదరాబాద్‌ - 500 020 ఫోన్‌ : 7633275, 280719

శ్రీ శృంగేరీ శ్రీ జగద్గురు సంస్థానమ్‌

శ్రీ మత్సరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణపారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణా సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చ క్రవర్త్యనా ద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరం పరాప్రాప్త షడ్‌ దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమసారహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదికమార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్రాది రాజధానీ విద్యానగర మహారాజధానీ కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్రతీరవాసి శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక శ్రీజగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీస్వామి గురు కరకమల సంజాత ''శ్రీ జగద్గురు శృంగేరి శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామిభిఃం అనుగృహీతం -

శ్రీముఖమ్‌

ఆస్మదత్యంత ప్రియశిష్య పల్లెంపాటి వెంకటేశ్వర్లుగారికి నారాయణ స్మరణ పూర్వకాశీస్సులు.

''పురాణన్యాయ మీమాంసా ధర్మశాస్త్రాంగ మిశ్రితాః | మేదాః స్థానాని విద్యానాం ధర్మస్యచ చతుర్దశ.'' యని చతుర్దశ విద్యాస్థానములలో నొకటిగా పురాణము చెప్పబడియున్నది. వేదార్థ నిర్ణయమున కుపకరించునది గావున పురాణమునకు ప్రాశస్త్యము గలదు. దర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురాషార్థములను అనేకములయిన ఉపాఖ్యానములద్వారా ప్రతిపాధించుటయే పురాణములందలి వైశిష్ట్యము. కావున పురాణములు అందరకును ఉపాదేయములు. అట్టి పురాణములను వేదవ్యాసమహర్షి రచించెను. ఆ పురాణములందు భాగవతపురాణము పేరెన్నికగన్నది. ఆది విష్ణుభాగవతమనియు దేవీభాగవతమనియు రెండు విధములుగా నున్నది. ఈ రెండును పురాణ లక్షణలక్షితములై యొప్పారుచున్నవి.

ప్రస్తుతము మీరు ''శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతీట్రస్ట్‌'' అను పేరున ఒక సంస్థను స్థాపించి తన్మూలముగా అష్టాదశ పురాణములను ఆంధ్రానువాదముతో ప్రకటింప నిశ్చయించి ఇప్పుడు దేవీభాగవతమును అనువాద సమితముగ ప్రకటించుట మాకు ముదావహముగనున్నది. పరదేవత యొక్క మాహాత్మ్యము అనేక విధములుగ ఈ పురాణమునందు చెప్పబడియున్నది. దీనిని సరసమైన తెలుగున అనువదించిన అనువాదకుల కృషి మెచ్చదగియున్నది. సర్వజన సులభ##మైన రీతిలోనున్న ఈ యనువాదము చదువరులకత్యంతోపకారముకాగలదు.

శ్రీ శారదాచంద్రమౌళీశ్వరుల యనుగ్రహమున మీరు ఇదేరీతిగా అన్ని పురాణములను ఆంధ్రీకరింపజేసి ప్రకటింతురుగాక యనియు ఈ గ్రంథములు భక్త జనాదరణీయములై విలసిల్లుగాకయనియు నారాయణస్మరణ పూర్వకముగ ఆశీర్వదించుచున్నాము.

శృంగేరి ఇతి నారాయణ స్మరణమ్‌

రక్తాక్షి మార్గశిర శుద్ధ చవితి సోమవారం శ్రీః

26-11-1984

 

Sri Devi Bhagavatam-1    Chapters