Varahamahapuranam-1    Chapters   

నవనవతితమోధ్యాయః - తొంబది తొమ్మిదవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత పలికెను.

జలధేనుం ప్రవక్ష్యామి పుణ్యహ్ని విధిపూర్వకమ్‌,

గోమయే మండలం కృత్వా గోచర్మ తదనన్తరమ్‌. 1

తత్ర మధ్యే చ రాజేన్ధ్ర పూర్ణకుంభంతు విన్యసేత్‌,

జలపూర్ణం సుగంధాడ్యం కర్పూరాగురు చన్దనైః,

వాపితం గంధతోయేన తాం ధేనుం పరికల్పయేత్‌. 2

రాజా! జలధేనువును గూర్చి చెప్పెదను పుణ్యదినమున విధిపూర్వకముగా గోమయముతో మండలముచేసి దానిపై గోవు చర్మమును ఉంచి దానినడుమ పూర్ణకుంభమును ఉంచవలయును. గంధముతో, కర్పూరము, అగురు, చందనము అనువాని సువాసన గల నీరునింపి ఆ ధేనువును ఏర్పరుపవలయును.

వత్సం తథాపరం కల్ప్య ఘృతేన పరిపూరితమ్‌,

వర్ధనీకం మహారాజ పత్ర పుషై#్పః సమన్వితమ్‌,

దుర్వాఙ్కురై రుపస్తీర్య స్రగ్దామైశ్చ విభూషితమ్‌. 3

అట్లే మరియొక కుంభమును నేతితో నింపి ఆకులతో పూవులతో అలంకరింపవలయును. గరికమొలకలను క్రిందనుంచ వలయును. పూలమాలలతో అలంకరింపవలయును.

పఞ్చరత్నాని నిక్షిప్య తస్మిన్‌ కుంభే నరాధిప,

మాంసీ ముశీరం కుష్ఠంచ తథాశైలేయ వాలుకమ్‌. 4

అయిదు రత్నములను ఆ కుంభమున నుంచవలయును. అట్లే మాంసి, ఉశీరము, కుష్ఠము, కొండమట్టి అను వానిని అందు నిలుపవలయును. (మాంసి - జటామాంసి అను మూలిక; ఉశీరము- వట్టివేరు; కుష్ఠము - చెంగల్వకోష్టు; శైలేయవాలుకము - కొండఏటిలోని ఇసుక).

ఆమలాః సర్షపాః శ్వేతాః సర్వధాన్యాని పార్థివ,

చతు ర్దిక్ష్వపి పాత్రాణి చత్వార్యేవ ప్రకల్పయేత్‌. 5

దానిలో ఆమలములు, తెల్లనువ్వులు, సర్వధాన్యములు ఉంచవలయును. నాలుగుదిక్కులందును నాలుగు పాత్రలను పెట్టవలయును. (ఆమలము - ఉసిరికకాయ)

ఏకం ఘృతమయం పాత్రం ద్వితీయం దధిపూరితమ్‌,

తృతీయం మధునశ్చైవ చతుర్థం శర్కరావృతమ్‌. 6

ఒకటి నేతి పాత్ర, రెండవది పెరుగు పాత్ర, మూడవది తేనెపాత్ర, నాలుగవది చక్కెరగిన్నె.

సువర్ణముఖచక్షూంసి శృజ్గాః కృష్ణాగురుషు చ,

ప్రశస్త పత్ర శ్రవణాం ముక్తాఫలమయేక్షణామ్‌. 7

తామ్రపృష్ఠాం కాంస్యదోహాం దర్భరోమసమన్వితామ్‌,

పుచ్ఛం సూత్రమయం కృత్వా కృష్ణాభరణ ఘంటికామ్‌. 8

బంగారుమొగము, నల్లని అగురుతో చేసిన కొమ్ములు, మేలైన ఆకులచెవులు, ముత్యములతో చేసినచూపులు, ఎఱ్ఱని పిరుదు, కంచుపాత్ర దర్భలే వెండ్రుకలు, త్రాటితో తోక, నల్లని ఆభరణములు, గంటలు కలిగిన ఆవును చేయవలయును.

కంబలే పుష్పమాలాం చ గుడాస్యాం శుక్తిదన్తికామ్‌,

జిహ్వాం శర్కరయా కృత్వా నవనీతేన చ స్తనమ్‌,

ఇక్షుపాదాం తు రాజేన్ధ్ర గంధపుష్పోపశోభితామ్‌. 9

గంగడోలునందు పూలమాల నుంచవలయును. బెల్లపు మొగము, ముత్యపుచిప్పలదంతములు, చక్కెరతో నాలుక, వెన్నతో పొదుగు, చెరకుగడలతో కాళ్లు కల ఆవునుచేసి సర్వాభరణములతో అలంకరింపవలయును.

కృష్ణాజినోపరి స్థాప్య వసై#్త్ర రాచ్ఛాదితం తు తామ్‌,

గంధపుషై#్పః సమభ్యర్చ్య విప్రాయ వినివేదయేత్‌. 10

నల్లనిలేడి చర్మము పైనుండి వస్త్రములతో కప్పి గంధ పుష్పములతో చక్కగా పూజచేసి దానిని విప్రునకు సమర్పింప వలయును.

ఏవం ధేనుం తదా దత్వా బ్రాహ్మణ వేదపారగే,

సాధు విప్రాయ రాజేన్ద్ర శ్రోత్రియా యాహితాగ్నయే,

తపోవృద్ధే వయోవృద్ధే దాతవ్యం చ కుటుంబినే. 11

వేదముతుదిదాక అధ్యయనము చేసినవాడు, సాధువు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, తపస్సుచేతను, వయస్సుచేతను పెద్దవాడు, కుటుంబము కలవాడు అగు బ్రాహ్మణునకు ఆ ధేనువును దానము చేయవలయును.

యో దదాతి నరో రాజన్‌ పశ్యతి చ శృణోతి చ,

ప్రతిగృహ్ణాతి యో విప్రః సర్వే తరన్తి దుష్కృతమ్‌. 12

రాజా! ఇట్లు దానముచేయువాడు, చూచువాడు, వినువాడు, పుచ్చుకొనువాడగు విప్రుడు - వీరందరు పాపమునుండి దాటుదురు.

బ్రహ్మహా దన్యుహా గోఘ్నః సురాపో గురుతల్పగః,

విముక్తః సర్వపాపైస్తు విష్ణులోకం స గచ్ఛతి. 13

బ్రహ్మహత్య, క్రూరహత్య, గోహత్య అనునవి చేసినవాడు, మద్యము త్రావువాడు గురుపత్నిని చెరచినవాడును సర్వపాపముల నుండియు దీనివలన విముక్తుడగును. విష్ణులోకమున కరుగును.

యోశ్వమేధేన యజతే సమాప్త వరదక్షిణః,

జలధేనుం చ యో దద్యాత్‌ సమమేత న్నరాధిప. 14

రాజా! అశ్వమేధయాగమును, శ్రేష్ఠమగు దక్షిణలతో పూర్తి చేసినవాడును, జలధేనువును దానమొసగినవాడును సమానులే.

జలాహారస్త్వేకదినం తిష్ఠేచ్చ జలధేనుదః,

అథ పయోవ్రత స్తిష్ఠే దేకాహం వ్రతమాస్థితః,

గ్రాహకోపి త్రిరాత్రం వై తిష్ఠే దేవం న సంశయః. 15

ఈ జలధేనుదానము చేయువాడు ఒకదినము జలాహారము. ఒకదినము పాల ఆహారమును మాత్రమే పుచ్చుకొని వ్రతమాచరింప వలయును. దానము పుచ్చుకొనువాడు గూడ మూడు రాత్రులు ఇట్లే ఉండవలయును.

యత్ర క్షీరవహా సద్యో మధుపాయస కర్దమాః,

యత్ర చాప్సరసాం గీతం తత్ర యాన్తి జలప్రదాః. 16

ఈ జలధేనుదానము చేయువారు పాలతోప్రవహించు నదులు, తేనె, పాయసములసమృద్ధి, అప్సరసల పాటలు గల పుణ్య లోకముల కరుగుదురు.

దాతా చ దాపక శ్చైవ ప్రతిగ్రాహీ చ యో ద్విజః,

సర్వ పాపవినిర్ముక్తో విష్ణుమేతి న సంశయః. 17

ఇచ్చువాడు, ఇప్పించువాడు, పుచ్చుకొను బ్రాహ్మణుడును అన్ని పాపములను రూపుమాపుకొని విష్ణులోకమున కరుగుదురు. సంశయము లేదు.

జలధేను విధానం యః శృణుయాత్‌ కీర్తయేత వా,

సర్వపాప వినిర్ముక్తః స్వర్గ మేతి జితేన్ధ్రియః. 18

ఈ జలధేను విధానమును గూర్చి విన్నవాడును, పలికిన వాడును, పాపములన్నింటిని పోగొట్టుకొని ఇంద్రియములను గెలిచిన వాడై స్వర్గమున కరుగును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే నవనవతితమోధ్యాయః

ఇది శ్రీవారహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదితొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters