Varahamahapuranam-1    Chapters   

చతుర్నవతితమోధ్యాయః - తొంబది నాలుగవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను

అథ మిద్యుత్ర్పభో దైత్య స్తథా దూతో విసర్జితః

దేవ్యాః సకాశం గత్వాసౌ తామువాచ సుమధ్యమామ్‌. 1

అంత మహిషుడు దూతగాపంపిన విద్యుత్ప్పభుడు దేవి సమీపమున కరిగి ఆ సుమధ్యమతో ఇట్లు పలికెను.

ప్రణమ్య ప్రయథో భూత్వా కుమారీశతసంకులామ్‌,

ఆస్థానే వినయావన్న స్తతో వచన మబ్రవీత్‌. 2

ప్రణమిల్లి భక్తియుక్తుడై వందలకొలది కన్యలతో ఉన్న ఆమె ఆస్థానమున వినయము కలవాడై యిట్లు పలికెను.

విద్యుత్ర్పభ ఉవాచ - విద్యుత్ర్పభు డిట్లనెను.

దేవి పూర్వమృషిస్త్వాసీ దాదిసర్గే కసంభవః,

సఖా సారస్వతో జాతః సుపార్మ్యో నామ వై విభుః. 3

దేవీ! మొదటి సృష్టిలో జలమునందు పుట్టిన సుపార్శ్వుడను ఋషి కలడు. అతడు సారస్వతమహర్షికి మిత్రము.

తస్యాభవన్‌ మహాతేజాః సింధుద్వీపః ప్రతాపవాన్‌,

స హి తీవ్రం తవస్తేపే మాహిష్మత్యాం పురోత్తమే. 4

అతనికి గొప్పతేజస్సు, ప్రతాపముగల సింధుద్వీపుడను కొడుకుపుట్టెను. అతడు మాహిష్మతియను గొప్ప పట్టణమున తీవ్రమగు తపస్సు చేసెను.

కుర్వతస్తు తపోఘోరం నిరాహారస్య శోభ##నే,

ఆద్యా తు విప్రచిత్తేస్తు సుతా సురసుతోపమా,

మాహిష్మతీతి విఖ్యాతా రూపేణాసదృశీ భువి. 5

అట్లు నిరాహారుడై మహాఘోరతపమాచరించుచున్న అతనికి మాహిష్మతి యను కూతురు పుట్టెను. ఆమె విప్రచిత్తికి అక్క, రూపములో సాటిలేనిది. దేవకన్యవంటిది.

సా సఖీభిః పరివృతా విహరన్తీ యదృచ్ఛయా,

ఆగతా మందరద్రోణీం తత్రాపశ్యత్‌ తపోవనమ్‌,

మునే రంబర సంజ్ఞస్య వివిధ ద్రుమ మాలినమ్‌. 6

ఆమె చెలులతో కూడి ఒకనాడు విహరించుచు అనుకొన కుండ మందర పర్వతము లోయలో అంబరుడను పేరుగల ముని తపోవనమును, పెక్కువిధముల చెట్లవరుసలు కలదానిని, చేరుకొనెను.

లతా గృహైస్తు వివిధై ర్వకులై ర్లకుచై స్తథా,

చందనైః స్పందనైః శాలైః సరళై రుపశోభితమ్‌,

విచిత్ర వనఖండైస్తు భూషితం తు మహాత్మనః. 7

ఆ మహాత్ముని తపోవనము పెక్కుపొదరిండ్లతో, పెక్కు విధములగు పొగడలు, గజనిమ్మలు, మంచిగంధపుచెట్లు, సాలములు, సరళములు, విచిత్రములగు తోటలు మొదలగువానితో అలంకృతమై యుండెను.

దృష్ట్వాశ్రమపదం రమ్యం సాసురీ కన్యకా శుభమ్‌,

మాహిష్మతీ వరారోహా చిన్తయామాస భామినీ. 8

అట్టి అందమైనది, శుభ##మైనది అగు ఆశ్రమపదమును గాంచి ఆ రాక్షసకన్య మాహిష్మతి ఇట్లు తలపోసెను.

భీషయిత్వాహ మేనం తు తాపసం త్వాశ్రమే స్వయమ్‌,

తిష్ఠామి క్రీడతీ సార్ధం సఖీభిః పరమార్చితా. 9

నాసఖులందరు నన్ను మిన్నగా మన్నించుచుండగా ఈ తాపసుని భయపెట్టి స్వయముగా నేనే ఇందు క్రీడించుచు నిలిచిపోయెదను.

ఏవం సంచిన్త్య సా దేవీ మహిషీ సంబభూవ హ,

సఖీభిః సహ విశ్వేశి తీక్ష్న శృంగాగ్ర ధారణీ. 10

ఇట్లు తలపోసి ఆ దేవి చెలులతో పాటు మిక్కిలి వాడి యయిన కొమ్మలు తాల్చి మహిషిగా ఆయెను. (మహిషి-గేదె)

తమృషిం భీషితుం తాభిః సహ గత్వా వరాననా,

అసౌ బిభీషిత స్తాభి స్తాం జ్ఞాత్వా జ్ఞానచక్షుషా,

ఆసురీం క్రోధసంపన్నః శశాప శుభలోచనామ్‌. 11

సుందరమగు మొగముగల ఆ రాక్షసి చెలులతోపాటు అతనిని భయపెట్టుటకై అరిగెను. అంత ఋషి జ్ఞాననేత్రముతో ఆమెను గుర్తించి క్రోధము పెచ్చురేగగా ఆ అసురకన్యను శపించెను.

యస్మాద్‌ భీషయసే మాం త్వం మహిషీ రూపధారిణీ,

అతో భవ మహిష్యేవ పాపకర్మే శతం సమాః. 12

నన్ను గేదెరూపు తాల్చా భయపెట్టిన కారణముగా ఓ పాపకర్మురాలా! నూరేండ్లు గేదెవు కమ్ము.

ఏవ ముక్తా తతః సాతు సఖీభిః సహ వేపతీ,

పాదయో ర్న్యపతత్‌ తస్య శాపాంతం కురు జల్పతీ. 13

ఇట్లు పలుకగా ఆమె చెలులతోపాటు వణకిపోవుచు శాపము తీరుదారి చెప్పుమని మరలమరల పలుకుచు అతని పాదములపై పడెను.

తస్యా స్తద్‌ వచనం శ్రుత్వా సమునిః కరుణాన్వితః,

శాపాంత మకరోత్‌ తస్యా వాక్యం చేద మువాచ హ. 14

ఆమె ఆ మాట విని ఆ ముని కరుణకలవాడై శాపము తీరుటను ఏర్పరచెను. ఈ వాక్యమును పలికెను.

అనేనైవ స్వరూపేణ పుత్ర మేకం ప్రసూయ వై,

శాపాన్తో భవితా భ##ద్రే మద్వాక్యం నమృషా భ##వేత్‌. 15

మంచిదానా! నీవు ఈ స్వరూపముతోడనే ఒక కొడుకును గని శాపాంతమును పొందుదువు. నా వాక్యము అబద్ధము కాదు.

ఏవ ముక్తా గతా సా తు నర్మదాతీర ముత్తమమ్‌,

యత్ర తేపే తపోఘోరం సింధుద్వీపో మహాతపాః. 16

అత డట్లు పలుకగా ఆమె సింధుద్వీపమహర్షి ఘోరమగు తపస్సు చేసిన ఉత్తమమగు నర్మదతీరమున కరిగెను.

తత్ర చేన్దుమతీనామ దైత్యకన్యాతిరూపిణీ,

సా దృష్టా తేన మునినా వివస్త్రా మజ్జతీ జలే. 17

అచట ఇందుమతి యను ఒక దైత్యకన్య మహారూపవతి వివస్త్రయై జలమున మునుగుచు ఆ మునికంటబడెను.

చస్కంద చ మునిః శుక్రం శిలాద్రోణ్యాం మహాతపాః,

తచ్చ మాహిష్మతీ దృష్ట్వా దివ్యగన్ధి సుగన్ధి చ,

తతః సఖీ రువాచేదం పిబామీదం జలం శుభమ్‌. 18

అంత నా మహాతాపసుడు రాతి దొన్నెయందు శుక్రమును వదలెను. దివ్యమైన పరిమళము, శ్రేష్ఠమగు వాసన గల ఆ శుక్రమును జూచి మాహిష్మతి సఖులతో నేనీ నీరమును త్రావెద ననెను.

ఏవ ముక్త్వా తు సా పీత్వా తచ్ఛుక్రం మునిసంభవమ్‌,

ప్రాప్తా గర్భం మునే ర్బీజాత్‌ సుషాన చ తదా సతీ. 19

ఇట్లు పలికి ఆమె మునివలన ఏర్పడిన ఆ శుక్రమును త్రావెను. ముని బీజమువలన గర్భము తాల్చెను. కుమారుని కనెను.

తస్యాః పుత్రోభవద్‌ ధీమాన్‌ మహాబలపరాక్రమః,

మహిషేతి స్మృతో నామ్నా బ్రహ్మవంశ వివర్ధనః,

సత్వాం వరయతే దేవి దేవసైన్య విమర్దనః. 20

ఆమెకు కొడుకు పుట్టెను. అంతడు గొప్ప బుద్ధిశాలి. గొప్ప బలము, పరాక్రమము కలవాడు. బ్రహ్మ వంశమును పెంపొందించు వాడు. పేరు మహిషుడు. దేవీ! దేవసైన్యమును పిండిగొట్టిన ఆతడు నిన్ను వరించుచున్నాడు.

స సురానపి జిత్వాజౌ త్రైలోక్యం చ తవానఘే,

దాస్యతే దేవి సుప్రీత స్తవ సర్వం మహాసురః,

తస్యాత్మోపప్రదానేన కురు దేవి మహత్‌ కృతమ్‌. 21

అతడు దేవతలను యుద్ధమున గెలిచి మిక్కిలి ప్రీతికలవాడై పుణ్యురాలా! నీకు మూడు లోకముల నొసగును. నీవును నిన్ను ఇచ్చుకొనుట ద్వారా, గొప్ప కృత్యమును ఆచరింపుము.

ఏవ ముక్తా తదా దేవీ తేన దూతేన శోభనా,

జహాస పరమా దేవీ వాక్యం నోవాచ కిఞ్చన. 22

ఇట్లా దూత పలుకగా ఆ శోభన, ఆ పరమదేవి నవ్వెను. ఏమియు పలుకకుండెను.

తస్యా హసన్త్యా దూతోసౌ త్రైలోక్యం సచరాచరమ్‌,

దదర్శ కుక్షౌ సంభ్రాంత స్తతక్షణాత్‌ సమపద్యత. 23

అట్లు నవ్వుచున్న ఆమె కడుపులో చరాచరాత్మక మయిన మూడు లోకములను ఆ క్షణమున ఆ దూత చూచెను. తలతిరిగి పోయెను.

తతో దేవ్యాః ప్రతీహారీ జయా నామాతి తేజనా,

దేవ్యా హృది స్థితం వాక్య మువాచ తనుమధ్యమా. 24

అంతదేవి ప్రతీహారి జయ అనుగొప్ప తేజశ్శాలిని సన్నని నడుము గలది, దేవి హృదయమున నున్న భావమును గూర్చి యిట్లు పలికెను.

జయా ఉవాచ - జయ పలికెను.

కన్యార్థీ వదతే యద్ధి తత్త్వయా సముదీరితమ్‌,

యది నామ వ్రతం చాస్యాః కౌమారం సార్వకాలికమ్‌,

అపి చాన్యాః కుమార్యోత్ర సన్తి దేవ్యాః పదానుగాః. 25

కన్యను కోరువాడు పలుకవలసినది పలికితివి. కాని ఈ యమ సర్వకాలమునకు సంబంధించిన కౌమారవ్రతమును పట్టినది. అట్లే ఇక్కడి కన్యలందరు ఆమె అడుగుజాడలలో నడచువారు కలరు.

తాసా మేకాపి నో లభ్యా కిము దేవీ స్వయంశుభా,

యాహి దూత త్వరన్‌ మాతే కిఞ్చి దన్యద్‌ భవిష్యతి. 26

వారిలో ఏ యొక్కతెయు మీకు లభింపదు. ఇక పరమపవిత్ర యగు దేవి సంగతి చెప్పనేల? ఓయిదూతా! త్వరగా నీకిక్కడ ఏదో మూడకముందే పొమ్ము.

ఏవ ముక్తో గతో దూత స్తావద్‌ వ్యోమ్ని మహామునిః,

ఆయాతో నారద స్తూర్ణం నృత్య న్నుచ్చై ర్మహాతపాః. 27

ఇట్లు పలుకగా ఆ దూత వెడలిపోయెను. ఇంతలో మహాముని నారదుడు పెద్దగా నృత్యము చేయుచు అచటకు వడివడిగా విచ్ఛేసెను.

దిష్ట్యా దిష్ట్యేతి వదత స్తాం దేవీం శుభలోచనామ్‌,

ఉపవిష్టో జగాదాథ ఆసనే పరమేర్చితః. 28

భాగ్యము భాగ్యమనుచు ఆ శుభలోచనయగు దేవిని గూర్చి పలుకుచు మంచిమన్నన గొప్పవాడై పరమాసనమును కూర్చుండెను.

ప్రణమ్య దేవీం సర్వేశీ మువాచ చ మహాతపాః,

దేవి దేవై రహం ప్రీతైః ప్రేషితోస్మి తవాన్తికమ్‌. 29

ఆ మహాతాపసుడు సర్వేశ్వరియగు ఆ దేవికి ప్రణమిల్లి యిట్లు పలికెను. అమ్మా! దేవతలందరు ప్రీతి నంది నన్ను పంపగా నీకడకు వచ్చితిని.

విజితా దేవి దైత్యేన మహిషాఖ్యేన నిర్జరాః,

త్వాం గృహీతుం ప్రయత్నం స కృతవాన్‌ దేవి దైత్యరాట్‌. 30

దేవీ! మహిషుడను రక్కసునికి దేవతలందరు ఓడిరి. ఆ దైత్యరాజు నిన్ను చేపట్టుటకు ప్రయత్నము చేసియున్నాడు.

ఏవ ముక్తోస్మి దేవై స్త్వాం బోధయామి వరాననే,

స్థిరీభూతా మహాదేవి తం దైత్యం ప్రతిఘాతయ. 31

మంచిమొగముగల ఓ తల్లీ! మహాదేవీ! దేవతలు నీకిది తెలుపుమని నన్ను పలికిరి. నీవు గట్టిగా నిలబడి ఆ రక్కసుని పరమార్పుము.

ఉక్తై వాన్త ర్హితః సద్యో నారదః స్వేచ్ఛయా య¸°,

దేవీ చ కన్యా స్తాః సర్వాః సన్నహ్యన్తా మువాచ హ. 32

ఇట్లు పలికి నారదుడు వెనువెంటనే అంతర్ధానము చెంది యిచ్చవచ్చినచోటి కరిగెను. దేవియు ఆ కన్యల నందరను సిద్ధము కండని పలికెను.

తతః కన్యా మహాభాగాః సర్వాస్తా దేవిశాసనాత్‌,

బభూవు ర్ఘోరరూపిణ్యః ఖడ్గ చర్మధనుర్ధరాః,

సంగ్రామ హేతోః సంతుస్థు ర్దైత్యవిధ్వంసనాయ తాః. 33

అంత నా పుణ్యాత్మలగు కన్యలందరు దేవి ఆజ్ఞవలన కత్తులు, డాళ్లు, విండ్లు చేత దాల్చి ఘోరరూపముకలవారై యుద్ధమునకును, దైత్యుని రూపుమాపుటకును సిద్ధపడిరి.

తావద్‌ దైత్య బలం సర్వం ముక్త్వా దేవచమూంద్రుతమ్‌,

అయ¸° యత్ర తద్‌ దేవ్యాః సన్నద్దం స్త్రీ బలం మహత్‌. 34

ఇంతలో ఆ రక్కసుని సైన్యమంతయు దేవసేనను వదలి గొప్పదియగు స్త్రీ బలమున్నచోటికి పరుగున వచ్చెను.

తతస్తా యుయుధుః కన్యా దానవైః సహ దర్పితాః,

క్షణన తద్‌ బలం తాభి శ్చతురంగం నిపాతితమ్‌. 35

గొప్ప ఆత్మధైర్యము గల ఆకన్యలు రక్కసులతో పోరి క్షణములో వారి నాలుగు అంగములుగల సేననంతటిని కూలవైచిరి.

శిరాంసి తత్ర కేషాంచి చ్ఛిన్నాని పతితాని చ,

అపరేషాం విదార్యోరః క్రవ్యాదాః పాన్తి శోణితమ్‌. 36

అందు కొందరి తలలు పగిలి నేలఁగూలినవి. మరికొందరి రొమ్ములను చీల్చి క్రూరమృగములు నెత్తురు త్రావినవి.

అన్యే కబంధభూతాస్తు ననృతు ర్దైత్యనాయకాః,

ఏవం క్షణన తే సర్వే విధ్వస్తాః పాపచేతసః,

అపరే విద్రుతాః సర్వే యత్రాసౌ మహిషాసురః. 37

మరికొందరు మొండెములు మాత్రము మిగిలిన దైత్య నాయకులు నృత్యములు గావించిరి. ఇంకను మిగిలినవారందరు మహిషాసురుడున్నచోటికి పారిపోయిరి.

తతో హాహాకృతం సర్వం యథా దైత్యబలం మహత్‌,

ఏవం తదాకులం దృష్ట్వా మహిషో వాక్య మబ్రవీత్‌,

సేనాపతే కి మేతద్ధి బలం భగ్నం మమాగ్రతః. 38

అపుడు పెద్దదియగు ఆ రాక్షససేన హాహాకరములు చేసెను. ఈ గందరగోళమును చూచి మహిషుడు సేనాపతీ! ఇదేమి! నా ఎదుటనే నాసేన నాశనమాయెను? అని పలికెను.

తతో యజ్ఞహను ర్నామా దైత్యో హస్తిస్వరూపవాన్‌,

ఉవాచ భగ్న మేతద్ధి కుమారీభిః సమన్తతః. 39

అప్పుడు యజ్ఞహను రక్కసుడు ఏనుగురూపము కలవాడు, ఆ కన్యలందరు ఈ సేనను సర్వవిధముల విరిచిప్రోవులు పెట్టెనని పలకెను.

తతో దుద్రావ మహిష స్తాః కన్యాః శుభలోచనాః,

గదా మాదాయ తరసా కన్యా దుద్రావ వేగవాన్‌. 40

అంత మహిషుడు గదచేపట్టి చక్కని కనులు గల ఆ కన్నెల నందరిని మహావేగముతో తరుముచు వచ్చెను.

యత్ర తిష్ఠతి సా దేవీ దేవగన్ధర్వ పూజితా,

తత్రైవ సోసురః ప్రాయాద్‌ యత్ర దేవీ వ్యవస్థితా,

సా చ దృష్ట్వా తమాయాన్తం వింశద్ధస్తా బభూవ హ. 41

దేవతలు, గంధర్వులు పూజించుచున్న ఆ దేవి ఉన్నచోటికే వాడు పరువెత్తుచు వచ్చెను. ఆమెయు నట్లు వచ్చి పడుచున్న రక్కసుని కని ఇరువది చేతులు కలది ఆయెను.

ధనుః ఖడ్గం తథా శక్తిం శరాన్‌ శూలం గదాం తథా,

పరశుం డమరుం చైవ తదా ఘణ్టాం విశాలినీమ్‌,

శతఘ్నీం ముద్గరం ఘోరం భుశుణ్డీం కుంత మేవ చ. 42

ముసలం చ తథా చక్రం భిందిపాలం తథైవ చ,

దండం పాశం ధ్వజం చైవ పద్మం చేతి చ వింశతిః. 43

భూత్వా వింశభుజా దేవీ సింహమాస్థాయ దంశితా,

సస్మార రుద్రం దేవేశం రౌద్రం సంహారకారణమ్‌. 44

విల్లు, కత్తి, శక్తి, బాణములు, శూలము, గద, గొడ్డలి, డమరువు, పెద్దఘంట, శతఘ్ని, ఇనుపగుదియ, ఘోరమైన భుశుండి, ఈటె, రోకలి, చక్రము, భిందిపాలము, దండము, పాశము, ధ్వజము, పద్మము అను ఈ ఇరువదింటిని చేతులతో పట్టుకొని సింహము నెక్కి చక్కగా కవచము మొదలగువానిని ధరించి ఆ దేవి సంహారకారణుడు భయంకరుడునగు రుద్రుని స్మరించెను.

తతో వృషధ్వజః సాక్షాద్‌ రుద్ర స్తత్రైవ ఆయ¸°,

తయా ప్రణమ్య విజ్ఞప్తః సర్వాన్‌ దైత్యాన్‌ జయామ్యహమ్‌. 45

అంత ఎద్దు ధ్వజముగా గల రుద్రుడు తనకు తానై అచటకు వచ్చెను. ఆమె అతనికి ప్రణమిల్లి యిట్లు విన్నవించెను. ఈ దైత్యుల నందరిని నేను గెలుతును.

త్వయి సన్నిధిమాత్రే తు దేవదేవ సనాతన,

ఏవముక్త్వాసురాన్‌ సర్వాన్‌ జిగాయ పరమేశ్వరీ. 46

దేవదేవా! సనాతనా! నీవు చేరువలోనున్న చాలును. అని పలికి ఆ అసురులనందరిని ఆ పరమేశ్వరి గెలిచెను.

ముక్త్వా తమేకం మహిషం శేషం హత్వా తమభ్యయాత్‌,

యావద్‌ దేవీ తతః సాపి తాం దృష్ట్వా సోపి దుద్రువే. 47

ఆ మహిషు నొక్కని వదలి తక్కిన మూక నంతటిని చంపివైచి వానిపై కురికెను. ఇంతలో వాడును ఆమెను గాంచి యామెవైపు దుమికెను.

క్వచిద్‌ యుద్ధ్యతి దైత్యేన్ధ్రః క్వచిచ్చైవ పలాయతి,

క్వచిత్‌ పునర్మృధం చక్రే క్వచిత్పున రుపారమత్‌. 48

ఒక్కయెడ ఆ దైత్యరాజు పోరాడును. కొండొకచో పారి పోవును, మరొకవేళ యుద్ధము చేయును. మరొకయెడ మాని వేయును.

ఏవం వర్షసహస్రాణి దశ తస్య తయా సహ,

దివ్యాని విగతాని స్యు ర్యుద్ధ్యత స్తస్య శోభ##నే,

బభ్రామ సకలం త్వాజౌ బ్రహ్మాండం భీతమానసమ్‌. 49

ఇట్లు ఆమెతో పోరుచున్న ఆతనికి పదివేల దివ్యవత్సరములు గడచిపోయెను. బ్రహ్మాండమంతయు బెదరుగుండెతో కదలిపోయెను.

తతః కాలేన మహతా శాతశృఙ్గే మహాగిరౌ,

పద్భ్యా మాక్రమ్య శూలేన నిహతో దైత్యసత్తమః. 50

అంతపెద్ద కాలమునకు శతశృంగమహాపర్వతమున ఆ తల్లి పాదములతో నాక్రమించి ఆ ఘోర దైత్యుని శూలముతో పొడిచి చంపివైచెను.

శిరశ్చిచ్ఛేద ఖడ్గేన తత్ర చాన్తఃస్థితః పుమాన్‌,

నిర్గత్య విగతః స్వర్గం దేవ్యాః శస్త్రనిపాతనాత్‌. 51

ఖడ్గముతో వాని తలను కోసి వైచెను. అట్లు దేవి ఆయుధము పడుటవలన ఆ మహిషునిలో నున్న ఒక పురుషుడు వాని దేహము నుండి వెలువడి స్వర్గమున కరిగెను.

తతో దేవగణాః సర్వే మహిషం వీక్ష్య నిర్జితమ్‌,

సబ్రహ్మకాః స్తుతిం చక్రు ర్దేవ్యా స్తుష్టేన చేతసా. 52

అంత బ్రహ్మతోపాటు దేవతలందరు ఓడి చచ్చిన మహిషుని గాంచి సంతసించిన హృదయముతో దేవి నిట్లు స్తుతించిరి.

దేవా ఊచుః - దేవత లిట్లనిరి.

నమో దేవి మహాభాగే గంభీరే భీమదర్శనే,

జయస్థే స్థితసిద్ధన్తే త్రినేత్రే విశ్వతోముఖి. 53

పూజ్యులారా! దేవీ! ఎరుగనలవి కాని తత్త్వము కలదానా! భయంకరముగా కానవచ్చు ఓ దేవీ! జయము నందున్నతల్లీ! సిద్ధాంతమును నెలకొల్పు మాతా! మూడుకన్నులదానా! అన్ని వైపుల ముఖములు గల ఓ అమ్మా! నీకు నమస్కారము.

విద్యావిద్యే యే యాజ్యే మహిషాసురమర్దిని,

సర్వగే సర్వదేవేశి విశ్వరూపిణి వైష్ణవి. 54

అమ్మా! నీవు విద్యవు, అవిద్యవు, జయవు, పూజ్యవు, మహిషాసురుని మర్దించితివి. అంతట నుందువు. సర్వదేవతలకు ఈశ్వరివి. విశ్వమంతయు నీ రూపమే. ఓ విష్ణుశక్తీ! నీకు ప్రణతి.

వీతశోకే ధ్రువే దేవి పద్మపత్ర శుభేక్షణ,

శుద్ధ సత్వ వ్రతస్థే చ చణ్డరూపే విభావరి. 55

నిన్ను శోకమంటదు. నీవు స్థిరమైన దానవు. తామరరేకుల వంటి చక్కని కన్నులు గల ఓ దేవీ! శుద్ధసత్వ స్వరూపముగల వ్రతమునందున్న దానవు. చండరూపము నీయది. రాత్రి రూపిణివి.

బుద్ధి సిద్ధిప్రదే దేవి విద్యేవిద్యేమృతే శివే,

శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వలోకనమస్కృతే. 56

సంపదను, సిద్ధిని ఒసగుదువు. విద్యవు, అవిద్యవు, అమృత స్వరూపిణివి. మంగళరూపవు, శంకర, విష్ణు, బ్రహ్మల శక్తులన్నియు కలదానవు. సర్వలోకములు నీకు నమస్కరించును.

ఘంటాహస్తే త్రిశూలాస్త్రే మహామహిషమర్దిని,

ఉగ్రరూపే విరూపాక్షి మహామాయేమృతస్రవే. 57

ఘంటహస్తమున గలదానవు. త్రిశూలము ఆయుధమైన దానవు. మహామహిషుని మర్దించినదానవు. ఉగ్రమగు రూపముగల దానవు. విరూపములగు కన్నులు కలదానవు. మహామాయవు. అమృతమును జాలువార్చు తల్లివి.

సర్వసత్వహితే దేవి సర్వసత్వమయే ధ్రువే,

విద్యాపురాణ శిల్పానాం జననీ భూతధారిణీ. 58

నీవు సర్వజంతువులకు మేలుకూర్చుదానవు. సర్వప్రాణులు నీ స్వరూపమే

అయినదానవు. స్థిరమైన దానవు. విద్యలు, పురాణములు, శిల్పములు అనువానిని

పుట్టించినదానవు. సర్వభూతము లను పట్టి నిలుపుదానవు.

సర్వదేవ రహస్యానాం సర్వసత్వవతాం శుభే,

త్వమేవ శరణం దేవి విద్యేవిద్యే శ్రియేంబికే.

విరూపాక్షి తథా క్షాన్తి క్షోభితాంతర్జలేవిలే. 59

సర్వదేవతల రహస్యములకు, సర్వశక్తులు కలవారికి నీవే శరణము. దేవీ! విద్యయు,

అవిద్యయు, సంపదయు, నీవే. నీవే తల్లివి. నీవు మూడు కన్నులతో విరూపాక్షివి. సహన స్వరూపిణివి. నీటిలోపలి శక్తి నీ స్వరూపమే. ఏ కలుషము లేనిదానవు.

నమోస్తు తే మహాదేవి నమోస్తు పరమేశ్వరి,

నమస్తే సర్వదేవానాం భావనిత్యేక్షయేవ్యయే. 60

మహాదేవి! నీకు నమస్సు. పరమేశ్వరీ! నీకు ప్రణామము. సర్వదేవతల భావములందు నిత్యమై వెలయు తల్లీ! అక్షయా! అవ్యయా! నీకు మ్రొక్కులు.

శరణం త్వాం ప్రపద్యన్తే యే దేవి పరమేశ్వరి,

న తేషాం జాయతే కిఞ్చి దశుభం రణసఙ్కటే. 61

పరమేశ్వరీ!దేవీ!ఘోరమగు యుద్ధముల కష్టసమయములలో నిన్ను శరణుపొందినవారికి ఏకీడును కలుగదు.

యశ్చ వ్యాఘ్రభ##యే ఘోరే చౌరరాజభ##యే తథా,

స్తవ మేనం సదా దేవి పఠిష్యతి యతాత్మవాన్‌. 62

నిగడస్థోపి యో దేవి త్వాం స్మరిష్యతి మానవః,

సోపి బంధై ర్విముక్త స్తే సుసుఖం వసతే సుఖీ. 63

పులిభయము, ఘోరమగు చోరభయము, రాజభయము కలిగినపుడు నిశ్చలమగు చిత్తముతో ఈ స్తోత్రమును పఠించు వాడును, బంధనమున నుండి నిన్ను తలచిన నరుడును ఆ అన్నింటి నుండి విముక్తుడై సుఖముతో జీవించును.

శ్రీవరాహ ఉవాచ - శ్రీ వారహ దేవు డిట్లు చెప్పెను.

ఏవం స్తుతా తదా దేవీ దేవైః ప్రణతి పూర్వకమ్‌,

ఉవాచ దేవాన్‌ సుశ్రోణీ వృణుధ్వం వర ముత్తమమ్‌. 64

ఇట్లు దేవతలందరు చేతులు మోడ్చి స్తుతింపగా ఆ పరమ సుదరి దేవతలను గాంచి, మేలైన వరము కోరుకొనుడని పలికెను.

దేవా ఊచుః - దేవత లిట్లనిరి.

దేవి స్తోత్ర మిదం యే హి పఠిష్యన్తి తవానఘే,

సర్వకామ సమాపన్నాన్‌ కురుదేవి స నో వరః. 65

అమ్మా! పుణ్యాత్మా! ఈ స్తోత్రమును భక్తితో చదువు వారు అన్ని కామితములను పొందువారగునట్లు చేయుము. ఇదియే మాకు వరము.

ఏవ మస్త్వితి తాన్‌ దేవా నుక్త్వా దేవీ పరాపరా,

విససర్జ తతో దేవాన్‌ స్వయం తత్రైవ సంస్థితా. 66

అట్లే యగుగాక! అని పలికి ఆ పరాపరయగు దేవి తానచటనే నిలిచినదై దేవతలందరిని వారి వారి తావులకు పంపివైచెను.

ఏతద్‌ ద్వితీయం యోజన్మ వేదదేవ్యా ధరాధరే,

స వీతశోకో విరజాః పదం గచ్ఛ త్యనామయమ్‌. 67

ఓ ధరిత్రీ! దేవి యీ రెండవ జన్మమును గూర్చి తెలిసికొన్న వాడు శోకము లేనివాడు, రజోగుణమంటనివాడును అయి ఏ రోగము లేని పదమునకు చేరుకొనును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుర్నవతితమోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబది నాలుగవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters