Varahamahapuranam-1    Chapters   

త్రినవతితమోధ్యాయః - తొంబది మూడవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

తతో మహిష దైత్య స్తు కామరూపీ మహాబలః,

మత్తహస్తిన మారుహ్య యియాసు ర్మేరుపర్వతమ్‌. 1

ఇష్టమైన రూపము తాల్పగలవాడు, గొప్పబలముగలవాడును అగు మహిషరాక్షసుడు మదించిన ఏనుగనెక్కి మేరుపర్వతమునకు ప్రయాణము కట్టెను.

తత్రైన్ధ్రం పుర మాసాద్య దేవైః సహ శతక్రతుమ్‌,

అభిదుద్రావ దైత్యేన్ధ్ర స్తతో దేవాః క్రుధాన్వితాః. 2

అంత నతడు ఇంద్రుని పురమును ముట్టి దేవతలతో పాటు దేవేంద్రుని తరిమికొట్టెను. అంత దేవతలందరు కోపావేశము పొందిరి.

ఆదాయ స్వాని శస్త్రాణి వాహనాని విశేషతః,

అధిష్ఠాయా సురా నాజౌ దుద్రువు ర్ముదితా భృశమ్‌. 3

తమ శస్త్రములను, వాహనములను పెద్దగా గొని దైత్యులను నిలువరించి ఆనందపుపొంగుతో వారి వెంటబడిరి.

తేషాం ప్రవవృతే యుద్ధం తుములం లోమహర్షణమ్‌.

ఘోరం ప్రచణ్డయోధానా మన్యోన్య మభిగర్జతామ్‌. 4

ప్రచండులగు యోధులు, ఒకరిపై నొకరు గర్జించుచున్న వారునగు వారికి ఒడలు గగుర్పాటు కలిగించు మహాసంకులమైన సమరము జరిగెను.

తత్రాంజనో నీలకుక్షి ర్మేఘవర్ణో బలాహకః,

ఉదరాక్షో లలాటాక్షః సుభీమో భీమవిక్రమః,

స్వర్భానుశ్చేతి దైత్యాష్టౌ వసూన్‌ దుద్రుపు రాహవే. 5

అందు అంజనుడు, నీలకుక్షి, మేఘవర్ణుడు, వలాహకుడు, ఉదరాక్షుడు, లలాటాక్షుడు, సుభీముడు, భీమవిర్రముడైన స్వర్భానువు అను ఎనమండ్రు రక్కసులు యుద్ధమున వసువులను తరిమి కొట్టిరి. (వసువులు - ఎనమండ్రు)

యథాసంఖ్యేన తద్వచ్చ దైత్యా ద్వాదశ చాపరే,

ఆదిత్యాన్‌ దైత్యవర్యాస్తు తేషాం ప్రాధాన్యతః శృణు. 6

పండ్రెండుగురు దైత్యులు పండ్రెండుగురైన ఆదిత్యులను తరిమికొట్టిరి. వారిని వివరించెదను వినుము.

భీమోధ్వజ్షో ధ్వస్తకర్ణః శంకుకర్ణ స్తథైవ చ,

వజ్రకాయోతివీర్యశ్చ విద్యున్మాలీ తథైవ చ. 7

రక్తాక్షో భీమదంష్ట్రస్తు విద్యుజ్జిహ్వ స్తథైవచ,

అతికాయో మహాకాయో దీర్ఘబాహుః కృతాంతకః,

ఏతే ద్వాదశ దైత్యేన్ద్రా ఆదిత్యాన్‌ యుధి దుద్రువుః. 8

భీముడు, ధ్వంక్షుడు, ధ్వస్తకర్ణుడు, శంకుకర్ణుడు, వజ్రకాయుడు, గొప్పవీర్యముకల విద్యున్మాలి, రక్షాక్షుడు, భీమదంష్ట్రుడు, విద్యుజ్జిహ్వుడు, అతికాయుడగు మహాకాయుడు, దీర్ఘబాహువు, కృతాంతుడు అను పండ్రెండుగురు దైత్యులు ఆదిత్యులను పోరున త్రోలిరి. (ఆదిత్యులు పండ్రెండుగురు)

స్వకం సైన్యముపాదాయ తద్వదన్యేపి దానవాః,

రుద్రాన్‌ దుద్రువు రవ్యగ్రా యథాసంఖ్యేన కోపితాః 9

అట్లే ఇతర రాక్షసులు పదునొకండుగురు మిక్కిలి కోపము కలవారై తమసైన్యములను కొనిపోయి రుద్రులను పదునొకండు గురను తరిమివైచిరి.

కాలః కృతాంతో రక్తాక్షో హరణో మిత్రహానిలః,

యజ్ఞహా బ్రహ్మహా గోఘ్నః స్త్రీఘ్నః సంవర్తక స్తథా. 10

ఇత్యేతే దశ చైకశ్చ దైత్యేంద్రా యుద్ధదుర్మదాః,

యథాసంఖ్యేన రుద్రాంస్తు దుద్రుపు ర్భీమవిక్రమాః. 11

కాలుడు, కృతాంతుడు, రక్తాక్షుడు, హరణుడు, మిత్రహుడు అనిలుడు, యజ్ఞహుడు, బ్రహ్మహుడు, గోఘ్నుడు, స్త్రీఘ్నుడు, సంవర్తకుడు - అను ఈ పదునొకండుగురు దైత్యేంద్రులు, యుద్ధమున ఒడలెరుగనివారు భయంకరశౌర్యము కలవారు అదే సంఖ్యగల రుద్రులను ఎదుర్కొనిరి.

శేషాన్‌ దేవాన్‌ శేషదైత్యా యథాయోగ ముపాద్రవన్‌,

స్వయం మహిషదైత్యస్తు ఇంద్రం దుద్రావ వేగితః. 12

మిగిలిన దేవతలను మిగిలిన రక్కసులు దొరకినవారిని దొరకినట్లు ఎదుర్కొనిరి. మహిషరాక్షసుడు స్వయముగా దేవేంద్రునితో తలపడి పోరాడెను.

స చాపి బలవాన్‌ దైత్యో బ్రహ్మణో వరదర్పితః,

అవధ్యః పురుషేణాజౌ యద్యపి స్యాత్‌ పినాకధృక్‌. 13

ఆ దైత్యుడు మిక్కిలి బలము కలవాడు. బ్రహ్మ వరము వలన పొగరెక్కినవాడు. స్వయముగా పినాకముతాల్చిన శివుడెత్తి వచ్చినను యుద్ధమున వధింపరానివాడు.

ఆదిత్యై ర్వసుభిః సాధ్యై రుద్రైశ్చ నిహతా భృశమ్‌,

అసురా యాతుధానాశ్చ సంఖ్యాపూరణ కేవలాః. 14

ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, రుద్రులు అనుదేవ జాతులవారు లెక్క పెట్టరాని సంఖ్యలో రాక్షసులను పరిమార్చిరి.

దేవానామపి సైన్యాని నిహతాన్యసురై ర్యుధి,

ఏవం భూతే తదా భ##గ్నే దేవేంద్రే విద్రుతాః సురాః. 15

దేవతల సైన్యములుకూడ రక్కసులచేత నాశనమయినవి. ఇట్లు దేవేంద్రుడు విరిగిపారగా దేవతలందరు చెల్లాచెదరయిరి.

అర్దితా వివిధైః శ##సై#్త్రః శూలపట్టిశముద్గరైః

గతవన్తో బ్రహ్మలోక మసురై రర్దితాః సురాః. 16

శూలములు, పట్టిసములు, ముద్గరములు మొదలగు పెక్కు విధములగు ఆయుధములతో నలుగగొట్టబడిన దేవతలందరు బ్రహ్మలోకమునకు అరిగిరి.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రినవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబది మూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters