Varahamahapuranam-1    Chapters   

ఏకోననవతితమోధ్యాయః - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము

ధరణ్యువాచ - ధరణి యిట్లు పలికెను.

పరమాత్మా శివః పుణ్య ఇతి కేచిద్‌ భవం విదుః,

అపరే హరి మీశాన మితి కేచి చ్చతుర్ముఖమ్‌. 1

ఏతేషాం కతమో దేవః పరః కో వాధవాపరః,

ఏతద్దేవ మమాచక్ష్వ పరం కౌతుహలం విభో. 2

విభూ! దేవా! పరమాత్ముడు పుణ్యమూర్తి శివుడని కొందరందురు. ఇతరులు హరిని చెప్పుదురు. మరికొందరు. మరికొందరు బ్రహ్మను పలుకుదురు. వీరిలో పరదైవమెవరు? దీనిని నాకు చెప్పుము. నాకు చాల కుతూహలముగా నున్నది.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లనెను.

పరో నారాయణో దేవ స్తస్మా జ్జాత శ్చతుర్ముఖః,

తస్మాద్‌ రుద్రోభవ ద్దేవి సచ సర్వజ్ఞతాం గతః. 3

నారాయణుడే పరమదైవము. ఆతనినుండి చతుర్ముఖుడు పుట్టెను. అతనివలన రుద్రుడు కలిగెను. అతడు సర్వజ్ఞత్వమును పొందెను.

తస్యాశ్చర్యా ణ్యనేకాని వివిధాని వరాననే,

శృణు సర్వాణి చిర్వజ్గి కథ్యమానం మయానఘే. 4

ఓ వరాననా! అనఘా! చారుగాత్రీ! ఆతని ఆశ్చర్యములు అనేకములు. నేను ఆఅన్నింటిని చెప్పెదను. వినుము.

కైలాసశిఖరే రమ్యే నానాధతువిచిత్రితే,

వసత్యమదినం దేవః శూలపాణి స్త్రిలోచనః. 5

అనేకవర్ణముల ధాతువులతో (కొండరాలతో) చిత్రమై అందమైన కైలాస శిఖరమున శూలపాణి, ముక్కంటి యగు దేవుడు నిత్యము నివాస ముండును.

సైకస్మిన్‌ దివసే దేవః సర్వభూతనమస్కృతః,

గణౖః పరివృతో గౌర్యా మహా నాసీత్‌ పినాకధృక్‌. 6

సర్వభూతములు మ్రొక్కులిడు ఆ దేవుడు ఒకనాడు భూతగణములు చుట్టుకొని యుండగా గౌరీదేవితో కూడి యుండెను.

తత్ర సింహముఖాః కేచిద్‌ గణా నర్దన్తి సంహవత్‌,

అపరే హస్తివక్త్రాశ్చ హయవక్త్రా స్తథాపరే. 7

అపరే శింశుమారాస్యా అపరే సూకరాననాః,

అపరేశ్వాముఖా రౌద్రా ఖరాస్యా జాననా స్తథా,

ఛాగమత్స్యాననాః క్రూరా హ్యనన్తాః శస్త్రపాణయః. 8

అందు కొందరు సింహ ముఖులు. సింహమువలె గర్జింతురు. మఱికొందరు ఏనుగుమోములవారు. ఇంకను కొందరు గుఱ్ఱము ముఖములవారు. వేరుకొందరు మొసలి మొగములవారు. ఇంకను ఇతరులు పందిముఖములవారు. అన్యులు ఆడుగుఱ్ఱముల మొగముతో భయంకరమైనవారు. అట్లే గాడిదమొగముల వారు. మేకమొగములవారు, పొటేలు మొగములవారు, చేపమొగములవారు క్రూరులు, శస్త్రపాణులు అనంతసంఖ్యలో ఉన్నారు.

కేచిద్‌ గాయన్తి నృత్యన్తి ధావన్తి స్ఫోటయన్తి చ,

హసన్తి కిలకిలాయన్తి గర్జన్తి చ మహాబలాః. 9

కొందరు పాడుచున్నారు. కొంద రాడుచున్నారు. కొందఱు పరువెత్తుచున్నారు. కొందరు పగులబడుచున్నారు. కొందరు నవ్వుచున్నారు. కిలకిలధ్వనులు చేయుచున్నారు. మహాబలము గలవారు గర్జించుచున్నారు.

కేచి ల్లోష్టాంస్తు సంగృహ్య యుయుధు ర్గణనాయకాః,

అపరే మల్లయుద్ధేన యుయుధు ర్బలదర్పితాః,

ఏవం గణసహస్రేణ వృతో దేవో మహేశ్వరః. 10

కొందరు గణనాయకులు రాలు పట్టుకొని పోరాడ జొచ్చిరి. మరికొందరు బలగర్వముతో మల్లయుద్ధములు చేయుచుండిరి. ఇట్టి ప్రమధగణములు వేలకొలదిగా కొలిచియుండగా మహాదేవుడు కొలువుండెను.

యావదాస్తే స్వయం దేవ్యా క్రీడన్‌ దేవవరః స్వయమ్‌,

తావద్‌ బ్రహ్మా స్వయం దేవై రుపాయాత్‌ సహ సత్వరః 11

ఈ విధముగా దేవదేవుడు తనకు తానై దేవితో క్రీడించు చుండగా త్వరతో బ్రహ్మ దేవతలతో కూడి అట కరుదెంచెను.

తమాగత మథో దృష్ట్వా పూజయిత్వా విధానతః,

ఉవాచ పరమో దేవో రుద్రో బ్రహ్మాణ మవ్యయమ్‌. 12

అట్లు వచ్చిన బ్రహ్మను గాంచి విధానము ననుసరించి రుద్రుడు పూజించి అవ్యయుడగునాతనితో ఇట్లు పలికెను.

కిమాగమనకృత్యం తే బ్రహ్మన్‌ బ్రూహి మమాచిరమ్‌,

కించ దేవా స్త్వరాయుక్తా ఆగతా మమ సన్నిధౌ. 13

బ్రహ్మా! నీవిచటకు వచ్చిన పనియేమి? త్వరగా చెప్పుము. మరియు దేవతలందరు తొందరతో నుండి నాకడకు వచ్చిరి. పనియేమి?

బ్రహ్మోవాచ - బ్రహ్మయిట్లు పలికెను.

అస్త్యంధకో మహాదైత్య స్తేన సర్వే దివౌకసః,

అర్దితా మత్సమీపంతు బుద్ధ్వా మాం శరణౖషిణః. 14

అంధకుడను మహారాక్షసుడు కలడు. దేవలోక వాసులందరు అతనిచేత బాధలనొంది నన్ను శరణుకోరిన వారై నాకడ కరుదెంచిరి.

తతశ్చైవ మయా సర్వే ప్రోక్తా దేవా భవం ప్రతి,

గచ్ఛాను ఇతి దేవేశ తత స్త్వేతే సమాగతాః. 15

నేనాదేవతలందరికి భవుడవగు నిన్ను గూర్చి తెలిపి అచటకు పోద మంటిని. అందువలన వీరందరు ఇచటకు వచ్చరి.

ఏవ ముక్త్వా స్వయం బ్రహ్మా వీక్షాంచక్రే పినాకినమ్‌,

నారాయణం చ మనసా సస్మార పరమేశ్వరమ్‌,

తతో నారాయణో దేవో ద్వాభ్యాం మధ్యే వ్యవస్థితః. 16

ఇట్లు పలికి బ్రహ్మ పినాకివైపు చూచుచుండెను. (పినాకము శివునివిల్లు - పినాకము కలవాడు పినాకి.) మరియు మనస్సున నారాయణ పరమేశ్వరుని స్మరించెను. అంత నారాయణుడు విచ్చేసి వారిరువురి నడుమ నిలుచుండెను.

తత స్త్వేకీగతా స్తేతు బ్రహ్మవిష్ణు మహేశ్వరాః,

పరస్పరం సూక్ష్మదృష్ట్యా వీక్షాం చక్రు ర్ముదా యుతాః. 17

అంత ఒక్కచోటనున్న ఆ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పరమానందముతో ఒకరినొకరు సూక్ష్మదృష్టితో చేచుకొనిరి.

తత స్తేషాం త్రిధా దృష్టి ర్భూత్వైకా సమజాయత,

తస్యాం దృష్ట్యాం సముత్పన్నా కుమారీ దవ్యరూపిణీ. 18

అపుడు ఆ మువ్వురి మూడు విధములగు దృష్టి ఒక్కటిగా రూపొందెను. ఆ దృష్టియందు ఒక దివ్యరూపముగల కుమారి ఉదయించెను.

నీలోత్పలదళశ్యామా నీలకుఞ్చిత మూర్దజా,

సునాసా సులలాటాన్తా సువక్త్రా సుప్రతిష్ఠితా. 19

నల్లనికలువల రేకులవంటి దేహకాంతియు, నల్లని నొక్కులు గల కేశములును, అందమైనముక్కు, చక్కని నెన్నుదురు, అందమైన మొగము కలిగి ఆ కుమారి చక్కగా నిలిచియుండెను.

త్వష్ట్రా యదగ్నిజిహ్వం తు లక్షణం పరిభాషితమ్‌,

తత్సర్వమేకతః సంస్థం కన్యాయాం సంప్రదృశ్యతే. 20

త్వష్ట అగ్నిజిహ్వకు ఏ లక్షణములను నిర్ధేశించెనో అది యంతయు ఒక్కచోట నిలిచిన తీరున ఆ కన్యాయాం సంప్రదృశ్యతే. 20

త్వష్ట అగ్నిజిహ్వకు ఏ లక్షణములను నిర్ధేశించెనో అది యంతయు ఒక్కచోట నిలిచిన తీరున ఆ కన్యయందు కానవచ్చెను.

అథ తాం దృశ్య కన్యాంతు బ్రహ్మవిష్ణు మహేశ్వరాః.

ఉచుః కాసి శుభే బ్రూహి కిం వా కార్యం విపశ్చితమ్‌. 21

అంత బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆ కన్యను చూచి కాంతా! నీవెవరు? నీవు భావించినపని యేమి? అని అడిగిరి.

త్రివర్ణా చ కుమారీ సా కృష్ణశుక్లా చ పీతికా,

ఉవాచ భవతాం దృష్టే ర్యోగా జ్జాతాస్మి సత్తమాః,

కిం మాం న వేత్థ సుశ్రోణీం స్వశక్తిం పరమేశ్వరీమ్‌. 22

నలుపు, తెలుపు, పసుపు అనుమూడు వన్నెలుగల ఆ కుమారి, ఉత్తములారా! మీ దృష్టి యోగమువలన నేను పుట్టితిని. నన్నెరుగరా? నేను మీ శక్తి స్వరూపిణిని. పరమేశ్వరిని. అని పలికెను.

తతో బ్రహ్మాదయ స్తేచ తస్యా స్తుష్టా పరం దదుః,

నామ్నాసి త్రికలా దేవీ పాహి విశ్వం చ సర్వదా. 23

అంత బ్రహ్మాదులు ఆనందమంది ఆమెకు వరము నొసగిరి. దేవీ! నీపేరు త్రికళ. ఎల్లవేళల ఈ విశ్వమును రక్షించుచుండుము.

అపరాణ్యపి నామాని భవిష్యన్తి తవానఘే,

గుణోత్థాని మహాభాగే సర్వసిద్ధికరాణి చ. 24

మరియు పుణ్యాత్మా! నీకు గుణములను బట్టి ఏర్పడునవి, అన్ని సిద్ధులు కలిగించునవియు నగు వేరు పేరులు కూడ కలుగును.

అన్యచ్చ కారణం దేవి త్రివర్ణాసి వరాననే,

మూర్తిత్రయం త్రిబిర్వర్ణైః కురు దేవి స్వకం ద్రుతమ్‌. 25

దేవీ! నీవు మూడు వన్నెలుకలదాన వగుటలో మరియొక కారణమును కలదు. మూడురంగులతో మూడుమూర్తలను నీవిగా చేసికొనుము.

ఏవ ముక్తా తదా దేవై రకరోత్‌ త్రివిధాం తనుమ్‌,

సితాం రక్తాం తథా కృష్ణాం త్రిమూర్తిత్వం జగామ హ. 26

వారిట్లు పలుకగా ఆమె తనదేహము తెల్లనిది, ఎర్రనిది. నల్లనిది అగునట్లు చేసికొని మూడు మూర్తుల స్థితిని పొందెను.

యా సా బ్రాహ్మీ శుభామూర్తి స్తయా సృజతి వై ప్రజాః,

సౌమ్యరూపేణ సుశ్రోణీ బ్రహ్మసృష్ట్యా విధానతః 27

బ్రహ్మసంబంధమైన శుభ##మైన మూర్తితో సౌమ్యరూపముతో ఆసుశ్రోణి బ్రహ్మసృష్టి పద్ధతినిబట్టి ప్రజలను సృజించును.

యాసా రక్తేన వర్ణేన సురూపా తనుమధ్యమా,

శజ్ఖ చక్రధరా దేవీ వైష్ణవీ సా కలా స్మృతా,

సా పాతి సకలం విశ్వం విష్ణుమాయేతి కీర్త్యతే, 28

ఎర్రని వన్నెతో ఏర్పడిన ఆ సూరూప శంఖచక్రములను తాల్చినదై విష్ణుసంబంధమైన కళగా ఏర్పడి 'విష్ణుమాయ' అని పిలువబడుచు ఈ సకల విశ్వమును సంరక్షించును.

యా సా కృష్ణేన వర్ణేన రౌద్రీ మూర్తి స్త్రి శూలినీ,

దంష్ట్రా కరాళినీ దేవీ సా సంహరతి వై జగత్‌. 29

నల్లని వన్నెతో రౌద్రరూపముతో త్రిశూలమును తాల్చి కోరలతో భయము గొలుపు ఆ దేవి జగమును సంహరించును.

యా సృష్టి ర్బ్రహ్మణో దేవీ శ్వేతవర్ణా విభావరీ,

సా కుమారీ మహాభాగా విపులాబ్జ దళేక్షణా,

సద్యో బ్రహ్మాణ మామస్త్ర్య తత్రై వాంతరధీయత. 30

బ్రహ్మసృష్టియై తెల్లని వన్నెతో విరాజిల్లు వికసించిన పద్మ దళములవంటి చూపులుగల ఆ పుణ్యస్వరూపయగు కుమారి వెంటనే బ్రహ్మకడ సెలవుకైకొని అంతర్ధానము పొందెను.

సాంతర్హితా య¸° దేవీ వరదా శ్వేత పర్వతమ్‌,

తప స్తప్తుం మహత్తీవ్రం సర్వగత్వ మభీప్సతీ. 31

వరదయగు ఆ దేవి విశ్వరూపము పొందగోరినదై త్రీవ్రమగు తపస్సు చేయుటకు శ్వేతపర్వతమున కరిగెను.

యావైష్ణవీ కుమారీ తు సాప్యనుజ్ఞాయ కేశవమ్‌,

మందరాద్రిం య¸° తప్తుం తపః పరమదుశ్చరమ్‌. 32

మహాదుష్కరమైన తపస్సు చేయుటకై వైష్ణవియగు, ఆ కుమారి హరిని వీడ్కొని మందరాద్రి కరిగెను.

యా సా కృష్ణా విశాలాక్షీ రౌద్రీ దంష్ట్రా కరాళినీ,

సా నీలపర్వతవరం తపశ్చర్తుం య¸° శుభా. 33

రుద్రసంబంధినియగు విశాలాక్షి, దంష్ట్రలతో భయము గొలుపు ఆ కృష్ణ నీలపర్వతమునకు తపస్సునకై అరిగెను.

అథ కాలేన మహతా ప్రజాః స్రష్టుం ప్రజాపతిః

ఆరబ్ధవాన్‌ తదా తస్య వవృధే సృజతో బలమ్‌. 34

అంత పెద్ద కాలము గడువగా బ్రహ్మ ప్రజలను సృజించుటకై మొదలిడి బలమును పెంపొందింపజూచుకొనెను.

యదా న వవృధే తస్య బ్రహ్మణో మానసీ ప్రజా,

తదా దధ్యౌ కిమేతన్మే న తథా వర్ధతే ప్రజా. 35

బ్రహ్మ తన మానసప్రజ పెంపొందకపోవుటకు గాంచి ఇదేమి ప్రజ వృద్ధిపొందదేమి? అని భావించెను.

తతో బ్రహ్మా హృదా దధ్యౌ యోగాభ్యాసేన సువ్రతే,

చిన్తయన్‌ బుబుధే దేవ స్తాం కన్యాం శ్వేతపర్వతే,

తపశ్చరన్తీం సుమహత్‌ తపసా దగ్ధకిల్చిషామ్‌. 36

అంతబ్రహ్మ యోగాభ్యాసముగల హృదయముతో ధ్యానించెను. శ్వేతపర్వతమున మహాఘెర తపమాచరించుచు పాపములను కాల్చి వేసికొనిన ఆకన్యను గూర్చి తెలిసికొనెను.

తతో బ్రహ్మా య¸° తత్ర యత్ర సా కమలేక్షణా,

తపశ్చరన్తీం తాం దృష్ట్వా వాక్య మేత దువాచ హ. 37

అంత బ్రహ్మ ఆ కమలేక్షణ తపస్సుచేయుచున్న తావున కరిగి ఆమెను గాంచి యిట్లు పలికెను.

బ్రహ్మో వాచ - బ్రహ్మ యిట్లు పలికెను.

కిం తపః క్రియతే భ##ద్రే కార్య మావేక్ష్య శోభ##నే,

తుష్టాస్మి తే విశాలాక్షి వరం కిం తే దదామ్యహమ్‌. 38

భద్రా! ఏపనిని తలపోసి నీవు తపస్సు చేయుచున్నావు? తుష్టి నందితిని. విశాలాక్షీ! నీకేమివరము కావలయునో ఇత్తును. కోరుకొనుము.

సృష్టి రువాచ - సృష్టి పలికెను.

భగవన్నేకదేశస్థా నోత్సహే స్థాతు మఞ్జసా,

అతోర్థం త్వాం వరం యాచే సర్వగత్వ మభీప్సతీ. 39

స్వామీ! నేను ఒక్కచోట నిలుచుటకు ఇష్టపడను. కావున నిన్నొకవరము కోరెదను. నేను ఎల్ల చోటుల నుండుదాన నగుటను కోరుచున్నాను.

ఏవ ముక్త స్తదా దేవ్యా సృష్ట్యా బ్రహ్మా ప్రజాపతిః,

ఉవాచ తాం తదా దేవీం సర్వగా త్వం భవిష్యసి. 40

సృష్టిదేవి యిట్లు పలుకగా ప్రజాపతియగు బ్రహ్మ ఆదేవితో నీవు సర్వగతపు అగుదువు అని పలికెను.

ఏవముక్తా తదా తేన సృష్టిః సా కమలేక్షణా,

తస్య హ్యంకే లయం ప్రాప్తా సా దేవీ పద్మలోచనా,

తస్మాదారభ్య కాలాత్‌ తు బ్రాహ్మీ సృష్టి ర్వ్యవర్ధత. 41

బ్రహ్మ యిట్లు పలుకగా ఆకమలేక్షణ సృష్టిదేవి ఆతని ఒడిలో లయమొందెను. అది మొదలుకొని బ్రహ్మసంబంధమగు సృష్టి వృద్ధి పొందెను.

బ్రహ్మణో మానసాః సప్త తేషా మన్యే తపోధనాః,

తేషా మన్యే తతస్త్వన్యే చతుర్ధా భూతసంగ్రహః,

సస్థాణుంగమానాం చ సృష్టిః సర్వత్ర సంస్థితా. 42

బ్రహ్మ మానసపుత్రులు, ఏడుగురు తపోధనులు, వారి తరువాత తక్కినవారు, తరువాత నాలుగు విధములైన భూతముల స్పష్టియు, స్థాపరజంగమాత్మకమైన దంతయు నేర్పడెను.

(మానసపుత్రులు : వీరినే నవబ్రహ్మలు - ప్రజాపతులు అందురు. 1. భృగువు 2. పులస్త్యుడు. 3. భరద్వాజుడు 4. అంగిరసుడు 5. అత్రి 6. క్రతువు 7. దక్షుడు 8. వసిష్ఠుడు 9. మరీచి.

ఏడుగురు తపోధనులు - సప్తర్షులు :- 1. కశ్యపుడు 2. అత్రి 3. భరద్వాజుడు 4. విశ్వామిత్రుడు 5. గౌతముడు 6. జమదగ్ని 7. వసిష్ఠుడు. నాలుగు విధములైన సృష్టులు :- 1. జరాయుజము 2. అండజము 3. స్వేదజము 4. ఉద్భిజ్జము).

యత్కిఞ్చిద్‌ వాజ్మయం లోకే జగత్థ్సావర జంగమమ్‌,

తత్సర్వం స్థాపితం సృష్ట్యా భూతం భవ్యం చ సర్వదా. 43

లోకమున వాగ్రూపము, స్థావరము, జంగమము అయిన సమస్తమైన సృష్టియు, భూతము, భవిష్యత్తు అయిన సర్వము ఈ విధముగా స్థాపితమైనది.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకోననవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబది తొమ్మిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters