Varahamahapuranam-1    Chapters   

షడశీతితమోధ్యాయః - ఎనుబది ఆరవ అధ్యాయము

అథ తృతీయం కుశద్వీపం శృణుత. కుశద్వీపేన

క్షీరోదః పరివృతః శాకద్వీపస్య విస్తారద్‌ ద్విగుణన.

తత్రాపి సప్త కులపర్వతాః సర్వే చ ద్వినామానః. తద్‌యథా

- కుముదవిద్రేమేతి సోచ్యతే. ఉన్నతో హేమపర్వతః

సైవ. బలాహకో ద్యుతిమాన్‌ సైవ. తథాద్రోణః

సైవపుష్పవాన్‌. కంకశ్చ పర్వతః సైవ కుశేశయః. తథా

షష్ఠో మహిషనామా స ఏవ హరి రిత్యుచ్యతే. తత్రాగ్ని

ర్వసతి. సప్తమస్తు కకుద్మాన్‌ నామ సైవ మందరః

కీర్త్యతే. ఇత్యేతే పర్వతాః కుశద్వీపే వ్యవస్థితాః. వ.1

ఇటుపై మూడవదగు కుశద్వీపమును గూర్చి వినుడు. కుశద్వీపమును చుట్టి పాలనీరు కలదు. ఇదిశాకద్వీపమునకు రెండింతలుగా ఉన్నది. అందును ఏడు కులపర్వతములు కలవు. అన్నింటికి రెండేసి పేర్లు. ఎట్లనగా కుముదము దానినే విద్రుమ మనియు నందురు. ఉన్నతము హేమపర్వతము. బలాహకమే ద్యుతిమంతము. ద్రోణమే పుష్పవంతము, కంకమే కుశేశయము. ఆరవదియగు మహిషమునే హరియనియు నందురు. అందు అగ్ని నివసించును. ఏడవది కకుద్మంతము. మందర మనియు దానికి పేరు. ఇవి కుశద్వీపమున గల కులపర్వతములు.

ఏతేషాం వర్షభేదో భవతి ద్వినామ సంఙ్ఞః. కుముదస్య

శ్వేత ముద్భిదం తదేవ కీర్త్యతే. ఉన్నతస్య లోహితం

వేణుమండలం తదేవ భవతి. వలాహకస్య జీమూతం

తదేవ రథాకార ఇతి. ద్రోణస్య హరితం తదేవ బలాధనం

భవతి. కంకస్యాపి కకుద్మాన్‌నామ. వృత్తిమత్‌ తదేవ

మానసం మహిషస్య ప్రభాకరమ్‌. కకుద్మతః కపిలం

తదేవ సంఖ్యాతం నామ. ఇత్యేతాని వర్షాణి. 2

వీనికి దేహములభేదము కూడ రెండేసి పేర్లతో ఏర్పడుచున్నది. కుముద పర్వతమునకు సంబంధించినది శ్వేతము. దానికే ఉద్భిదము అనియుపేరు. ఉన్నతమునకు చెందినది లోహితము. అదే వేణుమండలము. వలాహమునకు దేశము జీమూతము. దానినే రథాకారమనియు అందురు. ద్రోణపర్వతమునకు చెందిన హరిత దేశ##మే బలాధానమును అగును. కంకపర్వతదేశము కకుద్మంతము. అదియే వృత్తిమంతము. మహిషమునకు మానసము. అదియే ప్రభాకరము. కకుద్మంతమునకు కపిలము దేశము. దానిని సంఖ్యాత మనియు నందురు. ఇది దేశములు.

తత్ర ద్వినామ్న్యో నద్యః. ప్రతపా ప్రవేశాసైవోచ్యతే.

ద్వితీయా శివా యశోదా సాచ భవతి. తృతీయా పిత్రా

నామ సైవ కృష్ణా భణ్యతే. చతుర్థీ హ్రాదినీ సైవ చంద్రా

నిగద్యతే. విద్యుతా చ పఞ్చమీ సైవ ధృతిః. ఏతాః

ప్రధానాః. శేషా క్షుద్రనద్యః ఇత్యేష కుశద్వీపస్య సం

నివేశః. 3

అందు రెండుపేర్లుగల నదులున్నవి. ప్రతప మొదటిది అదియే ప్రవేశ. శివ రెండవది అదియే యశోద. పిత్ర మూడవది. అదియే కృష్ణ. హ్రాదిని నాల్గవది. అదియే చంద్ర. విద్యుత అయిదవది. అదియే శుక్ల. వర్ష ఆరవది. అదియే విభావరి. మహతి ఏడవది. అదియేధృతి. ఇవి ప్రధాననదులు. తక్కినవి చిన్ననదులు. ఇది కుశద్వీపము నిర్మాణము.

శాకద్వీపో ద్విగుణః సంనివిష్టశ్చ కథితః తస్య చ

మధ్యే మహాకుశస్తంబః. ఏష చ కుశద్వీపో దధిమండో

దేనావృతః క్షీరోదద్వి గుణన. 4

కుశద్వీపము వైశాల్యములో నిర్మాణములో శాకద్వీపమునకు రెట్టింపని చెప్పితిమి. దాని నడుమ పెద్దవిశాలమగు దర్భలతోటకలదు. ఈ కుశద్వీపముచుట్టును క్షీరసముద్రమునకు రెండింతలుగా ఉన్న పెరుగు సముద్రము కలదు.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే షడశీతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబది ఆరవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters