Varahamahapuranam-1    Chapters   

పఞ్చాశీతితమోధ్యాయః - ఎనుబది అయిదవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రుడిట్లు చెప్పెను.

ఇయం భూపద్మ వ్యవస్థా కథితా. ఇదానీం భారతం

నవభేదం శృణుత. తద్యథా. ఇంద్రః కేసరుః తామ్రవర్ణో

గభస్తిః నాగద్వీపః సౌమ్యః గంధర్వః వారుణః భారతం

చేతి. సాగరసంవృత మేకైకం యోజనసహస్ర ప్రమాణమ్‌.

తత్ర చ సప్త కులపర్వతా భవన్తి. వ.1

మహేన్ద్రో మలయః సహ్యః శుక్తిమాన్‌ ఋక్షపర్వతః,

వింధ్యశ్చ పారియాత్రశ్చ ఇత్యేతే కులపర్వతాః. 1

ఇట్లు భూపద్మము స్వరూపమును వివరించితిని. ఇప్పుడు తొమ్మిది భేదములు గల భారతవర్షమును గూర్చి వినుడు. అవి ఇంద్రము, కేసరువు, తామ్రవర్ణము, గభస్తి, నాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము, భారతము అనునవి. సముద్రము చుట్టిన ఇవి ఒక్కొక్కటి వేయి యోజనముల వైశాల్యము కలవి. అందు ఏడు కులపర్వతములు కలవు. అవి మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము అనునవి.

అన్యే చ మందరశారదర్దుర కోలాహల సురమైనాక

వైద్యుత వారంధమ పాండుర తుంగప్రస్థ కృష్ణగిరి

జయంత రై వత ఋష్యమూక గోమంత చిత్రకూట శ్రీ

చకోర కూటశైల కృతస్థల ఇత్యేతే క్షుద్ర పర్వతాః శేషాః

క్షుద్రతరాః. తేషా మార్యావ్లుెచ్ఛా జనపదా వసన్తి. పిబన్తి

చైతాసు నదీషు పానీయమ్‌. తద్యథా గంగా సింధు

సరస్వతీ శతద్రు వితస్తా విపాశా చంద్రభాగా సరయూ

యమునా ఇరావతీ దేవికా కుహూ గోమతీ ధృతపాపా

బాహుదా దృషద్వతీ కేశికీ నిస్వరా గండకీ చక్షుష్మతీ

లోహితా ఇత్యేతా హిమవత్పాద నిర్గతాః 2

ఇంకను మందరము, శారము, దర్దురము, కోలాహలము, సురము, మైనాకము, వైద్యుతము, వారంధమము, పాండురము, తుంగప్రస్థము, కృష్ణగిరి, జయంతము, రైవతము, ఋష్యమూకము, గోమంతము, చిత్రకూటము, శ్రీచకోరము, కూటశైలము, కృతస్థలము మొదలగు చిన్నకొండలు కలవు. మిగిలినవి గుట్టలు, వానికడ ఆర్యులు వ్లుెచ్ఛులు అను జానపదులు నివసింతురు. వారికి ఈ నదులజలములు పానీయములు. అవి - గంగ, సింధు, సరస్వతి, శతద్రు, వితస్త, విపాశ, చంద్రభాగ, సరయువు, యమున, ఇరావతి, దేవిక, కుహువు, గోమతి, ధృతపాప, బాహుద, దృషద్వతి, కౌశికి, నిస్వర, గండకి, చక్షుష్మతి, లోహిత అనునవి. ఇవి హిమవంతుని పాదములనుండి వెలువడినవి.

వేదస్మృతి ర్వేదవతీ సింధుపర్ణా సుచందనా

సదాచారారోహి పారా చర్మణ్యతీ విదిశా వేదత్రయీ

వపన్తీ ఇత్యేతా పారియాత్రోద్భవాః 3

వేదస్మృతి, వేదవతి, సింధుపర్ణ, సుచందన, సదాచార, రోహిపార, చర్మణ్వతి, విదిశ, వేదత్రయి, వపన్తి అనునవి పారియాత్ర పర్వతమునుండి పుట్టినవి.

శోణా జ్యోతీరథా నర్మదా సురసా మందాకినీ దశార్ణా

చిత్రకూటా తమసా పిప్పలా కరతోయా పిశాచికా

చిత్రోత్పలా విశాలా వంజులా బాలుకా వాహినీ శుక్తిమతీ

విరజా పంకినీ రిరీ కుహూ ఇత్యేతా ఋక్షప్రసూతాః 4

శోణ, జ్యోతీరథ, నర్మద, సురస, మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, కరతోయ, పిశాచిక, చిత్రోత్పల, విశాల, వంజుల, వాలుక, వాహిని, శుక్తిమతి, విరజ, పంకిని, రిరి, కుహువు అనునవి ఋక్షపర్వతమునుండి పుట్టినవి.

మణిజాలా శుభా తాపీ పయోష్ణీ శీఘ్రోదా వేష్ణా పాశా

వైతరణీ వేదీ పాలీ కుముద్వతీ తోయా దుర్గా అన్త్యా గిరా

ఏతే విన్ధ్యపాదోద్భవాః. 5

మణిజాల, శుభ, తాపి, పయోష్ణి, శీఘ్రోద, వేష్ణ, పాశ, వైతరణి, వేది, పాలి, కుముద్వతి, తోయ, దుర్గ అన్త్య, గిర- అనునవి వింధ్యపర్వతమునుండి వెలువడినవి.

గోదావరీ భీమరథీ కృష్ణావేణా వంజులా తుంగభద్రా సుప్రయోగా వాహ్యా కావేరీ ఇత్యేతాః సహ్యపాదోద్భవాః. 6

గోదావరి, భీమరథి, కృష్ణ, వేణ, వంజుల, తుంగభద్ర, సుప్రయోగ, వాహ్య, కావేరి అనునవి సహ్యపర్వతమునుండి పుట్టిన నదులు.

శతమాలా తామ్రపర్ణీ పుష్పావతీ ఉత్పలావతీ ఇత్యేతా

మలయజాః 7

శతమాల, తామ్రపర్ణి, పుష్పావతి, ఉత్పలావతి అనునవి మలయపర్వతమున పుట్టినవి.

త్రియామా ఋషికుల్యా ఇక్షులా త్రివిదా లాంగూలినీ

వంశవరా మహేన్ద్రతనయాః 8

త్రియామ, ఋషికుల్య, ఇక్షుల, త్రివిద, లాంగూలిని, వంశవర అనునవి మహేంద్రపర్వతము బిడ్డలు.

ఋషికా లూమతీ మందగామినీ పలాశినీ ఇత్యేతాః

శుక్తిమత్ప్రభవాః. 9

ఋషిక, లూమతి, మందగామిని, పలాశిని అనునివి శుక్తిమంతము నుండి పుట్టిననదులు.

ఏతాః ప్రాధాన్యేన కులపర్వతనద్యః. శేషాఃక్షుద్ర నద్యః.

ఏష జంబూద్వీపో యోజనలక్ష ప్రమాణతః 10

ఇవి ప్రధానముగా కులపర్వతములనుండి పుట్టిన నదులు. తక్కినవి చిన్నవాగులు. ఈ జంబూద్వీపము లక్ష యోజనముల కొలత కలది.

అతః పరం శాకద్వీపం నిబోధత. జంబూద్వీపస్య

విస్తారాద్‌ ద్విగుణపరిణాహా ల్లవణోదకశ్చ

జంబూద్వీపసమస్తేన ద్విగుణావృతః. తత్ర చ పుణ్యా

జనపదా శ్చిరాన్మ్రియన్తే దుర్భిక్షజరావ్యాధిరహితశ్చ

దేశో7యమ్‌. సపై#్తవ కులపర్వతా స్తావత్‌ తిష్ఠన్తి. తస్య

చోభయతో లవణ క్షీరోదధీ వ్యవస్థితౌ. 11

ఇటుపై శాకద్వీపమును గూర్చి తెలిసికొనుడు. జంబూద్వీపము వైశాల్యముకంటె రెట్టింపు వైశాల్యము కలది. ఉప్పునీరు జంబూద్వీపమునకు రెట్టింపు ప్రమాణమున కలదు. అందు పుణ్యముగల జానపదులు చాలకాలమునకు మరణింతురు. కరవు, ముదిమి, రోగములు లేని దేశమిది. ఏడే కులపర్వతములు ఉన్నవి. దానికి రెండువైపుల ఉప్పుసముద్రము, పాలసముద్రము కలవు.

తత్ర చ ప్రాగాయతః శైలేన్ద్ర ఉదయో నామ పర్వతః.

తస్యాపరేణ జలధారో నామ గిరిః సైవ చన్ద్రేతి కీర్తితిః.

తస్య చ జల మిన్ద్రోగృహీత్వా వర్షతి. తస్య పారే రైవతకో

నామ గిరిః. సైవ నారదో వర్ణ్యతే. తస్మింశ్చ నారదపర్వతా

దుత్పన్నో తస్య చాపరేణ శ్యామో నామ గిరిః. తస్మింశ్చ

ప్రజాః శ్యామత్వ మాపన్నాః సైవ దుందుభి ర్వర్ణ్యతే.

తస్మిన్‌ సిద్ధా ఇతి కీర్తితాః ప్రజా నైకవిధాః క్రీడన్తః.

తస్యాపరే రజతో నామ గిరిఃసైవ శాకోచ్యతే. తస్యాపరేణ

ఆంబికేయః సచ విభ్రాజసో భణ్యతే. సఏవ

కేసరీత్యుచ్యతే. తతశ్చ వాయుః ప్రవర్తతే. గిరినామా

న్యేవ వర్షాణి. 12

అందు తూర్పువైపుగా సాగిన పర్వతరాజము ఉదయము దాని కవతల జలధారమనుకొండకలదు. దానినే చంద్రమనియు అందురు. దానిజలము నింద్రుడు గ్రహించి వాన కురియును. దానిఒడ్డున రైవతకమను కొండ కలదు. దానినే నారదమనియు అందురు. ఆ నారదపర్వతమము నుండి పుట్టిన మరియొక కొండ శ్యామము. అందలి ప్రజలు శ్యామవర్ణమును పొందిరి. దానినే దుందుభి యనియు నందురు. అందు సిద్ధులనబడువారు పెక్కండ్రు క్రీడించుచుందురు. దానికి ప్రక్కగా రజతము అను కొండ కలదు. శాకమనియు దానికి మరియొకపేరు. దానికి అవతల 'ఆంబికేయము' అను పర్వతము కలదు. దానిని విభ్రాజసమనియు పిలుతురు. దానికే కేసరి అనియు పేరు. దానినుండి వాయువు బయలుదేరును. కొండలపేర్లే దేశములపేర్లు.

తద్యథా ఉదయసుమారో జలధార క్షేమక

మహాద్రుమేతి ప్రధానాని ద్వితీయపర్వతనామభి రపి

వక్తవ్యాని. తస్య చ మధ్యే శాకవృక్షస్తత్ర చ సప్తమహానద్యో

ద్వినామ్న్యః తద్యథా సుకుమారీ కుమారీ నందా వేణికా

ధేనుః ఇక్షుమతీ గభస్తి ఇత్యేతా నద్యః. 13

ఉదయము, సుకుమారము, జలధారము, క్షేమకము, మహద్రుమము అనునవి ప్రధానములు. పర్వతముల రెండవ పేర్లతో కూడ పిలువదగినవి. దానిమధ్య శాకవృక్షము కలదు. అందు ఏడు మహానదులు రెండేసి పేర్లతో ప్రసిద్ధికెక్కినవి. అవి సుకుమారి, కుమారి, నంద, వేణిక, ధేనువు, ఇక్షుమతి, గభస్తి అనునవి.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చాశీతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహపురాణము అను భగవచ్ఛాస్త్రమున ఎనుబదిఅయిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters