Varahamahapuranam-1    Chapters   

త్ర్యశీతితమోధ్యాయః - ఎనుబది మూడవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లు చెప్పెను.

నిసర్గ ఏష భద్రాశ్వానాం కీర్తితః కేతుమాలానాం

విస్తరేణ కథితమ్‌. నైషధస్యాచలేన్ద్రస్య పశ్చిమేన

కులాచలజనపదనద్యః కీర్త్యన్తే. తథాచ విశాఖ కంబల

జయంత కృష్ణ హరితాశోక వర్ధమానా ఇత్యేతేషాం

సప్తకులపర్వతానాం కోటిశః ప్రసూతిః. తన్నివాసినో

జనపదాస్తన్నామాన ఏవ ద్రష్టవ్యాః. వ.1

భద్రాశ్వములు, కేతుమాలములు అనువాని స్థితిని విస్తరముగా వర్ణించితిమి. నైషధమను పర్వతమునకు పడమరగా ఉన్న కులపర్వతములను, మమానదులను తెలియజెప్పుదుము. విశాఖము, కంబలము, జయంతము, కృష్ణము, హరితము, అశోకము, వర్ధమానము అనునవి ఆ ఏడుకులపర్వతములపేర్లు. వానినుండి కోట్లకొలది నదులు పుట్టినవి. వాని ఒడ్డున నివసించు జనపదములకు అవియే పేర్లుగా చూచుకొనవలయును.

తద్యథా సౌరగ్రామాత్తసాంతపః కృతసురాశ్రవణ

కంబల మాహేయాచలకూట వాసమూలతపక్రౌంచ

కృష్ణాంగ మణి పంకజ చూడమల సోమియా

సముద్రాంతక కుర కుఞ్చసువర్ణః తట కకుహ శ్వేతాంగ

కృష్ణ పాట విదకపిలకర్ణిక మహిష కుబ్జకరనాట

మహోత్కట శుకనాస గజభూమక కురంజనమనాహ

కింకిస పార్ణభౌమక చోరక ధూమజన్మ

అంగారజతీవనజీవలౌకిల వాచాం సమాంగ మధురేయ

శుకేచకేయ శ్రవణమత్తకాసిక గోదావామకుల పంజావర్జ

హ మోదశ అలక ఏతే జనపదా స్తత్పర్వతోత్థా నదీః

పిబన్తి. వ.2

సౌరగ్రామము, అత్తసాంతపము, కృతసుర, శ్రవణము, కంబలము, మాహేయము, అచలకూటము, వాసమూలము, తపక్రౌంచము, కృష్ణాంగము, మణిపంకజము, కృష్ణపాటవిదము, కపిలము, కర్ణికము, మహిషము, కుబ్జము, కరనాటము, మహోత్కటము, శుకనాసము, గజభూమము, కకురంజనము, మనాహకిము, కిసపౌర్ణము, భౌమకము, చోరకము, ధూమజన్మము, అంగారము, జతీవనము, జీవలౌకిలము, వాచాంసహము, అంగ మధురేయము, శుకేచకేయము, శ్రవణమత్తము, కాసికము, గోదావామము, శుకేచకేయము, శ్రవణమత్తము, కాసికము, గోదావామము, కులపంజ, వర్జహము, మోదము, అలకము - అను ఈ జనపదములు పర్వతములనుండి పుట్టిన నదులజలములను త్రావును.

తద్యథాప్లక్షా మహాకదమ్బా మానసీ శ్యామాసుమేధా బహులా

వివర్ణా పుఙ్ఖామాలా దర్భవతీ భద్రానదీ శుకనదీ పల్లవా భీమా

ప్రభఞ్జనా కామ్బాకుశావతీ దక్షా కాసవతీ తుంగా పుణ్యోదా

చంద్రావతీ సుములావతీ కకుద్మినీ విశాలా కరంటకా పీవరీ

మహామాయా మహిషీ మానుషీ చణ్డా ఏతానదీః ప్రధానాః,

శేషాః క్షుద్రనద్యః సహస్రశ##శ్చేతి. వ.3

ప్లక్ష, మహాకదంబ, మానసి, శ్యామ, సుమేధ, బహుల, విర్ణ, పుంఖ, మాల, దర్భవతి, భద్రానది, శుకనది, పల్లవ, భీమ, ప్రభంజన, కాంబ, కుశావతి, దక్ష, కాసవతి, తుంగ, పుణ్యోద, చంద్రావతి, సుమూలావతి, కకుద్మిని, విశాల, కరంటక, పీవరి, మహామాయ, మహిషి, మానుషి, చండ - ఇవి ప్రధాననదులు, తక్కిన చిన్న నదులు వేలకొలదిగా గలవు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్ర్యశీతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబది మూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters