Varahamahapuranam-1    Chapters   

ఏకాశీతి తమోధ్యాయః - ఎనుబది యొకటవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రుడిట్లు చెప్పెను.

అతః పరం పర్వతేషు దేవానా మవకాశా వర్ణ్యన్తే, తత్రయో7సౌ శాంతాఖ్యః పర్వతస్యోపరి మహేన్ద్రస్య క్రీడాస్థానమ్‌. తత్ర దేవరాజస్య పారిజాతకవృక్షవనమ్‌. తస్య పూర్వపార్శ్వే కుంజరో నామ గిరిఃతస్యోపరి దానవానా మష్టౌ పురాణి చ. వ.1

ఇటుపై పర్వతములందలి దేవతల స్థానములను వివరింతును. అందు 'శాంతము' అనుపేరు గల దేవేంద్రుని క్రీడాస్థలము కలదు. అదిమహేంద్రగిరి పై భాగమున నున్నది. అందు దేవతల రాజు ఇంద్రుని పారిజాతక వృక్షములతోట కలదు. దాని తూర్పు భాగమున కుంజరమను కొండయు, దానిపై దానవుల ఎనిమిదిపురములను కలవు.

తేచ నామ్నా నీలకాః కామరూపిణః మహానీలో7పి శైలేంద్రపురాణి. పంచదశ సహస్రాణి కిన్నరాణాం ఖ్యాతాని. పంచదశకిన్నరాణాం గర్వితాః. తాని సౌవర్ణాని బిలప్రవేశనాని చ పురాణి. తత్ర దేవదత్త చంద్రాదయో రాజానః. వ.2

నీలకములు, కామరూపులు మొదలగునవి వాని పేర్లు. మహానీలమనియు - ఇవి పర్వతములపైనున్న పురములు. కిన్నరుల పురములు పదునైదువేలు ప్రసిద్ధి కెక్కినవి. దేవదత్తుడు, చంద్రుడు మొదలగు వారు కిన్నరులరాజులు. పదునైదుగురు గర్వితులు. కలుగులు ప్రవేశముగా గలవారి పురములు స్వర్ణమయములు.

చంద్రోదయే చ పర్వతవరే నాగానా మధివాసః తేచ బిలప్రవేశాః బిలేషు వైనతేయ విషయావర్తినో వ్యవస్థితానురాగే చ దానవేంద్రా వ్యవస్థితాః. వ.3

చంద్రోదయమను గొప్ప పర్వతము నాగులకు నివాసభూమి. రంధ్రములలో ప్రవేశించు ఆ నాగులు ఆరంధ్రములలో గరుత్మంతునకు దొరకక తిరుగుచుందురు. అనురాగమను పర్వతమున రాక్షసేంద్రులు నివసింతురు.

వేణుమత్యపి విద్యాధర పురత్రయమ్‌. త్రింశద్యోజన శతవిస్తీర్ణ మేకైకం తావదాయతనమ్‌. ఉలూక రోమశ మహావేత్రాదయశ్చ రాజానో విద్యాధరాణామ్‌. ఏకైకే చ శైలరాజని స్వయమేవ గరుడో వ్యవస్థితః. వ.4

వేణుమంతమను పర్వతమున విద్వయాధరుల మూడు పురములు కలవు. ఒక్కొక్కటి ముప్పది ఆమడల వైశాల్యము కలిగినది. ఉలూకుడు, రోమశుడు, మహావేత్రుడు మొదలగువారు విద్యాధరుల రాజులు. ఒక్కొక్క పర్వత రాజమున స్వయముగా గరుడుడు నివసించియుండును.

కుంజరే తు పర్వతవరే నిత్యం పశుపతిః స్థితః,

వృషభాంకో మహాదేవః శంకరో యోగినాం వరః. వ.5

కుంజరమను ప్రసిద్ధిగల కొండపై పశుపతి, వృషభము గుర్తుగా గలవాడు, మహాదేవుడు, యోగులలో శ్రేష్ఠుడు అగు శంకరుడు నిత్యము నివసించును.

అనేక గణభూతకోటిసహస్ర వారో భగవాన్‌ అనాదిపురుషో వ్యవస్థితః. వ.6

పెక్కు గణములుగా గల భూతలముల సముదాయములు వేలకొలదిగా సేవించెడు భగవానుడు అనాదిపురుషుడు శంకరుడందు కాపురముండును.

వసుధారే చ పుష్పవతాం వసూనాం చ సమావాసః

వసుధార రత్నధారయో ర్మూర్ధ్ని అష్టౌ సప్తచ సంఖ్యయా

పురాణి వసుసప్తర్షీణాం చేతి. వ.7

వసుధారము పుష్పవంతులగు వసువుల నెలవు. వసుధార రత్నధార పర్వతముల శిఖరముపై ఎనిమిది, ఏడు సంఖ్యలు గల పురములు అష్టవసువులకు, సప్తర్షులకు సంబంధించినవి కలవు.

ఏక శృంగేచ పర్వతోత్తమే ప్రజాపతేః స్థానం

చతుర్వక్త్రస్య బ్రహ్మణః. గజపర్వతే చ మహాభూత

పరివృతా స్వయమేవ భగవతీ తిష్ఠతి. వసుధారే చ

పర్వతవరే మునిసిద్ధవిద్యాధరాణా మాయతనమ్‌.

చతురాశీత్యపర పుర్యో మహాప్రాకారతోరణాః. తత్ర

చానేకపర్వతా నామ గంధర్వా యుద్ధశాలినో వసన్తి.

తేషాం చాధిపతి ర్దేవో రాజరాజైక పిఙ్గలః. వ.8

ఏకశృంగమను పర్వతమున భగవంతుడగు చతుర్ముఖుని స్థానము కలదు. గజపర్వతమున మహాభూతములు కొలిచియుండగా భగవతియే స్వయముగా నెలకొనియున్నది. వసుధారము అను పర్వతము మునులు, సిద్ధులు, విద్యాధరులు అను వారి నెలవు. గొప్పప్రాకారములు తోరణములు గల ఎనుబదినాలుగుపురములు అందుగలవు. అచట అనేకపర్వతులను గంధర్వులు యుద్ధములు చేయుటలో ఆరితేరినవారు నివసింతురు. వారి అధిపతి రాజరాజగు ఏకపింగళుడు. (కుబేరుడు)

సురరాక్షసాః పఞ్చకూటే దానవాః శతశృఙ్గే యక్షాణాం

పురశతమ్‌. తామ్రాభే తక్షకస్య పురశతమ్‌. విశాఖపర్వతే

గుహస్యాయతనమ్‌. శ్వేతోదయే గిరివరే గరుడపుత్రస్య

సునాభస్యావాసః. పిశాచకే గిరివరే మహాగంధర్వభవనమ్‌. వ.9

పంచకూటమున సురలయు, రాక్షసులయు, శతశృంగమున దానవులయు, యక్షులయు నూరేసి పురములు కలవు. తామ్రాభమున తక్షకుని నూరుపురములు, విశాఖపర్వతమున గుహుని నివాసము కలవు. శ్వేతోదయమను గిరవరమందు గరుడుని పుత్రుడగు సునాభుని నివాసము, పిశాచకమనుగిరివరమున మహాగంధర్వుల భవనము కలవు.

హరికూటే హరిర్దేవః. కుముదే కిన్నరావాసః. అంజనే

మహోరగాః. కృష్ణే గంధర్వనగరమ్‌. విద్యాధర పురాణి

చ సప్త శోభితాని. సహస్రశిఖరే చ దైత్యానా ముగ్ర

కర్మిణా మావాసః. వ.10

హరికూటమున హరి దైవము. కుముదమున కిన్నరులనెలవు, అంజనమున మహాసర్పములు, కృష్ణమున గంధర్వనగరము, విద్యాధరుల పురములు ఏడు అలరారుచున్నవి. సహస్రశిఖరమున భయంకరచేష్టలుగల దైత్యుల నివాసములు కలవు.

పురాణాం సహస్రమేకం హేమమాలినాం ముకుటే,

పన్నగోత్తమాః వివస్వతస్తు సోమస్య వాయోర్నాగాధి

పస్య చ ప్రపక్షే పర్వతవరే చత్వార్యాయతనానితు.

ఏవం మేరుపర్వతేషు దేవానా మధివాసః. వ.11

హేమమాలిపర్వతములయందు ఒకవేయి పురములు కలవు. అందు శిఖరమున పాములరాజు లుందురు. ప్రపక్షమను పర్వతవరమున వివస్వంతుడు, సోముడు, వాయువు, నాగరాజు అనువారి భవనములు నాలుగు కలవు. ఈ విధముగా మేరు పర్వతముల యందు దేవతలనివాసములున్నవి.

మర్యాదాపర్వతే దేవకూటే పురవిన్యాసః కీర్త్యతే. తస్యోపరి

యోనశతం గరుడస్య జాతం క్షేత్రమ్‌. తసై#్యవ పార్మ్వత

స్త్రింశద్యోజనవిస్తీర్ణాశ్చత్వారింశ దాయతాః సప్తగంధర్వనగరాః.

ఆగ్నేయాశ్చ నామ్నా గంధర్వాతిబలినః. వ.12

మర్యాదాపర్వతమున దేవకూటమున పురముల స్థితిని తెలుపుచున్నాను. దానిపై నూరుయోజనముల మేర గరుడుని స్థానమేర్పడి యున్నది. దాని ప్రక్కభాగముననే ముప్పది ఆమడల వెడల్పు, నలుబది ఆమడల పొడవు గల ఏడు గంధర్వనగరములు కలవు. అచటి గంధర్వులు ఆగ్నేయులనువారు. గొప్పబలము కలవారు.

తత్ర చాన్యత్‌ త్రింశద్యోజనమండలం పురం సైంహికే

యానామ్‌. తత్ర చ దేవర్షిచరితాని దేవకూటే దృశ్యన్తే.

పురం చ కాలకేయానాం తత్రైవ. తసై#్యవ దక్షిణ

త్రింశద్యోజనవిస్తృతం ద్విషష్టి యోజనాయామం పురం

కామరూపిణాం దృప్తానామ్‌. మధ్యమే చ తస్య హేమకూటే

మహాదేవస్య న్యగ్రోధః. వ.13

అందు మరియొకపురము సైంహికేయులది ముప్పది యోజనముల మండలము కలదు. అందు దేవర్షులు దేవకూటమున తిరిగెడు తావులు కానవచ్చును. కాలకేయుల పురము కూడ అందే కలదు. దానికి దక్షిణమున ముప్పది యోజనముల వెడల్పు అరువదిరెండు యోజనముల పొడవు గల మహాగర్వముగల కామరూపుల పురము కలదు. హేమకూటము నడుమ మహాదేవుని రావి చెట్టు కలదు.

అధాతః కైలాసవర్ణకో భవతి. కైలాసస్య తటే

యోజనశత మాయామ విస్తృతం భువనమాలాభివ్యాప్తమ్‌.

తస్యాశ్చ మధ్యే సభా. తత్ర చ తత్పుష్కరం నామ

విమానం తిష్ఠతి. ధనదస్య చ తద్విమాన మధివాసశ్చ.

తత్ర పద్మ మహాపద్మ మకర కచ్ఛపకుముదశంఖ

నీలనంద మహానిధయః ప్రతివసన్తి. తత్ర చంద్రాదీనాం

లోకపాలానా మావాసః. తత్ర చ మందాకినీ నామ నదీ.

తథా కనకమందా మందా చేతి నామభిః సరితః.

తత్రాన్యా అపి నద్యః సన్తి. వ.14

ఇటుపై కైలాసవర్ణనము. కైలాసము ఒడ్డున నూరామడల పొడవు వెడల్పులు గల భువనపంక్తి వ్యాపించి యున్నది. దానినడుమ సభ. అందే పుష్కరమను విమానము కలదు. అదే కుబేరునిది. అదియే అతని నివాస స్థలము. అందు పద్మము, మహాపద్మము, మకరము, కచ్ఛపము, కుముదము, శంఖము, నీలము, నందము అనుమహానిధులు కలవు. అందు చంద్రుడు మొదలగు లోకపాలుర నివాసములును ఉన్నవి. అందే మందాకిని, కనకమంద, మంద అనునదులు, మరియు ఇతరనదులు కలవు.

పూర్వ పార్శ్వే చ శతయోజనాయామ స్త్రింశద్యోజన

విస్తృతా దశగంధర్వపుర్యః తాసుచ సుబాహు హరికేశ

చిత్రసేనాదయో రాజానఃతసై#్యవ చ పశ్చిమకూటే అశీతి

యోజనాయామం చత్వారింశ ద్విస్తృత మేకైకం

యక్షనగరమ్‌. తేషుచ మహామాలి సునేత్ర చక్రాదయో

నాయకాః. వ.15

తూర్పు పార్శ్వమున నూరామడల పొడవు, ముప్పది ఆమడల వెడల్పుగల పది గంధర్వనగరులు కలవు. అందు సుబాహువు, హరికేశుడు, చిత్రసేనుడు మొదలగువారు రాజులు. దాని పడమటి శిఖరమున ఒక్కొక్కటి ఎనుబది యోజనముల పొడవు, నలువది యోజనముల వెడల్పు గల యక్ష నగరములు కలవు. అందు మహామాలి, సునేత్రుడు, చక్రుడు మొదలగు వారు నాయకులు.

తసై#్యవ దక్షిణ పార్శ్వే కుంజదరీషు గుహాసు సముద్రాః.

సముద్రం యావత్‌ కిన్నరాణాం పురశతమ్‌. తేషు చ

ద్రుమసుగ్రీవాది భగదత్త ప్రముఖం రాజశతమ్‌. తత్ర

చ రుద్ర స్యోమయా సార్థం వివాహ స్సంవృత్తః. తపశ్చ

కృతవతీ గౌరీ. కిరాతరూపిణా చ రుద్రేణ స్థితమ్‌.

తత్రైవ తత్ర స్థితేన సోమేన శంకరేణ జంబూద్వీపావ

లోకనం కృతమ్‌. తత్ర చానేకకిన్నర గంధర్వోపగీత

ముమావనం నామాప్సరోభి రనేక పుష్పలతావల్లరీభి

రుపేతమ్‌. యత్ర భగవతా మహేశ్వరేణార్ధనారీనరవపుః

ప్రాప్తమ్‌. వ.16

దాని దక్షిణ పార్శ్వమున పొదలుగల చరియలుగల గుహల యందు సముద్రములు కలవు. సముద్రములనగా కిన్నరుల నూరు ఇండ్లు. వానియందు ద్రుమ, సుగ్రీవ, భగదత్త ప్రముఖులగు రాజులు నూరుగురు కలరు. అందే రుద్రునకు ఉమాదేవితో వివాహము జరిగినది. గౌరియు అందే తపస్సు చేసినది. అందుండియే శంకరుడు ఉమాదేవితో పాటు జంబూద్వీపమును చూచెను. అందు పెక్కండ్రు కిన్నరులు, గంధర్వులు గానములుచేయు ఉమావనము కలదు. అందు పెద్ద సంఖ్యలో అప్సరసలు, పూలతీవెలు కలవు. అందే భగవంతుడగు రుద్రుడు అర్ధనారీనర రూపమును పొందెను.

తత్ర చ కార్తికేయస్య శరద్వనమ్‌. పుష్పచిత్ర

క్రౌంచయో ర్మద్యే కార్తికేయాభిషేకః కృతః. తస్య చ

పూర్వతటే సిద్ధమునిగణావాసః కలాపగ్రామో నామ.

తథా చ మార్కండేయవసిష్ఠ పరాశర నలవిశ్వా మిత్రోద్దాల

కాదీనాం మహర్షీణా మనేకాని సహస్రాణ్యాశ్రమాణాం

హి భవతి. వ.17

అందు మరియు కార్తికేయుని (కుమారస్వామి) శరద్వనము కలదు. పుష్పచిత్రము, క్రౌంచము అనువాని మధ్య కార్తికేయుని అభిషేకము జరిగెను. దాని తూర్పు ఒడ్డున సిద్ధులయు, మునిగణములయు నివాసమగు కలాపమను గ్రామము కలదు. అట్లే మార్కండేయుడు, వసిష్ఠుడు, పరాశరుడు, నలుడు, విశ్వామిత్రుడు, ఉద్దాలకుడు మొదలగు మహర్షుల వేల ఆశ్రమములు కలవు.

తథా చ పశ్చిమస్యాచలేన్ద్రస్య నిషధస్య భాగం శృణుత.

తస్య చ మధ్యమ కూటే విష్ణ్వాయతనం మహాదేవస్య.

తసై#్యవోత్తరతటే త్రింశద్యోజన విస్తృతం మహత్పురం

లంబాఖ్యాతం రాక్షసానామ్‌. తసై#్యవ దక్షిణ పార్శ్వే

బిలప్రవేశ నగరమ్‌. వ.18

మరియు, పడమటి దిక్కుననున్న నిషధపర్వతభాగమును గూర్చి వినుడు. దాని మధ్య శిఖరమున మహాదేవుని విష్ణ్వాలయము కలదు. దాని ఉత్తరపు ఒడ్డున ముప్పది ఆమడల వైశాల్యము కల 'లంబ' అను పేరుగల రాక్షస పురము కలదు. దాని దక్షిణపార్శ్వమున బిలప్రవేశనగరము ఉన్నది.

ప్రభేదకస్య పశ్చిమేన దేవదానవ సిద్ధాదీనాం పురాణి.

తస్య గిరే ర్మూర్ధ్ని మహతీ సోమశిలా తిష్ఠతి. తస్యాం చ

పర్వణి సోమః స్వయ మేవావతరతి. తసై#్య వోత్తరపార్శ్వే

త్రికూటం నామ. తత్ర బ్రహ్మా తిష్ఠతి క్వచిత్‌. తథాచ

వహ్న్యాయతనమ్‌. మూర్తిమాన్‌ వహ్ని రుపాస్యతే దేవైః.

ప్రభేదకమను కొండకు పడమరగా దేవదానవ సిద్ధాదుల పురములు కలవు. ఆ గిరికొమ్మున పెద్ద సోమశిల కలదు. దాని యందు పర్వమున (పూర్ణిమదినము) చంద్రుడు స్వయముగా అవతరించును. దాని ఉత్తర పార్శ్వమున త్రికూటమను పర్వతము కలదు. అందు అప్పుడప్పుడు బ్రహ్మ ఉండును. మరియు అది అగ్నిదేవుని ఆలయము. రూపుగొన్న అగ్నిదేవుని అచట దేవతలు ఉపాసింతురు.

ఉత్తరేచ శృంగాఖ్యే పర్వతవరే దేవతానా మాయతనాని.

పూర్వే నారాయణ స్యాయతనమ్‌. మధ్యే బ్రహ్మణః,

శంకరస్య పశ్చిమే. తత్ర చ యక్షాదీనాం కేచిత్‌ పురాణి.

తత్ర చోత్తరతీరే జాతుభే మహాపర్వతే త్రింశద్యోజన

మండలం నందజలం నామ సరః. తత్ర నందో నామ

నాగరాజా వసతి శతశీర్ష ప్రచండ ఇతి. వ.20

శృంగము అను ఉత్తర దిక్కునందలి పర్వతమున దేవతల భవనములు కలవు. తూర్పున నారాయణుని ఆలయము. మధ్య బ్రహ్మదేవునిది. పడమటి దిక్కున శంకరునిది మరియు అందు యక్షాదుల పురములు కొన్ని కలవు. దాని ఉత్తరపు తీరముననున్న జాతుభమను పర్వతమున ముప్పది ఆమడల మండలముల నందజలమను సరస్సు కలదు. అందు నందుడను నాగరాజు నూరుతలలవాడు, ప్రచండుడు ఉండును.

ఇత్యే తే7ష్టౌ దేవపర్వతా విజ్ఞేయాః. తేనానుక్రమేణ

హేమ రజత రత్న వైడూర్యమనఃశిలా హింగులాది

వర్ణాః. ఇయం చ పృథ్వీ లక్షకోటి శతానేక సంఖ్యాతానాం

పూర్ణా. తేషు చ సిద్ధ విద్యా ధరాణాం నిలయాః. తే

చ మేరోః పార్శ్వతః కేసరవలయాలవాలం సిద్ధలోకేతి

కీర్త్యతే. వ.21

ఈ విధముగా ఈ ఎనిమిది దేవ పర్వతములు తెలియదగినవి. వరుసగా బంగారము, వెండి, రత్నము, వైడూర్యము, మణిశిల, హింగుళము మొదలగు వర్ణములు వానికి కలవు. (హింగుళము - ఇంగిలీకము). ఈ భూమి నూరు లక్షల కోట్ల జనముతో నిండినది. వానియందు సిద్ధులు, విద్యాధరులు మొదలగువారి నివాసములు కలవు. మేరువు ప్రక్కగా నున్న కేసర వలయముల పాదువంటి ఆ నిలయముల నన్నింటిని కలిపి సిద్ధలోకమని చెప్పుదురు.

ఇయం పృథ్వీ పద్మాకారేణ వ్యవస్థితా, ఏషచ

సర్వపురాణషు క్రమః సామాన్యతః ప్రతిపాద్యతే. వ.22

ఈ భూమి పద్మము ఆకారముతో నెలకొని యున్నది. ఇది అన్ని పురాణముల యందును సాధారణముగా చెప్పబడు విషయము.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ఏకాశీతితమో7ధ్యాయః.

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబది యొకటవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters