Varahamahapuranam-1    Chapters   

అశీతితమోధ్యాయః - ఎనుబదియవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

అథదక్షిణ దిగ్వ్యవస్థితాః పర్వత ద్రోణ్యః సిద్ధాచరితాః కీర్త్యన్తే. శిశిర పతఙ్గయో ర్మధ్యే శుక్లభూమి స్త్రియా ముక్తలతాగలితపాదకమ్‌.

ఇటుపై దక్షిణ దిక్కున నెలకొన్న పర్వతముల మైదానములను గూర్చి చెప్పెదను. శిశిరపతంగములనడుమ తెల్లనిభూమికలదు. అందు తీగలు చెట్లు కానరావు.

ఇక్షుక్షేపే చ శిఖరే పాదపై రుపశోభితమ్‌,

ఉదుంబరవనం రమ్యం పక్షి సంఘనిషేవితమ్‌. 1

ఇక్షుక్షేపమను శిఖరమున చక్కనిచెట్లతో ఒప్పారునదియు, పక్షులమూకలు నివసించునదియునగు అందమైన ఉదుంబర వనము కలదు. (ఉదుంబరము = మేడిచెట్టు)

ఫలితం తద్వనం భాతి మహాకూర్మోపమైః ఫలైః,

తద్వనం దేవయోన్యో7ష్టౌ సేవన్తే సర్వదైవ హి. 2

పెద్దతాబేళ్ల వంటిపండ్లతో ఆ వనమంతయు విరుగబూచి నట్లుండును. దేవయోనులు ఎనిమిదిజాతుల వారు ఎల్లవేళల ఆ వనము నాశ్రయించియుందురు.

తత్ర ప్రసన్నస్వాదు సలిలా బహూదకా నద్యోవహన్తి.

తత్రా శ్రయో భగవతః కర్దమస్య ప్రజాపతేః. నానాముని

జనాకీర్ణ స్తచ్చ శతయోజన మేకం పరిమండలం వనం చ. వ.1

అచట ప్రసన్నములు రుచికలవి అగుజలములుగల నదులు ఎక్కవ నీరుకలవియై ప్రవహించుచుండును. అచట పూజ్యుడగు కర్దమ ప్రజాపతి ఆశ్రమము కలదు. పెక్కండ్రు మునిజనులతో నిండిన ఆ ఆశ్రమము నూరుయోజనములవైశాల్యము కలది. మరియు అచట మండలాకారముగల వనమొకటి కలదు.

తథాచ తామ్రాభస్య శైలస్య పతంగస్య చాన్తరే

యోజనవిస్తీర్ణం ద్విగుణాయతం బాలార్కసదృశ రాజీవ

పుండరీకైః సమంతతః సహస్రపత్రై రవిరలై రలంకృతం

మహత్‌ సరో7నేకసిద్ధ గంధర్వా ధ్యుషితమ్‌. తస్య చ

మధ్యే మహాశిఖరః శతయోజనాయామ స్త్రింశ

ద్యోజనవిస్తీర్ణో7నేకధాతు రత్నభూషిత స్తస్య చోపరి

మహతీ రథ్యా రత్న ప్రకారతోరణా. వ.2

అట్లే తామ్రాభము పతంగము అను పర్వతముల నడుమ నూరుయోజనముల వెడల్పు, దానికి రెట్టింపు పొడవు కలదియు, బాలసూర్యుని వంటివి, అన్నివైపుల దట్టముగానున్నవి యగు నూరు రేకుల పద్మములతో ఒప్పారెడు గొప్పసరస్సు కలదు. దానిదగ్గర పెక్కండ్రు సిద్ధులు గంధర్వులు నివసించుచుందురు. దానినడుమ ఒక మహాశిఖరము నూరుయోజనముల పొడవు, ముప్పది యోజనముల విస్తీర్ణము కలది కలదు. దానిపై రత్నమయములగు తోరణములు గల పెద్దబాట ఉన్నది.

తస్యాం మహద్‌ విద్యాధరపురమ్‌. తత్రపులోమనామా

విద్యాధరరాజః శతసహస్రపరీవారః. వ.3

దానియందు విద్యాధరపురము పెద్దదికలదు. అందు పులోముడను విద్యాధరరాజు నూరువేల పరివారముతో నుండును.

తథా చ విశాఖాచలేంద్రస్య శ్వేతస్య చాన్తరే సరః

తస్య చ పూర్వతీరే మహదామ్రవనం కనకసంకాశైః ఫలై

రతిసుగన్ధిభిః మహాకుంభమాత్రైః సర్వతశ్చితమ్‌. దేవ

గంధర్వాదయశ్చ తత్ర నివసన్తి. వ.4

అట్లే విశాఖ, శ్వేతము అనుకొండలనడుమ ఒక సరస్సుకలదు. దాని తూర్పుఒడ్డున పెద్దమామిడి తోట కలదు. బంగారువన్నెయు, మంచివాసనయు, పెద్దకుండలంతటి ప్రమాణమును గల పండ్లతో అది నిండి యుండును. దేవతలు, గంధర్వులు మొదలగువారు అందు నివసింతురు.

సుమూలస్యాచలేన్ద్రస్య వసుధారస్య చాన్తరే త్రింశ

ద్యోజన విస్తీర్ణే పంచాశద్యోజనాయతే. బిల్వస్థలీనామ.

తత్రఫలాని విద్రుమసంకాశాని తైశ్చ పతద్భిః స్థలమృత్తికా

క్లిన్నా. తాంచ స్థలీం సుగుహ్యకాదయః సేవన్తే

బిల్వఫలాశినః. వ.5

సుమూలము, వసుధారము అనుకొండలనడుమ ప్రదేశము ముప్పది యోజనముల వెడల్పు, ఏబదియోజనముల పొడవు కలది. అందు బిల్వస్థలి యను వనముకలదు. దాని ఫలము పవడముల వన్నెతో నుండును. అవి రాలిపడుచుండగా అచటి మట్టి అంతయు తడితడిగా అగుచుండును. ఆ తావునందు ఆ మారేడు పండ్లనుతిను సుగుహ్యకాదులు నివసింతురు.

తథా చ వసుధార రత్నధారయో రన్తరే త్రింశ

ద్యోజనవిస్తీర్ణం శతయోజన మాయతం

సుగంధికింశుకవనం సదాకుసుమం యస్య గన్ధేన వాస్యతే

యోజన శతమ్‌. తత్ర సిద్ధా ధ్యుషితం జలోపేతం చ.

తత్ర చాదిత్యస్య దేవస్య మహదాయతనమ్‌. స

మాసేమాసే చ భగవా నవతరతి సూర్యః ప్రజాపతిః.

కాలజనకం దేవాదయో నమస్యన్తి. వ.6

వసుధారరత్నధార గిరులనడుమ ముప్పది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవు గల సువాసనతోనిండిన కింశుకవనము కలదు. (కింశుకము=మోదుగుచెట్టు.) అది ఎల్లవేళల పూచుచుండును. దానిసువాసన నూరుయోజనములవరకు వ్యాపించును. అందు సిద్ధులు నివసింతురు. మంచినీ రందుండును. నెలనెలకు సూర్యప్రజాపతి అక్కడ దిగుచుండును. కాలమునకు జనకుడగు ఆతనిని దేవతలు మొదలగువారు నమస్కరించు చుందురు.

తథాచ పంచకూటస్య కైలాసస్య చాన్తరే సహస్రయోజ

నాయామం విస్తీర్ణం శతయోజనం హంసపాండురం క్షుద్రసత్వై

రనా ధృష్యం స్వర్గసోపాన మివ భూమండలమ్‌. వ.7

పంచకూటము కైలాసము అనుకొండలనడుమ వేయి యోజనముల పొడవు నూరుయోజనముల వెడల్పుగలదియు, హంసలతో తెల్లనైనదియు, నీచమృగములు చొరరానిదియు స్వర్గమునకు మెట్టువంటిదియునగు భూమండలము కలదు.

అథ పశ్చిమదిగ్భాగే వ్యవస్థితా గిరిద్రోణ్యః కీర్త్యన్తే. 8

ఇక పడమటి దిక్కునందలి పర్వతప్రాంతములను చెప్పెదను.

సుపార్శ్వ శిఖిశైలయో ర్మధ్యే సమన్తాద్‌ యోజన

శతమేకం భౌమశిలాతలం నిత్యతప్తం

దుఃస్పర్శమ్‌. తస్యమధ్యే త్రింశద్యోజన విస్తీర్ణం మండలం

వహ్నిస్థానమ్‌. సచ సర్వకాల మనింధనో భగవాన్‌ లోక

క్షయకారీ సంవర్తకో జ్వలతే. వ.9

సుపార్శ్వము, శిఖి అనుకొండలనడుమ నూరుయోజనముల పాషాణమయము, ఎల్లప్పుడు కాలుచుండునట్టిది, తాకరానిది అగు భూభాగము కలదు. దాని నడుమ ముప్పదియోజనముల వైశాల్యము గల మండలముకలదు. అది అగ్ని స్థానము. అచట నన్నింటిని క్షయముచేయు సంవర్తకుడను అగ్నిదేవుడు మండుచుండును.

అన్తరే చ శైలవరయోః కుముదాంజనయోః శత

యోజనవిస్తీర్ణామాతులుంగస్థలీ సర్వసత్వానా మగమ్యా.

పీతవర్ణైః ఫలై రావృతా సతీ సా స్థలీ శోభ##తే. తత్ర చ

పుణ్యో హ్రదః సిద్ధై రుపేతః. బృహస్పతే స్త ద్వనమ్‌. 10

కుముదము, అంజనము అను దొడ్డ పర్వతముల నడుమ నూరు యోజనముల విస్తీర్ణము గల మాతులుంగ వనము కలదు. (మాతులుంగము = మాదీఫలము) ఎల్లజంతువులకును అది చొరశక్యము కానిది. పసుపు పచ్చని పండ్లతో నిండి ఆ తావు విరాజిల్లుచుండును. అందుసిద్ధులకు నెలవగు పుణ్యమగు సరస్సు కలదు. ఆ వనము బృహస్పతిది.

తథా చశైలయోః పింజరగౌరయో రన్తరేణ సరోద్రోణీ

హ్యనేకశత యోజనాయతా మహద్భిశ్చ షట్పదోద్ఘుష్టైః

కుముదై రుపశోభితా. తత్ర చ భగవతో విష్ణోః

పరమేశ్వరస్యాయతనమ్‌. వ.11

మరియు పింజరగౌరగిరులమధ్య ఒకజలప్రదేశము కలదు. పెక్కువందల ఆమడల పొడవైనది. పెద్దపెద్ద తుమ్మెదలు రొదచేసెడు కలువలతో ఒప్పారుచుండును. అది పరమేశ్వరుడగు విష్ణువు స్థానము.

తథా చ శుక్లపాండురయో రపి మహాగిర్యోరన్తరే

త్రింశద్యోజన విస్తీర్ణో నవత్యాయత ఏకః శిలోద్దేశో వృక్ష

వివర్జితః. తత్ర నిష్పఙ్కా దీర్ఘికా సవృక్షా చ స్థలపద్మినీ

అనేక జాతీయైశ్చ పద్మైః శోభితా. తస్యాశ్చ మధ్యే

పఞ్చయోజనప్రమాణో మహాన్యగ్రోధవృక్షః. తస్మిం

శ్చంద్రశేఖరోమాపతి ర్నీలవాసాశ్చ దేవో నివసతి

యక్షాదిభి రీడ్యమానః. వ.12

అట్లే శుక్లము పాండురము అను పెద్దకొండల మధ్య ముప్పదియోజముల వెడల్పు, తొంబది యోజనముల పొడవు కల ఒక రాతిప్రదేశము చెట్లు లేనిది కలదు. అందొక చోట బురదలేని దిగుడుబావి, కొన్ని చెట్లు కలది యున్నది. దానిసమీపమున పెక్కుజాతులకు సంబంధించిన మెట్టతామరల తీగ పద్మములతో అలరారుచుండును. దానినడుమ అయిదు యోజనముల వైశాల్యము గల పెద్దరావి చెట్టు కలదు. అందు ఉమాపతి, నీలవర్ణపు వస్త్రము తాల్చిన వాడు అగుచంద్రశేఖరుడు యక్షాదులు స్తుతించుచుండగా నివసించును.

సహస్రశిఖరస్య గిరేః కుముదస్య చాన్తరే పఞ్చాశ

ద్యోజనాయామం వింశద్యోజనవిస్తృత మిక్షుక్షేపోచ్చ శిఖర

మనేకపక్షిసేవీతమ్‌. అనేక వృక్షఫలై ర్మధురస్రవై రుపశోభి

తమ్‌. తత్ర చేన్ద్రస్య మహానాశ్రయో దివ్యాభిప్రాయ నిర్మితః. వ. 13

సహస్రశిఖరము, కుముదము అనుకొండలనడుమ ఏబది ఆమడల పొడవు, ఇరువది ఆమడల వెడల్పు గల ఇక్షుక్షేపమను ఎత్తైనశిఖరము కలదు. పెక్కువిధములైన పక్షులందుండును. పెక్కు తీరులచెట్లఫలములు తీయని రసములను జాలువార్చుచుండును. అచట ఇంద్రుని ఆశ్రమము దివ్యభావములతో కూడినది కలదు.

తథా శంఖకూటఋషభయో ర్మధ్యే పురుషస్థలీ

రమ్యానేక గుణానేక యోజనాయతా బిల్వప్రమాణౖః

కంకోలకైః సుగన్ధిభి రుపేతా. తత్ర పురుషకర సోన్మత్తా

నాగాద్యాః ప్రతివసన్తి. వ.14

మరియు, శంఖకూటము, ఋషభము అనుగిరులమధ్య 'పురుషస్థలి' అనుతావుకలదు. గొప్పగుణములు అనేకయోజనములు విస్తారము కలది. మారేడు పండ్లంతటి కంకోలకఫలములు మంచి వాసనకలవి అందుండును. పున్నాగపుష్పముల రసముతో ఉన్మత్తములగు మహాసర్పములందుండును.

తథా కపిఞ్జలనాగశైలయో రన్తరే ద్విశతయోజన మాయామ విస్తీర్ణా శతయోజనస్థలీ నానావనవిభూషితా ద్రాక్షఖర్జూర ఖండై రుపేతా అనేక వృక్షవల్లీభి రనేకైశ్చ సరోభి రుపేతా సా స్థలీ. వ.15

అట్లే కపింజలము నాగము అనుకొండలనడుమ, రెండు వందల యోజముల పొడవు వెడల్పులుగల 'శతయోజనస్థలి' కలదు. అందు పెక్కుతోటలు, ద్రాక్ష, ఖర్జూరములతో అలరారియున్నవి. పెక్కుచెట్లు, తీగలు, సరస్సులు ఆతావుననున్నవి.

తథా చ పుష్కరమహామేఘయో రన్తరే షష్టి యోజన

విస్తీర్ణా శతాయామా పాణితలప్రఖ్యా మహతీ స్థలీ

వృక్షవీరుధవివర్జితా. తస్యాశ్చ పార్శ్వే చత్వారి మహావనాని

సరాంసి చానేక యోజనానామ్‌. దశ పఞ్చసప్త తథాష్టౌ

త్రింశద్‌ వింశతి యోజనానామ్‌ స్థల్యోద్రోణ్యశ్చ. తత్ర

కాశ్చిన్మహాఘోరాః పర్వతకుక్షయః. వ.16

అట్లే పుష్కరము, మహామేఘము అను పర్వతములనడుమ అరువది ఆమడల వెడల్పు, నూరామడల పొడవుగల 'పాణితల' మను పెద్ద మైదానము కలదు. అందు చెట్లు చేమలు ఉండవు. దానిప్రక్క నాలుగు పెద్దవనములు, పెక్కుయోజనముల విస్తృతిగల సరస్సులు కలవు. పది, అయిదు, ఎనిమిది, ముప్పది, ఇరువది యోజనముల ప్రమాణము కల భూములు, మైదానములు కలవు. అందుకొన్ని మహా ఘోరములగు గుహలును ఉన్నవి.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అశీతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబదియవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters