Varahamahapuranam-1    Chapters   

ఏకోనాశీతి తమోధ్యాయః - డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రుడు పలికెను.

సీతాంతస్యాచలేంద్రస్య కుముదస్యాంతరేణ చ,

ద్రోణ్యాం విహంగపుష్టాయాం నానాసత్వనిషేవితమ్‌. 1

త్రియోజన శతాయామం శతయోజనవిస్తృతమ్‌,

సురసామల పానీయం రమ్యం తత్ర సురోచనమ్‌. 2

సీతాంతము, కుముదము అనుకొండలనడుమ నున్న విశాలమైన భూమియందు అనేకపక్షులు, పెక్కుమృగములు ఆశ్రయించినది, మూడువందలయోజనముల పొడవు, నూరుయోజనముల వెడల్పు కలది, చక్కని స్వచ్ఛమైన రుచికరమగు నీరుగల అందమైన సరస్సు ఒకటి కలదు.

ద్రోణమాత్ర ప్రమాణౖశ్చ పుండరీకైః సుగన్ధిభిః,

సహస్రశతపత్రైశ్చ మహాపద్మై రలంకృతమ్‌. 3

పెద్దకుండలంతటివి సువాసనలను విరజిమ్మునవి, వేయి రేకులుకలవి అగు తెల్లని మహాపద్మములు దాని నలంకరించినవి.

దేవదానవగంధర్వై ర్మహాసర్పై రధిష్ఠితమ్‌,

పుణ్యం తచ్ఛ్రీసరో నామ సప్రకాశ మిహేహచ. 4

దేవతలు, దానవులు, గంధర్వులు, మహాసర్పములు అందు నెలకొనియున్నవి. పుణ్యమైన ఆ సరస్సు పేరు శ్రీ సరస్సు. మంచి కాంతితో అలరారును

ప్రసన్నసలిలైః పూర్ణం శరణ్యం సర్వదేహినామ్‌,

తత్ర త్వేకం మహాపద్మం మధ్యే పద్మవనస్య చ. 5

కోటిపత్రప్రకలితం తరుణాదిత్య వర్చసమ్‌,

నిత్యం వ్యాకోశమధురం చలత్వా దతిమండలమ్‌. 6

చారుకేసరజాలాఢ్యం మత్తభ్రమరనాదితమ్‌,

తస్మిన్‌ మధ్యే భగవతీ సాక్షాచ్ఛ్రీర్నిత్యమేవ హి,

లక్ష్మీస్తుతం తదావాసం మూర్తిమంతం న సంశయః. 7

ప్రసన్నములగు జలములతో నిండినది, ప్రాణులన్నింటికి ఆశ్రయమొసగునది అగు ఆ సరస్సు నడిమి భాగమున పద్మముల తోటలో ఒకపెద్దపద్మము కలదు. దానికి కోటిరేకులు కలవు. ఉదయించుసూర్యునివంటి దీప్తి కలదు. ప్రతిదినము వికసించుట చేత మధురమైనది. కదలుచుండుటచేత పెద్దమండలము కలిగి యుండెను. అందమైన కేసరములు గుత్తులతో, మదించిన తుమ్మెదల నాదములతో ఒప్పారుచుండును.

దానినడుమ భగవతి లక్ష్మి నిత్యనివాసమొనరించును. ఆ నివాసమున సాక్షాత్తు రూపము ధరించి లక్ష్మి కన్పట్టును. సంశయము లేదు.

సరస స్తస్య తీరే తు తస్మిన్‌ సిద్ధనిషేవితమ్‌,

సదాపుష్పఫలం రమ్యం తత్ర బిల్వవనం మహత్‌. 8

ఆ సరస్సు ఒడ్డున సిద్ధులు నివసించెడునది, ఎల్లప్పుడు పూవులతో పండ్లతో సమృద్ధిగా ఉండునది, అందమైనది అగు మారేడు వనమొకటి కలదు.

శత యోజన విస్తీర్ణం ద్వియోజన శతాయతమ్‌,

అర్ధక్రోశాచ్చ శిఖరై ర్మహావృక్షైః సమంతతః,

శాఖాసహస్రకలితై ర్మహాస్కంధైః సమాకులమ్‌. 9

నూరుయోజనముల వెడల్పు, రెండునూర్ల యోజనముల పొడవు కలిగి, అర్ధక్రోశము వరకు వ్యాపించిన చివరలుగలవి, వేలకొలది కొమ్మలుకలవి, గొప్పకాండములు కలవి అగు మహావృక్షములతో నిండి యున్నది.

ఫలైః సహస్ర సంకాశైః హరితైః పాండురై స్తథా,

అమృతస్వాదుసదృశై ర్భేరీమాత్రైః సుగన్ధిభిః. 10

పెద్ద భేరులంతటి వేలకొలది, పచ్చని, తెల్లని అమృతమువలె రుచికరమైన, మంచివాసనగల పండ్లతో ఒప్పారును.

శీర్యద్భిశ్చ పతద్భిశ్చ కీర్ణభూమివనాంతరమ్‌,

నామ్నా తచ్ఛ్రీవనం నామ సర్వలోకేషు విశ్రుతమ్‌. 11

పండి పగిలి, రాలిపడుచున్నపండ్లతో ఆ భూమియంతయు వ్యాపించియున్నది. దానిపేరు శ్రీవనము. అన్నిలోకములలో ప్రసిద్ధి కెక్కినది.

దేవాదిభిః సమాకీర్ణ మష్టాభిః కకుభిః శుభమ్‌,

బిల్వాశిభిశ్చ మునిభిః సేవితం పుణ్యకారిభిః,

తత్ర శ్రీః సంస్థితా నిత్యం సిద్ధసంఘనిషేవితా. 12

ఎనిమిది దిక్కులందును దేవతలతో, బిల్వఫలములను మాత్రమే భుజించు పుణ్యవంతులగుమునులతో నిండియున్నది. అచట సిద్ధసంఘములు కొలుచుచున్న శ్రీదేవత సర్వకాలములలో నివాసము చేయును.

ఏకైకస్యాచలేంద్రస్య మణిశైలస్య చాన్తరమ్‌,

శతయోజనవిస్తీర్ణం ద్వియోజన శతాయతమ్‌. 13

విమలం పంకజవనం సిద్ధచారణసేవితమ్‌,

పుష్పం లక్ష్మ్యా ధృతం భాతి నిత్యం ప్రజ్వలతీవ హ. 14

ఒక్కొక్క కొండకుకొండకు నడిమి ప్రదేశము నూరు యోజనముల వెడల్పు, రెండునూర్లయోజనముల పొడవు కలిగి యుండెను. అందు విమలమైన పద్మవనము పొడవు కలిగి యుండెను. అందు విమలమైన పద్మవనము కలదు. దానిని సిద్ధులు, చారణులు సేవించియుందురు. లక్ష్మీదేవి తాల్చిన పుష్పమువలె ఎల్లప్పుడు వెలిగిపోవుచు ప్రకాశించును.

అర్ధక్రోశం చ శిఖరై ర్మహాస్కంధైః సమావృతమ్‌,

ప్రఫుల్లశాఖా శిఖరం పిఞ్జరం భాతి తద్వనమ్‌. 15

అర్ధక్రోశము ఎత్తుగల చివరిభాగములతో పెద్దపెద్దకాండములతో బాగుగా పుష్పించిన కొమ్మల చివరలతో ఆ వనము లేత ఎరుపు వన్నెతో అలరారును.

ద్విబాహు పరిణాహై సై#్తహస్తాయతవిస్తృతైః,

మనఃశిలాచూర్ణ నిభైః పాణ్డుకేసరశాలిభిః. 16

పుషై#్ప ర్మనోహరై ర్వ్యాప్తం వ్యాకోశై ర్గంధశోభిభిః,

విరాజతి వనం సర్వం మత్తభ్రమరనాదితమ్‌. 17

రెండుబారల చుట్టుకొలతయు మూడుబారల విస్తృతియు, మణిశిలచూర్ణము వంటిరంగుతో, తెల్లనికేసరములతో, నిత్యము వికసించుచు, సువాసనలతో అలరారు పూవులతో ఆ వనము మదించిన తుమ్మెదలనాదముతో ప్రకాశించుచుండును.

తద్వనం దానవై ర్దైత్యై ర్గంధర్వై ర్యక్షరాక్షసైః,

కిన్నరై రప్సరోభిశ్చ మహాభోగైశ్చ సేవితమ్‌. 18

దానవులు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, సర్పములు దానిని ఆశ్రయించియుండును.

తత్రాశ్రమో భగవతః కశ్యపస్య ప్రజాపతేః,

సిద్ధసాధుగణాకీర్ణం నానాశ్రమసమాకులమ్‌. 19

అందు భగవంతుడగు కశ్యపప్రజాపతి ఆశ్రమము కలదు. సిద్ధులు, సాధుగుణములు కలవారు అందు కొల్లలుగా నుందురు. అనేక ఆశ్రమములతో అది నిండియుండును.

మహానీలస్య మధ్యేతు కుంభస్య చ గిరే స్తథా,

మధ్యే సుఖా నదీనామ తస్యాస్తీరే మహద్వనమ్‌. 20

మహానీలము కుంభము అనుకొండలమధ్య 'సుఖ' అనునది కలదు. దానిఒడ్డున పెద్ద వనమున్నది.

పఞ్చాశద్యోజనాయామం త్రింశద్యోజనమండలమ్‌,

రమ్యం తాలవనం శ్రీమత్‌ క్రోశార్ధోచ్ఛ్రిత పాదపమ్‌. 21

ఏబదియోజనముల పొడవు, ముప్పది యోజనముల మండలము కలిగిన ఆతాలవనము అందమైనది. శోభ నిండినది. అర్ధక్రోశము ఎత్తుపెరిగిన చెట్లు కలది.

మహాబలైర్మహాసారైః స్థిరై రవిచలైః శుభైః,

మహ దఞ్జనసంస్థానైః పరివృత్తై ర్మహా ఫలైః. 22

మృష్టగన్ధ గుణోపేతై రుపేతం సిద్ధసేవితమ్‌,

ఐరావతస్య కరిణ స్తత్రైవ సముదాహృతమ్‌. 23

గొప్పబలము, గొప్పసారము, గట్టితనము, గలపండ్లు అందు కాటుకకొండలవలెనుండును. గుండ్రనితనముతో నలరారెడు మహాఫలములతో ఆ వనము ఒప్పారుచుండును. ఇంపైనపరిమళము ప్రకాశించును. సిద్ధులుసేవించు ఆ ప్రదేశము ఐరావతగజమునకు స్థానమైనదిగా చెప్పుచుందురు.

ఐరావతస్య రుద్రస్య దేవశైలస్య చాన్తరే,

సహస్రయోజనాయామా శతయోజన విస్తృతా. 24

సర్వా హ్యేకశిలా భూమి ర్వృక్షవీరుధ వర్జితా,

ఆప్లుతా పాదమాత్రేణ సలిలేన సమన్తతః. 25

ఐరావతము, రుద్రము అను దేవపర్వతముల నడుమ వేయి యోజనములపొడవు, నూరుయోజనముల వెడల్పు గల ఒకరాతిభూమి చెట్టుచేమలు లేనిది కలదు. కాలిలోతు నీరులో అన్నివైపుల మునిగి యుండును.

ఇత్యేతాభ్యంతరద్రోణ్యో నానాకారాః ప్రకీర్తితాః,

మేరోః పార్శ్వేన విప్రేన్ద్రా యథావదనుపూర్వశః. 26

విప్రవర్యులారా! మేరుపార్శ్వమున అనేక ఆకారములుగల మైదానములను గూర్చి మీకు వివరించి చెప్పితిని.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకోనాశీతి తమో7ధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters