Varahamahapuranam-1    Chapters   

షట్సప్తతితమోధ్యాయః - డెబ్బది ఆరవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లు చెప్పెను.

తసై#్యవ మేరోః పూర్వే తు దేశే పరమవర్చసే,

చక్రపాట పరిక్షిప్తే నానాధాతువిరాజితే. 1

తత్ర సర్వామరపురం చక్రపాట సముద్ధృతామ్‌,

దుర్ధర్షం బలదృప్తానాం దేవదానవ రక్షసామ్‌,

తత్ర జాంబూనదమయః సుప్రాకారః సుతోరణః. 2

ఆ మేరువునకు తూర్పున మిక్కిలి దీప్తి కలదియు, చక్రపాటమున వ్యాపించి యున్నదియు, పెక్కు ధాతువులతో విరాజిల్లునదియు నగు దేశమున చక్రపాటము నుండి వెలువడిన దేవతల రాజధానీ పురము కలదు. అది మిక్కిలి బలగర్వితులైన దేవదానవ రాక్షసులకును లోగొనరానిది. అందు బంగారు ప్రాకారము, తోరణము కలవు.

తస్యా ప్యుత్తరపూర్వే తు దేశే పరమవర్చసే,

అలోకజనసంపూర్ణా విమానశతసంకులా. 3

మహావాపీ సమాయుక్తా నిత్యం ప్రముదితా శుభా,

శోభితా పుష్ప శబలైః పతాకాధ్వజమాలినీ. 4

దేవై ర్యక్షోప్సరోభిశ్చ ఋషిభిశ్చ సుశోభితా,

పురందరపురీ రమ్యా సమృద్ధా త్వమరావతీ. 5

దానికి ఈశానీ దిక్కున గొప్ప కళాకాంతులతో అలరారు దేశమున అమరావతీపురి కలదు. అది దివ్యజనులతో నిండి యుండును. వందల కొలది విమానములు, గొప్ప బావులు, నిండారు సంతోషము గల జనులు, చిత్రచిత్రములగు రంగులు గల పూవులు, పతాకముల, ధ్వజముల వరుసలు మొదలగునవి సమృద్ధిగా గలవు, దేవతలతో, యక్షులతో, అప్సరసలతో, ఋషులతో శోభిల్లి యుండును. అట్టి పురందరుని పురి రమణీయము, సంపదలతో అలరారునదియు నై యుండును.

తస్యా మధ్యే 7మరావత్యా వజ్రవైడూర్య వేదికా,

త్రైలోక్యగుణవిఖ్యాతా సుధర్మా నామ వై సభా. 6

ఆ అమరావతి మధ్యభాగమున వజ్రవైడూర్యముల వేదికలు కలదియు, మూడు లోకములందలి సుగుణములచే కీర్తినందినదియు నగు సుధర్మ యను సభ కలదు.

తత్రాస్తే శ్రీపతేః శ్రీమాన్‌ సహస్రాక్షః శచీపతిః,

సిద్ధాదిభిః పరివృతః సర్వాభి ర్దేవయోనిభిః. 7

అందు లక్ష్మీపతి సంపదల వంటి సంపదలు కలవాడు, వేయి కన్నులవాడు, శచీపతి అగు దేవేంద్రుడు, అన్ని విధములవారగు దేవయోనులగు సిద్ధాదులతో పరివృతుడై ఉండును.

తత్ర చైవ సువంశఃస్యాద్‌ భాస్కరస్య మహాత్మనః,

సాక్షాత్‌ తత్ర సురాధ్యక్షః సర్వదేవ నమస్కృతః. 8

మరియు అందు మహాత్ముడగు భాస్కరుని నగరము సువంశమనునది కలదు. అందు సురల కధ్యక్షుడు, సర్వదేవతల మ్రొక్కులందు కొనువాడునగు సూర్యభగవానుడు ఉండును.

తస్యాశ్చ దిక్షు విస్తీర్ణా తత్తద్గుణ సమన్వితా,

తేజోవతీ నామ పురీ హుతాశస్య మహాత్మనః. 9

ఆ అమరావతికి దగ్గరనే అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్నదియు, గొప్ప గుణములతో కూడినదియు నగు తేజోవతియను నగరి మహాత్ముడగు అగ్నిదేవునికి సంబంధించినది కలదు.

తత్తద్గుణవతీ రమ్యా పురీ వైవస్వతస్య చ,

నామ్నా సంయమనీ నామ పురీత్రైలోక్య విశ్రుతా. 10

అట్లే (దానికి ప్రక్క) ఆయా మంచి గుణములతో విలసిల్లు యమునిపురి కలదు. దాని పేరు సంయమని. మూడు లోకములలో ప్రసిద్ధి కెక్కినది.

తథా చతుర్థే దిగ్భాగే నైరృతాధిపతేః శుభా,

నామ్నా కృష్ణావతీ నామ విరూపాక్షస్య ధీమతః. 11

అట్లే నాలుగవ దిక్కు అగు నైరృతి యందు బుద్ధిశాలియగు విరూపాక్షుడను నిరృతి దిగ్భాగాధిపతి నగరము మిక్కిలి శోభ కలది కలదు. దాని పేరు కృష్ణావతి.

పఞ్చమే హ్యుత్తరపుటే నామ్నా శుద్ధవతీ పురీ,

ఉదకాధిపతేః ఖ్యాతా వరుణస్య మహాత్మనః. 12

నైరృతికి ఉత్తరముగా అయిదవది యగు పడమటి దిక్కునదందు మహాత్ముడు జలాధిపతియగు వరుణుని నగరము శుద్ధవతి యనునది కలదు.

తథా పఞ్చోత్తరే దేవస్వస్యోత్తరపుటే పురీ,

వాయో ర్గంధవతీనామ ఖ్యాతా సర్వగుణోత్తరా. 13

అయిదవ దిక్కునకు ఉత్తరముగా వాయుదేవుని పురి సర్వగుణముల చేత మేలైనది, గంధవతి యను ప్రసిద్ధి కెక్కినది కలదు.

తస్యోత్తరపుటే రమ్యా గుహ్యకాధిపతేః పురీ,

నామ్నా మహోదయానామ శుభా వైదూర్య వేదికా. 14

దానికి ఉత్తరముగా గుహ్యకుల అధిపతి అగు కుబేరుని పురి, వైదూర్యముల అరుగులు కలది, మహోదయ అను పేరు కలది కలదు.

తథాష్టమే 7న్తరపురే ఈశానస్య మహాత్మనః,

పురీ మనోహరా నామ భూతై ర్నానావిధై ర్యుతా,

పుషై#్ప ర్ధన్యైశ్చ వివిధై ర్వనై రాశ్రమ సంస్థిత్తై. 15

అట్లే ఎనిమిదవ దిక్కున మహాత్ముడగు ఈశానుని పురి మనోహర అనునది కలదు. అందు పెక్కు విధముల భూతములు, మనోహరములగు పూవులతో ఇంపైన తోటలు గల ఆశ్రమములు గలవు.

ప్రార్థ్యతే దేవలోకో7యం స స్వర్గ ఇతి కీర్తితః. 16

ఈ దేవలోకమును అందరు పొందగోరు చుందురు. దానినే స్వర్గమనియు కీర్తింతురు.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే షట్సప్తతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదిఆరవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters