Varahamahapuranam-1    Chapters   

ఏకోనసప్తతి తమోధ్యాయః - అరువది తొమ్మిదవ అధ్యాయము

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వు డిట్లనెను.

భగవన్‌ త్వచ్ఛరీరే తు యద్వృత్తం ద్విజసత్తమ,

చిరజీవీ భవాం స్తన్మే వక్తు మర్హసి సత్తమ. 1

పూజ్యుడా! ద్విజశ్రేష్ఠుడా! నీ శరీరమున జరిగిన వింతయేమి? నీవు చిరంజీవివి ఎట్లయితివి? దీనిని నాకు చెప్పవలయును.

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు పలికెను.

మచ్ఛరీర మిదం రాజన్‌ బహు కౌతూహలాన్వితమ్‌,

అనేక కల్పసంస్థాయి వేదవిద్యా విశోధితమ్‌. 2

రాజా! ఈ నా శరీరము పెక్కువింతలకునిలయమైనది. పెక్కు కల్పములు నిలుచునది. వేదవిద్యలచేత శుద్ధి పొందినది.

అటన్‌ మహీ మహం సర్వాం గతవానస్మి పార్థివ,

ఇలావృతం మహావర్షం మేరోః పార్శ్వే వ్యవస్థితమ్‌. 3

ఈ భూమినంతటిని తిరుగుచు నేను మేరుపు ప్రక్కనున్న ఇలావృతమను మహావర్షమును చేరుకొంటిని.

తత్ర రమ్యం సరో దృష్టం తస్య తీరే మహాకుటీ,

తత్రోపవాసశిథిలం దృష్టవానస్మి తాపసమ్‌,

అస్థిచర్మావశేషం తు చీరవల్కల ధారిణమ్‌. 4

అచట అందమైన సరస్సును చూచితిని. దానిఒడ్డున పెద్ద గుడిసె ఒకటి కలదు. దానియందు ఎముకలు చర్మము మాత్రము మిగిలినవాడు, నారచీరలు ధరించనవాడును, ఉపవాసముల చేత బడలినవాడు నగు ఒక తాపసుని కాంచితిని.

తం దృష్ట్వా హం నృపశ్రేష్ఠ క ఏష నృపసత్తమ,

విశ్వాస్య ప్రతిపత్త్యర్థం విధేయం మే నరోత్తమ. 5

అతనిని చూచి ఇతడెవరో ఇతనిని తెలియుట కొరకు నేను నమ్మకము కలిగింపవలయు ననుకొంటిని.

ఏవం చిన్తయతో మహ్యం స మాంప్రాహ మహామునిః,

స్థీయతాం స్థీయతాం బ్రహ్మ న్నాతిథ్యం కరవాణి తే. 6

నే నిట్లనుకొనుచుండగా ఆ మహాముని నాతో ఇట్లు పలికెను. బ్రాహ్మణా! నిలువుము. నిలువుము. నేను నీకు ఆతిథ్యమును చేయవలయును.

ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య ప్రవిష్టో7హం కుటీం తు తామ్‌,

తావత్పశ్యామ్యహం విప్రం జ్వలన్తమివ తేజసా. 7

ఇది విని నే నాకుటీరములోని కరిగి చూడగా ఆతడు తేజస్సుతో వెలిగిపోవుచున్నట్లుండెను.

భూమౌ స్థితం తు మాం దృష్ట్వా హుంకార మకరోద్‌ ద్విజః,

తద్ధుంకారాత్‌తు పాతాళం భిత్వా పఞ్చ హి కన్యకాః. 8

నిర్యయుః కాఞ్చనం పీఠ మేకా తాసాం ప్రగృహ్యవై,

సా మాం ప్రాదాద్‌ తదాన్యాదాత్‌ సలిలం కరసంస్థితమ్‌. 9

గృహీత్వాన్యాతు మే పాదౌ క్షాళితుం చోపచక్రమే,

అన్వే ద్వే వ్యజనే గృహ్య మత్పక్షాభ్యాం వ్యవస్థితే. 10

నేలపై నిలబడిన నన్ను చూచి ఆద్విజుడు హుంకారము గావించెను. ఆ హుంకారమువలన పాతాళమును చీల్చుకొని అయిదుగురు కన్యలు పైకి వచ్చిరి. అందొకతే ఒక పీటను కొనివచ్చి నాకొసగెను. మరియొకతె చేతిలోనున్న నీటిని తెచ్చెను. మరియొకతె ఆ నీటిని కైకొని నా పాదములను కడుగమొదలిడెను. తక్కిన ఇద్దరు నా ప్రక్కల వీవనలు కొని నిలువబడిరి.

తతో హుంకార మకరోత్‌ పున రేవ మహాతపాః,

తచ్ఛబ్దా దంతరం హైమద్రోణీం యోజన విస్తృతామ్‌,

గృహ్యాజగామ మకరోత్ల్పవనం సరసి పార్థివ. 11

మరల ఆ మహాతపస్వి హుంకారమొనరించెను. ఆ శబ్దము వెనువెంటనే యోజనము వెడల్పుగల ఒక బంగారుదొన్నెను గొని ఒక మొసలి సరస్సు నుండి పైకి వచ్చెను.

తస్యాంతు కన్యాః శతశో హేమకుంభకరాః శుభాః,

ఆయయు స్తమథోదృష్ట్వా సమునిః ప్రాహ మాంనృప. 12

దానియందు బంగారుకుండలు తాల్చిన చక్కని కన్యలు వందలకొలదిగా వచ్చిరి. ఆ దొన్నెను చూచి ఆముని నాతో ఇట్లనెను.

స్నానార్థం కల్పితం బ్రహ్మన్నిదం తే సర్వ మేవ తు,

ద్రోణీం ప్రవిశ్య చేమాం త్వం స్నాతు మర్హసి సత్తమ. 13

బ్రాహ్మణా! ఇది యంతయు నీస్నానము కొరకు ఏర్పాటు. నీవు ఈ దొన్నెలో ప్రవేశించి స్నానము చేయదగును.

తతో7హం తస్య వచనాత్‌ తస్యాం ద్రోణ్యాం నరాధిప,

విశామి తావత్‌ సరసి సా ద్రోణీ ప్రత్యమజ్జత. 14

ఆతని మాటపై నేనా దొన్నెలో దిగినంతలో అది మునిగి పోయెను.

ద్రోణ్యాం జలే నిమగ్నో7హమితి మత్వా నరేశ్వర,

ఉన్మగ్నో7హం తతో లోక మపూర్వం దృష్టవాం స్తతః. 15

దొన్నెలోని నీట మునిగితి ననుకొన్న నేను పైకి లేచినంతనే ఒక అపూర్వమగు లోకమును కనుగొంటిని.

సుహర్మ్య కక్ష్యాయతనం విశాలం

రథ్యాపథం శుద్ధ జనానుకీర్ణమ్‌,

నీత్యుత్తమైః సేవిత మాత్మ విద్భి

ర్నృభిః పురాణౖ ర్నయమార్గసంస్థైః. 16

అది మంచిభవనములు, గదులు, శాలలు కలదియు, విశాలమైనదియు, విశాలములగు రాచబాటలు కలదియు, పవిత్రులగు జనులతో నిండినదియు, గొప్ప నీతిమంతులు, ఆత్మవేత్తలు, పురాణులు, ధర్మమార్గమున నెలకొన్న వారునగు నరులతో కూడినదియునై యుండెను.

సంసారచర్యా పరిఘాభి రుగ్రం

గంభీర పాతాళ తలస్థ మాద్యమ్‌,

సితై ర్నృభిః పాశవరాగ్రహసై#్తః

ద్విపాశ్వసంఘై ర్వివిధై రుపేతమ్‌. 17

మరియు కదలాడు చర్యలు గల పరిఘలతో భయంకరమైనదియు, మిక్కిలిలోతైన పాతాళ తలమున నున్నదియు, శ్రేష్ఠమైనదియు, మేలైన పాశములు చేతదాల్చిన తెల్లని నరులతో, ఏనుగుల, గుఱ్ఱములమందలతో కూడినదియునై యుండెను.

విచిత్ర పద్మోత్పలసంవృతాని సరాంసి నానా విహగాకులాని,

అంభోజపత్ర స్థిత భృంగనాదై రుద్గీత వన్తీవ లయై రనేకైః. 18

అందమైన పద్మములు, కలువలుకలవి, పెక్కువిధములైన పక్షులుకలవియు, పద్మపత్రముల మీదనున్న తుమ్మెదల నాదములతో అనేకలయలతో పాడుచున్నవో అన్నట్లున్న సరస్సులు అందుండెను.

కైలాసశృంగ ప్రతిమాని తీరే

ష్వనేకరత్నోత్పల సంచితాని,

గృహాణి ధన్యా ధ్యుషితాని నీచై

రుపాసితాని ద్విజదేవ విపై#్రః. 19

అందు కైలాసము కొమ్ములను పోలునట్టివియు, పెక్కు రత్నముల కలువల గుంపులు కలవియు, వేదపండితులగు విప్రులు నివసించునట్టివియు, పుణ్యాత్ములు నివసించునట్టివియు నగు గృహములు ఆ సరస్సుల తీరమునందు కలవు.

పద్మాని భృంగావనతాని చేలు స్తేషాం పునర్గురుభారా దజస్రమ్‌,

జవేషు యేషాం సుస్వరాస్యో ద్విజాతి

ర్వేదోదితా నాహ విచిత్రమన్త్రాన్‌. 20

తుమ్మెదలతో వంగిన పద్మములు అందు కదలాడు చున్నవి. వాని బరువులతో అవి ఎల్లప్పుడు ఊగులాడు చున్నవి. ఆ సరస్సుల జలములందు చక్కని స్వరములు గల పక్షిజాతులు వేదమునందలి విచిత్ర మంత్రములను పలుకుచున్నవి.

సితాబ్జమాలార్చిత గాత్రవన్తి

వాసోత్తరీయాణి ఖగప్రవారైః,

సరాంస్యనేకాని తథా ద్విజాస్తు

పఠన్తి యజ్ఞార్థవిధిం పురాణమ్‌. 21

తెల్లని పద్మముల మాలలతో గాత్రములు కలవియు, పక్షుల పంక్తులే ఉత్తరీయములుగా కలవియు, బ్రాహ్మణులు పురాతనములగు యజ్ఞ క్రియల మంత్రములను చదువుచున్న తీరుగలవియునగు పెక్కుకొలనులు అందున్నవి.

భ్రమన్నహం తేషు సరఃస్స్వ పశ్యం

వృన్దాన్యనేకాని సురాంగనానామ్‌,

విద్యాధరాణాం చ తథైవ కన్యాః

స్నానాయతం దేశ ముపాగతాశ్చ. 22

నేనా సరస్సులలో తిరుగుచు దేవతల, విద్యాధరుల కాంతలను స్నానము కొరకు ఆ ప్రదేశమునకు వచ్చిన వారిని, గాంచితిని.

తతః కదాచిద్‌ భ్రమతా నృపోత్తమ

ప్రదృష్ట మన్య త్సుసరః సుతోయమ్‌,

ప్రాగ్‌ దృష్ట మేకం తు తథైవ తీరే

కుటీం ప్రపశ్యామి యథా పురాహమ్‌. 23

ఆ విధముగా తిరుగుచు ఒకప్పుడు మంచి నీరుగల చక్కని కొలనును గాంచితిని. దాని ఒడ్డున మొదట చూచిన కుటీరమును మునుపటి వలెనే చూచితిని.

యావత్‌ కుటీం తాం ప్రవిశామి రాజన్‌

తపస్వినం తం స్థిత మేకదేశే,

దృష్ట్వాభిగమ్యా భివదామి యావత్‌

స్మయన్నువాచాప్రతిమ ప్రభావః. 24

ఆ కుటీరమును ప్రవేశించి ఒక వైపున కూర్చున్న ఆ తపస్విని చూచి దగ్గరకు చేరి పలుకునంతలో నవ్వుచు సాటిలేని ప్రభావముగల ఆ మహానుభావుడు ఇట్లు పలికెను.

తాపస ఉవాచ - తాపసు డిట్లు పలికెను.

కిం మాం విప్ర న జానీషే ప్రాగ్దృష్ట మపి సత్తమ,

యేనత్వం మూఢవల్లోక మిమ మప్యనుపశ్యపి. 25

విప్రా! మునుపు చూచిన నన్ను ఎరుగవా? మూఢునివలె ఈ లోకమును

చూచుచున్నావు.

దృష్టం మత్క మిదం దేవై ర్భువనం యన్న దృశ్యతే,

త్వత్ర్పియార్థం మయాలోకో దర్శితః సద్విజోత్తమ. 26

దేవతలు కూడ చూడజాలని నా భువనమును నీవు కనుగొంటివి. ద్విజోత్తమా! నీ ప్రియము కొరకు నీకీ లోకమును చూపితిని.

సంపదం పశ్య లోకస్య మదీయస్య మహామునే,

దధిక్షీరవహా నద్య స్తథా సర్పిర్మయాన్‌ హ్రదాన్‌. 27

నా లోకపు సంపదను మహామునీ! కనుగొనుము. అందు పెరుగుతో పాలతో ప్రవహించు నదులు, నేతితో నిండిన పెద్ద చెరువులు కలవు.

గృహాణాం హేమరత్నానాం స్తంభాన్‌ హేమమయాన్‌ గృహే,

రత్నోత్పలచితాం భూమిం పద్మరాగ సమప్రభామ్‌,

పారిజాత ప్రసూనాఢ్యాం సేవితాం యక్ష కిన్నరైః. 28

హేమరత్నమయములైన స్తంభములు గల గృహములు కలదియు రత్నములతో కూర్చినదిము, పద్మరాగములకెనయగు కాంతి కలదియు, పారిజాతపుష్పములతో ప్రసిద్ధి కెక్కినదియు యక్షకిన్నరులు సేవించుచున్నదియునగు ఈ భూమిని చూడుము.

ఏవ ముక్త స్తదా తేన తాపసేన నరాధిప,

విస్మయాపన్నహృదయ స్తమేవాహంతు పృష్టవాన్‌. 29

ఆ తాపసుడట్లు పలుకగా, రాజా! అచ్చెరువు నిండిన హృదయముతో అతనినే ఇట్లడిగితిని.

భగవంస్తవ లోకో7యం సర్వలోకవరోత్తమః,

సర్వలోకా మయా దృష్టా బ్రహ్మశక్రాది సంస్థితాః. 30

స్వామీ! నేను బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు వారుండు లోకము లన్నింటిని చూచితిని. నీ లోకము ఆ అన్నింటి కంటె ఉత్తమముగా నున్నది.

అయం త్వ పూర్వో లోకో మే ప్రతిభాతి తపోధన,

సంపదైశ్వర్య తేజోభిర్హర్మ్య రత్నచయై స్తథా. 31

సరోభిః సూదకైః పుణ్యౖ ర్జలజైశ్చ విశేషతః,

అత్యద్భుత మిదం లోకం దృష్టవానస్మి తే మునే. 32

తపోధనా! ఈ లోకము అపూర్వముగా నాకు కన్పట్టుచున్నది. సంపద, ఐశ్వర్యము, తేజస్సు, భవనములు, రత్న సముదాయములు, మంచినీరుగల పుణ్యవంతములగు సరస్సులు అనువానిచేత మిక్కిలి అద్భుతముగా నున్న దీనిని కనుగొంటిని.

ఇత్థంభూతః కథంలోకో భవాంశ్చేత్థం వ్యవస్థితః,

కథయసై#్వతస్య హేతుం మే కశ్చత్వం మునిగపుంగవ. 33

ఇటువంటి లోకమెట్లేర్పడినది? ఇందు నెలకొన్న నీ వెవరవు? దీనికి కారణమేమి? మునిపుంగవా! నాకెరుగ జెప్పుము.

కథమిలావృతే వర్షే సరస్తీరే మహామునే,

దృష్టవానస్మి సో7హం త్వం సరస్తత్‌ సా కుటీ మునే,

హేమ హర్మ్యాకులే లోకే కింవా స్థానంతు తే కుటిః. 34

మహామునీ! ఇలావృతవర్షమున సరస్సు తీరమున నేను నిన్ను దర్శించుకొంటిని. ఆ సరస్సేమి? ఆ కుటీరమేమి? బంగారు గృహములునిండిన ఈ లోకమున ఈ గుడిసెకు స్థానమేమి?

ఏవ ముక్తః సభగవాన్‌ మయా7సౌ మునిపుంగవః,

ప్రాహ మహ్యం యథావృత్తం యత్‌తు రాజేన్ద్ర తచ్ఛ్రుణు. 35

నే నిట్లనగా ఆ భగవానుడు నాకేది చెప్పెనో ఉన్నదున్నటు చెప్పెదను. రాజేంద్రా! వినుము.

తాపస ఉవాచ - తాపసు డిట్లనెను.

అహం నారాయణో దేవో జలరూపీ సనాతనః,

యేన వ్యాప్త మిదం విశ్వం త్రైలోక్యం సచరాచరమ్‌. 36

నేను సనాతనుడు, జలరూపమున నున్నవాడు అగు నారాయణుడను. చరాచరరూపమైన మూడులోకముల విశ్వమంతటిని ఆవరించి యున్నాను.

యా సా త్వాప్యాకృతి స్తస్య దేవస్య పరమేష్ఠినః,

సో7హం వరుణ ఇత్యుక్తః స్వయం నారాయణః పరః. 37

పరమేష్ఠి యగు ఆ దేవుని ఏ ఆకారమును నీవు చూచితివో అదియు నేనే. వరుణు డందురు. స్వయముగా అతడును పరుడైన నారాయణుడే.

త్వయా చ సప్తజన్మాని అహ మారాధితః పురా,

తేన త్రైలోక్య నాశే7పి త్వమేక స్త్వభాలక్షితః. 38

నీవు నన్ను ఏడు జన్మములు ఆరాధించితివి. అందుచేత మూడులోకములు నశించినను నీవొక్కడవు గుర్తింపబడితివి.

ఏవ ముక్త స్తదా తేన నిద్రా మీలితలోచనః.

పతితో7హం ధరాపృష్ఠే తతక్షణాత్‌ పునరుత్థితః. 39

ఆ నారాయణు డట్లు పలుకగా నేను నిద్రతో మూసికొన్న కన్నులు కలవాడనై పడితిని. వెనువెంటనే లేచితిని.

యావత్పశ్యా మ్యహం రాజన్‌ తమృషిం తచ్చ వైపురమ్‌,

తావన్మేరుగిరే ర్మూర్ధ్ని పశ్యా మ్యాత్మానమాత్మనా. 40

ఆ ఋషిని ఆ పురమును కనుగొనునంతలో మేరుగిరి శిఖరమున నన్ను నేను చూచుకొంటిని.

సముద్రాన్‌ సప్త పశ్యామి తథైవ కులపర్వతాన్‌,

సప్త ద్వీపవతీం పృథ్వీం దృష్టవానస్మి పార్థివ. 41

ఏడు సముద్రములను, ఏడు కులపర్వతములను, ఏడు ద్వీపములు గల పుడమిని కాంచితిని.

అద్యాపి తం లోకవరం ధ్యాయం స్తిష్ఠామి సువ్రత,

కదా ప్రాప్స్యే7థ తం లోక మితి చిన్తాపరో7భవమ్‌. 42

నేటిదనుక ఆ లోకవరమునే ధ్యానించుచు నిలిచితిని. ఆ లోకము నెప్పుడు పొందుదునా? అన్నచింతయే నాకున్నది.

ఏవం తే కౌతుకం రాజన్‌ కథితం పరమేష్ఠినః,

యద్‌ వృత్తం మమ దేహే తు కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛసి. 43

రాజా! నీ వేడుకను బట్టి నా దేహమున సంభవించిన పరమేష్ఠి వృత్తమును చెప్పితిని. ఇంకను నీవేది వినగోరుచున్నావు?

ఇతి శ్రీవరాహ పురాణ భగవాచ్ఛాస్త్రే ఏకోనసప్తతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది తొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters