Varahamahapuranam-1    Chapters   

షట్పంచాశోధ్యాయః - ఏబది యారవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లు చెప్పెను.

అతః పరం ప్రవక్ష్యామి ధన్యవ్రత మనుత్తమమ్‌,

యేన సద్యో భ##వేద్‌ ధన్య అధన్యోపి హి యో భ##వేత్‌. 1

ఇటుపై మిక్కిలి శ్రేష్ఠమగు ధన్య వ్రతమును గూర్చి చెప్పెదను. దానిచేత అధన్యుడుకూడ వెనువెంటనే ధన్యుడగును.

మార్గశీర్షే సితే పక్షే ప్రతిపద్‌ యా తిథి ర్భవేత్‌,

తస్యాం నక్తం ప్రకుర్వీత విష్ణు మగ్నిం ప్రపూయేత్‌. 2

మార్గశీర్షమాసము శుక్లపక్షమున పాడ్యమి నాడు రాత్రిపూట ఈ వ్రతమును చేయవలయును. ఆనాడు విష్ణురూపుడైన అగ్ని దేవుని పూజింపవలయును.

వైశ్వానరాయ పాదౌ తు అగ్నయే త్యుదరం తథా,

హవిర్భుజాయ చ ఉరో ద్రవిణోదేతి వై భుజే. 3

సంవర్తాయేతిచ శిరో జ్వలనాయేతి సర్వతః,

అభ్యర్చ్యైవం విధానేన దేవదేవం జనార్దనమ్‌. 4

'ఓం నమో వైశ్వానరాయ' అని పాదములను, 'నమోగ్నయే' అని ఉదరమును, నమో హవిర్భుజాయ అని వక్షస్సును, 'నమో ద్రవిణోదాయ' అని భుజములను, 'నమఃసంవర్తాయ' అని శరిస్సును, 'నమో జ్వలనాయ' అని సర్వాంగములను విధి ననుసరించి దేవదేవుడైన జనార్దనుని అభ్యర్చింపవలయును.

తసై#్యవ పురతః కుణ్డం కారయిత్వా విధానతః,

హోమం తత్ర ప్రకుర్వీత ఏభి ర్మన్త్రై ర్విచక్షణః. 5

ఆదేవుని ముందు విధానము ననుసరించి హోమ కుండమును ఏర్పరుపవలయును. ఈ మంత్రములతో వివేకవంతుడు హోమమును అందు చేయవలయును.

తతః సంయావకం చాన్నం భుంజీయాద్‌ ఘృతసంయుతమ్‌,

కృష్ణపక్షేస్యేవ మేవ చాతుర్మాస్యం తు యావతః. 6

పిదప నేయి కలిపిన సగ్గు బియ్యపు అన్నమును భుజింప వలయును. కృష్ణపక్షమునందును ఇట్లే చేయవలయును. ఈ విధముగా నాలుగు మాసములు చేయవలయును.

చైత్రాదిషు చ భుఞ్జిత పాయసం సఘృతం బుధః,

శ్రావణాదిషు సక్తూంశ్చ తతశ్చైతత్‌ సమాప్యతే. 7

చైత్రము మొదలగు నెలలలో నేయి కలిపిన పాయసమును, శ్రావణము మొదలగు వాని యందు పేలపిండిని భుజించి వ్రతము ముగింపవలయును.

సమాప్తేతు వ్రతం వహ్నిం కాఞ్చనం కారయేద్‌ బుధః,

రక్తవస్త్రయుగచ్ఛన్నం రక్తపుష్పానులేపనమ్‌. 8

కుంకుమేన తథా లిప్య బ్రాహ్మణం దేవ మేవ చ,

సర్వావయవ సంపూర్ణం బ్రాహ్మణం ప్రియదర్శనమ్‌. 9

పూజయిత్వా విధానేన రక్తవస్త్ర యుగేన చ,

పశ్చాత్తం దాపయేత్‌ తస్య మన్త్రేణానేన బుద్ధిమాన్‌. 10

ధన్యోస్మి ధన్యకర్మాస్మి ధన్యచేష్టోస్మి ధన్యవాన్‌,

ధన్యేనానేన చీర్ణేన వ్రతేన స్యాం సదా సుఖీ. 11

వ్రతము ముగిసిన పిదప బంగారు అగ్నిదేవుని ప్రతిమను చేయింపవలయును. ఎర్రని వస్త్రములు రెండు చుట్టవలయును. ఎర్రని పూలతో కప్పవలయును. కుంకుమ పూయవలయును. ఇట్లు బ్రాహ్మణునకును చేయవలయును. ఏ అంగవైకల్యము లేని వాడు, చక్కని రూపము కలవాడు నగు ఆ బ్రాహ్మణునకు రెండు ఎర్రని వస్త్రములను దానమొసగి పూజింపవలయును. పిదప నేనుధన్యుడను. ధన్యమగు కర్మములు కలవాడను, ధన్యమగు చేష్టలు కలవాడను. పుణ్యవంతుడను. ఉత్తమముగా సాగించిన ఈ వ్రతము చేత సర్వకాలములందును సుఖిని అగుదును' అను మంత్రముతో ఆ ప్రతిమను ఆ బ్రాహ్మణునకు దాన మీయవలెను.

ఏవముచ్చార్య తం విప్రే న్యస్య కోశం మహాత్మనః,

సద్యో ధన్యత్వ మాప్నోతి యోపి స్యా ద్భాగ్య వర్జితః. 12

ఇట్లు పలికి ఆ కోశమును విప్రునియందు సమర్పించిన మహాత్మునకు వెనువెంటనే ధన్యత కలుగును. ఆతడు భాగ్యహీనుడై నను నది సిద్ధించును.

ఇహ జన్మని సౌభాగ్యం ధనం ధాన్యం చ పుష్కలమ్‌,

అనేక కృతమాత్రేన జాయతే నాత్ర సంశయః. 13

ఈ వ్రతము చేసిన మాత్రమున ఈ జన్మమునందు సౌభాగ్యము, ధనము, ధాన్యము పుష్కలముగా కలుగును. సంశయము లేదు.

ప్రాగ్జన్మజనితం పాప మగ్ని ర్దహతి తస్య హ,

దగ్ధే పాపే విముక్తాత్మా ఇహ జన్మన్యసౌ భ##వేత్‌. 14

మునుపటి జన్మములందేర్పడిన ఆతని పాపమును కూడ అగ్ని కాల్చివేయును. అట్లు పాపము దగ్ధము కాగా ఆతడు విముక్తాత్ముడు ఈ జన్మమునందే యగును.

యోపీదం శృణుయా న్నిత్యం యశ్చ భక్త్యా పఠేద్ద్విజః,

ఉభౌ తావిహ లోకే తు ధన్యౌ సద్యో భవిష్యతః. 15

ప్రతి దినము దీనిని వినువాడును, భక్తితో పఠించువాడును ఇద్దరును ఈ లోకమున వెంటనే ధన్యలగుదురు.

శ్రూయతే చ వ్రతం చైత చ్చీర్ణ మాసీన్మహాత్మనా,

ధనదేన పురా కల్పే శూద్రయోనౌ స్థితేన తు. 16

మరియు పూర్వకల్పమున మహాత్ముడగు కుబేరుడు శూద్రజన్మమున నున్నవాడై ఈ వ్రతము నాచరించినట్లును విన వచ్చుచున్నది.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే షట్పంచాశోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది యారవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters