Varahamahapuranam-1    Chapters   

త్రిపఞ్చాశో7ధ్యాయః - ఏబది మూడవ అధ్యాయము

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వుడిట్లనెను.

మత్ప్రశ్నవిషయే బ్రహ్మాన్‌ కథేయం కథితా త్వయా,

తస్యా విభూతి రభవత్‌ కస్య కేన కృతేన హ. 1

బ్రాహ్మణోత్తమా! నా ప్రశ్నకు నీవీ కథ చెప్పితివి. దాని విభూతి ఎట్లు ఏవని ఏ కార్యము చేత కలిగినది?

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లు చెప్పెను.

ఆగతేయం కథా చిత్రా సర్వస్య విషయే స్థితా,

త్వద్దేహే మమ దేహే చ సర్వజన్తుషు సా సమా 2

ఈ కథ చాల చిత్రమై వెలువడినది. ఇది అన్నింటి విషయమునకు ఉండునది. నీ దేహమున, నా దేహమున, సర్వ జంతువుల విషయమున అది సమానముగా నుండునది.

తస్యాం సంభూతి మిచ్ఛన్‌ యస్తస్యో పాయం స్వయం పరమ్‌,

పశుపాలాత్‌ సముత్పన్నో యశ్చతుష్పా చ్చతుర్ముఖః. 3

సగురుః సకథాయాస్తు తస్యాశ్చైవ ప్రవర్తకః,

తస్య పుత్రః స్వరో నామ సప్తమూర్తి రసౌ స్మృతః. 4

దీనియందు పుట్టుకను ఎఱుగకోరు వానికి ఆ పరమాత్మయే స్వయముగా ఉపాయము. పశుపాలుని వలన పుట్టిన ఆ నాలుగు పాదములు నాలుగు మొగములు కలవాడు. ఎవడో అతడే ఈ కథకు గురువు. దీనిని ప్రవర్తింపజేసిన వాడు. అతని పుత్రుడు స్వరుడు. అతనికి 'సప్తమూర్తి' అనియు వ్యవహారము ( సప్తమూర్తి ఏడురూపములు కలవాడు).

తేన ప్రోక్తం తు యత్కించిత్‌ చతుర్ణాం సాధనం నృప,

ఋగర్థినాం చతుర్భిస్తే తద్భక్త్యా రాధ్యతాం యయుః. 5

ఆయన ప్రవచించిన దేదికలదో అది నాలుగు పురుషార్థములకు సాధనము. ఋక్కులను కోరువారికి ఆ నాల్గింటిచేత ఆ వాక్యములు ఆరాధింపదగినవయ్యెను.

చతుర్ణాం ప్రథమో యస్తు చతుఃశృఙ్గ సమాస్థితః,

వృషద్వితీయ స్తత్ర్పోక్త మార్గేణౖవ తృతీయకః,

చతుర్థ సత్త్ప్రణీత స్తాం పూజ్య భక్త్యా సుతం వ్రజేత్‌. 6

ఆ నాల్గింటిలో మొదటిది నాలుగు కొమ్ములతో కూడి యున్నది. రెండవది వృషభము. అది పలికిన మార్గముతోడనే మూడవదియు, నాల్గవదియు ఏర్పడినవి. ఆ మొదటిదానిని భక్తితో పూజించి సుతుని పొందినవి.

సప్తమూర్తేస్తు చరితం శుశ్రువుః ప్రథమం నృప,

బ్రహ్మచర్యేణ వర్తేత ద్వితీయోస్య సనాతనః. 7

ఈ ఏడు మూర్తులు గల దేవుని చరితమును వినగోరువాడు బ్రహ్మచర్యముతో ప్రవర్తింపవలయును. ఈతని రెండవదశ సనాతన మయినది. ( అనగా రెండవ గృహస్థాశ్రమమని భావము)

తతోభృత్యాదిభరణం వృషభారోహణం త్రిషు,

వనవాసశ్చ నిర్దిష్ట ఆత్మస్తే వృషభే సతి. 8

పిదప సేవకులు మొదలగు వారిని భరించుట వృషభరూపుడగు దైవమును అధిరోహించుట.

అహమస్మి వదత్యన్య శ్చతుర్ధా ఏకధా ద్విధా,

భేదభిన్న సహోత్పన్నా స్తస్యాపత్నాని జజ్ఞిరే. 9

నేనొకడను అని పలికెను. నాలుగు విధుములుగా, ఒక విధముగా, రెండు విధములుగా, అనేక రూపములు కలిసి పుట్టునట్లుగా అతనికి కొడుకులు జన్మించిరి.

నిత్యానిత్య స్వరూపాణి దృష్ట్వా పూర్వం చతుర్ముఖః,

చిన్తయామాస జనకం కథం పశ్యామ్యహం నృప. 10

నిత్యములు, అనిత్యములు అగు స్వరూపములు గల వానిని చూచి చతుర్ముఖుడు నేను నాతండ్రి నెట్లు చూతునని విచారమందెను.

మదీయస్య పితుర్యేహి గుణా ఆసన్‌ మహాత్మనః,

నతే సంప్రతి దృశ్యన్తే స్వరాపత్యేషు కేషుచిత్‌. 11

మహాత్ముడగు నా తండ్రి గుణములు ఈ స్వరుని బిడ్డల యందు ఒక్కరియందును ఇప్పుడు కాన రావు.

పితుః పుత్రస్య యఃపుత్రః స పితామహనామవాన్‌

ఏవం శ్రుతిః స్థితా చేయం స్వరాపత్యేషు నాన్యథా. 12

తండ్రి కొడుకు కొడుకు తండ్రి పేరు కలవాడగును. శ్రుతి ఈ విధముగా నుండగా స్వరుని బిడ్డల యందు మరియొక విధముగా కారాదు కదా!

క్వాపి సంపత్య్స తే భావో ద్రష్టవ్య శ్చాపి తే పితా,

ఏవం నీతోపి కిం కార్యమితి చింతా పరోభవత్‌. 13

నా భావమెచట ఫలమునకు వచ్చును. నా తండ్రి నాకెక్కడ చూడదగినవాడు. ఇట్టి స్థితికి వచ్చితిని. దీని కార్యమేమి? అని చింతాపరుడాయెను.

తస్య చిన్తయతః శస్త్రం పితృకం పురతో బభౌ,

తేన శ##స్త్రేణ తం రోషా న్మమన్థ స్వర మన్తికే. 14

అట్లతడు చింతించుచుండగా అతనిముందు తండ్రికి సంబంధించిన శస్త్రమొకటి ప్రకాశించెను. రోషముల వలన ఆ శస్త్రముతో ఆ స్వరుని కుళ్లబొడిచెను.

తస్మిన్‌ మథితమాత్రే తు శిరస్తస్యాపి దుర్గ్రహమ్‌,

నాలికేర ఫలాకారం చతుర్వక్త్రోన్వపశ్యత. 15

అట్లు పొడువగా చతుర్వక్త్రునకు పట్టశక్యము కాని ఆ స్వరుని కొబ్బరికాయ వంటి ఆకారము గల తల కానవచ్చెను.

తచ్చావృతం ప్రధానేన దశధా సంవృతం బభౌ,

చతుష్పాదేన శ##స్త్రేణ చిచ్ఛేద తిలకాణ్డవత్‌. 16

అదియు ప్రధానముగా పదివైపులను కప్ప బడి యుండెను. నవ్వు గింజంతగా దానిని నాలుగు పాదముల ఆయుధముతో పగులగొట్టెను.

ప్రకామం తిలసంఛిన్నే తదమూలో న మే బభౌ,

అహంత్వహం వదన్‌ భూతం తమప్యేవ మథాచ్ఛినత్‌. 17

నువ్వు గింజంతగా ముక్కలు కొట్టినను దానిమూలము, నాకు కానరాలేదని అతడనుకొనుచుండెను. నేను, నేను అని పలుకుచు ఒక భూతము ఏర్పడెను. దానిని కూడా అట్లే బాధించెను.

తస్మిన్‌ ఛిన్నే తదస్యాంసే హ్రస్వమన్య మవేక్షత,

కృత్వావకాశం తేసర్వే జల్పన్త ఇద మన్తికాత్‌. 19

దానిని కూడ ముక్కలు కొట్టెను. కాని ఆ అయిదింటి శూన్యతను చూడకుండెను. (కాని ఆ అయదు అక్కడనే యుండెనని భావము) అవి అవకాశమును చేసికొని వాగుచు నాలబడెను.

తమస్యసంగశ##స్త్రేణ చిచ్ఛేత తిలకాండవత్‌,

తస్మిన్‌ ఛిన్నే దశాంశేన హ్రస్వమన్య మపశ్యత. 20

దానిని కూడ అసంగమనెడు శస్త్రముతో నువ్వుగింజలంతగా ముక్కలుచేసెను. అది అట్లు పదేసిభాగములుగా ముక్కలు కాగా మరియొక పొట్టి ఆకారము కానవచ్చెను.

పురుషం రూపశ##స్త్రేణ తం ఛిత్వాన్య మపశ్యత,

తద్వద్‌ హ్రస్వం సితం సౌమ్యం తమప్యేవం తదాకరోత్‌. 21

ఆ పొట్టి పురుషుని కూడ ముక్కలుకొట్టి తెల్లనివాడు, సౌమ్యుడు అయిన మరియొక పురుషుని కాంచెను. వానిని కూడ అట్లే చేసెను.

ఏవం కృతే శరీరం తు దదర్మ స పునం ప్రభుః,

స్వకీయ మేవా కస్యాన్తః పితరం నృపసత్తమ. 22

ఇట్లు చేయగా ఆ ప్రభువునకు ఆ ముక్కలోపల ఒక శరీరము కానవచ్చెను. అది తన తండ్రిదే.

త్రసరేణుసమం మూర్త్వా అవ్యక్తం సర్వజన్తుషు,

సమం దృష్ట్వా పరం హర్షముభౌహి సస్వరోభవత్‌. 23

అది త్రసరేణువు అంత ఆకారమున సర్వజంతువుల యందు అవ్యక్తముగా నుండెను. అట్లు అంతట సమముగా ఉన్న దానిని చూచి వారిరువురు ఆనందము పొందిరి. (త్రసరేణువు ముప్పది పరమాణువులంతటిది.) అతడే స్వరుడాయెను.

ఏవం విధోసౌ పురుషః స్వరనామా మహాతపాః,

మూర్తిస్తస్య ప్రవృత్తాఖ్యం నివృత్తాఖ్యం శిరోమహత్‌. 24

ఈ విధమైన ఆపురుషుడు స్వరమను నామము కల వాడాయెను. అతని మూర్తికి 'ప్రవృత్తము' అని పేరు. శిరస్సునకు నివృత్తమనిపేరు.

ఏతస్మాదేవ తస్యాశు కథయా రాజసత్తమ,

సంభూతి రభవద్‌ రాజన్‌ వివృత్తే స్త్వేష ఏవతు. 25

రాజా! ఈ కథ వలననే ఆతనికి పుట్టుక కలిగినది. ఇదియే దాని విస్తృతి.

ఏషేతిహాసః ప్రధమః సర్వస్య జగతో భృశమ్‌,

య ఇమం వేత్తి తత్త్వేన సాక్షత్‌ కర్మపరో భ##వేత్‌. 26

ఇది సర్వజగత్తు యొక్క మొదటి ఇతిహాసము. దీనిని తత్త్వముతో ఎరిగినవాడు సాక్షాత్తుగా కర్మపరుడగును.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే త్రిపఞ్చాశోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబదిమూడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters