Varahamahapuranam-1    Chapters   

ఏకోనపంచాశోధ్యాయః - నలుబది తొమ్మిదవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు పలికెను.

తద్వదాశ్వయుజే మాసి ద్వాదశీం శుక్ల పక్షతః,

సంకల్ప్యాభ్యర్చయే ద్దేవం పద్మనాభం సనాతనమ్‌. 1

ఈ విధముగనే ఆశ్వయుజ మాసమున శుక్లపక్ష ద్వాదశి నాడు సంకల్పించి సనాతనుడగు పద్మనాభ##దేవుని అభ్యర్చింప వలయును.

పద్మనాభాయ పాదౌతు కటిం వై పద్మయోనయే,

ఉదరం సర్వదేవాయ పుష్కరాక్షాయ వై ఉరః,

అవ్యయాయ తథా పాణిం ప్రాగ్వదస్త్రాణి పూజయేత్‌. 2

'ఓం నమః పద్మనాభాయ' అని పాదములను, 'నమః పద్మయోనయే' అని నడుమును, 'నమః సర్వదేవాయ' అని ఉదరమును, 'నమః పుష్కరాక్షాయ' అని రొమ్మును, 'అవ్యయా యనమః' అని చేతిని, అట్లే మునుపటి వలె అస్త్రములను పూజింప వలయును.

ప్రభవాయ శిరః పూజ్య ప్రాగ్వదగ్రే ఘటం న్యసేత్‌,

తస్మిన్‌ సౌవర్ణకం దేవం పద్మనాభం తు విన్యసేత్‌. 3

'నమః ప్రభవాయ' అని శిరస్సును పూజించి మునుపటి వలెనే కుంభమును నిలుప వలయును. దాని యందు బంగారముతో చేసిన పద్మనాభ##దేవుని ప్రతిమను నిలుపవలయును.

తమేవ దేవం సంపూజ్య గంధపుష్పాదిభిః క్రమాత్‌,

ప్రభాతాయాం తు శర్వర్యాం బ్రాహ్మణాయ నివేదయేత్‌,

ఏవం కృతే తు యత్‌ పుణ్యం తన్నిబోధ మహామునే. 4

గంధపుష్పాదులతో క్రమముగా ఆ దేవుని పూజించి మరునాడు ఉదయమున బ్రాహ్మణునకు నివేదింపవలయును. ఇట్లు చేయగా కలుగు పుణ్య మెట్టిదియో చెప్పెదను వినుము.

ఆసీత్‌ కృతయుగే రాజా భద్రాశ్వో నామ వీర్యవాన్‌,

యస్య నామ్నాభవద్‌ వర్షం భద్రాశ్వం నామ నామతః. 5

కృతయుగమున భద్రాశ్వుడను గొప్ప శక్తి సంపద గల రాజుండెడి వాడు. అతని పేరుతో భద్రాశ్వమను వర్షము (దేశము పేరు) ఏర్పడెను.

తస్యాగస్త్యః కదాచిత్తు గృహమాగత్య సత్తమ,

ఉవాచ సప్తరాంత్రంతు వసామి భవతో గృహే. 6

ఒకప్పుడు ఆతని యింటికి అగస్త్యుడు వచ్చి, 'నీయింట ఏడురాత్రులు ఉందును' అని పలికెను.

తం రాజా శిరసా భూత్వా స్థీయతా మిత్యభాషత.

ఆరాజు తలవంచి అట్లే 'ఉండుడు' అని పలికెను.

తస్య కాంతిమతీ నామ భార్యా పరమశోభనా. 7

తస్యాస్తేజః సమభవద్‌ ద్వాదశాదిత్య సన్నిభమ్‌.

అతనికి మిక్కిలి సౌందర్యవతి యగు కాంతిమతి అను భార్య కలదు. ఆమె ముఖకాంతి పండ్రెండుగురు సూర్యులకు సమానమై యొప్పెడిది.

శతాని పఞ్చ తస్యాసన్‌ సపత్నీనాం యతవ్రత. 8

మరియు ఆమెకు అయిదు వందల మంది సవతులును కలరు.

తా దాస్య ఇవ కర్మాణి కుర్వన్త్యహరహః శుభాః.

కాన్తిమత్యా మహాభాగ భయాత్త్రస్తా విచేతసః. 9

వారందరు కాంతిమతి భయము చేత మనసు మనసులో లేనివారై బానిసల వలె ప్రతిదినము ఆమెకు సేవలు చేయు చుండిరి.

తా మగస్త్యస్తథా దృష్ట్వా రూపతేజోన్వితాం శుభామ్‌,

సపత్న్యశ్చ భయాత్‌ తస్యాః కుర్వన్త్యః కర్మ శోభనమ్‌,

రాజా తు తస్యా ముదితం ముఖమేవావ లోకయన్‌. 10

రూపము, తేజస్సు గల ఆ సుందరిని, భయముతో ఆమెకు సేవలు చేయుచున్న సవతులను అగస్త్యుడు చూచెను. రాజు మాత్రము ఆమె ముద్దు మొగమునే చూచుచుండెడివాడు.

ఏవంభూతా మథో దృష్ట్వా రాజ్ఞీం పరమశోభనామ్‌,

సాధు సాధు జగన్నాథే త్యగస్త్యః ప్రాహ హర్షితః. 11

ఇట్టి మహాసుందరి యగు రాణిని చూచి, రాజా! మేలు మేలని అగస్త్యుడు ఆనందముతో పలికెను.

ద్వితీయే దివసేప్యేవం రాజ్ఞీం దృష్ట్వా మహాప్రభామ్‌,

అహో ముష్ట మహోముష్టం జగదేత చ్చరాచరమ్‌,

ఇత్యగస్త్యో ద్వితీయేహ్ని రాజ్ఞీం దృష్ట్వాభ్యువాచహ. 12

అగస్త్యడు గొప్ప ప్రభ గల ఆ రాణిని చూచి రెండవ దినమునందును 'అహో! చరాచర జగ మంతయు కొల్లగొట్టబడినది, కొల్లగొట్టబడినది' అని పలికెను.

తృతీయేహని తాం దృష్ట్వా పున రేవ మువాచ హ,

అహో మూఢా నజానన్తి గోవిందం పరమేశ్వరమ్‌,

య ఏకేహ్ని ఫలం చైతద్‌క్షరాజ్ఞే తుష్టః ప్రదత్తవాన్‌. 13

మూడవవాడు ఆతడు ఆమెను చూచి యిట్లనెను. 'పరమేశ్వరుడగు గోవిందుని, అయ్యో! ఈ మూఢులు తెలియ కున్నారు. ఆ స్వామి ఒక్కదినమున ఈ రాజునెడ తుష్టి నంది ఫలము నంతటి నొసగియున్నాడు.'

చతుర్థే దివసే హస్తా వుతిక్ష ప్య పున రబ్రవీత్‌,

సాధుసాధు జగన్నాథ స్త్రీ శూద్రాః సాధుసాధ్వితి,

ద్విజాః సాధు నృపాఃసాధు వైశ్యాః సాధు పునః పునః. 14

నాల్గవ దినమున ఆ మహర్షి రెండు చేతులు యిట్లు పలికెను : జగన్నాథ! మేలు మేలు, స్త్రీలు మేలు, శూద్రులు మేలు, బ్రాహ్మణులు, వైశ్యులు, మేలు మేలు -

సాధు భద్రాశ్వ సాధు త్వం భోగస్త్య సాధుసాధు, తే,

సాధు ప్రహ్లాద తేసాధు ధ్రువ సాధో మహావ్రత,

ఏవముక్త్వా ననర్తోచ్చై రగస్త్యో రాజసంనిధౌ. 15

భద్రాశ్వా! నీవు గొప్పవాడవు. అగస్త్య: నీకు మేలు మేలు. ప్రహ్లాదా! నీకు శుభము శుభము. ధ్రువా! మహావ్రతా! మేలు అని యిట్లు పలుకుచు రాజు కడ అగస్త్యుడు పెద్దగా నర్తించెను.

ఏవం భూతం చ తం దృష్ట్వా సపత్నీకో నృపోత్తమః,

కిం హర్షకారణం బ్రహ్మన్‌ యేనేత్థం నృత్యతే భవాన్‌. 16

పత్నీసహితుడైన ఆ రాజు ఇట్లున్న ఆ అగస్త్యుని గాంచి, బ్రాహ్మణోత్తమా! నీ ప్రమోదమునకు కారణమేమి? ఏల ఇట్లు నృత్యము చేయుచున్నావు? అని అడిగెను.

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లు పలికెను.

అహో మూర్ఖః కురాజా త్వ మహో మూర్ఖా నుగా స్త్వమీ,

అహో పురోహితా మూర్ఖా యే న జానన్తి మే మతమ్‌. 17

అయ్యో! రాజా! నీవు పాడురాజవు, మూర్ఖుడవు. ఈ నీ సేవకు లందరు మూర్ఖులు. నీ పురోహితులు, అయ్యో! ఎంతమూర్ఖులు! నా అభిప్రాయము నెరుగ కున్నారు.

ఏవముక్తే తతో రాజా కృతాంజలి రభాషత,

న జానీమో వయం బ్రహ్మన్‌ ప్రశ్న మేత త్త్వయేరితమ్‌,

కథయస్వ మహాభాగ యద్యనుగ్రహకృద్‌ భవాన్‌. 18

ఇట్లు పలుకగా రాజు చేతులు జోడించి, మహర్షీ! నీవు పలికినది మేమెరుగకున్నాము. మాయందు అనుగ్రహము కలవాడవైనచో తెలుపుము, అని పలికెను.

ఇయం రాజ్ఞీ త్వయా యాభూద్‌ దాసీ వైశ్యస్య వైదిశే,

నగరే హరిదత్తస్య త్వమస్యాః పతి రేవచ,

తసై#్యవ కర్మకారోభూ చ్ఛ్రూద్రః సేవనతత్పరః. 19

ఈ నీరాణి పూర్వము విదిశాదేశ నగరపు వైశ్యుడు హరిదత్తుని దాసి, నీభార్య, నీవా హరిదత్తుని సేవకుడవగు శూద్రుడవు.

స వైశ్వోశ్వయుజే మాసి ద్వాదశ్యాం నియతః స్థితః,

స్వయం విష్ణ్వాలయం గత్వా పుష్పధూపాదిభి ర్హరిమ్‌. 20

అభ్యర్చ్య స్వగృహం ప్రాయాద్‌ భవన్తౌ రక్షపాలకే,

స్థాప్య ద్వానపి దీపానాం జ్వలనార్థం మహామతే. 21

ఓ మహామతీ! ఆ కోమటి అశ్వయుజ మాస ద్వాదశినాడు నియమమునందుండి స్వయముగా విష్ణుని ఆలయమున కరిగి పుష్పములతో, ధూపాదులతో హరిని అభ్యర్చించి రక్షపాలకులరగు మీ యిరువురను దీపములను వెలిగించుటకై నియోగించి తన యింటి కరిగెను.

గతే వైశ్యే భవన్తౌథ దీపాన్‌ ప్రజ్వాల్య సంస్థితౌ,

యావత్‌ ప్రభాతా రనీ నిశా మేకాం నరోత్తమ. 22

వైశ్యు డట్లరుగగా మీరిరువురు దీపములను వెలిగించి తెల్లవారువరకు రాత్రియంతయు మేల్కొని యట్లే యుండితిరి.

తతః కాలే మృతౌ తౌ తు ఉభౌ ద్వావపి దంపతీ,

తేన పుణ్యన తే జన్మ ప్రియవ్రత గృహే భవత్‌. 23

తరువాత కాలము గడువగా ఆ దంపతులగు మీరిరువురు మరణించితిరి. ఆ పుణ్యముచేత నీకు ప్రియవ్రతుని గృహమున పుట్టుక కలిగినది.

ఇయం తు పత్నీ తే జాతా పురా వైశ్యస్య దాసికా,

పారక్యస్యాపి దీపస్య జ్వలితస్య హరే ర్గృహే. 24

తనది కాకపోయినను హరి ఆలయమున దీపమును వెలిగించు పుణ్యము చేత ఆ వైశ్యుని దాసి యగు ఈమె నీకు పత్ని అయినది.

యః పునః స్వేన విత్తేన విష్ణో రగ్రే ప్రదీపకమ్‌,

జ్వాలయేత్‌ తస్యయత్పుణ్యం తత్సంఖ్యాతుం న శక్యతే.

ఇక తన సొమ్ముతో విష్ణుని ముందు పెద్ద దీపము వెలిగించిన వాని పుణ్యమెట్టిదో లెక్కించుట సాధ్యము కాదు.

తేన సాధో హరే సాధు ఇత్యుక్తం వచనం మయా. 25

అందుచేత హరీ సాధు సాధు అని నేనంటిని.

కృతే సంవత్సరే భక్తిం హరేః కృత్వా విచక్షణః,

సంత్సరార్థం త్రేతాయాం సమమేత న్న సంశయః. 26

వివేకవంతుడు కృతయుగమున ఒక్క ఏడును, త్రేతాయుగమున ఆరు మాసములును హరికి భక్తి చేయుటతో ఇది సమానము. సంశయము లేదు.

త్రిమాసే ద్వాపరే భక్త్యా పూజయన్‌ లభ##తే ఫలమ్‌,

నమో నారాయణాయేత్యుక్త్వా కలౌ తు లభ##తే ఫలమ్‌,

తేనమృష్టం జగద్‌ విష్ణో ర్భక్తి మాత్రం మయేరితమ్‌. 27

మూడు నెలలు ద్వాపరమున భక్తితో పూజించిన ఫలము, కలియందు ''నమో నారాయణాయ'' అనుటతో లభించును. అందుచేత విష్ణునియందలి భక్తితో జగత్తు కొల్లగొట్టబడినది అని నేను పలికితిని.

పారక్య దీపస్యోత్కర్షాద్‌ వై దేవాగ్రే ఫల మీదృశమ్‌,

ప్రాప్తం ఫలం త్వయా రాజన్‌ ఫల మేతన్మయేరితమ్‌,

అహో మూఢా నజానన్తి హరే ర్దీపక్రియా ఫలమ్‌. 28

దేవుని ముందు ఇతరుల దీపమును వెలిగించుటవలన, రాజా! ఇట్టి ఫలమును నీవు పొందితిని. కనుక హరికి దీపము పెట్టు ఫలమును మూఢు లెరుగ కున్నారని నేనంటిని.

ఏవం విధం ద్విజా యేచ రాజానో యేచ భక్తితః,

యజన్తే వివిదై ర్యజ్ఞై స్తేన తే సాధవః స్మృతాః. 29

ఈవిధముగా ఏ బ్రాహ్మణులు, రాజులు భక్తితో వివిధ ములగు యజ్ఞముల చేత కొలుతురో వారిని సాధువులుగా లోకము సంభావించును.

అహం తమేవ ముక్త్వాన్యం న పశ్యామి మహీతలే,

తేన సాధో అగస్త్యేతి, మయా చాత్మా ప్రశంసితః,

హర్షేణ మహతా రాజన్‌ వ్యాక్షిప్తేన మయేరితమ్‌. 30

నేను ఆ హరిని విడచి యితరుని ఈ భూమండలమున చూడను అందుచేత 'అగస్త్యా ధన్యుడవు' అని నన్ను నేను గొప్ప ఆనందపు పొంగుతో ఎగిరి గంతులు వైచుచు కొనియాడు కొంటిని.

సాస్త్రీధన్యా సశూద్రస్తు తథా ధన్యతరో మతః,

భర్తుః శుశ్రూషణం కృత్వా త్పరోక్షే హరే రితి. 31

ఆ యింతి ధన్యురాలు. ఆ శూద్రులు ఇంకను ధన్యుడు. ఏలయన ప్రభువు సేవ చేయుచు ఆతని పరోక్షమున హరి పూజ కావించెను.

సాస్త్రీధన్యా తథా శూద్రో ద్వితశుశ్రూషణ రతః,

తదనుజ్ఞయా హరేర్భక్తిః స్త్రీ శూద్ర స్తేన సాధ్వితి. 32

ఆ స్త్రీ ధన్య. అట్లే ఆశూద్రుడును, ద్విజుల సేవ యందు మిక్కిలి ప్రీతి కలవాడు కనుక, మరింత ధన్యుడు. వారి అనుమతితో హరి యెడల భక్తని చేసిరి. కావున ఆ స్త్రీని ఆ శూద్రుని గురించి మేలు మేలంటిని.

ఆసురం భావమాస్థాయ ప్రహ్లాదః పురుషోత్తమమ్‌,

ముక్త్యా చాన్యం న జానాతి తేనాసౌ సాధు రుచ్యతే. 33

రాక్షస భావమును పొందియు ప్రహ్లాదడు పురుషోత్తముని కాక ఇతరుని ఎరుగ కుండెను. అందుకై 'ప్రహ్లాదుడెంత సాధువు' అంటిని.

ప్రజాపతి కులే భూత్వా బాల ఏవ వనం గతః,

ఆరాధ్య విష్ణుం ప్రాప్తం తత్‌ స్థానం పరమశోభనమ్‌,

తేన సాధో ధ్రువేత్యేవం మయోక్తం రాజసత్తమ. 34

ప్రజాపతికులమున పుట్టి పిన్నవయసు నందే అడవి కరిగెను. విష్ణువు నారాధించి పరమ శోభనమైన పదమును అందెను. అందువలన ఆధ్రువుని మహిమను నేను కొనియాడితిని.

ఇతి రాజా వచః శ్రుత్వా అగస్త్యస్య మహాత్మనః,

అల్పోపదేశం రాజాసౌ పప్రచ్ఛ మునిపుంగవమ్‌. 35

ఇట్లు మహాత్ముడగు అగస్త్యుని మాట విని రాజు ముని పుంగవుడగు నతనిని ఒక చిన్న ఉపదేశమును గూర్చి అడిగెను.

అగస్త్యశ్చ మహాభాగః కార్తిక్యాం పుష్కరం వ్రజన్‌,

గతే గస్త్యే ప్రగచ్ఛన్‌ వై భద్రాశ్వస్య నివేశనమ్‌. 36

పృష్టశ్చరాజ్ఞా తామేవ ద్వాదశీం ముని సత్తమః.

మహానుభావుడగు అగస్త్యుడును కార్తీకమాసమున పుష్కరమున కరుగుచు భద్రాశ్వుని యింటి కిరిగినపుడు ఆతడు తనకే దైన చిన్న ఉపదేశము చేయుమని అడిగెను. ఆ ముని వరుడను రాజునకు ఆ ద్వాదశీ వ్రతమును గూర్చి చెప్పెను.

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లనెను.

ఇదమేవ మయా తుభ్యం కథితం తే తపోధన. 37

కథయిత్వా పునర్వాక్య మగస్త్యో నృపసత్తమమ్‌.

నేను నీకు చెప్పిన దీనినే ఆ మునిపుంగవుడును ఆ రాజున కెరిగించెను. చెప్పి మరల ఆ అగస్త్యుడు ఆ రాజసత్తమునితో ఇట్లనెను.

ఉవాచ పుష్కరం యామి పున రేష్యామి తే గృహమ్‌,

ఏవ ముక్త్వా జగామాశు సద్యోదర్శనతాం మునిః. 38

నేను పుష్కరమున కరుగు చున్నాను. మరల నీయింటికి వత్తును. అని పలికి ఆ మహర్షి అక్కడికక్కడ అదృశ్యుడాయెను.

రాజాపి తేన విధినా పద్మనాభస్య ద్వాదశీమ్‌,

ఉషోష్య పరమం కామ మిహజన్మని చాప్తవాన్‌. 39

రాజును, ఆ విధానముతో పద్మనాభ ద్వాదశి నాడు ఉపవాసముండి ఈ జన్మమున కోరిన కోర్కెలన్నిటిని పొందెను.

సపత్నీకో నృపవరో ద్వాదశీం సముపోష్య చ,

ఇహ జన్మని రాజాసౌ పుత్ర పౌత్రాంస్తథాప్తవాన్‌. 40

భార్యలతో కూడిన ఆ రాజును ఆ విధముగా ద్వాదశినాడు ఉపవాసముండి ఈ జన్మమున పుత్రులను, పౌత్రులను పొందెను.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకోనపంచాశోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది తొమ్మిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters