Varahamahapuranam-1    Chapters   

అష్టచత్వారింశోధ్యాయః - నలుబది యెనిమిదివ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసుడిట్లు చెప్పెను.

తద్వద్‌ భాద్రపదే మాసి శుక్లపక్షే తు ద్వాదశీమ్‌,

సంకల్ప్య విధినా దేవ మర్చయేత్‌ పరమేశ్వరమ్‌. 1

అదే విధముగా భాద్రపదమాసము శుక్లపక్షమున ద్వాదశినాడును సంకల్పము చేసికొని విధి పూర్వకముగా పరమేశ్వరుని అర్చింప వలయును.

నమోస్తు కల్కినే పాదౌ హృషీకేశాయ వై కటిమ్‌,

వ్లుెచ్ఛవిధ్వంసనాయేతి జగన్మూర్తే తథోదరమ్‌. 2

శితికంఠాయ కంఠం తు ఖడ్గపాణతి వై భుఔ,

చతుర్భుజాయేతి హస్తౌ విశ్వమూర్తే తథాశిరః. 3

'ఓనమః కల్కినే' అని పాదములను, 'నమోహృషీకేశాయ' అని నడుమును, 'నమో వ్లుెచ్ఛవిధ్వంసనాయ జగన్మూర్తయే' అని ఉదరమును, 'నమఃశితికంఠాయ' అని కంఠమును, 'నమః ఖడ్గపాణయే' అని భుజములను, 'నమశ్చతుర్భుజాయ' అని హస్తములను, 'నమో విశ్వమూర్తయే' అని శిరస్సును పూజింప వలయును.

ఏవమభ్యర్చ్య మేధావీ ప్రాగ్వత్‌ తస్యాగ్రతో ఘటమ్‌,

విన్యసేత్‌ కల్కినం దేవం సౌవర్ణం తత్ర కారయేత్‌. 4

మేధావి యగు నరుడు ఇట్లు కొలిచి మనుపటివలెనే ఆ దేవుని ముందు ఘటమును నిలుప వలయును. అందు బంగారు కల్కి ప్రతిమను ఉంచవలయును.

సితవస్తయుగచ్ఛన్నం గన్థపుష్పోపశోభితమ్‌,

కృత్వా ప్రభాతే విప్రాయ ప్రదేయం శాస్త్రవిత్తమే,

ఏవం కృతే భ##వేద్‌ యస్తు తన్నిబోధ మహామునే. 5

తెల్లని రెండు వస్త్రములతో దానిని కప్పి గంధములతో, పూవులతో అలరారునట్లు చేయ వలయును. మరుసటి దినము సూర్యోదయ కాలమున చక్కగా శాస్త్రములు అధ్యయనము చేసిన విప్రునకు దాన మీయవలయును. ఇట్లు చేసినచో నేమగునో చెప్పెదను వినుము.

పూర్వం రాజా విశాలోభూత్‌ కాశ్యాంపుర్యాం మహాబలః,

గోత్రజై ర్హృతరాజ్యోసౌ గన్ధమాదన మావిశత్‌. 6

పూర్వము కాశీపురమున విశాలుడను రాజుండెను. జ్ఞాతు లతనిరాజ్యము నపహరింపగా అతడు గంధమాదన పర్వతమును ప్రవేశించెను.

తస్య ద్రోణ్యాం మహారాజ బదరీం ప్రాప్య శోభనామ్‌,

హృతరాజ్యో విశేషేణ గతశ్రీకో నరోత్తమః. 7

ఆపర్వతము లోయలో బదరియను అందమైన ప్రదేశమున రాజ్యము, సంపద కోల్పోయిన ఆ రాజు నివసించెను.

కదాచి దాగతౌ తత్ర పురాణా వృషి సత్తమౌ,

నరనారాయణౌ దేవౌ సర్వదేవ నమస్కృతౌ. 8

పురాణులు, సర్వదేవతల మ్రొక్కులు కొనువారు, ఋషి శ్రేష్ఠులు నగు నరనారాయణులు ఒకనాడు అక్కడకు విచ్చేసిరి.

తౌ దృష్ట్వా తత్ర రాజానం పూర్వాగత మరిందమౌ,

ధ్యాయన్తం పరమం బ్రహ్మ విష్ణ్వాఖ్యం పరమం పదమ్‌. 9

అంతకు ముందే అచటకు వచ్చి, పరబ్రహ్మ స్వరూపము, పరంధామము అగు విష్ణునామక తత్త్వమును ధ్యానించుచున్న రాజును వారు చూచిరి.

తౌ ప్రీతా వూచతు స్తం తు రాఆనం క్షీణకల్మషమ్‌,

వరం వృణీష్వ రాజేన్ద్ర వరదౌ స్వస్తవాగతౌ. 10

నశించిన పాపములు గల ఆ రాఉను చూచి వారు ప్రీతులై రాజేంద్రా! మేము వరముల నిచ్చుటకై వచ్చితిమి. వరము కోరుకొనుమని పలికిరి.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

భవన్తౌ కౌ నజానామి కస్య గృహ్ణామ్యహం వరమ్‌,

ఆరాధయామి యత్‌ తస్మాద్‌ వరమిచ్ఛామి శోభనమ్‌. 11

మీరెవరో నేనెఱుగను. ఎవరి వరమును గ్రహింతురు? నేను దేని నారాధించుచున్నానో దాని నుండి మంచి వరము కోరుదును.

ఏవ ముక్తౌ తు తౌ రాజ్ఞా కమారాధయసే ప్రభో,

కం వావరం వృణుష్వత్వం కథయస్వ కుతూహలాత్‌. 12

అతడట్లు పలుకగా వారు రాజా! నీవెనని నారాధించుచున్నావు. ఎవనిని వరము వేడుచున్నావు? తెలియ వేడుకయైనది. చెప్పుము అనిరి.

ఏవ ముక్త స్తతో రాజా విష్ణు మారాధయామ్యహమ్‌,

కథయిత్వా స్థిత స్తూష్ణీం తత స్తా వూచతుః పునః. 13

వారట్లనగా రాజు 'నేను విష్ణువు నారాధించుచున్నాను' అని పలికి ఊరకుండెను. వారు మరల నిట్లనిరి.

రాజన్‌ తసై#్యవ దేవస్య ప్రసాదా దావయో ర్వరః,

దాతవ్యస్తే వరం బ్రూహి కస్తే మనసి వర్తతే. 14

రాజా! మేమాదేవుని ప్రసాదమువలననే వరము నిచ్చుచున్నాము. నీ వరమును గూర్చి చెప్పుము. నీ మనసున నేమి కలదు?

రాజోవాచ - రాజిట్లనెను.

యథా యజ్ఞేశ్వరం దేవం యజ్ఞై ర్వివిధదక్షిణౖః,

యష్టుం సమర్థతా మే స్యాత్‌ తథా మే దదతం వరమ్‌. 15

నాకు యజ్ఞేశ్వరుడగు దేవుని పెక్కు విధములగు దక్షిణలు గల యజ్ఞములతో పూజించు సమర్థత కలుగునట్లుగా వరమొసగుడు.

నర ఉవాచ - నరుడిట్లనెను.

స్వయం నారాయణో దేవో లోకమార్గ ప్రదర్శకః,

మయా సహ తపః కుర్యాద్‌ బదర్యాం లోకభావనః. 16

లోకులకు దారి చూపు దేవుడు నారాయణుడు స్వయముగా నాతోపాటు లోకములమేలును కాంక్షించి బదరీవనమునందు తపస్సు చేయుచుండును.

అయం మత్స్యోభవత్‌ పూర్వం పునః కూర్మ స్వరూపవాన్‌,

వరాహశ్చాభవద్‌ దేవో నరసింహ స్తతోభవత్‌. 17

వామనస్తు తతో జాతో జామదగ్న్యో మహాబలః,

పునర్దాశరథి ర్భూత్వా వాసుదేవః పునర్బభౌ. 18

ఇతడు మొదట మత్స్యమాయెను. తరువాత తాబేటి రూపు తాల్చెను. పిదప వరాహ మాయెను. అటుపై నరసింహు డాయెను. వామనుడు, పరశురాముడు, రాముడు, కృష్ణుడు అను అవతారముల నెత్తెను.

బుద్ధో భూత్వా నం హ్యేష మోహయామాస పార్థివ,

సపత్నాన్‌ దస్యవో వ్లుెచ్ఛాన్‌ పున ర్హత్వా మహీ మిమామ్‌,

ప్రకృతిస్థాం చకారాయం స ఏష భగవాన్‌ హరిః. 19

ఈతడు బుద్ధుడై జనులను మోహ పెట్టెను. పగవారగు వ్లుెచ్ఛులను, దొంగలను మరల రూపుమాపి ఈ భూమిని స్వస్థురాలిని గావించెను. ఆ భగవాను డితడే హరి.

పూజ్యతే మత్స్యరూపేణ సర్వజ్ఞత్వ మభీప్సుభిః,

స్వవంశోద్ధారణార్థాయ కూర్మరూపీ తు పూజ్యతే. 20

సమస్త జ్ఞానమును పొందగోరువారు మత్స్య రూపుడగు హరిని పూజింప వలయును. తన వంశమును ఉద్ధరించు కొనుటకు కూర్మరూపుడగు దేవు నర్చింప వలయును.

భవోదధి నిమగ్‌ఏన వారాహః పూజ్యతే హరిః,

నారసింహేణ రూపేణ తద్వ త్పాపభయా న్నరైః. 2

సంసార సముద్రమున మునిగినవాడు వరాహ రూపుడగు హరి నర్చింపవలయును. పాపభయము కల నరులు నరసింహ రూపమును పూజింప వలయును.

వామనం మోహనాశాయ విత్తార్థే జమదగ్నిజమ్‌,

క్రూరశత్రువినాశాయ యజేద్‌ దాశరథిం బుధః. 22

మోహము నశించుటకు వామనుని, ధనము కొరకు పరశురాముని, క్రూరులగు శత్రువుల వినాశము కొరకు దశరథ రాముని కొలువ వలయును.

బలకృష్ణౌ యజేద్‌ ధీమాన్‌ పుత్రాకామో న సంశయః,

రూపకామో యజేద్‌ బుద్ధం కల్కినం శత్రుఘాతనే. 23

కొడుకులను కోరు ధీశాలి బలరామకృష్ణుల నర్చింప వలయును. రూపమును కోరువాడు బుద్ధుని, శత్రువులను రూపుమాప గోరువాడు కల్కిని అర్చింప వలయును.

ఏవ ముక్త్వా నరస్తస్య ఇమా మేవాబ్రవీన్మునిః,

ద్వాదశీ కృతవాన్‌ సోపి చక్రవర్తీ బభూవ హ,

తసై#్యవ నామ్నా బదరీ విశాలాఖ్యా భవన్మునే. 24

ఇట్లు పలికి ఆ నరమహర్షి ఆతనికి ఈ ద్వాదశీవ్రతమును గూర్చియే తెలియజేసెను. ఆతడును అది కావించి చక్రవర్తి యాయెను. ఆతని పేరు మీదుగనే బదరి 'విశాల' అను పేరు పొందెను.

ఇహ జన్మని రాజాసౌ రాజ్యంకృత్వా ఇయాద్‌ వనమ్‌,

యజ్ఞైశ్చ వివిధై రిష్ట్వా పరం నిర్వాణ మాప్తవాన్‌. 25

ఆతడు ఇహజన్మమున రాజై తుదికి అడవి కేగెను. అచట పెక్కు విధములగు యజ్ఞము లాచరించి తుదికి నిర్వాణమును పొందెను.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే అష్టచత్వారింశోధ్యాయః.

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది యెనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters