Varahamahapuranam-1    Chapters   

సప్తచత్వారింశోధ్యాయః - నులుబది యేడవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

శ్రావణస్య తు మాసస్య శుక్లపక్షే తు ద్వాదశీ,

అర్చయేత్‌ పరమం దేవం గన్ధ పుషై#్ప ర్జనార్దనమ్‌. 1

శ్రావణ శుద్ధ ద్వాదశినాడు జనార్దనుడను పరమ దైవమును కొలువ వలయును.

దామోదరాయ పాదౌతు హృషీకేశాయ వై కటిమ్‌,

సనాతనేతి జఠర మురః శ్రీవత్స ధారిణ. 2

చక్రపాణయేతి భుజౌ కంఠంచ హరయే తథా,

ముఞ్జకేశాయ చ శిరో భద్రాయేతి శిఖాం తథా. 3

'ఓంనమో దామోదరాయ' అని పాదములను, 'నమో హృషీకేశాయ' అని నడుమును, 'నమస్సనాతనాయ' అని కడుపును, 'నమః శ్రీవత్సధారిణ' అని వక్షస్సును, 'నమశ్చక్రపాణయే' అని భుజములను, 'నమో హరయే' అని కంఠమును, 'నమో ముంజకేశాయ' అని శిరస్సును 'నమో భద్రాయ' అని శిఖను పూజింప వలయును.

ఏవం సంపూజ్య సంస్థాప్య కుంభం పూర్వవదేవ తు,

విన్యస్య వస్త్ర యుగ్మంతు తస్యోపరి తతో న్యసేత్‌. 4

కాంచనం దేవదేవంతు దామోదర సనామకమ్‌,

తమభ్యర్చ్య విధానేన గంధపుష్పాదిభిః క్రమాత్‌. 5

ఇట్లు సమర్చించి మునుపటి వలెనే కుంభమును పెట్ట వలయును. వస్త్రముల జంటను ఉంచి దానిపై దామోదర నామము గల దేవదేవుని బంగారు ప్రతిమను నిలుప వలయును. ఆ దేవుని చక్కగా గంధపుష్పాదులతో విధి ననుసరించి క్రమముగా పూజింప వలయును.

ప్రాగ్వత్‌ తం బ్రాహ్మణ దద్యాద్‌ వేదవేదాంగ పారగే,

ఏవం నియమ యుక్తస్య ప్రభావం తచ్ఛృణుష్వ మే. 6

వెనుకటి వలెనే ఆ ప్రతిమను వేద వేదాంగములను తుదముట్ట నధ్యయనము చేసిన బ్రాహ్మణున కొసగ వలయును. ఇట్లు నియమము పాటించిన వాడు పొందు ప్రభావమును నా వలన వినుము.

ఏష తే విధి రుద్దిష్టః శ్రావణ మాసి వై విభో,

ఏతస్యాశ్చ ప్రభావం యత్‌ శృణు పాప ప్రణాశనమ్‌. 7

శ్రావణమాసము నందు చేయవలసిన విధానమును చెప్పితిని. ఆ ద్వాదశీ వ్రత ప్రభావమును, పాపమును రూపుమాపు దానిని తెలిపెదను. వినుము.

పురా కృతయుగే రాజా నృగో నామ మహాబలః,

బభ్రామ స వనం గోరం మృగయాసక్త మానసః. 8

పూర్వము కృతయుగమున నృగుడను మహాబలము గల రాజుండెను. ఆతడొకప్పుడు వేటయందు తగుల్కొన్న మనసుతో ఘోరమగు అడవిలో తిరుగాడెను.

స కదాచిత్తురంగేణ హృతో దూరం మహద్వనమ్‌,

వ్యాఘ్ర సింహ గజాకీర్ణం దస్యు సర్ప నిషేవితమ్‌. 9

అతడొక సమయమున గుఱ్ఱము గుంజుకొని పోవగా పెద్ద పులులు, సింహములు, ఏనుగులు, మొదలగు వానితో నిండిన పెద్ద అడవికి పోయెను.

ఏకాకీ తత్ర రాజా తు అశ్వం ముచ్య తరోరథః,

స్వయం కుశ మథ్యాస్తీర్య సుప్తో దుఃఖ సమన్వితః. 10

ఒంటరియగు ఆ రాజు అచట గుఱ్ఱమును వదలి ఒక చెట్టు నీడను దర్భలు పరచుకొని దుఃఖముతో నిద్రించెను.

తావత్‌ తత్రైవ లుబ్ధానాం సహస్రాణి చతుర్దశ,

ఆగతాని మృగాన్‌ హన్తుం రాత్రౌ రాఙ్ఞః సమన్తతః. 11

ఆ రాత్రి పదునాలుగు వేలమంది బోయవాండ్రు మృగములను చంపుటకై అచటికి వచ్చి రాజు చుట్టును చేరిరి.

తత్రా పశ్యన్త తే సుప్తం హేమరత్న విభూషితమ్‌,

నృగం రాజాన మత్యుగ్రం శ్రియా పరమయా యుతమ్‌. 12

అచట వారు బంగారు నగల అలంకారములు గలవాడును, మిక్కిలి తీవ్రముగా నున్నవాడును, గొప్ప తేజస్సుతో వెలిగి పోవుకున్నవాడును నిద్రించు చున్నవాడును అగు ఆ నృగమహారాజును గాంచిరి.

తే గత్వా త్వరితం వ్యాధాః స్వభ##ర్త్రే సంన్యవేదయన్‌,

సో పి రత్న సువర్ణార్థం రాజానం హన్తు ముద్యతః. 13

వారును త్వరత్వరగా పోయి తమ ప్రభువునకు నివేదించిరి. అతడును రత్నములు, బంగారము కొల్లగొట్టుటకై ఆతనిని చంప బోయెను.

తురగస్య తు హేతోస్తు నిస్త్రింశా వనచారిణః,

రాజానం సుప్త మాసాద్య నిగృహీతుం ప్రచక్రముః. 14

గుఱ్ఱమును కూడ వశపరచుకొనుటకై ఆ ఆటవికులు నిద్రించుచున్న రాజును చేరుకొని పట్టుకొనుటకు ప్రయత్నించిరి.

తావద్‌ రాజా శరీరాత్‌ తు శ్వేతాభరణ భూషితా,

నారీ కాచిత్‌ సముత్తస్థౌ స్రక్చందన విభూషితా,

ఉత్థాయ చక్రమాదాయ తేవ్లుెచ్ఛా వినిపాతితాః. 15

ఇంతలో ఆ రాజు శరీరము నుండి తెల్లని ఆభరణములు, మాలలు, చందనములు తాల్చిన ఒక నారి వెలువడెను. ఆమె లేచి చక్రమును గొని ఆవ్లుెచ్ఛుల నందురిని కూలవైచెను.

దస్యూన్‌ నిహత్యసా దేవీ తస్య రాజ్ఞ స్తనుం పునః,

ప్రవిశన్త్యాశు రాజాపి ప్రతిబుద్ధోథ దృష్టవాన్‌,

వ్లుెచ్ఛాంస్తు నిహతాన్‌ దృష్ట్వా సా స్వమూర్తి లయం గతా. 16

ఆదేవి ఆ దొంగమూకలను చంపి మరల ఆ రాజు దేహము లోనికి ప్రవేశించెను. రాజంత మేల్కొని చచ్చిపడిన వ్లుెచ్ఛులను, తన దేహములో కలసి పోయిన ఆ నారిని కాంచెను.

అశ్వ మారుహ్య స పున ర్వామ దేవాశ్రమం య¸°,

తత్రాపృచ్ఛద్‌ ఋషిం భక్త్యా కాస్త్రీ కే తే నిపాతితాః,

ఏతత్‌ కార్య మృషే మహ్యం కథయస్వ ప్రసీద మే. 17

గుఱ్ఱమెక్కి ఆ రాజు వామదేవుని ఆశ్రమమున కరిగెను. అచట భక్తితో ఆ మహర్షిన స్వామీ! ఆమె ఎవరు? ఆ చచ్చిన వారెవరు? దీనిని నాకు తెలుపుము. ప్రసన్నుడ వగుము - అని అడిగెను.

వామదేవ ఉవాచ - వామదేవు డిట్లు పలికెను.

త్వమాసీ చ్ఛూద్ర జాతీయ అన్యజన్మని పార్థివ,

తత్ర త్వయా బ్రాహ్మణస్య ప్రేషణం కుర్వతా శ్రుతా,

శ్రావణస్యతు మాసస్య శుక్లపక్షేతు ద్వాదశీ. 18

రాజా! నీవు పూర్వజన్మమున శూద్రజాతివాడవు. ఒక బ్రాహ్మణుడు శ్రావణమాస శుక్ల పక్ష ద్వాదశినాటి వ్రతమును ఉపదేశించు చుండగా వింటివి.

స విధానాత్‌ త్వయా రాజన్‌ భక్త్యా వై సముపోషితా,

ఉపోషితాయాం తస్యాంతు రాజ్యం లబ్ధం త్వయానఘ. 19

విధిపూర్వకముగా నీవు భక్తితో ఆ తిథినాడు ఉపవాస ముంటివి. దాని వలన నీకు రాజ్యము లభించినది.

సర్వాపత్సు చ సా దేవీ భవన్తం పరిరక్షతి,

యయా వినిహతాః క్రూరా వ్లుెచ్ఛాః పాపసమన్వితాః,

భవాంశ్చ రక్షితో రాజన్‌ శ్రావణ ద్వాదశీ తు సా. 20

ఆ దేవి అన్ని ఆపదల యందును నిన్ను రక్షించుచున్నది. ఆ పాపాత్ములు, క్రూరులు అగు వ్లుెచ్ఛులను సంహరించినది ఆమెయే. నిన్ను రక్షించిన ఆమె శ్రావణ శుద్ధ ద్వాదశి.

ఏకైవ పాతి చాపత్సు రాజ్య మేకైవ యచ్ఛతి,

కిం పున ర్ద్వాదశైతాస్తు యేనైంద్రం న దదుఃపదమ్‌. 21

ఒక్కతెయే ఆపదలయందు రక్షించును. ఒక్కతెయే సామ్రాజ్యము నిచ్చును. ఇంక ఈ పండ్రెండు ద్వాదశుల సంగతి చెప్పనేల? వారు ఇంద్ర పదవిని కూడ ఈయరని చెప్పుటకు లేదు.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే సప్తచత్వారింశోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది యేడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters