Varahamahapuranam-1    Chapters   

త్రయశ్చరింశో7ధ్యాయః - నలుబది మూడవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

ఏవ మేవ మునే మాసి చైత్రే సంకల్ప్య ద్వాదశీమ్‌,

ఉపోష్యారాధయేత్‌ పశ్చాత్‌ దేవదేవం జనార్దనమ్‌. 1

మునీ! ఇట్లే చైత్రమాసమునను సంకల్పము చేసికొని దేవ దేవుడగు జనార్ధనుని ఆరాధింప వలయును.

వామనాయేతి పాదౌతు విష్ణవే కటి మర్చయేత్‌,

వాసుదేవేతి జఠర మురః సంపూర్ణకాయచ. 2

కంఠం విశ్వకృతే పూజ్య శిరో వై వ్యోమరూపిణ,

బాహూ విశ్వజితే పూజ్య స్వనామ్మా శంఖచక్రకే. 3

ఓం నమో వామనాయ అని పాదములను, విష్ణవేనమః అని నడుమును, వాసుదేవాయనమః అని గర్భమును, సంపూర్ణకాయనమః, అని రొమ్మును, విశ్వకృతే నమః అని కంఠమును, వ్యోమరూపిణ నమః అని శిరస్సును, విశ్వజితే నమః అని బాహువులను, వాని పేరులతో అనగా పాంచజన్యాయ నమః అని శంఖమును, సుదర్శనాయనమః అని చక్రమును పూజింపవలయును.

అనేన విధినాభ్యర్చ్య దేవదేవం సనాతనమ్‌,

ప్రాగ్వదేవోత్తరం కుంభం సయుగ్మం పురతో న్యసేత్‌. 4

ఈ పద్ధతితోడనే సనాతనుడగు దేవదేవుని అర్చించి మునుపటి వలెనే ఉత్తరదిక్కున రెండు వస్త్రములతో కుంభమును దేవునిముందు ఉంచవలయును.

ప్రాగుక్త పాత్రే సంస్థాప్య వామనం కాంచనం బుధః,

యథాశక్త్యా కృతం హ్రస్వం సితయజ్ఞోపవీతినమ్‌. 5

మునుపు చెప్పిన రాగిపాత్రయందు బంగారముతో వామనుని ప్రతిమను శక్తిమేరకు చేయించి తెల్లని జన్నిదము కల ఆ పొట్టి రూపును నిలుపవలయును.

కుండికాత్‌ స్థాపయేత్‌ పార్శ్వే ఛత్రికాం పాదుకే తథా,

అక్షమాలాం చ సంస్థాప్య బృసికాం చ విశేషతః, 6

ప్రక్కభాగమున కమండలువును, గొడుగును, పాదుకలను, జపమాలను, దర్భాసనమును ఉంచవలయును.

ఏతైరుపసై#్ర ర్యుక్తం ప్రభాతే స ద్విజాతయే,

దాపయేత్‌ ప్రీయతాం విష్ణు ర్హ్రస్వరూపీత్యుదీరయేత్‌. 7

ఈ పరికరములతో కూడిన వామనమూర్తిని తెల్లవారిన పిదప బ్రాహ్మణునకు గుజ్జురూపువిష్ణువు ప్రీతి నందుగాక అని పలుకుచు దాన మీయవలయును.

మాసనామ్నా తు సంయుక్తం ప్రాదుర్భావ విధానకమ్‌,

ప్రీయతా మితి సర్వత్ర విధి రేష ప్రకీర్తితః. 8

నెలపేరు కలియునట్లుగా వామనుని అవతారమును భావించుచు ప్రీతినొందు గాక అని చెప్పుచుండవలయును. ఇది అన్ని యెడల విధానము.

శ్రూయతే చ పురా రాజా హర్యశ్వః పృథివీపతిః,

అపుత్రః స తప స్తేపే పుత్ర మిచ్ఛం స్తపోధనమ్‌. 9

పూర్వము హర్యశ్వు డనురాజు వినవచ్చును. అతడు సంతానము లేనివాడు. గొప్ప తపస్సంపద గల కుమారుని కోరుచు తపస్సు చేసెను.

తసై#్యవ కుర్వతో వ్యుష్టిం పుత్రార్థే మునిసత్తమ,

ఆజగామ హరిః పూర్వం ద్విజరూపం సమాశ్రితః. 10

ఇట్లు పుత్రుని కొరకు తపస్సు చేయుచుండగా విష్ణువు బ్రాహ్మణ రూపమును దాల్చి ఆతని కడకు వచ్చెను.

ఉవాచ తపసా రాజన్‌ కింతే వ్యవసితం ప్రభో,

పుత్రార్థ మితి ప్రోవాచ తం విప్రః ప్రత్యువాచ హ. 11

రాజా! తపస్సు చేత నీవు కోరున దేమి? అని అడిగెను. పుత్రుల కొరకు తపస్సు అని అతడు బదులు చెప్పెను. అంత నా రాజునకు నా బ్రాహ్మణుడిట్లు బదులు పలికెను.

ఇద మేవ విధానం తు కురు రాజ న్నువాచ హ,

ఏవ ముక్త్వాతు రాజానం క్షణాదన్తర్హితః ప్రభుః. 12

రాజా! ఈ ద్వాదశీవ్రత విధానమునే ఆచరింపుము. అని ఆ ప్రభువు క్షణములో అదృశ్యుడాయెను.

రాజా7పి తం చకారాశు మంత్రవంతం ద్విజాతయే,

దరిద్రాయ తథా ప్రాదాత్‌ జ్యోతిర్గార్గాయధీమతే. 13

రాజును ఆ వ్రతమును మంత్ర సహితముగా వెంటనే ఆచరించెను. దరిద్రుడు, బుద్ధిమంతుడునగు జ్యోతిర్గార్గుడను బ్రాహ్మణునకు ఆ వామనమూర్తిని దానమొసగెను.

యథాతిదే రపుత్రాయాః స్వయం పుత్రత్వ మాగతః,

భగవం స్తేన సత్యేన మమాప్యస్తు సుతో వరః. 14

సంతానము లేని అదితికి స్వయముగా కొడుకై జన్మించితివి. అట్లే భగవంతుడా! నాకును ఆ సత్యము తోడనే శ్రేష్ఠుడగు పుత్రుడు కలుగుగాక!

అనేన విధినా దత్తే తస్య పుత్రో7 భవ న్మునే,

కువలాశ్వ ఇతిఖ్యాత శ్చక్రవర్తీ మహాబలః. 15

ఈ విధితో ఆతడు దానమొసగెను. ఆతనికి, ఓ మునీ, కువలాశ్వుడని పేరొందిన చక్రవర్తి మహాబలుడు పుత్రుడు కలిగెను.

అపుత్రో లభ##తే పుత్ర మధనో లభ##తే దనమ్‌,

భ్రష్ట రాజ్యో లభేద్‌ రాజ్యం మృతో విష్ణుపురం వ్రజేత్‌. 16

సంతానము లేనివాడు పుత్రులను, ధనము లేనివాడు ధనమును, రాజ్యము కోల్పడినవాడు రాజ్యమును, మరణించినవాడు విష్ణుపురమును దీనివలన పొందును.

కీర్తిత్వా సుచిరం తత్ర ఇహ మర్త్య ముపాగతః,

చక్రవర్తీ భ##వేద్‌ ధీమాన్‌ యయాతి రివ నాహుషః 17

అచట బహుకాలము కీర్తినొంది మరల మానవలోకమునకు వచ్చిన ఆ ధీశాలి నహుషుని కుమారుడు యయాతి వలె చక్రవర్తి యగును.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే త్రయశ్చత్వారింశో7ధ్యాయః.

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబదిమూడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters