Varahamahapuranam-1    Chapters   

షట్త్రింశో7ధ్యాయః - ముప్పది యారవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

ఆదిత్రేతాసు రాజానో మణిజా యే ప్రకీర్తితాః,

కథయిష్యామి తాన్‌ రాజన్‌ యత్ర జాతోసి పార్థివ. 1

రాజా! మొదటి త్రేతాయుగమున మణివలన పుట్టిన రాజులుగా ప్రసిద్ధి చెందిన వారిని గూర్చి తెలిపెదను. నీవు ఆ వంశముననే కదా పుట్టితివి!

యో సౌ సుప్రభానామాసీద్‌ సత్వంరాజన్‌ కృతేయుగే,

జాతోసి నామ్నా విఖ్యాతః ప్రజాపాలేతి శోభనః. 2

కృతయుగమున సుప్రభుడను పేరు గల రాజవు నీవే. అట్టి నీవు ప్రజాపాలుడను పేరున ఉత్తముడవై పుట్టితివి.

శేషా స్త్రేతాయుగే రాజన్‌ భవిష్యన్తి మహాబలాః,

యో దీప్త తేజా మణిజః స శ##న్తేతి ప్రకీర్తితః. 3

తక్కిన వారందరు త్రేతాయుగమున గొప్ప బలము గలవారై పుట్టుదురు. మణివలన పుట్టిన దీప్త తేజుడు శంతుడను ఖ్యాతి నొంది జనించును.

సురశ్మి ర్భవితా రాజా శశకర్ణో మహాబలః,

శుభదర్శనః పాఞ్చాలో భవిస్యతో నరాధిపః. 4

సురశ్మియను రాజు శశకర్ణుడను పేరున గొప్ప బలముతో పుట్టును. శుభదర్శనుడను రాజు పాంచాలు డగును.

సుశాన్తి రజ్గ వంశే వై సున్దరో ప్యజ్గ ఇత్యుత,

సున్దశ్చ ముచుకున్దోభూత్‌ సుద్యుమ్న స్తురఏవచ. 5

అంగ వంశమున సుశాంతి సుందరుడై పుట్టెను. సుందుడు ముచుకుందుడయ్యెను. సుద్యుమ్నుడు తురుడై పుట్టెను.

సుమనాః సోమదత్తస్తు శుభః సంవరణోభవత్‌,

సుశీలో వసుదానస్తు సుఖదోసుపతి ర్భవత్‌. 6

సుమనుడు సోమదత్తుడుగను, శుభుడు సంవరణుడుగను, సుశీలుడు వసుదానుడును, సుఖదుడు అసుపతిగను పుట్టిరి.

శంభుః సేనాపతి రభూత్‌ కాన్తో దశరథః స్మృతః,

సోమోభూ జ్జనకో రాజా ఏతే త్రేతాయుగే నృప. 7

శంభుడు సేనాపతి యాయెను. కాంతుడు దశరథు డయ్యెను. సోముడు జనకమహారాజాయెను. త్రేతాయుగమున వీరిట్లు జన్మించిరి.

సర్వే భూమి మిమాం రాజన్‌ భుక్త్వా తే వసుధాధిపాః,

ఇష్ట్వా చ వివిధై ర్యజ్ఞై ర్దివం ప్రాప్యన్త్య సంశయమ్‌. 8

రాజా! ఈ రాజులందరు ఈ భూమి భోగములను పొంది, పెక్కు విధములగు యజ్ఞము లాచరించి స్వర్గమునకు చేరుకొందురు.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవు డిట్లు పలికెను.

ఏవం శ్రుత్వా సరాజర్షి ర్బ్రహ్మ విద్యామృతం ప్రభుః,

ఆఖ్యానం పరమం ప్రీతి స్తప శ్చర్తు మియాద్‌ వనమ్‌. 9

ఇట్లు బ్రహ్మ విద్యయను అమృతము గల అత్యుత్తమమగు కథను విని ఆ రాజర్షి ప్రీతుడై తపస్సు చేయుటకై అడవి కరిగెను.

ఋషి రధ్యాత్మయోగేన విహాయేదం కళేబరమ్‌,

బ్రహ్మభూతో భవద్‌ ధాత్రి హరౌ లయ మవాప చ. 10

భూదేవీ! ఋషియును అధ్యాత్మయోగముచే ఈ దేహమును విడచి బ్రహ్మముగానై హరియందు లీన మయ్యెను.

వృన్దావనం చ రాజాసౌ తపోర్థం గతవాన్‌ ప్రభుః,

తత్ర గోవిన్దనామానం హరిం స్తోతు మథారభత్‌. 11

ఈ రాజు తపస్సుకొఱకు బృందావనమున కరిగెను. అచట గోవిందనామము గల హరిని కొనియాడ దొరకొనెను.

రాజో వాచ - రాజు ఇట్లు పలికెను.

నమామి దేవం జగతాం చ మూర్తిం

గేపేన్ధ్ర మిన్ద్రానుజ మప్రమేయమ్‌,

సంసారచక్ర క్రమణౖకరక్షం

క్షితీధరం దేవవరం నమామి. 12

దేవునకు, జగత్తులకు స్వరూప మైనవానికి, గోపదేవునకు, ఇంద్రుని తమ్మునకు, ఊహింప నలవికాని వానికి, సంసార చక్రమును దాటించుటలో నేర్పు గలవానికి, భూమికి పట్టుగొమ్మ అయినవానికి దేవవరునకు నీకు నమస్కరింతును.

భవోదధౌ దుఃఖశతోర్మిభీమే,

జరావర్తే కృష్ణ పాతాళమూలే

తదన్త మేకో దధతే సుఖం మే

నమోస్తు తే గోపతి రప్రమేయ. 13

ఈ సంసారమొక సముద్రము. ఇది వందలకొలది దుఃఖములనెడు తరంగములతో భయపెట్టుచుండును. ముసలితనమే యిందలి సుడులు. చీకటితో నిండిన పాతాళ##మే దీనికి మూలము. అట్టి దీనిని నాశనము చేయగలవాడవు నీవొక్కడవే. సుఖమును గూర్చువాడవును నీవే. ఓగోపతీ! అప్రమేయా! అట్టి నీకు మ్రొక్కులు.

వ్యాధ్యాదియుక్తైః పురుషై ర్గ్రహైశ్చ

సంఘట్టమానం పునరేవ దేవ,

నమోస్తు తే యుద్ధరతే మహాత్మనే

జనార్దనో పేన్ద్ర సమస్తబన్ధో. 14

దేవా! వ్యాధులతో, గ్రహబాధలతో కూడిన మానవులందరు నిన్ను ఆశ్రయింతురు. ఓ మహాత్మా! జనార్దనా! అట్టి వ్యాధులు మున్నగు వానితో పోరాడుట యందు మిక్కిలి ఆసక్తి కలవాడవు. గోపేంద్రా! సమస్తమునకు చుట్టమైనవాడా! నీకు నమస్కారము.

త్వముత్తమః సర్వవిదాం సురేశ

త్వయా తతం విశ్వమిదం సమస్తమ్‌,

గోపేన్ద్ర మాం పాహి మహానుభావ

భవాద్భీతం తిగ్మరథా జ్గపాణ. 15

సర్వము నెరిగిన వారిలో నీవు శ్రేస్ఠుడవు. దేవదేవా! ఈ విశ్వమంతయు నీతో నిండి యున్నది. గోపేంద్రా! సంసారము వలన భయపడిన నన్ను, వాడియగు చక్రమును చేతదాల్చిన స్వామీ! కాపాడుము.

పరోసి దేవ ప్రవరః సురాణాం

పుంసః స్వరూపోసి శశిప్రకాశః,

హుతాశ వక్త్రాచ్యుత తీవ్రభావ

గేపేంద్ర మాం పాహి భ##వే పతన్తమ్‌. 16

దేవా! నీవు సర్వమునకు పరుడవు. దేవులలో మిక్కిలి శ్రేష్ఠుడవు. పురుష స్వరూపుడవు. చంద్రుని వలె వెలుగొందువాడవు. అగ్నియే ముఖమైన వాడవు. అచ్యుతుడవు. పసగల భావములు గలవాడవు. గోపేంద్రా! సంసారమున పడిపోవుచున్న నన్ను పాలింపుము.

సంసారచక్ర క్రమణా న్యనేకా -

న్యావిర్భవన్త్యచ్యుత దేహినాం యత్‌,

త్వన్మాయయా మోహితానాం సురేశ

కస్తే మాయాం తరతే ద్వన్ద్వధామా. 17

దేహముతాల్చిన వారికి సంసారమను చక్రము నందలి తిరుగుళ్లు పెక్కులు సంభవించు చున్నవి. వారందరు నీ మాయచేత మోహితులైన వారే. ద్వంద్వములందు నిలుచు వాడెవ్వడైన నీ మాయను దాటగలుగునా?

అగోత్ర మస్పర్శ మరూపగన్ధ -

మనామ నిర్దేశ మజం వరేణ్యమ్‌,

గోపేన్ద్ర త్వాం యద్యుపాసన్తి ధీరా

స్తే ముక్తిభాజో భవబన్ధముక్తాః. 18

గోత్రము, స్పర్శ, రూపము, వాసన, పేరు నీకు లేవు. నీవు అజుడవు. సర్వ శ్రేష్ఠుడవు. ఇట్టి నిన్ను ఉపాసించు బుద్ధిశాలులు సంసారమను బంధమునుండి విడివడి ముక్తి పొందుదురు.

శబ్దాతిగం వ్యోమరూపం విమూర్తిం

వికర్మిణం శుభభావం వరేణ్యమ్‌,

చక్రాబ్జపాణింతు తథోపచారా -

దుక్తం పురాణ సతతం నమామి. 19

నీవు శబ్దమును మించి పోయినవాడవు. గగనమే నీ రూపము. నీకొక ఆకారము లేదు. ఒక కార్యము లేదు. శుభ##మైన భావము కలవాడవు. ఉత్తమోత్తముడవు. చక్రము, పద్మము చేత దాల్చిన వాడవని సూచనగా పురాణము నందు నిన్ను పేర్కొందురు. అట్టినీకు ఎల్లవేళల మ్రొక్కెదను.

త్రివిక్రమం క్రాన్తజగత్త్రయంచ

చతుర్మూర్తిం విశ్వగతం క్షితీశమ్‌,

శంభుం విభుం భూతపతిం సురేశం

నమా మ్యహం విష్ణు మనన్త మూర్తిమ్‌. 20

నీవు త్రివిక్రముడవు. లోకము లన్నింటిని దాటిన వాడవు. నాలుగు మూర్తులు కలవాడవు. విశ్వమంతట నిండిన వాడవు. భూదేవికి ఈశ్వరుడవు. శుభముల నొసగువాడవు. విభుడవు. సర్వభూతములకు పాలకుడవు. దేవదేవుడవు. విష్ణుడవు. అనంతమైన రూపములు కలవాడవు. అట్టి నీకు నమస్కారము.

త్వందేవ సర్వాణి చరాచరాణి

సృజస్యథో సంహరసే త్వమేవ,

మాం ముక్తికామం నయ దేవ శీఘ్రం

యస్మిన్‌ గతా యోగినో నాపయాన్తి. 21

దేవ ! చరాచరములగు సమస్త భూతములను నీవే సృజింతువు. మరల నీవే లోగొందువు. ఎందేగి యోగులు మరల తిరిగిరారో ఆ తావునకు ముర్తిని కాంక్షించు నన్ను వడిగా చేర్పుము.

జయస్వ గోవిన్ద మహానుభావ

జయస్వ విష్ణో జయ పద్మనాభ,

జయస్వ సర్వజ్ఞ జయాప్రమేయ

జయస్వ విశ్వేశ్వర విశ్వమూర్తే. 22

గోవిందా! నీకు జయము. మహానుభావా! నీకు జయము. విష్ణూ! పద్మనాభా! నీకు జయము. సర్వమెరిగిన దేవా! ఊహలకందని పరతత్త్వమా! విశ్వేశ్వరా! విశ్వమంతయు ఆకృతియైన స్వామీ! నీకు జయము.

శ్రీవారహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు పలికెను.

ఏవం స్తుత్వా తదా రాజా నిధాయ స్వం కళేబరమ్‌,

పరమాత్మని గోవిన్దే లయమాగాచ్చ శాశ్వతే. 23

ఇట్లు స్తుతించి ఆ రాజు తన కళేబరమును వదలి వైచి పరమాత్ముడు, శాశ్వతుడు అయిన గోవిందుని యందు లయము పొందెను.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే షట్త్రింశోధ్యాయః.

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పది ఆరవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters