Varahamahapuranam-1    Chapters   

పఞ్చత్రింశో7ధ్యాయః - ముప్పదియైదవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు పలికెను.

బ్రహ్మణో మానసః పుత్రః అత్రి ర్నామ మహాతపాః,

తస్య పుత్రోభవత్సోమో దక్షజామాతృతాం గతః. 1

బ్రహ్మమానసపుత్రుడు అత్రి. ఆతడు గొప్పతపస్సంపద గలవాడు. ఆతని పుత్రుడు చంద్రుడు దక్షున కల్లు డాయెను.

సప్తవింశతి యాః కన్యా దాక్షాయణ్యః ప్రకీర్తితాః,

సోమపత్న్యోతిమన్తవ్యా స్తాసాం శ్రేష్ఠాతు రోహిణీ. 2

దాక్షాయణులని పేరొందిన ఇరువదియేడుగురు కన్యలు, చక్కని రూపముకలవారు సోమునకు పత్నులయిరి. వారిలో అందరికంటె మిన్న రోహిణి.

తామేవ రమతే సోమో నేతరా ఇతి శుశ్రుమః,

ఇతరాః ప్రోచు రాగత్య దక్షస్యాసమతాం శ##శేః. 3

సోము డామెతోనే విహరింపజొచ్చెను. ఇతరభార్యలను ఆదరింపకుండెనని విందుము. ఆ ఇతరభార్యలు చంద్రుని యీ పక్షపాతమును దక్షునకు చెప్పుకొనిరి.

దక్షో ప్యసకృదాగత్య తమువాచ స నాకరోత్‌,

సమతాం సోపి తం దక్షః శశా పాన్తర్హితో భవ. 4

దక్షుడును పలుమారులు చంద్రుని కడకు వచ్చి చెప్పిచూచెను. కాని ఆతడు అందరిని సమముగా చూడడాయెను. అంత దక్షుడు నీవు కనబడకుండ పొమ్మని శపించెను.

ఏవం శప్తస్తు దక్షేణ సోమో దేహం త్యజే దథ,

ఉవాచ సోమో దక్షం తు భవానేవం భవిష్యతి,

అనేకజో విహాయేయం బ్రహ్మదేహం సనాతనమ్‌. 5

దక్షుడిట్లు తిట్టగా సోముడు దక్షునితో నీవును అట్లే అగుదువు. సనాతనమగు బ్రహ్మదేహమును విడచి పెక్కుమందికి పుట్టువాడ వగుదువు అని పలికెను.

ఏవ ముక్త్వా క్షయం సోమ అగమద్‌ దక్షశాపతః.

ఇట్లు పలికి చంద్రుడు దక్షునిశాపమువలన క్షీణించి పోయెను.

దేవా మనుష్యాః పశవో నష్టే సోమే సవీరుధః,

క్షీణా భవంస్తదా సర్వా ఓషధ్యశ్చ విశేషతః. 6

సోముడట్లు రూపములేనివాడు కాగా దేవతలు, మనుష్యులు, చెట్లపొదలు, సమస్తములగు ఓషధులు క్షీణించి పోయినవి.

క్షయం గచ్ఛద్భి రత్యర్థ మోషధీభిః సురర్షభాః. 7

మూలేషు వీరుధాం సోమః స్థిత ఇత్యూచు రాతురాః,

తేషాం చిన్తాభవత్‌తీవ్రా విష్ణుంచ శరణం యయుః 8

క్షీణించి పోవుచున్న ఓషదులతో పాటు దేవతాశ్రేష్ఠులు కూడ తరిగి పోవుచు బాధనొందినవారై పొదల మొదట చంద్రుడున్నాడని పలుకజొచ్చిరి. తీవ్రమైన వేదనతో వారందరు విష్ణువును శరణుజొచ్చిరి.

భగవానాహ తాన్‌ సర్వాన్‌ బ్రూత కిం క్రియతే మయా,

తే చోచు ర్దేవ దక్షేణ శప్తఃసోమో వినాశితః. 9

భగవంతుడు వారి నందరను నన్నేమియేయునుందు రని అడిగెను. దేవా! ఆ దక్షుని శాపము చేత సోముడు నాశమాయెను అని పలికిరి.

తానువాచ తదా దేవో మథ్యతాం కలశోదధిః,

ఓషధ్యః సర్వతో దేవాః ప్రక్షిప్యాశు సుసంయతైః. 10

దేవతలారా! ఓషధులన్నింటిని పడవైచి చెదరి పోకుండ చూచుకొని కలశము వంటి సముద్రమును చిలుకుడు అని విష్ణువు వారితో పలికెను.

ఏవ ముక్త్వా తతో దేవాన్‌ దధ్యౌ రుద్రం హరిః స్వయమ్‌,

బ్రహ్మాణం చ తథా దధ్యౌ వాసుకిం వేత్రకారణాత్‌. 11

దేవతలతో ఇట్లు పలికి హరి తానై రుద్రుని, బ్రహ్మను భావనచేసెను. అట్లే కవ్వపుద్రాడుగా నుండుటకై వాసుకిని స్మరించెను.

తే సర్వే తత్ర సహితా మమన్థు ర్వరుణాలయమ్‌,

తస్మింస్తు మథితే జాతః పునః సోమో మహీపతే. 12

వారందరు కలసి సముద్రమును చిలికిరి. అట్లు చిలుకగా చంద్రుడు మరల పుట్టెను.

యోసౌ క్షేత్రజ్ఞ సంజ్ఞో వై దేహేస్మిన్‌ పురుషః పరః,

స ఏవ సోమో మన్తవ్యో దేహినాం జీవసంజ్ఞితః,

పరేచ్ఛయా సమూర్తిం తు పృథక్‌ సౌమ్యాం ప్రపేదివాన్‌. 13

మానవుల దేహమున క్షేత్రజ్ఞుడను పేరున ఉన్న పరపురుషుడే ఈ సోముడని భావింప దగును. దేహులలో ఈతనికి జీవుడని పేరు. పరతత్త్వము ఇచ్ఛకు లోబడి ఆతడు వేరుగా సోమసంబంధమైన ఆకారమును పొందెను.

తమేవ దేవమనుజాః షోడ శేమాశ్చ దేవతాః,

ఉపజీవన్తి వృక్షాశ్చ తథైవోషధయః ప్రభుమ్‌. 14

దేవతలు, మనుజులు, పదునారు విధములుగా నున్న దేవతలు ఆతనిపై ఆధారపడి బ్రదుకుదురు. అట్లే వృక్షములకు, ఓషధులకు ప్రభువుగా ఆతనినే భావింతురు.

రుద్ర స్తమేవ సకలం దధార శిరసా తదా,

తదాత్మికా భవన్త్యాపో విశ్వమూర్తి రసౌ స్మృతః. 15

రుద్రు డతనికే అప్పుడు ఒక కళరూపముతో శిరస్సున ధరించెను. జలములు ఆతని స్వరూపములే. ఆతడు 'విశ్వమూర్తి' గా భావనకు వచ్చుచున్నాడు.

(విశ్వమూర్తి - విశ్వమంతయు తన ఆకారమే అయినవాడు)

తస్య బ్రహ్మా దదౌ ప్రీతః పౌర్ణమాసీం తిథిం ప్రభుః,

తస్యా ముపోషయేద్‌ రాజం స్తమర్థం ప్రతిపాదయేత్‌. 16

ఆతని యెడ ప్రీతి నొందిన బ్రహ్మ ఆతనికి పూర్ణిమ తిథిని సమర్పించెను. ఆతిథియందు ఉపవాసముండి ఆతనిని పూజింపవలయును.

యవాన్నాహారశ్చ భ##వేత్‌ తస్య జ్ఞానం ప్రయచ్ఛతి,

కాన్తిం పుష్టించ రాజేన్ద్ర ధనం ధాన్యంచ కేవలమ్‌. 17

యవలతో వండిన అన్నము తినవలయును. అట్టివానికి చంద్రుడు జ్ఞానము నొసగును. కాంతిని, పుష్టిని, ధనధాన్యములను ఎక్కువగా ప్రాసాదించును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చత్రింశోధ్యాయ.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదియైదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters