Varahamahapuranam-1    Chapters   

త్రింశో7ధ్యాయః - ముప్పదియవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

శృణు చాన్యాం వసుపతే రుత్పత్తిం పాపనాశినీమ్‌,

యథా వాయుః శరీరస్థో ధనదః సంబభూవ హ. 1

రాజా! పాపములను పోకార్చు మరియొకథ వినుము. అది వసుపతికి సంబంధించినది (వసుపతి-ధనములకు అధిపతి-కుబేరుడు) బ్రహ్మశరీరమున నున్న వాయువు, కుబేరుడుగా ఎట్లు పుట్టెనో చెప్పెదను.

ఆద్యం శరీరం యత్‌ తస్మిన్‌ వాయు రన్తఃస్థితోభవత్‌,

ప్రయోజనా న్మూర్తిమత్త్వమాదిష్టం క్షేత్రదేవతా. 2

వాయువు మొదట మొదటిదగు దేహమున నుండెను. ఆ క్షేత్రమున కధిష్ఠానదేవత ఒక పనికొరకు వాయువునకు ఆకారము కలుగునట్లు ఆదేశించెను.

తత్ర మూర్తస్య వాయోస్తు ఉత్పత్తిః కీర్త్యతే మయా,

తాం శృణుష్వ మహాభాగ కథ్యమానాం మయానఘ. 3

అట్లు ఆకారము పొందిన వాయువు ఉత్పత్తి ఎట్లు జరిగెనో నేను వివరించుచున్నాను. పుణ్యాత్మా! నేను చెప్పుచున్న ఆ ఉత్పత్తి నాలకింపుము.

బ్రహ్మణః సృష్టికామస్య ముఖాద్‌ వాయు ర్వినిర్య¸°,

ప్రచణ్డ శర్కరావర్షీ తం బ్రహ్మా ప్రత్యషేధయత్‌,

మూర్తో భవస్వ శాన్తశ్చ తత్రోక్తో మూర్తిమాన్‌ భవత్‌. 4

సృష్టి చేయగోరు బ్రహ్మముఖమునుండి మిక్కిలి తీవ్రమగు గులకరాలను వర్షించుచు వాయువు వెలువడెను. బ్రహ్మ వానిని నిలువరించెను. ఆకారము పొందుము. శాంతింపుము. అని బ్రహ్మ పలుకగా వాయువు ఆకారము ధరించెను.

సర్వేషాం చైవ దేవానాం యద్‌ విత్తం ఫలమేవచ,

తత్సర్వం పాహి యేనోక్తం తస్మాద్‌ ధనపతి ర్భవత్‌. 5

దేవతలందరకు గల ధనమును, వారార్జించిన ఫలమును అంతటిని నీవు రక్షింపుము. అని బ్రహ్మ పలుకగా వాయువు ధనపతి అయ్యెను.

తస్య బ్రహ్మా దదౌ తుష్ట స్తిథి మేకాదశీం ప్రభుః,

తస్యా మనగ్ని పక్వాశీ యో భ##వేన్నియతః శుచీ. 6

తస్యాశు ధనధో దేవ స్తుష్టం సర్వం ప్రయచ్ఛతి,

ఏషా ధనపతే ర్మూర్తిః సర్వకిల్బిష నాశినీ. 7

బ్రహ్మ సంతృప్తిపడి ఆ కుబేరునకు ఏకాదశి తిథిని కల్పించెను. ఆ తిథియందు అగ్నితో వండని పరార్థములను భుజించుచు నిష్ఠతోకూడిన పరిశుద్ధునకు కుబేరుడు తృప్తుడై కోరినదెల్ల ఒసగును. ఈ ధనపతి రూపము పాపములన్నింటిని పటాపంచలు చేయును.

య ఏతాం శృణుయాద్‌ భక్త్యా పురుషః పఠతేపి వా,

సర్వకామ మవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి. 8

ఈ కథను భక్తితో వినువాడును, చదువువాడను, కోరిన కోర్కెలనెల్ల పొందును. స్వర్గలోకమున కరుగును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రింశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదియవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters