Varahamahapuranam-1    Chapters   

సప్తవింశో7ధ్యాయః - ఇరువదియేడవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు పలికెను.

పూర్వమాసీన్‌ మాహాదైత్యో బలవా నన్ధకో భువి,

స వేదాన్‌ వశమానిన్యే బ్రహ్మణో వరదర్వితః. 1

మునుపు గొప్పబలము గల పెనురక్కసి అంధకుడనువాడు కలడు. అతడు బ్రహ్మ యిచ్చిన వరము గర్వమున దేవతల నందరిని వశపరచుకొనెను.

తేనాత్మసాత్‌ సురాఃకృత్వా త్యాజితా మేరుపర్వతమ్‌,

బ్రహ్మాణం శరణం జగ్ము రన్ధకస్య భయార్దితాః. 2

అట్లు చేజిక్కించుకొని ఆతడు దేవత లందరిని మేరు పర్వతమును వదలిపోవునట్లు చేసెను. దానితో వారు అంధకుని భయముతో బ్రహ్మదేవుని శరణుజొచ్చిరి.

తానాగతాం స్తదా బ్రహ్మా ఉవాచ సురసత్తమాన్‌,

కిమాగమన కృత్యం వో దేవా బ్రూత కిమాస్యతే. 3

అట్లు తన కడకు వచ్చిన ప్రధానదేవతలను గాంచి బ్రహ్మ దేవులారా! మీ రాకకు కారణమేమి? చెప్పుడు. ఊరకున్నారేమి'? అని పలికెను.

దేవా ఊచుః - దేవత లిట్లు పలికిరి.

అన్ధకే నార్దితాః సర్వే వయం దేవా జగత్పతే,

త్రాహి సర్వాం శ్చతుర్వక్త్ర పితామహ నమోస్తు తే. 4

జగన్నాథా! మమ్ములనందరను అంధకుడు పీడించు చున్నాడు. పితామహా! చతుర్వదనా! నీకు మ్రొక్కెదము, మమ్ము కాపాడుము.

బ్రహ్మోవాచ - బ్రహ్మ యిట్లు పలికెను.

అన్ధకాన్నైవ శక్తోహం త్రాతుం వై సురసత్తమాః,

భవం శర్వం మహాదేవం ప్రజామ శరణార్థినః. 5

దేవతలారా! నేను మిమ్ములను అంధకునినుండి కాపాడజాలను. భవుడు, శర్వుడునగు మహాదేవుని శరణువేడుదము. పదడు.

కిన్తు పూర్వం మయా దత్తో వరస్తస్య సురోత్తమాః,

అవధ్యస్త్వం హి భవితా న శరీరం స్మృశే న్మహీమ్‌. 6

సురోత్తములారా! నేను ఆతనికి మున్ను 'నీవు చంపరాని వాడవగుదువు. నీ శరీరము నేలను తాకరాదు' అని వరమిచ్చితిని.

తసై#్యవం బలిన స్త్వేకో హన్తా రుద్రః పరన్తపః,

తత్ర గచ్ఛామహే సర్వే కైలాసనిలయం ప్రభుమ్‌. 7

అట్టి బలవంతుని ఒక్క రుద్రుడే చింపగలడు. కావున కైలాసమున నివసించు ప్రభువు కడ కరుగుదము.

ఏవ ముక్త్వా య¸° బ్రహ్మా సదేవో భవసన్నిధౌ,

తస్య సందర్శనాద్‌ రుద్రః ప్రత్యుత్థానాదిక క్రియాః,

కృత్వాభ్యువాచ దేవేశో బ్రహ్మాణం భువనేశ్వరమ్‌. 8

బ్రహ్మ యిట్లు పలికి దేవతలతోపాటు శివుని సన్నిధి కరిగెను. ఆతని గాంచినంతనే రుద్రడు ఎదురేగుట మొదలగు మర్యాదలు నెరపి జగదీశ్వరుడగు బ్రహ్మతో నిట్లు పలికెను.

శంభు రువాచ - శంభు డానెను.

కిం కార్యం దేవతాః సర్వే ఆగతా మమ సంనిధౌ,

యేనాహం తత్కరోమ్యాశు ఆజ్ఞా కార్యాహి సత్వరమ్‌. 9

పనియేమి? దేవతలందరును నాకడకు వచ్చిరి. నేను వారికేమి చేయవలయునో శీఘ్రముగా సెలవిండు.

దేవా ఊచుః - దేవతలిట్లు పలికిరి.

రక్షస్వ దేవ బలిన స్త్వన్ధకాద్‌ దుష్టచేతసః. 10

దేవా! బలవంతుడు, దుష్టబుద్ధి అయిన అంధకునినుండి మమ్ము రక్షింపుము.

యావదేవం సురాః సర్వే శంసన్తి పరమేష్ఠినః,

తావత్‌ సైన్యేన మహతా తత్రైవాన్ధక ఆయ¸°. 11

సురలిట్లు పరమేశ్వరునకు చెప్పుకొనుచుండగనే గొప్పసేనతో అంధకు డటకు వచ్చెను.

బలేన చతురఙ్గేణ హన్తుకామో భవం మృధే,

తస్య భార్యాం గిరిసుతాం హర్తుమిచ్ఛన్‌ ససాధనః. 12

నాలుగు విభాగములుగల సేనతో యుద్ధమున శివుని చంపగోరియు, ఆతనిభార్యయగు పార్వతిని హరింపగోరియు సాధనములతో వచ్చెను.

తం దృష్ట్వా సహసా೭೭యాన్తం దేవశక్రప్రహారిణమ్‌,

సన్నహ్య సహసా దేవా రుద్ర స్యానుచరా భవన్‌. 13

అట్లు ఒక్క పెట్టునవచ్చి దేవతలను, దేవేంద్రుని పీడించు చున్న ఆతనినిగాంచి దేవతలందరు ఒక్కుమ్మడిని రుద్రుని వెనుక కొరిగిరి.

రుద్రోపి వాసుకిం ధ్యాత్వా తక్షకం చ ధనంజయమ్‌,

వలయం కటిసూత్రం చ చకార పరమేశ్వరః. 14

రుద్రుడును వాసుకిని, తక్షకుడు, ధనంజయుడు అను సర్పములను స్మరించెను. వారికి నడుమునకు మొలత్రాడుగా కట్టుకొనెను.

నీలానామా చ దైత్యేన్ధ్రో హస్తే భూత్వా భవాన్తికమ్‌,

ఆగత స్త్వరితః శక్రహస్తీ వోద్ధత రూపవాన్‌. 15

నీలుడను రాక్షసరాజు ఐరావతమువంటి భయంకర రూపముతో శివునికడకు వడివడిగా వచ్చెను.

స జ్ఞాతో నన్దినా దైత్యో వీరభద్రాయ దర్శితః,

వీరభద్రోపి సింహేన రూపేణా హత్య చ ద్రుతమ్‌. 16

తస్య కృత్తిం విదార్యాశు కరిణ స్త్వఞ్జన ప్రభామ్‌,

రుద్రాయార్పితవాన్‌ సోపి తమేవామ్బర మాకరోత్‌,

తతః ప్రభృతి రుద్రోపి గజచర్మపటోభవత్‌. 17

నంది దానిని గుర్తించి ఆ దైత్యుని వీరభద్రునకు చూపెను. వీరభద్రుడును సింహరూపము దాల్చి ఒక్క పెట్టున వానిని చంపి కాటుకవంటి కాంతిగల ఆ ఏనుగుచర్మమును చీల్చి రుద్రున కర్పించెను. ఆతడును దానిని వస్త్రముగా చేసికొనెను. అది మొదలు రుద్రుడు గజచర్మాంబరధారి యాయెను.

గజచర్మపటో భూత్వా భుజంగాభరణోజ్వలః,

ఆదాయ త్రిశిఖం భీమం సగణోన్ధక మన్వయాత్‌. 18

అట్లు శివుడు గజచర్మమును ధరించి పాములనెడు భూషణములతో వెలుగులు చిమ్ము చున్నవాడై వెరపు గొలుపు త్రిశూలమును చేతదాల్చి ప్రమథ గణములతో పాటు అంధకునిపై కురికెను.

తతః ప్రవృత్తే యుద్ధే చ దేవదానవయో ర్మహత్‌,

ఇన్ద్రాద్యా లోకపాలాస్తు స్కన్ధం సేనాపతి స్తథా,

సర్వే దేవగణా శ్చాన్యే యుయుధుః సమరే తదా. 19

అంత దేవదానవులకు ఘోరయుద్ధమారంభము కాగా ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, కుమారస్వామియు, తక్కిన దేవతలును పోరజొచ్చిరి.

తం దృష్ట్వా నారదో యుద్ధం య¸° నారాయణం ప్రతి,

శశంస చ మహద్‌యుద్ధం కైలాసే దానవైః సహ. 20

నారదు డదిగాంచి నారాయణుని కడ కరిగి కైలాసమున దేవతలకు రాక్షసులతో మహాయుద్ధము జరుగుచున్నదని చెప్పెను.

తచ్ఛ్రుత్వా చక్రమాదాయ గరుడస్థో జనార్దనః,

తమేవ దేశ మాగగ్య యుయుధే దానవైః సహ. 21

అది విని చక్రము పట్టుకొని గరుడు నెక్కి జనార్దనుడు ఆచోటికి వచ్చి దానవులతో తలపడెను.

ఆగత్య చ తతో దేవా హరిణా ప్యాయితా రణ,

విషణ్ణవదనాః సర్వే పలాయనపరా భవన్‌. 22

విష్ణువు ఆదుకొన్నను దేవతలు మొగమును వ్రేలవైచి పారిపోజొచ్చిరి.

తత్ర భ##గ్నేషు దేవేషు స్వయం రుద్రోన్ధకం య¸°,

తత్ర తేన మహద్యుద్ధ మభవ ల్లోమహర్షణమ్‌. 23

అట్లు దేవతలు దెబ్బతినగా స్వయముగా రుద్రుడు అంధకునిపై కరిగెను. గగుర్పాటు పుట్టించు పెనుపోరు సంభవించెను.

తత్ర దేవోప్యసౌ దైత్యం త్రిశూలే నాహనద్‌ భృశమ్‌.

తస్యాహతస్య యద్‌ రక్త మపతద్‌ భూతలే కిల,

తత్రాన్ధకా ఆసంఖ్యాతా బభూవు రపరే భృశమ్‌. 24

అచట ఆ దేవుడు రక్కసుని త్రిశూలముతో గ్రుచ్చెను. అట్లు పొడువగా నేలనై పడిన రక్తమునుండి లెక్కపెట్టరాని అంధకులు పుట్టిరి.

తత్‌ దృష్ట్వా మహదాశ్చర్యం రుద్రోశూలేన్ధకం మృధే.

గృహీత్వా త్రిశిఖాగ్రేణ ననర్త పరమేశ్వరః. 25

ఆ మహాశ్చర్యమును గాంచి రుద్రుడు యుద్ధమున అంధకుని త్రిశూలమున గ్రుచ్చి పట్టుకొని నాట్యమాడెను.

ఇతరే ప్యన్ధకాః సర్వే చక్రేణ పరమేష్ఠినా,

నారాయణన నిహతా స్తత్ర యేన్యే సముత్థితాః. 26

తక్కిన అంధకులును, పైకి లేచిన యితరులును నారాయణుని చక్రము చేత మడిసిరి.

అసృగ్ధారా తుషారైస్తు శూలప్రోతస్య చాసకృత్‌,

అనారతం సముత్తస్థు స్తతో రుద్రో రుషాన్వితః. 27

శూలముతో గ్రుచ్చిన ఆ అంధకుని నెత్తురుతుంపురులతో పెక్కుమారులు అంతులేని అంధకులు పుట్టుకొని వచ్చిరి. అంత రుద్రుడు తీవ్రక్రోధము తాల్చినవాడాయెను.

తస్య క్రోధేన మహతా ముఖా జ్జ్వాలా వినిర్య¸°,

తద్రూప ధారిణీ దేవీ యాం తాం యోగీశ్వరీం విదుః. 28

స్వరూపధారిణీ చాన్యా విష్ణునాపి వినిర్మితా,

బ్రహ్మణా కార్తికేయేన ఇన్ద్రేణ చ యమేన చ,

వరాహేణ చ దేవేన విష్ణునా పరమేష్ఠినా. 29

పాతాలోద్ధరణం రూపం తస్యా దేవ్యా వినిర్మమే,

మహేశ్వరీ చ రాజేన్ద్ర ఇత్యేతా అష్టమాతరః. 30

ఆతని ఆ పెనుకోపముచేత ముఖము నుండి జ్వాలలు వెలువడెను. ఆ జ్వాలల రూపము తాల్చి ఒకదేవి యావిర్భవంచెను. ఆమెనే యోగేశ్వరి అందురు. ఒక దేవిరూపము తనంత తాను ఉద్భవించెను. అట్లే మరియొక దేవిని విష్ణువు నిర్మించెను. మరియు బ్రహ్మ, కుమారుడు, ఇంద్రుడు, యముడును శక్తిరూపములను సృజించిరి. పరమప్రభువగు వరాహదేవుడు ఆ దేవికి పాతాళమును పెకలించిరి. పరమప్రభువగు వరాహదేవుడు ఆ దేవికి పాతాళమును పెకలించి రూపమును కల్పించెను. ఆదేవి పేరు మహేశ్వరి. వారినే అష్టమాతలు అందురు.

కారణం యస్య యత్ర్పోక్తం క్షేత్ర జ్ఞానావధారణమ్‌,

శరీరాద్‌ దేవతానాం తు తదిదం కీర్తితం మయా. 31

ఈ దేవత లిట్లు శరీరస్థితిని పొందిన విషయము నంతటిని నీకు వివరించితిని. శరీరజ్ఞాన బుద్ధితో వీరిస్వరూపములను వివరింతును.

కామః క్రోధ స్తథా లోభో మదో మోహోథ పఞ్చమః,

మాత్సర్యం షష్ఠ మిత్యాహుః పైశున్యం సప్తమం తథా,

అసూయా చాష్టమీ జ్ఞేయా ఇత్యేతా అష్టమాతరః. 32

కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము, చెడుతనము, ఇతరుల గుణములకోర్వనితనము అనునీ యెనిమిదియు దేహముననున్న ఆ యెనిమిది శక్తులు.

కామం యోగేశ్వరీం విద్ధి క్రోధో మహేశ్వరీం తథా,

లోభస్తు వైష్ణవీ ప్రోక్తా బ్రహ్మాణీ మద ఏవచ. 33

మోహః స్వయంభూః కౌమారీ మాత్సర్యం చేన్ద్రజాం విదుః,

యమదణ్డధరా దేవీ పైశున్యం స్వయమేవ చ,

అసూయా చ వరాహాఖ్యా ఇత్యేతాః పరికీర్తితాః. 34

కామమును యోగీశ్వరియనియు, క్రోధమును మాహేశ్వరి యనియు, లోభమును వైష్ణవి యనియును, మదమును బ్రహ్మాణి యనియు, మోహమును తానైపుట్టిన కౌమారియనియు, మాత్సర్యమును ఇంద్రజ యనియు, క్రూరత్వమును యమదండ ధర అనియు, అసూయను వారాహియనియు చెప్పుదురు.

కామాదిగణ ఏషోయం శరీరే పరికీర్తితః,

జగ్రాహ మూర్తిం తు యథా తథా తే కీర్తితం మయా. 35

ఈ శరీరమున నున్న కామాదుల సముదాయము మూర్తిని గొన్న విధానమును నీ కెరిగించితివి.

ఏతాభి ర్దేవతాభిశ్చ తస్య రక్తే తిశోషితే,

క్షయం గతాసురీ మాయా సచ సిద్దోన్ధకోభవత్‌,

ఏతత్‌ తే సర్వమాఖ్యాత మాత్మవిద్యామృతం మయా. 36

ఈ దేవతలు ఆ అంధకుని రక్తమును పూర్తిగా పీల్చివేయగా అసురుని మాయ నాశనమాయెను. ఆ అంధకుడు సిద్ధు డాయెను. ఇదిగో నీకు ఆత్మవిద్యామృతమును మొత్తము చెప్పితిని.

య ఏత చ్ఛ్రుణుయా న్నిత్యం మాతౄణాముద్భవం శుభమ్‌,

తస్య తాః సర్వతో రక్షాం కుర్వన్త్వనుదినం నృప. 37

ఈ మాతృదేవతల మంగళకరమగు కథను నిత్యము వినువారికి వారు ఎల్లవేళల రక్షణను గూర్తురు.

యశ్చైతత్‌ పఠతే జన్మ మాతౄణాం పురుషోత్తమ,

స ధన్యః సర్వదా లోకే శివలోకం చ గచ్ఛతి. 38

ఈ మాతృదేవతల జన్మవృత్తాంతము విన్న మానవుడు ధన్యుడై శివలోకమున కరుగును.

తాసాం చ బ్రహ్మణా దత్తా అష్టమీ తిథి రుత్తమా,

ఏతాః సంపూజయేద్‌ భక్త్యా బిల్వాహారో నరః సదా,

తస్య తాః పరితుష్టాస్తు క్షేమారోగ్యం దదన్తి చ. 39

బ్రహ్మవారికి ఉత్తమయగు అష్టమీ తిథిని అనుగ్రహించెను. ఆ దినమున మారేడు ఫలములు మాత్రము భుజించి వారిని పూజించు వారికి ఆ దేవతలు సంతసించి క్షేమమును, ఆరోగ్యమును ప్రసాదింతురు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తవింశోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్చాస్త్రమున ఇరువదియేడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters