Varahamahapuranam-1    Chapters   

పఞ్చత్రింశదధిక శతతమోధ్యాయః - నూటముప్పదియైదవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవు డిట్లు పలికెను.

రక్తవస్త్రేణ సంయుక్తో యో హి మా ముపసర్పతి,

తస్యాపి శృణు సుశ్రోణి కరమసంసారమోక్షణమ్‌. 1

ఎర్రని వస్త్రముతాల్చి నా కడకు అరుదెంచువాని సంసారముక్తి విధాన మెట్లుండునో, ఓ భూదేవీ! వినుము.

రజస్వలాసు నారీషు రజో యత్తత్ర్పవర్తతే,

తేనా సౌ రజసా స్పృష్టో కర్మదోషేణ జానతః, 2

తెలిసి చేసిన కర్మదోషముచేత మానవుడు ముట్టుతలైన స్త్రీల రజస్సును తాకిన వాడగును.

వర్షాణి దశపఞ్చైవ తస్య తే తత్ర నిశ్చయః,

రజో భూత్వా మహాభాగే రక్త వస్త్రపరాయణః. 3

ఎఱ్ఱని వలువలు తాల్చినవ్యక్తి పదునైదు వత్సరములు అట్టి రజసై#్స యుండిపోవును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య కాయవిశోధనమ్‌,

యేన శుద్ధ్యన్తి వై భూమి పురుషాః శాస్త్రవర్జితాః. 4

అట్లు శాస్త్రవిధిని వదలి ప్రవర్తించు పురుషులు శుద్ధి పొందెడు ప్రాయశ్చిత్త విధానమును వక్కాణించెను.

ఏకాహారం తతః కృత్వా దినాని దశ సప్త చ,

వాయుభక్షో దినత్రీణి దిన మేకం జలాశనః. 5

పదునేడు దినములు ఒంటిపూట భోజనము చేయ వలయును. మూడుదినములు గాలిని, ఒకరోజు నీటిని పుచ్చుకొనవలయును.

ఏవం స ముచ్యతే భూమి మమ విప్రియకారకః,

ప్రాయశ్చిత్తం తతః కృత్వా మమాసౌ రోచతే సదా. 6

ఈ విధముగా నాకు అప్రియము చేసినవాడు అట్టి ప్రాయశ్చిత్తమును చేసికొని దోషమునుండి విడివడును. నాకు ప్రియుడును అగును.

ఏతత్‌ తే కథితం భూమి రక్త వస్త్ర విభూషితమ్‌,

ప్రాయశ్చిత్తం మహాభాగే సర్వసంసారమోక్షణమ్‌. 7

భూమీ! ఎఱ్ఱనివస్త్రములు (నాపూజాసమయమున) తాల్చుట, దాని ప్రాయశ్చిత్తము అను వానిని నీకు తెలిపితిని. ఇది సంసారమోక్షణమును కలిగించునట్టిది.

రక్తవస్త్ర పరిధాన ప్రాయశ్చిత్తమ్‌

ఎరుపుబట్టలను కట్టుదోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

యస్తు మామన్ధకారేషు వినా దీపేన సుందరి,

స్పృశ##తే మాం వినా శాస్త్రం త్వరమాణో విమోహితః. 8

పతనం తస్య వక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తేన క్లేశం సమాసాద్య క్లిశ్యతే చరాధమః. 9

సుందరీ! శాస్త్రమును పాటింపక చీకటిలో దీపములేకుండ నన్ను త్వరపడుచు, విజ్ఞత లేక తాకువాని పతన మెట్లుండునో చెప్పెదను. వినుము. ఆ పాపముచేత ఆ నరాధముడు కష్టములలో నలిగిపోవును.

అన్ధో భూత్వా మహాభాగే ఏకం జన్మ తమోమయః,

సర్వాశీ సర్వభక్షశ్చ మానవ శ్చైవ జాయతే. 10

వాడు ఒక్కజన్మకాలము గ్రుడ్డివాడై చీకటి గుయ్యారమున అడ్డమైన గడ్డిని తినువాడై ప్రవర్తించును.

యత స్మృతి సత్త శ్చైవ మద్భక్త శ్చైవ జాయతే,

అనన్యమానసో భూత్వా భూమే హ్యేతత్‌ ప్రసాదయేత్‌. 11

ఎప్పుడు తనతప్పు తెలిసికొని నన్ను చెదరనిమనస్సుతో స్మరించునో అప్పుడు నాభక్తుడై పుట్టును. ఇది ఆతనిని చక్కదిద్దు విధానము.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి అంధకారే తు యః స్పృశేత్‌,

తరన్తి యేన సంసారం మమ లోకాయ గచ్ఛతి. 12

చీకటిలో నన్నుతాకువానికి ప్రాయశ్చిత్త మెట్టిదో, దేనితో అతడు తరించునో, నాలోకమున కరుగునో దానిని చెప్పెదను.

అక్ష్యాచ్ఛాదం విధాయిత్వా దినాని దశ పఞ్చ చ,

ఏకాహారం తతః కృత్వా దినవింశం సమాహితాః. 13

యస్య కస్యాపి మాసస్య ఏకా మేవ చ ద్వాదశీమ్‌,

ఏకాహారస్తతో భూత్వా తిష్ఠే చ్చాపి జలాశనః. 14

పదునైదుదినములు కన్నులకు గంతలు కట్టుకొనవలయును. ఇరువదిదినములు శ్రద్ధతో ఒంటిపూటభోజనము చేయవలయును. ఏదో ఒకనెలలో ద్వాదశినాడు నీరు మాత్రము త్రావుచు ఉండవలయును.

తతో యవాన్నం భుఞ్జీత గోమూత్రేణ ప్రపాచితమ్‌,

ప్రాయశ్చిత్తేన చైతేన ముచ్యతే పాతకాత్‌ తతః. 15

పిమ్మట గోవుమూత్రముతో వండిన యవల అన్నమును భుజింపవలయును. ఇట్టి ప్రాయశ్చిత్తము చేత ఆ పాతకమునుండి అతడు విడుదల పొందును.

అంధకార ప్రాయశ్చిత్తమ్‌

చీకటిలో దైవస్పర్శక ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

యః పునః కృష్ణవస్త్రేణ మమ కర్మపరాయణః,

దేవి కర్మాణి కుర్వీత తస్య వై పతనం శృణు. 16

నల్లని బట్టలు కట్టుకొని నా పూజలయందు ఆసక్తి కలవాడై ఆయాపనులు చేయువాని పాటెట్టిదో, వినుము.

ఘుణో వై పఞ్చవర్షాణి కాష్ఠభక్ష శ్చ జాయతే.

మశక స్త్రీణి వర్షాణి దంశస్త్రీణి చ పఞ్చచ. 17

మత్స్యో వై దశవర్షాణి లావకస్తు సమాస్త్రయః,

పఞ్చ వర్షాణి నకులో దశ వర్షాణి కచ్ఛపః.,

ఏవం భ్రమతి సంసారే మమ కర్మపరాయణః. 18

చెట్టపై పురుగై అయిదేండ్లు, దోమయై మూడేండ్లు, ఈగయై మూడేండ్లు, చేపయై పదియేండ్లు, లకుముకి పిట్టయై పదునైదేండ్లు, ముంగిసయై యైదేండ్లు, తాబేలై పదియేండ్లు ఈ ప్రపంచమున త్రిమ్మరుచుండును.

పారావతశ్చ జాయతే నవ వర్షాణి పఞ్చ చ,

తిష్ఠతే మమ పార్శ్వేషు యత్రైవాహం ప్రతిష్ఠితః. 19

నన్ను ప్రతిష్టించిన తావులలో పదునాల్గేండ్లు పావురమై నా పరిసరములలో నిలిచియండును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య సంసారమోక్షణమ్‌,

యేనాసౌ లభ##తే సిద్ధిం కృష్ణ వస్త్రాపరాధతః. 20

నల్లని బట్టలు తాల్చిన దోషమునకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దీనితో అతడు సిద్ధిని పొందును. సంసారము నుండి మోక్షము పొందును.

సప్తాహం యావకం భుక్త్వాత్రిరాత్రం సక్తు పిణ్డికాః,

త్రీణి పిణ్డాంస్త్రి రాత్రం తు ఏవం ముచ్యేత కిల్బిషాత్‌. 21

ఏడుదినములు యవలపిండిని, మూడు రాత్రులు పేలాలపిండిని రాత్రికి మూడు చొప్పున తినుచు పాపమునుండి విడుదల పొందును.

య ఏతేన విధానేన దేవి కర్మాణి కారయేత్‌,

శుచి ర్భాగవతో భూత్వా మమ మార్గాను సారకః,

న స గచ్ఛతి సంసారం మమ లోకాయ గచ్ఛతి. 22

ఈ పద్ధతితో కర్మములు చేయువాడు శుచియగు భాగవతుడై నా దారిననుసరించువాడై సంసారమునకు పోకుండును. నాలోకమునకు పయనించును.

కృష్ణవస్త్రాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

నల్లని వలువలు ధరించు దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

వాససా న చ ధౌతేన యో మే కర్మాణి కారయేత్‌,

శుచి ర్బాగవతో భూత్వా మమ మార్గానుసారకః. 23

తస్య దోషం ప్రవక్ష్యామి అపరాధం వసుంధరే,

పతన్తి యేన సంసారం వాససోచ్ఛి ష్ట కారిణః. 24

ఉతుకని వస్త్రము తాల్చి నా భక్తుడు నా పూజలు చేసినచో ఆ దోషమునకు శిక్ష యేమో తెలిపెదను. అట్లు మాసిన బట్టలు తాల్చి పూజ చేయువాడు సంసారమున పడిపోవును.

దేవి భూత్వా ఖగం తే తు జన్మ చైకం న సంశయః,

ఉష్ట్రం చైకం భ##వేజ్జన్మా జన్మచైకం ఖర స్తథా. 25

గోమాయు రేకజన్మా వై జన్మ చైకం హయ స్తథా,

సారఙ్గ స్త్వేకజన్మా వై మృగో భవతి వై తతః. 26

ఒక జన్మమున పక్షియు, ఒక జన్మమున లొట్టిపిట్టయు, ఒకజన్మమున గాదిదయు, ఒక జన్మమున నక్కయు, ఒక జన్మమున గుఱ్ఱమును, ఒక జన్మమున లేడియు నగును.

సప్త జన్మాన్తరం పశ్చాత్‌ తతో భవతి మానుషః,

మద్భక్త శ్చ గుణజ్ఞశ్చ మమ కర్మపరాయణః,

నిరపరాధో దక్షశ్చ అహంకార వివర్జితః. 27

ఇట్లు ఏడు జన్మముల తరువాత మానవుడై పుట్టును. నాకు భక్తుడు, గుణము లెరిగినవాడు, నా పూజలయందు శ్రద్దకలవాడు, దోషము లేనివాడు, సమర్థుడు అహంకారము లేనివాడు నగును. దోషములు లేనివాడు, సమర్థుడు అహంకారము లేనివాడు నగును.

ధరణ్యువాచ - భూమి యిట్లు పలికెను.

శ్రుత మేతత్‌ ప్రయత్నేన యత్త్వయా సముదాహృతమ్‌,

సంసారం వాస సోచ్ఛిష్టా యేన గచ్ఛన్తి మానుషాః. 28

మాసిన వలువలు కట్టి పూజచేయి మానవులు పొందెడు దుఃఖమును నీవు చక్కగా వివరించి చెప్పితివి.

ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి సర్వకర్మ సుఖావహమ్‌,

కిల్బిషాత్‌ యేన ముచ్యన్తి తవ కర్మపరాయణాః. 29

సర్వకర్మములకు మేలుకూర్చెడు ప్రాయశ్చిత్తమును కూడ నాకు చెప్పుము. నీపూజయందు చెదరని ఆసక్తి కల భక్తులు ఏమిచేసి యీ పాపమునుండి ముక్తి పొందుదురో దానిని నాకు సెలవిమ్ము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవి కథ్యమానం మయానఘే,

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి మమ కర్మ సుఖావహమ్‌. 30

దేవీ! నా అర్చనలకు సుఖమును కూర్చునట్టి ప్రయశ్చిత్తమును చెప్పెదను. వినుము.

యావకేన దినత్రీణి పిణ్యాకేన పునస్త్రయః,

కణభక్షో దినత్రీణి పాయసేన దినత్రయమ్‌,

పయోభక్షో దినత్రీణి వాయుభక్షో దినత్రయమ్‌. 31

ఏవం కృత్వా మహాభాగ వాససోచ్ఛిష్ట కారిణః,

అపరాధం న విద్యేత సంసారం చ న గచ్ఛతి. 32

యవలపిండితో మూడుదినములు, పిండితో మూడు దినములు, నూకలతో మూడు దినములు, పాయసముతో మూడుదినములు, పాలతో మూడు దినములు, ఏమియు తినకుండ మూడుదినములు-ఇట్లు మాసినగుడ్డలు కట్టుకొని పూజచేయువాడు ప్రాయశ్చిత్తము చేసికొనినచో అతనికి దోషముండదు. సంసారమునకు అరుగడు.

అధౌతవాసోపరాధ ప్రాయశ్చితమ్‌

ఉతుకని వస్త్రముల దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

శ్వానోచ్ఛిష్టం తు యో దద్యా న్మమ కర్మ పరాయణః,

పాపం తస్య ప్రవక్ష్యామి సంసారస్య మహద్‌ భయమ్‌. 33

కుక్కముట్టిన పదార్థమును నాకు నివేదన మొసగువాడు, ఆ పాపమువలన సంసారమను మహాభయమున చిక్కుకొనును.

శ్వానో వై సప్తజన్మాని గోమాయు స్సప్త వై తథా,

ఉలూకః సప్త వర్షాణి పశ్చా జ్జాయేత మానుషః. 34

ఏడు పుట్టుకలు కుక్కయు, ఏడుపుట్టుకలు నక్కయు, ఏడేండ్లు గ్రుడ్లగూబయునై పిదప మానవుడుగా పుట్టును.

విశుద్దాత్మా శ్రుతిజ్ఞశ్చ మద్భక్తశ్చైవ జాయతే,

గృహే భాగవతోత్కృష్టే అపరాధ వివర్జితః. 35

అంత భాగవతులలో శ్రేష్ఠుడైన వాని యింటియందు విశుద్ధమగు బుద్ధి కలవాడు, వేదముల నెరిగినవాడు నా భక్తుడు నై పుట్టును.

శృణు తత్త్వేన వసుధే ప్రాయశ్చిత్తం మహౌజసమ్‌,

తరన్తి మానుషా యేన త్యక్త్వా సంసారసాగరమ్‌. 36

పిక్కటిల్లిన శక్తి గల ప్రాయశ్చిత్తమును చెప్పెదను, మానవులు దానితో పాపమును వదలి సంసారమను సముద్రమును దాటుదురు.

మూలభక్షో దినత్రీణి ఫలాహారో దినత్రయమ్‌,

శాకభక్షో దినత్రీణి పయోభక్షో దినత్రయమ్‌. 37

దధ్యాహరో దినత్రీణి పాయసేన దినత్రయమ్‌,

వాయ్వాహారో దినత్రీణి స్నానం కృత్వా దఢవ్రతః. 38

ఏవం దినాన్యేకవింశత్‌ కృత్వా వై శుభలక్షణమ్‌,

అపరాధం న విన్దేత మమ లోకాయ గచ్ఛతి. 39

దుంపలు, పండ్లు, కూరలు, పాలు, పెరుగు, పాయసము, గాలి - వీనిని మూడేసి దినముల చొప్పున తినుచు ఇరువది యొక్క రోజులు చెదరని దీక్షతో, మంచి లక్షణములతో గడుపవలయును. అప్పుడా దోషము ఉండదు. నా లోకమునకు అరుగును.

శ్వానోచ్ఛిష్టాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

కుక్క ఎంగిలి దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

భుక్త్వా వరాహ మాంసం తు యశ్చ మామిహ సర్పతి,

పతనం తస్య వక్ష్యామి యథా భవతి సున్దరి. 40

పంది మాంసము తిని నా కడకు వచ్చు వాని పాటెట్టిదో, సుందరీ! చెప్పెదను.

వరాహో దశవర్షాణి భూత్వా త చరతే వనే,

వ్యాధో భూత్వా మహాభాగే సమాః సప్తచ సప్తచ,

భూమి ర్భూత్వా సమాః సప్త తిష్ఠతే తస్య పుష్కరే. 41

పందియై పదియేండ్లు అడవిలో తిరుగును. పదునాల్గేండ్లు బోయవాడగును. పిదప ఏడేండ్లు మట్టియై నీట మునుగుచుండును.

తతశ్చ మూషకో భూత్వా వర్షాణి చ చతుర్ధశ,

ఏకోనవింశ వర్షాణి యాతుధానశ్చ జాయతే. 42

పిదప పదునాలుగేండ్లు ఎలుక అయి, అటుపై పందొమ్మిదేండ్లు రక్కసుడగును.

శల్యకం చాష్టవర్షాణి జాయతే స వనే బహు,

వ్యాఘ్ర స్త్రింశ చ్చ వర్షాణి జాయతే పిశితాశనః. 43

ముళ్ళపందియై ఎనిమిదేండ్లు అడవిలో తిరుగుచుండును. ముప్పదియేండ్లు మాంసము తిండిగా గల పులియై పుట్టును.

ఏవం సంసారితాం గత్వా వారాహామిషభక్షకః,

జాయతే విపులే సిద్ధే కులే భాగవతస్తథా. 44

ఇట్లు యాతనల నన్నింటి ననుభవించి పంది మాంసము తిన్నవాడు పుణ్యముకల కులమున భాగవతుడై పుట్టును.

హృషీకేశవచః శ్రుత్వా సర్వం సంపూర్ణలక్షణమ్‌,

శిరసా చాఞ్జలిం కృత్వా వాక్యం చేద మువాచ హ. 45

నిండైన క్షణములు గల హృషీకేశుని మాట యంతయు విని భూదేవి తలపై దోసిలియొగ్గి ఇట్లు పలికెను.

ఏత న్మే పరమం గుహ్యం తవ భక్త సుఖావహమ్‌,

వరాహ మాంసభక్షం తు యేన ముచ్యేత కిల్బిషాత్‌. 46

పందిమాంసము తిన్నవానికి ప్రాయశ్చిత్త మెట్టిదియో భక్తులకు సుఖమును కూర్చెడు ఆ పరమ రహస్యమును నాకు తెలుపుము.

శ్రీవారాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

తరన్తి మానవా యేన తిర్యక్సంసార సాగరాత్‌,

గోమయేన దినం పఞ్చ కణాహారేణ సప్తవై. 47

పానీయం తు తతో భుక్త్వా తిష్ఠత్‌ సప్తదినం తతః,

అక్షారలవణం సప్త సక్తుభిశ్చ తథా త్రయః. 48

తిలభక్షో దివాన్‌ సప్త సప్త పాషాణ భక్షకః,

పయోభుక్త్వా దినం సప్త కారయే చ్ఛుద్ది మాత్మనః. 49

పశువుల పుట్టుకయనెడు సముద్రమునుండి మానవు లెట్లు దాటుదురో చెప్పెదను. అయిదు దినంములు ఆవుపేడతో, ఏడు దినములు నూకలతో, ఏడుదినములు నీటితో, ఏడుదినములు ఉప్పుకారములు లేని చప్పిడి కూటితో, మూడు దినములు పేలాలపిండితో, ఏడు దినములు నూవులతో, ఏడుదినములు ఉప్పుతో, ఏడు దినములు పాలతో గడపి తనకు శుద్ధిని కటిగించుకొనవలయును.

క్షాన్తం దాన్తం పరాకృత్వా అహంకార వివర్జితః,

దినా న్యూకోనపఞ్చాశ చ్చరతః కృతనిశ్చయః. 50

విముక్తః సర్వపాపేభ్యః ససంజ్ఞో విగతజ్వరః,

కృత్వాతు మమ కర్మాణి మమ లోకాయ గచ్ఛతి. 51

క్షమ, ఇంద్రియనిగ్రహము కలవాడగును. అహంకారమును విడనాడును. ఇట్లు చెదరని దీక్ష కలవాడై నలుబదితొమ్మిది రోజులు ప్రవర్తించువాడు పాపములన్నింటి నుండియు ముక్తి పొంది జ్ఞానము కలవాడై, ప్రమాదము లేనివాడై నా కర్మము లాచరించి నీలోకమున కరుగును.

వారాహమాంసభక్షణ ప్రాయశ్చిత్తమ్‌

పందిమాంసము తినినదానిక ప్రాయశ్చిత్తము.

- 0 -

శ్రీవరాహ ఉవాచ - శ్రీవారాహదేవు డిట్లు పలికెను.

జాలపాదం భక్షయిత్వా యస్తు మా ముపసర్పతి,

జాలపాదం తతో భూత్వా వర్షాణి దశ పఞ్చ చ,

కుంభీరో దశవర్షాణి పఞ్చ వర్షాణి సూకరః. 52

బాతుమాంసము తిని నాకడకరుదెంచువాడు పదునైదేండ్లు బాతు అగును. పదియేండ్లు మొసలియగును. అయిదేండ్లు పంది యగును.

తావద్‌ భ్రమతి సంసారే మమ చైవాపరాధతః,

కృత్వా తు దుష్కరం కర్మ జాయతే విపులే కులే. 53

నా యెడల చేసిన ఈతప్పునకు సంసారమున పడి పొరలు చుండును. కడకు చేయరాని పుణ్యకర్మముచేసి శ్రేష్ఠమగు కులమున పుట్టును.

శుద్దో భాగవతః శ్రేష్ఠ స్త్వపరాధ వివర్జితః,

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి. 54

పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, దోషము లేనివాడు నగు భాగవతుడై సర్వధర్మములను వదలివైచి నాలోకమున కరుగును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి జాలపాదస్య భక్షణ,

తరన్తి మనుజా యేన ఘోరసంసారసాగరాత్‌. 55

మనుజుల ఘోరమైన దుఃఖమనెడు సముద్రము నుండి దేనివలన దాటుదురో అట్టి ప్రాయశ్చిత్తమును, బాతుమాంసము తిన్న పాపమునకు చేయవలసిన దానిని చెప్పెదను.

యావకానాం దినత్రీణి వాయుభక్షో దినత్రయమ్‌,

ఫలభక్షో దినత్రీణ తిలభక్షో దినత్రయమ్‌.56

అక్షారలవణాన్నాశీ పునస్తత్ర దినత్రయమ్‌,

పఞ్చదశ దినాన్యేవం ప్రాయశ్చిత్తం సమాచరేత్‌. 57

మూడుదినములు యవల అన్నము, మూడు దినములు గాలిని, మూడు దినములు, పులుపు, ఉప్పులేని అన్నమును - ఇట్లు పదునైదు దినములు భోజననియమమును పెట్టుకొని ప్రాయశ్చిత్తమును చేసికొనవలయును.

జాలపాదాపరాధస్య ఏవం కుర్వీత శోధనమ్‌,

వినీతాత్మగతి ర్భూత్వా యదీచ్ఛేత్‌ సుందరాం గతిమ్‌. 58

మనోజ్ఞమైన గతిని కోరువాడగునేని చక్కదిద్దు కొన్నబుద్ధి కలవాడై బాతుమాంసము తిన్న తప్పునకు ప్రాయశ్చిత్తము నిట్లు చేసికొనవలయును.

ఇతి జాలపాదభక్షణాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

ఇది బాతుమాంసపు దోషమునకు ప్రాయశ్చిత్తము.

ఇది శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చత్రింశదధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటముప్పది అయిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters