Varahamahapuranam-1    Chapters   

త్రయస్త్రింశ దధిక శతతమోధ్యాయః - నూటముప్పది మూడవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు చెప్పెను.

శృణు తత్త్వేన మే భూమి కథ్యమానం మయానఘే,

పురీషం ముచ్యతే యస్తు మమ కర్మ సమాచరన్‌. 1

భూమీ! నా అర్చనము చేయుచు మలమును విసర్జించు దోషమును గూర్చి నేను చెప్పుచున్నదానిని వినుము.

దివ్యం వర్షసహస్రం తు రౌరవే నరకే వసేత్‌,

పురీషం భక్షయేత్‌ తత్ర మహాదుఃఖ సమన్వితః. 2

అట్టివాడు రౌరవ నరకమున దేవతల వేయియేండ్లు మలము తినుచు మహాదుఃఖము ననుభవించును.

ప్రాయశ్చిత్తం వదా మ్యత్ర యేన ముచ్యేత కిల్బిషాత్‌,

మమకర్మ పరిభ్రష్టో విహతేనాన్తరాత్మన. 3

చెడిన బుద్ధితో నా ధర్మమునుండి పరిభ్రష్టుడైనవాడు పాపమునుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. వినుము.

ఏకాం జలమయీం శయ్యా మేకమాకాశ శాయనమ్‌,

ఏవం కృత్వా విధానం తు సోపరాధాత్‌ ప్రముచ్యతే. 4

నీటిలో ఒకదినము, బయలున ఒక దినము నిద్రించి ఈ అపరాధము వలన విడుదల పొందును.

ఏతత్‌ తే కథితం భ##ద్రే పురీషం యః సముత్పృజేత్‌,

మద్భక్తేషు విశాలాక్షి అపరాధ వినిశ్చయః. 5

పూజావిధానసమయమున మలము విసర్జించు నా భక్తుల అపరాధమును, ప్రాయశ్చిత్తమును నీకు తెలియజెప్పితిని.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రయస్త్రింశ దధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్చాస్త్రమున నూటముప్పది మూడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters