Varahamahapuranam-1    Chapters   

అధ వింశత్యధికశతతమోధ్యాయః - నూట ఇరువదియవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడిట్లు చెప్పెను.

యేన గర్భం నగచ్ఛేత తన్మేశృణు హి మాధవి,

కథయిష్యామి తే హ్యేవం సర్వధర్మ వినిశ్చయమ్‌. 1

ఓమాధవీ! దేనిచేత మనుజుడు గర్భవాసము పొందకుండునో ఆ సర్వధర్మ వినిశ్చయమును చెప్పెదను వినుము.

కృత్వాపి విపులం కర్మ ఆత్మానం న ప్రశంసతి,

కుర్వతే చ బహు కర్మ శుద్ధేనైవాంతరాత్మనా. 2

గొప్పపని చేసియు తన్నుతాను పొగడుకొనక నిర్మలమగు మనస్సుతో పెక్కు సత్కర్మములు ఆచరించువాడు.

కృత్వాపి మమ కర్యాణి మత్ర్పియాణి వసుంధరే,

నైవ కుర్వన్త్యహంకారం క్రోధం చైవ నగృహ్ణతి. 3

నాకు ప్రియమైన నాపూజాదికార్యములు చేసియు అహంకారము పొందనివాడు, క్రోధము తాల్పనివాడు.....

సమం పశ్యతి చిత్తేన లాభాలాభవివర్జితః,

పఞ్చానా మిన్ద్రియాణాంచ సమర్థో నిగ్రహే రతః. 4

మనస్సుతో సమమును దర్శించుచు, లాభనష్టములను పట్టించుకొనక అయిదు ఇంద్రియములపై అదుపుకలిగి, ఆ నిగ్రహమున ప్రీతికలవాడు .....

కార్యా కార్యే విజానాతి సర్వధర్మేషు నిష్ఠితః,

శీతోష్ణవాత వర్షాశ్చ క్షుత్పిపాసా సహాశ్చయే. 5

కార్యము, అకార్యమలను చక్కగా ఎరుగువాడు, ధర్మములన్నింట నిష్ఠకలాడు, చలి వేడి, గాలి, ఆకలి దప్పి అనువానినిన సహించువాడు....

యో దరిద్రో నిరాలస్యః సత్యవాగనసూయకః,

స్వదారనిరతో నిత్యం పరదారవివర్జకః. 6

దరిద్రుడయ్యును, పనులయందు సోమరితనము లేనివాడు, సత్యమేపలుకువాడు, అసూయ లేనివాడు, ఎల్లప్పుడు తన భార్యయందే మనసు కలవాడు, ఇతరుల భార్యలను మోహింపనివాడు....

సత్యవాదీ విశుద్ధాత్మా నిత్యం భాగవతప్రియః,

సంవిభాగీ విశేషజ్ఞో నిత్యం బ్రాహ్మనవత్సలః. 7

సత్యస్వరూపమగు పరమాత్మను గూర్చియే పలుకువాడు, విశుద్ధమగు అంతరంగము కలవాడు, నిత్యము భగవద్భక్తులయందు ప్రియముకలవాడు, వివేకవంతుడు, విశేషముల నెరుగువాడు, బ్రహ్మజ్ఞానుల యందు పుత్రప్రేమ కలవాడు....

ప్రియవాదీ ద్విజానాం చ మమ కర్మ పరాయణః,

కుయోనిం తు నగచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి. 8

ప్రియములుపలుకువాడు, ద్విజులయు, నాయొక్కయు కార్యములయందు శ్రద్ధకలవాడును అగు భక్తుడు పాడు కడుపులలో పడడు. నాలోకమున కరుగును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

యో వియోనిం నగచ్ఛేత మమ కర్మపరాయణః. 9

వసుంధరా! నాపూజయందు మిక్కిలి ఆసక్తికలనరుడు వేరుజాతుల కడుపులలో పడకుండుటను గూర్చి వివరించిచెప్పెదను వినుము.

జీవాని యే నహింసన్తి సర్వభూతహితః శుచిః,

సర్వే సమాని పశ్యన్తి కాంచనం లోష్టవిద్యయా. 10

ప్రాణులను హింసింపడు, సర్వప్రాణులమేలును కోరుచుండును. పరిశుద్ధుడై అన్నింటిని సమానముగా చూచును బంగారమును మట్టిపెళ్ల వలె భావించును.

బాలే వయసి వర్తన్తః క్షాంతా దాంతాః శుభే రతాః,

కృత్యాన్యేవ విజానన్తి పరేణాపి కృతం క్వచిత్‌. 11

చిన్నవయసునందున్నను క్షమ, దమము కలవాడై పుణ్యకార్యములయందాసక్తి కలిగియుండును. మంచిపనులనే తెలిసికొనును. పగవాడు కీడుచేసినను పట్టించుకొనడు

కృత్యం నవిస్మరేద్‌ యేన ఆసత్యం చ న జల్పతి,

వ్యలీకేషు నివర్తన్తే పర్యేతి కృతనిశ్చయః. 12

చేయవలసిన దానిని మరవడు. అబద్ధములు వాగుడు. మోసములనుండి మరలును. ఒకనిశ్చయమునకు వచ్చి దానిని తుదిముట్ట సాధించును.

నిత్యం చ ధృతిమాన్‌ యశ్చ పరోక్షే న చ నిక్షిపేత్‌,

ఋతుకాలేభిగచ్చేత అపత్యార్థం స్వకాం స్త్రియమ్‌. 13

ఎల్లప్పుడు ధృతికలిగియుండును. చాటుమాటున ఆక్షేపించడు, కేవలము సంతానము కొరకు తనయిల్లాలిని ఋతుకాలమున మాత్రమే పొందును.

ఈదృశాస్తు నరాభ##ద్రే మమ కర్మపరాయణాః,

వియోనిం తే న గచ్ఛన్తి మమ గచ్ఛన్తి సుందరి. 14

భూదేవీ! ఇట్టినరులు నాకర్మమున మిక్కిలి శ్రద్ధకలవారై వేరుజాతుల గర్భములందు పడరు. నాలోకమున కరుగుదురు.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణోహి వసుంధరే,

పురుషాణాం ప్రపన్నానాం యశ్చ ధర్మః సనాతనః. 15

వసుంధరా! మరల ఇంకొకవిషయమును చెప్పెదను వినుము. ప్రపన్నులగు పురుషులకు సనాతనమగు ధర్మ మేదియో ఎరుగుము.

మనునాప్యన్యథా దృష్టో హ్యన్యధాజ్గిరసేన చ,

శుక్రేణ చాన్యథా దృష్టో గౌతమేనాపి చాన్యథా. 16

సోమేన చాన్యథా దృష్టో రుద్రేణౖ వాన్యథా పునః,

శ##జ్ఖేన చాన్యథా దృష్టో లిఖితేనైవ చాన్యథా. 17

కశ్యపేనాన్యథా దృష్టో ధర్మేణౖ వాన్యథా ధరే,

అగ్నినా వాయునా చైవ దృష్టో ధర్మోన్యథా ధరే. 18

య మేన చాన్యథా దృష్ట ఇన్ద్రేన వరుణన చ,

కుబేరేణాన్యథా దృష్టః శాణ్డిల్యేనాపి చాన్యథా. 19

పులస్త్యే నాన్యథా దృష్ట ఆదిత్యేనై నాపి చాన్యథా,

పితృభి శ్చాన్యథా దృష్ట మన్యథా చ స్వయంభువా. 20

మనువు, అంగిరసులు, శుక్రుడు, గౌతముడు, సోముడు, రుద్రుడు, శంఖుడు, లిఖితుడు, కశ్యపుడు, ధర్ముడు, అగ్ని, వాయువు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, శాండిల్యుడు, పులస్త్యుడు, ఆదిత్యుడు, పితృదేవతలు, స్వయంభువగు బ్రహ్మ - వీరందరు ధర్మమును వేరువేరు విధములుగా దర్శించిరి.

ఆత్మన్యాత్మని ధర్మేణ యే నరా నిశ్చితవ్రతాః,

స్వకం పాలయతే ధర్మ స్వమతేనవ భాషితమ్‌. 21

ఆయానరులు తమతమ ఆత్మలయందు ధర్మము విషయమున నిశ్చయమైన వ్రతముగలవారు. ఎవరిధర్మమును వారు పాలింతురు. తమ అభిప్రాయమునే ధర్మముగా వక్కాణించిరి.

పరవాదం నకుర్వీత సర్వధర్మేషు నిశ్చితః,

న నిందేత్‌ ధర్మకార్యాణి ఆత్మధర్మపథే స్థితః. 22

ధర్మములన్నింటియందును నిశ్చయబుద్ధి కలవాడై యితరులను నిందిపరాదు. తనధర్మమునందు తాను గట్టిగా నిలిచి ధర్మకార్యములను తూలనాడకుండవలయును.

ఏభి ర్గుణౖః సమాయుక్తో మమ కర్మాణి కుర్వతి,

వియోనింతే నగచ్ఛన్తి మమ లోకాయ గచ్ఛతి. 23

ఈ గుణములతో చక్కని పొందిక కలిగి నాపనులు చేయుచుండు వాడు పశుపక్ష్యదియోనులలో ప్రవేశింపడు. నాలోకమున కరుగును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వేహ మాధవి,

తరన్తి పురుషా యేన గర్భసంసార సాగరాత్‌. 24

మాధవీ! గర్భమనుసంసారసాగరము నుండి తరించు మార్గమును మరియొకదానిని వక్కాణించెదను. వినుము.

జితేన్ద్రియా జితక్రోధా లోభమోహ వివర్జితాః,

ఆత్మపాకరతా నిత్యం దేవాతిథి పితృప్రియాః. 25

ఇంద్రియములను గెలిచినవారు, క్రోధముపై అదుపు కలవారు. లోభమోహములను వదలివైచినవారు, తన పరిణతస్థితియందు ప్రీతి కలవారు, ప్రతిదినము దేవతలను, అతిథులను, పితృదేవతలను ప్రీతిగాచూచువారు...

హింసాదీని న కుర్వన్తి మధుమాంసవివర్జితాః,

గావశ్చ నిత్యం వన్దన్తి సురాపాన వివర్జితాః. 26

హింసమొదలగు నీచకార్యములను చేయనివారు, మద్యమాంసములను ముట్టనివారు, నిత్యము, గోవులకు వందన మాచరించువారు, సురాపానము పొంతపోవనివారు...

మనసా బ్రాహ్మణీం చైవ యో న గచ్ఛేత్‌ కాదాచన,

కపిలాం దదతే విప్రే వృద్ధం సాంత్వేన పాలయేత్‌. 27

బ్రాహ్మణవనితను మనస్సునందుకూడ దుష్టభావముతో పొందనివాడు, విప్రునకు కపిలగోవును దానమోసగువాడు. ముదుసలిని మంచిమన్ననతో పరిరక్షించువాడు...

సర్వేషాం చైవ పుత్రాణాం విశేషం యో సకుర్వతి,

సంక్రుద్ధం బ్రాహ్మణం దృష్ట్వా యస్తు తత్ర ప్రసాదయేత్‌. 28

కుమారులందరిలో భేదబుద్ధిని చేయనివాడు, మిక్కిలి కోపగించిన బ్రహ్మవేత్తను చూచి ప్రసన్నునిచేయువాడు...

యఃస్పృశేత్‌ కపిలాం భక్త్యా కుమారీం చ న దూషయేత్‌,

అగ్నించ నాక్రమేత్‌ పద్భ్యాం న చపుత్రేణ భాషయేత్‌,

జలే న మేహనం చైవ గురువాక్యం నజల్పకః. 29

కపిలగోవును భక్తితో తాకువాడు, కన్యను చెఱుపనివాడు. అగ్నిని కాళ్లతో తాకనివాడు, కొడుకుతో వివాదము చేయనివాడు. నీటిలో మలమూత్రములు వదలనివాడు, గురువు పలుకును వెక్కిరింపని వాడు....

ఏవం ధర్మేణ సంయుక్తో యో ను మాం ప్రతిపద్యతే,

సచ గర్భం నగచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి 30

ఇట్లిట్లు ధర్మముతో కూడినవాడై నన్ను పొందెడు వాడు గర్భవాసదుఃఖమును పొందడు. నాలోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే వింశత్యధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటఇరువదియవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters