Varahamahapuranam-1    Chapters   

అథఏకోనవింశత్యధిక శతతమోధ్యాయః - నూటపందొమ్మిదవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడిట్లనెను

శృణుష్వ పరమం గుహ్యం యత్‌ త్వయాపూర్వపృచ్ఛితమ్‌,

దేవి సర్వం ప్రవక్ష్యామి సంసారతరణం మహత్‌. 1

దేవీ! నీవు నన్నింతకుముందడిగిన సంసారతరణమును గూర్చి మిక్కిలి రహస్యమగుదానిని చెప్పెదను వినుము.

స్నానం కృత్వా యథాన్యాయం మమ కర్మపరాయణాః,

ఉపసర్పన్తి మేభక్త్యా కదన్నాశా జితేన్ద్రియాః. 2

నాపనులయందు పరమశ్రద్ధకలవారు, విధి ననుసరించి స్నానమాచరించి చెడ్డకూడు తినువారయ్యు ఇంద్రియనిగ్రహము కలవారై నాకడ కరుదెంతురు.

యచ్చైవ ముచ్యతే భ##ద్రే మమ రూపం సనాతనమ్‌,

అహమేవ వరారోహే సర్వభూతం సనాతనమ్‌. 3

సుందరీ! నాసనాతనమగు రూపమేది చెప్పబడుచున్నదో అదియే సర్వము సనాతనము అయిన నేను.

అధశ్చోర్ధ్వం చ యశ్చైవ అహమేవ వ్యవస్థితః,

దిశాంచ విదిశాం చైవ అధశ్చోర్ధ్వం చ భావిని 4

క్రిందివైపు, పైవైపు, అన్నిదిక్కులలో క్రిందుమీదులందును నెలకొని ఉన్నవాడను నేనే.

సర్వదా వన్దనీయా స్తే మమ భ##క్తేన నిత్యశః,

క్రియాయుక్త సమూహేన యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌ 5

కావున నా భక్తుడు పరమగతిని కోరువాడైనచో అన్నివిధముల అందరిని అన్నింటిని పూజాదికార్య సముదాయముచేత నమస్కరింపవలయును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి గుహ్యం లోకే మహద్యశః,

యదావై వన్దనీయా స్తే మమ మార్గానుసారిణః. 6

నా మార్గము ననుసరించువారిని ఎట్లు వందనము చేయవలయునో ఆ రహస్యమును, గొప్పకీర్తికలదానిని కూడ నీకు తెలిపెదను

కృత్వాపి పరమం కర్మ బుద్ధి మాదాయ తద్విధామ్‌,

తతః పూర్వముఖో భూత్వా శుచి ర్గృహ్య జలాంజలిమ్‌,

మూలయోగం సమాదాయ ఇమం మన్త్ర ముదీరయేత్‌. 7

పరమమైన అర్చనను గావించి, అవిధమైన బుద్ధిని నిలుపుకొని తూర్పునకు మోగముంచి పరిశుద్ధుడై దోసిలితో నీటిని గ్రహించి మూలయోగమును చక్కగా చేసికొని ఈ మంత్రమును పలుకవలయును (మూలమోగము అన్నింటికి మూలమగు మనస్సును పరమాత్మతో కలుపుట)

యజామహే ధర్మపరాయణోద్భవం నారాయణం ప్రసీదేశాన,

సర్వలోక ప్రధానం పురాణం కృపాసంసారమోక్షణమ్‌. 8

ధర్మమును పరమగతికి కారణమైనవాడు, సర్వలోక ప్రధానుడు, పురాణుడు, కృపతో భక్తులసంసారమును పటాపంచలు చేయువాడు నగు శ్రీనారాయణుని పూజింతుము. ఈశ్వరా! ప్రసన్నుడవు కమ్ము.

తతః పశ్చాన్ముఖోభూత్వా పునర్గృహ్య జలాంజలిమ్‌,

ఓంనమోనారాయణత్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌. 9

మరల పడమటివైపు మొగము పెట్టి దోసిలిలోనికి నీటినగ్రహించి 'ఓంనమో నారాయణాయ' అని పలికి ఈ మంత్రమును పఠింపవలయును.

ఓం మన్త్రా ఊచుః - మంత్రములు

యదాను దేవః ప్రథమాదికర్తా

పురాణకల్పం చ యథా విభూతిః

దివి స్థితా చాది మనన్తరూప

మమోఘమోఘం సంసారమోక్షణమ్‌. 10

ఆదేవుడు మొదటి సృష్టికర్త. సనాతనుడు సర్వ ఐశ్వర్యరూపుడు. స్వర్గమున నున్నవాడు. సర్వమునకు మొదటివాడు. అనంతమైన రూపములు కలవాడు. ఎందును ఎదురులేనివాడు. సంసారమునుండి ముక్తినొసగువాడు.

అధ తస్మింస్తు కాలేస్మిన్‌ పునర్గృహ్య జలాంజలిమ్‌,

తేన చైవాస్య యోగేన భూత్వా చైవోత్తరాముఖః,

నమోనారాయణత్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌. 11

అటుపిదప మరల నీటిదోసిలిని గ్రహించి అదే యోగముతో ఉత్తరమువైపు ముఖము ఉంచి 'ఓంనమో నారాయణాయ' అని పలికి ఈ మంత్రమును పఠింపవలయును.

మన్త్రోచ్యతే - మంత్రము

యజామహే దివ్యపరం పురాణ మనాది

మధ్యాంతమనంత రూపమ్‌. భవోద్బవం సంసార

మోక్షణమ్‌. 12

దివ్యుడు, పరుడు, పురాణుడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, అనంతములైన రూపములు గలవాడు, సంసారమునుండి విడుదల కలిగించువాడునగు దేవుని అర్చింతుము.

తతస్తేనైవ కాలేన భూత్వా వై దక్షిణాముఖః,

నమః పురుషోత్తమాయేత్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌ 13

వెనువెంటనే దక్షిణమునకు మొగము పెట్టి 'ఓంనమః పురుషోత్తమాయ' అని పలికి మంత్రమును చదువవలయును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

యజామహే యజ్ఞమహో రూపజ్ఞం కాలంచకాలాదిక

మప్రయేయమ్‌. అనన్యరూపం సంసారమోక్షణమ్‌. 14

యజ్ఞరూపుడు, రూపములునెరిగినవాడు, కాలస్వరూపుడు, కాలమునకు మొదటివాడు, ఊహింపరానివాడు, అనన్యమగు రూపముకలవాడు, సంసారమును రూపుమాపువాడునగు స్వామిని పూజింతుము.

కాష్ఠకృత్యస్తతో భూత్వా కృత్వా చేన్ద్రియనిగ్రహమ్‌,

అచ్యుతే తు మనఃకృత్వా ఇమం మన్త్రముదాహరేత్‌. 15

పిదప సమిధల పనిముగించి ఇంద్రియనిగ్రహము కలవాడై అచ్యుతునియందు మనస్సును నిలిపి ఈ క్రిందిమంత్రమును చదువవలయును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

యజామహే సోమపధేన భావే త్రిసప్తలోకనాథమ్‌,

జగత్ర్పదానం మృత్యురూపం సంసారమోక్షణమ్‌. 16

మూడేడులోకములకు నాథుడు, సోమ మార్గమున (యజ్ఞపద్ధతియందు) నిలిచియుండువాడు, జగత్తునకు ప్రధానుడు, మృత్యురూపుడు అయి సంసారమును రూపుమాపు దేవుని యజింతుము.

ఏతేషాం త్రిషు సంధ్యాసు కర్మచైవం సమాచరేత్‌,

బుద్ధిమాన్‌ మతిమాన్‌ భూత్వా యదీచ్ఛేత్‌ పరమాంగతిమ్‌ 17

ఈ తీరుగా బుద్ధియు ప్రజ్ఞయుగల భక్తుడు, పరమగతిని కోరువాడైనచో ఈ పూజా విధానములు మూడు సంధ్యలయందును భక్తితో చేయవలయును.

మోగానాం పరమో యోగో గుహ్యానాం గుహ్యముత్తమమ్‌,

సాంఖ్యానాం పరమం సాంఖ్యం కర్మణాం కర్మచోత్తమమ్‌ 18

ఇదియోగములలో పరమయోగము, రహస్యములలో ఉత్తమ రహస్యము. జ్ఞానమార్గములలో పరమసాంఖ్యము. కర్మములతో ఉత్తమకర్మము.

ఏతన్నదద్యా న్మూర్ఖాయ పిశునాయ శఠాయచ,

దీక్షితాయైవ దాతవ్యం సుశిష్యాయ దృఢాయ చ. 19

ఈ యోగమును మూర్ఖునకు, పిసినిగొట్టునకు, మొండివానికి ఒసగరాదు. ఉత్తమశిష్యుడు, గట్టిగుండెనిబ్బరము కలవాడునగు దీక్షితునకు మాత్రమే ఒసగవలయును.

ఏతన్మరణకాలేపి గుహ్యం విష్ణుప్రభాషితమ్‌,

బుద్ధిమాన్‌ మతిమాన్‌ భూత్వా విస్మరేన్న కదాచన. 20

శ్రీమహావిష్ణువు ఉపదేశించిన ఈ రహస్యమును బుద్ధిప్రజ్ఞలుగల వాడై భక్తుడు చావుదాపురించినపుడును మరువరాదు.

య ఏతత్‌ పఠతే నిత్యం కల్యోత్థాయ దృఢవ్రతః,

మమాపి హృదయే నిత్యం స్థితః సత్త్వగుణాన్తితః. 21

ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి ఏమాత్రము చెదరని వ్రతముకలవాడై దీనిని పఠించువాడు సత్త్వ గుణముతో కూడినవాడై నాహృదయమున శాశ్వతముగా నిలుచును.

య ఏతేన విధానేన త్రిసంధ్యం కర్మ కారయేత్‌,

తిర్యగ్యోన్యాపి సంప్రాప్య మమ లోకాయ గచ్ఛతి. 22

ఈ విధానముతో మూడు సంధ్యలయందును కర్మము నాచరించువాడు పశుపక్ష్యాదులకడుపున పుట్టినను నాలోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకోనవింశత్యధిక శతతమోధ్యాయః.

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపందొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters