Varahamahapuranam-1    Chapters   

సప్తదశాధికశత తమో7ధ్యాయః - నూటపదునేడవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను

శృణు తత్త్వేన మే భ##ద్రే ప్రాయశ్చిత్తం యథావిధి,

యథావత్‌ నచ దాతవ్యో మమ భ##క్తేన విద్యయా 1

భద్రా! ప్రాయశ్చిత్తము నున్నదున్నట్లు విధి ననుసరించి చెప్పెదను వినుము. మరియు ఏ తెలివితో నాభక్తునకు దాన మొసగవలయునో చెప్పెదను.

యథాచాభ్యఞ్జనం దద్యాద్‌ యత్‌ త్వయాపూర్వపృచ్ఛితమ్‌,

ఉద్వర్తనవిధిం చాపి శృణు దేవి మమ ప్రియమ్‌,

సామాన్యం చైవ కర్మణ్యం శివస్నానం మమ ప్రియమ్‌ 2

తలంటుస్నానము, నలుగుబెట్టుట, సామాన్యముగా చేసెడు శివస్నానము అనునాకు ప్రియమైనవి యెట్లు ఒసగవలయునో తెలిపెదను వినుము.

కల్యమేవ సముత్థాయ హన్యాద్‌ భేరీ యథోచితామ్‌,

యత్ర భేరీ న వాద్యేత కవాటం తత్ర చాహనేత్‌. 3

ఉషఃకాలమున నిద్రలేచి తగువిధమైన భేరిని మ్రోగింపవలయును. భేరి మ్రోగించుటకు వీలు కానిచో తలుపులనైన శబ్దము చేయవలయును.

ద్వాత్రింశత్‌ ప్రకారాణి పదే దక్షిణ జానునా,

నమో నారాయణ త్యుక్త్వా ఇమం మన్త్ర ముదీరయేత్‌. 4

కుడిమోకాలితో ఇరువదిరెండు పదములు 'నమో నారాయణాయ' అని పలుకుచు తిరుగుచు ఈక్రింది మంత్రమును పలుకవలయును.

దేవతా తపవస్వయ ఆదిమధ్యావసాన అవ్యక్త అవ్యయ

బుద్ధ్యస్వ తవ కర్మణాం సంహారకర్తా చ ఆగతం విజ్ఞాహి తవ కర్మణ్యవస్థితమ్‌.

ఓపరమ దైవమా! ఆదియు, మధ్యయు, అవసానము అయినదేవా! అవ్యక్తరూపా! అవ్యయా! మేల్కొనుము. నీ కార్యములు నిర్వహించుటకు, నీపనులయందు నిష్ఠగలవాడు వచ్చెనని తెలియుము

అనేన మన్త్రేణ చోద్ఘాటితవ్యం దన్తకాష్ఠం చ దాతవ్యమ్‌.

ఈ మంత్రముతో తలుపులను తెరుపవలయును. పలుదోము పుల్లను సమర్పింపవలయును.

యావన్న స్పృశ##తే భూమిం తావద్‌ దీపం నజ్వాల్యతే,

దీపే ప్రజ్వలితే తత్ర హస్తశౌచం తు కారయేత్‌. 5

భూమిని తాకకుండ దీపమును వెలిగింపరాదు. దీపము వెలిగించిన పిదప చేతిని శుద్ధిచేసికొనవలయును.

తతః ప్రక్షాళ్య హస్తౌతు పున రేవ ముపాగతః,

చరణౌ వన్దయిత్వా తం దంతధావ ముపానయేత్‌. 6

చేతులు కడిగికొని మరల లోనికి వచ్చి విగ్రహపు చరణములకు మ్రొక్కి దంతధావనమును కావింపవలయును.

తతః ప్రస్థాపై#్యవ దన్తై ర్విగృహ్య పూర్వం జలం శుచిః,

నిరపరాధో మధ్యస్థ ఇదం మన్త్ర ముదాహరేత్‌. 7

పిదప మంచినీరు నీరు తెచ్చి దంతములను శుభ్రముచేసి, ఏదొసగులేనివాడు, ఏపక్షపాతములేని వాడునగు భక్తుడు ఈ మంత్రము నుచ్చరింపవలయును.

ఓం మన్త్రా ఊచుః - మంత్రములు.

భువనభవన రవిసంహరణ అనన్తో మధ్యశ్చేతి గృహ్ణేమం భువనం దంతధావనమ్‌.

భువనముల పుట్టుకకు కారణమైన వాడా! సూర్యుని అస్తమింపజేయువాడా! అనంతుడా! అన్నింటికి మధ్యనుండు దేవా! ఇదిగో దంతధావనమును స్వీకరింపుము.

యత్‌ త్వయా భాషితం సర్వ మేవం ధర్మవినిశ్చయమ్‌,

దంతధావనం తతో దద్యాద్‌ యావత్‌ కర్మ వసుంధరే,

నిర్మాల్యం శిరసి కశ్చిద్‌ భక్త్యా వాత్మసమానతః. 8

భూదేవీ! ఇది నీవు నన్నడిగినదానికి సమాధానము దంతములను తోముట ముగిసినపిదప మిగిలిన జలములను భక్తుడు తనశిరస్సున భక్తితో చల్లుకొనవలయును.

పశ్చాత్‌ తు జలపూతేన తతో హస్తేన సుందరి,

కుర్యాత్‌ తు ముఖకర్మాణి స్వల్పేన సలిలేన చ. 9

పిదప నీటితో పవిత్రమగు చేతితో కొంచెము పాటినీటితో స్వామికి ముఖకార్యములను చేయవలయును.

ముఖే ప్రక్షాళ్యమానే తు మన్త్రం మే శృణు సుందరి,

యస్త్వేవం కృతమన్త్రేణ సంసారాత్‌ తు ప్రముచ్యతే. 10

ముఖము కడుగునపుడు చెప్పవలసిన మంత్రమును, సుందరీ నావలన వినుము. ఈ మంత్రముతో ఆపని చేయువాడు సంసారమునుండి ముక్తిపొందును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికెను.

జలం గృహ్య దేవ హర్తా కర్తా వికర్తా ఊచతాహవాం,

త్వాం గుణశ్చ ఆత్మనశ్చాపి గృహ్ణ వారిణశ్చాపి.

దేవా! నీవు హరించువాడవు, చేయువాడవు, విపరీతము చేయువాడవు. జలమును గ్రహింపుము. నిన్నే మేము కొనియాడుదుము. నీకొరకు తెచ్చిన నీటిగుణమును గూడ గ్రహింపుము.

సర్వతో దేవతానాం ముఖప్రక్షాళనం కృత్వాః

ఇట్లు అంతట దేవతలముఖప్రక్షాళనము చేసి

హ్యేతేన పూజయే న్మన్త్రాన్‌ ధూపనైవేద్యైశ్చ సుగం ధైశ్చ పున రేవం సమర్చయేత్‌.

ఇట్లు మంత్రములతో పూజించి ధూపములతో నైవేద్యములతో సుగంధములతో మరల స్వామిని సమర్పింప వలయును.

తతః పుష్పాఞ్జలిం దత్వా భగవద్భక్తి వత్సలః,

నమో నారాయణ త్యుక్త్వా ఇమం మన్త్రముదాహరేత్‌. 11

పిదప భగవంతుడు, భక్తవత్సలుడు అయిన స్వామికి పూలదోసిలి సమర్పించి 'నమో నారాయణాయ' అని పలికి ఈ మన్త్రమును పఠింపవలయును.

ఓం మన్త్ర ఉచ్యతే - మంత్రము చెప్పబడుచున్నది.

యజ్ఞానాం యజ్ఞయష్టాయం భూత స్రష్టార మేవ చ,

అన్యం పుష్పం హి సంగృహ్య కల్యముత్థాయ మాధవమ్‌. 12

యజ్ఞములను సృజించినవాడు, యజ్ఞములనాచరించువాడు. భూతములను సృష్టించినవాడునగు మాధవుని ప్రాతః కాలమున లేచి, మరియొక పుష్పమును కొనితెచ్చి, నేను పూజింతును.

ఏవం పుష్పాణి ఆదాయ జ్ఞానీ భగవతః శుచిః,

దేవీతలే నిపత్యేత్‌ తు సర్వకర్మ సమన్వితః. 13

జ్ఞానము కలవాడు, పవిత్రుడు నగు భక్తుడు ఈ విధముగా భగవంతునికొరకు పూవులను పూజాకర్మములన్నింటితో కూడినవాడై సాష్టాంగపడి నమస్కరింప వలయును.

తతో నిపతితం కృత్వా ప్రసీదేతి జనార్దనమ్‌,

శిరసా చాఞ్జలిం కృత్వా ఇమం మన్త్రముదాహరేత్‌. 14

అట్లు సాష్టాంగనమస్కారము చేసి జనార్దనుని ప్రసన్నడవు కమ్మని ప్రార్థించి శిరస్సున దోయిలి చేర్చి ఈ మంత్రమును పలుకవలయును.

లబ్ధ్వా సంజ్ఞామపి నాథ ప్రసన్నేచ్ఛాతః సాంసారాన్ముక్తయే

అహం కర్మ కరోమి. యత్‌త్వయా పూర్వముక్తం మే ప్రసీదతు.

నాథ! నేను తెలివినొంది ప్రసన్నమగుకోరికతో సంసారమునుండి ముక్తిపొందుటకై నీపూజను చేయుచున్నాను. నీవు మునుపు పలికినట్లు నాకు ప్రసన్నుడవగుదువు గాక!

ఏవం మన్త్రవిధిం కృత్వా మమ భక్తి వ్యవస్థితః,

పృష్ఠతోను పదం కృత్వా శీఘ్రం యావన్నహీయతే. 15

ఏవం సర్వం సమాదాయ మమ కర్మదృఢవ్రతః,

శీఘ్రంమేభ్యంజనం దద్యాత్‌ తైలేన సఘృతేన వా. 16

ఇట్లు మంత్రవిధి ననుష్ఠించి నాభక్తియందు నిలుకడకలవాడై పూజ ముగియునంతవరకు వెనుకవైపుగా నడచుచు (భగవంతునివైపుముఖము నిలిపి అని తాత్పర్యము.) వస్తువుల నన్నింటిని కూర్చుకొని మిక్కిలి శ్రద్ధకలవాడై తైలముతో గాని నేతితో కానీ నాకు తలంటుస్నానమును సమర్పింపవలయును.

తత స్తం స్నేహముద్దిశ్య మన్త్రజ్ఞః కర్మకారకః,

ఏవం చిత్తం సమాధాయ ఇమం మన్త్రముదాహరేత్‌. 17

మన్త్రముల నెఱిగినవాడు, క్రియలయందు నేర్పు గలవాడునగుభక్తుడు తైలమును గూర్చి మనసునేకాగ్రము చేసికొని ఈ మంత్రమును పలుకవలయును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

స్నేహం స్నేహేన సంగృహ్య లోకనాథ మయా హృతమ్‌,

సర్వలోకేషు సిద్ధాత్మా వదామి ఆత్మహస్తే హమన్య

ప్రోక్తం మన్నమస్తనేతి నమో నమః. 18

లోకనాథా! నేను తెచ్చిన నూనెను స్నేహముతో గ్రహింపుము. నీవు సర్వలోకములయందును సిద్ధమైన ఆత్మకలవాడవు. ఇతరులు చెప్పిన మంత్రమును పఠించుచు నేను నాచేతితో దీనిని నీకు సమర్పించుచున్నాను. నీకు నమస్సు, నమస్సు.

ఏవం మన్త్రైః సమాఖ్యాతః శిరసి ప్రథమం దదౌ,

పశ్చాద్‌ దక్షిణ మజ్గేషు తతో వామం తు లేపయేత్‌. 19

ఇట్లు మంత్రములతో భగవంతుని ప్రార్థించి మొదట నూనెను శిరమున ఉంచవలయును. తరువాత కుడివైపు అంగముల యందును, పిదప ఎడమవైపునకు ఉంచవలయును.

ఆపశ్చ పృష్ఠ మారుహ్య తతః పశ్చాత్‌ కటిం తథా,

పశ్చా ల్లిప్యేత్‌ తతో భూమిం గోమయేన దృఢవ్రతః. 20

తరువాత వెనుకవైపు నీటితో కడుగవలయును. పిదప నడుమునకు నూనె రాయవలయును. అటుపై భూమిని ఆవుపేడతో అలుకవలయును.

తస్య దృష్ట్వా శ్రుతం భ##ద్రే లిప్సయంశ్చ సునిశ్చితః,

యాని పుణ్యా న్యవాప్నోతి మమ మార్గానుసారిణః. 21

ఇట్లు నామార్గముననుసరించి అనులేపనము చేయువాడు పొందు పుణ్యములను వింటివా? ఓ వసుంధరా!

యావన్తి జలబిన్దూని లిప్యమానస్య సుందరి,

తావద్‌ వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే. 22

అట్లు స్వామికి పూయుచున్న జలబిందువు లెన్నిగలవో అన్నివేల ఏండ్లు ఆతడు స్వర్గలోకమున ప్రతిష్ఠ పొందును.

తతః పుణ్యకృతాన్‌ లోకాన్‌ పురీషై ర్యేన లిప్యతే,

ఏకేనైవానులేపేన గోషు యోన్యాం ప్రముచ్యతే. 23

తాను పుణ్యములతో సాధించిన లోకములను తన మలముతో అలుకుకొన్నవాడు (ఘెరపాపములు చేసినవాడు) ఈ ఆవుపేడతో ఒక్కమారు అలికిన పుణ్యముతో ఆ పాపముల నుండి విముక్తుడగును.

యో మే వాభ్యంజనం దత్వా విశిష్టేనైవ కర్మణా,

యావన్తి బిన్దవః కేచిత్‌ స్నేహం ఘృతతిలాని వా,

తావద్‌ వర్షసహస్రాణి మమ లోకే ప్రతిష్ఠతి. 24

ఇట్లు విశిష్టమైన విధానముతో నాకు అభ్యంజనము చేయువాడు, ఆ నూనెలో, లేదా నేతిలో ఎన్నిబిందువులుండునో అన్నివేల ఏండ్లు నాలోకమున స్థిరముగా నివసించును.

అథ చోద్వర్తనం భ##ద్రే ప్రవక్ష్యామి ప్రియం మమ,

యేన తుష్యన్తి వశ్యా యే విశుద్ధి ర్మమ జాయతే. 25

భద్రా! ఇక నలుగుబెట్టుటకు గూర్చి చెప్పెదను. అది నాకు ప్రియమైనది. భక్తులు దానితో సంతోషింతురు. నాకు వశమగుదురు. నాకు దానివలన విశుద్ధి కలుగును.

భోగింవా యదివా రోధ్రం యది పిప్పలకో మధు,

మధూక మశ్వవర్ణం వా రోహిణం చైవ కర్కటమ్‌,

ఏతేషాం ప్రాప్య లభ##తే శాస్త్రజ్ఞః కర్మకారకః. 26

కరేణ యస్య చూర్ణేన పిష్టచూర్ణేన వా పునః,

ఏతే నోద్వర్తనం కుర్యాన్‌ మమ గాత్ర సుఖావహమ్‌,

యదిచ్ఛేత్‌ పరమాం సిద్ధిం మమ కర్మాను సారిణః. 27

చేతితో చేసిన పిండితోగాని, పిండిగా అయిన చూర్ణముతో గాని నా దేహమునకు సుఖము కలుగునట్లు నలుగుబెట్టవలయును. నాకర్మమును అనుసరించు అట్టివానికి పరమసిద్ధి కలుగును.

ఏవ ముద్వర్తనం కృత్వా సర్వ కర్మాణి కారయేత్‌,

పశ్చాద్‌ దేయంచ స్నానం చ యచ్చ మే మనసి ప్రియమ్‌ 28

ఇట్లు నలుగుబెట్టి తక్కిన పనులన్నియు ముగించి నామనసునకు ప్రియము కలిగించు స్నానమును చేయింప వలయును.

తత ఆమలకం చైవ వసుగంధర్వ ముత్తమమ్‌,

తై ర్హిమే సర్వగాత్రాణి మర్దయిత్వా దృఢవ్రతః,

జలకుంభం తతో గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్‌. 29

అటుపై ఉసిరిక, వస, గంధర్వము మొదలగు ఉత్తమ ద్రవ్యములతో నా అన్ని అవయవములను మర్దింపవలయును. అటుపై నీటి కుండను పట్టుకొని ఈ మంత్రమును పఠింపవలయును..

మన్త్రా ఊచుః - మంత్రములు

దేవానాం దేవ దేవోసి దేవ అనాది అనంత వ్యక్తరూపస్నాన గృహ్య మామ్‌.

దేవా! నీవు దేవులకు దేవుడవు, అనాదివి, అనంతుడవు. ప్రతిమారూపమున వ్యక్తమైన వాడవు. నా స్నానమును గ్రహింపుము.

ఏవంతు స్నాపనం కుర్యా న్మమ మార్గానుసారిణః,

అధ సౌవర్నకుంభేన రజతస్య ఘటేన వా. 30

ఏతేషా మ ప్యలాభేన కర్మజ్ఞః కర్మ కారయేత్‌,

తామ్ర కుంభమయం చైవ కుర్యాత్‌ స్నాపన ముత్తమమ్‌. 31

నా పనియందు శ్రద్ధగలభక్తుడు బంగారు కుండతో గానీ, వెండికుండతో కానీ, లభింపనిచో రాగికుండతో గానీ నాకు ఉత్తమముగ స్నానమును, విధాన మెరిగిన వాడై, చేయింపవలయును.

ఏవం మేస్నాపనం కృత్వా విధిదృష్టేన కర్మణా,

పశ్చాద్‌ గన్ధం చ దాతవ్యం ప్రకృష్టం మన్త్రసంయుతమ్‌. 32

ఇట్లభిషేకము గావించి శాస్త్రముచెప్పిన విధానము ననుసరించి శ్రేష్ఠమగు గంధమును మంత్రపూర్వకముగా సమర్పింపవలయును.

ఓం మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

సర్వగన్దాః సర్వసౌగన్ధిభి శ్చ సర్వావర్ణా యే కేచిద్‌

విధివర్ణ త్వయా దత్తం సప్తలోకేషు దేవ తవ దేహేనమతి

సుగంధం మదాజ్ఞాశ్చ సమావహ మయం శుచి.

అన్నిరంగులు, అన్నిసువాసనలు గలవి, ఏడులోకముల యందును నీవు కూర్చినవి అగు గంధములన్నింటిని నీకు పూయుచున్నాను. స్వామీ! నేను ఎరిగిన వీనితో సుగంధమును తాల్పుము.

మమ భక్త్యా ప్యనుష్ఠాయ ప్రతిగృహ్యాశు మాధవ,

ఏవం గంధాం స్తతో దత్వా ఉత్కృష్టం కర్మకారయేత్‌. 33

నేను భక్తితో సమర్పించిన ఈ గంధమును మాధవా! గ్రహింపుము. అనియిట్లు గంధముల నొసగి శ్రేష్ఠమగు కర్మము నాచరింపవలయును.

కర్మణ్యష్వపి మాలేషు శీఘ్రమేవ ప్రదాపయేత్‌,

తమేవ చార్చనం కృత్వా కర్మజ్ఞః కర్మసంమితః,

తతః పుష్పాఞ్జలిం దత్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 34

అనంతరము చక్కని యోగ్యములగు పూలమాలలను సమర్పింపవలయును. ఇట్లు విధానము నెరిగిన కర్మకుశలుడు మాలార్చనము గావించి పుష్పములను దోయిలినిండుగా సమర్పించి ఈ మంత్రమును పలుకవలయును.

ఓం మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

జలజం స్థలజం చైవ పుష్పం కాలోద్భవం శుచి,

మమ సంసారమోక్షాయ గృహ్య గృహ్య మమాచ్యుత. 35

నీటబుట్టినది, నేలపైపుట్టినది, తగుకాలమున పుట్టినది, శుభ్రమైనది అగు పుష్పమును అచ్యుతా! నా సంసార మోక్షమునకై గ్రహింపుము, గ్రహింపుము.

విశ్వయోనోపచారేణ అర్చయిత్వా మమ ప్రియమ్‌,

పశ్చాద్‌ ధూపాని మే దద్యాత్‌ సుగంధద్రవ్య సంమితాన్‌. 36

అట్లు విశ్వమున లభించు పుష్పములతో నన్ను ప్రియమార అర్చించి తరువాత మంచిసువాసనలగల ధూపములను నాకు సమర్పింప వలయును.

ధూపం గృహ్య విధానేన మయా ప్రోక్తం మహత్తరమ్‌,

ఉభ##యేషు కులాత్మేషు ధూప మన్త్ర ముదాహరేత్‌. 37

విధినిబట్టి కూర్చిన ధూపమును చేత దాల్చి రెండువైపుల త్రిప్పుచు ధూపమంత్రమును పలుకవలయును.

వనస్పతిరసం దివ్యం బహుద్రవ్య సమన్వితమ్‌,

మమ సంసారమోక్షాయ ధూపం మే సంప్రగృహ్యతామ్‌. 38

దేవా! వనస్పతిరసము కలది, దివ్యమైనది, పెక్కు ద్రవ్యములతో కూడినదియగు ధూపమును, నా సంసారమోక్షమునకై స్వీకరింపవలయును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికెను.

శాన్తి దేవతా మే కోష్ఠే వసన్తి శాన్తి మే సాంఖ్యానాం,

శాన్తియోగినాం గృహ్యం ధూపం మమ సంసారమోక్షణమ్‌,,

త్రాతారం నాస్తి మే కశ్చిత్‌ త్వాం విహాయ జగద్గురో. 39

శాంతిదేవతలు నా గృహమున నివసింతురు. జ్ఞాన సంపన్నులగు శాంతి యోగులకు శాంతి గ్రహింపదగినదియగు గాక! జగద్గురూ! నీవు గాక రక్షకుడు నాకు మఱియొకడు లేడు.

ఏవ మభ్యర్చనం కృత్వా మాల్యగన్థానులేపనైః,

పశ్చాద్వస్త్రం తతో దద్యాత్‌ క్షేమం శుక్లం సపీతకమ్‌. 40

ఇట్లు పూలమాలలతో, గంధపు పూతలతో చక్కగా అర్చనము గావించి తరువాత తెల్లనిది, పచ్చని అంచులు గలదియగు పట్టువస్త్రమును సమర్పింపవలయును.

ఏవం వస్త్రం సమాదాయ కృత్వా శిరసి చాంజలిమ్‌,

దివ్యం యోగం సమాదాయ ఇమం మన్త్రముదాహరేత్‌. 41

ఇట్లు వస్త్రమును పట్టుకొని శిరసున దోయిలించి చక్కని ధ్యానముతో ఈ మంత్రమును పలుకవలయును.

ఓం మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

ప్రీయతాం భగవాన్‌ పురుషోత్తమః శ్రీనివాసః శ్రీమానానం

దరూపః గోప్తా కర్తా ఆదికాలాత్మకః భూతనాథ ఆదిరవ్యక్త

రూపః. క్షేమం వస్త్రం వాసితాశ్చ.

మనోజ్ఞ దేవ గృహ్ణం త్వం గాత్రప్రచ్ఛాదనాయ చ,

వసై#్త్ర ర్విభూషణం కృత్వా మమ మార్గాను సారిణః.

పశ్చాత్‌ పుష్పం తతో గృహ్య ఆసనం చోపకల్పయేత్‌. ||

గృహీత్వా ప్రణవాద్యేన ధర్మపుణ్యన సంయుతః. 42

పురుషోత్తముడు, శ్రీనివాసుడు, శ్రీమదానందరూపుడు, రక్షకుడు, కర్త, ఆదికాలాత్మకుడు, భూతనాథుడు, మొదటివాడు, అవ్యక్తరూపుడు అగు దేవుడు ప్రీతినందుగాక! దేవా! మనోహరా! తెల్లని పట్టువస్త్రమును నీ దేహమును కప్పుకొనుటకు గ్రహింపుము. ఈ వస్త్రమును విభూషణముగా స్వీకరింపుము. అని పలికి పుష్పమును పట్టుకొని ఓంకారము తొలుతనుండు నట్లు ధర్మము పుణ్యమునగు మంత్రముతో ఆసనమును కూర్పవలయును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

ఇదం పరాపరనాథ పరస్పర శాస్త్ర పరప్రమాణ

ప్రమాణినాం చైవ తిష్ఠ తదనుకల్పయోపయుక్త

మాత్మానం సత్యం సదేవ గృహ్ణ

స్వామీ! నీవు పరాపరములకు నాథుడవు. అన్నింటికి మించిన ప్రమాణమవు. శాస్త్ర రూపుడవు. ప్రమాణము కలవారి కెల్లరకు మించి నిలుచువాడవు. నేను కూర్చిన పూజను సత్యమైన దానిని సత్వ్యరూపుడవగు నీవు గ్రహింపుము.

ఏవం తు ప్రాపణం కృత్వా మమ మార్గానుసారిణః,

ముఖ ప్రక్షళనం కృత్వా శీఘ్రం మన్త్రప్రకల్పితమ్‌. 43

ఇట్లు నేను చెప్పిన మార్గము ననుసరించి సమర్పణము గావించి వెనువెంటనే ముఖ ప్రక్షాళనమును మంత్రపూర్వకముగా చేయవలయును.

శుచి స్తవేతి దేవానా మేవం చైవ పరాయణమ్‌,

శౌచార్థంతు జలంగృహ్ణ కృత్వా ప్రాపణముత్తమమ్‌. 44

దేవతలకును నీవలననే పరిశుద్ధత. నీవే పరమగతివి. నేనర్పించిన ఉత్తమమగు ఈజలమును శౌచముకొఱకు గ్రహింపుము.

ఏవంతు భోజనం దత్వా వ్యపనీయ తు ప్రాపణమ్‌,

తాంబూలం తు తతో గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్‌. 45

ఇట్లే భోజనము సమర్పించి దానిని ప్రక్కకు తీసి తాంబూలమును పట్టుకొని ఈ మంత్రమును పలుకవలయును.

మన్త్రా ఊచుః - మంత్రములు పలికినవి.

అలంకారం సర్వతో దేవానాం ద్రవ్యోపయుక్తః

సర్వసౌగంధి కాదిభి ర్గృహ్య తాంబూలం లోకనాథ విశిష్ట

మస్మాకం చ తవ ప్రీతి ర్మేభవమ్‌.

అన్నియెడల దేవతలకు అలంకారము, గొప్పవస్తువులతో కూడినది, సువాసన కలదియగు తాంబూలమును గ్రహించి లోకనాథా! నాకు ప్రీతిని కలిగింపుము.

అలంకారం ముఖే శ్రేష్ఠం తవ ప్రీత్యా మయాకృతమ్‌,

ముఖప్రసాదనం శ్రేష్ఠం దేవ గృహ్ణ మనోహరమ్‌. 46

ముఖమునకు ఇంపుకలిగించునది, మనోహరమైనదియగు తాంబూలమును ప్రీతితో నీకొసగితిని. దేవా! శ్రేష్ఠమగు దీనిని గ్రహింపుము.

య ఏతే నోపచారేణ మద్భక్తః కర్మ కారయేత్‌,

అనుముక్తం మహాలోకాన్‌ పశ్యతే మమ నిత్యశః. 47

నా భక్తుడు ఈ ఉపచారముతో పూజను గావించి సంసారబంధమును విడివడి నామహాలోకమును నిత్యము చూచుచుండును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తదశాధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదునేడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters