Varahamahapuranam-1    Chapters   

దశాధికశతతమోధ్యాయః - నూటపదియవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత పలికెను.

అథాతః సంప్రవక్ష్యామి కపిలాధేను ముత్తమామ్‌,

యత్ర్పదానాన్నరో యాతి విష్ణులోక మనుత్తమమ్‌. 1

ఇక ఇటుపై యగు కపిలాధేనువును గూర్చి చెప్పెదను. దాని దానమువలన నరుడు అత్యంత శ్రేష్ఠమగు విష్ణులోకమును పొందును.

పూర్వోక్తేన విధానేన దద్యాద్‌ ధేనుం సవత్సకామ్‌,

సర్వాలంకారసంయుక్తాం సర్వరత్న సమన్వితామ్‌. 2

మునుపు చెప్పిన విధానముతో దూడతో కూడిన కపిల ధేనువును, అన్ని అలంకారములు, అన్ని రత్నములు కల దానిని దానము చేయవలయును.

కపిలాయాః శిరో గ్రీవాం సర్వతీర్థాని భామిని,

పితామహనియోగాచ్చ నివసన్తి హి నిత్యశః. 3

కపిలధేనువు తలయందు, కంఠమునందును బ్రహ్మ ఆదేశమువలన సర్వతీర్థములు నెలకొని యుండును.

ప్రాత రుత్థాయ యో మర్త్యః కపిలాగళ మస్తకాత్‌,

చ్యుతం తు భక్త్యా పానీయం శిరసా వన్దతే శుచిః. 4

స తేన పుణ్యతోయేన తత్షణాద్‌ దగ్ధకిల్బిషః,

త్రింశద్వర్షకృతం పాపం దహత్యగ్ని రివేన్దనమ్‌. 5

ఉదయమున లేచి మానవుడు పుల్లాపు మెడనుండియు, తలనుండియు జారిన నీటిని భక్తితో తలకద్దుకొనుచు శుచియై ఆపవిత్రజలమువలన ఆప్పటికప్పుడు మాడిన సర్వపాపములు కలవాడగును. ముప్పదేండ్లు చేసినపాపమును కూడ, అగ్ని కట్టెనువలె, కాల్చి వేయును.

కల్యముత్థాయ యో మర్త్యః కుర్యాత్‌ తాసాం ప్రదక్షిణమ్‌,

ప్రదక్షిణీ కృతా తేన పృథివీ స్యా ద్వసుంధరే. 6

ఉషః కాలమున లేచి కపిలగోవులకు ప్రదక్షిణము చేయునరుడు, ఓ భూదేవి! భూమికి ప్రదక్షిణము చేసినవాడగును.

ప్రదక్షణన చైకేన శ్రద్ధాయుక్తేన తత్షణాత్‌,

దశజన్మకృతం పాపం తస్య నశ్యత్య సంశయమ్‌. 7

శ్రద్ధతో కూడిన ఒకప్రదక్షిణము చేత పది జన్మములలో చేసిన ఆతని పాపము నశించును. సంశయము లేదు.

కపిలాయాస్తు మూత్రేణ స్నాయాచ్చైవ శుచివ్రతః,

స గంగాదిషు తీర్థేషు స్నాతో భవతి మానవః. 8

కపిలగోవు మూత్రముతో స్నానము చేసిన మానవుడు మిక్కిలి పతివ్రతుడగును. గంగమొదలగు తీర్థములందు స్నానము చేసిన వాడగును.

తేన స్నానేన చైకేన భావయుక్తేన వై నరః,

యావ జ్జీవకృతాత్‌ పాపాన్ముచ్యతే నాత్ర సంశయః. 9

ఆ ఒక్క స్నానము మంచిభావముతో చేసిన నరుడు పుట్టినది మొదలు కొని చేసిన సర్వపాపములనుండి విముక్తుడగును. సంశయము లేదు.

గోసహస్రంతు యో దద్యా దేకాంచ కపిలాం నరః,

సమ మేతత్‌ పురాప్రాహ బ్రహ్మా లోకపితామహః. 10

వేయిగోవులను ఇచ్చువాడును. ఒక్కకపిలధేనువు నిచ్చువాడును సమానమేయని లోకపితామహుడగు బ్రహ్మ మునుపు నొక్కిచెప్పెను.

గవామస్థి నతప్యేత మృతగన్ధే న దూషయేత్‌,

యావజ్జిఘ్రతి తం గన్ధం తావత్పుణ్యౖ స్తు పూర్యతే. 11

గోవుల ఎముకను కాల్పరాదు. చచ్చిన ఆవువాసనను నిందింపరాదు. ఆ వాసనను గ్రహించునంతవరకు ఆతడు పుణ్యములతో నిండి పోవును.

గవాం కండూయనం శ్రేష్ఠం తథాచ పరిపాలనమ్‌,

తుల్యం గోశతదానస్య భయరోగాదిపాలనే. 12

గోవులను గోకుట ఉత్తమ కార్యము. అట్లే గోవులను పెంచుట మంచిది. వానికి భయము, రోగము కలిగినపుడు రక్షించుట నూరావులను దానముచేయుటతో సమానము.

తృణోదకాని యో దద్యాత్‌ క్షుధితానాం గవాహ్నికమ్‌,

గోహేధస్య ఫలం దివ్యం లభ##తే మానవోత్తమః. 13

ప్రతిదినము ఆకలిగల ఆవులను గడ్డి నీరు ఇచ్చు ఉత్తమ మానవుడు గోమేధము చేసినఫలమును పొందును.

విమానై ర్వివిధై ర్దవ్యైః కన్యాభి రభితోర్పితైః,

సేవ్యమానః సుగన్ధై ర్వై దీప్యమానో యథాగ్నయః. 14

అట్టివాడు పెక్కువిధములగు దివ్యవిమానములతో చుట్టు నున్న కన్యలతో మంచిగంధములతో సేవలు కొనుచున్నవాడై అగ్నుల వలె వెలిగిపోవుచుండును.

సువర్ణ కపిలా పూర్వం ద్వితీయా గౌరపింగలా,

తృతీయా చైవ రక్తాక్షీ చతుర్థీ గుడ పింగలా. 15

పఞ్చమీ బహువర్ణా స్యాత్‌ షష్ఠీచ శ్వేతపింగలా,

సప్తమీ శ్వేతపింగాక్షీ అష్టమీ కృష్ణ పింగలా. 16

నవమీ పాటలా జ్ఞేయా దశమీ పుచ్ఛ పింగలా,

ఏకాదశీ ఖురశ్వేతా త్వేతాసాం సర్వలక్షణా. 17

బంగారు వన్నెతో గోరోచన వర్ణముకలిసినది మొదటిది. పసుపు ఎరుపులు కలిసినది రెండవది. ఎర్రని కన్నులుకలదిమూడవది. బెల్లము రంగుకలది నాలుగవది. పెక్కు రంగులు కలది అయిదవది. తెలుపు గోరోజనము వన్నెలు కలది ఆరవది. తెలుపు గోరోచనముల వన్నెకల కన్నులుకలది ఏడవది. నలుపుగోరోచనముల వన్నెలు కలిసినది ఎనిమిదవది. తెలుపు ఎరుపుల కలయిక కలది తొమ్మిదవది. తోకయందు గోరోజనవర్ణము కలది పదియవది. గిట్టల యందు తెలుపుకలది పదునొకండవది. వీనిలో అన్నిలక్షణములు కలది గొప్పది.

సర్వలక్షణసంయుక్తా సర్వాలంకృతసుందరీ,

బ్రాహ్మణాయ ప్రదాతవ్యా భుక్తిముక్తి ప్రదాయినీ,

భుక్తిముక్తి ప్రదా గావో విష్ణులోకం స గచ్ఛతి. 18

అన్ని లక్షణములు కలదియు సర్వాలంకారములతో చూడ ముచ్చట అయినదియునగు గోవును బ్రాహ్మణునకు సమర్పింప వలయును. గోవులు భుక్తిని ముక్తిని ఇచ్చునవి. వానిదానము చేసిన వాడు విష్ణులోకమున కరుగును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే దశాధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదియవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters