Brahmapuranamu    Chapters   

అష్టమోcధ్యాయ ః

ఆదిత్యవంశాను కీర్తనమ్‌

లోమహర్షణ ఉవాచ-

సత్యవ్రతస్తు భక్త్యా చ కృపయా చ ప్రతిజ్ఞయా | విశ్వామిత్రకలత్రం తు బభార వినయే స్థితః || 1

హత్వా మృగాన్వరాహాంశ్చ మహిషాంశ్చవనేచరాన్‌ | విశ్వామిత్రాశ్రమాభ్యాసే మాంసంవృక్షే బబంధ చ || 2

ఉపాంశువ్రతమాస్థాయ దీక్షాం ద్వాదశ వార్షికీమ్‌ | పితుర్నియో గాదవసత్తస్మి న్వనగతే నృపే || 3

అయోథ్యాం చైవ రాజ్యంచ తథై వాంతఃపురం మునిః | యాజ్యోపాధ్యాయసంయోగాద్వశిష్ఠః పర్యరక్షత ||4

సత్యవ్రతస్తు బాల్యాచ్చ భావినో7ర్థస్య వైబలాత్‌ | వశిష్ఠే7భ్యధికం మన్యుం ధారయామాస నిత్యశ ః || 5

పిత్రా హి తం తధా రాష్ఠ్రాత్త్యజ్యమానం ప్రియం సుతమ్‌ | న వారయామా స ముని ర్బహునా కారణచ || 6

పాణిగ్రహణమంత్రాణాం నిష్ఠా స్యా త్సప్త మే పదే | న చ సత్యవ్రత స్మా ద్ధృతవా న్సప్తమేపదే||7

జాన న్ధర్మం వశిష్ఠస్తు న మాం త్రాతీతి భో ద్విజాః | సత్యవ్రత స్తదా రోషం వశిష్ఠే మనసా7కరోత్‌|| 8

గుణబుద్ధ్యా తు భగవా న్వశిష్ఠః కృతవాం స్తథా | న చ సత్యవ్రత స్త స్య త ముపాంశు మబుధ్యత || 9

తస్మి న్న పరితోషశ్చ పితు రాసీ న్మహాత్మనః | తేన ద్వాదశవర్షణి నావర్ష త్పాకశాసనః || 10

తేన త్విదానీం విహితాం దీక్షాం తాం దుర్వహాం భువి | కులస్య నిష్కృతి ర్విప్రాః కృతా సా వై భ##వేదితి|| 11

న తం వశిష్ఠో భగవా న్పిత్రా త్యక్తం న్యవారయత్‌ | అభిషేక్ష్యా మ్యహం పుత్ర మస్యేత్యేవం మతి ర్మునిః|| 12

స తు ద్వాదశవర్షాణి తాం దీక్షామావహ ద్బలీ | అవిద్యమానే మాంసే తు వశిష్ఠస్య మహాత్మనః || 13

సర్వకామదుఘాం ధోగ్థ్రీంసదదర్శ నృపాత్మజః | తాం వై క్రోధాచ్చ మోహాచ్చ శ్రమాచ్చైవక్షుధాన్వితః || 14

దేశధర్మగతో రాజా జఘాన మునిసత్తమాః | తన్మాంసం స స్వయం చైవ విశ్వామిత్రస్య చా77 త్మజాన్‌||15

భోజయామాస తచ్ఛృత్వా వశిష్ఠో7ప్యస్య చుక్రుథే || 16

లోమ హర్షణుడిట్లనియె:- సత్యవ్రతుడు భక్తితో కృపతో పట్టుదలతో వినయముతో విశ్వామిత్రుని భార్యను భరించెను. మృగములవేటాడి తెచ్చిన మాంసము నమ్మునియాశ్రమసమీపమున చెట్టుకొమ్మకు వ్రేలాడగట్టెను. ఉపాంశువ్రతమూని (ఇంద్రియములను మనసును నిగ్రహించి-చేయువ్రతము) ద్వాదశవార్షిక దీక్షగొని తండ్రియాదేశమున నాదేశమందు వసించెను. యజ్ఞకర్తలకు కులగురువులకుCగల సంబంధము నమసరించి వశిష్ఠు డయోధ్యారాజ్యమును రాణివాసమును దానే బర్యవేక్షించెను. సత్యవ్రతుడు మాత్రమజ్ఞానమువలన భావిదైవ ఘటనమువలనను కులగురువగు వశిష్ఠునెడ నధికమైన క్రోధము వహించెను. తండ్రి కుమారుని బహిష్కరించుతఱి వశిష్ఠుడు పెక్కుకారణములచే వలదనడయ్యె. పాణిగ్రహణ మంత్రములకు సప్తపదితో సమగ్రత యేర్పడును కావున సత్యవ్రతుడు సప్తపదిలో కన్య నపహరింపలేదు. ఓ బ్రాహ్మణులారా ! వశిష్ఠుడా ధర్మ మెఱిగియు నన్ను రక్షించుటలేదని సత్యవ్రతుడు వసిష్ఠునిపై కోపముగొనెను. వసిష్ఠ భగవానుడు గుణబుద్ధితోనే అట్లు చేసెను. కాని సత్యవ్రతుడు వానిని తటస్థునిగ తలంచెను. తండ్రియగు వసిష్ఠునకు కుమారుడగు సత్యవ్రతునిపై అసంతుష్ఠి కలిగెను.

ఆ కారణమున నారాజ్యామున నిద్రుcడు పండ్రెండు సంవత్సరములు వర్షముల లేకుండజేసెను. అందులకు ప్రాయశ్చిత్తముగా సత్యవ్రతుడు ద్వాదశవార్షికమైన కఠోరదీక్షను బూనగలడని దానివలన నీకులమునకుcగల కళంకము పోగలదని యెఱిగియే వశిష్ఠుడానాడు వనప్రవేశము వలదనడయ్యె. మాంసము కరవై సత్యవ్రతుడవ్వల క్షుధాతురుడై క్రోధ మోహములచే మిక్కిలి శ్రమించి వశిష్ఠుని కామధేనువు హరించెను. తాను వసించు దేశధర్మముననుసరించి యాటవికక్రూరవృత్తిచే దానిం జంపి యా మాంసమును విశ్వామిత్రుని కుమారులచేగూడ దినిపించెను. అదివిని వశిష్ఠుండతనియెడ కుపితుడై యిట్లనియె.

పాతయేయ మహం క్రూర తవ శంకు మసంశయమ్‌ | యది తే ద్వావిమౌ శంకూ న స్యాతాం వై కృతౌ పునః || 17

పితు శ్చాపరితోషేణ గురుదోగ్థ్రీవధేన చ | అప్రోక్షితోపయోగాచ్ఛ త్రివిధ స్తే వ్యతిక్రమః || 18

ఏవం త్రీ ణ్యస్య శంకూని తాని దృష్ట్వా మహాతపాః | త్రిశంకురితి హోవాచ త్రిశంకు స్తేన స స్మృతః 19

విశ్వామిత్రస్య దారాణా మనేన భరణం కృతమ్‌ | తేన తసై#్మ వరం ప్రాదా న్మునిః ప్రీత స్త్రిశంకవే || 20

ఛంద్యమానో వరేణాథ వరం వవ్రే నృపాత్మజః సశరీరో వ్రజే స్వర్గ మిత్యేవం యాచితో వరః || 21

అనావృష్టిభ##యే తస్మి న్గతే ద్వాదశవార్షికే | పితూ రాజ్యే7భిషిచ్యాథ యాజయామాస పార్థివమ్‌ || 22

మిషతాం దేవతానాం చ వశిష్ఠస్య చ కౌశికః | దివ మారోపయామాస సశరీరం మహాతపాః || 23

ఓరి క్రూరుడా ! ఇపుడుగురుధనమగు గోవునపహరించి సంహరించుట యామాంసమును ప్రోక్షింపకమే నారగించుటయను నీరెండు శంకువులను ( పాపములను) చేసియుండవేని తండ్రియెడ జేసిన నీమొదటి యపరాధమును నిస్సంశయముగా పోగొట్టియుండెడివాడను. ఇప్పుడు మూడు శంకువులనుజేసి నీవు త్రిశంకు వైతివని వశిష్ఠమహర్షిపలికెను. అవ్వల దన కుటుంబ భరణము చేసినాడని ప్రీతుడై విశ్విమిత్రుండు వరమేదేని యడుగుమన నానృపకుమారుడు సశరీరస్వర్గమనుగ్రహింపుమని యాచించెను. అనావృష్టి భయము పోయిసతరువాత విశ్వామిత్రుడు వానిం దండ్రి రాజ్యమున నభిషిక్తుజేసి సశరీసస్వర్గము కొఱుకు యజింపజేసెను. దేనతలు వశిష్ఠులుజూచుచుండగనే వాని నమ్ముని స్వర్గమెక్కించెను. (17-23)

తస్య సత్యరథానామ పత్నీ కేకయవంశజా | కుమారం జనయామాస హరిశ్చంద్ర మకల్మషమ్‌ ||24

సవై రాజా హరిశ్చంద్ర సై#్త్రశంకవ ఇతి స్మృత ః | ఆహర్తా రాజాసూయస్య సమ్రాడితి మా విశ్రుతః || 25

హరిశ్చంద్రస్య పుత్రో7భూ ద్రోహితో నామ పార్థివః | హరితో రోహితస్యాథ చంచుర్హారిత ఉచ్యతే || 26

విజయశ్చ మునిశ్రేష్ఠా శ్చంచుపుత్రో భూవ హ | జేతా స సర్వపృధివీం విజయస్తేన స స్మృత ః || 27

రురుక స్తన యస్తసప్య రాజా ధర్మార్థకోవిదః | రురుకస్య వృకః పుత్రోవృకా ద్భాహుస్తు జజ్ఞివాన్‌ || 28

హైహాయాసాలజంఘాంశ్చనిరస్యంతిస్మ తంనృపమ్‌ | తత్పత్నీ గర్భమాదాయ ఔర్వస్యా77శ్రమ మావిశత్‌ || 29

నాసత్యో ధార్మికశ్చైవ స హి ధర్మ యుగే 7భవత్‌ | సగరస్తు సుతో మాహో ర్జజ్ఞే సహగరేణ వై || 30

ఔర్వస్యా77 శ్రమ మాసాద్య భార్గవే ణాభిరక్షిత ః | అగ్నేయ మస్తృం లభ్థ్వా చ భార్గవా త్సగరో నృపః || 31

జిగాయ పృథివీం హత్వా తాలజంఘా న్సహైహయాన్‌ | శకానాం పహ్ల వానాం చ ధర్మం నిరస దచ్యుత ః

క్షత్రియాణాం మునిశ్రేష్ఠాః పారదానాం చ ధర్మవిత్‌ || 32

అఱనిభార్య సత్యంధ కేకయ వంశజ. ఆమె పుణ్యాత్ముడగు హరిశ్చంద్రుడు కుమారుని గనెను. ఆ హరిశ్చంద్రుడు త్రైశంకవుడు (త్రిశంకుని కుమారుడు) అనుపేర ప్రఖ్యాతినంచెను. రాజసూయముగావించి సమ్రాట్టు (చక్రవర్తి) అను యశమందెను. ఆయన పుత్రుడు రోహితుడు. అతని కొడుకు హరితుడు హరితుని కొడుకు చంచువు చంచువు పుత్రుడు విజయుడు. అతడు సర్వంసహా(భూమి) విజేత. అందువలన నతడు విజయుడనబడెను. వాని కొడుకు రురుకుడు. ధర్మార్థకోవిదుడై నరాజు వానికొడుకు వృకుడు. వానికుమారుడు బాహువు. హైహయులు-తాలంజఘులు నాఱనింద్రోరాజనిరి. అతని భార్య గర్భవతియై ఔరుని యాశ్రమమందుc జేరెను. బాహువు కుమారుడు సగరుడు. అతడును ధర్మపరుడు. సత్యనిష్ఠుడు. కృతయుగము వాడు. తల్లికి సవతిపెట్టిన గరముతో (విషముతో)బాటు పుట్టినందున సగరుడని పేరొందెను. ఔర్వుని యాశ్రమమందు జనన సమయమున శుక్రుని రక్షణమొంది క్షేమముగా జన్మించెను. ఆ భార్గవుని వలననే యాగ్నేయాస్త్రమునంది తాలజంఘులను - హైహయులను సంహరించిభూ మండల మెల్ల జయించెను. శక పహ్లవ పారదులను పేరంబరగిన క్షత్రియులయొక్క ధర్మమును (నాస్తిక ధర్మమును) ఖండించెను. (24-32)

మునయ ఊచుః -

కథం స సగరో జాతో గరేణౖన సహాచ్యుతః | కిమర్థం చ శకాదీనాం క్షత్రియాణాం మహౌజసామ్‌ || 33

ధర్మా న్కులోచితా న్రాజా క్రుద్దో నిరస దచ్యుతః| ఏత న్నః సర్వ మాచక్ష్వ విస్తరేణ మహామతే || 34

మునులనిరి:- సగరుడు విషముతోనెట్లు జనించెను. శకాదుల ధర్మములను క్రుద్ధుడైయేల నిరసించెను. ఈ కథ మాకు సవిస్తరముగ నానతిమ్మనిన లోమహర్షణుడిట్లనియె. (33-34)

లోమహర్షణ ఉవాచ :-

బాహోర్వ్యసనినః పూర్వం హృతం రాజ్య మభూత్కిల| హైహయైస్తాలజంఘైశ్చశ##కైః సార్థం ద్విజోత్తమాః||

యవనాః పారదాశ్చైవకాంభోజాః పహ్లవా స్తథా | ఏతే హ్యపి గణాః పంచ హైహయార్థే పరాక్రమన్‌|| 36

హృతరాజ్య స్తదారాజా స వై బాహు ర్వనం య¸°|పత్న్యా చానుగతో దుఃఖీ తత్ర ప్రాణా నవాసృజత్‌ ||

పత్నీ తు యాదవీ తస్య సగర్భా పృష్ఠతో7న్వగాత్‌|సపత్న్యా చ గరస్తసై#్యదత్తః పూర్వః కిలానఘాః || 38

సా తు భర్తు శ్చితాం కృత్వా వనే తా మభ్యరోహత|ఔర్వస్తాం భార్గవోవిప్రాః కారుణ్యాత్సమవారయత్‌||

తస్యా7శ్రమేచ గర్భః స గరేణౖవ సహచ్యుతః | వ్యజాయత మహాబాహుః సగరో నామ పార్థివః 40

ఔర్వస్తు జాతకర్మాదీం స్తస్య కృత్వా మహాత్మనః|అధ్యాప్య వేదశాస్త్రాణి తతో7స్త్రం ప్రత్యపాదయత్‌ || 41

ఆగ్నేయంతు మహాభాగా అమరైరపి దుస్సహమ్‌| స తేనాస్త్రబలేనా7ఔ బలేన చ సమన్విత || 42

హైహయా న్విజఘానా7శు క్రుద్ధో రుద్రః పశూనివ | ఆజహార చ లోకేషు కీర్తింకీర్తి మతాంవరః ||43

తతః శకాంశ్చ యవాన న్కాంభోంజా న్పారదాంస్తథా | పహ్లవాంశ్చైవ నిశ్శేషా న్కర్తుం వ్యవసితో నృపః ||44

తే వధ్యమానా వీరేణ సగరేణ మహాత్మనా | వశిష్ఠం శరణం గత్వా ప్రణిపేతు ర్మనీషిణమ్‌|| 45

వశిష్ఠ స్త్వథ తా న్దృష్ట్వా సమయేన మహాద్యుతిః || సగరం వారయామాస తేషాం దత్వా7 భయం తదా || 46

సగరః స్వాం ప్రతిజ్ఞాం తు గురో ర్వాక్యం నిశమ్య చ | ధర్మం జఘాన తేషాం వై వేషా నన్యాంశ్చకారహ ||

అర్థం శకానాం శిరసో ముండయిత్వా వ్యసర్జయత్‌ | యవనానాం శిరః సర్వం కాంభోజానాం తథైవ చ || 48

ఫారదా ముక్త కేశాశ్చ పహ్లవా శ్శశ్రుధారిణః | నిస్సాధ్వాయవషట్కారాః కృతా స్తేన మహాత్మనా || 49

శకా యవనకాంబోజాః పారదాశ్చ ద్విజోత్తమాః కోణిసర్పా మాహిషికా దర్వా శ్చోలాః సకేరలాః||50

సర్వే తే క్షత్రియా విప్రాధర్మస్తేషాం నిరాకృతః | వశిష్ఠవచనా ద్రాజ్ఞా సగరేణ మహాత్మనా 51

లోమహర్షణు డిట్లనియె - బాహువు వ్యసనియయినందున హైహయులు తాలజంఘులు శకులును నాతని రాజ్యము గాజేసిరి. హైహయుని పక్షమున శకులు యవనులు, పారదులు, కాంబోజులు, పహ్లవులు నను నైదుగణములవారుకూడ చేరిరి. రాజ్యము పోయి బాహువు వనమున కేగెను. పత్నియు నతని వెంట జనెను. అతడక్కడ ప్రాణములు వాసెను. అప్పటి కతని భార్య గర్భవతి. అమెకు సవతి గరము (విషము) పెట్టెను. వనమం దాసాధ్వి భర్తతో సహగమనము సేయుటకు జితి యెక్కెను. భృగువంశీయు జౌర్వుడు కరుణCగొని యామెను నివారించెను. అయనయాశ్రమమందా శిశువు గరముతోగూడ జన్మించెను. అందుచే సగరుడను పేరొందెను.

జౌర్వుడాతనిని వేదశాస్త్రబలముచే చదివించి ఆగ్నేయాస్త్రమందు శిక్షణమొసంగెను. క్రుద్ధుడైన రుద్రుడు పశువులం జంపునట్లాతడాగ్నేయాస్త్రబలముచే హైహయుల వధించి మంచిప్రతిష్ఠ వడసెను. అవ్వల శక యవన కాంభోజ పారద పహ్లవులను నిశ్శేషముగా బరిమార్పC బూనెను. వారు వశిష్ఠుని శరణందిరి. ఆయన వారి కభయమొసగి సగరుని వారించెను, గురువచన మాలించి యాతడు వారింగాక వారి ధర్మమును ఖండించి వారందరి వేషములను మార్చెను. అదెట్లన శకుల కర్థముండనము (సగము తల గొరుగుట) గావించి వదలెను. యవన కాంభోజులకు సంపూర్ణముండనము గావించెను. పారదులను తల విరజోసికొన జేసెను. పహ్లవులకు గడ్డముల నుంచెను. వారెల్లరను నిస్వాధ్యాయవషట్కారులం గావించెను (యజనయాజనాది వేదకర్మదూరులం జేసెనని భావము.) శకాదులు కోణిసర్పులు మహిషకులు దర్వులు, చోళులు, కేరళులు ననుపేర వారందరు క్షత్రియులే. కాని వారి ధర్మమాతనిచే నిరాకరింపబడినది. అనగా పెలివేయబడినారన్నమాట. ఇదంతయ వశిష్ఠునాజ్ఞచేతనే యాత డొనరించెను. (35-51)

సధర్మవిజయీ రాజా విజిత్యేమాం వసుంధరామ్‌ | అశ్వం ప్రచారయామాస వాజిమేధాయ దీక్షితః || 52

తస్య చారయతః సో7శ్వః సముద్రే పూర్వదక్షిణ | వేలాసమీ పే7పహృతో భూమిం చైవ ప్రవేశితః || 53

సతం దేశం తదా పుత్రైః ఖానయామాస పార్థివః | ఆసేదు స్తే తదా తత్ర ఖన్యమానే మహార్ణవే || 54

తమాదిపురుషం దేవం హరిం కృష్ణం ప్రజాపతిమ్‌ | విష్ణుం కపిలరూపేణ స్వపంతం పురుషం తదా || 55

తస్య చక్షుస్సముత్థేన తేజసా ప్రతిబుధ్యతః | దగ్థా స్సర్వే ముని శ్రేష్ఠా శ్చత్వార స్త్వశేషితా ః || 56

బర్హికేతుః సుకేతుశ్చ తథా ధర్మరథో నృపః | శూరః పంచనదశ్చైవ తస్య వంశకరా నృపాః || 57

ప్రాదాచ్చతసై#్మ భగవాన్‌ హరిన్నారాయణో వరం | ఆక్షయం వంశమిక్ష్వాకోః కీర్తిం చాప్యనివర్తనీమ్‌ || 58

పుత్రం సముద్రంచ విభుః స్వర్గే వాసం తథాక్షయం | సముద్రశ్చార్ఘ్యమాదాయ వవందే తం మహీపతిమ్‌ || 59

సాగరత్వం చలేభే స కచ్మణా తేన తస్యహ | తం చాశ్వమేధికం సో7శ్వం సముద్రా దుపలబ్దవాన్‌ 60

ఆజహారాశ్వమేధానాం శతం స సుమహోతపాః | పుథ్రానాంచ నహప్రాణి షష్టిస్తస్యేతి నశ్శ్రుతమ్‌ || 61

సగరస్యా77త్మజా వీరాః కథం జాతా మహాబలాః విక్రాంతాః షష్టిసాహస్రా విధినా కేన సత్తమ || 62

ధర్మముచే జయమందిన యా సగర చక్రవర్తి వసుంధరనెల్ల గెల్చి యశ్వమేధదీక్షగొని గుఱ్ఱమును వదలెను. అ గుఱ్ఱము తూర్పు దక్షిణ సముద్రప్రాంతతీరమున సంచరించుచుండగా నెవ్వనిచేతనో హరింపబడి భూమియందు బ్రవేశింపజేయబడెను. అపుడా రాజు తన కొడుకు లఱువదివేలమందిచేత నీ భూమిని ద్రవ్వించెను. వారందఱు సముద్రముం జొచ్చి భూమింద్రవ్విపోయిపోయి ఆది పురుషుడగు హరిని కపిలరూపమున నున్న విష్ణువుం గాంచిరి. అ సమయమున నాదేవుడు నిదురలో నుండెను. వారి రాకచే గల్గిన చప్పుడువలన నాతడు కనుదెఱచెను. అందుండి వెడలిన తేజస్సుచే నా సగరులు నల్గురు తరువాయిగా నఱువది వేలమందియు దగ్ధులైరి. అ మిగిలిన సగంవంశవర్థములు బర్హికేతువు సుకేతువు భర్మరధుడు శూరుడైన పంచజనుడు ననువారు. భగవంతుడు కపిలుడు ఱనికి ఇక్ష్వాకువంశమక్షయముగ నుండునట్లును. మంచికీర్తిమంతమగునట్లు వరము ననుగ్రహించె. సముద్రుని కుమారునిగ నిచ్చి అక్షయస్వర్గవాస సౌఖ్యమునుగూడ నొసంగెను. సముద్రుడా సగరుని కర్ఘ్యముం గొని వచ్చియిచ్చి నమస్కరించెను. ఆ పుణ్యకర్మ ప్రభావముచే సముద్రుడుసాగరుడు గూడ నయ్యెను. (సగరుని కుమారుడను ప్రఖ్యాతి నంచెను) సగరచక్రవర్తి యన్యశ్వమేదాశ్వమును బడసి తిఱిగి వచ్చి నూఱశ్వమేధయాగము లాచరించెను. అతని కుమారులే సాగరులను ప్రఖ్యాతి నందిన వారఱువదివేలమందియని విన్నాము. అన విని మునులు సగరునికి వీరులగు కుమారు లఱువది వేలమంది యెట్లు కల్గిరి ? ఎట్లు విక్రమించిరో తెలుపుమన లోమహర్ణణుం డిట్లనియె ( 52-62)

లోమహర్షణ ఉవాచ -

ద్వే భార్యే సగరస్యా77స్తాం తపసా దగ్ధకిల్బిషే | జ్యేష్ఠా విదర్భదుహితా కేశినీ నామ నామతః || 63

కనీయసీ తు మహతీ పత్నీ పరమధర్మిణీ | అరిష్ఠనేమిదు హితా రూపేణాప్రతిమా భువి || 64

ఔర్వ స్తాభ్యాం వరం ప్రాదా త్తద్బుధ్యద్వం ద్విజోత్తమాః | షష్టిం పుత్రసహస్రాణి గృహ్ణా త్వేకా నితంబినీ || 65

ఏకం వంశధరం త్వేకా యధేష్టం పరయత్వితి తత్త్రేకా జగృహే పుత్రా న్షష్టిసాహస్రసంమితాన్‌ || 66

ఏకం వంశధరం త్వేకా తథేత్యాహతతో మునిః |

లోమహర్షణుడిట్లనియె- సగరుని కిద్దరు భార్యలు. విదర్భదేశాధీశుని కూతురు కేశిని పెద్దభార్య. అరిష్టనేమి కూతురు మిక్కియందగత్తె మహతి యునునది రెండవది. ఔర్వుడు వారింగని, అరువదివేలమంది కొడుకులు గావలెనో, వంశోద్ధారకుడైన కొడుకొక్కడు గావలెనో కోరుకొండని వరమొసంగె. ఒకతె అరువదివేలమంది కొడుకులను, మరొకతె యొక్క వంశధరుడగుపుత్రునిC గోరిరి. అంతనమ్ముని యట్లే యగుగాక అనెను. (63-66)

రాజాపంచజనో నామ బభూవ స మహాద్యుతిః || 67

ఇతరా సుషువే తుంబీం బీజపూర్ణా మితి శ్రుతిః | తత్ర షష్టిసహస్రాణి గర్భాస్తే తిలసంమితా ః|| 68

సంబభూవు ర్యథాకాలం వవృధుశ్చ యథా సుఖమ్‌ | ఘృతపూర్ణేఘ కుంభేషు తాన్గర్భా న్నిదధే తతః 69

ధాత్రీ శ్చైకైకశః ప్రాదా త్తావతీః పోషణ నృపః | తతోదశసు మాసేషు సముత్తస్థు ర్యథాక్రమమ్‌ || 70

కుమారాస్తే యథాకాలం సగర ప్రీతివర్థనాః | షష్టిపుత్ర సహస్రాణి తసై#్యవ మభవ న్ద్విజాః || 71

గర్భా దలాబుమధ్యాద్వై జాతాని పృథివీపతేః |

పంచజనుడను మహాతేజస్వియగురాజు ఒకతెకుC గల్గెను. రెండవ యామె బీజపూర్ణమైన యొక తుంబుని (సొరకాయను) ప్రసవించెను ప్రసిద్ధి. అందునువ్వుగింజలంతవారు అరువదివేలమంది శిశువులండిరి. సమయముననుసరించి సుఖముగ పెంపొందిరి. వారి నామె ఘృతపూర్ణకుంభముల నుంచెను. ఒక్కొక్కని పోషణమున కొక్కొక్కతె దాది నేర్పరచెను. పదినెలలో క్రమముగ నా శిశువులందుండి బయలుదేరి సగరునికి ప్రీతి వర్థనులైరి. ( 67-71)

తేషాం నారాయణం తేజః ప్రవిష్టానాం మహాత్మనాం || 72

ఏకః పంచజనో నామ పుత్రో రాజా బభూవ హ | శూరః పంచజనస్యా77సీ దంశుమాన్నామ వీర్యవాన్‌ || 73

దిలీపస్తస్య తనయః ఖట్వాంగ ఇతి విశ్రుతః | యేన స్వర్గాదిహా77గత్య ముహూర్తం ప్రాప్య జీవితమ్‌ || 74

త్రయో7భిసంధితా లోకా బుద్ధ్యా సత్యేన చానఘాః|దిలీపస్యతు దాయాదో మహారాజో భగీరథః ||75

యః స గంగాం సరిచ్ఛ్రేష్టా మవతారయత ప్రభుః | సముద్ర మానయచ్చైనాం దుహితృత్వే7 ప్యకల్పయత్‌ 76

తస్మాద్భాగీరథీ గంగా కథ్యతే వంశచింతకైః |

నారాయణ తేజస్సున బ్రవేశించిన యా మహానుభావులలో నొకడు పంచజCనుడనువాడు రాజయ్యెను. అతని కుమారుడు వీర్యవంతుడగు నంశమంతుడు. అంశుమంతుని సుతుడు దిలీపుడు. ఖట్వాంగుడనుపేర నతడు సుప్రసిద్ధుడు. ఈతడు స్వర్గమునుండి యీ లోకమునకు వచ్చి ముహూర్తకాలముండి బుద్ధితోను సత్యముతోను ముల్లోకముల నొక్కటి చేసెను. దిలీవుని దాయాది భగీరథుడు. అతడు గంగ నవని కవతరింపC జేసిన వాCడు. ఆ గంగను సముద్రమందు గంగ సంగమింపCజేసిన మహానుభావుడు. భగీరథుడు సరిచ్చ్రేష్టయైన గంగ నా విధముగా తన కూతురుగా చేసికొనెను. అందువలననే గంగ భాగీరతథి యయ్యెను. ( 72-76)

భగీరథసుతో రాజా శ్రుత ఇత్యభి విశ్రుతః || 77

నాభాగస్తు శ్రుతస్యా77సీత్పుత్రః పరమధార్మికః | అంబరీషస్తు నాభాగిః సిధుద్వీపపితా7భవత్‌ || 78

అయుతాజిత్తు దాయాదః సింధుద్వీపస్య వీర్యవాన్‌ | అయుతాజిత్సుతస్త్వాసీ ద్దృతుపర్ణో మహాయశాః || 79

దివ్యాక్షహృదయాభిజ్ఞో రాజా నలసఖో బలీ | ఋతుపర్ణసుత స్త్వాసీ దత్తపర్ణి ర్మహా యశాః || 80

సుదాస స్తస్య తనయో రాజా ఇంద్రసఖో7భవత్‌| సుదాసస్య సుతః ప్రోక్తః సౌదాసోనామ పార్థివః || 81

ఖ్యాతః కల్మాషపాదో వైరాజా మిత్రసహో7భవత్‌ | కల్మాష పాదస్య సుతః సర్వకర్మేతి విశ్రుతః || 82

అనరణ్యస్తు పుత్రో7భూద్విశ్రుతః సర్వకర్మణః | అనరణ్యసుతో నిఘ్నో నిఘ్నతో ద్వౌ బభూవతుః || 83

అనమిత్రో రఘుశ్చైవ పార్థివర్షభసత్తమౌ | అనమిత్రసుతో విద్వా న్దువిదుహో7భవత్‌ || 84

దిలీపస్తనయస్తస్య రామస్య ప్రపితామహః | దీర్ఘబాహు ర్దిలీపస్య రఘుర్నామాసుతో7భవత్‌ || 85

అయోధ్యాయాం మహారాజో యఃపురాసీ న్మహాబలః |

భగీరథుని కుమారుడు శ్రుతుడు. అతని పుత్రుడు నాభాగుడు ఉత్తముడు. నాభాగుని పుత్రుడు అంబరీషుడు (నాభాగి) సింధుద్వీవుని కాతడు జనకుడు. సింధుద్వీవుని కొడుకు అయితాజిత్తు. అతని కొడుకు అయుతాజిత్తు. అతని కొడుకు ఋతుపర్ణుడు. అక్షహృదయ మెరిగిన ప్రోడ. బలశాలి. నలునికి మిత్రము. ఋతుపర్ణుని కొడుకు ఆత్తపర్ణి. గొప్పకీర్తిమంతుడు. వాని కుమారుడు సుదాసుడు ఇంద్రుని స్నేహితుడు. వాని బిడ్డడు సౌదాసుడు రాజై కల్మాష పాదుడు-మిత్రసహుడనియు పేరందెను. వాని కొడుకు సర్వకర్మ. వాని కుమారుడు అనరణ్యుడు. వానితనయుడు నిఘ్నుడు. నిఘ్నని వలన అనమిత్రుడు రఘువు అని ఇద్దరు రాజశ్రేష్ఠులు గల్గిరి. అనమిత్రుని సుతుడు విద్వాంసుడు దువిదుహుడు. అవ్వాని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు వీరుడగు రఘవు. రఘువు రాముని ముత్తాత. ఇతడు మహాబలుడై అయోధ్యాపట్టణమున మహారాజుగ నుండెను. (77-85)

అజస్తు రాఘవో జజ్ఞే తథా దశరథో7ప్యజాత్‌ ||86

రామో దశరథాజ్జజ్ఞే ధర్మాత్మా సుమహాయశాః | రామస్య తనయో జజ్ఞే కుశ ఇత్యభిసంజ్ఞిత ః|| 87

అతిథిస్తు కుశాజ్జజ్ఞే ధర్మాత్మా నుమహాయశాః | అతిథే స్త్వభవ త్పుత్రో నిషధో నామ వీర్యవాన్‌ || 88

నిషధస్య నలః పుత్రో నభః పుత్రో నలస్యతు | నభస్య పుండరీకస్తు క్షేమధన్వా తతః స్మృతః || 89

క్షేమధన్వసుత స్త్వాసీ ద్దేవావీకః ప్రతాపవాన్‌ | అసీ దహీనగు ర్నామ దేవా నీకాత్మజః ప్రభుః || 90

అహీనగోస్తు దాయాదః సుధన్వా నామ పార్థివః | సుధస్వనః సుతశ్చాపి తతో జజ్ఞేశతో నృపః|| 91

ఉక్యో నామ సధర్మాత్మా శలపుత్రో బభూవ హ | వజ్రనాభః సుత స్తస్య నలస్తస్య మహాత్మనః || 92

నలౌ ద్వావేవ విఖ్యాతౌ పురాణ మునిసత్తమాః| వీరసేనాత్మజశ్చైవ యశ్చేక్ష్వాకుకు లోద్వహః || 93

ఇక్ష్వాకు వంశ ప్రభవాః ప్రాధాన్యేన ప్రకీర్తితాః| ఏతే వివస్వతో వంశే రాజానో భూరితేజసః ||94

పఠ న్సమ్య గిమాం సృష్టి మాదిత్యస్య వివస్వతః | శ్రాద్ధదేవస్య దేవస్య ప్రజానాం పుష్టిదస్య చ || 95

ప్రజావా నేతి సాయుజ్య మాదిత్యస్య వివస్వతః || 96

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే ఆదిత్యవంశానుకీర్తనం నామ అష్టమోధ్యాయః

అయన కొడుకు అజుడు. అయనకు దశరథు డుదయించెను. దశరథకుమారుడు రాముడు. రాముని కుమారుడు కుశుడు కుశనందనుడతిథి. అతని పుత్రుడు నిషధుడు. నిషధుని సుతుడు నలుడు. నలాత్మజుడు నభుడు. నభుని బిడ్డడు పుండరీకుడు. వానికి క్షేమధన్వుడు, వానికి దేవానీకుడునుదయించిరి. దేవానీకునికొడుకు అహినగువు వాని కొడుకుసుధన్వుడు. వానికొడుకు శలుడు. శల పుత్రుడుక్యుడు. ఉక్యుని కొడుకు వజ్రనాభుడు. వానికొడుకు నలుడు. పురాణములందు నలులిద్దరేఖ్యాతికెక్కినారు. ఒకడు వీరసేనుని కుమారుడు రెండవవాడు ఇక్ష్వాకువంశజుడు వీరు వివస్వతునివంశమందలి తేజస్సమృద్ధులైన రాజులు. ప్రజలకు పోషకుడును శ్రాద్ధదేవుడును నగు అదిత్యుని యీ వంశవృత్తముపఠించునాతడు

సంతానవంతుడయి అదిత్యుని యొక్క సాయుజ్యము నందును. (85-95)

శ్రీ బ్రహ్మపురాణమునందు ఆదిత్య వంశాను కీర్తనము ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Brahmapuranamu    Chapters